Saturday, November 23, 2013

Heart transplantation,గుండె మార్పిడి
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గుండె మార్పిడి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఇవాళ ఒక మనిషి చనిపోతూ, పది మందికి కొత్త జీవితాన్ని ఇవ్వగలుగుతున్నాడు. అంటే... ఒక వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు గుర్తించి, అతను లేక ఆమె బంధువులు అవయవ దానం చేస్తే - ఈ అవయవాల్ని అవతల పూర్తిగా చెడిపోయిన వాళ్ళకి అమరుస్తున్నారు. ఇలా ఒక బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి రెండు కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్‌, కాలేయం లాంటి అవయవాల్ని దానం చేయవచ్చు. అంటే ఒక వ్యక్తి చనిపోయి తిరిగి పదిమందిలో బ్రతుకుతాడన్నమాట! ఎంతో మంది అవయవాలు దెబ్బతిని మార్పిడి ద్వారా ప్రాణరక్షణకి ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు మనదేశంలాంటి దేశాల్లో దాతల కన్నా స్వీకర్తల సంఖ్య ఎక్కువ ఉంది. కొంత కాలం వారికి అవయవాలు లభించకపోతే తీవ్రస్థాయిలో బాధపడుతూ మరణిస్తున్నారు. అందుకని బ్రెయిన్‌ డెడ్‌ అయిన మనిషిని వెంటిలేటర్‌ సహకారంతో శ్వాసించేట్లు చేస్తారు. ఈ వెంటిలేటర్లు తొలగిస్తే ఆ వ్యక్తి చనిపోతాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళు చనిపోయి, వాళ్ళ అవయవాలు బూడిద అవడం, మట్టిలో కలిసిపోవడం బదులు మరికొందరిలో బ్రతికి ఉండటం గొప్పేకదా! దాతలుగా తమను తాము రికార్డు చేసుకోవాలి. తమ కోరికను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి. అప్పుడే కోరిక నెరవేరుతుంది. దాతలమని రిజిస్టర్‌ చేసుకున్నంత మాత్రాన దాతలం కాలేం. మన అవయవాలన్నీ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండి, ఏ కారణంగానైనా యాక్సిడెంటుకు గురికావడమో, తలలోని రక్తనాళాలు చిట్లిపోవడం లాంటివి జరుగుతేనే మనం దాతలం కాగలం.

ఇక గుండె విషయానికొస్తే చాలామంది గుండె కండరాలు పూర్తిగా దెబ్బతినో, కరొనరి డిసీజ్‌ తీవ్రంగా ఉండో ప్రాణం పోతోందని బాధపడుతుంటారు. అటువంటి వారికి గుండె మార్పిడి ఒక్కటే మార్గం. గుండె బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి నుంచి మాత్రమే తీసుకోవడానికి వీలుంటుంది. బ్లడ్‌గ్రూప్‌ లాంటివి మ్యాచ్‌ అవడంతో పాటు గుండె పరిమాణం కూడా దాతకి, స్వీకర్తకి ఒకటేలా ఉండాలి. లింపోసైట్‌ క్రాస్‌మ్యచ్చింగ్‌ కూడా సరిపడాలి. ఆడ, మగ భేదం లేదు, వయస్సుతో సంబంధం లేదు. ఇలా గుండె మార్పిడి జరిగిన వాళ్ళు మిగతా వాళ్ళలాగా అన్ని పనులూ చేసుకోగలరు. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనీసం15 సంవత్సరాలు బ్రతకగలరు. ప్రపంచంలో మొట్టమొదటి గుండె మార్పిడి 1967లో డా క్రిష్టియాన్‌ బర్నార్డ్‌, లూయిస్‌ వాష్‌కాన్స్‌స్కీకి చేశారు.

మన దేశంలో మొదటి సారి గుండె మార్పిడి శస్తచ్రికిత్స 1994 ఆగష్టు 3న ఎయిమ్స్‌లో డా’’ పి.వేణుగోపాల్‌ చేశారు. మన రాష్ట్రంలో మొదటిసారి గుండెమార్పిడి శస్తచ్రికిత్స డా.ఆళ్ళగోపాలకష్ణ గోఖలే రమేష్‌ అనే వ్యక్తికి 2004లో లక్డీకాపూల్‌ గ్లోబల్‌హాస్పిటల్‌లో విజయవంతంగా నిర్వహించారు.
గుండె మార్పిడి చేసిన తరువాత ఇన్‌ఫెక్షన్స్‌ రావచ్చు. సెప్సిస్‌ రావచ్చు. ఆర్గాన్‌ రిజక్ట్‌ కావచ్చు. శస్తచ్రికిత్స తరువాత ఇమ్యునో సప్రసివ్‌ డ్రగ్స్‌ వాడటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి కొన్ని ఇన్‌ఫెక్షన్స్‌ లాంటివి రావచ్చు. వీటన్నీంటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి.
చాలామంది అవయవదానం అన్నప్పుడు కళ్ళు, మూత్రపిండాలు, లివర్‌ లాంటివే అనుకుంటారు. గుండెను కూడా దానం చేయవచ్చు. అలాగే గుండె జబ్బు చివరి దశ (ఎండ్‌ స్టేజ్‌)కి వచ్చినా కంగారు పడాల్సిన పనిలేదు. మన రాష్ట్రంలో గుండె మార్పిడి శస్తచ్రికిత్సలు అందుబాటులో ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.

గుండె మార్పిడిలో ముందు దాత శరీరాన్ని ఓపెన్‌ చేసి గుండె ఆరోగ్యం ఎలా ఉందో, గుండె పరిమాణం - చూసి సంతప్తి చెందిన తరువాత స్వీకర్త శరీరాన్ని ఓపెన్‌ చేయడం జరుగుతుంది. ఒక శరీరంలో గుండె ఆగిన నాల్గు గంటల్లోపల రెండో శరీరంలో అది కొట్టుకోవడం ప్రారంభించాలి. మూత్రపిండాల, ఊపిరితిత్తుల, లివర్‌ జబ్బులున్నవాళ్ళు, ఇన్సులిన్‌ తీసుకుంటున్న డయాబెటిస్‌ వ్యక్తులు, మెడప్రాంతంలో, కాళ్ళ ప్రాంతంలో రక్తనాళాల జబ్బులున్న వాళ్ళు, థ్రోంబో ఎంబాలిజం ఉన్నవాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, తీవ్రంగా ఆల్కాహాల్‌, ట్యుబాకో, డ్రగ్‌ఎబ్యూజ్‌ వాళ్ళకి గుండె మార్పిడి చేయడం కష్టమవుతుంది.

  • --courtesy with : Dr .Alla  Gopalakrishna Ghokle,Hyderabad@surya Telugu news paper.
  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.