రక్త నాళ కుడ్యాలలో కొవ్వు పేరుకు పోవడం వలన రక్త నాళాలు కుంచించుకపోయినపుడు, లేదా ఆటంకానికి గురైనపుడు, వాటిని యాంత్రికంగా వెడల్పు చేసే పద్ధతిని యాంజియోప్లాస్టీ అంటారు. మార్గదర్శిగా ఉన్న తీగపై, ఖాళీగా, ముడుచుకొని ఉన్న స్థితిలో ఉన్న బెలూన్‌ని బెలూన్ కెథటార్ అంటారు. దీనిని కుంచించుకపోయిన ప్రదేశాలలోకి చొప్పించి, ఆ తర్వాత, దానిలోకి మామూలు రక్త పీడనం(6-20 అట్మాస్పియర్లు) కన్నా 75 నుండి 500 రెట్లు ఎక్కువగా నీటి ఒత్తిడిని పంపి బెలూన్‍ను ఉబ్బేటట్లు చేస్తారు. అప్పుడు ఈ బెలూన్ కొవ్వు నిల్వలపై ఒత్తిడి కలుగజేస్తుంది. తద్వారా రక్తనాళాలు తెరుచుకునేలా చేసి రక్తప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది. అలా చేసాక ఈ బెలూన్‌ని తిరిగి పూర్వపు స్థితికి తెచ్చి, దాన్ని ఉపసంహరిస్తారు.
ఈ పదము గ్రీకు భాషలోని యగియోస్ , ప్లాస్టోస్ అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. యగియోస్ అంటే "నాళము" అని అర్థం. ప్లాస్టోస్ అంటే "రూపొందిన', "మలచిన" అని అర్థం. యాంజియోప్లాస్టీ ద్వారా అన్ని రకాల ప్రసరణ సంబంధమైన సమస్యలను, రక్తనాళాల ద్వారా చొప్పించే విధానం ద్వారా గానీ, లేదా చర్మం ద్వారా చొప్పించే విధానం ద్వారా గానీ పరిష్కరించవచ్చు
చరిత్ర
యాంజియోప్లాస్టీని మొదట చార్లెస్ డాటర్ అనే ఇంటర్‌వెన్షనల్ రేడియాలజిస్ట్, 1964లో ఉపయోగించాడు. యాంజియోప్లాస్టీని, కెథటార్ ద్వారా చొప్పించే స్టంట్‌ని కనుగొనడం ద్వారా డా.డాటర్ ఆధునిక వైద్య విధానానికి ఆద్యుడయ్యాడు. దీన్ని ఆయన పరిధీయ ధమని వ్యాధికి చికిత్స చేయడానికి వాడాడు. 1964, జనవరి 16లో, సాధారణ స్థితిలో కూడా రక్తం గడ్డకట్టే వ్యాధితో, మానని గాయంతో బాధ పడుతూ, కాలును తీసివేయడానికి అంగీకరించని 82 సంవత్సరాల స్త్రీకి, డా.డాటర్ చర్మం ద్వారా బెలూన్‌ని చొప్పించి, కుంచించుకపోయిన పరిధీయ ఊరుధమని(SFA)ని వెడల్పు చేసాడు. మార్గదర్శక తీగ, కోయాక్సియల్ టెఫ్లాన్ కాథటార్స్‌లతో కుంచించుకపోయిన ధమనిని వెడల్పు చేసాక, కాలులో తిరిగి రక్తప్రసరణ మామూలు స్థితికి వచ్చింది. ఇలా వెడల్పు చేసిన ధమని, ఆమె న్యుమోనియాతో చనిపోయేంతవరకూ, రెండున్నర సంవత్సరాల పాటు అలాగే పని చేసింది. చార్లెస్ డాటర్‍ను "ఇన్వెన్షనల్ రేడీయాలజీ పితామహుడ"ని పిలుస్తారు. ఆయన చేసిన కృషికి గాను, 1978లో వైద్యరంగంలో నోబెల్ బహుమతినోబుల్ ప్రైజ్కు ఎంపికయ్యాడు.
మొట్టమొదటి కరోనరీ యాంజియోప్లాస్టీని 1977లో జర్మన్ హృద్రోగనిపుణుడు యాండ్రెస్ గ్రుయెంట్‍జిగ్, మెలకువగా ఉన్న ఒక రోగికి చేసాడు.హృదయ
ధమని వ్యాధికి కారణాలు
అధిక రక్త పీడనము, మధుమేహం, కనీస వ్యాయమంలేని జీవితం, పొగతాగడం, కొలస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, హృదయ సంబంధ వ్యాధులుండడం వలన ధమనులలో రక్త ప్రవాహం ఆటంక పరచబడుతుంది. యాంజియోప్లాస్టీ ద్వారా ఈ ఆటంకాలను తొలగించవచ్చు.యాంజియోప్లాస్టీ బైపాస్ శస్త్ర చికిత్స కన్నా సురక్షితం. ఈ విధానంలో చికిత్స చేయించుకున్న వారిలో 1% మంది మాత్రమే చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత ఈ క్రింద చెప్పిన సమస్యలు తలెత్తవచ్చు:
ధమనికి గాయం కలగడం వల్ల రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోవచ్చు. హృదయ కుఢ్య కణక్షయం జరగవచ్చు. దీనిని సాధారణంగా స్టంట్తో బాగు చేస్తారు.
గడ్డ కట్టిన రక్తం తొలగించడం వల్ల కొన్ని సందర్భాలలో గుండె పోటు రావచ్చు.( యాంజియోప్లాస్టీ చికిత్స తీసుకుంటున్న వారిలో 1%కంటే తక్కువ రోగులలో ఇలా జరిగింది.)
కాథటర్ను అమర్చిన చోట రక్తం కారడం లేదా గాయం అవడం సంభవించవచ్చు:
ఎక్స్-రే తీసేటప్పుడు దాని కోసం ఉపయోగించే అయోడిన్ కాంట్రాస్ట్ వర్ణకం వల్ల, మూత్ర పిండ వ్యాధి, మధుమేహం ఉన్న వారిలో మూత్ర పిండ సమస్యలు తలెత్త వచ్చు. ఇలాంటప్పుడు యాంజియోప్లాస్టీ చేయడానికి ముందుగాని, చేసిన తర్వాత గానీ రక్తనాళాలలోకి ద్రవాలను ఎక్కించడం ద్వారా , మందుల ద్వారా నష్టం కలిగే అవకాశాలను తగ్గిస్తారు.
అరీథిమా (గుండె సరిగా కొట్టుకోకపోవడం);
యాంజియోప్లాస్టీ చేస్తున్నప్పుడు వర్ణకం వల్ల వేదనాత్మక ప్రతిచర్య కలిగే అవకాశం ఉంది.
3 నుండి 5% కేసులలో హృదయ కుఢ్య కణ క్షయం జరిగే అవకాశం ఉంది.
ఈ విధానంలో హృదయ ధమనిని అత్యవసరంగా బైపాస్ పద్ధతిలో అతికించాల్సిన అవసరం ఏర్పడచ్చు. (2 నుంచి 4% మందిలో) ధమని మూసుకుపోయినపుడు ఇలా చేయాల్సి వస్తుంది:
యాంజియోప్లాస్టీ చేసాక ఏర్పడే సాధారణ సమస్యలలో ధమని తిరిగి కుచించుకుపోవడం ఒకటి. యాంజియోప్లాస్టీ చేసాక కొన్ని వారాల తర్వాత గానీ, కొన్ని నెలల తర్వాత గానీ, రక్తనాళం క్రమంగా కుంచించుకపోవచ్చు. అధిక రక్త పీడనం మధుమేహం, ఛాతినొప్పి, మూత్రపిండ వ్యాధి ఉన్నవారిలో ఇలా జరగడానికి అవకాశం ఉంది.
యాంజియోప్లాస్టీ చేసాక కొన్ని గంటల తర్వాత గానీ, కొన్ని నెలల తర్వాత గానీ స్టంట్‌లలో రక్తం ( స్టెంట్‍లో థ్రాంబోసిస్) గడ్డ కట్టవచ్చు. దీనివల్ల హృదయ కుఢ్య కణ క్షయం జరగవచ్చు.
యాంజియోప్లాస్టీ వల్ల, 75 ఏళ్ళకు మించినవారి లోనూ, మధుమేహ వ్యాధితో బాధపడే వారిలోనూ, తీవ్రమైన హృదయ సంబంధ వ్యాధులున్న వారిలోనూ, హృదయ ధమనులలో రక్తం గడ్డకట్టిన వారిలోనూ ఎక్కువగా సమస్యలు తలెత్తుతాయి. రక్త పంపిణి సరిగా లేని వారిలోనూ, స్త్రీలలోనూ ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ.
యాంజియోప్లాస్టీ వల్ల హృదయ కుఢ్య కణ క్షయం, గుండెపోటు, మూత్ర పిండ సమస్యలు చాలా అరుదుగా మాత్రమే తలెత్తుతాయి. దీనివల్ల చనిపోయే రోగుల శాతం కూడా చాలా తక్కువ. ఇది 0.1% మాత్రమే ఉంది.(బైపాస సర్జరీలో ఇది 1% నుంచి 2% వరకు ఉంది.) మొత్తం మీద యాంజియోప్లాస్టీ వల్ల తలెత్తే నష్టం, దాని వల్ల కలిగే ప్రయోజనంతో పోలిస్తే సాపేక్షికంగా తక్కువగానూ, ఆమోదయోగ్యంగానూ ఉంది (నష్టం కలిగే అవకాశం - ప్రయోజనాల నిష్పత్తి ).
వివాదం--గుండె నొప్పికి గురైన రోగులను కాపాడడంలో(ధమనిలో ఏర్పడిన ఆటంకాన్ని తక్షణం తొలగించడంలో) యాంజియోప్లాస్టీ ఉపయోగాన్ని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ యాంజియోప్లాస్టీ వల్ల తలెత్తే సమస్యలను తగ్గించే విషయంలోమాత్రం ఈ అధ్యయనాలు విఫలమయ్యాయి. యాంజియోప్లాస్టీ vs. ఛాతి నొప్పి స్థిరంగా ఉన్న రోగులకు చేసే వైద్య చికిత్సా విధానం. ధమనిని తెరిచే విధానం తాత్కాలికంగా ఛాతి నొప్పిని తగ్గిస్తుంది. కానీ అది ఎక్కువ కాలం నొప్పిని ఆపలేదు. "చాలా గుండెనొప్పులు ధమనులు కుంచించుకపోయి ఆటంకాలు ఏర్పడడం వల్లనే కలగవు".
పొగ తాగడం ఆపివేయడం, వ్యాయామం, రక్తపోటును నియంత్రించే మందులను వాడుతుండడం, తద్వారా కొలెస్టరాల్‍ను తగ్గించుకోవడం, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడం వంటి చర్యల ద్వారా రోగులలో గుండె నొప్పిని శాశ్వతంగా నివారించే వీలుంది.
ఈ విధానం తర్వాత యాంజియోప్లాస్టి చేసిన తర్వాతా చాలా మంది రోగులను రాత్రంతా పరిశీలనలో ఉంచుతారు. సమస్యలేవీ కనిపించనట్లయితే మరుసటి రోజు రోగిని ఇంటికి పంపిస్తారు.
కెథటార్ అమర్చిన ప్రాంతంలో రక్తస్రావం జరుగుతున్నదా, వాపు ఏమైనా వచ్చిందా, గుండె సరిగా కొట్టుకుంటుందా, రక్త పీడనం ఎలా ఉంది వంటి విషయాలను పర్యవేక్షిస్తారు. ధమనులు సంకోచించినపుడు సాధారణంగా మందులనుపయోగించి తగ్గిస్తారు. ఈ విధానం తర్వాత రోగులు ఆరు గంటల కల్లా అతి కష్టం మీద నడవగలుగుతారు. ఒక వారం తర్వాత మామూలు స్థితికి వస్తారు.
యాంజియోప్లాస్టీ అయ్యాక కొన్ని రోజుల పాటు శారీరక కార్యకలాపాలు ఆపాల్సి ఉటుంది. బరువులు ఎత్తకూడదని, చిన్నపిల్లలను కూర్చోబెట్టుకోకూడదని, కష్టతరమైన పనులు చేయకూడదని రోగులకు సలహా ఇస్తారు. సున్నితమైన బెలూన్ యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత కనీసం రెండు వారాల దాకా శరీరానికి కష్టం కలిగే పనులు, ఎక్కువ సేపు ఆటలాడడం వంటివి చేయకుండా ఉండాలి.
రోగులలో రక్త స్కందన నిరోధానికి ఎసిటైల్‍సాలిసిలిక్ ఆమ్లముతో పాటుగా అదే సమయంలో క్లొపిడోగ్రెల్ను ఇస్తారు. ఈ మందులను రక్త గడ్డ కట్టకుండా ఉండేందుకు ఇస్తారు. వీటిని చికిత్స చేయించుకున్న నాలుగు నెలల వరకు వాడాల్సి ఉంటుంది. చాలా సందర్భాలలో, రోగులు ఈ మందులను ఒక సంవత్సరం పాటు వాడుతుంటారు. దంత చికిత్సను చేయించుకుంటున్న రోగులకు ఎండోకార్డైటిస్ సమస్య తలెత్తే అవకాశం, గుండెలో సంక్రమణం వ్యాపించే అవకాశం ఉన్నందున ఆ చికిత్సను ఆపివేయమని రోగులకు సలహా ఇస్తారు.
స్టంట్ అమర్చిన చోట వాయడం, రక్తస్రావమవడం, నొప్పి కలగడం, జ్వరం రావడం, నిస్త్రాణ లేదా నీరసంగా అనిపించడం, శరీర ఉష్ణోగ్రతలో మార్పు, లేదా మోచేయి, కాలు రంగు మారిపోవడం, గాలి సరిగా ఆడకపోవడం , ఛాతినొప్పి కనిపించినట్లయితే వెంటనే వైద్య సలహా పొందాలి.
పరిధీయ యాంజియోప్లాస్టీ
పరిధీయ యాంజియోప్లాస్టీ అంటే హృదయ ధమనులకు బయట ఉన్న రక్త నాళాన్ని తెరిచేందుకు బెలూన్‌ని ఉపయోగించడం. ఉదరంలోనూ, కాలులోనూ,వృక్క ధమనులలోనూ కుఢ్యాలకు కొవ్వు పేరుకుని, అవి కుంచించుకుపోయినపుడు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. సిరలు కుంచించుక పోయినపుడు కూడా వాటిని నయం చేయడానికి PA పద్ధతిని ఉపయోగిస్తారు. పరిధీయ యాంజియోప్లాస్టీలో పరిధీయ స్టంటింగ్ తోపాటుగా అథరెక్టమిని కలిపి చేస్తారు.
కరోనరీ యాంజియోప్లాస్టీ
ఎడమ కరోనరీ ప్రసరణను చూపుతున్న కరోనరీ యాంజియోగ్రామ్ (హృదయ ధమనులలో తీసిన ఎక్స్ - రే, రేడియో ఒపెక్ కాంట్రాస్టుతో)దూరస్థ ఎడమ ప్రధాన హృదయ ధమని (LMCA) పటంలో ఎడమ పై భాగపు పావువర్తులంలో ఉంది. దీని ప్రధాన శాఖలలో (పటంలో కనపడుతున్నాయి) ఒకటి , ఎడమ సర్‌క్యుమ్‌ప్లెక్స్ ధమని (LCX)- ఇది పై నుంచి కిందికి, మధ్య నుండి కిందికి వ్యాపించి ఉంటుంది. రెండవది, ఎడమ పూర్వాంత అవరోహణ ధమని(LAD) , పటంలో ఎడమ నుండి కుడికి, మధ్య నుండి కిందికి దూరస్థ LCX కింది భాగంలో చూపించబడింది. LADకు పొడవైన రెండు ఐమూల శాఖలు ఉన్నాయి. ఇవి పటంలో మధ్య పై భాగంలోనూ, మధ్య కుడి భాగంలోనూ వ్యాపించి ఉన్నాయి.
Percutaneous coronary intervention-పర్‌క్యుటేనియస్ కరోనరీ ఇంటర్‌వెన్షన్ ను (PCI ), సాధారణంగా కరోనరీ యాంజియోప్లాస్టీ అని పిలుస్తారు. ఈ చికిత్సా విధానాన్ని కరోనరీ గుండెజబ్బుకు, కుచించుకుపోయిన గుండెయొక్క హృదయ ధమనులను వెడల్పు చేయడానికి ఉపయోగిస్తారు. రక్తనాళాలు కొలస్టరాల్ కారణంగా కుచించుకపోతాయి. ఇది రక్త నాళ కుడ్యాలకు కొవ్వు పేరుకొని పోవడానికి కారణమవుతుంది. PCIని సాధారణంగా ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్నిర్వహిస్తాడు.
స్థిరమైన హృదయ ధమని వ్యాధి ఉన్నవారిలో PCI చికిత్స చేసి ఛాతినొప్పిని తగ్గిస్తాడు. అయితే , హృదయ కుఢ్య కణ క్షయం, ఇతర ప్రధాన హృదయ ప్రసరణ సంబంధమైన సమస్యలు కూడా తోడైనపుడు చనిపోయే అవకాశాన్నితగ్గించలేడు.
వృక్క ధమని యాంజియోప్లాస్టీ-- వృక్క ధమని కుఢ్యాలు కొవ్వుతో పేరుకుపోయి కుచించుకుపోయినపుడు వృక్క ధమని యాంజియోప్లాస్టీ నుపయోగించి చికిత్స చేస్తారు ( పర్‌క్యుటేనియస్ ట్రాన్సులుమినల్ రీనల్ యాంజియోప్లాస్టీ, PTRA ). వృక్క ధమని కుచించుకుపోవడం వల్ల, అధిక రక్త పీడనం, వృక్కాలు సరిగా పని చేయకపోవడం సంభవిస్తుంది.
కరోటిడ్ యాంజియోప్లాస్టీ-- చాలా ఆసుపత్రులలో, ప్రమాదం వాటిల్లే అవకాశం బాగా ఉన్న రోగులలో కుచించుకుపోయిన కరోటిడ్ ధమనిని యాంజియోప్లాస్టీ, స్టంటింగ్ చేసి బాగుచేస్తారు.
మస్తిష్క ధమనుల యాంజియోప్లాస్టీ--1983 లో రష్యా న్యూరో సర్జన్, జుబ్కోవ్ తన అనుచరులతో కలిసి కుచించుకుపోయిన రక్తనాళాలను అన్యురిస్మల్ SAH జరిపిన తర్వాత ట్రాన్సులుమినల్ బెలూన్ యాంజియోప్లాస్టీతో బాగు చేసినట్లుగా చెప్పాడు.
మూలము : వికిపెడియా అంతర్జాలము .
- ============================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.