Saturday, August 31, 2013

Inrertility as a problem,సమస్యగా...సంతానలేమి

  •  


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


- డాక్టర్‌ వందన హెగ్డే,-M.S., (OBG)F.R.M., (infertility)-స్పెషలిస్టు ఇన్‌ రిప్రొడక్టివ్‌మెడిసిన్‌, అబ్‌స్ట్రెట్రిషియన్‌ - గైనకాలజిస్టు, క్లినికల్‌డైరక్టర్‌, హెగ్డే హాస్పిటల్సు67/68, విఠల్‌రావు నగర్‌, మాధాపూర్‌-హైదరాబాద్‌ - 81 drvandanag@hotmail.com

ప్రస్తుత కాలంలో సంతాన లేమి అన్నది ఒక సమస్య గా మారుతోంది. గత కాలంతో పోలిస్తే ఇప్పటితరంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వైద్య శాస్త్రం చాలా ప్రగతి సాధించినప్పటికీ అనేక మంది దంపతులు అవగాహన లేమితో ఈ సమస్యతో బాధపడుతున్నారు. సరైన సమయంలో సరైన వైద్య సహాయం తీసుకొంటే ఈ సమస్య నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది..

వివాహం అనేది ఒక ధర్మ ప్రక్రియగా భారతీయులు భావిస్తారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవటం, సంతానాన్ని కనటం విద్యుక్త ధర్మములుగా చెబుతారు. ఇందులో మొదటిది మన చేతిలో ఉన్నప్పటికీ, రెండోది మాత్రం ఒక్కోసారి మనుషుల పరిధిలో ఉండకుండా పోతుంది. పైగా సంతానం లేకపోతే వంశం నిలిచిపోతుందన్న మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. అందుచేత భారతీయ సమాజంలో సంతానాన్ని కనటం, పిల్లల్ని వ్రద్ది లోకి తీసుకొని రావటాన్ని తప్పనిసరి ప్రక్రియగా భావిస్తారు. ఆధునిక కాలంలో రక రకాల కారణాలతో సంతాన లేమి అన్నది సమస్యగా మారింది. పెళ్లి అయ్యాక రెండు ఏళ్ల పాటు కలిసి కట్టుగా కాపురం చేసినా గర్భం దాల్చక పోవటాన్ని సంతాన లేమిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి.

యుక్త వయస్సులో ఉన్న దంపతుల్లో మూడు, నాలుగు సంవత్సరాల పాటు వేచి ఉండే ధోరణిని కూడా మనం గమనిస్తాం. అయినప్పటికీ కూడా గర్భం దాల్చకపోతే మాత్రం సంతానలేమి అన్న అనుమానం కలగక మానదు. అందుచేత ఈ సమస్యలకు దారితీస్తున్న పరిస్థితుల గురించి మ న సమాజంలో అవగాహన అవసరం.సంతానం కలగక పోవటానికి సాధారణంగా దంపతుల్లో ఎవరో ఒకరిలో ఇబ్బంది ఉండటాన్ని కారణంగా చెబుతారు. సాధారణంగా మూడో వంతు దంపతుల్లో మహిళల్లో లోపం ఉంటే, మరో మూడో వంతు జంటల్లో పురుషుల్లో సమస్య ఉంటుంది. మరో మూడో వంతు మందిలో మాత్రం ఇద్దరిలో సమస్య ఉండటం కానీ, ఊహించని పరిణామం చోటు చేసుకోవటం కానీ సమస్యకు దారితీస్తుంది. అటువంటప్పుడు సమస్య ఎవరిలో ఉందో ముందుగా గుర్తించాలి. ఆ తర్వాత ఆయా వ్యక్తుల్లో సమస్యను సరిదిద్దుకొని సంతానాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది.

నిర్దిష్టంగా ఒక కారణంతో సంతాన లేమి ఏర్పడుతుందని చెప్పటం కష్టం. కొన్ని అంశాలు ఈ సమస్యకు దారి తీసే అవకాశం ఉంది. అంత మాత్రాన ఈ అంశాల కారణంగా పిల్లలు పుట్టరని తెగేసి చెప్పటం కూడా సరి కాదు. వివాహం అయిన తర్వాత క్రమం తప్పకుండా కాపురం చేసే జంటల్లో తొందరలోనే గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. చాలా మందిలో ఒక నెల నుంచి ఆరు నెలల కాలంలో ఫలితం వస్తుంటుంది. మరి కొందరిలో ఇందుకు సంవత్సరం నుంచి రెండేళ్ల కాలం పట్టవచ్చు. రెండు సంవత్సరాలు దాటినప్పటికీ గర్భం దాల్చకపోతే మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.సాధారణంగా గర్భం దాల్చటానికి వయస్సు అనే దాన్ని ముందుగా గుర్తుచుకోవాలి. ముఖ్యంగా భారత్‌వంటి ఉష్ణ మండల దేశాల్లో 15,16 సంవత్సరాలకే యుక్త వయస్సు మొదలై పోతుంది. అంటే అప్పటి నుంచే సంతాన ఉత్పత్తికి తగినట్లుగా శరీరం లో సన్నాహాలు జరిగిపోతాయి.

అప్పటి నుంచి 20 సంవత్సరాల నాటికి అన్ని అవయవాలు పూర్తిగా విస్తరించు కోవటం జరుగుతుంది. అప్పటి నుంచి 30 ఏళ్ల వయస్సు వరకు సమ్రద్దిగా ఉండే వయస్సు అనుకోవచ్చు. అంటే ఈ పదేళ్ల కాలం వివాహానికి, సంతానాన్ని దాల్చేందుకు చక్కటి సమయం అనుకోవచ్చు. మహిళల్లో 32-35 సంవత్సరాలు దాటిన నాటి నుంచి ఫెర్టిలిటీ రేటు తగ్గుతూ వస్తుంది. పురుషుల్లో మాత్రం ఇందుకు తగిన వయస్సు 40 ఏళ్ల దాకా చెబుతారు. 40 దాటాక ఈ సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. ఆలస్యంగా వివాహం చేసుకొనే వారిలో ఈ సమస్య ఏర్పడటానికి ఇదే కారణంగా చెప్పుకోవచ్చు.పొగతాగటం, మద్యం తాగటం వంటి దురలవాట్లు కూడా దీన్ని ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఈ అలవాట్లు సాధారణంగా భారత్‌ వంటి సాంప్రదాయిక దేశాల్లో పురుషుల్లో ఎక్కువగా చూస్తు ఉంటాం. అందుచేత పురుషుల్లో సంతాన ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవటంలో ఈ అంశాల్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

ఎక్కువ బరువు ఉండటం లేదా స్థూలకాయం ఉండటాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. ఆధునిక కాలంలో సీటుకు అతుక్కొని పనిచేయాల్సిన ఉద్యోగాలు ఎక్కువ గా ఉంటున్నాయి. దీంతో శారీరక వ్యాయామం బాగా తగ్గిపోతోంది. శరీర భాగాలకు ఏ మాత్రం అలసట లేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో శరీరంలో కొవ్వులు పేరుకొని పోయి అధిక బరువుకి లేదా స్థూలకాయానికి దారితీస్తోంది. ఏమాత్రం వ్యాయామం లేని జీవితం గడపటం ఎంతటి సమస్యో, విపరీతంగా వ్యాయామం చేసే వారిలో లేదా విపరీతంగా కాయకష్టం చేసే వారిలో కూడా సమస్యలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.
శారీరక అంశాలు ఎంత ముఖ్యమో, మానసిక పరిస్థితి కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఎక్కువ ఆందోళన చెందేవారు, టెన్షన్‌ తో కూడిన పనులు చేసే వారు, అధికంగా ఒత్తిడిని
ఎదుర్కొనే వారిలో ఈ సమస్యను గుర్తించవచ్చు. దీంతో పాటు పిల్లలు పుట్టకపోతే ఆ దిగులు ను చాలా మంది మనసులో పెట్టేసుకొంటారు.

దీంతో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఆందోళనతో కాపురం చేసే వారిలో సరైన కలయిక సాధ్యం కాదు. దీంతో సంతాన లేమి అనేది మరింత పెద్ద సమస్యగా దాపురిస్తుంది.
సంతాన లేమి అనేది ప్రధాన మైన సమస్య అనటంలో సందేహం లేదు. అంతమాత్రాన జీవితం నిస్సారం అయిపోయిందని మాత్రం భావించకూడదు. ఆధునిక కాలంలో ఈ సంతాన లేమికి అనేక రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించుకొని సంతానాన్ని పొందేందుకు అవకాశం ఉంది. అంతేకానీ, అదే పనిగా ఆందోళనను మనస్సులో పెట్టుకొని చికిత్సకు హాజరైనప్పటికీ ఏమాత్రం ప్రయోజనం ఉండదని గుర్తించు కోవాలి. ముఖ్యంగా భార్యా భర్తలు ఇద్దరు ప్రశాంతంగా వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవటం ముఖ్యం. లోపం ఎవరిలో ఉన్నా, ఇద్దరు పరస్పర సహకారంతో మెలిగినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి.

సంతాన లేమితో బాధ పడుతున్న దంపతుల్లో చాలా మంది నిరాశ కు లోనవుతుంటారు. దీంతో చికిత్స చేయించుకొంటున్నా ఒక్కో సారి వెంటనే ఫలితం దక్కక పోవచ్చు. ఈ లోగా ఎవరో సలహా చెప్పారని చెప్పి, చికిత్సను వదిలిపెట్టి నాటువైద్యాల్ని, మొక్కుబడుల్ని ఆశ్రయిస్తారు. కొన్నాళ్లపాటు అటువంటి ప్రయత్నాలు చేసి, మళ్లీ డాక్టర్‌ ను కలుస్తారు. దీంతో కథ మొదటికి వస్తుంది. నిపుణులైన వైద్యుల్ని సంప్రదించి పాజిటివ్‌ వైఖరితో చికిత్స చేయించుకోవాలి. అసలు సమస్యను గుర్తించి దానికి చికిత్స చేయించుకొంటే సంతానాన్ని పొందేందుకు వీలవుతుంది.

ఆహారపు అవాట్లు కూడా సంతాన సమస్యను ప్రభావితం చేస్తాయి. ఎక్కువగా తినటం, తిన్న తర్వాత కదలకుండా కూర్చొని ఉండటం లేదా పడుకొని కాలం గడపటం వంటి అలవాట్లు సంతాన లేమికి దారి తీయవచ్చు. అధికంగా కొవ్వులు మిగిల్చే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం ఇందుకు దారి తీయవచ్చు. దీంతో పాటు పోషకాల్ని తినక పోవటం కూడా సమస్యే. ముఖ్యంగా ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, జింక్‌, విటమిన్‌ బి-12 వంటివి సమ్రద్దిగా అవసరం. ఈ పోషకాల్ని తీసుకోకపోతే పోషకాహార లోపం తలెత్తి సమస్యకు దారి తీయవచ్చు.

Courtesy with Surya daily news paper.July 1, 2013
  • =====================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, August 30, 2013

Doctors - vicissitudes,వైద్యులు-కష్టసుఖాలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --వైద్యులు-కష్టసుఖాలు -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

పూర్వము హిందూదేశములో " వైద్యో నారాయణో హరి " అనేవారు. వైద్యులకు అంత విలువ ఉండేది. . . ఇప్పుడు " వైద్యో నారాయణో అరి " అంటున్నారు . (అరి అంటే బక్షించేవాడు అని అర్ధము). ఎందుకిలా మారింది. కాలము మారిందా?.డాక్టర్లు మారారా? . . లేక ప్రజల దృక్పదములో మార్పు వచ్చిందా?.

వైద్య వృత్తి చాలా కష్టము తో కూడుకొన్నది. సహనము , దయ , దాన గుణము కలిగి ఉండాలి. వైద్యులు సరియైన చికిత్స ఇవ్వాలంటే వారు ప్రశాంతముగా , ఏ వత్తిడి లేకుండా ఉండాలి. ఇటు కుటుంబసభ్యులనుండి గాని , ప్రజలనుండిగాని , ప్రసార సాధనాలనుండిగాని , అటు ప్రభుత్వము నుండిగాని ఏ రకమైన కష్ట - నష్టాలు , వేధింపులు ఉండకూడదు. ఆప్పుడే తను సక్రమముగా వృత్తి ధర్మాన్ని , నైపుణ్యాన్ని ప్రదర్శించగలడు. వైద్యులు చేస్తున్న పని ఏమిటి?... రోగి ఉచ్చ , దొడ్డి , చీము , రక్తము , చెమట తో కూడుకున్నది. రోగికి నీరుడు బందు అయితే గొట్టం వేసి తీయాలి (catheterization),విరోచనము అవకపోతే .. ఎనీమా(enema) చేయాలి, పుండు పుడితే క్లీనింగ్ - డ్రస్సింగ్ చేయాలి , దెబ్బలు తగిలితే శుబ్రము చేసి కట్టువేయాలి , రోగి వ్యాది ఏమిటో తెలియడానికి శరీరమంతా చెమట ఉన్నా తనికీచేయాలి . కదా మరి ఇన్ని పనులు చేసేవారిని ఏమంటారు . మునిసిపాలిటీ అయితే " తోటీ పనివారు " అని అంటారు. అందుకే అన్నాడు ... ఓ మహానుభావుడు ... వైద్యులను " మానవ పాకీ వాళ్ళు  '' అని . రోగికి ఏ అంటురోగమున్నదోనని ఆలోచించకుండా వ్యాదినిర్ధారణకోసమో , ప్ర్రాణాలు రక్షించడానికోసమో , జబ్బుతెలుసుకునే నిమిత్తము రోగిని  ఆపాదమస్తకం తనికీ చేయాల్సిందే!. తనూ మానవమాత్రుడే కదా ! తనకూ వ్యాధులు అంటుకోవా?. ఎండుగజ్జి , తామరగజ్జి , ఏనుగుగజ్జి తనికీ అంటుకోవా ?. ఇవన్నీ అధికమించి సేవా దృక్పదముతో చికిత చేయడము వలనే పూర్వము వైద్యులను దేవుని గా భావించేవారు. పూర్వము ... రోగి చనిపోతే వైద్యులపై చీదరింపులు , వేదింపులూ , బ్లాక్ మెయింగ్ లు , కన్జూమర్ కోర్టులు , క్రిమినల్ కేసులు పెట్టడము ఉండేవికావు . . డాక్టర్లు తమపని తాము చేసారు చావును ఎవరూ ఆపలేరు అనుకునేవారు. కాని నేడు అలాకాదు.

" వైద్యానాం సుఖజీవనం కష్టయ: ,అధవా:
రోగీ యోగేనాం .. దైవయోగేనాం .,
మారకేం ... వైదుశ్యమారకహా:  "

ఈ నీతిశతం లోని శ్లోకము అర్ధం = వైద్యులు , వైద్యవృత్తిలోఉన్నవారు సుఖముగా జీవించలేరు. ఒకవేళ (అధవా:) సేవాదృక్పదముతో మదర్ తెరీసా నో , ఫ్లోరన్స్ నైటింగేల్ నో ఆదర్శము గా సేవచేసినా.... రోగి వ్యాదినుండి  బాగుపడితే ... దేవుని కృపవలన బాగుపడ్డాం అంటారు ..హాస్పిటల్ గేటు ముందు ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోతాడు .. వ్యాది నయమవక చనిపోతే .. వైద్యులు , వైద్యసిబ్బంది , వారి తప్పుడుచికిత్స  , నిర్లక్ష్యము మూలంగానే చనిపోయాం అని అంటారు. .

ఇది అప్పుడు  కాఫు ఇప్పుదు జరుగుతున్న విషయము . ఆ పై కోర్టు కేసులు , బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు రాబట్టుకోవడము లేదా విచ్చన్నకర పనులు చేయడము , కొట్టడము , వస్తుసామగ్రిని ద్వంసము చేయడము వంటివి జరుగుతునే ఉన్నాయి.

వందమంది డాక్టర్ల దగ్గర ఓరు ... ఇద్దరు చెడ్డ డాక్టర్లూ ఉంటారు . ఇది సమాజము లో ఉన్న నైజము . ప్రతీ ఫృత్తిలోను ఇలాంటి చీడపురుగులు ఉంటాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చి వైద్యము వ్యాపారముగా మార్చేసారు.. హాస్పి టల్ కట్టించేది ఎవరో ఒక MBA అసామి . తనకున్న వ్యాపార విద్య నంతటినీ ఉపయోగింది డాక్టర్లని మభ్యపెట్టి , పెద్ద జీతాలు ఆశచూపి , సాదారణ వైద్యులను పెద్ద నిపుణులు గా బోర్డులు వ్రాసి ఉదా: డా.రామారావు యమ్‌.డి (యు.యస్.ఎ) M.D అమెరికాలో చేసారనుకుంటాం ,కాని ఇక్కడ యమ్‌.డి (యు.ఎస్.ఎ) అంటే యు=యునానీ, యస్=సిద్ధ , ఎ=ఆయుర్వేద అన్న సంగతి ఎవరికి తెలుసు . వ్యాపార ధోరణీ లో రిఫరల్ కేసులకు పర్సంటేజులు ఇస్తూ పేసెంటలను రాబట్టుకుంటున్నారు . ఆ డాక్టర్ క్వాలిఫైడా , కాదా అని ఆలోచించరు .. చివరకు గ్రామ సర్పంచకూ పి.సి . ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. పి.సి లకు ఎక్కువగా సంచి డాక్టర్లు కేసులు (రోగులు) తీసుకొస్తారు. బిల్లు కి ఇంత , ఆపరేషన్‌ కి ఇంత , లేబు తనికీలకు ఇంత అని ఫిక్షిడు పి.సి లు ఉంటాయి. అవసరమున్నా లేకున్నా ఆపరేషన్‌ చేసీమంటాడా సంచిడాక్టర్ . . . పి.సి కోసము . పి.సి లు ఇవ్వకపోతే తన ప్రాక్టిష్ తగ్గిపోతుందనో , ఈగలు తోలుకోవడము వస్తుందనో సదరు డాక్టర్ పి.సి ల ప్రాక్టిస్ కే అలవాటు పడిపోతాడు . తప్పు ఎవరిది?.

అలాగని ఏ మంచిడాక్ట రో తను సరియైన వైద్యము అందించినా రోగి చనిపోవచ్చును .. దాన్ని మనదేశములో 24 గంటలూ న్యూస్ చానెల్స్ హైలైట్ చే పబ్లిసిటీ చేస్తూ ఉన్నదీ లేనిదీ వెనకా ముందూ తగిలిస్తూ ప్రచారము చేయడము సదరు డాక్టర్ ని మానసిక క్ష్యోభకు గురిచేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది చెట్టుకింద ప్లీడర్లు బ్లాక్ మెయిలింగ్ చేయడము ... రాజీ పెడతాం అని కొంత డబ్బులు గుంజడం జరుగుతూ ఉన్నది . రబసను , నసను భరించడము ఇష్టము లేకనో  , భయపడో అడిగిన డబ్బులు ఇవ్వడమూ జరుగుతూ ఉన్నది. పోనీ కోర్ట్ కెలదామా అంటే ... కన్జూమర్ కోర్ట్ ...ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత వడ్డిస్తూనే ఉంటుంది. అది దాని ధర్మము ... ఆ  డాక్టర్ బాగా సంపాదించాడులే.! ఆ మాత్రము పోతే ఏమి?.అనే ధోరణే తప్ప ..మంచి చెడూ ఆలోచనలేదు . ఇక్కడ తప్పు ఎవరిది?.

నేడు నూటికి 99 మంది డాక్టర్లు రాత్రింబవళ్ళు నిద్ర ఆహారము లేకుండా కష్టపడతారు . రోగి ప్రాణాలు కాపాడేందుకు సాయశక్తులా తమకున్న విజ్ఞానాన్నంతటినీ ఉపయోగిస్తారు.  బోలెడన్ని త్యాగాలొనరించే వీరందరికీ మనము పాదాభివందనము చేయాలి.ఇటువంటి త్యాగమూర్తులు , సైయింటిస్ట్ లు లేకపోతే విజ్ఞానము అభివృద్ధి చెందేది కాదు .. కొత్త కొత్త పరికరాలు , ప్రయోగాలు , ప్రొసీజర్లు . తనికీలు , వైద్య విధానాలు , స్కానింగ్ లు , సిటి , ఎం,ఆర్.ఐ లు ఉండేవి కావు .

ఇక మందులు కంపెనీలు వారి వ్యాపార నిమిత్తము ఎన్నో ప్రలోభాలు , ఆశలు (ఫ్రిజ్ లు , కార్లు , ఏ.సి లు ఇలా ) చూపించి నాసిరకము మందులు రాయించుకుంటారు. ఎంతమంచిడాక్టరయినా గిఫ్టులకు లొంగకుండా ఉంటారా?. ఇది రోగి విషయము లో చాలా తప్పు . రోగికి నష్టము ,, మందులు కంపెనీలకు , మందుల షాపులకు లాభాలు . ఇంతటితో ఆగక ఈ కంపెనీలు కొన్ని రకాలైన వ్యాపార గెట్టుగెదర్ మీటింగ్ లంటూ ' స్తార్ హొటల్" ల్లలో ఏర్పాటుచేసి సబ్జెక్ట్ బొంద అయిందనిపిస్తూ మెల్ల మెల్లగా ఫేషన్‌ అనే పేరుతో తాగుడు వంటి వ్యసనాలకు అలవాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అలవాటు లేనివారు కూడా కాలు జారుతున్నారు. మరి తాగే వాడు డాక్టర్ అయినా వాడి అవతారము వాడిదే. నష్టము జరిగేది రోగికే ... ఆ ఖర్చులన్ని మాత్ర మేద ఉన్న రేటుకి తగిలించబడతాయి.

ఎవరైనా ఒక డాక్టర్ చిన్న క్లినిక్ నో , ఓ మోస్తరు నర్సింగ్ హోమ్‌(హాస్పిటల్)నో పెట్టుకున్నప్పుడు తనకు సహాయకులా , ఆయా లను . స్లీపర్లను , వార్డ్ బాయ్ లను , తోటీ లను జీతాలిస్తూ ఉద్యోగస్తులు గా పెట్టుకుంటారు . వీరిలో కొంత మంది చిన్నపాటి వైద్యము నేర్చుకొని  ఒకటి , రెండు సంవత్సరాలలో సదరు హాస్పిటల్ లో పని మానేసి .... గ్రామాలలో వైద్యులు గా చెలామని అవుతూ ఉన్నారు . రూరల్ మెడికల్ ప్రాక్టిషినర్స్  అని , ప్రవేటు మెడికల్ ప్రాక్టిషినర్స్ అని , ఫస్ట్ -ఎయిడ్  అసిస్టెంట్స్  అని పోష్టల్ / లోకల్ సర్టిఫికేట్స్ పొందుతూ చలామని అవుతూ ఉన్నారు . మా శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4000 వరకూ ఉన్నారు.వీరు పి.సి ల కోసము లేని పోని హంగామా , భయాలను రోగి ముందు ప్రదర్శించి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరకి రిఫర్ చేస్తూ ఉంటారు . దానికి తగ్గటు గానే మెడికల్ బిల్లులు  పి.సి లను కలుపుకొని  ఎక్కువ వస్తాయి.

  • *లేబర్ యాక్ట్ అని లేబరు ఆఫీసు వారూ , 
  • *ఇన్‌కమ్‌ టాక్ష్ అని ఆదాయపన్ను ఆఫీసర్లు , 
  • *ప్రొఫెషన్‌ టాక్ష్ అని సేల్ టాక్క్ష్ డిపార్ట్ మెంట్ , 
  • *ఇంటి పన్ను అంటూ మునిసిపాలిటీ రెవిన్యూ వారు , 
  • *పొల్యూషన్‌ ఎక్కువవుతుందని  పొల్యూషన్‌ కంట్రో బోర్డ్ వారు , 
  • *క్లినిక్ ముందు రోడ్ మీద చెత్త ఎత్తడానికి మామూళ్ళు అడిగే రోడ్ స్లీపర్లు , 
  • *హెవీ మిషనరీ లోడ్ చెక్ అప్ అని కరంటు డిపార్ట్మెంట్ వారు లంచాలు , 
  • *నాలా పన్ను అని నర్సింగ్ హోమ్‌ చుట్టు ప్రక్కల ఉన్న ఖాళీ స్థలానికి పన్ను వసూలుచేసే రెవిన్యూ శాఖ వారు . . . . పెట్టే వేదింఫులు ఇంతా . . అంతా  అని చెప్పలేము . చెప్పేవికావు .

ఎందుకిలా మారింది. కాలము మారిందా?.డాక్టర్లు మారారా? . .ప్రభుత్వాలే కారణమా?.. లేక ప్రజల దృక్పదములో మార్పు వచ్చిందా?.

అబ్బా ... ఇంత టెన్‌షనా? అసలు ప్రశాంతత లేదు . మరి వైద్యమెలా చేయడము !

  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, August 29, 2013

Hepatitis-A,హెపటైటిస్‌-ఏ,HAV

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Hepatitis-A,హెపటైటిస్‌-ఏ,HAV- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 Hepatitis-A,హెపటైటిస్‌-ఏ,HAV-------------

ఇది సాధారణంగా కనిపించే పచ్చకామెర్ల వ్యాధి. 'ఫికో ఓరల్‌ రూట్‌' అంటే మనం తాగే నీరుగానీ, ఆహారం గానీ కలుషితమైనా అది నోటి ద్వారా తీసుకున్నపుడే కాదు. మలరంధ్రాల ద్వారా కూడా శరీరంలోకి వైరస్‌లు చేరి హెపటైటిస్‌-ఏ సంభవించేందుకు ఆస్కారం ఉంది. దీన్ని ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అంటారు  హెపటైటిస్‌ -ఎ వైరస్‌ ద్వారా వచ్చే లివర్‌ వ్యాధి. ఇది కలుషితమైన నీటి ద్వారా కాని, లేక కలుషితమైన ఆహారం ద్వారా కాని వ్యాప్తి చెందుతుంది. ప్రతి ఏటా, ప్రపంచవ్యాప్తంగా పది మిలియన్ల ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రోగక్రిమి శరీరంలో ప్రవేశించినప్పటి నుండి రోగల ణాలు మొదలయ్యే వరకు (ఇంక్యుబేషన్‌ పీరియడ్‌) సాధా రణంగా, రెండు నుండి నాలుగు వారాల వరకు ఉంటుం ది. హెపటైటిస్‌ -ఎ టీకాతో ఈ వ్యాధిని నిరోధించవచ్చు.

వ్యాధి పుట్టుక
వ్యాధికారక క్రిమి గొంతు లేక ప్రేవులోని కణజాలాన్ని చొచ్చుకొని, రక్తం ద్వారా లివర్‌కు చేరి, అక్కడ అభివృద్ధి చెందుతుంది.

ప్రివలెన్స్‌
వ్యాధికారక క్రిములు రోగి మలంలో కనబడతాయి. ఈ వ్యాధి ప్రబలంగా ఉన్న దేశాలను సందర్మించే వారికి, రోగితో సంభోగించిన వారికి, రోగి వాడిన సూదులు, సిరెంజిలు వాడిన వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.

ట్రీట్ మెంట్ :
Liv-52 tab .. 2 మాత్రలు చొప్పున్న రోజుకి మూడుసార్లు . . . 2-3 నెలలు వాడాలి.
  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Hepatitis-B,హెపటైటిస్‌-బి


  •  

  •  



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Hepatitis-B,హెపటైటిస్‌-బి-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


హెపటైటిస్‌-బి

హెపటైటిస్‌ -బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్‌ -బి వైరస్‌ ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్‌ హెసడ్నావైరస్‌ కుటుంబానికి చెందిన వందల రకాల వైరస్లలో ఇది ఒక రకం. దీనికి సీరం హెపటైటిస్‌ అని ఇంకో పేరుంది. ఈ వ్యాధి ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో చాలా చోట్ల ప్రబలంగా ఉంది. ఒంట్లో హెపటైటిస్‌ వైరస్‌ ఉన్నవాళ్ళు మన దేశంలో, మన ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 3 - 5 శాతం వరకూ ఉన్నట్టు అంచనాలు చెబుతున్నాయి. కాలేయానికి వాపు రావటం, వాంతులు, పచ్చ కామెర్లు ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే కాలేయం గట్టిబడిపోయి లివర్‌ కాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది.

వ్యాప్తి మరియు వ్యాధి లక్షణాలు

ఒకసారి హెపటైటిస్‌ -బి వైరస్‌ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దాని సంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్‌ను దెబ్బతియ్యటం ఆరంభిస్తుంది. ఇక వాళ్ళ రక్తంలోనూ, వీర్యంలోనూ, లాలాజలంలోనూ, ఇతరత్రా శారీరకా స్రావాలన్నింటిలోనూ ఈ వైరస్‌ ఉండొచ్చు. ఈ వైరస్‌ ఎక్కువగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. సెక్స్‌, రక్తమార్పిడి, సూదులు, సిరింజిలు తల్లి నుండి బిడ్డకు సంక్రమించవచ్చును.

తొలి దశ
హెపటైటిస్‌-బి వైరప్‌ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి. దీన్ని ‘అక్యూట్‌’ దశ అంటారు. కామెర్లతో పాటు వికారం, అన్నం సయించకపోవటం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలూ ఉండొచ్చు. ఈ దశలో మనం Elisa పరీక్ష చేస్తే ‘పాజిటివ్‌’ వస్తుంది. అంటే ఏదో మార్గంలో హెపటైటిస్‌ -బి వైరస్‌ వీరి శరీరంలో ప్రవేశించిందని, దాని కారణంగా కామెర్లు వచ్చాయని అర్థం. వీరికి ‘లివర్‌ ఫంక్షన్‌ టెస్లు’ల్లో కూడా కాస్త తేడాలుంటాయి.
1. ఇలా కామెర్లు వచ్చి, హెపటైటిస్‌ -బి ‘పాజిటివ్‌’ ఉన్న వారిలో నూటికి 99.5 మందికి ప్రాణాపాయం ఉండదు. ఈ దశలో మనం వీరికి మంచి ఆహారం, పూర్తి విశ్రాంతి ఇస్తే చాలు. ముఖ్యంగా లివర్‌ను దెబ్బతీసే మందులు వాడకూడదు. పసర్లు తాగించటం, చేతులు కాల్పించటం వంటివేమీ చెయ్యకూడదు.
2. క్రమంగా కామెర్లు వాటంతట అవే తగ్గిపోతాయి. 95 శాతం మందికి ఆర్నెల్ల తర్వాత వీరికి మళ్ళీ Elisa పరీక్ష చేస్తే ‘నెగిటివ్‌’ వచ్చేస్తుంది.
3. పెద్దల్లో కేవలం కొద్దిమందికి(5%) మాత్రం ఆర్నెల్ల తర్వాత కూడా హెపటైటిస్‌ - బి వైరస్‌ ఒంట్లో ఉండిపోవచ్చు. అదే పిల్లల్లో అయితే 90 శాతం మందికి ఈ వైరస్‌ పూర్తిగా పోదు, అది అలాగే శరీరంలో ఉండిపోతుంది.
4. అంటే హెపటైటిస్‌ -బి ఎంతోమందికి సోకినా కేవలం కొద్దిమందికి మాత్రమే అది ఒంట్లో నిల్వ ఉండిపోతుంది. ఇది దీర్ఘకాలిక సమస్యకు ఆరంభం!
5. ఒకసారి హెపటైటిస్‌ -బి ఉన్నట్టు తేలిందంటే వారి నుంచి అది ఇతరులకు సంక్రమించకుండా ఇంట్లోని వారంతా టీకాలు వేయించుకోవటం వంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. జీవిత భాగస్వాములకు ఈ జాగ్రత్తలు మరీ ముఖ్యం!

వైరస్‌ మకాం
కామెర్లు తగ్గిన ఆర్నెళ్ల తర్వాత కూడా HBsAg పరీక్ష పాజిటివ్‌ వస్తుంటే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా క్రోనిక్ పటైటిస్‌ గా పరిగణిస్తారు. అంటే ఇక హెపటైటిస్‌ - బి వైరస్‌ శరీరంలో ఉండిపోవటానికే ప్రయత్నిస్తోందన్నట్టే. ఇలా హెపటైటిస్‌ -బి ఒంట్లో ఉండిపోతున్నా కూడా వీరిలో 60 శాతం మంది జీవితాంతం అలాగే... ఏ సమస్యలూ లేకుండా ఉండిపోవచ్చు. వీళ్ళను అస్‌ఎఫెక్టెడ్‌ క్యారియర్స్‌ అంటారు. ఏలక్షణాలూ, ఏబాధలూ ఉండవు. చాలాసార్లు ఒంట్లో వైరస్‌ ఉన్న విషయం కూడా వీరికి తెలీదు. మామూలు హెల్త్‌చెకప్‌లకు వెళ్ళినప్పుడో, రక్తదానం చేసినప్పుడో, గర్భం దాల్చినప్పుడు సాధారణంగా చేసే పరీక్షలోనే ఈ విషయం బయటపడుతుంది. మరిన్ని పరీక్షలు చేస్తే వీరికి ఎలీష -HBsAg పాజిటివ్‌ ఉంటుంది గానీ SGPT నార్మల్‌గానే ఉంటుంది, HBeAg నెగిటివ్‌ ఉంటుంది. వైరల్‌లోడ్‌ కూడా తక్కువే ఉంటుంది. అంటే వీళ్ళ ఒంట్లో వైరస్‌ ఉందిగానీ దానివల్ల లివర్‌ ప్రభావితం కావటం లేదని అర్థం. వైరస్‌ వల్ల వీరికే సమస్యా లేకపోయినా వీరి నుంచి వైరస్‌ ఇతరులకు సంక్రమించే అవకాశం మాత్రం ఉంటుంది.

1. వీళ్ళకు లివర్‌ సమస్యలు వచ్చే అవకాశం తక్కువే. అయినా వీళ్ళు ఆర్నెల్లకోసారి వైద్యులను కలిసి ముఖ్యమైన పరీక్షలు ఒకటి రెండు చేయించుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఇప్పటికి వైరస్‌ వల్ల ఏ ఇబ్బందీ లేకపోయినా జీవితాంతం ఇలాగే ఉంటుందని చెప్పలేం.
2. కొందరు జీవితాంతం ఈ దశలోనే ఇలాగే ఏ ఇబ్బందీ లేకుండా గడిచిపోయేవారూ ఉంటారు.
3. వీళ్ళు ఎప్పుడు రక్తదానం చెయ్యకూడదు. దేనికోసం వైద్యుల దగ్గరకు వెళ్ళినా హెపటైటిస్‌ -బి ఉన్న విషయం చెప్పాలి. మద్యం ముట్టకూడదు. చక్కటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీరి నుంచి వైరస్‌ సంక్రమించకుండా సన్నిహితులంతా జాగ్రత్తలు తీసుకోవాలి.

భవిష్యత్తులో ప్రమాదం
ఒంట్లో వైరస్‌ నివాసం ఏర్పరచుకున్న ‘క్రానిక్‌ హెపటైటిస్‌’ బాధితుల్లో 60 శాతం మందికి ఏ ఇబ్బందీ లేకపోయినా, ఓ 40 శాతం మందికి భవిష్యత్తులో ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి లివర్‌ వ్యాధులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.వీరికి భవిష్యత్తులో సమస్య ఎలా ఉండొచ్చు? ఎంత తీవ్రంగా ఉండొచ్చన్నది ముందే చెప్పేందుకు పరీక్షలు ఉపకరిస్తాయి.
1. పరీక్షల్లో - HBsAg పాజిటివ్‌గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్‌ ఉండి, SGPT (కాలేయానికి సంబంధించిన ఎన్‌జైమ్‌) ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి వైరల్‌ లోడ్‌ 5లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని!
2. దాన్ని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మన అందుబాటులో ఉన్నాయి. వీరు తక్షణం పెగ్‌-ఇంటర్‌ఫెరాన్‌, లెమోవిడిన్‌, ఎడిఫోవిర్‌, ఎంటకావిర్‌ వంటి యాంటీ వైరల్‌ మందులు తీసుకోవటం ద్వారా మున్ముందు కూడా అసలు లివర్‌ వ్యాధి రాకుండా నివారించుకునే అవకాశం ఉంది.
3. సన్నిహితులకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం ముట్టకుండా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతుండాలి. తరచూ వైద్యులను సంప్రదిస్తుండాలి. కొంతకాలంగా హెపటైటిస్‌ - బి వైరస్‌ ఒంట్లో ఉండి లివర్‌ ప్రభావితమైనా కూడా ఏ సమస్యా లేకుండా గడిపేవాళ్ళు కొందరైతే కొందరికి ఎప్పుడైనా తీవ్రమైనా లివర్‌ సమస్యలు ఆరంభం కావచ్చు. తీవ్రస్థాయి కామెర్లు, లేదా పొట్ట ఉబ్బరం, జలోదరం, సరైనా స్పృహ లేకపోవటం, రక్తపువాంతుల వంటి లక్షణాల్లో ఏవో ఒకటి మొదలవ్వచ్చు, కొందరికి అన్నీ రావచ్చు.
4. పరీక్షల్లో: వీరికి HBsAg పాజిటివ్‌ ఉంటుంది. ఇక HBeAg పాజిటివ్‌ ఉండొచ్చు, నెగిటివ్‌ ఉండొచ్చు. అలాగే వైరల్‌ లోడ్‌ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే లివర్‌ మీద దుష్ర్పభావాలు వచ్చిన తర్వాత ఒంట్లో వైరల్‌ లోడ్‌ తగ్గిపోవచ్చు కూడా.
5. అల్ట్రాసౌండ్‌ పరీక్షలో చూస్తే మెత్తగా, మృదువుగా ఉండాల్సిన లివర్‌ గట్టిబడుతూ చిన్నదవుతున్నట్టు, గడ్డలుగడ్డలుగా తయారవుతున్నట్టు కనబడొచ్చు, ప్లీహం పెద్దదై కూడా ఉంటుంది, ఎండోస్కోపీలో అన్నవాహికలోని రక్తనాళాలు పెద్దవై కనబడతాయి.
6. దీనర్థం: వైరస్‌ దీర్ఘకాలం ఒంట్లో ఉండటం వల్ల లివర్‌ దెబ్బతినటం ఆరంభమైంది. వైరస్‌ వల్ల అది గట్టిబడిపోవటం మొదలైంది. కొద్దికొద్దిగా గట్టిబడుతున్న తొలి దశను పైబ్రోసిస్‌ అనీ, మరీ ముదిరిన తర్వాత దశను ‘సిర్రోసిస్‌’ అనీ అంటారు. దీనికి కూడా యాంటీ వైరల్‌ మందులు ఆరంభిస్తే లివర్‌ అస్థితి నుంచి మరింత దెబ్బతినకుండా ఉంటుంది. రక్తపువాంతుల వంటి సమస్యలకు కూడా చికిత్స చెయ్యొచ్చు. మొత్తం మీద ఇప్పుడున్న చికిత్సలతో - చాలాకాలం పాటు వీరి సాధారణ జీవితానికి సమస్యల్లేకుండా చూడొచ్చు.
7. సిర్రోసిస్‌ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్స తీసుకోవటం ముఖ్యం.
8. ఆల్కహాల్‌ ముట్టకూడదు, తరచూ వైద్యుల పర్యవేక్షణ అవసరం.
9. వైరస్‌ సన్నిహితులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.

విపరీత పరిస్థితి
కొందరికి ఇతరత్రా లివర్‌ సమస్యలేమీ మొదలవ్వకపోయినా.. దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్‌-బి వైరస్‌ ఉన్న కారణంగా లివర్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది.

ఏ పరీక్ష ఏం చెబుతుంది?
HBsAg: ఇది పాజిటివ్‌ ఉంటే హెపటైటిస్‌ -బి వైరస్‌ ఒంట్లో ఉందనే అర్థం.
SGPT :ఇది ఎక్కువుంటే ఒంట్లో వైరస్‌ బాగా చురుకుగా ఉండి తన సంఖ్యనూ, ప్రాబల్యాన్నీ బాగా పెంచుకుంటోందని అర్థం.
HBeAg: ఇది పాజిటివ్‌ ఉంటే ఇప్పుడు లివర్‌ బాగానే ఉన్నా భవిష్యత్తులలో దెబ్బతినే అవకాశం ఉందని అర్థం.
డిఎన్‌ఏ వైరల్‌ లోడ్‌: దీనిలో వైరస్‌ సంఖ్య ఎంత ఉందో చూస్తారు. ఇది 5 లక్షలకు మించి ఉన్నట్టయితే లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది కాస్త ఖరీదైన పరీక్ష.

ముందు జాగ్రత్త
ఇది సోకకుండా చూసుకోవాలంటే ముందుస్తు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి.
1. హెపటైటిస్‌ - బి సెక్స్‌ ద్వారా సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి కండోమ్‌ వంటి సురక్షిత జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌లో పాల్గోనవద్దు.
2. ఒకరి టూత్‌బ్రష్‌లు, రేజర్లు, నెయిల్‌కట్టర్లు వంటివి మరోకరు వాడొద్దు. బయట సెలూన్లలో కూడా కచ్చితంగా కొత్త బ్లేడు వాడేలా చూడాలి.
3. ఇంజక్షన్‌ సూదుల వంటివి ఒకరికి వాడినవి మరొకరు ఉపయోగించవద్దు. డిస్పోజబుల్‌ సూదులు, సిరంజీలు వాడటం ఉత్తమం.
4. చెవులు కుట్టటం, ముక్కులు కుట్టటం, పచ్చబొట్లు వేయించుకోవటం వీటికి ఒకరికి వాడిన పరికరాలు మీకు వాడకుండా చూసుకోవాలి.
5. రక్తం ఎక్కించేటప్పుడు, రక్తమార్పడి విషయంలో పూర్తి సురక్షితమైన పద్ధతులను అనుసరించటం... చాలా అవసరం!

పెళ్లి
టీకాలున్నాయి కాబట్టి హెపటైటిస్‌ -బి బాధితులు ఈ విషయం ముందుకానే అందరికీ తెలిపి, వారి అనుమతితో నిశ్చితంగా పెళ్ళి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటటిస్‌ - బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్‌ వచ్చిన వాళ్ళు తప్పించి మిగతా అందరూ (అన్‌అఫెక్టెడ్‌ క్యారియర్స్‌ కూడా) పిల్లలను కూడా కనొచ్చు.

గర్భిణులు
గర్భిణులంతా తప్పనిసరిగా HBsAg పరీక్ష చేయించుకోవాలి. హెపటైటిస్‌-బి ఉన్నా కూడా బిడ్డలను కనొచ్చు. గర్భస్రావాలు చేయించుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే పుట్టగానే బిడ్డకు ఒక తొడకు Hepatitis-B ఇమ్యూనోగ్లోబ్యులిన్ల ఇంజక్షన్‌, మరో తొడకి హెపటైటిస్‌-బి టీకా రెండు తప్పకుండా ఇవ్వాలి. నెల రోజులకు మరో టీకా, ఆర్నెల్లకు మరో టీకా ఇప్పించాలి. దీంతో తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ సంక్రమించకుండా 95 శాతం వరకూ నివారించవచ్చు.

టీకాలు
1. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా ఏ ప్రామాణిక సంస్థా కూడా ప్రజలంతా హెపటైటిస్‌ టీకా తప్పకుండా తీసుకోవాలని సిఫార్సు చెయ్యటం లేదు. కొంతమంది మాత్రం తప్పకుండా తీసుకోవాలి.
2. చిన్న పిల్లలకూ, స్కూలు వయసు పిల్లలందరకీ తప్పకుండా టీకా ఇప్పించాలి.
3. కుటుంబంలో ఎవరికన్నా హెపటైటిస్‌ -బి ఉంటే, ఆ ఇంట్లోని వారంతా తప్పకుండా టీకా తీసుకోవాలి. వైద్య సిబ్బంది, తరచూ రక్తమార్పిడి అవసరమయ్యే రకరకాల వ్యాధి పీడితులకు కూడా టీకా తప్పనిసరి.
4. ఇవాళ మొదటి టీకా వేయించుకుంటే - మళ్ళీ సరిగ్గా నెలకు ఒకటి, ఆర్నెల్లకు మరోకటి, మొత్తం మూడు టీకాలే తీసుకోవాలి.



Courtesy with : డా ధర్మేష్‌ కపూర్‌, హెపటాలజిస్ట్‌-గ్లోబల్‌ హాస్పిటల్‌, లక్డీకపూల్‌@surya Telugu daily news paper
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, August 26, 2013

How far exercise necessary for health?-వ్యాయామము ఆరోగ్యానికి ఎంత అవసరము?

  •  


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -How far exercise necessary for health?-వ్యాయామము ఆరోగ్యానికి ఎంత అవసరము?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మనము జీవించాలంటే  శ్వాసించడము , తినడము , నిద్రించడము లాగే కొంత వ్యాయామము కూడా అవసరము . పసిపిల్లలకు తొలిరోజుల్లో  రోదనము  ఆరోగ్యము . ఎదుగుతున్న, వయస్సు నిండి వృద్దాప్యము దాకా జీవితపు అన్ని అవస్థలలోనూ దానికి తగ్గ వ్యాయామము అవసరము .ప్రతి ఒక్కరికీ వ్యాయామము అవసరము . వ్యాయామము చేయడము వలన ఎన్నో అనారోగ్య పరిస్థితులనుండి విముక్తి పొందగలము . పలానా వ్యాయామము చేయాలా? ఏది చేస్తే బాగుంటుంది . రోజులో ఎప్పుడు చేయాలి ... ఇంకా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతుంటాయి. నిజానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమయ్యే వ్యాయామానికి ఒక పద్దతి , టైమ్‌ అంటూ ఏమీ అవసరము లేదు. శరీర కదలికలు . చెమటపట్టే వరకు సుమారు 30-45 నిముషాలు వారానికి 5 రోజులు మనకి నచ్చిన వ్యాయామము చేయవచ్చును. నడక , తోటపని, ఆటలు ఆడుకొనుట (టెన్నిస్ , బేట్మింటన్‌ , షటిల్ కాక్ , రింగ్ టెన్నిస్ , కబటి ,వాలీబాల్  మున్నగునవి . చివరికి ఇల్లు ఊడ్చడము , బట్టలు ఉతకడము , ఇంటిపనులు చేసుకోవడమూ కూడా వ్యాయామాలే .

బహుశా పూర్వము మనిషికి ఇప్పుడున్నంత వత్తిడి, చెడు ఆలోచనలు ఉండేవికావు . . . కాబట్టి శరీరము పై చెడుప్రభావము లేకుండా ఉండి ఉండవచ్చు. కాని ప్రస్తుతము పగలు , రాత్రులు ఉద్యోగము చేసి ఏదో ఒకటి  తినేసి జీవించే ఈ నాటి జీవన విధానానికి తప్పకుండా వ్యాయామము అవసరము .అదీ మనకి అవసరమైనంతవరకే చేయాలి. మనము దేసే ఉద్యోగాలలో 80% కుర్చీలో కూర్చుని చేసేవే . మరికొంతమందికి వ్యాయామమే కాని శరీరశ్రమ చాలా తక్కువ . వాహనాల సౌకర్యము రోజురోజుకీ ఎక్కువ అవడము వలన సాధారముగా మనము చేసుకునే కొద్దిపాటి శ్రమను కూడా చేయలేకపోతున్నాము . దానివలన చిన్నవయసులోనే లావు అవడము , కీళ్ళనొప్పులకు గురి అవడము , అజీర్ణము తో బాధపడడము , పొట్ట బాగా పెరగడము ఇలా ఎన్నో ఇబ్బందులు ... దానికి పరిష్కారము సరైన వ్యాయామము స్త్రీ ,పురుషులిద్దరికీ అవసరము .
  • మనకి కావల్సిన మంచి కొలెస్ట్రాల్ ' HDL' ను పెందుతుంది. 
  • చర్మము యొక్క రక్తప్రసరణ పెంచి కాంతివంతము చేస్తుంది. 
  • బి.పి.ని తగ్గిస్తుంది, మధుమేహ వ్యాదిని అదుపులో ఉంచుతుంది. 
  • శరీరములోని వివిధ అవయవాలకు ప్రాణవాయువును చక్కగా అందిస్తుంది. 
  • పక్షవాతము , గుండె పోటు .. వంటి ఎటాక్స్ రాకుండా కాపాడుతుంది. 
  • ఎముకల పటిస్టతను బలపరుస్తుంది. 
  • శరీరము లో ఫ్రీ రాడికల్స్ ... వ్యర్ధపదార్ధాలను విసర్జించే ప్రక్రియను వేగవంతము చేస్తుంది . 
  • కేలరీల శక్తి ఉపయోగించడము వలన బరువు పెరిగే అవకాశము , ఊబకాయము నివారించవచ్చును .


  • Exercise is a medicine-వ్యాయామమే ఔషధం.

శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆకృతిని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గటానికి తోడ్పడుతుంది. గుండె బలోపేతం కావటానికీ.. జీవనకాలం పెరగటానికీ దోహదం చేస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింపజేయటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నెన్నో. రోజుకి కనీసం 30 నిమిషాలు సేపు వ్యాయామం చేసినా చాలు. చాలా జబ్బుల బారినపడకుండానూ చూసుకోవచ్చు. నిజానికి శరీర సామర్థ్యం లోపిస్తే చిన్న చిన్న సమస్యలైనా పెద్దవిగా మారతాయి. వ్యాయామం ద్వారా ఇలాంటివాటిని దూరం చేసుకోవచ్చు. అందుకే ప్రస్తుతం వ్యాయామాన్ని కూడా చికిత్సలో భాగంగా చూస్తున్నారు. కొన్ని జబ్బులు తగ్గటంలో వ్యాయామం ఎలా తోడ్పడుతుందో చూద్దాం.

* ఆందోళన: దీర్ఘకాలం ఆందోళనతో సతమతమయ్యేవారికి కుంగుబాటు వంటి మానసిక సమస్యల ముప్పూ ఎక్కువే. వ్యాయామంతో వీటి బారినపడకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి ఆందోళన ముప్పు 25% తక్కువగా ఉంటున్నట్టు పరిశోధనలు పేర్కొంటున్నాయి. వ్యాయామం మూలంగా మనసును ఉత్సాహపరిచే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ముఖ్యంగా ధ్యానం వంటి శ్వాస సంబంధ పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. మిగతా వ్యాయామాలూ పనికొస్తాయి. వీటిని ఎక్కువగా చేస్తే ఫలితమూ అధికంగా ఉంటుంది.

* జ్ఞాపకశక్తి క్షీణత: వ్యాయామం మూలంగా మెదడుకు రక్తసరఫరా మెరుగవుతుంది. అలాగే జ్ఞాపకశక్తిని నియంత్రించే భాగాలూ వృద్ధి చెందుతాయి. వ్యాయామం చేసేవారు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవటం, ఒకేసారి వివిధ లక్ష్యాలను ఛేదించటం, ప్రణాళికా రచన వంటి పరీక్షల్లో చురుకుగా ఉంటున్నట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకే తరహా కన్నా కొత్తరకం వ్యాయామాలు చేస్తే.. కొత్త నైపుణ్యాలను నేర్చుకునేలా మెదడు తర్ఫీదు పొందుతుంది కూడా. కాబట్టి డ్యాన్స్‌, ఆటలు, పెరట్లో మొక్కలు నాటటం, సైకిల్‌ మీద కాత్త దారిలో వెళ్లటం.. ఇలా కొత్తకొత్త పద్ధతుల్లో ప్రయోగాలు చేయటం మంచిది.

* నిద్ర సమస్యలు: వ్యాయామం వల్ల మెదడుకు రక్తసరఫరా పెరుగుతుంది. రక్తంతో పాటు ఇనుము కూడా మెదడుకు అందుతుంది. ఇది నిద్ర బాగా పట్టటానికి తోడ్పడుతుంది. వ్యాయామం చేసేవారు మిగతావారికన్నా గాఢంగా, నిద్రాభంగం లేకుండా హాయిగా నిద్ర పోతున్నట్టు అధ్యయనాల్లో వెల్లడైంది. నిద్రలేమితో బరువు పెరగటం, నిస్సత్తువ, అలసట, గుండెజబ్బు, ఒత్తిడిని తట్టుకోలేకపోవటం వంటి సమస్యలు దాడిచేస్తాయి. వ్యాయామం ఇలాంటి వాటి బారినపడకుండా కాపాడుతుంది కూడా. నిద్రపోతున్నప్పుడు శ్వాసకు అడ్డంకి (స్లీప్‌ అప్నియా) తలెత్తే సమ్యతో బాధపడేవారు మరింత ఎక్కువగా వ్యాయామం చేయటం మంచిది. దీంతో బరువు తగ్గి, సమస్య దూరం కావటానికి అవకాశముంది.

*ఆస్థమా: గుండె రక్తనాళాల ఆరోగ్యం బాగుంటే ఆస్థమా లక్షణాల తీవ్రతా తగ్గుతున్నట్టు అధ్యయనాల్లో బయటపడింది. బరువు పెరగటం మూలంగా కొవ్వు కణాలు శరీరంలో వాపును తెచ్చిపెడతాయి. ఇది ఆస్థమా తీవ్రం కావటానికి దోహదం చేస్తుంది. కాబట్టి వ్యాయామంతో.. ముఖ్యంగా గుండెను బలోపేతం చేసే ఏరోబిక్‌ వ్యాయామాలతో ఆస్థమా లక్షణాలు తగ్గే అవకాశముంది. అయితే ఆరుబయట వ్యాయామం చేసేవారు కాలుష్యం, పుప్పొడి, చల్లటిగాలి వంటి ఆస్థమా ప్రేరకాల బారిన పడకుండా చూసుకోవాలి.

* స్తంభనలోపం: శృంగారంపై అనాసక్తికి, స్తంభనలోపానికి దారితీసే ఒత్తిడి, నిద్రలేమి, నిస్సత్తువ, గుండె సమస్యల వంటివన్నీ వ్యాయామంతో దూరమయ్యేవే. ముఖ్యంగా నడుము కింది భాగానికి రక్తసరఫరాను పెంచే వ్యాయామాలు ఈ విషయంలో బాగా ఉపయోగపడతాయి.

* వెన్ను, తుంటి, మోకాలు, మెడ నొప్పులు: కండరాల బలహీనం మూలంగానూ నొప్పులు వస్తుంటాయి. ఉదాహరణకు తొడ నుంచి సాగే ఇలియోటిబియల్‌ కండరబంధనం బలహీనమైతే మోకాలు నొప్పి రావొచ్చు. చాలాసేపు కంప్యూటర్‌ ముందు వంగి కూచోవటం వల్ల భుజం, మెడనొప్పి రావొచ్చు. ఆయా కండరాలను బలోపేతం చేసే, సాగదీసే వ్యాయామాలతో ఇలాంటి నొప్పులను దూరంగా ఉంచుకోవచ్చు.

  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, August 25, 2013

valve replacement awareness-గుండె కవాట మార్పిడి అవగాహన

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --valve replacement awareness-గుండె కవాట మార్పిడి అవగాహన -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... Heart

శస్త్ర చికిత్సలకు సరిపడా ఆరోగ్యంతో ఉన్నవాళ్లకు... కవాట లోపాలుంటే సరిదిద్దాలంటే కవాట మార్పిడి శస్తచ్రికిత్స ఎంతగానో తోడ్పడుతుంది. గుండెలోని కవాటలోని వ్యాధికి గురైన వాళ్లు ఆయాసం, గుండెదడ, కాళ్లవాపు శస్తచ్రికిత్సలు, పూర్తిగా దెబ్బతిన్న కవాటల స్థానంలో కృత్రిమ కవాటాల్ని అమర్చి శస్తచ్రికిత్సను ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నారుు. గుండెలో నాలుగు కవాటలున్నాయి . రెండు కుడిపక్క, మరోరెండు ఎడమ పక్క ఉంటాయి . గది నుంచి గదికి రక్తం సవ్యంగా ఒకే డైరెక్షన్‌లో వెళ్లడానికి ఇది అవసరం. ఎడమ పక్క ఉండేవి మైట్రల్‌ వాల్‌, అయోర్డిక్‌ వాల్‌, ఇవి కొన్ని రకాల జబ్బులతో దెబ్బతినవచ్చు. ఇందులో ముఖ్యమైనది రుమాటిక్‌ హార్డ్‌ డిసీజ్‌.

రుమాటిక్‌ హార్డ్‌ డిసీజ్‌ చిన్నతనంలో వచ్చే గొంతు నొప్పి, టాన్సిల్స్‌ వాపు, కీళ్ల నొప్పులు, జర్వం, మొదలైన వాటికి సరైన సమయంలో చికిత్స చేయించాలి. లేకపోతే అవి రుమాటిక్‌ గుండె జబ్బులకు దారితీసే ప్రమాదం ఉంది. క్రమంగా గుండె కవాటాలు దెబ్బతింటాయి. ఈ జబ్బులకు పెన్సిలిన్‌ చాలామంది మందు, మంచి గాలీ వెలుతురు ఉన్న ఇళ్లలో నివశించడం ద్వారా, బలమైన ఆహారం (పాలు, పళ్లు, గుడ్లు, మాంసం) తీసుకోవడం ద్వారా ఈ వ్యాధులు నివారించవచ్చు.రుమాటిక్‌ గుండె జబ్బు వస్తే తరుచుగా పరీక్షలు చేయించుకుంటూ సరైన సమయంలో ఆపరేషన్‌ చేయించుకోవాలి. ఆపరేషన్‌ భయంతోనే, మరో కారణంతోనైన వాయిదా వేస్తే గుండె బలహీనమైపోతుంది. గుండెలో రక్తం గడ్డకట్టి ఆ ముక్కలు మెదడులోకి, కాళ్లలోకి గానీ చేరుకొని రక్త ప్రసరణకి అరోదం కలిగిస్తే ఆ అవయావాలలో గాంగ్రీన్‌ ప్రారంభమవ్వచ్చు. పక్షవాతం రవాచ్చు. అందుకని ఆపరేషన్‌ వెంటనే చేయించుకోవాలి.

ప్రతీ ఆరు నెలలకి గుండె పరీక్ష చేయించుకోవడం మంచిది. ఎడమ అరికల్‌, ఎడమ వెంట్రికల్‌ మధ్య ఉంటుంది. మైట్రల్‌ కవాటం, రుమాటిక్‌ పీవర్‌ వల్ల మెత్తగా ఉండే ఈ కవాట పత్రాలు అతుక్కొని, క్రమంగా గట్టిపడి, మైట్రల్‌ వాల్వ్‌ రంద్రం సన్నగవుతుంది. దాంతో ఎడమ పైనున్న గుండె గది ఆరికల్‌ నుంచి కింద గుండె గది ఎడమ వెంట్రికలోకి రక్తం సరిగా ప్రవహించదు. రక్తం ఎడమ ఆరికల్‌లోనే ఉండిపోవడం వెనక్కి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. దాంతో రోగికి ఆయాసం, ఎగశ్వాస కలుగుతుంది. వెల్లకిలా పడుకోలేక కూర్చోవాల్సి వస్తుంది. దగ్గులో రక్తం కూడా రావచ్చు. ఎడమ ఆరికల్‌లో రక్తం గడ్డలు కట్టవచ్చు. క్రమంగా ఈ గడ్డలు రక్త ప్రవాహం ద్వారా మెదడు, మూత్రపిండాలు అడ్డంపడవచ్చు. పక్షవాతం లాంటివి రావచ్చు. మైట్రోస్టినోసిస్‌ల వల్ల గుండె లయ తప్పుతుంది. ఇలాంటి వాళ్లు ఉప్పు తగ్గించి తినాలి.

శ్రమతో కూడిన పనులు చేయకూడదు. దగ్గు, జర్వం లాంటివి వస్తే వెంటనే తగిన చికిత్స చేయించుకోవాలి. రుమాటిక్‌ ఫీవర్‌ తిరగబెట్టకుండా ప్రతీ మూడు వారాలకు బెంజథిన్‌ పెన్సిలిన్‌ ఇంజిక్షన్‌ చేయించుకుంటూ ఉండాలి. కవాటం భాగ ఇరుకైనప్పుడు మైట్రల్‌ కవాటాన్ని వెడల్పు చేయాటానికి శస్త్ర చికిత్స అవసరమవుతుంది. మామూలుగా ఎడమ ఆరికల్‌ లోనుంచి రక్తం ఎడమ వెంట్రికల్‌లోకి ప్రవహిస్తుంది. అలా ప్రవహించే మార్గం సరిగా లేనప్పుడు కలిగే ఇబ్బందులు, చికిత్స తెలుసుకున్నాం. కవాటాల పనిమిటంటే రక్తం ఒకే వైపు ప్రవహించేలా చూడటం. అంటే మైట్రల్‌ వాల్వ్‌ ద్వారా ఎడమ వెంట్రికల్‌లోకి రక్తం రావాలి గానీ, ఎడమ ఆరికల్‌లోకి వెళ్లకూడదు. కవాటం దెబ్బతిని పూర్తిగా మూసుకుపోవడం వల్ల ఎడమ వెంట్రికల్‌ నుంచి రక్తం తిరిగి ఎడమ ఆరికల్‌లోకి వెళ్తుంది. ఈ స్థితిని మైట్రల్‌ రిగర్జిటేషన్‌, ఇది తీవ్రత దశలో ఉన్నపుడు శస్త్ర చికిత్స జరిపి కృత్రిమ కవాటాన్ని అమర్చాలి. కవాటం తీవ్రంగా ఇరుకుగా ఉన్నపుడు శస్తచ్రికిత్స ద్వారా కృత్రిమ కవాటంతో ఆ కవాట మార్పిడి చేయాలి.

కవాట వ్యాధుల్ని తొలిదశలోనే కనుక్కొని కావాల్సిన చికిత్స అందేలా చూడాలి. ఎడమ వెంట్రికల్‌ నుంచి బయటకు వచ్చే దారిలో అయోర్డికా వాల్వు ఉంటుంది. ఇది కూడా మూసుకపోవచ్చు. లేదా లీక్‌ కావచ్చు. దీనిని కూడా జబ్బు ఎక్కువగా ఉన్నపుడు ఓపెన్‌ హార్డ్‌ సర్జరీ ద్వారా మార్చాల్సివస్తుంది. మెడియన్‌ స్టెర్నొటమి శస్త్ర చికిత్సలో కవాటాలు మారుస్తారు. గుండె తెరుస్తారు కాబాట్టి కార్డియో పల్మొనరి బైపాస్‌ మిషన్‌ మీద ఉంచి ఈ శస్త్ర చికిత్సను చేయాల్సి ఉంటుంది. కవాట మార్పిడి చేసినపుడు ఈ కృత్రిమ గుండె ఊపిరితిత్తుల మిద ఉన్నపుడు వైద్యుడు రోగి దెబ్బతిన్న కవాటాన్ని పెడతారు. కవాటాన్ని పెట్టగానే గుండెను మూసివేస్తారు. అప్పడు హార్డ్‌లండ్‌ మెష్‌ని తీసివేస్తారు. కొత్త కవాట పనితీరును పరీక్షించడానికి, పర్యవేక్షించాడానికి ట్రాన్స్‌ ఈ సోపాగల్‌ ఎకోకార్డియోగ్రామ్‌ చేస్తారు. శస్త్ర చికిత్స తరువాత ఛాతి, ఫెరికార్డియల్‌ ప్రాంతాల నుంచి ద్రావకాన్ని తీసివేయాడానికి డ్రైనేజ్‌ ట్యూబ్స్‌ని అమరుస్తారు.

36 గంటల మళ్లీ వాటిని తీసివేస్తారు. వాల్వ్‌ మార్పిడి జరిగిన తరువాత రొగి 12 నుంచి 36 గంటల పాటు కార్డియో థోరాసిక్‌ ఇండెన్సిస్‌ కేర్‌లో ఉంచుతారు. 4 నుంచి 3 నెలలలోపు ఈ కవాట మార్పిడితో పూర్తిగా కోలుకుంటారు. ఈ శస్త్ర చికిత్స జరిగిన 6 వారాల నుంచి 8 నెలల వరకు బరువు ఎత్తకూడదు. ఎందుకంటే ఛాతి ఎముకలు సరిగ్గా అతుక్కోవాలి.

కృత్రిమ కవాటాలు
కృత్రిమ కవాటాలు ప్రధానంగా రెండు రకాలు మెకానికల్‌ వాల్వ్‌లు. టిష్యూవాల్వ్‌లు. టిష్యూవాల్వ్‌లు జంతువుల కణాల నుంచిగానీ, జంతువుల గుండె కవాటాలు లేక జంతువుల పెరికార్డియల్‌ టిష్యూ నుంచి తయారు చేస్తారు. ఈ కణాజాలాలకి కాల్సిఫికేషన్‌ ఏర్పకుండా, రిజెక్షన్‌ కాకుండా ట్రీట్‌ చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మనుషుల ఆయోర్డిక్‌ కవాటాన్నే మార్పిడి చేస్తారు. వీటిని హుమోగ్రఫ్‌ అంటారు. టిష్యూ కవాటాలతో సమంగా హోమోగ్రాఫ్ట్‌ కవాటాలు తోడ్పడుతాయి. అయోర్డిక్‌ కవాటాన్ని మార్చడానికి రాస్‌ ప్రాసీజర్‌ లేక పల్మోనరి ఆటోగ్రాప్ట్‌ చేస్తారు. మెకానికల్‌ కవాటాలు ఎక్కువగా కాలం ఉంటాయి. మెకానికల్‌ కవాటాలు అమర్చిన వాళ్లకు రక్తం గడ్డ కట్టకుండా మందులు ఇస్తారు. టిష్యూ కవాలాలైతే 10 నుంచి 20 సంవత్సరాల వరకు వాళ్లకు మాత్రమే ఉంటాయి. పెద్దవయస్సు వాళ్లకైతే టిష్యూ కవాటాలు, చిన్న వయస్సు వాళ్లకు మెకానికల్‌ కవాటాలు మంచిది.

Courtesy with : డా.. ఆళ్లగోపాలకృష్ణ గోఖలే, కార్డియోథొరాసిక్‌ సర్జన్‌, హైదరాబాద్‌

  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Liver problems awareness-కాలేయ సమస్యల అవగాహన


Friday, August 16, 2013

Caligynephobia - అందమైన స్త్రీల భయం ,క్యాలిగైనీఫోబియా

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Caligynephobia - అందమైన స్త్రీల భయం ,క్యాలిగైనీఫోబియా-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఎక్కువమంది మగవారు  ఈ ''అందమైన స్త్రీల ఫియర్'' గురించి తెలిసిన వారు ఉండకపోవచ్చును  కానీ ఎప్పుడూ అందంగా ఉండే మహిళల చూసి భయపడుతుంటారు . "నిరంతర, అసాధారణ, మరియు అసమంజసమైన భయము" గా నిర్వచించారు, ప్రతి సంవత్సరం ఈ ఆశ్చర్యకరమైన  సాధారణ భయం లెక్కలేనన్ని ప్రజలకు  అనవసర ఒత్తిడిని కలిగిస్తుంది. Caligynephobia, Venustraphobia, మరియు అత్యంత సాధారణంగా అందమైన మహిళలు భయం -అని పులువబడే ఇది  - తరచుగా గణనీయంగా నాణ్యత ప్రభావితం చేసే సమస్య గా తేలినది  . ఇది పానిక్ దాడుల గా వస్తూ ... ప్రియమైన వారిని మరియు వ్యాపార అసోసియేట్స్ నుండి దూరముగా ఉంచుతుంది , లేదా ఆ వాతావరణాన్ని కలుగజేస్తుంది ..

 caligynephobia వివిధ లక్షణాలు కలిగి ఉన్నాయి... శ్వాస తగ్గిపోవడం, వేగంగా శ్వాస తీసుకోవటం, క్రమం లేని హృదయ స్పందన, చెమట పట్టుట, వికారం, మరియు భయం యొక్క మొత్తం భావాలు ఉంటాయి. దీని వల్ల ఆర్ధిక లాబాలు , వ్యాపార సంబంధాలు  భయం తో  పూర్తిగా దృష్టి పెట్టలేక  అవకాశాలు కోల్పోతారు. పేలవమైన ప్రదర్శన లేదా బిడియం  ద్వారా  ప్రమోషన్లు, మిస్ అవుతారు . లక్షణాలు  ఒక్కొకరికీ ఒక్కోవిధము గా  వారి సొంత మార్గంలో లేదా వేరే విధముగా కనిపించును .

Formal Definition
CALIGYNEPHOBIA: (caligynephobia, venustraphobia, and fear of beautiful women)
1: caligynephobia: a persistent, abnormal, and unwarranted fear of beautiful women, despite conscious understanding by the phobic individual and reassurance by others that there is no danger. 2: caligynephobia: an extreme unwarranted fear and/or physical aversion to beautiful women.

Treatment : 

దీనికి మందుల రూపము లో వైద్యము లేదు . కౌన్సలింగ్ ద్వారా పేసెంట్ ని ఆ భయము గురించి అవగాహన కలుగజేయాలి.

ఎక్ష్ఫోజర్ థెరఫీ ద్వారా ఈ భయమున్న వార్ని .........అందము గురించి , అందముగా ఉన్న వారి గురించి బయపడనవసరములేదని .. వారు మామూలు మనుసులేఅని పదేపదే మానసికము గా ఇన్‌పుట్ చేయాలి.సమాజములో కొంతమందితో మాట్లాడె ఏర్పాటు చేస్తూ ఉండాలి.
పనిచేసే చోట కలిసి మెలసి ఉండే ఏర్పాటు చేస్తే కొంతవరకు ఈ వ్యాధి నుండి బయటపడతారు.
మందులు విషయానికొస్తే : వాడకపోవడమే మంచిది. మానసిక వైద్యనిపుణులు మూడు రకాల మందులు వాడడము గమనించాను .

1. బీటా బ్లోకర్స్ --
Beta blockers

Beta blockers are used for relieving performance anxiety. They work by blocking the flow of adrenaline that occurs when you’re anxious. While beta blockers don’t affect the emotional symptoms of anxiety, they can control physical symptoms such as shaking hands or voice, sweating, and rapid heartbeat.

2.Antidepressants

Antidepressants can be helpful when the feelings of fear are severe and debilitating. Three specific antidepressants — Paxil, Effexor, and Zoloft — have been approved by the U.S. Food and Drug Administration phobias.

3.Benzodiazepines

Benzodiazepines are fast-acting anti-anxiety medications. However, they are sedating and addictive, so they are typically prescribed only when other medications have not worked.



  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, August 9, 2013

Heart diseases in woman,స్త్రీలలో గుండెజబ్బులు




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Heart diseases in woman,స్త్రీలలో గుండెజబ్బులు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పురుషులతో పోలిస్తే స్త్రీలకు గుండెజబ్బుల ముప్పు తక్కువ. ఇందుకు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ దోహదం చేస్తున్నట్టు వైద్యులు చాలాకాలంగా నమ్ముతున్నారు. కానీ ఆహార, విహారాదుల వంటి జీవనశైలి మార్పుల మూలంగా స్త్రీలల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ మోతాదులు తగ్గుతున్నట్టు ఒక గణనలో వెల్లడైంది. దీంతో గుండెజబ్బుల నుంచి స్త్రీలకు సహజసిద్ధంగా లభించిన రక్షణ కూడా తొలగిపోతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత ఐదేళ్లలో మహిళల్లో గుండెజబ్బులు 16-20% వరకు పెరగటమే దీనికి నిదర్శనం. ముఖ్యంగా 20-40 ఏళ్ల స్త్రీలల్లో గుండెజబ్బులు 10-15% ఎక్కువగా కనబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. జీవనశైలి మార్పుల మూలంగా ఒత్తిడి, వూబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటివీ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ గుండెజబ్బు ముప్పు కారకాలే కావటం గమనార్హం. గణనీయంగా ముప్పు పొంచి ఉంటున్నప్పటికీ.. స్త్రీలకు గుండెజబ్బులపై అవగాహన లేకపోవటం, సకాలంలో చికిత్స తీసుకోకపోవటం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది కూడా. గుండెజబ్బుల మూలంగా మహిళలు మరణించటానికి చాలావరకు ఆలస్యంగా గుర్తించటమే దోహదం చేస్తోంది. ''గుండెజబ్బు లక్షణాలను స్త్రీలు పెద్దగా పట్టించుకోరు. నిపుణులను సంప్రదించటం అరుదు. ఒకవేళ చికిత్స తీసుకున్నా లక్షణాలు తగ్గిపోగానే ఆపేస్తుంటారు. దీర్ఘకాలం మందులు వాడేవారు చాలా తక్కువ'' అని వైద్యులు వివరిస్తున్నారు. మిగతావారితో పోలిస్తే ఉద్యోగం చేసే మహిళల్లో గుండెజబ్బులపై అవగాహన కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ వీరిలో గుండెజబ్బుల బారినపడుతున్నవారి సంఖ్యా పెరుగుతోందని చెబుతున్నారు. ఉద్యోగినులు ఇటు ఇల్లు అటు ఆఫీసు బాధ్యతల మధ్య సమన్వయం కుదరక తరచుగా ఒత్తిడికి గురవుతుంటారు. ఇది గుండెజబ్బులకే కాదు మధుమేహం వంటి రకరకాల సమస్యలకూ దారితీస్తుంది. మనదేశంలో మధుమేహులు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మున్ముందు గుండెజబ్బుల బారినపడే మహిళల సంఖ్య 17% మేరకు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Autism-ఆటిజం

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Autism-ఆటిజం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  
 
ఇన్నాళ్లుగా పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకుంటున్న 'ఆటిజం' ఇప్పుడు మన దేశంలోనూ ఎక్కువగానే ఉందని అర్థమవుతోంది. అందుకు రోజురోజుకూ పిల్లల మానసిక వైద్యుల వద్దకు వస్తున్న కేసుల సంఖ్యే తార్కాణం. ఆటిజం.. ఒకటే రుగ్మత కాదు. ఇదో చట్రం! దీనిలో ఎన్నో ఛాయలు.. ఎన్నో స్థాయులు.. మరెన్నో భేదాలు! అందరూ ఒకేలా అనిపించకపోవచ్చు. అందరిలోనూ ఒకే లక్షణాలుండకపోవచ్చు. కానీ ముందుగానే దీన్ని ఆనవాళ్లు పట్టుకుంటే.. దీన్ని అధిగమించటం.. ఈ చట్రాన్ని దాటటం మరీ అసంభవమేం కాకపోవచ్చు. అందుకే తల్లిదండ్రుల్లో 'ఆటిజం'పై అవగాహన పెంచేందుకు సమగ్ర వివరాలను మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ!

మెడ నిలపటం, పాకటం, తప్పటడుగులు, అత్తతాతలు.. పిల్లల ఎదుగుదల క్రమంలో ప్రతిదీ ఒక పండగే. వీటిలో ఏదైనా తేడా వచ్చినప్పుడు తల్లిదండ్రులు తేలికగానే గుర్తుపడతారు.. వెంటనే దృష్టిసారిస్తారు కూడా. కానీ ఈ గడపలన్నీ దాటి.. ప్రయాణం బాగానే సాగుతోందనుకుంటున్న తరుణంలో కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు. వీటిని గుర్తించటం అంత తేలిక కాదు. వాటిని పట్టుకోవటానికి కాస్త అవగాహన అవసరం. ఇలాంటి సమస్యల్లో ముఖ్యమైనదీ.. ఇప్పటి వరకూ పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకుంటున్నదీ... సంపన్న వర్గాల్లోనే ఎక్కువ అనుకుంటున్నదీ.. మన దేశంలోనూ, అన్ని వర్గాల్లోనూ ఎక్కువేనని ఇప్పుడిప్పుడే స్పష్టంగా బయటపడుతున్నదీ... ఆటిజం!

'ఆటిజం' భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగల సమస్య. దీన్నే 'పర్వేసివ్‌ డెవలప్‌మెంటల్‌ డిసార్డర్స్‌' అంటారు. వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనబడతాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది. ముఖ్యంగా మూడు అంశాలను ప్రత్యేకంగా గమనించొచ్చు.

* ఇతరులతో కలవలేకపోతుండటం: ఆటిజమ్‌ పిల్లలు తోటి పిల్లలతో ఆడుకోవటానికి అంతగా ఇష్టపడరు. ఒంటరిగా ఆడుకోవటం, ఒంటరిగా గడపటం ఎక్కువ.

* భావవ్యక్తీకరణ లోపం: మాటలు రావటం జాప్యం కావచ్చు. వచ్చినా పూర్తిస్థాయిలో ఉండకపోవచ్చు. తమ అవసరాలను తీర్చుకునేందుకు వేలుపట్టుకుని అక్కడి వరకూ తీసుకువెళ్లటం వంటివి చేస్తుంటారు.

* ప్రవర్తన లోపాలు: చేసిందే మళ్లీ మళ్లీ చేస్తుండటం, ఒకపనిని ఎప్పుడు చేసినా తిరిగి అలాగే చెయ్యాలని ప్రయత్నిస్తుండటం (అబ్‌సెషన్‌ ఆఫ్‌ సేమ్‌నెస్‌). రోజూ తాము వాడే టాయ్‌లెట్‌నే వాడతామంటారు. రెండోదానిలోకి వెళ్లనని మొరాయిస్తుంటారు. కొందరు సంతోషం కలిగితే చేతులను కాళ్లను పైకీ కిందికీ అదేపనిగా ఆడిస్తారు. మరి కొందరు సూదులు, గుండుపిన్నుల వంటి ఒకే రకం వస్తువులను సేకరిస్తుంటారు..... ఆటిజమ్‌ పిల్లల్లో సాధారణంగా ఈ మూడు లక్షణాలూ ఉంటాయి. కొందరిలో ఒకట్రెండు మాత్రమే ఎక్కువగా కనబడినా అన్ని లక్షణాలూ ఏదో ఒక స్థాయిలో కనబడతాయి. అమెరికా 'డయాగ్నోస్టిక్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ మాన్యువల్‌ (డీఎస్‌ఎం)'లో దీన్ని 'పర్వేసివ్‌ డెవలప్‌మెంటల్‌ డిజార్డర్‌' కింద దీన్ని వర్గీకరించారు. ఈ లక్షణాలు ఆరంభమైన సమయం, తీవ్రత, క్షీణిస్తున్న తీరు తదితర అంశాలను బట్టి దీన్ని ప్రధానంగా 5 రకాలుగా విభజించారు.

* ఆటిస్టిక్‌ డిజార్డర్‌: ఎక్కువగా కనబడే ఆటిజం సమస్య ఇదే. దీన్ని 'చైల్డ్‌హుడ్‌ ఆటిజమ్‌' అంటారు. ఇది ఆడ పిల్లల్లో కన్నా మగపిల్లల్లో ఎక్కువ. మున్ముందు వివరంగా చూద్దాం.

* రట్స్‌ డిజార్డర్‌: అరుదైన ఈ రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. దీని ప్రత్యేకతేమంటే.. పుట్టిన ఏడాది వరకూ పిల్లలు బాగానే ఉంటారుగానీ తర్వాత లక్షణాలు కనబడటం మొదలవుతుంది. ఇవి రెండు మూడేళ్లలోనే వేగంగా తీవ్రమవుతాయి. అప్పటికి వచ్చిన ఒకట్రెండు మాటలు కూడా తిరిగి వెనక్కి వెళ్లిపోతాయి. ఇది ముదిరే రకం (ప్రోగ్రెసివ్‌ డిజార్డర్‌) కావటం వల్ల కొంతకాలానికి నాడీ సంబంధ సమస్యలూ ఆరంభమవుతాయి. సరిగా నడుము నిలపలేకపోతుండటం వంటివాటితో మొదలై మెల్లగా 'ఫిట్స్‌' కూడా వస్తాయి. సాధారణంగా వయసుతో పాటు పెరగాల్సిన తల వీరిలో చిన్నదవుతుంటుంది. చొంగ కారటం, చేతులుకాళ్లు ఒకే రకంగా ఆడిస్తుండటం, చేతులతో చప్పుళ్లు చేయటం వంటివి కనబడతాయి. యుక్తవయసుకు ముందే సమస్యలు బాగా ముదిరి వీరు బతికిబట్టకట్టటం కూడా కష్టమవుతుంటుంది.

* ఆస్పర్జెర్స్‌ డిజార్డర్‌: ఇది మగ పిల్లల్లో ఎక్కువ. సాధారణంగా ఆటిజమ్‌ పిల్లల్లో మాటలు ఆలస్యంగా వస్తుంటాయి. కానీ ఈ రకంలో మాటలు మామూలుగానే ఉంటాయి. నలుగురిలోకి వెళ్లటం, తెలివి తేటలు కూడా బాగానే ఉంటాయి. కానీ తక్కువగా మాట్లాడతారు. అడిగిన దానికి సమాధానం చెప్పేసి ఆపేస్తారు. శరీరాకృతి భిన్నంగా ఉంటుంది. పొడుగ్గా ఉంటారు. పొడవైన ముఖంతో పాటు చెవులూ భిన్నంగా ఉంటాయి. మిగతా ఆటిజమ్‌ పిల్లలతో పోలిస్తే ఇతరులతో బాగానే కలుస్తారు కాబట్టి వీరిలో భాషా నైపుణ్యాలు కాస్త ఎక్కువగానే అలవడతాయి. కొంతవరకూ బాగానే చదువుతారు. కొన్ని పనుల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అందువల్ల ఆయా అంశాల్లో నైపుణ్యం సాధిస్తారు. అందువల్ల మిగతా ఆటిజమ్‌ పిల్లలతో పోలిస్తే కాస్త మెరుగ్గా (వెల్‌ ఫంక్షనింగ్‌ ఆటిజమ్‌) ఉంటారు. కానీ వీరిలో ప్రవర్తనా సమస్యలు అధికం. కోపోద్రేకాల వంటివి ఎక్కువ.

* చైల్డ్‌హుడ్‌ డిసింటిగ్రేటెడ్‌ డిజార్డర్‌: ఇది ఆటిజమ్‌లో తీవ్రమైన సమస్య. వీళ్లు పుట్టినపుడు బాగానే ఉంటారు. ఒకటి రెండేళ్ల వరకూ ఎదుగుదల కూడా బాగానే ఉంటుంది. పాకటం, నిలబడటం, మాట్లాడటం అన్నీ మామూలుగానే వస్తాయి. ఆ తర్వాత ఎదుగుదల వెనక్కి మళ్లటం (రిగ్రెషన్‌) మొదలవుతుంది. అదీ చాలా వేగంగా. వీరిలో- ముఖం రఫ్‌గా, ముదరినట్టుండటం, తలకట్టు కిందికి ఉండటం, పొట్టిగా, లావుగా ఉండటం వంటివి కనబడతాయి. నాడీ సంబంధ లోపాలూ ఆరంభమై, ఫిట్స్‌ వచ్చి నెమ్మదిగా మంచానికే పరిమితమవుతారు, బతికి బట్టకట్టే అవకాశాలూ తగ్గుతాయి.

కాదు మాంద్యం
కొందరు పిల్లల్లో- ఎవరితోనూ కలవకపోవటం, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం.. వంటి భిన్న లక్షణాలను గమనించి.. 'లియో కానర్‌' అనే మానసిక విశ్లేషకుడు తొలిగా దీనికి 'ఆటిజం' అని పేరు పెట్టారు.

* బుద్ధిమాంద్యం ఉన్నవారూ ఇతరులతో కలవకుండా, తమ లోకంలో తాముంటారు కాబట్టి మొదట్లో దీన్ని అంతా 'బుద్ధిమాంద్యం'గానే భావించేవారు. కానీ 'ఆటిజమ్‌' పిల్లలు బుద్ధిమాంద్యం పిల్లల్లా స్తబ్ధుగా ఉండరు. హుషారుగా, పరిసరాలను గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ఇది బుద్ధిమాంద్యం కాదని గుర్తించారు. పైగా ఆటిజమ్‌ పిల్లలు కొన్నింట్లో చాలా చురుకుగా ఉంటారు. కొందరు ఏదైనా ఒకసారి దారిని చూస్తే మరచిపోరు. మరికొందరు అంకెలు, సంఖ్యలు టకటకా చెప్పేస్తారు. పద్యాలు, గేయాలను ఒకసారి వినగానే తిరిగి అప్పజెప్పేస్తారు. చుట్టుపక్కల పరిసరాలను అంతగా చూడనట్టు ప్రవర్తించినా వీరిలో కొన్ని అసాధారణ సామర్థ్యాలుంటాయి. దీన్నే 'సావంట్‌ స్కిల్స్‌' అంటారు. ఈ ప్రత్యేకతలన్నింటి దృష్ట్యా ఇది బుద్ధిమాంద్యం కాదని తేల్చారు. అయితే ఆటిజమ్‌ పిల్లలు పెద్దయ్యాక కొందరిలో బుద్ధిమాంద్యం లక్షణాలు కనిపించొచ్చు. ఇతరులతో కలివిడిగా ఉండకపోవటం, నేర్చుకోకపోవటం వంటివి దీనికి దారితీయొచ్చు.
కారణాలు
ఆటిజంకు ఇదమిత్థమైన కారణమిదీ అని చెప్పటం కష్టం. అందుకే దీనికి సంబంధించి రకరకాల సిద్ధాంతాలు, భావనలు విస్తృతంగా ఉన్నాయి.

* కొందరికి మెదడు లోపాలుంటాయి. ఈ పిల్లల్లో బుద్ధిమాంద్యంతో పాటు ఫిట్స్‌, ఇతరత్రా వ్యాధులు కూడా కనబడుతుంటాయి. మెదడు ఎదుగుదలకు తోడ్పడే కొన్ని జన్యువులు, క్రోమోజోములు కూడా ఆటిజంకు దోహదం చేస్తున్నట్టు భావిస్తున్నారు. మెదడులో సెరటోనిన్‌, డోపమిన్‌ వంటి రసాయన మార్పులు కూడా సమస్యకు మూలం కావొచ్చనీ, అలాగే గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి ఏవైనా వైరల్‌ ఇన్ఫెక్షన్ల బారినపడినా, లేదా కాన్పు సమయంలో బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందకపోవటం వంటి సమస్యలు తలెత్తినా ఆటిజం బారిన పడచ్చని భావిస్తున్నారు.

* తల్లి ఆప్యాయంగా చూసుకోకపోవటం, దగ్గరకు తీసుకోకపోవటం వల్ల పిల్లలకు ప్రేమ తెలియక, ఒంటరితనానికి దారి తీస్తుందని అనుకునేవారు. కానీ ప్రేమగా చూసుకునే వారి పిల్లలూ ఆటిజమ్‌ బారినపడుతున్నట్టు గుర్తించి దీన్ని కారణంగా చూడటం లేదు. ఈ మధ్యకాలంలో గుర్తిస్తున్న మరో అంశమేమంటే సాఫ్ట్‌వేర్‌ వంటి కొన్ని వృత్తుల్లోని తల్లులకు పుట్టే బిడ్డల్లో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుండటం! దీనికి సంబంధించి ఇదమిత్థమైన గణాంకాలుగానీ, కారణాలుగానీ లేవు. కొన్ని వృత్తుల్లోనివారు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోవటం, పని గంటలు అస్తవ్యస్తంగా ఉండటం, పరిసరాల నుంచి సరైన ప్రేరణ లేకపోవటం, రేడియేషన్‌ ప్రభావం వంటివి కారణాలు కావచ్చు. మొత్తానికి ఆటిజంపై చాలా రకాల ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు అందుబాటులోకి వస్తున్నాయిగానీ ఇవేవీ కూడా పూర్తిగా నిరూపణ అయినవి కావు.

గుర్తించేదెలా?
మరీ చిన్నవయసులో..
* అకారణంగా నిరంతరంగా ఏడ్వటం
* గంటల తరబడి స్తబ్ధుగా ఉండటం
* తల్లి దగ్గరకు తీసుకుంటున్నా పెద్దగా స్పందించకపోవటం
* పరిచిత వ్యక్తులను చూడగానే నవ్వక పోవటం
* తల్లిదండ్రులు రమ్మని చేతులు చాచగానే.. ఉత్సాహంగా ముందుకు రావాల్సిన పిల్లల్లో అలాంటి స్పందనలేవీ కనిపించకపోవటం

కాస్త పెద్దవయసులో..
* మిగతా పిల్లలతో కలవకపోవటం
* పిలిస్తే పలకకపోతుండటం
* పెరిగే కొద్దీ ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుండటం
* మనుషుల కంటే బొమ్మలు, వస్తువుల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండటం
* ఎవరైనా పలకరించినా వెంటనే సమాధానం ఇవ్వకపోవటం
* కళ్లలో కళ్లు పెట్టి చూడకపోతుండటం
* ముఖంలో భావోద్వేగాలేవీ చూపించకపోతుండటం
* మాటలు సరిగా రాకపోతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం
* గుంపులో ఉన్నా మిగతా పిల్లలతో కలివిడిగా ఉండలేకపోతుండటం, తమ బొమ్మలు తాము పెట్టుకు ఆడుకుంటుండటం
* ఎదుటి వారికి దెబ్బలు, గాయాల వంటివి తగిలినా పట్టనట్టుగా ఉండిపోతుండటం, వెంటనే స్పందించకపోతుండటం
* తమకు దెబ్బలు తగిలినా నొప్పి, బాధ పట్టనట్టు ఉండిపోవటం
* నడక మొదలుపెట్టినప్పుడు మునివేళ్ల మీద నడుస్తుండటం
* వయసుకు తగినట్లు భాషా పాటవం వృద్ధి చెందకపోవటం
* పలకరించినా రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోవటం, సంభాషణను కొనసాగించే శక్తి కొరవడటం
* 'నేను - నువ్వు' అన్న తారతమ్యం తెలియకపోవటం. ఉదాహరణకు 'నీకు పాలు కావాలా' అని అడిగితే.. 'నీకు పాలు కావాలా' అంటుండటం
* ఎదుటి వారు అన్న మాటనే తాము మళ్లీ అనటం. ఉదాహరణకు 'నీ పేరేమిటి?' అని అడిగితే సమాధానం చెప్పటానికి బదులు తను కూడా 'నీ పేరేమిటి?' అనటం. (ఎకోలాలియా)
* మనం ఎప్పుడో అడిగిన ప్రశ్నకు.. వెంటనే స్పందించకుండా.. తర్వాత ఎప్పుడో మళ్లీ అదే ప్రశ్నను అడుగుతుండటం
* మనసు ఎక్కడో లగ్నమై ఉండటంతో కొన్నిసార్లు అసందర్భంగా మాట్లాడుతుండటం.
* ఏదైనా ఒక వస్తువు లేదా బొమ్మ పట్ల విపరీతమైన వ్యామోహం పెంచుకోవటం. ఎప్పుడూ యావంతా దాని మీదే ఉండటం, దాన్ని తీసేస్తే విపరీతంగా కోపం రావటం
* చేతులు, కాళ్లు లేదా వేళ్లు కాస్త అసహజంగా ఒకే తీరులో కదలిస్తుండటం
* వీటితో పాటు ప్రవర్తనాపరమైన సమస్యలు కూడా కనబడుతుంటాయి. ముఖ్యంగా అడిగినవి ఇవ్వకపోతే అరవటం, గట్టిగా గీపెట్టటం మొ||
* కొంతమందిలో ప్రతి దానికీ భయపడటం. గాలికి తీగలాంటిదేదన్నా
గుతున్నా కూడా భయపడిపోవటం, చీమలాంటిది కనబడినా భయపడటం, చిన్న చిన్న శబ్దాలకు కూడా గట్టిగా చెవులు మూసుకోవటం, శబ్దాలు భరించలేకపోవటం వంటి భావోద్వేగపరమైన అంశాలు కూడా ఉంటాయి.
* కొందరు విపరీతంగా చురుకుగా ఉంటుంటారు. ఎప్పుడూ కదులుతూ, అటూఇటూ తిరుగుతూ ఉండటం చాలామందిలో కనబడుతుంది.
* కొందరికి మేధస్సు సగటు స్థాయిలోనే ఉన్నా.. కొందరిలో మాత్రం కొన్నికొన్ని విషయాల్లో అపారమైన ప్రజ్ఞ కనబడుతుంటుంది.
* 30% మందిలో ఫిట్స్‌, మరికొన్ని రకాల మెదడు, నాడీ సంబంధ సమస్యలూ కనబడుతుంటాయి.
*  కొద్దిమందిలో మానసిక ఎదుగుదల కూడా కుంటుపడొచ్చు.

చికిత్స ఏమిటి?
సమస్య అందరిలో ఒకే తీరులో. ఒకే తీవ్రతలో ఉండదు. కారణాలూ స్పష్టంగా తెలీవు కాబట్టి దీనికి చికిత్స కూడా లక్షణాల ఆధారంగా ఉంటుంది. వైద్యులు 'ఆటిజం రేటింగ్‌ స్కేల్స్‌' ఆధారంగా పిల్లల ప్రవర్తన, లక్షణాలన్నింటినీ గమనిస్తారు. అవసరమైతే 'ఐక్యూ' పరీక్షలూ చేస్తారు. దీనిలో- మోస్తరు, మధ్యస్తం, తీవ్రం- స్థాయులు నిర్ధారించి దాన్ని బట్టి దీన్ని ఎలా ఎదుర్కొనాలన్నది నిర్ధారిస్తారు. సాధారణంగా ఆటిజం, ఆస్పర్జెస్‌ సిండ్రోమ్‌ వంటివి ఉన్నవారు వీటితో చాలా వరకూ మెరుగవుతారు.

మందులు (ఫార్మకలాజికల్‌ థెరపీ):
* ఫిట్స్‌, మెదడులో లోపాలు, ఉద్రేకపూరితమైన ప్రవర్తన వంటివి ఉంటే మూడేళ్లు దాటిన పిల్లలకు మందులు సిఫార్సు చేస్తారు. ముఖ్యంగా ఒకచోట కూర్చోకుండా, అస్సలు కుదురు లేకుండా నేర్చుకోవటంలో కూడా వెనకబడిపోతుండే 'హైపరాక్టివ్‌' పిల్లలకు 'ఏడీహెచ్‌డీ'కి ఇచ్చే మందులు ఇస్తుంటారు. చెప్పిందే చెప్పటం, ఏదైనా ఒక వస్తువునే పట్టుకుని వదలకపోతుండటం వంటి అబ్సెషన్స్‌ ఎక్కువగా ఉండే పిల్లలకు అవసరమైతే 'యాంటీ డిప్రసెంట్‌' మందులూ ఇవ్వాల్సి వస్తుంటుంది. ఉద్రేకాలు, ఉద్వేగాలు ఎక్కువగా ఉండి కొట్టుకోవటం, గిచ్చటం వంటివి చేస్తున్న వారికి యాంటీసైకోటిక్‌, ట్రాంక్విలైజర్‌ మందులు కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇవన్నీ ఆటిజంను తగ్గించేవి కాకపోయినా... పిల్లల్లో ఉండే లక్షణాలను, సమస్యలను అధిగమించేందుకు ఇవి గణనీయంగా దోహదం చేస్తాయి.

మానసిక స్థితిని చక్కదిద్దటం (సైకలాజికల్‌ ఇంటర్వెన్షన్‌)
ఆటిజం పిల్లలకు కీలకమైనది మానసిక స్థితిని చక్కదిద్దే శిక్షణే. తల్లిదండ్రులు దీన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం. చిన్నతనంలోనే ప్రేరణ (స్టిమ్యులేట్‌) ఇవ్వటం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అతిగా ఆశించకుండా అలాగని నిరాశలో కూరుకుపోకుండా చికిత్సలో భాగస్వాములు కావటం కీలకం.

* స్పీచ్‌ థెరపీ, లాంగ్వేజ్‌ స్టిమ్యులేషన్‌: ఒక పద్ధతి ప్రకారం ఉదయం నుంచీ రాత్రి వరకూ పిల్లలతో మాట్లాడుతుండటం, సంభాషణా సామర్థ్యం పెరిగేలా చూడటం అవసరం. దీనికి స్పీచ్‌థెరపీ దోహదం చేస్తుంది. కళ్లలో కళ్లు పెట్టి చూడటాన్ని అలవాటు చేసేందుకు శిక్షణ, అలాగే మలమూత్ర విసర్జన కోసం 'టాయ్‌లెట్‌ ట్రైనింగ్‌' వంటివన్నీ పద్ధతి ప్రకారం నేర్పిస్తారు. క్రమేపీ స్థాయులను పెంచుకుంటూ వెళతారు. దీంతో మెదడులో లోపం క్రమేపీ సర్దుకుంటుంటుంది.

* ప్రవర్తన చక్కదిద్దటం: ఆటిజం పిల్లలకు 'బిహేవియర్‌ మోడిఫికేషన్‌' కూడా ముఖ్యమే. పిల్లవాడికి ఏదైతే బాగా ఇష్టమో దాన్ని వెంటనే ఇవ్వకుండా.. మనం చెప్పిన పని చేస్తే అప్పుడు ఇవ్వటం, మంచి అలవాట్లు పాదుకునేలా చూడటం ముఖ్యం. వేరే పిల్లలతో గొడవలు పడటం వంటివి చేస్తుంటే సైకో థెరపీ వంటివీ ఇస్తారు.

* మరీ చిన్నపిల్లలకు 'సెన్సరీ ఇంటిగ్రేషన్‌ థెరపీ' ఇస్తారు. వీళ్లు కంటితో చూసి ఎక్కువ నేర్చుకోరు కాబట్టి ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా స్పర్శ, ధ్వని వంటి వాటి ద్వారా వారికి కావాల్సినవి నేర్పిస్తారు.

* ముఖ్యంగా వీరిలోని ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటికి మెరుగుపెట్టించటం ముఖ్యం. వీటిలో వీరు బాగా రాణిస్తారు. దీనికి ఆక్యుపేషనల్‌ థెరపీ, మ్యూజిక్‌ థెరపీ వంటివీ దోహదం చేస్తాయి.

ఫలితం..
* ముందే గుర్తించి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తే వీరు చదువుల్లో ముందుండటం వంటివి సాధిస్తారు. దీనివల్ల వీరు చాలా వరకూ సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుంది. ఇతరత్రా లోపాలేమీ లేకుండా మేధస్సు సాధారణ స్థాయిలో ఉండి, మాటలు-సంభాషణ బాగానే ఉన్న వారికి మొదటి నుంచీ చికిత్స ఇస్తే చాలా మెరుగయ్యే పరిస్థితి ఉంటుంది.

పథ్యం
ఆహారంలో పడని వస్తువుల వల్ల ఆటిజం తరహా మెదడు సమస్యలు వస్తున్నాయన్న వాదనా ఉంది. ముఖ్యంగా గోధుమల్లో ఉండే గ్లూటెన్‌ అనే ప్రోటీను, పాలలో ఉండే కెసీన్‌ అనేవి వీరికి అలర్జీ కలిగిస్తాయని భావించి.. వీరికి ఇవి లేకుండా ఆహారం ఇవ్వటం వల్ల ఉపయోగం ఉంటుందన్న వాదన ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్నే 'జీఎఫ్‌ సీఎఫ్‌' డైట్‌ అంటారు. అయితే దీన్ని కచ్చితంగా పాటించటం కష్టం. 2, 3 నెలల పాటు ఇలా ఇచ్చి చూసి ఫలితం ఉంటే కొనసాగించటం లేకపోతే సాధారణ ఆహారానికి మారటం మంచిది.

Courtesy with-Dr.A.Gowridevi -child pshychiatrist, shine hospital -Hyd.@eenadu sukibhava. 09-Aug-13
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, August 8, 2013

Breast feeding and Doubts-తల్లిపాల ఆరోగ్యం అపోహలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Breast feeding and Doubts-తల్లిపాల ఆరోగ్యం అపోహలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



ప్ర్రకృతి ప్రసా దించిన తల్లిపాల గురించి ఎటువంటి ఆలోచన లేకుండా ఇతర క్షీరదాలు తమ పిల్లలను తమ పాలతోనే పెంచుతున్నప్పటికీ మనుషుల్లో ఎన్నో సందేహాలు ఉండటం మానవజాతి పరిణామంలో ఒకవిచిత్ర దశ. ఈ రచయిత తల్లిపాల సంస్కృతి రక్షణలో చేసిన కృషి ఫలితంగా ప్రభుత్వరంగంలో చిత్తూరు జిల్లా కేంద్ర ఆసుపత్రి దేశంలో మొట్టమొదటి శిశుమైత్రి ఆసుపత్రిగా రూపుదిద్దుకుంది. దాదాపు 12 సంవత్సరాలు బ్రెస్ట్‌ఫీడింగ్‌ ప్రమోషన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియా మొదటి రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా పనిచేసిన అనుభవంతో తల్లులు అడిగే కొన్ని సాధారణ ప్రశ్నలకు ఈ వ్యాసం ద్వారా జవాబులు ఇవ్వడంలో ఉద్దేశం తల్లులను చైతన్యపరచడమే.

Q : ఈ మధ్యకాలంలో ఆరోగ్య కార్యకర్తలు అప్పుడేపుట్టిన శిశువుకు నీరు, గ్లూకోజు నీరు, తేనెలాంటి పదార్థాలు తాగించొద్దు అంటున్నారు. ఎందువల్ల?

తల్లిపాల ఉత్పత్తికి ప్రధానంగా చేయాల్సింది తల్లులు చిన్నా రులకు తరచుగా పాలుపట్టడం. పాల ఉత్పత్తి పాలు తాగడం మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడే పుట్టిన శిశువుకు చాలామంది నీరుగానీ, గ్లూకోజునీరుగానీ, చక్కెరగానీ, తేనెగానీ రకరకాల పదార్థాలు తాగిస్తుంటారు. వీటివల్ల కడుపు నిండి శిశువుపాలు తాగే ప్రయత్నం చేయదు. పాల ఉత్పత్తి ప్రక్రియ జరగదు. అంతేగాక వీటి ద్వారా చిన్నారులు సూక్ష్మజీవుల బారినపడే ప్రమాదముంది. చిన్నారుల రక్షణకు ఉపయోగపడే ముర్రుపాలు వారికి లభించవు.

Q : మూడురోజుల వరకు తల్లిపాలు పడవు. ఇటీవల ఆరోగ్య కార్యకర్తలు శిశువు పుట్టిన మొదటి గంట లోనే తల్లిపాలు పట్టాలంటున్నారు. అదెలా సాధ్యం?

కాన్పు అయిన ప్రతీస్త్రీ శిశువు పుట్టినప్పటి నుండే బిడ్డకు పాలుపట్టగలదు. ముందుగా వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. అవి పాపాయి ఆరోగ్య రక్షణకు ఎంతో అవసరం. తల్లిపాలు ఉత్పత్తి సరఫరా ప్రక్రియను ఇంగ్లీషులో 'టైలర్‌ మేడ్‌' అంటారు. ప్రకృతి శిశువులకు ఎప్పుడు ఏది అవసరమో అది తల్లుల ద్వారా అందించింది. మరో ఆలోచన అనవసరం. ప్రకృతి ఏర్పరచిన దారిలో నడవడం వివేకం.

Q : కొందరు పిల్లలు పాలుతాగిన వెంటనే వాంతి చేస్తారు. ఎందువల్ల? ఎలాంటి మందులు వాడాలి?

అలా చేసే దానిని 'వాంతి' అనకూడదు. పాలు తాగేటప్పుడు పిల్లలు పాలతో పాటు కొంతగాలి కూడా మింగుతుంటారు. కొందరు తల్లులు పిల్లల్ని ఎక్కు వగా కదిలిస్తారు. అందువల్ల తాగినపాలు బయటకి వస్తాయి. దీనిని వైద్యపరిభాషలో 'పొసెట్టింగ్‌' అంటారు. ఇది వాంతి వ్యాధి కాదు. ఈ సహజ చర్యకు ఎలాంటి మందులు వాడకూడదు. తల్లిపాలు పట్టిన తర్వాత భుజంపై పడుకోబెట్టుకుని, శిశువు వీపుపై తరచుగా చేతితో తట్టాలి. ఇందువల్ల మింగిన గాలి బయటకు వస్తుంది. పాలుపట్టిన తర్వాత శిశువులను ఎక్కువగా కదిలించరాదు.

Q : కొందరు చిన్నారులు ఊరకే ఎప్పుడూ ఏడు స్తుంటారు. తల్లిపాలు చాలనందువల్లా?

చిన్నారులలో ఏడుపునకు సవాలక్ష కారణాలు ఉన్నాయి. వాటిలో ఆకలి కూడా ఒకటి. తల్లిపాలు మాత్రమే తాగే పిల్లలు రోజుకు ఆరుసార్లకన్నా ఎక్కువ సార్లు మూత్రవిసర్జన చేస్తుంటే, సంతృప్తికరమైన పెరుగుదల ఉంటే చిన్నారులకు తల్లిపాలు సరిపోయినట్లే.

Q : చిన్నస్తనాలు ఉంటే పాలు తక్కువ ఉత్పత్తి అవుతాయి. చిన్న స్తనాలు ఉండేవారు పాల ఉత్పత్తికి ఏమి చేయాలి?

స్తనాల సైజు కొవ్వుపదార్థంపై ఆధారపడి ఉంటుంది. పాలు ఉత్పత్తి చేసే గ్రంథులు అందరిలో సమానమే. స్తనాల సైజుకూ, పాల ఉత్పత్తికీ ఎలాంటి సంబంధం లేదు.

Q : పాపాయికి పాలు పడితే స్తనాలు వదులై అమ్మల అందం తగ్గుతుందా?

ఇదో పెద్ద అపోహ. పవిత్రమైన మన తల్లుల ఆలోచనా విధానాన్ని సమాజం వక్రీకరించడం ఈ ఆలోచనకు కారణం. ఈ ఆలోచన మాతృత్వాన్ని, ప్రాకృత్రిక ధర్మాన్ని అవమానం చేసే ఆలోచన. నిజంగా మనం స్త్రీలు ఈ ఆలోచన చేయడంలేదు. వారు అలా అనుకుంటారని ఇతరులు అంటున్నారు. పాపాయికి పాలుపట్టడం ద్వారా అమ్మల అందం పెరుగుతుంది. పాలిచ్చే తల్లుల్లో కొవ్వుపదార్థం తగ్గుతుంది. పాలిచ్చే తల్లి మనస్సు నిర్మలంగా, చిన్నారిని గురించి భద్రతా భావంతో ఉంటుంది.

Q : పాలు బాగా పట్టాలంటే ఎలాంటి మందులు తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తినాలి?

పాల ఉత్పత్తిని పెంచే మందులు లేవు. ఆహారానికి పాల ఉత్పత్తికి ఎలాంటి సంబంధం లేదు. తల్లులు సాధారణంగా తినే ఆహారం తింటే చాలు. అయితే మాములు కన్నా ఎక్కువగా తినాలి.

Q : మాకు తల్లిపాలు పట్టడం ఎట్టి పరిస్థితుల్లో వీలుకాదు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి, పోతపాలు వాడతాం. విదేశాల నుంచైనా పాల పొడి తెప్పించుకుంటాం. మంచి పాలపొడి ఏమిటో చెప్పండి?

మీరు నిత్య జీవితంలో ప్రకృ తి ప్రసాదించిన చాలా ప్రాణరక్షక వస్తువులకు బదులు ఏమిటని ఆలోచించడం లేదు. ప్రకృతి ప్రసాదించిన నీరు, గాలికి మరో మార్గం ఆలోచించడం లేదు. అదే పద్ధతిలో తల్లిపాలకు బదులు ఏమిటని ఆలోచించకండి. మరో ముఖ్య విషయం తల్లిపాలకు సమానమైన పాలపొడులు, పోతపాలు విదేశాల్లో కూడాలేవు.

Q : తల్లిపాలు ఎప్పుడు మొదలుపెట్టాలి? ఎంతకాలం పట్టాలి?

బిడ్డ పుట్టిన మొదటిగంటలోనే తల్లిపాలు పట్ట డం మొదలుపెట్టాలి. బిడ్డకు ఆరునెలలు పూర్తి అయ్యే వరకు తల్లిపాలు మాత్రమే పట్టాలి. ఆరవనెల ఆఖరు వారంలో ఇంటిలో తయరుచేసిన అదనపు ఆహారం మొదలుపెట్టాలి. అదనపు ఆహారంతోపాటు కనీసం రెండేళ్లు తల్లిపాలు పట్టాలి. రెండేళ్ల తర్వాత తల్లీ-బిడ్డ లకు ఇష్టమైతే ఎంతకాలమైనా తల్లిపాలు పట్టవచ్చు.

Q : మీరెన్ని చెప్పినా, కొందరిలో తల్లిపాల ఉత్పత్తి అసలు ఉండదు?

తొందరపడవద్దు. తేలికపాటి నిర్ణయాలు తీసు కోకండి. ఈ తేలికపాటి నిర్ణయాలే ఇన్ని అనర్థాలకు కారణం. మీమాటే సత్యమైతే దాదాపు నాలుగు వేల పైబడి క్షీరజంతువులు మనేవి కావు. ఈ ప్రపంచంలో. సృష్టి చరిత్రలో మనుషుల్లో పోతపాల చరిత్ర దాదాపు 150, 200 సంవత్సరాలే. తల్లిపాల సంస్కృతి కోసం అంకితభావంతో కృషిచేసే ఆరోగ్యకార్యకర్తల, డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.

Courtesy with : డాక్టర్‌ ఆరవీటి రామయోగయ్య--ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ సోషల్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ హెల్త్‌, హైదరాబాద్‌@prajasakti news paper
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, August 7, 2013

Cyber knife Radio therapy-సైబర్‌నైఫ్‌ రెడియోథెరపి

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Cyber knife Radio therapy-సైబర్‌నైఫ్‌ రెడియోథెరపి - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


శరీరంలోని ఏ భాగంలోనైనా మిల్లీమీటర్‌ కంటే తక్కువ పరిమాణంలోని క్యాన్సర్‌ కణతికి కచ్చితమైన చికిత్స అందించే సైబర్‌నైఫ్‌ రొబొటిక్‌ రేడియో సర్జరీ అందుబాటులోకి వచ్చింది. నిలకడగా లేదా కదులుతున్న కణతులను గుర్తించి చికిత్స చేయడం దీని ప్రత్యేకత. క్యాన్సర్‌ కణతి చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినది ఈ సైబర్‌నైఫ్‌ రొబొటిక్‌ రేడియో సర్జరీ.

సైబర్‌ నైఫ్‌ అంటే రొబొటిక్‌ రేడియో సర్జరీకి రేడియో థెరపీ పరికరాలున్న విభాగం. దీని ద్వారా రేడియేషన్‌ ఆంకాలజిస్టులు శస్త్రచికిత్స అవసరం లేకుండా, నొప్పిలేని చికిత్సను అందిస్తారు. రొబొటిక్‌ పరికరం ఏ దిశలోనైనా, శరీరంలోని ఏ భాగంపైనైనా సూటిగా రేడియోధార్మిక కిరణాలను ప్రసరింపజేస్తుంది. ఈ వ్యవస్థ క్యాన్సర్‌ కణతి ప్రతీ కదలికను గుర్తిస్తుంది. అత్యంత శక్తివంతమైన రేడియోధార్మికత కిరణాలను క్యాన్సర్‌ కణతిపై ప్రసరింపజేస్తుంది. చట్టుపక్కలున్న అవయవాలకు హాని కలగకుండా కేవలం కణతిని మాత్రమే నాశనం చేస్తుంది. ప్రతీ కిరణం విడుదల చేసే ముందు కణతి స్థానాన్ని పరిశీలిస్తుంది. ఓపెన్‌ శస్త్రచికిత్సతో కోలుకోని వారికి కూడా ఈ చికిత్స విధానం సరైనది. క్యాన్సర్‌ కణతి చికిత్స పొందినా కూడా నయం కాని రోగులకు సైబర్‌నైఫ్‌ కొత్త ఆశలను కల్పిస్తుంది.

చికిత్స దశలు

తొలిమెట్టు : రోగి ఆసుపత్రికి వచ్చి వైద్యున్ని కలిశాక సైబర్‌నైఫ్‌ చికిత్స విధానాల గురించి వివరిస్తారు.

రెండో మెట్టు : రోగిని చికిత్సకు సిద్ధం చేస్తారు.

మెటల్‌ మార్కర్స్‌ అమరిక : చికిత్స కోసం సైబర్‌నైఫ్‌కువచ్చినప్పుడు కణతికి దగ్గరలో కొన్ని మెటల్‌ మార్కర్స్‌ అమరుస్తారు. దీని ద్వారా చికిత్స కాలంలో కణతుల స్థాయిని గమనించొచ్చు.

మాస్క్‌ తయారి : తల/మెడకు ఒక మాస్క్‌ తొడుగుతారు. ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ విధానం చాలా తేలికగా, నొప్పిలేకుండా ఉంటుంది.

మూడోమెట్టు : ఈ దశలో సిటి స్కాన్‌ ద్వారా ప్రతిబింబ రూపకల్పన చేస్తారు. స్కానింగ్‌లో కణతి పరిమాణం, ఆకారం, ప్రదేశం గురించి తెలుసుకోవచ్చు. అవసరమైతే ఎంఆర్‌ఐ, పిఇటి, సిటి లేదా యాంజియోగ్రఫి స్కానింగ్‌లు కూడా చేస్తారు.

నాలుగోమెట్టు : ప్రతిబింబం సైబర్‌నైఫ్‌ వర్క్‌స్టేషన్‌కు బదిలీ చేస్తారు. ఇక్కడున్న వైద్యుల బృందం (రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌, క్లినిషియన్‌, ఫిజిస్ట్‌, రేడియాలజిస్ట్‌) సాఫ్ట్‌వేర్‌ సహకారంతో చికిత్స ప్రణాళికను రూపొందిస్తుంది. ఈ ప్రణాళిక చాలా అవసరం. బృందం చికిత్స ప్రణాళికను తయారు చేస్తుంది.

ఐదో మెట్టు : ప్రణాళిక సిద్ధం అయిన వెంటనే సైబర్‌నైఫ్‌ చికిత్స మొదలవుతుంది. సైబర్‌నైఫ్‌ వ్యవస్థ కంప్యూటర్‌ ఆధీనంలోని రోబోట్‌ రోగి చుట్టూ పరిభ్రమిస్తుంది. కణతికి రేడియేషన్‌ను వెలువరించే దిశలో ఇది పరిభ్రమిస్తుంది.

స్కానింగ్‌ : కణతి పరిమాణాన్ని, దాని స్థానాన్ని తెలుసుకోవడానికి రోగికి సీిటి లేదా ఎంఆర్‌ఐ స్కానింగ్‌ పరీక్షలు చేస్తారు. సైబర్‌నైఫ్‌ చికిత్స ప్లానింగ్‌ సాఫ్ట్‌వేర్‌, చికిత్సలో భాగంగా చికిత్సకు ముందు తీసిన సిటిస్కాన్‌, ఇతర సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ప్లానింగ్‌ : స్కానింగ్‌ తర్వాత సమాచారాన్ని సైబర్‌నైఫ్‌ సిస్టంకు చెందిన 'ట్రీట్‌మెంట్‌ ప్లానింగ్‌ వర్క్‌స్టేషన్‌'కు డిజిటల్‌ రూపంలో అందిస్తారు. అక్కడ వైద్యులు కణతి పరిమాణాన్ని, ప్రదేశాన్ని కనుక్కుంటారు. వైద్య నిపుణులు ట్యూమర్‌ ప్రదేశానికి తగినంత మోతాదులో రేడియేషన్‌ను పంపడానికి సైబర్‌నైఫ్‌ సాఫ్ట్‌వేర్‌ సహకారంతో ప్రణాళికతో రూపొందిస్తారు. చికిత్సా ప్రణాళికలో భాగంగా సైబర్‌నైఫ్‌ సిస్టం ఆటోమెటిక్‌గా రేడియోధార్మిక కిరణాల సంఖ్యను, వాటిని పంపించే సమయాన్ని బట్టి, వాటిని పంపాల్సిన కోణాలను సూచిస్తుంది.

చికిత్స : రోగి చికిత్స బల్లపై సుఖంగా పడుకుంటారు. నొప్పి ఉండదు. అందువల్ల మత్తుమందు ఇవ్వరు. సుమారు 100 నుండి 200 రేడియోధార్మిక కిరణాలు ఒక్కొక్కటి 10 నుంచి 15 సెకన్ల వ్యవధిలో వివిధ దిశల నుంచి 30 నుంచి 90 నిమిషాలలో శరీరంలోకి పంపిస్తారు. ప్రతీ రేడియోధార్మిక కిరణాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు సైబర్‌నైఫ్‌ వ్యవస్థ రెండు ఎక్స్‌-రే ప్రతిబింబాలను తీసుకుంటుంది. వాటిని ప్లానింగ్‌ వ్యవస్థ నుంచి వచ్చిన డిఆర్‌ఆర్‌తో పోల్చిచూస్తుంది.

సైబర్‌ వ్యవస్థ : సబ్‌మిల్లీమీటర్‌ విస్తీర్ణతతో శరీరంలోని ఏ భాగంలోని క్యాన్సర్‌ కణతిని నయం చేయడానికి కంప్యూటర్‌ నియంత్రణ గల రొబొటిక్స్‌తో కూడిన ప్రతిబింబ ఆధారిత లీనియర్‌ యాక్సిలేటర్‌ మిశ్రమం సైబర్‌ నైఫ్‌. ఇది లీనియర్‌ యాక్సిలేటర్‌ 6ఎంవి శక్తితో కూడిన ఫోటాన్‌ కిరణాలను ప్రసరింపజేస్తుంది. రోబోటిక్‌ పరికరం స్వేచ్ఛగా తిరగడానికి వీలుగా తేలికైన లినాక్‌ హెడ్‌ అమర్చబడి ఉంటుంది. రొబొట్‌ విడుదల చేసే ప్రతి కిరణం నుండి 12 విభిన్న కిరణాలు వెలువడుతాయి. స్కల్‌ ట్రాకింగ్‌ (ఇన్‌ట్రా క్రానికల్‌ గాయాలకు ఉపయోగపడుతుంది), ఫిడుషియల్స్‌ ట్రాకింగ్‌ (మృదువైన కణజాలాల గాయాలకు), సింక్రోనీ ట్రాకింగ్‌ (శ్వాస సంబంధ గాయాలకు), స్పైన్‌ ట్రాకింగ్‌ (వెన్నుపాము సంబంధ గాయాలకు), లంగ్‌ ట్రాకింగ్‌ (ఊపిరితిత్తుల గాయాలకు) అనే ఐదు ప్రతిబింబాలతో కూడిన ట్రాకింగ్‌లను చికిత్సలో సైబర్‌నైఫ్‌ ఉపయోగిస్తుంది. కెవి ఎక్స్‌రే కిరణాల ద్వారా ఈ ప్రతిబింబాలు రూపొందుతాయి. ఈ కిరణాలు 45 డిగ్రీల కోణంలో అమర్చిన రెండు డయాగటిక్‌ ఎక్స్‌రే ట్యూబుల నుండి వెలువడుతాయి. రెండు డిటెక్టర్లు ఈ ప్రతిబింబాలను చిత్రిస్తాయి. వీటిని రిఫరెన్స్‌ ప్రతిబింబాలతో పోల్చుతుంది. ఆఫ్‌సెట్‌ విలువల స్థాయి నిర్ణీత పరిధిలో ఉండే వరకు సిస్టం ట్రీట్‌మెంట్‌ను అనుమతించదు. రొబొట్‌ సబ్‌మిల్లీమీటర్‌ పరిధితో ఆఫ్‌సెట్‌ను తిరిగి అదే స్థానంలో ఉంచుతుంది. ఇదంతా ప్రతి కిరణం వెలువడే ముందే జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ వ్యవస్థా రూపొందించని ప్రతిబింబాలను ఇది ఏర్పరుస్తుది. ఎక్స్‌రేతోపాటు, పలు కణతుల చికిత్సలో ఉపయోగపడే సిన్‌క్రోనీ మోషన్‌ ట్రాకింగ్‌ను కూడా అందిస్తుంది. కేవలం శ్వాస వ్యవస్థలోనే రేడియేషన్‌ను అందించే ఇతర వ్యవస్థల్లా కాక సైబర్‌నైఫ్‌ హృదయ కదలికలకు అనుగుణమైన రేడియేషన్‌ను అందిస్తుంది.

ప్రయోజనాలు : చుట్టుపక్కల భాగాలకు హాని కలగకుండా మోడ్రన్‌ రేడియేషన్‌ థెరపీ అధిక మోతాదులో రేడియేధార్మిక కిరణాలను వెలువరిస్తుంది. దీని వల్ల వ్యాధి ముదరకుండా తక్కువ సమయంలో తొందరగా వ్యాధిని నయం చేయొచ్చు. ఊపిరితిత్తులు, హృదయం, ప్లీహంలోని గాయాలకు తక్కువ వ్యవధిలో చికిత్స అందిస్తారు. కణతి రకాన్ని బట్టి ప్రతి చికిత్సా 30 నుంచి 90 నిమిషాల వ్యవధిలో పూర్తవుతుంది. చికిత్స తర్వాత రోగి ఎప్పటిలాగే అన్ని పనులూ చేసుకోవచ్చు.

ప్రయోజనాలు

* నొప్పి ఉండదు.
* మత్తుమందు ఇవ్వాల్సిన అవసరముండదు.
* ఉదయం వచ్చి సాయంత్రానికి ఇంటికెళ్లొచ్చు.
* చాలా తక్కువ సమయంలోనే కోలుకుంటారు.
* వెంటనే సాధారణ పనులన్నీ చేసుకోవచ్చు.
* చికిత్స సమయంలో ఊపిరిబిగపట్టాల్సిన అవసరం లేదు. చికిత్స సమయంలో ఊపిరిబిగపట్టాల్సిన అవసరం లేదు. వెంటనే సాధారణ పనులన్నీ చేసుకోవచ్చు.
* చికిత్స సమయంలో ఊపిరిబిగపట్టాల్సిన అవసరం లేదు.

Courtesy with : డాక్టర్‌ రాహుల్‌ లత్‌,సీనియర్‌ కన్సల్టంట్‌ న్యూరోసర్జన్‌, అపోలో హెల్త్‌సిటీ-హైదరాబాద్‌.@Prajasakti News paper(27 Feb 2012). 
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, August 2, 2013

premenstrual syndrome,PMS,ప్రీమెస్ట్రువల్ సిండ్రోం,ప్రీమెస్ట్రువల్ డిస్ఫారిక్ డిసార్డర్,Premenstrual dysphoric disorder,PMDD

  •  



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - premenstrual syndrome,PMS,ప్రీమెస్ట్రువల్ సిండ్రోం,ప్రీమెస్ట్రువల్ డిస్ఫారిక్ డిసార్డర్,Premenstrual dysphoric disorder,PMDD - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


కొందరు మహిళల్లో అప్పుడప్పుడూ కనిపించే విసుగు ,చిరాకు , కోపము , సరిగా నిద్రపట్టకపోవడము లాంటి ప్రవర్తనకు కారణం ‘ప్రీ మెస్ట్రువల్ సిండ్రోం’తో బాధపడటమే. ఆడవారిలో ఈడు వయసు వచ్చింది మొదలు నెల నెలా బహిష్టు రావడం సహజం. బహిష్టు రావటం అనేది ప్రత్యుత్పత్తి వ్యవస్థ పని విధానంలో నెలవారీగా జరిగే తంతు. మహిళల్లో సరాసరిన నాలుగు వారాలకు ఒకసారి ప్రత్యుత్పత్తికోసం అండం విడుదల అవుతుంది. అదే సమయానికి గర్భాశయ లోపలి తలంలో రక్తం జిగురుగా మారి గర్భాశయం లోపలి గోడల్లో మందంగా, పూతలా ఏర్పడుతుంది. ఒకవేళ ఫలదీకరణం జరిగితే దాన్ని గర్భంగా నిలుపుకోవడానికి వీలుగా ఈ ఏర్పాటు జరుగుతుంది. ఫలదీకరణం కనుక జరగకపోతే రెండు వారాలుగా గర్భాశయ గోడల్లో పూతగా ఏర్పడిన రక్తం కరిగి బయటకు వస్తుంది. ఇలా రక్తం బయటకు రావటాన్నే ముట్టు, నెలసరి, బహిస్టు, బయట చేరటం లాంటి అనేక పేర్లతో వ్యవహరిస్తుంటారు. నెల నెలా వచ్చే రుతుక్రమంలో లూటినైజింగు, ఈస్ట్రోజను, ప్రొజెస్టిరాను అనే హార్మోనులు ఒక పని తరువాత మరొక పనిని గొలుసుకట్టు చర్యలా చేసుకుంటూ పోతాయి. అందులో భాగంగా ఆ హార్మోన్లలో ఉన్నట్టుండి హెచ్చు తగ్గులు ఉంటాయి. మామూలుగా అయితే హార్మోనులకు ప్రత్యుత్పత్తి వ్యవస్థ మాత్రమే స్పందిస్తుంది. లోలోపల జరిగే ఈ మార్పులు బయటకు కనపడవు. అందువల్ల ఏ ఇబ్బందులు లేకుండా ఈ కార్యం సాధారణంగా జరిగిపోతుంది.
కొంతమంది మహిళల్లో వారి శరీరంలో వివిధ భాగాలు ఈ హార్మోనుల ప్రభావానికి గురై, శారీరక లక్షణాల రూపంలో ఇబ్బంది పెడతాయి. మరి కొందరిలో వారి మెదడు ప్రభావితం అవుతుంది. చాలా కొద్దిమందిలో అటు శరీరమూ, ఇటు మెదడు రెండూ స్పందిస్తాయి. స్పందించే తీరును బట్టి వారిలో కొద్దిపాటి నుండి చాలా తీవ్ర స్థాయిలో మార్పులు చోటుచేసుకుంటాయి. మెదడు పైన చూపే ప్రభావంవల్ల ఆ సమయంలో వారి ప్రవర్తన మారిపోతుంది. ఈ ప్రవర్తన బహిష్టు రావటానికి రెండు మూడు రోజుల ముందు నుండి కనపడే మార్పులను ‘ప్రీ మెస్ట్రువల్ సిండ్రోం’ అంటారు. దీనితో బాధపడే మహిళల్లో కూడా అందరూ ఒకే రీతిగా బాధపడరు. కొందరిలో కేవలం కొన్ని తేలిక లక్షణాలతో సరిపెట్టగా మరికొందరిలో తీవ్రంగా ఇబ్బందిపెట్టే ‘ప్రీ మెస్ట్రువల్ డిస్ఫారిక్ డిసార్డర్’గా మారుతుంది.

Premenstrual dysphoric disorder (PMDD) consists of symptoms similar to, but more severe than PMS, and while primarily mood-related, may include physical symptoms such as bloating. PMDD is classified as a repeating transitory cyclic disorder with similarities to unipolar depression, and several antidepressants are approved as therapy.

ప్రీ మెస్ట్రువల్ డిస్ఫారిక్ డిసార్డర్ లక్షణాలు ఇలా ఉంటాయి.

మనసులో ఉద్వేగాలు నిలకడగా ఉండవు. వెంట వెంటనే మారిపోతుంటాయి. ఉన్నట్టుండి దిగులు ఆవహిస్తుంది. చిన్న కారణానికే ఏడుపు పొర్లుకు వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండదు. అలజడిగా, ఆందోళనగా ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు పట్టింపులేని చిన్న విషయానికి కూడా ఈ సమయంలో ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. ఊహింపు భయం ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రత కుదరదు. దానివల్ల ఆలోచనలు స్థిరంగా ఉండవు. మనసు పరి పరి విధాలాపోతుంది. కొందరిలో ఆకలి మందగిస్తే మరికొందరిలో విపరీతంగా ఆకలి వేస్తుంది. కొంతమందిలో ఈ సమయంలో కొన్ని తిండి అలవాట్లు మారవచ్చు. కొందరికి నిద్రపట్టకపోగా మరికొందరు ఎక్కువగా నిద్రపోయే స్వభావాన్ని చూపుతారు.

ప్రీ మెస్ట్రువల్ సిండ్రోం ప్రవర్తన లక్షణాలు :

కొంతమందికి ఏ పనీ చేయాలనిపించదు. రోజువారీగా వారు చేయగలిగిన పనులు కూడా సరిగా చేసుకోలేరు. మామూలుగా ఉన్నప్పుడు వారిలో ఉండే సహనం, ఓర్పు ఉండదు. విసుగు, చికాకు ఎక్కువ అవుతుంది. అయినదానికి కానిదానికి చిర్రుబుర్రులాడుతూ ఉంటారు. ప్రతిదానికి చివాలున స్పందిస్తారు. ఆ స్పందన తీవ్రంగా ఉండవచ్చు. కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ వచ్చే కోపం కారణానికి అనుగుణంగా ఉండదు. చిన్న విషయానికే అగ్గిమీద గుగ్గిలం అయి, ఊగిపోతారు. మచ్చుకు పిలిచిన వెంటనే పలకనందుకే పిల్లల్ని బాదిపడేస్తారు. పెద్దవారితో అయితే గొడవకు దిగుతారు. మామూలుగా ఉన్నప్పుడు తమను తాము అదుపు చేసుకునేవారు ఈ సమయంలో దాన్ని కోల్పోతారు. తమ అనుచిత ప్రవర్తనవల్ల గొడవ మొదలై, అది పెద్దది అవుతుంటే ఒక అడుగు తగ్గి గొడవను సద్దుమణగనీయకుండా మాట మాట పెంచి అదిపెద్దది అయ్యేందుకు కారణం అవుతారు. దీనివల్ల కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, తోటి ఉద్యోగులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు అయితే ఫరవాలేదు కానీ ఇతరులతో సంబంధాలు తిరిగి మామూలుగా తెచ్చుకోవడం కష్టం కావచ్చు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఆ సమయంలో మహిళ ప్రవర్తనపట్ల భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు అవగాహన ఉండాలి. నెలలో నాలుగైదు రోజులు మాత్రమే ఉండే ఈ ప్రవర్తనని గుర్తించలేక పోవటంవల్ల ఆ సమయంలో మొదలయ్యే చిన్న చిన్న గొడవలు పెద్దవి అయి విడాకులకు దారితీసిన సందర్భాలు అనేకం.

జాగ్రత్తలు, చికిత్స :
ముందుగా ఇలాంటి ప్రవర్తన తనకు ఉందని మహిళ గుర్తించాలి. నెలలో రెండు మూడు రోజులు ఉండే ఈ ప్రవర్తన పట్ల కుటుంబ సభ్యులకు కొంత అవగాహన ఉండాలి. సమస్య తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు సహకారం అందిస్తే చాలావరకు ఇబ్బందులు తప్పుతాయి. మాటతీరు, ప్రవర్తన మారగానే దాన్ని గుర్తించి ఆ సమయంలో ఆ మహిళలతో కాస్త జాగర్తగా మెలగాలి. వారి ప్రవర్తనను అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మసలుకోవాలి. ఈ సమయంలో వారిలో కనిపించే విసుగు, కోపానికి, మాటలకు పెద్ద ప్రాధాన్యతను ఇవ్వకూడదు. వారిని రెచ్చగొట్టే విధంగా కుటుంబ సభ్యులు మాట్లాడకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా ‘‘నేను నెలసరిలో ఉన్నాను నన్ను నాలుగు రోజులు విసిగించవద్దు’’ అని కుటుంబ సభ్యుల సహకారాన్ని కోరితే ముప్పావు భాగం ఇంట్లో రాగల గొడవలు నివారించుకున్నవారు అవుతారు. సమస్య ఎక్కువగా ఉన్నా, శరీర లక్షణాలు బాగా ఇబ్బంది పెడుతుంటే డాక్టర్‌ను కలిసి ఆ నాలుగు రోజులు కొన్ని మందులు వాడుకోవాల్సి ఉంటుంది. సాధారణ వైద్యుల దగ్గర నయం కాకపోతే గైనకాలజిస్టు దగ్గర, అక్కడ కూడా తగ్గకపోతే మానసిక వైద్యులను సంప్రదించాలి. సమస్య సాధారణ ప్రీ మెస్ట్రువల్ సిండ్రోం లక్షణాలుదాటి ‘డిస్ఫారిక్ డిసార్డర్’ స్థాయికి పోతే తప్పనిసరిగా మైండ్ ఫిజీషియన్‌ని కలిసి వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది.

ఐరన్‌ అవసరము

ఏ వ్యక్తి కైనా ఆరోగ్యము గా ఉండడానికి ఐరన్‌ అవసరము చాలా ఉంటుందనేది నిర్వివాదాంశము . పరిశోదకులు ఈ విషయానికి ముక్తకంఠము తో ముద్రవేశారు . సరికొత్త పరిశోదనలో మరో కొత్త విషయాన్ని జోడించారు. ఐరన్‌ అధికము గా ఉండే పదార్ధాలు తినే మహిళలలో 30-40 శాతము ప్రీ-మెన్‌స్ట్రుయల్ సిండ్రోమ్‌ మిగతా వారితో పోల్చితె తక్కువగా ఉంటుందని పరిశోదనలలో తేలినది. ఎక్కువ ఐరన్‌ తీసుకున్నవారిలో మితతావారి కంటే సంబంధిత రిస్కులు కూడా తక్కువగానే ఉన్నాయి. పొటాషియం ఎక్కువగా వుంటే పదార్ధాలు తినే వారిలో పి.యం.యస్ ఎక్కువగా బాధిస్తుంది.

మామూలుగా రోజుకు 18 మి.గ్రా. ఐరన్‌ అవసరము. అదే రోజుకు 20 మి.గా. తీసుకున్నట్లైతే మంచి ఫలితాలు ఉంటాయి. న్యూరో ట్రాన్స్ మిటర్ అయిన " సెరటోనిన్‌" ను ఐరన్‌ ఉత్పత్తి చేస్తుంది. దీనివలన పి.యం.యస్ . లక్షణాలు తగ్గుతాయి.మెగ్నీషియం , కాపర్ , సోడియం ,మాంగనీస్  వంటి ఇతర ఖనిజాలకు ... పి.యం.యస్ కు ఎటువంటి సంబంధము లేదు.

టోపు(సోయాబీన్‌ తో తయారుచేస్తారు) , గుమ్మడి ,బ్రకోలి, వేరుశనగపప్పు , బాదం , కిస్మిస్ , పీచ్ , పాలకూర , వాల్నట్స్  మొదలగునవి ఐరన్‌ లభించే కొన్ని పదార్ధాలు .

    Supportive therapy

 includes evaluation, reassurance, and informational counseling, and is an important part of therapy in an attempt to help the patient regain control over her life. In addition, aerobic exercise has been found in some studies to be helpful. Some PMS symptoms may be relieved by leading a healthy lifestyle: Reduction of caffeine, sugar, and sodium intake and increase of fiber, and adequate rest and sleep.
    Dietary intervention studies indicate that calcium supplementation (1200 mg/d) may be useful. Also vitamin E (400 IU/d) has shown some effectiveness. A number of other treatments have been suggested, although research on these treatments is inconclusive so far: Vitamin B6, magnesium, manganese and tryptophan.
    SSRIs(serotonin-specific reuptake inhibitor) like fluoxetine, sertraline can be used to treat severe PMS. Women with PMS may be able to take medication only on the days when symptoms are expected to occur. Although intermittent therapy might be more acceptable to some women, this might be less effective than continuous regimens.
  
Hormonal intervention may take many forms:
        Hormonal contraception is commonly used; common forms include the combined oral contraceptive pill and the contraceptive patch. This class of medication may cause PMS-related symptoms in some women, and may reduce physical symptoms in other women. They do not relieve emotional symptoms.
        Progesterone support has been used for many years but evidence of its efficacy is inadequate.
        Gonadotropin-releasing hormone agonists can be useful in severe forms of PMS but have their own set of significant potential side effects.
    Diuretics have been used to handle water retention. Spironolactone has been shown in some studies to be useful.
    Non-steroidal anti-inflammatory drugs (NSAIDs; e.g., ibuprofen) have been used to treat pain.
    Clonidine has been reported to successfully treat a significant number of women whose PMS symptoms coincide with a steep decline in serum beta-endorphin on a monthly basis.
    Chasteberry has been used by women for thousands of years to ease symptoms related to menstrual problems. It is believed some of the compounds found within Chasteberry work on the pituitary gland to balance hormone levels.
    DL phenylalanine can reduce or prevent symptoms of PMS in some women. It is only effective when the PMS is associated with an abrupt decline in circulating serum beta-endorphin levels.
    Essential fatty acids, Evening primrose oil, which contains the Omega-6 EFA GLA (gamma-Linolenic acid), lacks clear scientific support.

  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/