Monday, August 26, 2013

How far exercise necessary for health?-వ్యాయామము ఆరోగ్యానికి ఎంత అవసరము?

  •  


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -How far exercise necessary for health?-వ్యాయామము ఆరోగ్యానికి ఎంత అవసరము?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మనము జీవించాలంటే  శ్వాసించడము , తినడము , నిద్రించడము లాగే కొంత వ్యాయామము కూడా అవసరము . పసిపిల్లలకు తొలిరోజుల్లో  రోదనము  ఆరోగ్యము . ఎదుగుతున్న, వయస్సు నిండి వృద్దాప్యము దాకా జీవితపు అన్ని అవస్థలలోనూ దానికి తగ్గ వ్యాయామము అవసరము .ప్రతి ఒక్కరికీ వ్యాయామము అవసరము . వ్యాయామము చేయడము వలన ఎన్నో అనారోగ్య పరిస్థితులనుండి విముక్తి పొందగలము . పలానా వ్యాయామము చేయాలా? ఏది చేస్తే బాగుంటుంది . రోజులో ఎప్పుడు చేయాలి ... ఇంకా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతుంటాయి. నిజానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమయ్యే వ్యాయామానికి ఒక పద్దతి , టైమ్‌ అంటూ ఏమీ అవసరము లేదు. శరీర కదలికలు . చెమటపట్టే వరకు సుమారు 30-45 నిముషాలు వారానికి 5 రోజులు మనకి నచ్చిన వ్యాయామము చేయవచ్చును. నడక , తోటపని, ఆటలు ఆడుకొనుట (టెన్నిస్ , బేట్మింటన్‌ , షటిల్ కాక్ , రింగ్ టెన్నిస్ , కబటి ,వాలీబాల్  మున్నగునవి . చివరికి ఇల్లు ఊడ్చడము , బట్టలు ఉతకడము , ఇంటిపనులు చేసుకోవడమూ కూడా వ్యాయామాలే .

బహుశా పూర్వము మనిషికి ఇప్పుడున్నంత వత్తిడి, చెడు ఆలోచనలు ఉండేవికావు . . . కాబట్టి శరీరము పై చెడుప్రభావము లేకుండా ఉండి ఉండవచ్చు. కాని ప్రస్తుతము పగలు , రాత్రులు ఉద్యోగము చేసి ఏదో ఒకటి  తినేసి జీవించే ఈ నాటి జీవన విధానానికి తప్పకుండా వ్యాయామము అవసరము .అదీ మనకి అవసరమైనంతవరకే చేయాలి. మనము దేసే ఉద్యోగాలలో 80% కుర్చీలో కూర్చుని చేసేవే . మరికొంతమందికి వ్యాయామమే కాని శరీరశ్రమ చాలా తక్కువ . వాహనాల సౌకర్యము రోజురోజుకీ ఎక్కువ అవడము వలన సాధారముగా మనము చేసుకునే కొద్దిపాటి శ్రమను కూడా చేయలేకపోతున్నాము . దానివలన చిన్నవయసులోనే లావు అవడము , కీళ్ళనొప్పులకు గురి అవడము , అజీర్ణము తో బాధపడడము , పొట్ట బాగా పెరగడము ఇలా ఎన్నో ఇబ్బందులు ... దానికి పరిష్కారము సరైన వ్యాయామము స్త్రీ ,పురుషులిద్దరికీ అవసరము .
  • మనకి కావల్సిన మంచి కొలెస్ట్రాల్ ' HDL' ను పెందుతుంది. 
  • చర్మము యొక్క రక్తప్రసరణ పెంచి కాంతివంతము చేస్తుంది. 
  • బి.పి.ని తగ్గిస్తుంది, మధుమేహ వ్యాదిని అదుపులో ఉంచుతుంది. 
  • శరీరములోని వివిధ అవయవాలకు ప్రాణవాయువును చక్కగా అందిస్తుంది. 
  • పక్షవాతము , గుండె పోటు .. వంటి ఎటాక్స్ రాకుండా కాపాడుతుంది. 
  • ఎముకల పటిస్టతను బలపరుస్తుంది. 
  • శరీరము లో ఫ్రీ రాడికల్స్ ... వ్యర్ధపదార్ధాలను విసర్జించే ప్రక్రియను వేగవంతము చేస్తుంది . 
  • కేలరీల శక్తి ఉపయోగించడము వలన బరువు పెరిగే అవకాశము , ఊబకాయము నివారించవచ్చును .


  • Exercise is a medicine-వ్యాయామమే ఔషధం.

శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆకృతిని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గటానికి తోడ్పడుతుంది. గుండె బలోపేతం కావటానికీ.. జీవనకాలం పెరగటానికీ దోహదం చేస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింపజేయటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నెన్నో. రోజుకి కనీసం 30 నిమిషాలు సేపు వ్యాయామం చేసినా చాలు. చాలా జబ్బుల బారినపడకుండానూ చూసుకోవచ్చు. నిజానికి శరీర సామర్థ్యం లోపిస్తే చిన్న చిన్న సమస్యలైనా పెద్దవిగా మారతాయి. వ్యాయామం ద్వారా ఇలాంటివాటిని దూరం చేసుకోవచ్చు. అందుకే ప్రస్తుతం వ్యాయామాన్ని కూడా చికిత్సలో భాగంగా చూస్తున్నారు. కొన్ని జబ్బులు తగ్గటంలో వ్యాయామం ఎలా తోడ్పడుతుందో చూద్దాం.

* ఆందోళన: దీర్ఘకాలం ఆందోళనతో సతమతమయ్యేవారికి కుంగుబాటు వంటి మానసిక సమస్యల ముప్పూ ఎక్కువే. వ్యాయామంతో వీటి బారినపడకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి ఆందోళన ముప్పు 25% తక్కువగా ఉంటున్నట్టు పరిశోధనలు పేర్కొంటున్నాయి. వ్యాయామం మూలంగా మనసును ఉత్సాహపరిచే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ముఖ్యంగా ధ్యానం వంటి శ్వాస సంబంధ పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. మిగతా వ్యాయామాలూ పనికొస్తాయి. వీటిని ఎక్కువగా చేస్తే ఫలితమూ అధికంగా ఉంటుంది.

* జ్ఞాపకశక్తి క్షీణత: వ్యాయామం మూలంగా మెదడుకు రక్తసరఫరా మెరుగవుతుంది. అలాగే జ్ఞాపకశక్తిని నియంత్రించే భాగాలూ వృద్ధి చెందుతాయి. వ్యాయామం చేసేవారు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవటం, ఒకేసారి వివిధ లక్ష్యాలను ఛేదించటం, ప్రణాళికా రచన వంటి పరీక్షల్లో చురుకుగా ఉంటున్నట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకే తరహా కన్నా కొత్తరకం వ్యాయామాలు చేస్తే.. కొత్త నైపుణ్యాలను నేర్చుకునేలా మెదడు తర్ఫీదు పొందుతుంది కూడా. కాబట్టి డ్యాన్స్‌, ఆటలు, పెరట్లో మొక్కలు నాటటం, సైకిల్‌ మీద కాత్త దారిలో వెళ్లటం.. ఇలా కొత్తకొత్త పద్ధతుల్లో ప్రయోగాలు చేయటం మంచిది.

* నిద్ర సమస్యలు: వ్యాయామం వల్ల మెదడుకు రక్తసరఫరా పెరుగుతుంది. రక్తంతో పాటు ఇనుము కూడా మెదడుకు అందుతుంది. ఇది నిద్ర బాగా పట్టటానికి తోడ్పడుతుంది. వ్యాయామం చేసేవారు మిగతావారికన్నా గాఢంగా, నిద్రాభంగం లేకుండా హాయిగా నిద్ర పోతున్నట్టు అధ్యయనాల్లో వెల్లడైంది. నిద్రలేమితో బరువు పెరగటం, నిస్సత్తువ, అలసట, గుండెజబ్బు, ఒత్తిడిని తట్టుకోలేకపోవటం వంటి సమస్యలు దాడిచేస్తాయి. వ్యాయామం ఇలాంటి వాటి బారినపడకుండా కాపాడుతుంది కూడా. నిద్రపోతున్నప్పుడు శ్వాసకు అడ్డంకి (స్లీప్‌ అప్నియా) తలెత్తే సమ్యతో బాధపడేవారు మరింత ఎక్కువగా వ్యాయామం చేయటం మంచిది. దీంతో బరువు తగ్గి, సమస్య దూరం కావటానికి అవకాశముంది.

*ఆస్థమా: గుండె రక్తనాళాల ఆరోగ్యం బాగుంటే ఆస్థమా లక్షణాల తీవ్రతా తగ్గుతున్నట్టు అధ్యయనాల్లో బయటపడింది. బరువు పెరగటం మూలంగా కొవ్వు కణాలు శరీరంలో వాపును తెచ్చిపెడతాయి. ఇది ఆస్థమా తీవ్రం కావటానికి దోహదం చేస్తుంది. కాబట్టి వ్యాయామంతో.. ముఖ్యంగా గుండెను బలోపేతం చేసే ఏరోబిక్‌ వ్యాయామాలతో ఆస్థమా లక్షణాలు తగ్గే అవకాశముంది. అయితే ఆరుబయట వ్యాయామం చేసేవారు కాలుష్యం, పుప్పొడి, చల్లటిగాలి వంటి ఆస్థమా ప్రేరకాల బారిన పడకుండా చూసుకోవాలి.

* స్తంభనలోపం: శృంగారంపై అనాసక్తికి, స్తంభనలోపానికి దారితీసే ఒత్తిడి, నిద్రలేమి, నిస్సత్తువ, గుండె సమస్యల వంటివన్నీ వ్యాయామంతో దూరమయ్యేవే. ముఖ్యంగా నడుము కింది భాగానికి రక్తసరఫరాను పెంచే వ్యాయామాలు ఈ విషయంలో బాగా ఉపయోగపడతాయి.

* వెన్ను, తుంటి, మోకాలు, మెడ నొప్పులు: కండరాల బలహీనం మూలంగానూ నొప్పులు వస్తుంటాయి. ఉదాహరణకు తొడ నుంచి సాగే ఇలియోటిబియల్‌ కండరబంధనం బలహీనమైతే మోకాలు నొప్పి రావొచ్చు. చాలాసేపు కంప్యూటర్‌ ముందు వంగి కూచోవటం వల్ల భుజం, మెడనొప్పి రావొచ్చు. ఆయా కండరాలను బలోపేతం చేసే, సాగదీసే వ్యాయామాలతో ఇలాంటి నొప్పులను దూరంగా ఉంచుకోవచ్చు.

  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.