Sunday, August 25, 2013

valve replacement awareness-గుండె కవాట మార్పిడి అవగాహన

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --valve replacement awareness-గుండె కవాట మార్పిడి అవగాహన -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... Heart

శస్త్ర చికిత్సలకు సరిపడా ఆరోగ్యంతో ఉన్నవాళ్లకు... కవాట లోపాలుంటే సరిదిద్దాలంటే కవాట మార్పిడి శస్తచ్రికిత్స ఎంతగానో తోడ్పడుతుంది. గుండెలోని కవాటలోని వ్యాధికి గురైన వాళ్లు ఆయాసం, గుండెదడ, కాళ్లవాపు శస్తచ్రికిత్సలు, పూర్తిగా దెబ్బతిన్న కవాటల స్థానంలో కృత్రిమ కవాటాల్ని అమర్చి శస్తచ్రికిత్సను ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నారుు. గుండెలో నాలుగు కవాటలున్నాయి . రెండు కుడిపక్క, మరోరెండు ఎడమ పక్క ఉంటాయి . గది నుంచి గదికి రక్తం సవ్యంగా ఒకే డైరెక్షన్‌లో వెళ్లడానికి ఇది అవసరం. ఎడమ పక్క ఉండేవి మైట్రల్‌ వాల్‌, అయోర్డిక్‌ వాల్‌, ఇవి కొన్ని రకాల జబ్బులతో దెబ్బతినవచ్చు. ఇందులో ముఖ్యమైనది రుమాటిక్‌ హార్డ్‌ డిసీజ్‌.

రుమాటిక్‌ హార్డ్‌ డిసీజ్‌ చిన్నతనంలో వచ్చే గొంతు నొప్పి, టాన్సిల్స్‌ వాపు, కీళ్ల నొప్పులు, జర్వం, మొదలైన వాటికి సరైన సమయంలో చికిత్స చేయించాలి. లేకపోతే అవి రుమాటిక్‌ గుండె జబ్బులకు దారితీసే ప్రమాదం ఉంది. క్రమంగా గుండె కవాటాలు దెబ్బతింటాయి. ఈ జబ్బులకు పెన్సిలిన్‌ చాలామంది మందు, మంచి గాలీ వెలుతురు ఉన్న ఇళ్లలో నివశించడం ద్వారా, బలమైన ఆహారం (పాలు, పళ్లు, గుడ్లు, మాంసం) తీసుకోవడం ద్వారా ఈ వ్యాధులు నివారించవచ్చు.రుమాటిక్‌ గుండె జబ్బు వస్తే తరుచుగా పరీక్షలు చేయించుకుంటూ సరైన సమయంలో ఆపరేషన్‌ చేయించుకోవాలి. ఆపరేషన్‌ భయంతోనే, మరో కారణంతోనైన వాయిదా వేస్తే గుండె బలహీనమైపోతుంది. గుండెలో రక్తం గడ్డకట్టి ఆ ముక్కలు మెదడులోకి, కాళ్లలోకి గానీ చేరుకొని రక్త ప్రసరణకి అరోదం కలిగిస్తే ఆ అవయావాలలో గాంగ్రీన్‌ ప్రారంభమవ్వచ్చు. పక్షవాతం రవాచ్చు. అందుకని ఆపరేషన్‌ వెంటనే చేయించుకోవాలి.

ప్రతీ ఆరు నెలలకి గుండె పరీక్ష చేయించుకోవడం మంచిది. ఎడమ అరికల్‌, ఎడమ వెంట్రికల్‌ మధ్య ఉంటుంది. మైట్రల్‌ కవాటం, రుమాటిక్‌ పీవర్‌ వల్ల మెత్తగా ఉండే ఈ కవాట పత్రాలు అతుక్కొని, క్రమంగా గట్టిపడి, మైట్రల్‌ వాల్వ్‌ రంద్రం సన్నగవుతుంది. దాంతో ఎడమ పైనున్న గుండె గది ఆరికల్‌ నుంచి కింద గుండె గది ఎడమ వెంట్రికలోకి రక్తం సరిగా ప్రవహించదు. రక్తం ఎడమ ఆరికల్‌లోనే ఉండిపోవడం వెనక్కి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. దాంతో రోగికి ఆయాసం, ఎగశ్వాస కలుగుతుంది. వెల్లకిలా పడుకోలేక కూర్చోవాల్సి వస్తుంది. దగ్గులో రక్తం కూడా రావచ్చు. ఎడమ ఆరికల్‌లో రక్తం గడ్డలు కట్టవచ్చు. క్రమంగా ఈ గడ్డలు రక్త ప్రవాహం ద్వారా మెదడు, మూత్రపిండాలు అడ్డంపడవచ్చు. పక్షవాతం లాంటివి రావచ్చు. మైట్రోస్టినోసిస్‌ల వల్ల గుండె లయ తప్పుతుంది. ఇలాంటి వాళ్లు ఉప్పు తగ్గించి తినాలి.

శ్రమతో కూడిన పనులు చేయకూడదు. దగ్గు, జర్వం లాంటివి వస్తే వెంటనే తగిన చికిత్స చేయించుకోవాలి. రుమాటిక్‌ ఫీవర్‌ తిరగబెట్టకుండా ప్రతీ మూడు వారాలకు బెంజథిన్‌ పెన్సిలిన్‌ ఇంజిక్షన్‌ చేయించుకుంటూ ఉండాలి. కవాటం భాగ ఇరుకైనప్పుడు మైట్రల్‌ కవాటాన్ని వెడల్పు చేయాటానికి శస్త్ర చికిత్స అవసరమవుతుంది. మామూలుగా ఎడమ ఆరికల్‌ లోనుంచి రక్తం ఎడమ వెంట్రికల్‌లోకి ప్రవహిస్తుంది. అలా ప్రవహించే మార్గం సరిగా లేనప్పుడు కలిగే ఇబ్బందులు, చికిత్స తెలుసుకున్నాం. కవాటాల పనిమిటంటే రక్తం ఒకే వైపు ప్రవహించేలా చూడటం. అంటే మైట్రల్‌ వాల్వ్‌ ద్వారా ఎడమ వెంట్రికల్‌లోకి రక్తం రావాలి గానీ, ఎడమ ఆరికల్‌లోకి వెళ్లకూడదు. కవాటం దెబ్బతిని పూర్తిగా మూసుకుపోవడం వల్ల ఎడమ వెంట్రికల్‌ నుంచి రక్తం తిరిగి ఎడమ ఆరికల్‌లోకి వెళ్తుంది. ఈ స్థితిని మైట్రల్‌ రిగర్జిటేషన్‌, ఇది తీవ్రత దశలో ఉన్నపుడు శస్త్ర చికిత్స జరిపి కృత్రిమ కవాటాన్ని అమర్చాలి. కవాటం తీవ్రంగా ఇరుకుగా ఉన్నపుడు శస్తచ్రికిత్స ద్వారా కృత్రిమ కవాటంతో ఆ కవాట మార్పిడి చేయాలి.

కవాట వ్యాధుల్ని తొలిదశలోనే కనుక్కొని కావాల్సిన చికిత్స అందేలా చూడాలి. ఎడమ వెంట్రికల్‌ నుంచి బయటకు వచ్చే దారిలో అయోర్డికా వాల్వు ఉంటుంది. ఇది కూడా మూసుకపోవచ్చు. లేదా లీక్‌ కావచ్చు. దీనిని కూడా జబ్బు ఎక్కువగా ఉన్నపుడు ఓపెన్‌ హార్డ్‌ సర్జరీ ద్వారా మార్చాల్సివస్తుంది. మెడియన్‌ స్టెర్నొటమి శస్త్ర చికిత్సలో కవాటాలు మారుస్తారు. గుండె తెరుస్తారు కాబాట్టి కార్డియో పల్మొనరి బైపాస్‌ మిషన్‌ మీద ఉంచి ఈ శస్త్ర చికిత్సను చేయాల్సి ఉంటుంది. కవాట మార్పిడి చేసినపుడు ఈ కృత్రిమ గుండె ఊపిరితిత్తుల మిద ఉన్నపుడు వైద్యుడు రోగి దెబ్బతిన్న కవాటాన్ని పెడతారు. కవాటాన్ని పెట్టగానే గుండెను మూసివేస్తారు. అప్పడు హార్డ్‌లండ్‌ మెష్‌ని తీసివేస్తారు. కొత్త కవాట పనితీరును పరీక్షించడానికి, పర్యవేక్షించాడానికి ట్రాన్స్‌ ఈ సోపాగల్‌ ఎకోకార్డియోగ్రామ్‌ చేస్తారు. శస్త్ర చికిత్స తరువాత ఛాతి, ఫెరికార్డియల్‌ ప్రాంతాల నుంచి ద్రావకాన్ని తీసివేయాడానికి డ్రైనేజ్‌ ట్యూబ్స్‌ని అమరుస్తారు.

36 గంటల మళ్లీ వాటిని తీసివేస్తారు. వాల్వ్‌ మార్పిడి జరిగిన తరువాత రొగి 12 నుంచి 36 గంటల పాటు కార్డియో థోరాసిక్‌ ఇండెన్సిస్‌ కేర్‌లో ఉంచుతారు. 4 నుంచి 3 నెలలలోపు ఈ కవాట మార్పిడితో పూర్తిగా కోలుకుంటారు. ఈ శస్త్ర చికిత్స జరిగిన 6 వారాల నుంచి 8 నెలల వరకు బరువు ఎత్తకూడదు. ఎందుకంటే ఛాతి ఎముకలు సరిగ్గా అతుక్కోవాలి.

కృత్రిమ కవాటాలు
కృత్రిమ కవాటాలు ప్రధానంగా రెండు రకాలు మెకానికల్‌ వాల్వ్‌లు. టిష్యూవాల్వ్‌లు. టిష్యూవాల్వ్‌లు జంతువుల కణాల నుంచిగానీ, జంతువుల గుండె కవాటాలు లేక జంతువుల పెరికార్డియల్‌ టిష్యూ నుంచి తయారు చేస్తారు. ఈ కణాజాలాలకి కాల్సిఫికేషన్‌ ఏర్పకుండా, రిజెక్షన్‌ కాకుండా ట్రీట్‌ చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మనుషుల ఆయోర్డిక్‌ కవాటాన్నే మార్పిడి చేస్తారు. వీటిని హుమోగ్రఫ్‌ అంటారు. టిష్యూ కవాటాలతో సమంగా హోమోగ్రాఫ్ట్‌ కవాటాలు తోడ్పడుతాయి. అయోర్డిక్‌ కవాటాన్ని మార్చడానికి రాస్‌ ప్రాసీజర్‌ లేక పల్మోనరి ఆటోగ్రాప్ట్‌ చేస్తారు. మెకానికల్‌ కవాటాలు ఎక్కువగా కాలం ఉంటాయి. మెకానికల్‌ కవాటాలు అమర్చిన వాళ్లకు రక్తం గడ్డ కట్టకుండా మందులు ఇస్తారు. టిష్యూ కవాలాలైతే 10 నుంచి 20 సంవత్సరాల వరకు వాళ్లకు మాత్రమే ఉంటాయి. పెద్దవయస్సు వాళ్లకైతే టిష్యూ కవాటాలు, చిన్న వయస్సు వాళ్లకు మెకానికల్‌ కవాటాలు మంచిది.

Courtesy with : డా.. ఆళ్లగోపాలకృష్ణ గోఖలే, కార్డియోథొరాసిక్‌ సర్జన్‌, హైదరాబాద్‌

  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.