పూర్వము హిందూదేశములో " వైద్యో నారాయణో హరి " అనేవారు. వైద్యులకు అంత విలువ ఉండేది. . . ఇప్పుడు " వైద్యో నారాయణో అరి " అంటున్నారు . (అరి అంటే బక్షించేవాడు అని అర్ధము). ఎందుకిలా మారింది. కాలము మారిందా?.డాక్టర్లు మారారా? . . లేక ప్రజల దృక్పదములో మార్పు వచ్చిందా?.
వైద్య వృత్తి చాలా కష్టము తో కూడుకొన్నది. సహనము , దయ , దాన గుణము కలిగి ఉండాలి. వైద్యులు సరియైన చికిత్స ఇవ్వాలంటే వారు ప్రశాంతముగా , ఏ వత్తిడి లేకుండా ఉండాలి. ఇటు కుటుంబసభ్యులనుండి గాని , ప్రజలనుండిగాని , ప్రసార సాధనాలనుండిగాని , అటు ప్రభుత్వము నుండిగాని ఏ రకమైన కష్ట - నష్టాలు , వేధింపులు ఉండకూడదు. ఆప్పుడే తను సక్రమముగా వృత్తి ధర్మాన్ని , నైపుణ్యాన్ని ప్రదర్శించగలడు. వైద్యులు చేస్తున్న పని ఏమిటి?... రోగి ఉచ్చ , దొడ్డి , చీము , రక్తము , చెమట తో కూడుకున్నది. రోగికి నీరుడు బందు అయితే గొట్టం వేసి తీయాలి (catheterization),విరోచనము అవకపోతే .. ఎనీమా(enema) చేయాలి, పుండు పుడితే క్లీనింగ్ - డ్రస్సింగ్ చేయాలి , దెబ్బలు తగిలితే శుబ్రము చేసి కట్టువేయాలి , రోగి వ్యాది ఏమిటో తెలియడానికి శరీరమంతా చెమట ఉన్నా తనికీచేయాలి . కదా మరి ఇన్ని పనులు చేసేవారిని ఏమంటారు . మునిసిపాలిటీ అయితే " తోటీ పనివారు " అని అంటారు. అందుకే అన్నాడు ... ఓ మహానుభావుడు ... వైద్యులను " మానవ పాకీ వాళ్ళు '' అని . రోగికి ఏ అంటురోగమున్నదోనని ఆలోచించకుండా వ్యాదినిర్ధారణకోసమో , ప్ర్రాణాలు రక్షించడానికోసమో , జబ్బుతెలుసుకునే నిమిత్తము రోగిని ఆపాదమస్తకం తనికీ చేయాల్సిందే!. తనూ మానవమాత్రుడే కదా ! తనకూ వ్యాధులు అంటుకోవా?. ఎండుగజ్జి , తామరగజ్జి , ఏనుగుగజ్జి తనికీ అంటుకోవా ?. ఇవన్నీ అధికమించి సేవా దృక్పదముతో చికిత చేయడము వలనే పూర్వము వైద్యులను దేవుని గా భావించేవారు. పూర్వము ... రోగి చనిపోతే వైద్యులపై చీదరింపులు , వేదింపులూ , బ్లాక్ మెయింగ్ లు , కన్జూమర్ కోర్టులు , క్రిమినల్ కేసులు పెట్టడము ఉండేవికావు . . డాక్టర్లు తమపని తాము చేసారు చావును ఎవరూ ఆపలేరు అనుకునేవారు. కాని నేడు అలాకాదు.
" వైద్యానాం సుఖజీవనం కష్టయ: ,అధవా:
రోగీ యోగేనాం .. దైవయోగేనాం .,
మారకేం ... వైదుశ్యమారకహా: "
ఈ నీతిశతం లోని శ్లోకము అర్ధం = వైద్యులు , వైద్యవృత్తిలోఉన్నవారు సుఖముగా జీవించలేరు. ఒకవేళ (అధవా:) సేవాదృక్పదముతో మదర్ తెరీసా నో , ఫ్లోరన్స్ నైటింగేల్ నో ఆదర్శము గా సేవచేసినా.... రోగి వ్యాదినుండి బాగుపడితే ... దేవుని కృపవలన బాగుపడ్డాం అంటారు ..హాస్పిటల్ గేటు ముందు ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోతాడు .. వ్యాది నయమవక చనిపోతే .. వైద్యులు , వైద్యసిబ్బంది , వారి తప్పుడుచికిత్స , నిర్లక్ష్యము మూలంగానే చనిపోయాం అని అంటారు. .
ఇది అప్పుడు కాఫు ఇప్పుదు జరుగుతున్న విషయము . ఆ పై కోర్టు కేసులు , బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు రాబట్టుకోవడము లేదా విచ్చన్నకర పనులు చేయడము , కొట్టడము , వస్తుసామగ్రిని ద్వంసము చేయడము వంటివి జరుగుతునే ఉన్నాయి.
వందమంది డాక్టర్ల దగ్గర ఓరు ... ఇద్దరు చెడ్డ డాక్టర్లూ ఉంటారు . ఇది సమాజము లో ఉన్న నైజము . ప్రతీ ఫృత్తిలోను ఇలాంటి చీడపురుగులు ఉంటాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చి వైద్యము వ్యాపారముగా మార్చేసారు.. హాస్పి టల్ కట్టించేది ఎవరో ఒక MBA అసామి . తనకున్న వ్యాపార విద్య నంతటినీ ఉపయోగింది డాక్టర్లని మభ్యపెట్టి , పెద్ద జీతాలు ఆశచూపి , సాదారణ వైద్యులను పెద్ద నిపుణులు గా బోర్డులు వ్రాసి ఉదా: డా.రామారావు యమ్.డి (యు.యస్.ఎ) M.D అమెరికాలో చేసారనుకుంటాం ,కాని ఇక్కడ యమ్.డి (యు.ఎస్.ఎ) అంటే యు=యునానీ, యస్=సిద్ధ , ఎ=ఆయుర్వేద అన్న సంగతి ఎవరికి తెలుసు . వ్యాపార ధోరణీ లో రిఫరల్ కేసులకు పర్సంటేజులు ఇస్తూ పేసెంటలను రాబట్టుకుంటున్నారు . ఆ డాక్టర్ క్వాలిఫైడా , కాదా అని ఆలోచించరు .. చివరకు గ్రామ సర్పంచకూ పి.సి . ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. పి.సి లకు ఎక్కువగా సంచి డాక్టర్లు కేసులు (రోగులు) తీసుకొస్తారు. బిల్లు కి ఇంత , ఆపరేషన్ కి ఇంత , లేబు తనికీలకు ఇంత అని ఫిక్షిడు పి.సి లు ఉంటాయి. అవసరమున్నా లేకున్నా ఆపరేషన్ చేసీమంటాడా సంచిడాక్టర్ . . . పి.సి కోసము . పి.సి లు ఇవ్వకపోతే తన ప్రాక్టిష్ తగ్గిపోతుందనో , ఈగలు తోలుకోవడము వస్తుందనో సదరు డాక్టర్ పి.సి ల ప్రాక్టిస్ కే అలవాటు పడిపోతాడు . తప్పు ఎవరిది?.
అలాగని ఏ మంచిడాక్ట రో తను సరియైన వైద్యము అందించినా రోగి చనిపోవచ్చును .. దాన్ని మనదేశములో 24 గంటలూ న్యూస్ చానెల్స్ హైలైట్ చే పబ్లిసిటీ చేస్తూ ఉన్నదీ లేనిదీ వెనకా ముందూ తగిలిస్తూ ప్రచారము చేయడము సదరు డాక్టర్ ని మానసిక క్ష్యోభకు గురిచేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది చెట్టుకింద ప్లీడర్లు బ్లాక్ మెయిలింగ్ చేయడము ... రాజీ పెడతాం అని కొంత డబ్బులు గుంజడం జరుగుతూ ఉన్నది . రబసను , నసను భరించడము ఇష్టము లేకనో , భయపడో అడిగిన డబ్బులు ఇవ్వడమూ జరుగుతూ ఉన్నది. పోనీ కోర్ట్ కెలదామా అంటే ... కన్జూమర్ కోర్ట్ ...ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత వడ్డిస్తూనే ఉంటుంది. అది దాని ధర్మము ... ఆ డాక్టర్ బాగా సంపాదించాడులే.! ఆ మాత్రము పోతే ఏమి?.అనే ధోరణే తప్ప ..మంచి చెడూ ఆలోచనలేదు . ఇక్కడ తప్పు ఎవరిది?.
నేడు నూటికి 99 మంది డాక్టర్లు రాత్రింబవళ్ళు నిద్ర ఆహారము లేకుండా కష్టపడతారు . రోగి ప్రాణాలు కాపాడేందుకు సాయశక్తులా తమకున్న విజ్ఞానాన్నంతటినీ ఉపయోగిస్తారు. బోలెడన్ని త్యాగాలొనరించే వీరందరికీ మనము పాదాభివందనము చేయాలి.ఇటువంటి త్యాగమూర్తులు , సైయింటిస్ట్ లు లేకపోతే విజ్ఞానము అభివృద్ధి చెందేది కాదు .. కొత్త కొత్త పరికరాలు , ప్రయోగాలు , ప్రొసీజర్లు . తనికీలు , వైద్య విధానాలు , స్కానింగ్ లు , సిటి , ఎం,ఆర్.ఐ లు ఉండేవి కావు .
ఇక మందులు కంపెనీలు వారి వ్యాపార నిమిత్తము ఎన్నో ప్రలోభాలు , ఆశలు (ఫ్రిజ్ లు , కార్లు , ఏ.సి లు ఇలా ) చూపించి నాసిరకము మందులు రాయించుకుంటారు. ఎంతమంచిడాక్టరయినా గిఫ్టులకు లొంగకుండా ఉంటారా?. ఇది రోగి విషయము లో చాలా తప్పు . రోగికి నష్టము ,, మందులు కంపెనీలకు , మందుల షాపులకు లాభాలు . ఇంతటితో ఆగక ఈ కంపెనీలు కొన్ని రకాలైన వ్యాపార గెట్టుగెదర్ మీటింగ్ లంటూ ' స్తార్ హొటల్" ల్లలో ఏర్పాటుచేసి సబ్జెక్ట్ బొంద అయిందనిపిస్తూ మెల్ల మెల్లగా ఫేషన్ అనే పేరుతో తాగుడు వంటి వ్యసనాలకు అలవాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అలవాటు లేనివారు కూడా కాలు జారుతున్నారు. మరి తాగే వాడు డాక్టర్ అయినా వాడి అవతారము వాడిదే. నష్టము జరిగేది రోగికే ... ఆ ఖర్చులన్ని మాత్ర మేద ఉన్న రేటుకి తగిలించబడతాయి.
ఎవరైనా ఒక డాక్టర్ చిన్న క్లినిక్ నో , ఓ మోస్తరు నర్సింగ్ హోమ్(హాస్పిటల్)నో పెట్టుకున్నప్పుడు తనకు సహాయకులా , ఆయా లను . స్లీపర్లను , వార్డ్ బాయ్ లను , తోటీ లను జీతాలిస్తూ ఉద్యోగస్తులు గా పెట్టుకుంటారు . వీరిలో కొంత మంది చిన్నపాటి వైద్యము నేర్చుకొని ఒకటి , రెండు సంవత్సరాలలో సదరు హాస్పిటల్ లో పని మానేసి .... గ్రామాలలో వైద్యులు గా చెలామని అవుతూ ఉన్నారు . రూరల్ మెడికల్ ప్రాక్టిషినర్స్ అని , ప్రవేటు మెడికల్ ప్రాక్టిషినర్స్ అని , ఫస్ట్ -ఎయిడ్ అసిస్టెంట్స్ అని పోష్టల్ / లోకల్ సర్టిఫికేట్స్ పొందుతూ చలామని అవుతూ ఉన్నారు . మా శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4000 వరకూ ఉన్నారు.వీరు పి.సి ల కోసము లేని పోని హంగామా , భయాలను రోగి ముందు ప్రదర్శించి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరకి రిఫర్ చేస్తూ ఉంటారు . దానికి తగ్గటు గానే మెడికల్ బిల్లులు పి.సి లను కలుపుకొని ఎక్కువ వస్తాయి.
- *లేబర్ యాక్ట్ అని లేబరు ఆఫీసు వారూ ,
- *ఇన్‌కమ్ టాక్ష్ అని ఆదాయపన్ను ఆఫీసర్లు ,
- *ప్రొఫెషన్ టాక్ష్ అని సేల్ టాక్క్ష్ డిపార్ట్ మెంట్ ,
- *ఇంటి పన్ను అంటూ మునిసిపాలిటీ రెవిన్యూ వారు ,
- *పొల్యూషన్ ఎక్కువవుతుందని పొల్యూషన్ కంట్రో బోర్డ్ వారు ,
- *క్లినిక్ ముందు రోడ్ మీద చెత్త ఎత్తడానికి మామూళ్ళు అడిగే రోడ్ స్లీపర్లు ,
- *హెవీ మిషనరీ లోడ్ చెక్ అప్ అని కరంటు డిపార్ట్మెంట్ వారు లంచాలు ,
- *నాలా పన్ను అని నర్సింగ్ హోమ్ చుట్టు ప్రక్కల ఉన్న ఖాళీ స్థలానికి పన్ను వసూలుచేసే రెవిన్యూ శాఖ వారు . . . . పెట్టే వేదింఫులు ఇంతా . . అంతా అని చెప్పలేము . చెప్పేవికావు .
ఎందుకిలా మారింది. కాలము మారిందా?.డాక్టర్లు మారారా? . .ప్రభుత్వాలే కారణమా?.. లేక ప్రజల దృక్పదములో మార్పు వచ్చిందా?.
అబ్బా ... ఇంత టెన్‌షనా? అసలు ప్రశాంతత లేదు . మరి వైద్యమెలా చేయడము !
- =========================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.