శరీరంలోని ఏ భాగంలోనైనా మిల్లీమీటర్ కంటే తక్కువ పరిమాణంలోని క్యాన్సర్ కణతికి కచ్చితమైన చికిత్స అందించే సైబర్‌నైఫ్ రొబొటిక్ రేడియో సర్జరీ అందుబాటులోకి వచ్చింది. నిలకడగా లేదా కదులుతున్న కణతులను గుర్తించి చికిత్స చేయడం దీని ప్రత్యేకత. క్యాన్సర్ కణతి చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినది ఈ సైబర్‌నైఫ్ రొబొటిక్ రేడియో సర్జరీ.
సైబర్ నైఫ్ అంటే రొబొటిక్ రేడియో సర్జరీకి రేడియో థెరపీ పరికరాలున్న విభాగం. దీని ద్వారా రేడియేషన్ ఆంకాలజిస్టులు శస్త్రచికిత్స అవసరం లేకుండా, నొప్పిలేని చికిత్సను అందిస్తారు. రొబొటిక్ పరికరం ఏ దిశలోనైనా, శరీరంలోని ఏ భాగంపైనైనా సూటిగా రేడియోధార్మిక కిరణాలను ప్రసరింపజేస్తుంది. ఈ వ్యవస్థ క్యాన్సర్ కణతి ప్రతీ కదలికను గుర్తిస్తుంది. అత్యంత శక్తివంతమైన రేడియోధార్మికత కిరణాలను క్యాన్సర్ కణతిపై ప్రసరింపజేస్తుంది. చట్టుపక్కలున్న అవయవాలకు హాని కలగకుండా కేవలం కణతిని మాత్రమే నాశనం చేస్తుంది. ప్రతీ కిరణం విడుదల చేసే ముందు కణతి స్థానాన్ని పరిశీలిస్తుంది. ఓపెన్ శస్త్రచికిత్సతో కోలుకోని వారికి కూడా ఈ చికిత్స విధానం సరైనది. క్యాన్సర్ కణతి చికిత్స పొందినా కూడా నయం కాని రోగులకు సైబర్‌నైఫ్ కొత్త ఆశలను కల్పిస్తుంది.
చికిత్స దశలు
తొలిమెట్టు : రోగి ఆసుపత్రికి వచ్చి వైద్యున్ని కలిశాక సైబర్‌నైఫ్ చికిత్స విధానాల గురించి వివరిస్తారు.
రెండో మెట్టు : రోగిని చికిత్సకు సిద్ధం చేస్తారు.
మెటల్ మార్కర్స్ అమరిక : చికిత్స కోసం సైబర్‌నైఫ్‌కువచ్చినప్పుడు కణతికి దగ్గరలో కొన్ని మెటల్ మార్కర్స్ అమరుస్తారు. దీని ద్వారా చికిత్స కాలంలో కణతుల స్థాయిని గమనించొచ్చు.
మాస్క్ తయారి : తల/మెడకు ఒక మాస్క్ తొడుగుతారు. ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ విధానం చాలా తేలికగా, నొప్పిలేకుండా ఉంటుంది.
మూడోమెట్టు : ఈ దశలో సిటి స్కాన్ ద్వారా ప్రతిబింబ రూపకల్పన చేస్తారు. స్కానింగ్‌లో కణతి పరిమాణం, ఆకారం, ప్రదేశం గురించి తెలుసుకోవచ్చు. అవసరమైతే ఎంఆర్‌ఐ, పిఇటి, సిటి లేదా యాంజియోగ్రఫి స్కానింగ్‌లు కూడా చేస్తారు.
నాలుగోమెట్టు : ప్రతిబింబం సైబర్‌నైఫ్ వర్క్‌స్టేషన్‌కు బదిలీ చేస్తారు. ఇక్కడున్న వైద్యుల బృందం (రేడియేషన్ ఆంకాలజిస్ట్, క్లినిషియన్, ఫిజిస్ట్, రేడియాలజిస్ట్) సాఫ్ట్‌వేర్ సహకారంతో చికిత్స ప్రణాళికను రూపొందిస్తుంది. ఈ ప్రణాళిక చాలా అవసరం. బృందం చికిత్స ప్రణాళికను తయారు చేస్తుంది.
ఐదో మెట్టు : ప్రణాళిక సిద్ధం అయిన వెంటనే సైబర్‌నైఫ్ చికిత్స మొదలవుతుంది. సైబర్‌నైఫ్ వ్యవస్థ కంప్యూటర్ ఆధీనంలోని రోబోట్ రోగి చుట్టూ పరిభ్రమిస్తుంది. కణతికి రేడియేషన్‌ను వెలువరించే దిశలో ఇది పరిభ్రమిస్తుంది.
స్కానింగ్ : కణతి పరిమాణాన్ని, దాని స్థానాన్ని తెలుసుకోవడానికి రోగికి సీిటి లేదా ఎంఆర్‌ఐ స్కానింగ్ పరీక్షలు చేస్తారు. సైబర్‌నైఫ్ చికిత్స ప్లానింగ్ సాఫ్ట్‌వేర్, చికిత్సలో భాగంగా చికిత్సకు ముందు తీసిన సిటిస్కాన్, ఇతర సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ప్లానింగ్ : స్కానింగ్ తర్వాత సమాచారాన్ని సైబర్‌నైఫ్ సిస్టంకు చెందిన 'ట్రీట్‌మెంట్ ప్లానింగ్ వర్క్‌స్టేషన్'కు డిజిటల్ రూపంలో అందిస్తారు. అక్కడ వైద్యులు కణతి పరిమాణాన్ని, ప్రదేశాన్ని కనుక్కుంటారు. వైద్య నిపుణులు ట్యూమర్ ప్రదేశానికి తగినంత మోతాదులో రేడియేషన్‌ను పంపడానికి సైబర్‌నైఫ్ సాఫ్ట్‌వేర్ సహకారంతో ప్రణాళికతో రూపొందిస్తారు. చికిత్సా ప్రణాళికలో భాగంగా సైబర్‌నైఫ్ సిస్టం ఆటోమెటిక్‌గా రేడియోధార్మిక కిరణాల సంఖ్యను, వాటిని పంపించే సమయాన్ని బట్టి, వాటిని పంపాల్సిన కోణాలను సూచిస్తుంది.
చికిత్స : రోగి చికిత్స బల్లపై సుఖంగా పడుకుంటారు. నొప్పి ఉండదు. అందువల్ల మత్తుమందు ఇవ్వరు. సుమారు 100 నుండి 200 రేడియోధార్మిక కిరణాలు ఒక్కొక్కటి 10 నుంచి 15 సెకన్ల వ్యవధిలో వివిధ దిశల నుంచి 30 నుంచి 90 నిమిషాలలో శరీరంలోకి పంపిస్తారు. ప్రతీ రేడియోధార్మిక కిరణాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు సైబర్‌నైఫ్ వ్యవస్థ రెండు ఎక్స్-రే ప్రతిబింబాలను తీసుకుంటుంది. వాటిని ప్లానింగ్ వ్యవస్థ నుంచి వచ్చిన డిఆర్‌ఆర్‌తో పోల్చిచూస్తుంది.
సైబర్ వ్యవస్థ : సబ్‌మిల్లీమీటర్ విస్తీర్ణతతో శరీరంలోని ఏ భాగంలోని క్యాన్సర్ కణతిని నయం చేయడానికి కంప్యూటర్ నియంత్రణ గల రొబొటిక్స్‌తో కూడిన ప్రతిబింబ ఆధారిత లీనియర్ యాక్సిలేటర్ మిశ్రమం సైబర్ నైఫ్. ఇది లీనియర్ యాక్సిలేటర్ 6ఎంవి శక్తితో కూడిన ఫోటాన్ కిరణాలను ప్రసరింపజేస్తుంది. రోబోటిక్ పరికరం స్వేచ్ఛగా తిరగడానికి వీలుగా తేలికైన లినాక్ హెడ్ అమర్చబడి ఉంటుంది. రొబొట్ విడుదల చేసే ప్రతి కిరణం నుండి 12 విభిన్న కిరణాలు వెలువడుతాయి. స్కల్ ట్రాకింగ్ (ఇన్‌ట్రా క్రానికల్ గాయాలకు ఉపయోగపడుతుంది), ఫిడుషియల్స్ ట్రాకింగ్ (మృదువైన కణజాలాల గాయాలకు), సింక్రోనీ ట్రాకింగ్ (శ్వాస సంబంధ గాయాలకు), స్పైన్ ట్రాకింగ్ (వెన్నుపాము సంబంధ గాయాలకు), లంగ్ ట్రాకింగ్ (ఊపిరితిత్తుల గాయాలకు) అనే ఐదు ప్రతిబింబాలతో కూడిన ట్రాకింగ్‌లను చికిత్సలో సైబర్‌నైఫ్ ఉపయోగిస్తుంది. కెవి ఎక్స్‌రే కిరణాల ద్వారా ఈ ప్రతిబింబాలు రూపొందుతాయి. ఈ కిరణాలు 45 డిగ్రీల కోణంలో అమర్చిన రెండు డయాగటిక్ ఎక్స్‌రే ట్యూబుల నుండి వెలువడుతాయి. రెండు డిటెక్టర్లు ఈ ప్రతిబింబాలను చిత్రిస్తాయి. వీటిని రిఫరెన్స్ ప్రతిబింబాలతో పోల్చుతుంది. ఆఫ్‌సెట్ విలువల స్థాయి నిర్ణీత పరిధిలో ఉండే వరకు సిస్టం ట్రీట్‌మెంట్‌ను అనుమతించదు. రొబొట్ సబ్‌మిల్లీమీటర్ పరిధితో ఆఫ్‌సెట్‌ను తిరిగి అదే స్థానంలో ఉంచుతుంది. ఇదంతా ప్రతి కిరణం వెలువడే ముందే జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ వ్యవస్థా రూపొందించని ప్రతిబింబాలను ఇది ఏర్పరుస్తుది. ఎక్స్‌రేతోపాటు, పలు కణతుల చికిత్సలో ఉపయోగపడే సిన్‌క్రోనీ మోషన్ ట్రాకింగ్‌ను కూడా అందిస్తుంది. కేవలం శ్వాస వ్యవస్థలోనే రేడియేషన్‌ను అందించే ఇతర వ్యవస్థల్లా కాక సైబర్‌నైఫ్ హృదయ కదలికలకు అనుగుణమైన రేడియేషన్‌ను అందిస్తుంది.
ప్రయోజనాలు : చుట్టుపక్కల భాగాలకు హాని కలగకుండా మోడ్రన్ రేడియేషన్ థెరపీ అధిక మోతాదులో రేడియేధార్మిక కిరణాలను వెలువరిస్తుంది. దీని వల్ల వ్యాధి ముదరకుండా తక్కువ సమయంలో తొందరగా వ్యాధిని నయం చేయొచ్చు. ఊపిరితిత్తులు, హృదయం, ప్లీహంలోని గాయాలకు తక్కువ వ్యవధిలో చికిత్స అందిస్తారు. కణతి రకాన్ని బట్టి ప్రతి చికిత్సా 30 నుంచి 90 నిమిషాల వ్యవధిలో పూర్తవుతుంది. చికిత్స తర్వాత రోగి ఎప్పటిలాగే అన్ని పనులూ చేసుకోవచ్చు.
ప్రయోజనాలు
* నొప్పి ఉండదు.
* మత్తుమందు ఇవ్వాల్సిన అవసరముండదు.
* ఉదయం వచ్చి సాయంత్రానికి ఇంటికెళ్లొచ్చు.
* చాలా తక్కువ సమయంలోనే కోలుకుంటారు.
* వెంటనే సాధారణ పనులన్నీ చేసుకోవచ్చు.
* చికిత్స సమయంలో ఊపిరిబిగపట్టాల్సిన అవసరం లేదు. చికిత్స సమయంలో ఊపిరిబిగపట్టాల్సిన అవసరం లేదు. వెంటనే సాధారణ పనులన్నీ చేసుకోవచ్చు.
* చికిత్స సమయంలో ఊపిరిబిగపట్టాల్సిన అవసరం లేదు.
Courtesy with : డాక్టర్ రాహుల్ లత్,సీనియర్ కన్సల్టంట్ న్యూరోసర్జన్, అపోలో హెల్త్‌సిటీ-హైదరాబాద్.@Prajasakti News paper(27 Feb 2012).
- =======================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.