Monday, October 18, 2010

Vitamins , విటమిన్లు




విటమిన్లు (Vitamins) సూక్ష్మమైన పోషక పదార్దములు .ఇవి శక్తినిచ్చే పదార్ధములు కావు . శరీరములొని వివిధ జీవక్రియలను పరోక్షముగా నియంత్రిస్తాయి . వీటి లోపము వలన అనేక వ్యాధులు కలుగుతాయి . ఎ,బి,సి,డి,ఇ,కె అనే ఆరు విటమిన్లు ఉన్నాయి. విటమిన్ల అధ్యయనం చేసే శాస్తాన్ని " విటమినాలజీ " అని అంటారు . జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ మొదటి సారిగా 1912లో ప్రతిపాదించాడు. ఇతనిని " విటమిన్ల పితామహుడు " అంటారు . తరువాత కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి 'vitamines' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని 'vitamins' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తిప్రసరణ, జీవక్రియల నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి. కొన్ని విటమిన్లు సహ ఎంజైము (Coenzymes) లుగా పనిచేస్తాయి.
  • మానవులలో ముఖ్యమైనవి 6 విటమిన్లు గుర్తించారు. వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు.

ఎ. కొవ్వులలో కరిగే విటమిన్లు:
1.విటమిన్A,
2.విటమిన్D,
3.విటమిన్E,
4.విటమిన్K
విటమిన్లు కొవ్వులలో కరిగేవి. ఇవి శోషణం చెందడానికి పైత్యరసం అవసరం. ఇవి శోషరసం ద్వారా వివిధ భాగాలకు అందుతాయి.
బి. నీటిలో కరిగే విటమిన్లు:
1.విటమిన్ B-complex,విటమిన్ H(Biotin)
2.విటమిన్ C ,

విటమిన్లు నీటిలో కరిగేవి. ఇవి పేగులో నేరుగా రక్తంలోకి శోషణం చెంది వివిధ భాగాలకు రవాణా అవుతాయి.



  • విటమిన్లు - చెడు ప్రభావము

మనిషి ఆరోగ్యముగా మనుగడ సాగించడానికి విటమిన్ల అవసరమెంతోవుంది. విటమిన్ల లోపము వలన ఎన్నో వ్యాధులు వచ్చినా సదరు లోపాన్నిపూరించినట్లైతే ఆయా వ్యాధులు ఇట్టే మాయమవుతాయి. అయితే వచ్చిన చిక్కేమిటంటే విటమిన్ల లోపాలను పూరించే ఆదుర్దాలో విటమిన్లు పుష్కలముగా ఉండే తాజా పండ్లు,ఆకు కూరలకు బదులు ఏకంగా విటమిన్ గుళికలు మింగడము వల్ల ప్రయోజనానికి బదులు కీడే ఎక్కువ జరుగుతుందని ఐరోపా శాస్త్రజ్ఞులు అంటున్నారు. డెన్మార్క్ లోని కోపెన్ హెగాన్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన 'గోరన్ బెలకోవిచ్'నాయకత్వములో జరిగిన పరిశోధనలో ..విటమిన్ ఎ ,విటమిన్ ఇ ,బీటాకెరోటిన్లను గుళికల రూపంలో తీసుకుంటే ఏకంగా ప్రాణహాని సంభవిస్తుందని తేలింది. అయితే విటమిన్ సి ,సెలీనియం లను ఈవిధంగా తీసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదన్నారు. గతంలో కొన్ని పరిశీలనలు విటమిన్ గుళికలలో వుండే యాంటి ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపాయి. ప్రస్తుత పరిశోధనా ఫలితాలు అందుకు విరుద్ధముగా ఉన్నాయి. 180,938 మంది ప్రజలపై చేసిన పరిశోధనల వల్ల మొత్తము మీద 5 శాతము ప్రజలు విటమిన్ గుళికల వలన మరణిస్తారని తేలింది. వివిధ రకాల విటమిన్లు వేరు వేరుగా పరిశీలించినపుడు

* బీటా కెరోటిన్ వల్ల 7 శాతము,
* విటమిన్ A వల్ల 16 శాతము,
* విటమిన్ E వల్ల 4 శాతము మంది మరణించారు అని పరిశోధనల వల్ల తెలిసింది. సెలీనియం వల్ల 10శాతము మరణపు రేటు తగ్గిందని గమనించారు.



విటమిన్ ఎ : click here for more details in Telugu

కంటి చూపును సవ్యంగా ఉంచడంలో విటమిన్ ఎ పాత్ర ముఖ్యమైనది. వ్యాధి నిరోధక చర్యలు, చర్మ దృఢత్వానికి ఇది దోహదం చేస్తుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. మన దేశంలో మూడు శాతం మంది పిల్లలు విటమిన్ ఎ లోపం కారణంగా కంటిలో బిటాట్ స్పాట్ (తెల్లని కనుగుడ్డుపై నల్లటి మచ్చ) తో బాధ పడుతున్నారు. విటమిన్ ఎ లోపం తొలిదశ లక్షణాల్లో రేచీకటి మొదటిది.


  • లోపానికి గురైనప్పుడు అంధత్వం వస్తుంది. మనిషి ఆరోగ్యంగా పెరగడానికి, వ్యాధి నిరోధక శక్తి పెంపొందడానికి, నేత్రదృష్టి బాగా ఉండటానికి ......... విటమిన్‌ ఎ (A)అవసరం.


విటమిన్‌ డి (Vitamin D) : click for more details
  • విటమిన్ D3 చర్మానికి సూర్యరశ్మి (ముఖ్యముగా అతినీలలోహిత కిరణాలు) సోకినపుడు తయారుచేయబడుతుంది. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది.


బి విటమిన్‌ : B విటమిన్స్ జాబితా--22 రకాలు మిళితమై ఉన్నాయి. అందులో కొన్నే మానవులకు ఉపయోగపడతాయి.
  • * విటమిన్ B1 (thiamine),
  • * విటమిన్ B2 (రిబోఫ్లేవిన్-riboflavin),
  • * విటమిన్ B3 (నియాసిన్ లేదా niacinamide),
  • * విటమిన్ B4 (అడెనీన్-adenine),
  • * విటమిన్ B5 (పాంతోతేనిక్-pantothenic acid),
  • * విటమిన్ B6 (pyridoxine, pyridoxal, లేదా pyridoxamine, ),
  • * విటమిన్ B7 (biotin),
  • * విటమిన్ B8 "'(adenosine),
  • * విటమిన్ B9 (ఫోలిక్ ఆమ్లం-folic acid),
  • విటమిన్‌ భ10 (PABA)పారా అమినో బెంజోయిక్ యాసిడ్ ),
  • * విటమిన్ బి 12 (వివిధ cobalamins; విటమిన్ సప్లిమెంట్స్ లో సాధారణంగా cyanocobalamin),
*some rare B-vitamins
  • * విటమిన్ B11: ఫోలిక్ ఆమ్లం యొక్క ఒక రూపం ఇది pteryl-hepta-glutamic acid-కొంతమంది పెరుగుదల అంశం. తరువాత మానవులకు అవసరమైన ఐదు folates ఒకటి కనుగొన్నారు . విటమిన్ S లేదా కారకం (factor)ఎస్ అని కూడా పిలుస్తారు
  • * విటమిన్ B13: orotic యాసిడ్, ఒకప్పుడు విటమిన్‌ గా భావించేవారు .. ఇప్పుడు తెలిసినది ఒక విటమిన్ కాదు అని .
  • * విటమిన్ B14: ఎర్ల్ ఆర్ నోరిస్ ద్వారా కనుగొబడినది. పేరు cell proliferant, రక్తహీనత, ఎలుక పెరుగుదల అంశం, మరియు antitumor pterin ఫాస్ఫేట్. 0.33ppm వద్ద మానవ మూత్రాన్ని (తరువాత రక్తంలో) నుండి వేరుచేయబడినది కానీ మరింత సాక్ష్యం తో నిర్ధారించ బడ లేదు. తరువాత అతని ద్వారానే నిరాకరించబడింది . అతను కూడా ఈ xanthopterin లేదని పేర్కొన్నారు .
  • * విటమిన్ B15: pangamic యాసిడ్,
  • * విటమిన్ B16: dimethylglycine (DMG),
  • * విటమిన్ B17: nitrilosides, amygdalin లేదా Laetrile. ఈ పదార్థాలు విత్తనాలు, మొలకలు, బీన్స్, tubers, మరియు ధాన్యాలలో గుర్తించవచ్చు. పెద్ద పరిమాణంలో విష ము అని ప్రతిపాదకులు ఇది అంగీకరించారు .శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం ఆదరణపొందలేదు . క్యాన్సర్ చికిత్స మరియు నివారణ లో పనిచేయునని వాదించారు.
  • విటమిన్ B18:
  • విటమిన్ B19:
  • విటమిన్ B20: carnitine,
  • విటమిన్ B21:
  • విటమిన్ B22: తరచూ అలోవేరా నుండి వెలికితీయుదురు యొక్క ఒక మూలవస్తువుగా కాని పలు ఇతర ఆహారాలు లో పేర్కొన్నారు. అని ఒక మూలం ద్వారా పేర్కొన్నారు విటమిన్ B12b.

బి విటమిన్ ఉపయోగాలు :
పిండిపదార్థాల జీర్ణక్రియలో ఉపయోగపడే ఎంజైమ్‌గా విటమిన్‌ బి పని చేస్తుంది. ఆహా రంలో లోపిస్తే ఆకలి మందగిం చడం, చేతులు కాళ్లు మొద్దుబారడం, గుండెదడ,అలసట, నీరసం వంటి లక్షణాలు సంభవిస్తాయి.



విటమిన్‌ సి :(for more details in Telugu click here)
  • లోపిస్తే స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. నోటిలో పుండ్లు పడటం, చిగుళ్లనుంచి రక్తం కారడం, దంతాలు కదలడం, చర్మం కింద ఉండే కేపిల్లరీస్‌ చిట్లి రక్తస్రావం కావడం జరుగుతాయి. గాయాలు త్వరగా మానడానికి విటమిన్‌ సిను ఇస్తారు.





  • విటమిన్లు Table :
    నీటిలో కరిగే విటమిన్లు
    విటమిన్
    రసాయనిక నామము
    లభించే పదార్ధాలు
    నూన్యత వలన కలిగే వ్యాధులు
    బి 1 ధయామిన్ గోధుమ వంటి ధాన్యాలు, వేరుశనగ వంటి నూనె గింజలు, నువ్వు గింజలు , పాలు, మాంసము, చేప, గుడ్లు, కాయ గూరలు. బెరి బెరి, ఆకలి మందగించటం
    బి 2 రైబోఫ్లేవిన్ పాలు, గుడ్లు, కాలేయము , మూత్రపిండము, ఆకు కూరలు నోటిపూత, నోటి మూలల్లో పగలటం
    బి 6 పైరిడాక్సిన్ పాలు, కాలేయము, మాంసము, గుడ్డులోని సొన, చేపలు, ధాన్యాలు, చిక్కుడు జాతి కాయలు, కాయకూరలు. రక్తహీనత, ఉద్వేగము, నాడి మండలంలో లోపాలు
    B9-ఫోలిక్ ఆమ్లము ఫోలిక్ ఆమ్లము కాలేయము, మాంసము, గుడ్లు, పాలు, ఫలాలు, ధాన్యాలు, ఆకు కూరలు రక్తహీనత, అతిసారము, తెల్ల రక్త కణాలు నష్ట పోవటము
    బి 12 సయానో కో బాలమైన్ ఆహార పదార్ధాలలో లభించదు. పేగులోని బాక్టీరియములు దీన్ని సంశ్లేషణము చేసి శరీరానికి అందిస్తాయి హానికర రక్తహీనత
    సి ఆస్కార్బిక్ ఆమ్లము నిమ్మ జాతి ఫలాలు (సిట్రస్) , టమోటాలు , కాయకూరలు, బంగాళ దుంపలు, కాలిఫ్లవర్, కొన్ని పండ్ల జ్యూసులు, పచ్చిమిరపకాయలు. స్కర్వె
    B5--పాంటోథినక్ ఆమ్లము పాంటోథినక్ ఆమ్లము తాజాకాయకూరలు, కాలేయము, మూత్ర పిండము, ఈస్ట్, గుడ్డులోని సొన, మాంసము, చిలగడ దుంపలు, వేరుశనగ, తేనె కాళ్ళు మండటము
    బయోటిన్ vitamin B7 బయోటిన్ పప్పు దినుసులు, గింజలు, కాయకూరలు, కాలేయము, మూత్రపిండము కండరాల నొప్పులు, నాడీ మండలంలో తేడాలు, అలసట


    కొవ్వులో కరిగే విటమిన్లు

    విటమిన్
    రసాయనిక నామము
    లభించే పదార్ధాలు
    నూన్యత వలన కలిగే వ్యాధులు
    ఎ కెరోటిన్ కాలేయము, గుడ్లు, వెన్న, పాలు, చేప, మాంసము, కాడ్, షార్క్ చేపలనూనె, బచ్చలి, తోటకూరలు, క్యారెట్ , టమోటా, గుమ్మడి, బొప్పాయి, మామిడి రేచీకటి, జిరాఫ్ థాల్మియా, శుక్ల పటలము పగలటం, చర్మం మీద పొలుసులు
    డి కాల్సిఫెరాల్ కాలేయము, గుడ్డులోని సొన, వెన్న, కాడ్ చేప నూనె, షార్క్ చేప నూనె రికెట్స్ ఎముకలు పెళుసుగా అవుతాయి
    ఇ టోకోఫెరాల్ పాలు, కాయకూరలు, బాదంపప్పు , మొలకెత్తిన గింజలు , మాంసము, గుడ్డులోని సొన, పొద్దుతిరుగుడు పువ్వు గింజల నూనె, పత్తి గింజల నూనె పురుషులలో వంధ్యత్వము, స్త్రీలలో గర్భస్రావము, ఎర్ర రక్త కణాల జీవిత కాలపరిమితి తగ్గటము
    కె యాంటిహేమరేజ్ ఆకు కూరలు , ఆవు పాలు రక్తము ఆలస్యంగా గడ్డ కడుతుంది
  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

కీళ్ళ నొప్పులు , Arithritis

మన ప్రతి కదలికకూ కీలే.. కీలకం! జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతుంటేనే... మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంటుంది. అది వేళ్ల జాయింట్లు కావచ్చు, మణికట్టు జాయింట్లు కావచ్చు.. భుజం జాయింట్లు కావచ్చు.. మోకాలి కీళ్లు కావచ్చు.. చివరికి పాదాల, వేళ్ల జాయింట్లు కావచ్చు.. దేనికైనా.. ఏ కదలికకైనా ఈ కీళ్లే కీలకం. మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించటం మొదలుపెడితే..? కాలు కదపాలంటే కష్టం. చేయి మెదపాలంటే కష్టం. సంకెళ్లు వేసినట్టు.. జీవితం అడుగడుగునా సమస్యలా తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం!

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi2cGk2BDJl9kffoor7u4Bfs2cDy1ytQSKy6fvM2nEbrhBk6zRCtWX7qLDbPlIf1PIoloRhw6aNnaN_ERyttDjkwzTvKR1AUxUnScI-66FzlCyOeLfLN_r0-F-W_gLQMhAvIHwClEGPpTSr/s1600/Arthritis+Day.jpg

****************************************
For more details
- >click here Arthritis
****************************************
  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్, Rhemotoid Arthritis


  • _________________________________________
వయసు తో నిమిత్తము లేకుండాఆ వచ్చే వ్యాధుల్లో కీళ్ళా నొప్పులు (Osteoarthritis ) ప్రధానమైనది . కాకపోతే వయసు పైబడిన వారిలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటది . మొత్తం గా చూస్తే నూటికి 90 శాతము ఏదో ఒక దశలో కీళ్ళనొప్పులతో బాధపడేవారే . జన్యుపరమైన వ్యాధుల్లో ఇదొకటి . శరీరములో ఉన్న కొన్ని ఇన్‌ఫెక్షన్‌ల వల్ల వచ్చే -- ఇన్‌ఫెక్టివ్ ఆర్థరైటిస్ , సోరియాటిక్ అర్థ్రైటిస్ , ప్రమాదలవలన వ్చ్చే - పోస్టు ట్రమాటిక్ ఆర్థరైటిస్ లు ఈ కీళ్ళ నొప్పులకు కారణమవుతాయి .

లక్షణాలు :
  • కీళ్ళు బిగుసుకు పోవడం ,
  • నొప్పి ,
  • కదలలేకపోవడం ,
  • కీళ్ళ వాపు ,

నేడు రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అధికంగా భారతీయులను బాధిస్తుంది. ఇది కీళ్లలో మంటను ప్రేరేపిస్తుంది. కండరాల మధ్య జిగు రుపదార్థాన్ని హరించేస్తుంది. ఈ జిగురుకు ప్రత్యామ్నాయం లేదు. కీళ్ల నొప్పి క్రమేపీ మిగతా శరీర అవయవాలైన హృద యం, ఊపిరితిత్తులు, కళ్లపై ప్రభావాన్ని చూపిస్తుందని కలకత్తా లోని అపోలో హాస్పి టల్‌ సిీనియర్‌ కన్సల్టెంట్‌ డా. బుద్ధదేవ్‌ ఛటర్జీ తెలియజేశారు.

బైయాలజీస్‌, ఎంబ్రెల్‌ మందులు

గీతాషా ఢిల్లిలో సొంతంగా వ్యాపారం చేస్తుంది. గత ముప్ఫై సంవత్సరాలుగా కీళ్ల రోగంతో బాధపడుతుంది. ఒక్కోసారి తలుపు గెడకూడా తీయలేదు. సీసామూత తీయాలన్నా కష్టమే. చివరికి ఢిల్లిలోని ఇంద్రప్రస్థ వైద్యులు డా.ఎస్‌.జె. గుప్తా సలహా మేరకు 'నాన్‌ స్టీరో డియల్‌ ఏంటి ఇన్‌ఫ్లమ్మేటరీ' మందులను వాడు తుంది. ఇవేకాక, 'డిసీజ్‌ మాడిఫైయింగ్‌ ఏంటీ రుమాటిక్‌ మందులను వేసుకుంటుంది. ఇవి శ్వాశత పరిష్కారం కావు. తాత్కాలికంగా బాధ ను నివారిస్తాయి. బైయాలజీస్‌, ట్యూమర్‌ నెక్రోసిస్‌ ఫ్యాక్టర్‌ను టార్గెట్‌ చేస్తుంది. ఎంబ్రెల్‌ అనే మందుతో కొంత ఉపశమనం కలుగుతుంది. ఇది ఇంజెక్షన్‌లో కూడా లభిస్తుంది. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ల కారణాన గీతాషా తన పనులు కీళ్ల బాధలేకుండా చేసుకుంటుంది. వీటిని వాడితే పెయిన్‌ కిల్లర్స్‌ వాడనవసరం లేదు.

కాదెవరూ ఈ బాధకు అనర్హులు!

రుమాటైయిడ్‌ ఆర్థరైటిస్‌ బాధితులు వ్యాధి వచ్చిన రెండు సంవత్సరాలలోపే బైయాలజీస్‌ వాడాలి. లేకపోతే జాయింట్స్‌ను విపరీతంగా బాధకు గురిచేస్తుంది. 'ఆర్థరైటిస్‌ ఫౌండే షన్‌ ఆఫ్‌ ఇండియా' చైర్మన్‌ డా. సుశీల్‌ శర్మ, ''భారత్‌లో జనాభాలో ఒక శాతం ఆర్థరై టిస్‌ బాధితులే'' అంటారు. ఇది కేవలం వృద్ధు లనే బాధిస్తుందనేది అపోహ. ఢిల్లిలోని ప్రకాష్‌ మాధూర్‌ 16, బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడు కీళ్లనొప్పుల బాధితుడే. ముందు తనకు ఆటలో గాయం అయివుంటుందని అశ్రద్ధ చేశాడు. క్రీడా మైదానికి నడిచి వెళ్లలేక పోయేవాడు. చివరికి రక్త పరీక్ష ఎక్స్‌రేలలో 'ఏంకీలోసింగ్‌ స్పాండిలైటిస్‌' గానిర్థారించారు. ఇది 20-40 వయస్సులోని పురుషులలనే ఎక్కువగా బాధిస్తుంది. పిల్లలకు తక్కువ నొప్పులు కలుగుతాయి.

రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్‌ను అశ్రద్ధ చేస్తే స్త్రీలలో 10 సంవత్సరాలు పురుషులలో ఏడు సంవత్సరాలు జీవనకాలం తగ్గుతుంది. ఆధు నిక వైద్యం కారణాన వంద రకాల ఆర్థరైటిస్‌కు నేడు డాక్టర్లు చికిత్స కనుగొన్నారు.

ముంబైలోని గృహిణి కావేరీకి ఎడమ కాలు కీళ్లు రెండు సంవత్సరాలుగా బాధిస్తుంది. ఆమె తల్లికి ఆస్టియో ఆర్థరైటిస్‌. కావేరీ తల్లి బాధితురాలు కనుక, ఆమె ముందు జాగ్ర త్తలు తీసుకొంది. న్యూ ఢిల్లిలోని మ్యాక్స్‌ హెల్త్‌ కేర్‌ లోని డా. ఎస్‌.కె. ఎస్‌. మార్య, చీఫ్‌ ఆర్థో పెడిక్స్‌, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ ఏమంటారంటే, 'వృద్ధాప్యం, ఊబకా‌యం, కుటుంబ చరిత్ర ఆర్థరైటిస్‌కు దారి తీస్తాయి. పురుషులలో ఆల్కహాల్‌, ధూమ పానం, స్త్రీలలో ముందుగానే మెనోపాజ్‌, అమెనోరియా వస్తే ఆర్థరైటిస్‌ బాధకు లోనవుతారు.''

నివారణ

జీవనసరళిని మార్చుకోవాలి. స్త్రీలు వంట గదిలో ఎక్కువసేపు నిలబడరాదు. కీళ్లకు నొప్పి కల్గించే పనులు చేయరాదు. ఫిజియో ధెరపీ, ఆహారంలో మార్పుకొంత వరకు నొప్పి నివా రణకు తోడ్పడ తాయి. రోజూ తేలి కపాటి వ్యాయా మం చేస్తే మంచి దంటారు. ... ముంబైలోని హిందూజా నేష నల్‌ హాస్పిటల్‌ వైద్యులు డా. సి. బాలకృష్ణన్‌.

మందులు

కీళ్ల నొప్పికి అనాల్జసిక్స్‌ను వాడాలి. ఎన్‌ఎస్‌ ఎయిడ్‌(NSAIDS) పిల్స్‌ వల్ల రోగ నివారణ కలగకపోతే క్రీమ్‌ను వాడాలి. మాంట్రియల్‌ లోని ఆర్థరైటిస్‌ సెంటర్‌ ప్రొఫెసర్‌ డా. జీన్‌ పీర్రే పెల్లెటైర్‌ ఎంజైమ్స్‌ పై శ్రద్ధ వహించారు. హిప్‌ను మార్చటం ద్వారా నొప్పినివారణ కలుగుతుందని ముంబై ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డా. నిరాద్‌ వెంగ్‌ సర్కార్‌ తెలియజేస్తున్నారు. వృద్ధులలో హిప్‌ మార్చితే 10 నుండి 12 సం త్సరాల దాకా ఫరవాలేదు. యువతకు 'ఆర్టిక్యులర్‌ సర్ఫేస్‌ రీప్లేస్‌మెంట్‌' మంచిది. ఈ చికిత్సలో కేవలం హిప్‌ సాకెట్‌, ఫెమూర్‌ నిర్మూలిస్తారు.

ఆస్టియోనెక్రోసిస్‌

ఎముకకు రక్త ప్రసారణ ఆగిపోతే ఆస్టియోనె క్రోసిస్‌ వస్తుంది. క్రమేపీ ఆర్థరైటిస్‌ కు దారితీస్తుంది. యోగ, హైడ్రోధెరపీ తాత్కా లికంగా ఉపశమనాన్ని కలుగజేస్తాయి.

మెటల్‌ -ఆన్‌-మెటల్‌ చికిత్స

ముఖ్యంగా క్రీడాకారులు యువతకు ఈ చికిత్స సరైనది. గర్భిణీలకు ఇది వాంఛ నీయం కాదు. పుట్టబోయే బిడ్డకు ఈ చికిత్స హాని చేస్తుంది. వీరికి సిరమిక్‌ -ఆన్‌-సిరమిక్‌ చికిత్స మేలు. అయితే ఇది ఖర్చుతో కూడు కున్నది. నాగపూర్‌లోని వ్యాపారి బల్చీర్‌సింగ్‌ రేణుకు 2004లో ఆస్టియో ఆర్థరైటిస్‌ అని డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్‌కు భయపడి, చికిత్స చేయించుకోలేదు. చివరికి నొప్పి తీవ్రమై నించోలేకపోయాడు. ఆపరేషన్‌ గత్యం తరమై ఇప్పుడు కోలుకున్నాడు. అయితే బ్యాడ్‌మింటన్‌ ఆటకు గుడ్‌ బై చెప్పాడు. కలకత్తాలోని ప్రొ. చక్రవర్తికి కీళ్ల నొప్పులు షడ్ష్థŠీఙ పోలీధైపాన్‌, కోబాల్డ్‌ క్రోమ్‌ ఎల్లాయ్‌ చికిత్సతో నొప్పినివారణ కల్గింది.

కంప్యూటర్‌ చికిత్స

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుచున్న ఈ రోజుల్లో కంప్యూటర్‌ నేవిగేషన్‌ ద్వారా, రోటే టింగ్‌ ప్లాట్‌ఫాం హైప్లెక్స్‌ డిజై న్ల కారణాన నేడు చికిత్స కష్టంకాదు. నొప్పి లేకుండా మేడమెట్లు ఎక్కగలరు, తమ పనులను వారు యధావిధిగా నిర్వహించుకుంటున్నారు. బస్‌లలో ్ఘŸిలి ఉ్శ చేయగలుగుచున్నారు.

ఆయుర్వేద చికిత్స

శిరోధార చికిత్సలో మెడికేటెడ్‌ ఆయిల్‌ను చుక్కలు, చుక్కలుగా తలపై ధారవిడుస్తారు. కీళ్లకు ప్యాక్‌లు, హెర్బల్‌ పేస్ట్‌ ఉపయోగిస్తారు. మషాలాలు, నూనె, ఉప్పు తక్కువగా ఆహా రం తీసుకోవాలి. కీళ్ల వ్యాధిని బట్టి, హెర్బల్‌ మందులు, నూనెలు మారతాయి. వీటి ద్వారా కూడా బాధితులకు ఉప శమనం కలుగుతుంది.

రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌తో క్యాన్సర్‌ ముప్పు(Eenadu sukhibhava)
లింఫ్‌ గ్రంథుల్లో ఏర్పడే క్యాన్సర్లకు (లింఫోమా) రుమటాయిడ్‌ కీళ్లనొప్పులకూ సంబంధం ఉందా? అవుననే అంటున్నారు స్వీడన్‌ పరిశోధకులు. ముఖ్యంగా తీవ్రమైన రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ కీళ్లనొప్పులతో బాధపడేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు. పైకి కనిపించని వాపు లక్షణాలు, రోగ నిరోధక శక్తిని అణచేందుకు ఇచ్చే మందులు, జన్యు, పర్యావరణ సంబంధ అంశాల వంటివన్నీ ఈ క్యాన్సర్లకు దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు. రుమాటాయిడ్‌ కీళ్లనొప్పుల వల్లనే లింఫోమా ముప్పు ముంచుకొస్తుందా? ఇతరేతర అంశాలేవైనా కారణమవుతున్నాయా? అనేది తెలుసుకోవటానికి 6,745 మంది వివరాలను ఇతరులతో పోల్చి చూశారు. రుమటాయిడ్‌ కీళ్లనొప్పులు ఉన్నట్టు గుర్తించిన తర్వాతనే లింఫోమా బారిన పడుతున్నవారి సంఖ్య మిగతావారిలో కన్నా అధికమని గుర్తించారు.
  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, October 16, 2010

పరధ్యానం , Absent mindedness




పరధ్యానం(Absent mindedness)- మెంటల్ హెల్త్ :

ధ్యానం మంచిదే...కాని పరధ్యానంతోనే అసలు సమస్య. పరధ్యానంలో పడితే అసలు విషయంపై దృష్టి కేంద్రీకరించలేరు. పని పక్కదారి పడుతుంది. రహదారి వదిలేసి పక్కదారులు పడితే ప్రమాదమే కదా! దాంతో ప్రధానమైన విషయాలను విడిచి, కొత్తవాటి గురించే ఆలోచిస్తుంటాం.

పరధ్యానానికి ఎన్నో కారణాలుంటాయి. వాటితో ఎన్నో సమస్యలూ వస్తాయి. వాటిని అధిగమించడాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అసలు సమస్యలు, కొసరు సమస్యలూ అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది.

బస్‌స్టాప్‌కు వెళ్లి బస్సు గురించి చూస్తూ ఎక్కడో ఆలోచిస్తే ఆ బస్సు వెళ్లిపోయింది కూడా తెలియకపోవచ్చు. రోడ్డు దాటే సమయంలో అలెర్ట్‌గా ఉండకపోతే ఏ ప్రమాదమైనా జరగవచ్చు. ఇవి ఏ పనులు చేసేటప్పుడైనా ఏర్పడవచ్చు. మనిషిక్కడ, మనసెక్కడో అన్నట్టుగా ఉండటం వలన ఇబ్బందులు తలెత్తుతుంటాయి.

సుజన్యకు 35 ఏళ్లు. భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఎప్పుడూ బిజీగా ఉంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు. హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. పనివాళ్లు ఇంటి పని చేసేసి వెళ్లిపోతారు. సుజన్యకు కావల్సినంత ఖాళీ సమయం. ఈ మధ్య సుజన్యలో వస్తున్న మార్పు భర్తను కలవరపరుస్తోంది. తను పిలిచినా త్వరగా పలకడం లేదు. రాతిళ్లు సరిగ్గా నిద్రపోవడం లేదు. ముందున్న హుషారు ఎంతమాత్రం లేదు. మనిషిగా ఇక్కడే ఉంటుంది కాని, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంటుంది. డాక్టర్ని కలిస్తే డిప్రెషన్ పరధ్యానం అని చెప్పారు.

* * *
మాధురి, రమేష్‌కు పెళ్లై రెండేళ్లే అవుతోంది. విడాకులు తీసుకుంటానని మాధురి తన తల్లిదండ్రుల దగ్గర పోరుతోంది. కారణం రమేష్‌కు అసలు ఇంటి ధ్యాసే లేదని, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటున్నాడని, అతనికి ఇష్టం లేని పెళ్లి చేసి తన గొంతు కోశారని’ కంప్లైంట్. తర్వాత తెలిసిన నిజం. రమేష్ సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాడు. బిజినెస్ పనుల్లో టూర్లకు వెళ్లడం, ఎలా చేస్తే త్వరగా ఎదుగుతామనే ఆలోచనలు, ఆర్థిక సమస్యల మూలంగా పరధ్యానంగా ఉండేవాడు.

* * *
భార్గవ్‌కి పద్నాలుగేళ్లు. నైన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఈ మధ్య ఎప్పుడూ పరధ్యానంగా ఉంటున్నాడు, చదువుమీద ఏకాగ్రత లేదు అని తల్లి బెంగపెట్టుకుంది. భార్గవ్‌ని తరచి తరచి అడిగితే తేలిన విషయం ఏంటంటే కిందటి క్లాస్‌లో లాగ మ్యాథమేటిక్స్ మంచిగా చెప్పే టీచర్ లేరు. ఫ్రెండ్స్ కూడా సపోర్ట్‌గా లేరు. లెక్కల్లో ఫెయిల్ అవుతానేమో అనే ఆందోళనతో పరధ్యానంగా ఉంటున్నాడు.

* * *
ధ్యానం అంటే ఆరోగ్యానికి మేలు కలిగించేదిగా, మనసుకు ప్రశాంతత నిచ్చేదిగా చెబుతుంటారు. మరి పరధ్యానం అంటే...! మనిషి ఉన్న చోటే ఉండి, అతని ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉండటం. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా అర్థం కానట్టుగా ఉంటారు. ఆలోచన, ఆచరణ ఒకేదానిపై కేంద్రీకరించినప్పుడు ఆ పని సఫలీకృతం అవుతుంది. ఉదాహరణకు బస్‌స్టాప్‌కు వెళ్లి బస్సు గురించి చూస్తూ ఎక్కడో ఆలోచిస్తే ఆ బస్సు వెళ్లిపోయింది కూడా తెలియకపోవచ్చు. రోడ్డు దాటే సమయంలో అలెర్ట్‌గా ఉండకపోతే ఏ ప్రమాదమైనా జరగవచ్చు. ఇవి మరే వర్క్ చేసేటప్పుడైనా ఏర్పడవచ్చు. మనిషిక్కడ, మనసెక్కడో అన్నట్టుగా ఉండటం వలన ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇది ఏ పనికైనా వర్తిస్తుంది. అంతమాత్రాన పరధ్యానం మానసిక వ్యాధి అని చెప్పడానికి లేదు. కొంత మంది వ్యక్తితత్వం అలా ఉన్నట్టుగా ఉంటుంది. కాకపోతే వ్యాధి రూపంలో ఒక లక్షణంగా ఉంటే ఉండొచ్చు. మామూలు వ్యక్తుల్లోనూ ఈ సమస్య ఉంటుంది. పరధ్యానానికి వారు వీరు, వయసు తేడా ఏమీ లేదు.

ఇలా ఉంటారు...
పరధ్యానంగా ఉన్నవారిని అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదు. వీరు...సున్నిత స్వభావులై, కళాత్మక హృదయం కలవారై ఉంటారు. ఎక్కువగా ఊహల్లో వివరిస్తుంటారు. చిత్రకారులు, రైటర్లు.. ఈ కోవకు చెందుతారు. తాము చేయబోయే పనిని రకరకాలుగా ఆలోచిస్తూ, ఊహించుకుంటూ, తమలో తాము మాట్లాడుకుంటూ ఉండటం వల్ల దైనందని జీవితంలో చుట్టుపక్కల వారిని పట్టించుకోరు. చాలా మెతకగా, నెమ్మదస్తులై ఉంటారు. రకరకాల కాంపిటిషన్స్‌లో పాల్గొనాలనే ఉత్సాహాన్ని చూపరు. పైగా వీటికి చాలా దూరంగా ఉంటారు.

ఎప్పుడూ మానసిక ప్రశాంతను కోరుకుంటారు. తమ భావాలను మరొకరితో పంచుకోవడానికి అంత ఉత్సాహం చూపరు. తక్కువగా మాట్లాడుతారు. ప్రతి ఒక్క విషయానికి ఇంకొకరిమీద ఆధారపడుతుంటారు. మెచ్యూర్డ్‌గా ఉండరు. సహజత్వానికి దూరంగా ఉంటారు.

పరధ్యానంగా ఉండటం వల్ల ...సమస్యలు
నేర్చుకోవాలన్న ఆసక్తి, ఏకాగ్రత ఉండదు. దీని వల్ల ఏం చేస్తున్నారో ఆ పని మైండ్‌లో రిజిస్టర్ కాదు. ఇది పిల్లల్లో అయితే చదువులో వెనకబడేలా చేస్తుంది. పెద్దల్లో పనుల్లో లోపాలు, జాప్యం, కెరియర్‌లో ఎదుగుదల లేకపోవడం.. వంటి నష్టాలు సంభవిస్తుంటాయి.

సమస్యల నుంచి త ప్పుకోవాలనుకుంటారు. ప్రశాంతంగా ఉంటే చాలు అనుకుంటారు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో దూరంగా ఉంటారు కనుక ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడతుంటారు.

వివాహ బంధంలో భాగస్వామితో త్వరగా సర్దుకుపోలేరు. ఎదుటి వ్యక్తి అంటే ఉండే భయం కారణంగా వివాహం కూడా వద్దనుకుంటారు.

ఏదైనా వర్క్ విషయంలో ‘చేస్తాను’ అని మాట ఇచ్చి నిలుపుకోలేరు. దీంతో ఎదుటివారి నమ్మకాన్ని కోల్పోతుంటారు.

కారణాలు
వంశపారంపర్యం: తల్లిదండ్రుల్లో పరధ్యానం సమస్య ఉంటే అది వారి పిల్లలకూ వచ్చే అవకాశం ఉంటుంది.

కుటుంబ వాతావరణ: ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలతో చులకనగా మాట్లాడటం. ఉదాహరణకు ‘నీకే పనీ చేతకాదు, ఓ చోట కూర్చో, నువ్వు సరిగ్గా చదవలేవు...’ వంటి పెద్దల మాటల ప్రభావం చిన్నతనంలో ఒంటరిగా ఉండేలా చేస్తుంది. ఇంకొంతమంది పిల్లల్ని అతిగారాబం చేస్తుంటారు. తింటున్నా, కూర్చున్నా, నిల్చున్నా... ఏం చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే భావంలో ఉంటారు. అన్నీ సజావుగా జరిగిపోవడంతో ఎప్పుడూ సౌకర్యాన్నే కోరుకుంటారు. తమకు అనుగుణంగా లేనప్పుడు త్వరగా మూడీ అయిపోతారు. ఇవి రకరకాల ఆలోచనలను కలిగిస్తాయి.

పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనైనప్పుడు (ఎమోషనల్ ప్రాబ్లమ్స్), అతిగా ఆలోచిస్తున్నప్పుడు కూడా పరధ్యానం వస్తుంటుంది.

పెద్దవారిలో పర్సనాలిటీ డిసార్డర్స్, మేజర్ డిప్రెషన్ డిసార్డర్స్ వల్ల మనసు దిగులుగా, దుఃఖంగా ఉండటం, తమను తాము తక్కువగా అంచనా వేసుకొని వాళ్లలో వాళ్లు లీనమైపోతారు.

స్కిజోఫ్రీనియో: ఇది తీవ్రతరమైన మానసిక జబ్బు. వ్యక్తి తన ఆలోచనల్లో తాను ఉండిపోతాడు. చుట్టుపక్కల వాతావరణం అంతా బాధాకరంగా అనిపిస్తుంటుంది. అందరూ బాధపెట్టేవారుగానే కనిపిస్తారు. రకరకాల అనుమానాలు పెట్టుకుంటారు. తమ ముందు ఎవరూ లేకున్నా, ఎవరో వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉంటారు.

మద్యం, సిగరెట్, మత్తు పదార్థాలు అలవాటైన వారు కూడా ఏదో పోగొట్టుకున్నట్టు పరధ్యానంగా ఉంటారు. మందుల ప్రభావం వల్ల, వ్యసనం వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది.

మల్టీటాస్కింగ్ : ఒకేసారి రకరకాల పనులు చేసేవారిలో అయోమయం నెలకొంటుంది. ముఖ్యంగా స్ర్తీలు- ఇంటి పనులు, పిల్లల పనులు, ఉద్యోగినులైతే ఆఫీస్ పనులు... ఇలా ఒక పని తర్వాత మరో పని పెట్టుకొనే వారు, పనులను ఒక ఆర్డర్ ప్రకారం చేసుకోనివారు పరధ్యానంగా కనిపిస్తుంటారు. అలాగే వ్యాపారాలు, వృత్తి, ఉద్యోగాలు.. ఎన్నో రకాల పనులు పెట్టుకునేవారిలో ఈ సమస్య ఉంటుంది. దీని వల్ల తప్పులు దొర్లుతుంటాయి. ఏకాగ్రత లోపిస్తుంది. దీంతో ‘మర్చిపోతున్నాం’ ‘మతిమరుపు మూలంగా ఏ పనీ చేయలేకపోతున్నాం’ అని తిట్టుకుంటూ ఉంటారు. కాని ఇది మతిమరుపు కాదు, పరధ్యానం వల్ల కలిగే సమస్య.

పరధ్యానం నుంచి బయట పడాలనుకునేవారు...

మనస్తత్వ నిపుణులను సంప్రదించి, మానసిక రుగ్మతతో ఉంటే చికిత్స తీసుకోవాలి.
ఇష్టమైన పనులు చేయాలి. వారం మొత్తం ఏమేం పనులు చేశామో వారాంతంలో గుర్తుచేసుకొని బుక్‌లో రాసుకోవాలి.
ఏకాగ్రత కుదరడానికి, సోషల్ స్కిల్స్‌లో ప్రావీణ్యానికి శిక్షణ తీసుకోవాలి.
ఏకాగ్రత పెరగడానికి రకరకాల పజిల్స్‌తో మెంటల్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. పిల్లల చేత వీటిని చేయించాలి.
పాజిటివ్ దృక్పథాన్ని అలవరుచుకోవాలి.
సమయానుకూలంగా పనిని విభజించుకొని దానికి తగినట్టుగా పనులు చేసుకోవాలి. అదేవిధంగా ఆ రోజు చేయాల్సిన పనుల జాబితా రాసుకోవాలి. అనుకున్న పని పూర్తవగానే టిక్ పెట్టుకోవాలి.
ఒక బుక్ పెట్టుకొని ఏయే సమయాల్లో పరధ్యానంగా ఉంటున్నారు? ఎందుకు ఉంటున్నారు? అనేవి రాసుకోవాలి.
పిల్లలు దేని కారణంగా పరధ్యానంగా ఉంటున్నారో తెలుసుకొని, చర్చిస్తే ఆ సమస్యకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది.

  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, October 13, 2010

జ్వరం -- Fever






  • జ్వరం :వర్షాకాలం సహజంగానే జ్వరాలు ఎక్కువ. ఈ సమయంలో రకరకాల వైరస్‌లు కొత్త శక్తితో విజృంభిస్తాయి. అలాగే నీళ్లు కలుషితం కావటం వల్ల ఇతరత్రా జ్వరాలూ వ్యాపిస్తుంటాయి.
మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 సెంటిగ్రేడ్ డిగ్రీలు లేక 98.4 ఫారన్‌హీట్ డిగ్రీలు ఉంటే అది నార్మల్ అని అంటారు. శరీర ఉష్ణోగ్రత అంతకంటే ఎక్కువ ఉంటే అది జ్వరం అంటారు. సాధారణంగా 37.5 సెంటిగ్రేడ్ డిగ్రీలు వుంటుంది. జ్వరం అన్నది శరీరంలో వున్న ఏదో ఒక వ్యాధి లక్షణము మాత్రమే వ్యాధి ప్రభావము పెరిగే కొద్ది జ్వర తీవ్రత అధికమవుతుంది. 39.5 c లేదా 103 F కు పైన ఉన్నా తప్పనిసరిగా డాక్టరు సలహా తీసుకోవాలి. జ్వరం జబ్బుకాదు! ఒక లక్షణం! వేరే వ్యాధికి ఇది సంకేతం ! మన శరీరం వేరే జబ్బుకు గురైనప్పుడు జ్వరరూపంలో సంకేతం వస్తుంది. మామూలు జ్వరమేకదా అని అశ్రద్ధ చేయకూడదు. జ్వరం ఎందుకు వచ్చిందో కారణం తెలుసుకోవాలి. జ్వరం ఏ జబ్బుకు చెందినదో నిర్థారించుకోవాలి. ఆ జబ్బుకు చికిత్స పొందడం ద్వారా ఆరోగ్యం పొందాలి.

మన శరరంలో ఉష్ణోగ్రతను సమ స్థితిలో వుంచే వ్యవస్థ ఉంటుంది. అది దెబ్బతినడంవల్లనే జ్వరం వస్తుందన్న మాట ! జ్వరానికి కారణమైన జబ్బుల గురించి ముందుగా మనం తెలుసు కుందాం !


  • సాధారణ కారణాలు

* మలేరియా, టైఫాయిడ్ , క్షయ, రుమాటిక్ జ్వరము, ఆటలమ్మ, గవదలమ్మ, ఊపిరితిత్తులు ఇన్ పెక్షన్, జలుబు,  టాన్సిలైటిస్ , బ్రాంకైటిస్ మూత్రనాళాల ఇన్ ఫెక్షన్ మొదలైనవి. బ్యాక్టీయా & వైరస్ వలన ఇంఫెక్షన్‌ వస్తూఉంటాయి ..ఫ్లూ జ్వరం, , ఫైలేరియా, మెనింజైటిస్ , ఎన్‌సెఫలైటిస్ .... మున్నగునవి .

మలేరియా : ఇది అకస్మాత్తుగా వస్తుంది. శరీరం ముట్టుకుంటే కాలిపోతున్నట్లుగా వుంటుంది. జ్వరంతోబాటు చలీ, వణుకూ వస్తుంటాయి. జ్వరం కొద్ది గంటలే ఉంటుంది. ఆ తరువాత తగ్గి పోతుంది. ఇలా తరచూ జరుగుతుంది. జ్వరం తగ్గినట్లు అనిపించగానే చెమటలు పడతాయి. రోజు విడచి రోజు జ్వరం వస్తుంది. లేదా రెండు- మూడు రోజులకు జ్వరం వస్తుంది. జ్వరంలేని రోజున రోగి బాగానే ఉన్నట్లు కనిపి స్తాడు. వస్తూ తగ్గుతూ ఉండే జ్వరాన్ని మలేరియాగా అనుమానించాలి.

టైఫాయిడ్‌: ఇది రొంపతో మొదలవు తుంది. జ్వరం రోజు రోజుకూ పెరుగు తుంది. నాడి నెమ్మదిగా కొట్టుకుం టుంది. ఒక్కోసారి విరేచనాలు ఎక్కువగా అవుతాయి. దాంతో శరీరంలో నీరు ఎక్కువగా బయటకు పోతుంది. నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. ఒణుకు, సంధి ఉంటుంటాయి. చాలా జబ్బుగా ఉన్నట్లు కనిపిస్తారు. ఇటువంటి పరిస్థితిలో టైఫా యిడ్‌గా అనుమానించి వైద్యుడిని సంప్ర దించాలి. టైఫాయిడ్‌ ప్రమాదకారి సుమా!

కాలేయానికి చీము : జ్వర తీవ్రత తక్కువగా వుంటుంది. ఆకలి మంద గిస్తుంది. ఏమీ తినబుద్థికాదు. వాంతులు అవుతుంటాయి. కళ్ళు, చర్మం పచ్చబడ తాయి. మూత్రం పచ్చగా, లేక నారింజ రంగులో వస్తుంది. మలం తెల్లగా వస్తుంది. కాలేయం ఉన్నచోట నెప్పిగా ఉంటుంది. కాలేయం పెద్దదవుతుంది. రోగికి చాలా నీరసం వస్తుంది.

న్యుమోనియా: ఊపిరితిత్తులలో నిమ్ము చేర డాన్నే న్యూమోనియాగా వ్యవహరిస్తాం! ఒక్కోసారి ఊపిరి వేగంగా తీసుకుంటాడు. మరోసారి చాలా తేలిగ్గా తీసుకుంటాడు. ఉన్నట్టుండి జ్వరం త్వరత్వరగా పెరిగి పోతుంటుంది. దగ్గుతుంటాడు. శ్లేష్మం ఆకుపచ్చగా, పసుపు పచ్చగా ఉండవచ్చు. ఛాతీలో నెప్పికూడా వస్తూ వుంటుంది.

రుమాటిక్‌ ఫీవర్‌: దీనినే మనం కీళ్ళ వాతరోగ జ్వరం అంటాం ! పిల్లలకు, యవ్వనంలోకి అడుగుపెడుతున్న వారికీ ఈ వ్యాధి సాధారణంగా వస్తూంటుంది. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. విప రీతమైన జ్వరం వస్తుంది. గొంతులో నెప్పి గా వుంటుంది. ఊపిరి తీసుకుంటున్న ప్పుడు ఛాతీలో నెప్పి వస్తుంది. కాళ్ళు, చేతులు కదల్చాలంటే ఇబ్బందిగా వుంటుంది. అవి స్వాధీనంలో ఉండవు.

క్షయ : ప్రధమంలో రోగికి చాలా అల సటగా ఉంటుంది. మనిషి చిక్కిపోతుం టాడు. సాయంత్రం వేళల్లో తరచుగా జ్వరం వస్తూంటుంది. ఉదయం జ్వరం వుండదు. దగ్గు ఎక్కువగానే ఉంటుంది. ఆకలి ఉండదు. ఏమీ తినబుద్థికాదు. రాత్రివేళల్లో ఉన్నట్టుండి చెమటలు పడుతూవుంటాయి. ఈ లక్షణాలు కొద్ది రోజులు ఉండి తగ్గిపోదు ! నెలల తరబడి ఇదే విధంగా ఉంటాయి.

ప్రసవ జ్వరం : దీనినే సూతికా జ్వరం అనికూడా అంటాం! ప్రసవానంతరం ఒకటి రెండు రోజులు పోయాక జ్వరం వస్తుంది. ఇది చాలా తక్కువ స్థాయిలో వుంటుంది. క్రమంగా పెరుగుతుంది. యోనిలో నుంచి వచ్చే ద్రవం దుర్వాసన పూరితంగా ఉంటుంది. యోనిలో నొప్పి వస్తూంటుంది. ఒక్కోసారి రక్తస్రావం కూడా కావచ్చు.

జ్వరానికి యితర కారణాలు: ఇంతే కాకుండా జ్వరం రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. గొంతువ్యాధి, చర్మంలో వచ్చే చీముగడ్డలు కూడా జ్వరా నికి కారణమౌతాయి. ఒక్కమాటలో చెప్పా లంటే మన శరీరంలో వచ్చే అనేక వ్యాధు లకు జ్వరం ప్రథమలక్షణం! అందుకే జ్వరం ఏ స్థాయిలో ఉన్నా అశ్రద్ధచేయ కూడదు. అశ్రద్ధ చేస్తే ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అలాగే-కొన్ని రకాల జ్వరాలు ముదిరితే-మరికొన్ని జబ్బులకు దారి తీయవచ్చు. మలేరియా వంటి వ్యాధి ముదిరితే రక్తహీనత వస్తుంది. పచ్చ కామెర్లుగా దారితీయవచ్చు. యూరిన్‌ ఇనెఫెక్షన్‌, ఛెస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటివి రాగల ప్రమాదం వుంది.

  • జలుబు జ్వరం
మానవాళికి ఎదుర్కొనే సర్వసాధారణ సమస్య జలుబు. అందుకే దీన్ని 'కామన్‌ కోల్డ్‌' అంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో సంవత్సరానికి ఇది 6-12 సార్లు వస్తుంటుంది. వయసు పెరిగిన కొద్దీ తరచుదనం తగ్గుతుంది, పెద్దవాళ్లక్కూడా 3, 4 సార్లు రావచ్చు. జలుబు తెచ్చిపెట్టే వైరస్‌లు దాదాపు 200 వరకూ ఉన్నాయిగానీ ఎక్కువగా కనబడేది రైనో వైరస్‌. ఇంకా ఎడినో వైరస్‌, ఆర్‌ఎస్‌వీ, కరోనా వైరస్‌ వంటివీ చాలా ఉన్నాయి. దేనితో వచ్చిందన్నది చెప్పటం కష్టం, అంత అవసరం కూడా కాదు. జలుబు చాలా వరకూ దానంతట అదే తగ్గిపోయే సమస్య. దీనివల్ల ఇతరత్రా సమస్యలు ముదరటం అరుదు.

* లక్షణాలు: తుమ్ములు, ముక్కు కారటం, ముక్కు పట్టేయటం, తలనొప్పి, కొద్దిగా జ్వరం.. ఇవన్నీ ఉండొచ్చు. కొందరిలో జ్వరం ఉండకపోవచ్చు కూడా. మొదట్లో 1, 2 రోజులు ముక్కు నుంచి స్వచ్ఛమైన నీరులాంటి ద్రవం వస్తుంది. కొద్దిమందిలో దగ్గు, గొంతు నొప్పి కూడా రావచ్చు. మరీ తీవ్రమైన జ్వరం ఉండదు. ఒళ్లు నొప్పులు అంతగా ఉండవు. ఈ సమస్య సాధారణంగా 2-5 రోజుల్లో తగ్గిపోతుంది. ఈ బాధలు వేధిస్తుంటే- 'యాంటీ హిస్టమిన్‌', 'డీకంజెస్టెంట్‌' మందులు వాడితే మంచి ఉపశమనం ఉంటుంది. ఇవి ముక్కు నుంచి స్రావాలను తగ్గించేస్తాయి. ఇక జలుబుకంటూ ప్రత్యేకంగా 'యాంటీ వైరల్‌' మందు లేదు. కొంచెం ఒళ్లు నొప్పులు, జ్వరం ఉంటే ప్యారాసెటమాల్‌ బిళ్లలు వేసుకోవచ్చు. సాధారణ జలుబు మందుల్లో (డీకోల్డ్‌ వంటివి) ఇవన్నీ కలిసే ఉంటాయి. వీటితోనే జలుబు తగ్గిపోతుంది. చిన్నపిల్లలు ముక్కు బిగిసిపోయి ఏడుస్తుంటే వారికి నేసోక్లియర్‌ వంటి చుక్కల మందులు ముక్కులో వేస్తే రంధ్రాలు తెరుచుకుని హాయిగా గాలి పీల్చుకుంటారు.

జలుబు సమయంలో తీసుకోవాల్సిన ఆహారంలో మార్పులేం ఉండవుగానీ చాలామంది మిరియాల కషాయం, చికెన్‌ పులుసు, మషాలా సూపుల వంటివి ఇష్టపడుతుంటారు, వీటితో ముక్కులు తెరుచుకున్నట్త్లె హాయిగా ఉంటుంది. ఈ సమయంలో ద్రవాహారం, విశ్రాంతి.. ఈ రెండూ ముఖ్యం. ఇలా చేస్తే నాలుగైదు రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది.

* ఇక చాలా కొద్దిమందిలోనే జలుబు ముదిరి.. సైనుసైటిస్‌, చిన్నపిల్లల్లో చెవిపోటు వంటివి సమస్యలు రావచ్చు. ప్రారంభ దశలో అవసరం లేకపోయినా.. రెండు మూడు రోజుల తర్వాత ముక్కు స్రావాలు పసుపు లేదా ఆకు పచ్చగా వస్తుండటం, తలభారం ఉంటే వైద్యుల సలహా మేరకు అమోక్సిలిన్‌, అజిత్రోమైసిన్‌, సెఫలెక్సిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌ వాడితే తగ్గిపోతుంది. చాలామంది జలుబు రాగానే యాంటీబయాటిక్స్‌ మొదలుపెడుతుంటారు, అది
అవసరం లేదు. ముక్కు నుంచి నీరులాంటి స్రావం కారుతున్న తొలి దశలో యాంటీబయాటిక్స్‌ అవసరం అస్సలుండదు. స్రావాల రంగు మారితే అప్పుడు వైద్యుల పర్యవేక్షణలో యాంటీబయాటిక్స్‌ వాడటం మంచిది.

* చాలా కొద్దిమందిలో జలుబు తగ్గినట్లే తగ్గి మళ్లీ ద్రవాలు పచ్చరంగులోకి మారి, జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటివి రావచ్చు. వీరికి వైద్యుల సలహా మేరకు యాంటీబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది.

* ప్రతి సీజన్లోనూ ఈ వైరస్‌ లక్షణాలు మారిపోతుంటాయి కాబట్టి ఇది రాకుండా చూసే టీకాలేం లేవు.

  • డెంగీ జ్వరం
అతి ముఖ్యమైనదీ, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అందర్నీ భయపెడుతున్నదీ డెంగీ జ్వరం. మనకే కాదు, జలుబు తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వేధిస్తున్న ఇన్ఫెక్షన్‌ ఇదే. సాధారణంగా ఈ సీజన్లో, దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో జలుబు, గొంతు నొప్పి, ముక్కుకారటం వంటి ఇతరత్రా లక్షణాలేమీ లేకుండా జ్వరం, అదీ తీవ్రంగా వచ్చిందంటే దాన్ని డెంగీగా అనుమానించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. అందుకే జ్వరం వచ్చినప్పుడు- ముందు డెంగీనా? కాదా? అన్నది గుర్తించటం ముఖ్యం. నిజానికి డెంగీ జ్వరం కూడా ప్రారంభ దశలో సాధారణ జ్వరంలాగే ఉంటుంది. డెంగీ సోకగానే అందరూ చనిపోతారన్నంత భయానికిలోనవ్వాల్సిన పని లేదు. దీనిలోనూ తీవ్రతను బట్టి రకరకాల దశలున్నాయి. చాలామందికి మొదటిసారి డెంగీ జ్వరం వచ్చి ఏమీ తెలియకుండానే తగ్గిపోవచ్చు. కొద్దిమందికి జ్వరం తీవ్రంగా ఉండి తగ్గిపోతుంది. కానీ గతంలో ఒకసారి డెంగీ జ్వరం వచ్చిన వారికి మళ్లీ వస్తే మాత్రం.. తీవ్ర సమస్యలు రావచ్చు. అందుకే దీన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు.

* మొత్తమ్మీద డెంగీ జ్వరంలో విపరీతమైన ఒళ్లు నొప్పులు (ఫ్లూ కంటే కూడా ఎక్కువగా) ఉంటాయి. అందుకే దీన్ని 'బ్రేక్‌ బోన్‌ ఫీవర్‌' అంటారు. కొందరికి  తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. జ్వరం కూడా చాలా తీవ్రంగా 102-104 కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో వాంతులు, లేదా విరేచనాలు, పలవరింతల వంటివి ఉండొచ్చు. కొద్దిమందిలో ఒంటి మీద ఎర్రగా కందినట్లు ర్యాష్‌ రావచ్చు.

* మన రాష్ట్రంలో అంతా ప్లేట్‌లెట్లు చూసుకుంటున్నారుగానీ వాస్తవానికి ప్లేట్‌లెట్లు తగ్గటమన్నది చాలా సమస్యల్లో రావచ్చు. కాబట్టి ఈ సీజన్లో, దోమలు బాగా ఉన్నచోట ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, తీవ్రమైన ఒళ్లునొప్పులు లేదా తలనొప్పి వచ్చి, రక్తపరీక్షలో తెల్లరక్తకణాలు తగ్గటం, ప్లేట్‌లెట్లు తగ్గటం వంటి లక్షణాలు కనబడినప్పుడు దాన్ని డెంగీగా అనుమానించటం మంచిది.

* ఇప్పుడు 'ఎన్‌ఎస్‌1 యాంటీజెన్‌' అనే పరీక్ష అందుబాటులో ఉంది. జ్వరం వచ్చిన 1-5 రోజుల్లో ఎప్పుడు చేసినా ఇది డెంగీ జ్వరమా? కాదా? అన్నది చాలావరకూ తెలుస్తుంది. వారం తర్వాత 'ఐజీఎం యాంటీబోడీ' పరీక్షలో, ఆ తర్వాత ఐజీజీ యాంటీబోడీ పరీక్షలో కూడా తెలుస్తుంది. ఇలా నిర్ధారణ  అయ్యిన తర్వాత.. ఇతరత్రా ఇబ్బందులేమీ లేని సాధారణ డెంగీ జ్వరమే అయితే ప్యారాసెటమాల్‌ మాత్రలు తీసుకుంటూ ద్రవాహారం ఎక్కువగా  తీసుకుంటుంటే సరిపోతుంది. విశ్రాంతిగా ఉండాలి. ముఖ్యంగా డైక్లోఫెనాక్‌, ఐబూప్రోఫెన్‌, ఆస్పిరిన్‌ వంటి నొప్పినివారిణి మాత్రలు మాత్రం పొరపాటున కూడా  తీసుకోకూడదు. ఇస్తే ప్లేట్‌లెట్లు దెబ్బతిని, రక్తస్రావం అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

* డెంగీ జ్వరం 5-7 రోజుల్లో తగ్గిపోతుంది, కొందరికి వచ్చి, తగ్గి, మళ్లీ రావచ్చు. కొంతమందికి కొద్ది రోజులు ఇలా ఊపేసిన జ్వరం.. ఉన్నట్టుంది   ఒక్కసారిగా తగ్గిపోతుంది. చాలామంది జ్వరం తగ్గిపోయిందని నిర్లక్ష్యంగా ఉండిపోతారుగానీ వాస్తవానికి డెంగీలో ఇదే కీలక సమయం. ఇప్పుడే చాలా  జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలా జ్వరం తగ్గిన తర్వాత.. బీపీ పడిపోవటం, రక్తం చిక్కబడటం, నాడి తగ్గటం, ఒంట్లో చిగుళ్ల వంటి రకరకాల ప్రాంతాల నుంచి రక్తస్రావం, మలం నల్లగా రావటం లేదా మూత్రంలో రక్తం పడటం.. ఇటువంటి లక్షణాలు ఆరంభమవుతాయి. ఇది ప్రమాదకరమైన దశ.

* మన రక్తంలో ఎర్రకణాలు, తెల్లకణాలు, ప్లేట్‌లెట్లు ఉంటాయి. వీటికి తోడు ప్లాస్మా అనే ద్రవం ఉంటుంది. డెంగీ జ్వరంలో ఈ ప్లాస్మా లోపల్లోపలే లీక్‌  అవుతూ.. రక్తం చిక్కబడుతుంది. దీంతో ఇటు రక్తం చిక్కబడటం, అదే సమయంలో బీపీ పడిపోవటం.. ఈ రెండూ జరుగుతాయి. ప్లేట్‌లెట్‌ కణాల సంఖ్య  తగ్గటం కంటే కూడా ఇది ప్రమాదకరమైన స్థితి. దీన్ని మనం గుర్తించాలి.

* అందుకే వైద్యులు రోగికి జ్వరం తగ్గినా కూడా రోజూ పరీక్షలు చేయిస్తుంటారు. ప్లేట్‌లెట్లు లక్ష కంటే తగ్గటం, రక్తం 20% కంటే ఎక్కువగా చిక్కబడటం..  ఈ రెండూ ఉంటే దాన్ని 'డెంగీ హెమరేజిక్‌ ఫీవర్‌' అంటారు. అందుకే ప్లేట్‌లెట్ల పరీక్షతో పాటు రక్తం ఎంత చిక్కగా ఉందన్నది చెప్పే 'హెమటోక్రిట్‌' అనే పరీక్ష  కూడా కీలకమే.

ఇక జ్వరం తగ్గిపోయే దశలో- వాంతులు తగ్గకపోవటం, బీపీ తగ్గిపోవటం, చేతులు కాళ్లు సాధారణ స్థితి కంటే చల్లబడుతుండటం, హెమటోక్రిట్‌ పెరగటం,  ప్లేట్‌లెట్లు తగ్గటం, మన సోయి లేకపోవటం, ఒంటి మీద ఎక్కడన్నా తేలికగా రక్తస్రావం లేదా రక్తపు మచ్చలు కనబడుతుండటం, మలం నల్లగా రావటం,  మూత్రంలో రక్తంపడుతూ ముదురురంగులో వస్తుండటం, 4-6 గంటల నుంచీ మూత్రం రాకపోవటం.. ఇలాంటి లక్షణాలు కనబడుతుంటే మాత్రం తక్షణం  ఆసుపత్రిలో చేర్చి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లేట్‌లెట్ల కంటే కూడా 'హెమటోక్రిట్‌' ముఖ్యం. దీన్నే 'ప్యాక్డ్‌ సెల్‌ వాల్యూమ్‌ (పీసీవీ)' అంటారు. దీన్ని బట్టి రక్తం
చిక్కబడకుండా సాధారణ సెలైన్‌ ఇస్తుండాలి. ఇక ప్లేట్‌లెట్లు 1 లక్ష కంటే తగ్గినప్పుడు  ఆసుపత్రిలో చేర్చాలి. రోగి స్థితిని బట్టి ఒకట్రొండు సార్లు ప్లేట్‌లెట్ల పరీక్ష  చేస్తుంటారు. ప్లేట్‌లెట్లు 20,000 కంటే తగ్గినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మూత్రం వంటివాటిలో రక్తస్రావం, మలం నల్లగా రావటం వంటివి  జరుగుతున్నాయేమో గమనిస్తుండాలి. ప్లేట్‌లెట్‌ కణాల సంఖ్య 10,000 (పదివేలకు) తగ్గితే.. ఇతరత్రా ఏ లక్షణాలూ లేకున్నా ప్లేట్‌లెట్లు ఎక్కించాలి.

అరుదుగా ప్లేట్‌లెట్లు బాగానే ఉన్నా, రక్తం గడ్డకట్టే వ్యవస్థ దెబ్బతిని రక్తస్రావం  అవుతుంటుంది.. దీన్ని పీటీ, ఏపీటీటీ పరీక్షల ద్వారా గుర్తించి, అప్పుడు  'ప్లాస్మా' ఎక్కించాలి. పొట్టలో, ఊపిరితిత్తుల్లో నీరు లీక్‌ అయ్యిందేమో గమనిస్తూ బీపీ తగ్గిపోతుంటే వెంటనే సెలైన్‌ ఇవ్వటం, దానితో బీపీ పెరగకపోతే ప్లాస్మా  ఇవ్వటం అవసరం. చాలా వరకూ వీటితో పరిస్థితి చక్కబడుతుంది. అప్పటికీ మెరుగవ్వకపోతే రోగి 'డెంగీ షాక్‌ సిండ్రోమ్‌' లోకి వెళుతున్నారని అర్థం, ఇది  ప్రమాదకర దశ. ఇందులో ప్రాణ ప్రమాదం కూడా ఉంటుంది. అన్నీ బాగుండి కొందరికి కామెర్లు ఉండొచ్చు, ఫిట్స్‌ రావచ్చు, కిడ్నీలు దెబ్బతినొచ్చు. దీన్ని  'ఎక్స్‌పాండెడ్‌ డెంగీ సిండ్రోమ్‌' అంటారు. అంటే ప్రధాన అవయవాలు దెబ్బతింటున్నాయని అర్థం. వీరిని ఐసీయూలో ఉంచి జాగ్రత్తగా కాపాడాల్సి ఉంటుంది. * డెంగీ దోమల ద్వారా వ్యాపించే జ్వరం. కాబట్టి దోమలు కుట్టకుండా చూసుకోవటం అత్యుత్తమమైన నివారణ చర్య.
  • సాధారణ జ్వరం లక్షణాలు

* 37.5 డిగ్రీలు C లేదా 1000 డిగ్రీలు F ఆ పైన జ్వరం నమోదు
* తలనొప్పి
* చలితో కూడిన జ్వరం
* కీళ్ళనొప్పులు
* నోరు చేదుగా ఉండుట
* అకలి తగ్గడం, మలబద్దకం
* కొన్ని ప్రత్యేక సమయాలలో కలవరింతలు మొదలైనవి




జ్వరం వచ్చినప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు


* జ్వరం వచ్చిన వ్యక్తి వున్న వాతావరణం చల్లగా ఉండేటట్లు చూడాలి
* సాధారణ ఫ్యాన్ క్రింద పరుండబెడితే కొంత ఉపశమనముంటుంది
* పలుచటి దుస్తులు వాడాలి
* పలుచటి దుప్పట్లు వాడాలి
* గోరువెచ్చని నీళ్ళతో శరీరమంతా తుడవాలి
* నీళ్ళు ద్రవ పదార్దాలు అధికంగా తీసుకోవాలి
* చల్లని నీళ్ళ తో శరీరము తుడవరాదు. నుదుటి మీద తడిగుడ్డ వేయడం వలన ఉపయోగం లేదు
* జ్వరం వచినపుడు తీసుకోవలిసిన ఆహారము
* ఎక్కువ విశ్రాంతి తీసుకొని అధికంగా నీరు త్రాగాలి
* జ్వరం ఉన్నప్పుడు శరీరానికి అధిక కేలరీలు అవసరము అవుతాయి కనుక గ్లూకోజ్ ,హార్లిక్స్ లాంటి ద్రవ పదార్దాలు, పండ్ల రసాలు వంటివి ఆధికంగా తీసుకోవాలి
* బియ్యం గంజి,సగ్గుబియ్యం గంజి,జావ, బార్లీ నీళ్ళు సులభంగా జీర్ణమై య్యే పదార్దాలు ఇవ్వాలి
* కాఫీ , టీ లాంటి ద్రవ పదార్దాలు సాధారణ వేడి తో తీసుకోవాలి
* పాలు , రొట్టె లాంటి పదార్దాలు తీసుకోవచ్చును
* మాంసం ,గుడ్డు, వెన్న , పెరుగు ,నూనె పదార్దాలు తీసుకోరాదు

జ్వరం-చికిత్స :
జ్వరానికి ప్రత్యేకంగా ఫలానా చికిత్స అంటూ లేదు. జ్వరానికి కారణమైన జబ్బేమిటో తెలుసుకుని చికిత్స పొందాలి. సాధారణమైన జ్వరం రెండు మూడు రోజుల్లోనే తగ్గిపోతుంది. మూడు నాలుగు రోజులకు మించి జ్వరం ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. సత్వర వైద్య సహాయం పొందాలి. లక్షణాలను బట్టి మనకు మనమే జబ్బును నిర్ధారించుకో కూడదు. చిన్నపాటి జ్వరమే కదా అని స్వంత వైద్యం చేసుకోకూడదు. మన తెలియనితనం చాలాసార్లు ప్రాణాల మీదకు తెస్తుంది. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగినప్పుడు గోరువెచ్చని నీళ్ళలోని గుడ్డతో శరీరం తుడవాలి. అలా వేడి తగ్గేందుకు ప్రయత్నించాలి. ఆలస్యం చేయకుండా వైద్య సహాయం పొందాలి. స్వంత వైద్యం, నాటువైద్యం పనికిరాదు. కాబట్టి జ్వరం అనేది ఒక జబ్బు కాదు. మరొక వ్యాధికి లక్షణం. దీనిని గమనించి అవసరాన్ని బట్టి తక్షణం చికిత్స పొందాలి.

tab calpal 500 mg 3 times / day for 3- 5 days

for children :

calpal syrup 2.5 ml 3 times /day 3-5 రోజులు .

  • ఉష్ణమాపి ,Thermometer

జ్వరము కొలిచే సాధనము ను ధర్మామీటరు .ఉష్ణమాపి (Thermometer) , సాధారణంగా ఇందులో పాదరసము ను ఉపయోగిస్తారు. పాదరసం సంకోచ వ్యాకోచాలను ఆధారంగా చేసుకొని ఉష్ణోగ్రతను నిర్ణయిస్తారు. ఈ పరికరమును ముఖ్యముగా రెండు భాగములుగా విభజించవచ్చును, ఒకటి ఉష్ణోగ్రత Sensor (స్పర్శేంద్రియము) (పాదరస ఉష్ణమాపిలో ఉండే బల్బు), రెండవది కొలబద్ద. ఉష్ణోగ్రతను మనము సాధారణము గా entigrade(C) లోగాని Foren(F) లో గాని కొలుస్తాము. ధర్మామీటర్లలో అనేక రకాలు ఉన్నాయి.

"జరుగుబాటుంటే జ్వరమంత సుఖం లేద"న్నారు మన పెద్దవాళ్ళు....అప్పట్లో అంటే, సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో ఓసారి అలా వచ్చి పలకరించి ఇలా వెళ్ళిపోయేవి జ్వరాలు...రోజూ కాయకష్టం చేసే వాళ్ళకి, అలా రెండ్రోజులు మంచం మీద పడుకుని, వేళకింత తింటూ(రోజూలా అదరాబాదరాగా కాకుండా) ఉంటే ప్రాణానికి కాసింత సుఖంగానే అనిపించేదేమో! కాని మన రోజులకి అది అంత సరిపడదేమో! ఒక్కరోజు ఆఫీసుకి వెళ్ళకపోయినా జీతంలో కోత! productivity తగ్గిపోతుందిగా మరి! పైగా నెలకోసారి వచ్చే జ్వరాలతో ఎలా?.......మరి ఇలాంటి జ్వరాలకి జరుగుబాటు ఎలా ఉంటే, మనసుకి,శరీరానికి కాస్త హాయిగా ఉంటుందో


అసలు ఈ జ్వరం అంటే ఏంటి? ఎందుకు వస్తుందో ముందు టూకీగా తెలుసుకుందాం........మన శరీరం యొక్క ఉష్ణోగ్రత (core body temperature) మామూలుగా రోజువారీ ఉండేతేడాలకన్నా(diurnal variations అంటే మన శరీర ఉష్ణోగ్రత ఉదయం పూట,రాత్రి పూట వేరువేరుగా ఉంటుంది) పెరిగితే దాన్ని జ్వరం అనొచ్చు....... అంటే శరీర సాధారణ ఉష్ణోగ్రత 37'c or 98.4'F అనుకుంటే, ఒక డిగ్రీ ఎక్కువ వరకూ నార్మల్ గా తీసుకోవచ్చు.(100'F వరకూ).........ఈ జ్వరం అనేది ప్రత్యేకమైన వ్యాధి కాదు...అంతర్గతంగా ఉన్న ఒక వ్యాధి యొక్క బాహ్య లక్షణం(DISEASE SYMPTOM) మాత్రమే.కాబట్టి జ్వరానికి కారణాలు ఏదైనా కావచ్చు.మామూలు వైరల్ ఫీవర్స్ దగ్గరనుంచి విషజ్వరాలు,క్యాన్సర్లు కూడా కావచ్చు...ఒక్కొక వ్యాధికి జ్వరలక్షణం ఒక్కోరకంగా ఉంటుంది.....అంటే, fever periodicity,high or low grade, associated with chills and rigors, other associated symptoms ఇలాంటివి అన్నమాట.

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన వాళ్ళు సాధారణంగా ఒక అపోహ పడుతుంటారు..."జ్వరం బైటకి కనపడట్లేదు, ’లో జ్వరం’ ఉంది" అని....అలాంటిది ఏమీ ఉండదు..జ్వరం అంటే బయటికి కనిపించేది మాత్రమే....ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది "లోజ్వరం" ఉంది అని టాబ్లెట్లు మింగేస్తుంటారు..దాని వల్ల ఉపయోగం ఏమీ లేకపోగా, లివర్ దెబ్బతినే అవకాశం ఉంది......

ఇక ఫీవర్ ఎంత ఉందో, కరెక్ట్ గా ఎలా చూడాలో చూద్దాం......ఈ రోజుల్లో రకరకాల థర్మామీటర్స్ దొరుకుతున్నాయి....డిజిటల్, ఊరక చేత్తో పట్టుకుని చూసేవి ఇలా......కాని అన్నిటికన్నా బెస్ట్ ఒన్, మన పాత గ్లాస్ థర్మామీటర్(దీన్నే CLINICAL THERMOMETER అంటారు).......body temperature is best measured when it is done per rectally.కాని అలా చెయ్యటం ప్రాక్టికల్ గా కుదరదు కాబట్టి, నాలుక కింద పెట్టి చూడటం(ఒక నిమిషం పాటు) ఉత్తమం....(చేతికింద అంటే చంకలో పెట్టి చూసిన రీడింగుకి ఎప్పుడూ ఒక డిగ్రీ ఎక్కవ కలపాలి.)......చూసే ముందు,తర్వాత థర్మామీటర్ ని శుభ్రంగా తుడవాలి....మరీ చల్లటి నీళ్ళని కాని, మరీ వేడి నీళ్ళని కాని ఉపయోగించవద్దు...దీనివల్ల తప్పు రీడింగు రావటమే కాకుండా, థర్మామీటర్ పగిలిపోయే అవకాశం కూడా ఉంది....చూసేప్పుడు థర్మామీటర్ టిప్ ని పట్టుకోవద్దు..దీనివల్ల చూసినవాళ్ళ బాడీ టెంపరేచర్ ట్రాన్స్మిట్ అయ్యి రీడింగు తప్పు వచ్చే అవకాశం ఉంది.

ధర్మామీటర్లలో అనేక రకాలు ఉన్నాయి

మౌత్ ధర్మామీటరు : ఒక చివర్ పాదరము బల్బ్ ఉంటుంది . ఈ బల్బ్ ను నోటిలో నాలుక కిందను పెట్టి ఉష్ణోగ్రతను కొలుస్తారు . చిన్నపిల్ల విషయము లో దీనిని వాడరు . కొరికే ప్రమాదము ఉన్నందున .

రెక్టల్ ధర్మామీటరు : పిల్లలకు మూడేళ్ళు వచ్చేవరకు ఈ ధర్మామీటరు ఉత్తమమైనది . పిల్లలను బోర్లా పడుకోపెట్టి థర్మామీటరు చివరిభాగములో పెట్రోలియం జెల్లీ రాసి అసనము లోకి అంగుళము మేర చొప్పించి ఉష్ణోగ్రత చూసే సమ్యము పూర్తయ్యే వరకు కాళ్ళు ఒక చేతితోపైకి పట్టుకోని , మరోచేతితో థర్మామీటరునూ పడిపోకుండా పట్టుకొని జ్వరము కొలుస్తారు .

చెవి థర్మామీటరు : ఈ రకమైన థర్మామీటరును అన్ని వయసులవారికి వాడవచ్చును . రెండు నిముషాలపాటు చెవిలో ఉంచి జ్వరము కొలుస్తారు . ఇది కూడా ఖచ్చితమైన ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది .

నోటిద్వారా చూసే డిజిటల్ థర్మామీటరు .: ఐదేళ్ళు .. ఆపైబడ్డవారికి దీనిని ఉపయోగిస్తారు . ఇది బేటరీ పై పనిచేస్తుంది . బేటరీ శక్తి తగ్గితే ఇది తప్పు రీడింగు చూపే ఆస్కారము ఉంది .

స్ట్రిప్ థర్మామీటరు : ముఖము ఫాలభాగము పైన ఈ థర్మామీటరు ఉంచి ఉష్ణోగ్రతను కొలుస్తారు . నోటిలో పెట్టడానికి వీలు పడనపుడు దీనిని వాడుతారు . ఇది ఖచ్చితమైన రీడింగ్ ఇవ్వక పోవచ్చును.


  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, October 11, 2010

గర్భిణి లలో మధ్యపానము , Alcohol in pregnency .



పాశ్చ్యాత్త దేశాలలో మధ్యపానకు చేసే అలవాటు ఎక్కువ . మద్యపానం దుష్ఫలితాల్లో మరోటి వచ్చి చేరింది. గర్భం ధరించిన సమయంలో తల్లులకు ఈ అలవాటు ఉంటే.. వారికి పుట్టిన మగ పిల్లల్లో పెద్దయ్యాక సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని డెన్మార్క్‌లోని ఆర్‌హస్‌ విశ్వవిద్యాలం అసుపత్రి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఇది సంతాన లోపాన్ని కలిగించకపోయినా పిల్లల్ని కనటంలో తీవ్రమైన ఇబ్బందులు మాత్రం తెచ్చిపెడుతోందని పరిశోధకులు చెబుతున్నారు. మిగతా వారితో పోలిస్తే.. గర్భంలో ఉండగా తీవ్రమైన మద్యం ప్రభావానికి గురైన వారిలో పెద్దయ్యాక వీర్యకణాల సంఖ్య మూడింతలు తగ్గుతుండటం గమనార్హం. ''గర్భిణులు మద్యం తాగితే వారి గర్భంలోని శిశువు వృషణాల్లో వీర్యాన్ని ఉత్పత్తి చేయటానికి ఉపయోగపడే కండరాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే పెద్దయ్యాక వీర్యకణాల నాణ్యతను దెబ్బ తినటానికి కారణమవుతుండొచ్చు'' అని అధ్యయనానికి నేతృత్వం వహించిన డా|| సెసిలా రామ్‌లావ్‌-హన్‌సెన్‌ తెలిపారు. ఇలాంటి అధ్యయనం జరగటం ఇదే తొలిసారని, ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. అయితే తండ్రుల మద్యపానం అలవాటుతో దీనికి సంబంధం ఉన్నట్టు బయటపడలేదు.

  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, October 6, 2010

పిల్లలు నోట్లో వేలేసుకోవటం, Thumb Sucking habit in children



నోట్లో వేలేసుకొన్నట్టు--అమాయకంగా ఉండటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పసిపాపలకు నోట్లో వేలేసుకోవటం అలవాటుగా ఉంటుంది. పపిపాపలు అమాయకంగా ఉండటం సహజం. అలా అమాయకంగా ఎవరైనా ఉన్నారని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఇది కొన్నిసార్లు వ్యంగ్య ధోరణిలో కూడా వినిపిస్తుంటుంది. 'నేనేమైనా నోట్లో వేలేసుకున్న వాడిలా కనిపిస్తున్నానా?' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంటుంది.

థంబ్ సకింగ్ అలవాటు పుట్టిన బిడ్డ రొమ్ము పాలు తాగేందుకు ఉపయోగపడే ఒక నాడీమండల రిప్లెక్ష్ . అనుకోకుండా ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది . బిడ్డ సుమారు 4 మాసాల వయసు లో ఇది ఉండకుండా పోతుంది . ఇది సహజమైనది .

పిల్లలు నోట్లో వేలేసుకోవటం సహజమే గానీ.. అదొక అలవాటుగా మారితేనే తంటా. ఇది చూడటానికి అసహ్యంగానే కాదు దవడలు, పళ్ల ఆకారం మారిపోవటానికీ దోహదం చేస్తుంది. ఈ అలవాటును మాన్పించటానికి తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. వేలికి గుడ్డలు చుట్టటం, చేదుగా ఉండే పదార్థాలు రాయటం వంటివెన్నో చేస్తుంటారు. ఇలాంటి తల్లిదండ్రుల అవస్థలను తీర్చటానికే బ్రిటన్‌లో ఇటీవల మొట్టమొదటిసారిగా ఓ ప్రత్యేక ఆసుపత్రి వెలిసింది. ఇప్పటికే ఎంతోమంది పిల్లలను వేలు వేసుకునే అలవాటు నుంచి మాన్పించామనీ అక్కడి వైద్యులు చెబుతున్నారు.

పిల్లలు 3-6 ఏళ్ల వయసు వరకు నోట్లో వేలు వేసుకున్నా పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. నిజానికి చాలామంది ఆ లోగానే దానిని మానేస్తుంటారు కూడా. కానీ కొందరు మాత్రం ఆ అలవాటును వదల్లేరు. ఇది దవడల పెరుగుదలను అడ్డుకుంటుంది. వంకర పళ్లకు దారి తీస్తుంది. చక్కగా రావాల్సిన ముందుపళ్లు ముందుకు వంగి ఎత్తుపళ్లగా తయారవుతాయంటున్నారు. పై దవడకి, పళ్లకి, పెదవికి ఒత్తిడి కలగటంతో పై పెదవి సమానంగా ఉండకుండా చిన్నదిగా తయారవుతుందని.. దాంతో ఎంతో అందమైన కళ్లు, ముక్కు ఉన్నా ప్రయోజనం లేకుండా పోతుంది .

ఎన్నో ఏళ్లుగా వీటికి చికిత్స చేస్తున్న డా.నీల్‌ కౌనిహన్‌కు దీనికోసం ప్రత్యేకంగా ఓ ఆసుపత్రి ఎందుకు ఉండకూడదనే ఆలోచన వచ్చింది. వెంటనే దానిని కార్యరూపంలో పెట్టేశారు. ఇంతకీ ఈ అలవాటును మాన్పించటానికి కొత్త ఆసుపత్రిలో ఏం చేస్తారు? పిల్లల నోట్లో ప్రత్యేక పరికరాలను పెట్టి అసౌకర్య భావన కలిగించటమో.. లేదంటే సంప్రదాయ పద్ధతిలో బొటనవేలికి త్వరగా ఊడిరాని ప్లాస్టిక్‌ కవచాన్ని బిగించటమో చేస్తారు. ఇలాంటి విధానాలెన్నో అక్కడి వైద్యులు రూపొందిస్తున్నారు.

చికిత్సా విధానము :
పిల్లలకి బలవంతంగా ఈ అలవాటును మాన్పిస్తే మానసికంగా దెబ్బతింటారని కొంతమంది చెబుతుంటారుగానీ, అయితే అలాంటిదేమీ లేదని కొన్ని పరిశోధనలు నిరూపించాయి.

నోట్లో వేలు వేసుకునే అలవాటు మానని పిల్లల్లో చదువుపట్ల శ్రద్ధ తక్కువగా ఉంటుందనీ, వారికి వయసుతోపాటు మానసిక వికాసం తగ్గుతుంది . అందుకనే చిన్నారుల్ని ఈ అలవాటు నుంచి ఐదు సంవత్సరాల వయస్సులోపే మాన్పించాలని, లేకపోతే వారు ఎత్తుపళ్ల బారిన పడవచ్చు.

పిల్లలు మట్టిలో ఆడుకుంటూ ఆ చేతివేళ్లను చీకటంవల్ల మట్టిలోని క్రిములు కడుపులోకి పోవటం, దానివల్ల పొట్ట పురుగులు పట్టడం , వాంతులు , విరోచనాలు , కడుపునొప్పికి గురవటం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకనే.. తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతనం నుంచే కనిపెట్టుకుని, ఒకవేళ ఈ అలవాటు ఉన్నట్లయితే మాన్పించే ప్రయత్నం చేయాలి.

ఈ క్రమంలో పిల్లలు నిద్రపోతున్న సమయంలో మెల్లిగా వారి నోట్లోంచి వేలును తీసివేయాలి. కొద్దిగా వయస్సు వచ్చిన పిల్లలు ఆ అలవాటును మానకపోతే వేళ్లన్నింటికీ స్టిక్కింగ్ ప్లాస్టర్ అంటించి చూడాలి లేదా ఏదైనా చేదుపదార్థం రాయాలి.

ఇవన్నీ చేసినా పిల్లలు నోట్లో వేలేసుకోవటం మాననిపక్షంలో పళ్ల వైద్యుల వద్దకు తీసుకెళ్లినట్లయితే, వారు పిల్లల నోట్లో ముళ్లు ఉండే ప్లేటును అమర్చుతారు. అలవాటుగా పిల్లలు నోట్లో వేలు వేసుకున్నట్లయితే ఈ ప్లేటులోని ముళ్లు గుచ్చుకుని. వారు నోట్లో వేలు వేసుకునేందుకు సాహసించరు. అలా క్రమంగా పిల్లలు నోట్లో వేలు వేసుకోవటం మానివేస్తారు.

ఈ అలవాటు కేవలం పిల్లల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పెద్దల్లోనూ కనిపిస్తుంది. చిన్నతనంలో లేకపోయినా వారికి ఆ అలవాటు అబ్బటం విశేషం. మానసిక నిపుణుల కౌన్సెలింగ్‌తో దీని నుంచి తప్పించుకోవచ్చు.

updates :
ఈనాడు సుఖీభవ -- 23112010
ఏడాదిలోపు పిల్లలు నోట్లో వేలేసుకోవటం సహజమే. ఆకలి అనిపించినప్పుడు, ఒంటరిగా, అసౌకర్యంగా ఉన్నప్పుడు, పాలు చీకాలనే కోరికను తీర్చుకోవటానికి.. ఇలా వివిధ సందర్భాల్లో పిల్లలు నోట్లో వేలు వేసుకుంటూ ఉంటారు. ఆకలి వేసినప్పుడు పిల్లలు ఒక వేలు మాత్రమే కాదు, చేయి అంతటినీ నోట్లో కుక్కుకుంటారు కూడా. సాధారణంగా తల్లిపాలు తాగే పిల్లల్లో కన్నా సీసా పాలు పట్టే చిన్నారుల్లో నోట్లో వేలు వేసుకునే అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే సీసాతో పాలు పట్టేటప్పుడు అవి త్వరగా అయిపోతాయి. దీంతో పాలు చీకాలనే కోరిక పూర్తిగా తీరకపోవటంతో నోట్లో వేలు వేసుకొని తృప్తి పడుతుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లలు ఈ అలవాటును స్వతహాగానే మానేస్తుంటారు. ఆట వస్తువులు, ఇతర అంశాల మీదికి దృష్టి మళ్లుతున్న కొద్దీ నోట్లో వేలేసుకోవటాన్ని మరచిపోతుంటారు. కాబట్టి వయసుకు తగ్గట్టుగా పిల్లల మనసుకి నచ్చే ఆట వస్తువులను అందుబాటులో ఉంచుతూ, వేళకు ఆహారం తినిపిస్తే చాలావరకు ఈ అలవాటు దీర్ఘకాలం కొనసాగకుండా చూసుకోవచ్చు నిద్రపోతున్నప్పుడో, అలసిపోయినప్పుడో ఒకట్రెండు సార్లు నోట్లో వేలేసుకున్నా పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు.

సాధారణంగా పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ 68 ఏళ్లు వచ్చేసరికి నోట్లో వేలు వేసుకోవటం మానేస్తారు. ఒకవేళ అప్పటికీ మానకపోతుంటే ఇందుకు తీవ్రమైన ఒత్తిడికి సంబంధించిన సమస్యలు, మానసికంగా చిన్నబుచ్చుకోవటం వంటివి కారణాలు కావొచ్చు. ఇలాంటి సమయాల్లో పిల్లలు ఆ అలవాటు నుంచి బయటపడటానికి పెద్దవాళ్లు సహకరించాలి. బలవంతంగా, భయపెట్టి మాన్పించటం సరికాదు. ఎందుకంటే పిల్లలు పెద్దగా అవుతున్నకొద్దీ పిల్లలు తమకుతాముగానే ఆత్మ నిగ్రహాన్ని నేర్చుకుంటారు. ఇతరులను చూసి తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారు. కాబట్టి పిల్లలను కొట్టటం, తిట్టటం వంటివి చేయరాదు.

** పిల్లలు నోట్లో వేలు వేసుకుంటుంటే పెద్దవాళ్లు ముందుగా దానిని పట్టించుకోనట్టే వ్యవహరించాలి. తిట్టటం, కొట్టటం వల్ల ఈ అలవాటు మరింత ముదిరే ప్రమాదం ఉంది.
** పిల్లలను ఇతర వ్యాపకాల వైపు దృష్టి మళ్లించేలా చూడాలి.
** ఏదైనా మంచి అలవాటును నేర్చుకుంటే బహుమతి ఇవ్వటం ద్వారా పిల్లల్లో మార్పు తీసుకురావొచ్చు. నోట్లో వేలు వేసుకోని సందర్భాల్లో పిల్లలను మెచ్చుకోవటం, బహుమతి ఇవ్వటం వంటివి చేసి ఆ అలవాటు నుంచి బయటపడేలా ప్రోత్సహించాలి.
** పిల్లల్లో చాలా శక్తి ఉంటుంది. వారికి కాగితం, పెన్సిల్‌, బిల్డింగ్‌ బ్లాక్స్‌ వంటివి ఇస్తే వాటితో గడపటంలో మునిగిపోతారు.
** ఒకవేళ పిల్లలు నోట్లో వేలు వేసుకునే అలవాటు మానలేకపోతుంటే పిల్లల మానసిక వైద్యుడికి చూపించటమూ మంచిదే.

  • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, October 5, 2010

క్షయ వ్యాధి , T.B. disease




  • టి.బి. (క్షయ) అంటే ఏమిటి?
ఇది మైక్రో బాక్టీరియా టుబరంక్యులోసిన్ అనే బాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఈ క్షయ క్రిములు ముఖ్యంగా ఊపిరితిత్తులలో ప్రవేశించి శ్వాసకోశ క్షయవ్యాధిని కలుగచేస్తాయి. ఈ శ్వాసకోశ క్షయ చాలా తీవ్రమైన అంటువ్యాధి. శరీరంలోని ఇతర భాగాలకి కూడా క్షయ వ్యాధి రావచ్చు. అనగా శ్వాసకోశేతర భాగాలు .. 1.ఎముకలు, 2.కీళ్ళు, 3.లింపు గ్రంధులు, 4.మెదడు పొరలు, 5.మూత్ర పిండాలు, 6.గర్భ సంచి మొదలైనవి.

  • క్షయ అంటువ్యాధి. ఇది స్త్రీ, పురుషులకు ఏ వయసులోనైనా, ఎవరికైనా సోకవచ్చు. శరీరంలో ఏ భాగానికైనా రావొచ్చు. ఎక్కువగా ఊపిరితిత్తులకు సోకుతుంది. దీన్నే శ్వాసకోశ క్షయ అంటారు. జనాభాలో 100 మందిలో 40 మందికి పెద్ద వయసు వచ్చేసరికి క్షయ వ్యాధి సోకుతుంది. కానీ వీరిలోని రోగనిరోధక శక్తి వల్ల అది వ్యాధిగా మారదు. సెకనుకు ఒకరు క్షయ వ్యాధి బారినపడుతున్నారు. ప్రపంచ జనాభాలో మూడో వంతు మంది క్షయ బాధితులు. క్షయ వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, చీదినప్పుడు, మాట్లాడినప్పుడు, ఊసినప్పుడు క్షయ సూక్ష్మజీవులు ఇతరులకు గాలి ద్వారా సోకుతాయి. క్షయ వ్యాధి వచ్చిన వ్యక్తికి చికిత్స చేయకపోతే ఇతని ద్వారా సగటున ఏడాదిలో 10 నుంచి 15 మందికి క్షయ సోకుతుంది. కానీ క్షయ సూక్ష్మజీవి సోకిన వ్యక్తి అస్వస్థతకు గురవడం తప్పనిసరి కాదు. ఎందుకంటే ఈ వ్యక్తిలోని రోగనిరోధక శక్తి సూక్ష్మజీవిని చంపేస్తుంది. రోగనిరోధక శక్తి బలహీనమైతే క్షయ వ్యాధి వచ్చే అవకాశాలెక్కువ.
వ్యాధి లక్షణాలు :
  • 1. మూడు వారాలకి పైగా దగ్గు, కఫం
  • 2. సాయంత్రం, రాత్రి సమయాలలో జ్వరం
  • 3. బరువు తగ్గుట, ఆకలి తగ్గుట
  • 4. దగ్గు కఫంతోపాటు రక్తంపడుతుంది

క్షయ- ఎయిడ్స్‌


  • మూడు వారాలకు మించి దగ్గు, సాయంత్రం పూట జ్వరం, ఆకలి లేమి, బరువు తగ్గడం, కఫంలో రక్తం పడడం - ఉంటే క్షయ వ్యాధి పరీక్షలు చేయించుకోవాలి. ఎయిడ్స్‌ వ్యాధి గల వారిలో క్షయ వ్యాధి ఎక్కువగా వస్తుంది. క్షయ వ్యాధికి 'డాట్స్‌' చికిత్స ఉంది. డాట్‌ ప్రొవైడర్‌ స్వయంగా మందులు మింగిస్తారు. క్షయ వ్యాధికి బిసిజి టీకా ఉంది. పిల్లలకు వీలున్నంత తొందరలో ఈ టీకా ఇప్పించాలి.

వ్యాపించే విధానం

  • 1. క్షయ క్రిములు గాలి ద్వారా వ్యాపించుతాయి
  • 2. క్షయ వ్యాధి గ్రస్తుడు దగ్గినపుడు, అతని ఊపిరితిత్తుల నుండి వచ్చే కఫం ద్వారా ఈ బాక్టీరియా గాలిలో చేరి, దగ్గరలో ఉన్న ఆరోగ్యవంతమైన మనిషి పీల్చే గాలితోపాటు అతని ఊపిరితిత్తుల లోనికి ప్రవేశించి జబ్బుకి పునాది వేస్తుంది.
నిరోధక చర్యలు :
  • 1. క్షయరోగి దగ్గినప్పుడు నోటికి అడ్డుపెట్టుకోవాలి.
  • 2. దగ్గినపుడు వచ్చే కఫం ఒక పాత్రలోనికి పట్టి కాల్చివేయాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • 3. నిరోధక చర్యగా చిన్న పిల్లలకి బి.సి.జి. టీకా ఇప్పించాలి.



నివారణ చర్యలు - లేబరిటరీ పరీక్షలు :

  • రక్త పరీక్షలు - Tc ,Dc , ESR , Hb% Blood sugar , HIV test , HBsAg test , etc .
  • నీరుడు పరీక్షలు - Alb , Sugar , Microscopic ,
  • ఛాతి ఎక్సురే ,
  • కెళ్ళ పరీక్ష ,
  • IgG /IgM Rapid test
  • ఎక్స్‌పర్ట్‌ ఎంటీబీ/ఆర్‌ఐఎఫ్‌
Treatment:

  • వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తికి వెంటనే కఫంప పరీక్ష జరిపి చికిత్స ప్రారంభించి మానకుండా పూర్తి కాలం వైద్యులు నిర్ణయించిన ప్రకారం మందులు వాడాలి.

శరీరంలో క్షయ వ్యాధి ఏ భాగంలో ఉన్నప్పటికీ చికిత్సా విధానం మాత్రం ఒకటే. రిఫాంపిసిన్‌, ఐసోనెక్స్‌, ఇతాంబ్యుటాల్‌ వంటి మందులతో వ్యాధిని పూర్తిగా నయం చేయ వచ్చు. ఈ వ్యాధికి కనీసం 6 నెలలు క్రమం తప్పకుండా వైద్య సలహాపై మందులు వాడాలి. మందులు వాడటం మొదలుపెట్టిన నెల రోజుల్లో రోగికి చాలా వరకూ ఉపశమనం వస్తుంది. కానీ ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు తప్పనిసరిగా మందులు వాడాలి. కొంత మంది ఉపశమనం లభించిందని మందులు వాడటం మానేస్తుంటారు. ఇటువంటి వారికి వ్యాధి తిరిగి ఆరంభమవుతుంది.

వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రతతోపాటు ఇళ్లలో గాలి, వెలుతురు మొదలైనవి బాగా ఉండేలా చూసుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మిన ప్పుడు చేతి రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ కళ్లె ఉమ్మేయకూడదు.ఉమ్మి వేయడానికి మూత ఉన్న కప్పు ఉప యోగించాలి. మంచి పోషకాహారం తీసుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప జేసుకోవాలి.

For more details in Telugu -> T.B in Telugu Wikipedia


  • క్షయ నిర్ధారణకు కొత్త పరీక్ష
క్షయవ్యాధిని వేగంగా, తేలికగా గుర్తించటానికి ఇప్పుడొక కొత్త పరీక్ష అందుబాటులోకి వచ్చింది. ఎక్స్‌పర్ట్‌ ఎంటీబీ/ఆర్‌ఐఎఫ్‌ అనే ఇది మందులకు లొంగని క్షయ రకాన్ని కూడా పసిగడుతుండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా క్షయను.. ముఖ్యంగా మందులకు లొంగని, హెచ్‌ఐవీ బాధితుల్లో వచ్చే రకాలను అరికట్టటంలో సఫలం కాలేకపోవటానికి నెమ్మదిగా, బండ పద్ధతుల్లో సాగుతున్న పరీక్షలూ దోహదం చేస్తున్నాయి. ప్రస్తుతం శిక్షణ పొందిన నిపుణులు సూక్ష్మదర్శిని ద్వారా చేసే ఈ పరీక్షలకు ఎంతో సమయం పడుతోంది. ఎప్పుడో 125 ఏళ్ల క్రితం కనుగొన్న పద్ధతుల్లో ఇప్పటికీ పెద్దగా మార్పులేవీ రాలేదు.

ప్రపంచంలో ఎంతోమంది మరణాలకు కారణమయ్యే 10 ప్రధాన వ్యాధుల్లో క్షయ కూడా ఒకటి. ఇది సబ్‌ సహారన్‌ ఆఫ్రికా, భారత్‌, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేదలకు ఎక్కువగా సోకుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో పేదలు నివసించే ప్రాంతాల్లోనూ కనబడుతోంది. హెచ్‌ఐవీ బాధితుల్లో కూడా చాలామంది క్షయ బారినపడుతున్నారు. మందులకు లొంగని క్షయను గుర్తించటానికి నెలల సమయం పడుతున్న సందర్భాలూ లేకపోలేదు. అందుకే దీనిని మరింత కచ్చితంగా, వేగంగా గుర్తించే కొత్త పరీక్షలు రావాల్సిన అవసరం ఉందని వైద్యులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు.

ఎక్స్‌పర్ట్‌ ఎంటీబీ/ఆర్‌ఐఎఫ్‌ పరీక్ష సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. మందులకు లొంగని క్షయ ఉండే అవకాశం గల మొత్తం 1,730 మంది నుంచి కళ్లె నమూనాలు సేకరించి పాత, కొత్త పద్ధతుల్లో పరీక్షించారు. వీటిల్లో ఎక్స్‌పర్ట్‌ ఎంటీబీ/ఆర్‌ఐఎఫ్‌ పరీక్ష 98 శాతం వరకు కచ్చితమైన ఫలితాన్ని అందించింది. క్షయ నివారణకు ఇచ్చే శక్తిమంతమైన మందు రిఫామైసిన్‌కు లొంగని జబ్బురకాన్ని కూడా ఇది గుర్తించింది. అదీ కేవలం 2 గంటల్లోనే. ఈ పరీక్ష త్వరగా పూర్తికావటమే కాకుండా ఎలాంటి మందులు వాడాలో అనేదానిపైనా ఒక అవగాహన కలిగిస్తుండటం విశేషం.

  • క్షయ పరీక్ష.. 100 నిమిషాల్లోనే updated 25/12/2010

క్షయ ఎంత సర్వసాధారణమైన వ్యాధో.. దాని నిర్ధారణ అంత కష్టమవుతుంది ఒక్కోసారి. వూపిరితిత్తుల్లో తలెత్తే క్షయను ఛాతీ ఎక్స్‌రే, కళ్లె పరీక్ష, మాంటో పరీక్ష వంటివాటితో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నా.. దాన్ని చాలాసార్లు కచ్చితంగా నిర్ధారించటం కష్టమవుతోంది. మరికొన్ని సందర్భాల్లో అనుమానంగా ఉన్న అవయవం నుంచి ముక్క తీసి కూడా పరీక్షించాల్సి వస్తుంటుందిగానీ... ఆ ఫలితం రావటానికి చాలా సమయం పడుతుంది. మొత్తానికి క్షయ నిర్ధారణ తరచుగా గందరగోళంగా తయారవుతోందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కచ్చితమైన ఒక సరికొత్త విధానాన్ని తెరపైకి తెస్తోంది.

వైద్యరంగం ఇంతగా అభివృద్ధి చెందుతున్నా క్షయ వ్యాధి ప్రపంచాన్ని ఇప్పటికీ వణికిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరం 94 లక్షల మంది దీని బారిన పడగా.. 17 లక్షల మంది మరణించటమే దీనికి నిదర్శనం. మొత్తం క్షయ కేసుల్లో మూడింట ఒకవంతు మనదేశంలోనే వెలుగు చూస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. 2009లో ప్రతి రెండు నిమిషాలకు ఒక కేసు నమోదు కావటం గమనార్హం. క్షయ ఒక్క భారత్‌లోనే ఏటా 5 లక్షల మందిని కబళిస్తోంది. వీరిలో 15-45 ఏళ్లలోపు వాళ్లే ఎక్కువగా ఉంటుండటంతో ఆర్థికంగా ఏడాదికి సుమారు రూ.13,500 కోట్ల నష్టమూ సంభవిస్తోంది.

క్షయ వ్యాధిని గుర్తించే పరీక్షలు మారుమూల ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవటం, ఫలితం తేలటానికి చాలా సమయం పడుతుండటం వంటివి క్షయ విజృంభించటానికి దోహదం చేస్తున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కేవలం 100 నిమిషాల్లోనే క్షయను గుర్తించే కొత్త పరీక్షకు ఆమోదం తెలిపింది. దీనిని ప్రయోగశాలల్లోనే కాకుండా బయట కూడా చేసే వీలుండటమూ విశేషం. ప్రస్తుతం చాలా వరకు వందేళ్ల క్రితం రూపొందించిన కళ్లె పరీక్షతోనే క్షయను గుర్తిస్తున్నారు. తాజా పరీక్షను డీఎన్‌ఏ పరిజ్ఞానం ఆధారంగా రూపొందించారు. ఎన్‌ఏఏటీ (న్యూక్లియక్‌ యాసిడ్‌ ఆంప్లికేషన్‌ టెస్ట్‌) అని పిలుచుకునే ఇది క్షయను తొలిదశలోనే కాదు.. మందులకు లొంగని మొండి క్షయను, హెచ్‌ఐవీతో కూడిన సంక్లిష్టమైన క్షయనూ కచ్చితంగా గుర్తిస్తుంది. ఈ పరీక్షకు సంబంధించి శాస్త్రీయమైన ఆధారాలు లభించినందున ఇప్పుడు దీనిని వివిధ దేశాల్లో అమలు చేయాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సంకల్పించింది. ఇది మందులకు లొంగని మొండి క్షయ, హెచ్‌ఐవీతో ముడిపడిన క్షయను గుర్తించటంలో మూడు రెట్లు మెరుగైన ఫలితాలు అందిస్తుందని భావిస్తున్నారు. దీనిని తయారుచేసిన కంపెనీ భారత్‌ వంటి బడుగు దేశాలకు ధరను 75 శాతం తగ్గించి ఇస్తుండటం వల్ల ఇది అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు.

'క్షయ' భరితం!-భవిష్యత్‌ ప్రమాదకరమే-పిల్లల్లో పెరుగుతున్న తీవ్రత-నియంత్రణ అంతంత మాత్రమే---> -ఈనాడు - హైదరాబాద్‌ సౌజన్యము తో .
క్షయనివారణకు కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఉచితంగా ఖరీదైన మందులు ఇస్తున్నా, వ్యాధి నివారణ జరగకపోగా చిన్నారుల్లో క్షయ తీవ్రత ఆందోళనకరంగా మారుతోంది. మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అయిదేళ్లలోపు పిల్లల్లో ఏటా 12 వేలకు పైగా క్షయ కేసులు నమోదవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే, అయిదారు రెట్లు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని వైద్య
ఆరోగ్యశాఖకు చెందిన అధికారులే అంగీకరిస్తున్నారు. మరో తీవ్రమైన విషయం.. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో వూపిరితిత్తులతో పాటు ఇతర అవయవాల్లో క్షయ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. క్షయ వ్యాధి సోకినవారికి పూర్తిస్థాయిలో చికిత్స అందకపోవడం వల్ల, వారి ద్వారా ఎక్కువ మందికి వ్యాపిస్తోంది. దీని తీవ్రతను గుర్తించి, వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్‌ భయానకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

నయం కాకపోతే..: ఒక క్షయరోగికి వ్యాధి నయం కాకపోతే, అతని ద్వారా ఏడాదికి 10- 15 మందికి సోకే ప్రమాదం ఉంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులు ఒకసారి దగ్గినపుడు దాదాపు 40 వేలదాకా వ్యాధికారక క్రిములు గాల్లో కలుస్తాయి. ఇవి మనం పీల్చేగాలి ద్వారా శరీరంలోకి చేరుతాయి. చివరికి రోగ నిరోధకశక్తి తగ్గినప్పుడు ''క్షయ''గా మారుతోంది. కేంద్ర వైద్యఆరోగ్య మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం... మన జనాభాలో 33.3%(మూడో వంతు) మంది శరీరాల్లో క్షయ వ్యాధికారక క్రిములు అంతర్గతంగా ఉన్నాయి. ఇది చాలా ఆందోళనకర పరిణామం. దీన్ని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 1993లోనే క్షయను ప్రపంచ ఆరోగ్య అత్యయిక పరిస్థితిగా ప్రకటించింది. అయితే.. వ్యాధి నియంత్రణ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్య వైఖరి ఫలితంగా మందులకు కూడా లొంగని రీతిలో క్షయ వ్యాధికారక బ్యాక్టీరియా శక్తిమంతంగా మారింది. గత ఏడాది ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6991 మందిని పరీక్షించగా... దాదాపు 1561 మందిలో మందులకు లొంగని క్షయ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పేద ప్రజానీకంలో క్షయవ్యాధి ఉన్నట్లు తెలిసినా, చాలామంది మందులు కూడా వాడడం లేదని వైద్యశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి 'ఈనాడు'తో చెప్పారు.

వ్యాధికారక బ్యాక్టీరియాలో మార్పులు: మన దేశ జనాభాలో క్షయకారక క్రిములు ఇప్పటికే చాలామంది శరీరాల్లో నిద్రాణ స్థితిలో ఉన్నాయి. రోగ నిరోధక శక్తి తగ్గగానే వ్యాధిగా విజృంభించే అవకాశం ఉంది. క్షయ సోకినవారిలో దాదాపు 35 శాతం మంది వ్యాధి సంపూర్ణంగా నయమయ్యేంత వరకు మందులు వాడడం లేదు. దీనివల్ల వారిలో వ్యాధికారక బ్యాక్టీరియా మందులను కూడా తట్టుకునే స్థితికి చేరుకుంది. ఇలాంటి బ్యాక్టీరియా ఉన్న వ్యక్తులు దగ్గినపుడు వ్యాధికారక క్రిములు గాల్లో కలిసి ఎక్కువ మందికి వ్యాప్తి చేయడానికి దోహదం చేస్తున్నాయి. ఈ బ్యాక్టీరియా అందరి శరీరాల్లోకి చేరితే, వ్యాధిని నయం చేయడం ఎలా అన్నదే ఇప్పుడు వైద్యవర్గాలను ఆందోళనలో ముంచెత్తుతున్న అంశం. దీనికి మరింత శక్తిమంతమైన కొత్తరకం మందులు అవసరం. వాటిని కనుక్కోవాల్సి ఉంది. మరోవైపు.. శక్తిమంతమైన మందులు వాడితే, వాటిని తట్టుకునే శక్తి శరీరానికి ఉండదు. దీనివల్ల వివిధ రకాల కొత్త ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కొత్త సవాలు: ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో క్షయ.. వైద్యరంగంలో ఒక సవాలుగా మారుతోంది. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో శరీరంలోని వివిధ భాగాల్లో కణితుల రూపంలో, పేగుల్లో, మెదడు, ఎముకలకు సోకుతోంది. క్షయ రోగి ఉన్న కుటుంబంలో అయిదేళ్లలోపు పిల్లలుంటే, వారికి వ్యాధి సోకకుండా ముందస్తుగా మందులు ఇవ్వాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా విధానాన్ని అనుసరిస్తున్నారు. మన దేశంలో కూడా ఈ తరహా విధానం అమలు చేయాలని అయిదేళ్ల కిందట నిర్ణయించినా, ఇప్పటి వరకు కార్యాచరణకు నోచుకోలేదు. బ్యాక్టీరియా మందులకు లొంగని రీతిలో మార్పులు చెందుతున్నతీరు, ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో క్షయ భారతంగా మారుతుంది.

క్షయ విశ్వరూపం
*మన దేశంలో ప్రతి రోజు 1000 మంది క్షయతో మృత్యువాత పడుతున్నారు.
*మన రాష్ట్రంలో ఏటా కొత్త కేసుల్లో 1.8% మందులకు లొంగని క్షయ కేసులు నమోదవుతున్నాయి.
*పాత కేసుల్లో 11.8% మందులకు లొంగని క్షయ కేసులు ఉన్నాయి.
*జైళ్లలోఉన్న రిమాండ్‌ ఖైదీల్లో క్షయవ్యాధి ఎక్కువగా ఉంది. సాధారణ ప్రజలతో పోలిస్తే 10- 20 రెట్లు ఎక్కువ కేసులు జైళ్లలో నమోదవుతున్నాయి.
*అనంతపురం, కర్నూలు, నెల్లూరు, వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది.
*క్షేత్రస్థాయిలో వ్యాధి నిర్ధారణ కేంద్రాలు పెంచాలి. వ్యాధిగ్రస్తులకు మందులతో పాటు అవి వాడే విధంగా వారికి అవగాహన పెంపొందించాలి.


  • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/

బరువు తగ్గుట అనారోగ్యము , Weight loss indicates illness how?








ప్రపంచం మొత్తం 'బరువు' మాట వింటేనే భయపడుతోంది! ఎక్కడ చూసినా వూబకాయం వూబిలో కూరుకుపోయి.. బరువు తగ్గాలని తంటాలుపడే వారే. ఉండాల్సిన దానికంటే ఎక్కువున్నవారు కచ్చితంగా బరువు తగ్గటం, తగ్గేందుకు ప్రయత్నం చెయ్యటం అవసరమే. కానీ మనమే ప్రయత్నమూ చెయ్యకుండా.. మనవైపు నుంచి ఎటువంటి శ్రమా లేకుండానే బరువు తగ్గుతున్నామంటే మాత్రం అది మంచి లక్షణం కాదు!

బరువు తగ్గిపోవటమన్నది శరీరంలో తలెత్తిన తీవ్ర అనారోగ్యానికి సూచిక! క్షయ, క్యాన్సర్‌ వంటి తీవ్రస్థాయి సమస్యల్లో ప్రధానంగా కనబడే లక్షణం... ఈ బరువు తగ్గటమే! కాబట్టి బరువు తగ్గిపోతున్నట్టు అనుమానం వస్తే తక్షణం వైద్యులను సంప్రదించి.. అందుకు కారణాలను అన్వేషించటం అత్యవసరం!

బరువు తగ్గిపోతుండటమన్నది వైద్యపరంగా చాలా తీవ్రమైన అంశం! బరువు ఎక్కువ ఉన్నవారు, బరువు తగ్గాలని భావించేవారు కావాలని డైటింగ్‌, వ్యాయామాల వంటివి ఎక్కువ చేస్తుంటారు. వారు బరువు తగ్గటం సహజం. అయితే అలాంటి ప్రయత్నాలేవీ లేకుండానే చాలా వేగంగా.. అంటే నెలకు ఒక కిలోకన్నా, లేదా ఆర్నెల్లలో 5 కిలోలకన్నా ఎక్కువగా బరువు తగ్గిపోతుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏదో తలెత్తిందని అనుమానించాలి.
మన వయసు, తీసుకునే ఆహారం, ఆరోగ్యం, శారీరక శ్రమ వంటి అంశాలన్నీ మన బరువును ప్రభావితం చేస్తాయి. సాధారణంగా ఒక వయసుకు వచ్చిన తర్వాత బరువు కాస్త అటూఇటూగా స్థిరంగా ఉంటుంది. అలాకాకుండా తగ్గిపోతోందంటే దాన్ని తప్పకుండా పట్టించుకోవాలి. ఆహారం సరిగా తీసుకోకపోవటం.. తిన్న ఆహారం వేగంగా ఖర్చైపోతుండటం.. కొన్నిసార్లు మలమూత్రాల ద్వారా గ్లూకోజు, ప్రోటీన్లు బయటకు వెళ్లిపోతుండటం.. ఇవన్నీ బరువు తగ్గటానికి దోహదం చేసే అంశాలు. చిన్నపేగులు, క్లోమగ్రంథుల్లో సమస్యలు తలెత్తినపుడు.. తిన్న ఆహారంలోని పోషకాలను మన శరీరం గ్రహించక ముందే అవి బయటకు వెళ్లిపోతుంటాయి. దీంతో పోషకాహార లోపం తలెత్తి బరువు తగ్గిపోతుంటారు. క్షయ వంటి తీవ్ర సమస్యల్లో ఆకలి తగ్గిపోయి, దానివల్ల కూడా బరువు తగ్గిపోతుంటారు. మానసిక ఒత్తిడి వలన బరువు పెరిగే మాట నిజమేగానీ.. ఇదే కొందరిలో బరువు తగ్గిపోయేందుకూ కారణమవుతుందని గుర్తించాలి.
.
మధుమేహంలో బరువెందుకు తగ్గుతారు?
మధుమేహం వస్తే మన రక్తంలో గ్లూకోజు శాతం ఎక్కువ అవుతుంది. రక్తంలోని ఆ గ్లూకోజు తనతో పాటు ఎక్కువగా నీటిని కూడా బయటకు తీసుకుపోతుంటుంది. ఫలితంగా ఒంట్లో నీటిశాతం తగ్గిపోయి మనిషి బరువు తగ్గుతారు. తర్వాత- రక్తంలో గ్లూకోజు అధికంగానే ఉంటున్నా శరీర కణజాలం దాన్ని సరిగా ఉపయోగించుకోదు కాబట్టి ఒంట్లో కండరాల క్షీణతా ఆరంభమవుతుంది. క్రమేపీ కండ తగ్గిపోతూ బరువు తగ్గుతారు. వీటివల్ల ఎంత తింటున్నాగానీ బరువు తగ్గిపోతుంటారు.బరువు తగ్గిపోయేలా చేసే రుగ్మతల్లో అతి ప్రధానమైంది మధుమేహం. మన దేశంలో ఎవరైనా ప్రత్యేకమైన, స్పష్టమైన కారణమేదీ లేకుండానే బరువుతగ్గిపోతున్నారంటే ముందుగా టైప్‌-2 రకం మధుమేహం వచ్చిందేమో పరీక్ష చేయించుకోవటం అవసరం. చాలామంది మధుమేహమంటే- అతి ఆకలి, అతి మూత్రం వంటి లక్షణాలుంటాయని భావిస్తుంటారు. కానీ వాటన్నింటికంటే కూడా ముందే బరువు తగ్గిపోవటం మొదలవ్వచ్చు.

కొందరు వయసు పెరిగిన కొద్దీ చర్మం ముడతలు పడి, ముసలి రూపులోకి వస్తారుగానీ బరువు చూస్తే బాగానే ఉంటారు. చుట్టుపక్కలవారు ప్రేమతో 'అరెరె ఏంటిలా చిక్కిపోయారు' అని అడుగుతుంటారు. కానీ వాస్తవానికి వాళ్లు బరువు తగ్గరు.

ఒత్తిడి
వృత్తిపరంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించే వారు బరువు తగ్గిపోతారు. ఇదే కాదు, క్యాన్సర్‌, గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధుల బారినపడినప్పుడు కూడా మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. వీరిలో ఎఫినెఫ్రిన్‌, నార్‌ఎఫినెఫ్రిన్‌ వంటి రసాయనాలు విడుదల అవుతూ వీటి ప్రభావం కారణంగా శరీరంలోని కణజాలం, కండరాలు క్షీణిస్తుంటాయి. దీనివల్ల బరువు తగ్గిపోతుంటారు. మానసిక ఒత్తిడి వల్ల ఆహారపుటలవాట్లు, నిద్ర, మొత్తం జీవన విధానమే అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆకలి, జీర్ణవ్యవస్థ వంటివన్నీ తీవ్రంగా ప్రభావితమై వేగంగా బరువు తగ్గటం, తీవ్రమైన అలసట వంటివి ముంచుకొస్తాయి. ఆధునిక కాలంలో 'బరువు పెరగటం'తో పాటు ఇది కూడా పెద్ద సమస్యగా పరిణమిస్తోంది.

హైపర్‌ థైరాయిడిజం
థైరాయిడ్‌ హార్మోన్లు మన శారీరక, జీవక్రియలకు చురుకుదనాన్నిచ్చే హార్మోన్లు. ఒంట్లో ఈ హార్మోన్లు ఎక్కువైతే.. ఆకలి పెరుగుతుంది, జీవక్రియల వేగం పెరిగిపోతుంది. కేలరీల ఖర్చు పెరిగిపోయి.. కణజాలంలో శక్తి ఎక్కువగా ఖర్చైపోతుంటుంది. వీళ్లు ఆహారం ఎక్కువెక్కువే తింటుంటారు, అన్నం, పిండిపదార్థాలు, స్వీట్ల వంటివి అధికంగా తీసుకుంటూ ఉంటారు. అయినా బరువు తగ్గిపోతుంటారు! కాబట్టి ఇటువంటి లక్షణాలతో బరువు తగ్గుతుంటే తప్పనిసరిగా థైరాయిడ్‌ను అనుమానించాలి. మన దేశంలో ప్రజలు బరువు తగ్గిపోతుండటానికి ఇది రెండో అతి ముఖ్య కారణం.

పేగుల్లో సమస్యలు
చాలారకాల జీర్ణసమస్యలు, పేగుల వ్యాధుల్లో బరువు తగ్గిపోవటమన్నది కనబడుతుంది. ఆకలి తగ్గిపోవటం, తిన్నది జీర్ణం కాకపోవటం, పేగుల్లో సమస్యల వల్ల పోషకాహార లోపం తలెత్తటం.. ఇవన్నీ బరువు తగ్గిపోయేందుకు కారణమవుతాయి. పేగుల్లో పుండ్లు-అల్సర్లు, పేగు పూత, వాపు, స్ప్రూ, అల్సర్లు మానిపోతూ పేగులు అతుక్కోవటం.. ఇలా పలురకాల పేగు సమస్యల్లో బరువు తగ్గిపోతుంటారు.


క్షయ
మన దేశంలో గ్రామీణ ప్రజలు బరువు తగ్గిపోతుండటానికి ముఖ్యమైన కారణం క్షయ. ఈ ఇన్ఫెక్షన్‌ సోకితే చాలామందిలో సాయంత్రానికల్లా కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలుంటాయి, కానీ కొందరిలో జ్వరం కూడా ఉండకపోవచ్చు. పైకి ఏ లక్షణాలూ కనబడవు, అయినా బరువు తగ్గిపోతుంటారు. క్షయ అంటే దగ్గు, కళ్లెపడటం వంటివీ ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే క్షయ ఛాతీలోనే కాదు... చర్మం, పేగులు, ఎముకలు.. ఇలా శరీరంలోని ఏ అవయవానికైనా రావచ్చు. కాబట్టి బరువు తగ్గుతుంటే క్షయనూ అనుమానించాలి.

క్యాన్సర్లు
ఇతరత్రా ఎటువంటి లక్షణాలూ లేకుండా కేవలం బరువు తగ్గటం ఒక్కటే ఉందంటే క్యాన్సర్‌ అని అనుమానించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్లయితే సాధారణంగా జ్వరం వంటి ఏదో ఒక లక్షణాలుంటాయి. అలాగే జీర్ణ సమస్యలైతే వాంతుల వంటివి ఉండొచ్చు. ఇటువంటి లక్షణాలేమీ లేకుండానే రోగి బరువు తగ్గుతున్నారంటే ఎక్కడో క్యాన్సర్‌ ఛాయలేమైనా (అకల్ట్‌ మాలిగ్నన్సీ) ఉన్నాయా? అన్నది అనుమానించాలి.
బరువు తగ్గుతుంటే...
* ఉద్యోగపరమైన ఇబ్బందులున్నాయా? (ఒత్తిడి)
* సాయంత్రం జ్వరం వస్తోందా? (క్షయ)
* ఎప్పుడుబడితే అప్పుడు జ్వరం వస్తోందా? (లింఫోమాలు)
* ఆకలి ఎక్కువుందా? (మధుమేహం, థైరాయిడ్‌)
* ఆకలి తక్కువుందా? (జీర్ణసమస్యలు, మానసిక సమస్యలు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్‌)
* బీపీ ఎక్కువుందా? (కిడ్నీ సమస్యలు)
* కామెర్లు ఉన్నాయా? (లివర్‌ సమస్యలు)
* కాళ్ల వాపులు ఉన్నాయా? (ఎనీమియా, కిడ్నీ సమస్యలు)..
........వైద్యులు ఇలా ఎన్నో అంశాలను తరచి చూసి సంబంధిత పరీక్షలు చేయిస్తారు.

పురుగులు
పిల్లలు ప్రత్యేకమైన లక్షణాలేవీ లేకుండా బరువు తగ్గుతున్నా, సరిగా బరువు పెరగకున్నా.. పేగుల్లో నులిపురుగు, నట్టల వంటివేమైనా ఉన్నాయేమో చూడాలి. గ్రామీణ ప్రాంత పిల్లల్లో ఈ సమస్య చాలా ఎక్కువ. వీటివల్ల వేగంగా బరువు తగ్గుతుంటారు.

డిప్రెషన్‌
డిప్రెషన్‌తో బాధపడే వారికి ఆకలి, సరైన ఆహారం లేకపోవటం వల్ల బరువు తగ్గిపోతుంటారు. ముఖ్యంగా సరైన శ్రద్ధ, ఆప్యాయత కరవై డిప్రెషన్‌కు లోనయ్యే వృద్ధులు, వాళ్లు వాడే రకరకాల మందులు, దంతసమస్యల వంటివన్నీ బరువు తగ్గటానికి కారణాలవుతాయి.

హెచ్‌ఐవీ
హెచ్‌ఐవీ సోకినప్పుడు వేగంగా బరువు తగ్గిపోయే అవకాశాలుంటాయి. బరువు తగ్గటం, శరీరం శుష్కించటం దీనిలో ఎక్కువగా కనబడతాయి.

క్లోమం
మద్యం, వంశపారంపర్యం, కొలెస్ట్రాల్‌ ఎక్కువుండటం వంటికారణాల వల్ల క్లోమగ్రంథి ప్రభావితమై దీర్ఘకాలిక పాంక్రియాటైటిస్‌ రావచ్చు. దానివల్ల బరువు తగ్గుతారు.

లివర్‌
కాలేయం 'సిరోసిస్‌' బారినపడినపుడు కూడా ఆకలి తగ్గిపోయి అన్నం సరిగా జీర్ణం కాక.. బరువు తగ్గుతారు.

అనొరెక్సియా
'జీరో సైజ్‌' పట్ల కాంక్ష, సన్నగా ఉండాలన్న విపరీతమైన ధ్యాస, అనరెక్సియో నెర్వోసా, బులీమియా వంటి మానసిక సమస్యల్లో విపరీతంగాబరువు తగ్గిపోతారు.

ఇంకా
కిడ్నీ వ్యాధుల్లో, పిట్యూటరీ గ్రంథి సమస్యల్లో, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లలో, గుండె చుట్టూ ఉండే పొరకు ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు కూడా బరువు తగ్గొచ్చు.

పరీక్షలు
రక్తం, మూత్రం పరీక్షలు చేయిస్తే ప్రాథమికమైన విషయాలు తెలుస్తాయి. మూత్రంలో ప్రోటీన్లు పోతున్నాయా? గ్లూకోజు పోతోందా? రక్తంలో ఈఎస్‌ఆర్‌ ఎక్కువుందా? ఒంట్లో ఇన్ఫెక్షన్లు ఉన్నాయా? కిడ్నీ పనితీరు పరీక్షలు, థైరాయిడ్‌ పరీక్షలు.. అవసరాన్ని బట్టి మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి.

-డా. ఎం.వి.రావు-కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌, యశోదా హాస్పిటల్స్‌,హైదరాబాద్‌(courtesy Eenadu sukheebhava)


  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, October 3, 2010

సంగీతము -ఆరోగ్యము , Music Therapy and health




శరీరం నలతగా ఉంటే ఒక మాత్ర, మనసు కలత గా ఉంటే ఒక మాత్ర ఇదీ ఆధునికుల వరుస. చివరికి శరీరం ఒక మందుల బీరువా అవుతోంది. నిజానికి ఇవేవీ లేకుండానే శరీరాన్నీ, మనసునూ ఆరోగ్యంగా ఉంచే మార్గాలు కూడా ఉన్నాయి.

వాటిలో సంగీతం వినడం అత్యంత ప్రధానమైనది. సంగీతం ఆరోగ్యాన్నీ, గొప్ప జీవచైతన్యాన్నీ ప్రసాదిస్తుంది. అందుకే సమయం లేదంటూ దాటేయకుండా రోజూ కాసేపు సంగీతం వినడానికి వెచ్చించమంటున్నారు నిపుణులు.

జీవన ప్రవాహంలో ప్రతి హృదయం ఎంతో కొంత అలజడికి లోనవుతూనే ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సమస్యల గురించి విశ్లేషణలకు దిగితే అన్నీ అయోమయపు సమాధానాలే వస్తాయి. అసలే అలజడి మనసు. ఆ స్థితిలో వచ్చే విశ్లేషణలు సాలోచనగా ఎలా ఉంటాయి? అందుకు మనసును ముందుగా అలజడి కి అతీతంగా ఒక భావాతీత స్థితికి చేర్చాలి. అప్పుడే మనసు కాస్త కుదుటపడుతుంది. కుదురైన ఆలోచనలు చేస్తుంది. మనసును ఆ భావాతీత స్థితికి చేర్చడానికి సంగీతాన్ని వినడానికి మించిన మార్గం లేదు.

ధ్యానం వల్ల కూడా ఈ స్థితి సాధ్యం కావచ్చు. కానీ, ధ్యానానికి కొంత సాధన కావాలి. అలాంటి సాధన కానీ, మరో ప్రయత్నం కానీ లేకుండానే మనసు ఉన్నఫళాన ధ్యాన స్థితికి చేరడం అన్నది సంగీతం వల్లే సాధ్యమవుతుంది. అది పాడటం కావచ్చు. వినడం కావచ్చు. పాడే వారూ, వినే వారూ ఏకకాలంలో ఒక ధ్యానస్థితికి చేరడం అన్నది సంగీతంతో సాధ్యమవుతుంది.

దైనందిన జీవితపు ఆందోళనల నుంచి ఒక అలౌకిక అనందంలోకి తీసుకు వెళ్లే గొప్ప ఔషధమే సంగీతంలోని విశిష్టత. తాము ఆ ధ్యాన స్థితికి ఎలా చేరుకుంటున్నామనే విషయం తెలియకుండానే ఆ స్థితి వచ్చేస్తుంది. దాంతో మనసును ఎప్పటినుంచో నులిమేస్తున్న ప్రతికూల భావాలన్నీ ఇగిరిపోతాయి.గుండె ను పిండేస్తున్న భావ కాలుష్యాలన్నీ పక్కకు జారిపోతాయి. అప్పుడు సహజంగానే ఒక నిశ్చలమైన మానసిక స్థితి ఏర్పడుతుంది. ఆ తరువాత మన సులో ఒక రసాయన సమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా అప్పటి వరకూ లేని ఒక సౌమ్యత, సరళత వారి అంతరంగంలో చోటుచేసుకుంటాయి. భావ వ్యక్తీకరణలో మునుపటి పరుషత్వమంతా పోయి అన్ని దశల్లోనూ మృదువుగామాట్లాడటం మొదలవుతుంది.


ఇవన్నీ పరిశీలించే కొంత మంది సంగీత నిపుణులు మ్యూజిక్ థెరపీని రూపొందించారు. మెదడులోని రసాయనాలను సమతుల్యంగా ఉంచడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. రసాయన ప్రక్రియ సమతుల్యంగా మారే కొద్దీ ప్రతికూల భావాలు అతి వేగంగా తగ్గుముఖం పడతాయి. అప్పుడు సచేతనమైన మెదడు ప్రభావం శరీరంపై పడుతుంది. అది శారీరక ఆరోగ్యానికీ దోహదం చేస్తుంది. నిజానికి శరీరానికీ మనసుకూ మధ్య పెద్ద అంతరం ఏమీ లేదు. అందుకే శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు మనసులో నైరాశ్యం, ఉదాసీనత, ఒక కల్లోలం చోటుచేసుకుంటాయి. కోపం వచ్చినప్పుడు గుండె వేగం పెరగడం, కళ్లు ఎర్రబారడం అందరికీ అనుభవమే. పరిశీలిస్తే ప్రతి శారీరక అవస్థ వెనుక ఒక మానసిక కారణం, ప్రతి మానసిక అవస్థ వెనుక ఒక శారీరక కారణం మనకు కనిపిస్తాయి. ఈ వాస్తవాలే మ్యూజిక్ థెరపీకి మూలస్థంభాలయ్యాయి. ఈ సూత్రీకరణ ఆధారంగానే భావోద్వేగాలకు సంబంధించిన సంగీతం, శారీరక రుగ్మతలను నయం చేసే దిశగా అడుగులు వేసింది.

మ్యూజిక్ థెరపీలో రాగానిదే ప్రథమ స్థానం. అయితే ఏ సాహిత్యమూ లేని వాధ్య సంగీతం మనసుకు ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. అంతే తప్ప మనసుకు ఏ దిశా నిర్దేశమూ చేయదు. పాటలో సాహిత్యం ఉంటుంది కాబట్టి అందులో సానుకూల భావాలు ఉంటే అవి ఆ భావాల ద్వారా, తాత్విక విశ్లేషణల ద్వారా మనసుకు ఒక మార్గం చూపిస్తుంది. అందుకే వాధ్య సంగీతం కన్నా పాటలనే శ్రోతలు ఎక్కువగా ఇష్టపడతారు.

వ్యక్తి మానసికంగా కుంగిపోయినప్పుడు అతడు తన సహజ చైతన్యాన్ని కోల్పోతాడు. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గిపోయి తరుచూ రోగగ్రస్తుడవుతూ ఉంటాడు. ఇక్కడ చేయవలసిందేమిటి? అత డు కోల్పోయిన చైతన్యాన్ని తిరిగి అందించడమే. సరిగ్గా ఆ బాధ్యతనే నిర్వహిస్తుంది మ్యూజిక్ థెరపీ. ఏకకాలంలో శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యవంతుణ్ని చేస్తుంది.
అయితే నిరంతరం మనసును శాంతింప చేసే రాగాలకో పాటలకో పరిమితమైనా ప్రమాదమే. ఎప్పుడూ అలాంటి పాటలకే పరిమితమైతే క్రమంగా అతడు అచేతనంగా మారి, దేని మీదా ఆసక్తి లేకుండా పోయి, చివరికి ఒక జీవచ్ఛవంలా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఉత్తేజాన్నీ, పౌరుషాన్నీ నింపే పాటలను కూడా వింటూ ఉండాలి.

ఉదయాన్నే సంగీతం వినడం గొప్ప థెరపీ. నిద్రలేవగానే సంగీతం వినడం వల్ల ఒక మంచి మూడ్ క్రియేట్ అవుతుంది. అది రోజంతా కొనసాగుతుంది. దైనందిన జీవితంలో అనుక్షణం చైతన్య వంతంగా ఉండడానికి ఇది దోహదం చేస్తుంది.
  • ============================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, October 2, 2010

ఆస్టియోపొరొసిస్ , Osteoporosis



పాత కణాలు అంతరించి కొత్త కణాలు అంకురించే ప్రక్రియ ఎముకల్లోనూ నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఏ కారణంగానైనా తరిగిపోతున్న పాత ఎముకకు సరిసమానంగా కొత్త ఎముక ఏర్పడకపోతే ఎముకలు పెళుసుబారిపోయే ఆస్టియో పొరోసిస్ వ్యాధి మొదలవుతుంది. వీరిలో అతి చిన్న దె బ్బకు లేదా చిన్న బెణుకుకే ఎముకలు విరిగిపోవచ్చు లేదా ఎముకలు పగుళ్లు బారవచ్చు. అందుకే శరీర అస్థిత్వాన్ని నిలబెట్టే అస్థిపంజరాన్ని జీవితమంతా నిలబెట్టుకోవడానికి ఎన్నెన్నో జాగ్రత్తలు అవసరమవుతాయి.

శరీరం నిలబడేదే ఎముకల మీద ఆ ఎముకలే బలహీనపడితే ఏమైపోవాలి ?
అదేదో అత్యంత సహజంగా తనకు తానే నిలబడిపోయే వ్యవస్థ అనుకుంటామే గానీ, అవసరమైన ఆహార, వ్యాయామాలు లేకపోతే ఎముకలన్నీ పెళుసుబారిపోతాయనే విషయం చాలా సార్లు మన దృష్టికి రాదు. ఎముకలు క్షీణించిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. వాటిలో వయసు పైబడిన కారణంగా ఎముకలు సన్నబడిపోవడం ఒక కారణం. ఇక స్త్రీలలో రుతుక్రమం ఆగిపోయి (మెనోపాజ్) ఈస్ట్రోజన్ తగ్గిపోయినప్పుడు లవణాల సాంద్రత తగ్గిపోవడం మరో కారణం.

నిజానికి ఆస్టియోపొరోసిస్ సమస్యలు చాలా ఎక్కువ మందిలోనే ఉన్నాయి. కానీ, వారిలో 50 శాతం మంది కూడా ఈ పరీక్షలకు వెళ్లడం లేదు. ఆస్టియో పొరోసిస్ వ్యాధి వృద్ధాప్యం కారణంగా వచ్చే సమస్య కాబట్టి దీన్ని నివారించడం పూర్తిగా అసాధ్యమన్న భావనే చాలా మందిలో ఉంది. అలాగే రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలే ఈ సమస్యకు గురవుతారన్న భావన కూడా బలంగానే ఉంది.

నిజానికి స్త్రీ పురుషులు ఇరువురూ దాదాపు అన్ని వయసుల్లోనూ ఈ సమస్యలకు గురవుతారు. ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం భారతదేశంలో మూడు కోట్ల మంది స్త్రీలు, రెండు కోట్ల మంది పురుషులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

ఎలా తెలుస్తుంది ?
ఆస్టియో పొరోసిన్ వ్యాధి లక్షణాలు ప్రారంభంలో ఏమీ కనిపించవు. కానీ ఎముకలు లోలోపల క్షీణిస్తూనే ఉంటాయి. ఎప్పుడో సమస్య మరీ తీవ్రమై ఎముకలు విరిగిపోయినప్పుడు గానీ, ఆ విషయం స్పురణకు రాదు. ఇంటర్నేషనల్ ఆస్టియోపొరోసిన్ ఫౌండేషన్ (ఐఓఎఫ్) వారి అధ్యయనంలో 45 ఏళ్లు దాటిన ప్రతి ఇద్దరు స్త్రీలలోనూ ఒకరు ఈ వ్యాధితో ఉన్నారని తేలింది. .

ఎందుకిలా ?
శరీర శ్రమ లేకపోవడం, అతిగా మద్యపానం చేయడం, పొగతాగడం వంటివి ఆస్టియోపొరోసిస్ రావడానికి గల కారణాల్లో కొన్ని. ఇవే కాకుండా నూనె, మసాలాలు విరివిగా వాడే ఆహార పదార్థాలు, దీర్ఘకాలికంగా మందులు వాడటం, రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పుల కారణంగా చాలా రోజులుగా స్టెరాయిడ్లు వాడుతూ ఉండడం, మూర్ఛరోగం మందులు కూడా ఇందుకు కారణమవుతాయి.

కొందరిలో మూత్రపిండాల వ్యా«ధులు కూడా ఈ సమస్యలను కలిగించవచ్చు. ఈ వ్యాధి పీడితుల ఎముకలు విరిగిపోవడానికి ఎంతో ఎత్తునుంచి పడిపోవలసిన అవసరం లేదు. మామూలుగా నడిచి వెళుతున్న సమయంలో కూడా విరిగిపోవ చ్చు.

క్యాల్షియం అవసరాలు
విదేశీయులతో పోలిస్తే ఆస్టియోపొరోసిస్ వ్యాధికి గురయ్యే వారిలో భారతీయులే ఎక్కువ. వీరికి క్యాల్షియం, డి- విటమిన్ చాలా తక్కువగా అందడమే కారణం. నిజానికి సగటున ప్రతి మనిషికీ రోజుకు 1200 నుంచి 1500 మి. గ్రాముల క్యాల్షియం అందవలసి ఉంటుంది.గుండె కండరాలు, నరాలు సరిగా పనిచేయడానికి కూడా క్యాల్షియం అవసరం.

వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఉండడానికి చక్కగా నడవడానికి కూడా క్యాల్షియం తప్పనిసరి. అందుకు పాలు లేదా పాల ఉత్పత్తులు రోజూ తీసుకోవాలి. అలాగే ఆకుకూరలు, చేపలు, వేరుశనిగలు, రాగులు అలాగే లవణాలు ఇచ్చే ఇతర పదార్థాలు కూడా తరుచూ తీసుకోవాలి.
అవసరమైతే క్యాల్షియం మాత్రలు తీసుకోవాలి. క్యాల్షియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం ఉండే పళ్లు కూరగాయలు కూడా బాగా తీసుకోవాలి.

విటమిన్-డి
ఎముకల నిర్మాణంలో క్యాల్షియం గురించిన ప్రస్తావనే ఎక్కువగా ఉంటుంది. కానీ, చాలా మంది డి-విటమిన్ విషయాన్ని మరిచిపోతారు. నిజానికి ఆస్టియోపొరోసిస్ సమస్యను నివారించడంలో డి-విటమిన్ ఎంతో కీలక పాత్రను పోషిస్తుంది. ఉదయం వేళ నీరెండ పడుతున్న సమయంలో రోజూ 90 నిమిషాల పాటు గడిపితే శరీరానికి అవసరమైన డి-విటమిన్ లభిస్తుంది.

ఆస్టియోపొరొసిస్‌ - మందులు


ఆస్టియోపొరొసిస్‌ నివారణలో మందులు కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇవి మూడు రకాలు. ఆస్టియోబ్లాస్టిక్‌ క్రియను పెంచే మందులు, ఆస్టియోక్లాస్టిక్‌ క్రియను తగ్గించే మందులు, మహిళల్లో వాడే ప్రత్యేక మందులు.

ప్రో ఆస్టియోబ్లాస్టిక్‌ మందులు : ఈ మందులు ఎముకల్లోని కొత్త కాల్షియాన్ని ఇతర మూలకాలను పెంచుతాయి.

కాల్షియం మూల మందులు : మార్కెట్‌లో రకరకాల రూపాలలో కాల్షియం లభ్యమవుతున్నది. కాల్షియం ఫాస్పేట్‌, కాల్షియం కార్బొనేట్‌, కాల్షియం సిట్రేట్‌, కాల్షియం సిట్రేట్‌ మాలేట్‌, కాల్షియం ఫ్రక్టోబొరేట్‌, కాల్షియం ఆస్పర్టేట్‌, అయానిక్‌ కాల్షియం, ట్రైబేసిక్‌ కాల్షియం, ఛీలేటెడ్‌ కాల్షియం వంటి అనేక రకాలు వివిధ లోహధాతువులతో (జింక్‌, మెగ్నీషియం, బోరాన్‌, మాలిబ్డినం, స్ట్రాన్షియం, ఫాస్సరస్‌) కలగలిసి విటమిన్‌-డి సహితంగా లభిస్తాయి. సాధారణంగా ఇవి సిరప్స్‌ రూపంలోనూ, టాబ్లెట్‌ రూపంలోను, సాఫ్ట్‌జెల్‌ క్యాప్సుల్స్‌ రూపంలోనూ లభిస్తాయి. వ్యాపార ప్రకటనలకు లోబడకుండా ప్రతీ వ్యక్తి కాల్షియం మందులు వాడడంలో ఈ జాగ్రత్తలు వహించాలి. అవి...
కాల్షియం, విటమిన్‌ డి3 కలిసి ఉన్నప్పుడు కనీస నిష్పత్తి 5:4 ఉండాలి. ఉదాహరణకు 500 మిల్లీగ్రాములు+విటమిన్‌-డి3 500 ఐయు కాల్షియం విటమిన్‌-డి4తో కలిసి ఉన్నప్పుడు విటమిన్‌-డి4 ఆల్ఫా కాల్సిడాల్‌ లేక కాల్సిట్రాల్‌ వంటి ఏ రూపంలో ఉన్నప్పటికీ కనీసం 0.25 మైక్రోగ్రాముల నుండి 1.0 మైక్రోగ్రాముల వరకు ఉండాలి. ఈ మోతాదులో విటమిన్‌-డి లేకుంటే కాల్షియం ఆ మందుల నుండి చాలా తక్కువ శాతం మాత్రమే ఎముక కణజాలం నుంచి గ్రహించగలుగుతుంది. ఎముకల బల సాంధ్రతలోని 'టి' స్కోరు -4 కన్నా తక్కువగా ఉన్న వ్యక్తుల్లో విటమిన్‌-డి4 కలిసిన కాల్షియం మాత్రమే దీర్ఘకాలం అంటే ఒకటి, రెండు ఏళ్లు కూడా వాడాలి. వీలైనంత వరకు కాల్షియం మాత్రలు రోజుకు కనీసం రెండు ఆహారానికి ముందుగానే తీసుకోవాలి.

విటమిన్‌ కె 2-7 : కొత్తగా లభ్యమవుతున్న ఈ మూలకం ఎముకల బలాన్ని పెంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది.

అనబాలిక్‌ స్టిరాయిడ్స్‌ : నాండ్రోలిన్‌ ప్రోపియోనేట్‌ అనే ఇంజక్షన్‌ 25 లేక 50 మిల్లీగ్రాములు వారానికి ఒకసారి, నాండ్రోలిన్‌ డెకోనేట్‌ అనే ఇంజక్షన్‌ 25 నుంచి 100 మిల్లీగ్రాముల వరకు నెలకోసారి వాడాలి. దీని వల్ల కాల్షియంతోపాటు ఎముకకు అవసరమైన ప్రోటీను పదార్థాలు బాగా పెరుగుతాయి.

ఆయుర్వేదిక్‌ మందులు : సల్లాకీ, వితానియా సోమ్నిఫెరా, అశ్వగంధ, వైట్‌ కొరియన్‌ జిన్సెంగ్‌, సెట్రం డయార్నం వంటి మందులు కూడా ఎముకల బలాన్ని పెంపొందిస్తాయి.

అతితీవ్ర ఆస్టియోపొరిసిస్‌ను ఆస్టియోమలేసియా అంటాం. ఈ వ్యాధికి విటమిన్‌-డి 3 - 50000 యూనిట్ల వరకు, విటమిన్‌-డి4- 50 మైక్రోగ్రాముల వరకు కూడా రోజువారీ క్రమంలో కాల్షియంతో పాటు వాడాలి.

ఆస్టియో క్లాస్టోసిస్‌ తగ్గించే మందులు : అధికంగా ఎముక నుండి కాల్షియం, విటమిన్‌-డి, ఇతర లోహ ధాతువులు బయల్పడకుండా ఆపడానికి, తద్వారా ఆస్టియోబ్లాస్టోసిస్‌ సక్రమంగా జరిగి ఎముకలు బలపడడానికి ఈ మందులు తోడ్పడతాయి. ఆస్టియోపొరొసిస్‌, ఆస్టియోమలేసియాలో రెండు రకాల మందులు కలిపి తప్పకుండా వాడాలి.

బిస్‌ఫాస్ఫోనేట్స్‌ మందులు ఐదు రకాలు

అలాండ్రోనేట్‌ : ఈ మాత్ర 70 మిల్లీగ్రాముల డోసులో వారానికి ఒక రోజు, ఒక మాత్ర ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపున తీసుకోవాలి. తర్వాత అరగంట వరకు పడుకోకుండా, కూర్చొకుండా తిరుగుతూ ఉండాలి. దీనివల్ల మాత్ర పూర్తిగా జీర్ణప్రకియలో గ్రహింపబడి విధి నిర్వహిస్తుంది. ఈ విధంగా 12 నుండి 16 వారాలు వాడాలి.

ఎటిడ్రోనేట్‌ : ఈ మాత్రలు రోజుకు రెండు చొప్పున కనీసం 3 నుండి 6 నెలలు వాడాలి.

రైసిడ్రోనేట్‌ : ఈ మాత్ర 35 మిల్లీగ్రాముల డోసులో వారానికి ఒకసారి వాడాలి. అలాండ్రోనేట్‌లా కాక దీన్ని ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. దీని దుష్ఫ్రభావాలు కూడా తక్కువ

ఇబాండ్రోనేట్‌ : ఈ మాత్ర 35 మిల్లీగ్రాముల డోసులో నెలకోసారి చొప్పున ఆరు నెలల నుంచి 12 నెలల వరకు వాడొచ్చు. మాత్రల రూపంలో దొరికే ఈ విభాగం మందుల్లో ఇది అత్యంత ప్రతిభావంతమైంది.

జోలెడ్రోనిక్‌ ఆసిడ్‌ : అత్యంత కొత్తది ఈ ఔషధం. ఇంజక్షన్‌ రూపంలో లభిస్తుంది. దీన్ని 100 మిల్లీగ్రాములు, నార్మల్‌ సెలైన్‌లో కలిపి నిమిషానికి 30 చుక్కల చొప్పున ఐవి రూట్‌ ద్వారా ఇవ్వాలి. సాధారణ ఆస్టియోపొరొసిస్‌ కేసులలో ఏడాదికి ఒక డోసు చొప్పున ఇవ్వాలి.

పారాథైరాయిడ్‌ గ్రంథిలోపం వల్ల ఏర్పడే అధిక ఆస్టియోక్లాస్టోసిస్‌ను నిరోధించడానికి ఒక ప్రత్యేకమైన మందు లభిస్తుంది.

సాల్మన్‌ కాల్సిటోనిన్‌ : ఇది ఇంజక్షన్‌, నేసల్‌ స్ప్రేరూపంలో లభిస్తుంది. ఈ మందును టెస్ట్‌డోస్‌ నిర్వహించి మాత్రమే వాడాలి.

మెనోపాజల్‌-ఆస్టియోపొరొసిస్‌

మెనోపాజ్‌ దశలో మహిళల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోను తగ్గిపోతుందని తెలుసుకున్నాం. ఈస్ట్రోజెన్‌ పునరుద్ధరించడానికి కొన్ని ప్రత్యేక మందులు లభిస్తున్నాయి. వీటిన్‌ సెర్మ్‌ ఏజెంట్స్‌ (స్పెసిఫైడ్‌ ఈస్ట్రోజెన్‌ రిసెప్టార్‌ మాడిఫయింగ్‌ ఏజెంట్స్‌) అంటారు. ఇవి రెండు రకాలు.

రాలోక్సిఫేన్‌ : రోజుకు 60 మిల్లీగ్రాముల చొప్పున ఆరు నెలల నుండి 12 నెలల వరకు ఇతర మందులతో కలిపి వాడాలి.

టిబోలోన్‌ : ఈ మందును కూడా ఇది విధంగా వాడాలి. అదనంగా స్త్రీలలో అదే సమయంలో ఏర్పడే తలనొప్పి, మానసిక ఆందోళన శరీర అధిక ఉష్ణోగ్రతకు కూడా తగిన మందులు.

ఐసోఫ్లేవాస్‌ : ఐసోఫ్లేవనాయిడ్స్‌ అనే ఈ పదార్థాలు సోయ, ఇతర పదార్థాల నుండి లభిస్తాయి. ప్రత్యేక అమైనో ఆమ్లాలు కలిగి మహిళల్లో మెనోపాజ్‌ దశలో ఎముకలు, ఇతర కణజాలాన్ని కూడా వృద్ధి చేస్తుంది. పైన పేర్కొన్న ఇతర మందులతోపాటు రోజుకు 60 మిల్లీగ్రాముల చొప్పున దీర్ఘకాలం వాడాలి.

శస్త్ర చికిత్సలు

ఆస్టియోపొరొసిస్‌లో ప్రత్యేక శస్త్ర చికిత్సలుండవు. కానీ పారాథైరాయిడ్‌ గ్రంథి కణతుల ద్వారా ఏర్పడే అధిక ఆస్టియోక్లాస్టోసిస్‌ నిరోధించడానికి ఈ వినాళగ్రంథిని 90 శాతం వరకు తొలగిస్తారు. ఆస్టియోపొరొసిస్‌ ద్వారా ఏర్పడే ఫ్రాక్చర్స్‌గానీ, ఆస్టియో ఆర్థ్రయిటీస్‌గానీ అవసరమైన చోట శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారు.

- డాక్టర్‌ జె. భాను కిరణ్‌-ఆర్థొపెడిక్‌ సర్జన్,‌-డాక్టర్‌ వెంకట రామప్ప హాస్పిటల్‌,సత్యసాయి మహిళాకళాశాల ఎదురుగ,బెంగళూరురోడ్డు, అనంతపురం.,

  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/