Wednesday, August 17, 2011

Mouth wash , మౌత్ వాష్ ,నోటిని శుబ్రపరిచే ద్రావకము



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మౌత్ వాష్ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మౌత్ వాష్ లేదా మౌత్ రింజ్ ని నోటి శుభ్రత కోసం వాడే ఒక ద్రావకము . నోటి దుర్వాసన పోగొట్టి , దంత రక్షణకు ఉపయోగపడును . నోటి లో చేసే ఏవైనా ఆపరేషన్స్ ఇన్ఫెక్షన్‌ అవకుండా మౌత్ వాష్ వాడుతారు . మౌత్ వాష్ ఎన్నో ఏళ్ళ నుండి సుమారు క్రీ.పూ. 2700 కాలము నుండీ వాడుకలో ఉంది . గ్రీకులు , రోమన్లు ... ఉప్పు , ఆలం , వెనిగర్ మిశ్రమాన్ని వాడేవారు . తరువాత కాలములో లీవెన్‌ హాక్ .. సూక్ష్మజీవులు కనుగొన్న తర్వాత నోటిదుర్వాసనకు క్రిములే కారణమని తలుసుకొని ఎన్నోరకాల యాంటిసెప్టిక్ మౌత్ ద్రావకాలు కనుగొనబడ్డాయి. కొంతమంది ధనిక గ్రీకులు , రోమన్లు నోటి సువాసనకు మౌత్ వాష్ లను వాడేవారు . 1960 లో రోయల్ డెంటల్ కాలేజీ ప్రొఫెసర్ " హెరాల్డ్ లోయ్ " దంతాల పై " డెంటల ప్లేక్స్ " ను రాకుండా ఉండేందుకు " క్లోర్ హెక్షిడిన్‌ " రసాయనాన్ని వాడకాన్ని ఉపయోగపడుతుందని కనిపెట్టడం తో దంత వైద్యము లో చాలా ఉపయోగకరము గా తయారయినది . అప్పటినుండి వ్యాపారపరముగా మౌత్ వాష్ లు తయారీ మొదలైనది .
ఒకవేళ పుక్కిలించేటప్పుడు ఈ మౌత్వాష్ పొరపాటున కడుపులోకి వెళ్ళినా ఎలాంటి సమస్యా ఉండదు. బ్యాక్టీరియాలో అనేక రకాలు నోటి దుర్వాసనకు కారణమవుతుంటాయి. ... దీనికోసం నాలుకను నాలుకబద్దతో శుభ్రం చేసుకోవడం, మౌత్వాష్ ఉపయోగించడం వంటివి చేయాలి.

ముఖ్యము గా వాడే మూలపదార్ధాలు :(Active ingredients in commercial brands of mouthwash )

  • థైమాల్ --thymol,
  • యూకలిప్టాల్ --eucalyptol,
  • హెక్షిడిన్‌ --hexetidine,
  • మిథైల్ సాలిసిలేట్ --methyl salicylate,
  • మెంథాల్ ---menthol,
  • క్లోర్ హెక్షిడిన్‌ గ్లుకొనేట్ --chlorhexidine gluconate,
  • బెంజాల్ కోనియం క్లోరైడ్ --benzalkonium chloride,
  • సిటైల్ పిరిడియం క్లోరైడ్ --cetylpyridinium chloride,
  • మిథైల్ పేరాబెన్‌ --methylparaben,
  • హైడ్రోజన్‌ పెరాక్షైడ్ --hydrogen peroxide,
  • డోమిఫెన్‌ బ్రోమైడ్ --domiphen bromide
  • ఫ్లోరైడ్ ---fluoride,
  • ఎంజైంస్ --enzymes,
  • కాల్సియం --calcium. మున్నగునవి .
ఇంకా ఇవి కాకుండా నీరు , స్వీట్నర్స్ అయిన సార్బిటాల్ -సూక్రలోజ్ -సోడియం సాక్కరిన్‌ -జైలిటాల్ (as a bacterial inhibitor) కలిపి ఉంటాయి .

మౌత వాష్ ఉపయోగాలు :
నోటి దుర్వాసనకోసము పుక్కలించడానికి సుమారు 20 మి.లీ. బ్రుష్ చేసుకున్న తర్వాత రోజూ రెండు పూటలూ చేయాలి . సుమారు అర నిముషము నోటిలో ఉంచి ఉమ్మివేయాలి . ఉదా:
లిస్టిర్న్‌(Listerine),
టోటల్ కేర్ (Total care)
హెక్షిన్‌ మౌత్ వాస్ (hexin mouth wash)
బెటాడిన్‌ మౌత్ వాష్ (Betadine),
వకాడిన్‌ (wakadin)మౌత్ వాష్ , మున్నగునవి మార్కెట్ లో లభిస్తున్నాయి.

దంతాల సంరక్షణ కు మంచి ఫలితాలు అందిస్తాయి . బ్రుష్ చేరలేని దంత బాగాలలోని బాక్టీరియాను ఈ మౌత్ వాష్ లు శుబ్రము చేస్తాయి . జింజివైటిస్ నయమవుతుంది . దంతగార తొలగిపోతుంది . .. దంత క్షయము నివారణ జరుగుతుంది .

హెర్బల్ మౌత్ వాష్ లు :
  • పెర్సికా (persica)--ఇది చిన్న మొక్క . దీని బెరడు , ఆకులు దంతరక్షణకు వాడుతారు .
  • సీసం ఆయిల్ ,
  • సన్‌ఫ్లవర్ ఆయిల్ ,
  • పుదీన ఆకు , ల నుండి తయారైన దావకాలు నోటిశుబ్రతకు వాడుతారు .

సైడ్ ఎఫెక్ట్స్ & ప్రమాదాలు :
  • కొన్ని మౌత్ వాష్ లు ఆల్కహాల్ ను కలిగిఉంటాయి . వీటివలన నోటి క్యాన్సర్ వచ్చేఅవకాశముంది .
  • డెంటల ఎరోజన్‌ ,
  • పళ్ళు రంగు మారె ప్రమాదము ఉంది ,
  • కొన్ని మౌత్వాష్ ల వల్ల రుచి తెలుసుకునే శక్తి తగ్గే అవకాశము ఉందనని అంటారు .
  • చిన్నపిల్లలు ప్రమాదవసాత్తు తాగేస్తే విషం గా ప్రమాదం సంభవించవచ్చును .



source : written / Dr.Seshagirirao -MBBS

  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.