Sunday, November 24, 2013

Coronary heart disease,కరోనరి హార్ట్‌ డిసీజెస్‌ రాకుండాసలహాలు,కరొనరి ఆర్టెరీ హార్ట్‌డిసీజ్‌ అంటే?

  •    •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Coronary heart disease,కరోనరి హార్ట్‌ డిసీజెస్‌ ?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

Q : కరొనరి ఆర్టెరీ హార్ట్‌డిసీజ్‌ అంటే ఎమిటి ?
A : మనశరీరంలోని ప్రతీ అవయవానికి రక్తం సరఫరా చేయ డానికి కొన్ని ప్రత్యేక రక్తనాళాలు ఉంటాయి వాటి ద్వారా ఆయా అవయవాలకి రక్తప్రసరణ జరుగుతుంది. రక్తం ద్వారానే ఆహారం, ఆక్సిజన్‌ సరఫరా అన్ని కణాలకు జరుగు తుంది. రక్తం చేరని ప్రాంతానికి ఇవి చేరక ఇబ్బంది పడతాం. రక్తం అంతా గుండె ద్వారా ఇతర అవయవాలకు చేరుతున్నా, గుండె తనకు రక్తం సరఫరా చేసే నాళాలైన ‘కరొనరి ఆర్టెరీ’ శాఖల ద్వారా వచ్చే రక్తాన్నే తనకోసం ఉపయోగించుకుంటుంది. ఈ కరొనరి ఆర్టెరీ శాఖలలో అడ్డంకులు ఏర్పడితే గుండె కండరాలకి రక్తం సరిగ్గా సరఫరా కాదు. దాంతో కండరాలు నీరసించి గుండె కొట్టుకోవడం కష్టమవుతుంది. గుండె రక్తనాళాలైన కరొనరి ఆర్టెరీ శాఖలలో ‘ఎథిరోస్ల్కీరోసిస్‌’తో పూడుకు పోవడం జరిగి తద్వారా గుండె రక్తప్రసరణ తగ్గడాన్ని కరొనరి ఆర్టెరీ హార్ట్‌డిసీజ్‌ అంటారు. గుండె రక్తనాళాల్లో ఈ మార్పు ఎలా వస్తాయంటే ముందు కొవ్వు కొద్ది కొద్దిగా రక్తనాళాలలోపలివైపు పేరుకుపోతుంది. ఆ తరువాత లిపిడ్‌, పైబర్‌ కూడా పేరుకుపోయి గట్టిపడతాయి. ఇవి సాధారణంగా రక్తనాళాలు మలుపుతిరిగేచోట కానీ, చీలేచోటగానీ ఏర్పడతాయి.

ఈ ప్లేక్స్‌ రకరకాలుగా ఉంటాయి. కొన్ని కొవ్వు కణాల్తో పెద్దగా ఏర్పడి సన్నటిక్యాప్‌ కప్పినట్లు పెరుగుతాయి. ఇవి చిదిమిపోవచ్చు. ఇలా రక్తనాళాల్లో అడ్డంకులేర్పడతాయి. పూర్తిగా రక్తనాళాల్లో అడ్డంకిగా ఏర్పడి ‘మయోకార్డియల్‌ఇన్‌ఫె‘న్‌’ ఏర్పడవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఈ ప్లేకు ఫైబ్రస్‌ ప్లేక్‌ అవుతాయి. ఆర్టరీ శాఖలలో విస్తరిస్తాయి. ఈ విధంగా కరొనరీ ఆర్టరీలో కొవ్వు 50శాతం కన్నా ఎక్కువ పేరుకుపోతే అక్కడినుంచి రక్తసరఫరా తగ్గి ఆప్రాంతంలో గుండె కండరాలు దెబ్బతింటాయి. అంతకన్నా ఎక్కువ పేరుకుపోతే గుండె కండరాలు ఇంకా ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇలా కరొనరి ఆర్టరీ డిసీజెస్‌ వస్తాయి. దీన్ని ప్రారంభదశలో గుర్తించి, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మామూలు కన్నా పొగతాగే వాళ్ళలో కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ వచ్చే రిస్క్‌ రెండు లేక మూడు రెట్లు ఎక్కువ. సిగరెట్లు తాగడం మానేస్తే ఈ రిస్క్‌ కూడా క్రమంగా తగ్గుతుంది. కాబట్టి ధూమపానం అలవాటు ఉంటే మానుకోవడం మంచిది.

కరొనరి హార్ట్‌ డిసీజ్‌కి మరో రిస్క్‌ కొలెస్ట్రాల్క్త్రంలో పెరగడం. కొలెస్ట్రాల్‌ వల్ల ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. మన శరీరంలో లోడెన్సిటి లైపోప్రొటీన్‌ (ఎల్‌.డి.ఎల్‌) తక్కువగా ఉండాలి. రక్షణ కల్పించే హై డెన్సిటి లైపోప్రొటీన్‌ (హెచ్‌.డి.ఎ) ఎక్కువగా ఉండాలి. అలా కాకుండా ఎల్‌డిఎల్‌ పెరిగినా, హెచ్‌డిఎల్‌ తగ్గినా కూడా రిస్క్‌ఎక్కువే! ట్రెగ్లిజరైడ్స్‌ ఎక్కువై వాటితోపాటు ఎల్‌డిఎల్‌ పెరిగి హెచ్‌డిఎల్‌ తగ్గడంతో రిస్క్‌ ఎక్కువవుతుంది. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ కొలెస్ట్రాల్‌ స్థాయిని తట్టుకోగలరు. ఎందుకంటే బహిష్టు ఆగేవరకు ప్రత్యేక హార్మోన్లు రక్షణ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్‌ పెరగడానికి రెండు ప్రత్యేక కారణాలున్నాయి. 1) వంశపారంపర్యంగా వచ్చేవి. 2) ఆహారం ద్వారా వచ్చేవి. చిన్న వయస్సులో కూడా కొన్ని జీన్స్‌ దెబ్బతినడం వల్ల వంశపారపర్యంగా ‘హైపర్‌-లిపిడిమియా’ బారినపడుతుంటారు.

దీంతో కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ చిన్న వయస్సులో వచ్చే రిస్క్‌ ఉంది. ‘సేచురేటెడ్‌’ ఫ్యాట్స్‌ ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఎక్కువ. అధిక బరువు, డయాబెటిస్‌, అధికరక్తపోటుల వల్ల కూడా గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. డయాబెటిస్‌ ఉన్న వాళ్ళల్లో ఎథిరోస్ల్కీరోసిస్‌తో గుండెరక్తనాళాలు మూసుకుపోయే రిస్క్‌ ఎక్కువ. అధిక రక్తపోటు వల్ల కరొనరి డిసీజెస్‌ ఎక్కువ. రక్తపోటును తగ్గిస్తే ఆరిస్క్‌ తగ్గుతుంది.ఊబకాయం గుండె జబ్బులు రావడానికి ప్రధాన రిస్క్‌ ప్యాక్టర్‌గా గుర్తించారు. ఊబకాయాల వల్ల కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఎల్‌.డి.ఎల్‌ పెరిగి హెచ్‌.డి.ఎల్‌ తగ్గుతుంది. కాబట్టి బాడీమాస్‌ ఇండెక్స్‌ చెప్పిన దానికన్నా ఎక్కువ బరువు ఉండకుండా చూడటం అవసరం. బి.ఎం.ఐ అంటే బాడీమాస్‌ ఇండెక్స్‌ ఎత్తును బట్టి ఉండాల్సిన బరువును చెప్పడం. బి.ఎం.ఐ = బరువు కిలోగ్రాముల్లో /ఎత్తు మీటర్లలో అలాగుణించినప్పుడు 25కన్నా తక్కువ ఉండాలి.

ఛాతి చుట్టుకొలతని పిరుదుల చుట్ట కొలతతో పొల్చినప్పుడు ఆడవాళ్ళల్లో అయితే. 8 కన్నా ఎక్కువ ఉండకూడదు. మగవాళ్ళల్లో అయితే. 1 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ రేషియో పెరిగిన కొద్దీ కరొనరి డిసీజెస్‌ రిస్క్‌ ఎక్కువ. సరైన ఎక్స్‌సర్‌సైజ్‌ లేకపోవడం కూడా కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ వచ్చే రిస్క్‌ను పెంచుతుంది. వారంలో అయిదు రోజులు 20 నుంచి 30 నిమిషాల పాటు ఎక్స్‌సర్‌సైజులు చేయాలి. నడకైనా మంచిది. ఆల్కాహాల్‌ ఎక్కువ తీసుకున్నా ‘ట్రెగ్లిజరైడ్స్‌’ఎక్కువై లివర్‌ డిసీజ్‌తో పాటు కరొనరి డిసీజెస్‌ రావచ్చు. ఎక్కువగా స్ట్రాంగ్‌ కాఫీ తీసుకోవడం మంచిది కాదు. స్ట్రాంగ్‌ కాఫీ వల్ల సైనస్‌ టేకికార్డియా లేకపోతే ఎరిథ్మియా కలగవచ్చు. కాబట్టి కాఫీ తగిన మోతాదులో మాత్రమే తీసుకోవడం మంచిది.

సాధారణంగా మెనూపాజ్‌ పీరియడ్‌ వచ్చేంతరకు వరకు ఆడవాళ్ళల్లో హార్మోన్స్‌ భద్రతను కలిగిస్తాయి. జీవనవిధానం మారడంతో ఇలాంటి లక్షణాలు దెబ్బతిని ఆడవాళ్ళల్లో చిన్నతనంలోనే కరొనరి హార్ట్‌డిసీజ్‌ వస్తుంది. కరోనరి హార్ట్‌ డిసీజెస్‌ వచ్చే కారణాలు తెలుసుకున్నాం. వీటిని బట్టి మనం జీవన విధానం ఎలా మార్చుకోవాలో తెలుసుకోవచ్చు. ధూమపానం, ఆల్కాహాల్‌, కాఫీ లాంటి అలవాట్లను మానేయటం మంచిది. కొలెస్ట్రాల్‌ పెరగని విదంగా ఆహారపు అలవాట్లను తీర్చిదిద్దుకోవాలి. ఊబకాయం, డయాబెటిస్‌, అధిక రక్తపోటు లాంటి వాటిని అదుపులో ఉంచుకోవాలి. వ్యాయామం చేస్తుండాలి. ఇలా జీవన విధానాన్ని మార్చుకొంటే కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ రాకుండా కాపాడుకోవచ్చు.

మానసిక ఒత్తిడితో కూడా కరొనరి హార్ట్‌డిసీజ్‌ రిస్క్‌ల్లో ఒకటి. టైప్‌-ఎ పర్సనాల్టీలో ఒత్తిడి ఎక్కువ. దీనితో వాళ్ళకి కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ వచ్చే అవకాశం ఎక్కువ. టైప్‌-ఎ  పర్సనాలిటీ ఉన్న వాళ్ళలో పోటీతత్వం ఎక్కువ. వాళ్ళు అనుకున్న పని పూర్తికాకపోతే తీవ్ర ఒత్తిడికి గురవుతారు. యోగ, మెంటల్‌ రిలాక్సేషన్‌లతో కరొనరి హార్ట్‌ డిసీజెస్‌తో వచ్చే రిస్క్‌ తగ్గుతుంది.

  • courtesy with : Dr.Ravikuma Aluri (cardiotogist) Hyd@surya Telugu news paper.October 7, 2013
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.