Tuesday, August 16, 2011

ఆడువారి ఆరోగ్యానికి అవసరమైన 6+3 ఫార్ముల , woman needs 6+3 formula for good health



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -6+3 విటమిన్‌ ఫార్ములా- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

తాము మంచి పోషకాహారాన్నే తింటున్నామని అనుకునే చాలా మంది మహిళలు కుఖ్యమైన ఆరు విటమిన్లు , మూడు ఖనిజాలు విస్సవుతుంటారు . ఆ ముఖ్యమైన పోషకాలు ఏమిటి , అవెందుకు అవసరము . వేటిలో లభస్స్తాయన్న అవగాహనే ఈ వ్యాసము ప్రధాన ఉద్దేశము .

విటమిన్లు :
1.విటమిన్‌ బి 6 : మంచి నిద్ర , జీర్ణశక్తి , మంచి మూడ్ లను క్రమబద్దీకరిస్తుంది . నాడీవ్యవస్థ సక్రమముగా పనిచేయడానికి సహకరిస్తుంది .
వేటిలో అభిస్తుంది . : ఉడికించిన చిలకడదుంప , అరటి పండు , ఉడికించిన చికెన్‌ . మున్నగునవి .

2.విటమిన్‌ బి 12 : చురుకుదనాన్ని పెంచి అలసటతో పోరాడు తుంది . ఎర్ర రక్త కణాల్లోని హీమోగ్లోబిన్‌ తయారీకి ఇది తప్పనిసరి .
వేటిలో అభస్తంది : పెరుగు , గుడ్లు , మాంసము , దానిమ్మ పండ్లు . ఇవి తినని వారు బి 12 మాత్రలు రూపము లో తీసుకోవాలి .

3. ఫోలేట్ (విటమిన్‌ బి-9): ముక్కముగా మెదడు , వెన్నెముక లోపాల్ని అరికట్టేందుకు గర్భము దాల్చిన తొలివారాల్లో ఇది చాలా కీలకము. కోలన్‌ , బ్రెస్ట్ . క్యాన్సర్ వచ్చే అవకాశాఅల్ని తగ్గించడములో ఇది సహకరిస్తుంది .
వేటిలో లభస్తుంది . : ఆకుకూరల్లో- పాలకూర , పప్పు గింజలలో-చిక్కుడు , శనగలు , గుడ్డు సొన , సన్‌ఫ్లవర్ గింజలు , కాలేయము , ఆరెంజ్ జ్యూస్ , ద్రాక్ష మున్నగునవి .

4. విటమిన్‌ డి 3 : కాల్సియం absorption లో తోడ్పడుతుంది . ఎముకలు , కండరాలు బలోపేతము చేస్తుంది . ఆటోఇమ్యూన్‌ వ్యాధుల నుంచి , బ్రెస్ట్ , ఒవేరియన్‌ క్యాన్సర్ల నుండి పరిరక్షిస్తుంది .
వేటిలో లభిస్తుంది : గుడ్లు , పాలు , కాడ్ లివర్ ఆయిల్ , ‌ పుట్టగొడుగులు ,ఆకుకూరలు , పండ్లు . సూర్యరశ్మి తగిలితే మన చర్మమే దీనిని తయారు చేసుకుంటుంది .

5. విటమిన్‌ -సి : మృదులాష్తి , ఎముక , డెంటీన్‌ ల మాత్రికను , రక్తనాళాల ఎండోథీలియం ను ఆరోగ్యముగా ఉంచుతుంది . వ్యాధినిరోధకశక్తిని పెంపొందిస్తుంది , రక్తములో కొలెస్టిరాల్ ను కరిగిస్తుంది , ఇనుము శోషణాన్ని అధికము చేస్తుంది , స్కర్వే వ్యాధి రాకుండా కాపాడు తుంది .
వేటిలో లభస్తుంది : నిమ్మజాతి పండలలోను , ఉసిరి , ఆకుకూరలలోను , తాజా బంగాళా దుంప , టమాటో మున్నగునవి .

6.విటమిన్‌ -ఇ & కె : స్త్రీలలో సంతాన సాఫల్యము కోసము ఇది సహకరిస్తుంది . చర్మము , కేశాలు మంచి లస్టర్ గా , అందము గా కనిపించేందుకు , గుండె జబ్బు నివారణలోనూ ఉపయోగపడును.
వేటిలో లభిస్తుంది : వీట్ జర్మ్‌ ఆయిల్ , సన్‌ఫ్లవర్ ఆయిల్ , బాదము , స్పినాచ్ , టొమాటొ , మామిడి , బొప్పాయి మున్నగునవి .
విటమిన్‌ -కె : ఎర్రరక్త కణాలు తయారీకి , రక్తము గడ్డకట్టుటలో సహకరిస్తుంది . రోజుకి 90 mcg ఆడవారికి అవసరము .
వేటిలో లభిస్తుంది : spinach , కాబేజీ , కోసుపువ్వు (క్యాలీఫ్లవర్ ) , కివి ఫ్రూట్స్ , ద్రాక్ష , లివర్ ఉత్పత్తు లలో లభంచును .
ఖనిజలవణాలు :
1.ఐరన్‌(ఇనుము) : ఎర్రరక్తకణాలు తయారీకి ఐరన్‌ తప్పనిసరి . రక్తహీనత రాకుండా కాపాడుతుంది . మెదడు పనితీరు సక్రమముగా , ఉసారుగా ఉండి సంతాప్రాప్తికి దోహదపడుతుంది .
వేటిలో లభస్తుంది : మాంసము , రొయ్యలు , అన్ని ఆకుకూరలు , చిక్కుడు జాతి కూరలు , కాయదాన్యాలు ,శెనగలు (పీస్ ), బెల్లము , మున్నగువాటిలో లభించును .

2.కాల్సియం : గర్భిణి స్త్రీలకు , పెరిగే పిల్లలకు ... మీనోపాజ్ , యాండ్రో పాజ్ వయసు వచ్చిన పెద్దవాళ్ళకు కాల్సియం అవసరము . ఎముకల విరిగిపోకుండ , రక్తపోటు క్రమబద్ధీకరించును . ఆస్టియోపొరోసిస్ అనే ఎముకల వ్యాధి బారిన పడకుండా కాల్సియం తప్పనిసరి .
వీటిలో లభించును : పాలు , పాల ఉత్పత్తులు , ఆకు కూరలు, జున్ను, గోధుమ పొట్టులో పుష్కలంగా లభ్యమవుతుంది.

3.జింక్ & క్రోమియం :
జింక్ ఒక ముఖ్యమైన సూక్ష్మమూలకము , సుమారు 300 వరకూ శరీరములోని ఎంజైముల తయారీకి ఇది అవసరము . కణవిభజనకు , డి.ఎం.ఎ. & ప్రోటీన్ల తయారీకి , కణజాలము పెరుగుదలకు , గాయాలు మానుటకు , వ్యాధినిరోద మండలము అభివృద్ధి కి , ప్రోస్టాగ్లండిన్‌ ఉత్పత్తికి , ఎముకల తయారీవధానములోను , థైరాయిడ్ పనిలోను , రక్తము గడ్డకట్టుటలోను , కడుపులో శి్శువు పెరుగుదలకు , పురుష బీజకణాల ఉత్పత్తికి . . . జింగ్ అవసరము .
క్రోమియం : యాంటీఆక్షిడెంట్ గా పనిచేసి ఫ్రీ రాడికిల్స్ ను బయటికి నెట్టివేయును , గుండె , రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడును , ఇన్సులిన్‌ పనితనాని ఎక్కువచేయడం ద్వారా రక్త ము లోని చెక్కెర స్థాయిలను అదుపుచేయుటలోను , ఫాట్ మెటబాలిజం లో సహాయపడును . brewer's yeast, sweet potato , corn , whole grains , meat and seafood లలో లభించును .
  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.