Wednesday, February 13, 2013

Radiation Therapy Technology TrueBeam ,క్యాన్సర్‌ చికిత్సలో ముందడుగు ట్రూబీమ్‌

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Radiation Therapy Technology TrueBeam ,క్యాన్సర్‌ చికిత్సలో ముందడుగు ట్రూబీమ్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


క్యాన్సర్‌ చికిత్సలో రేడియేషన్‌ అత్యంత కీలకమైంది. శక్తిమంతమైన రేడియేషన్‌ను పంపించి, పక్క కణజాలం దెబ్బతినకుండా క్యాన్సర్‌ కణితి మాత్రమే ప్రభావితమయ్యేలా చేయటం చాలా ప్రధానం. ఈ దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మరో అడుగు ముందుకు తీసుకువెళ్తోంది 'ట్రూబీమ్‌' యంత్రం.

అసాధారణ కణాలు అపరిమితంగా వృద్ధి కావటం. స్థూలంగా చెప్పాలంటే క్యాన్సర్‌ అంటే ఇదే. సాధారణంగా మన శరీరంలోని కణాలు అవసరమైనంత మేరకు విభజన చెందుతుంటాయి. శరీరానికి వాటి అవసరం తీరిపోయాక చనిపోతాయి. అయితే కొన్నిసార్లు ఈ కణాలు అపరిమితంగా పెరుగుతూ, చాలా వేగంగా విభజన చెందుతూ కాన్యర్లుగా మారతాయి. వీటిని తొలిదశలో గుర్తిస్తే చికిత్స చేయొచ్చు గానీ ముదిరితే మాత్రం కష్టం. దీనిబారినపడి ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. అందుకే పరిశోధకులు దీన్ని జయించేందుకు కొత్త కొత్త పద్ధతులను రూపొందిస్తున్నారు. అలాంటి ఒక అధునాతన పరికరమే ట్రూబీమ్‌. దీంతో ఇమేజ్‌గైడెడ్‌ రేడియోథెరపీ, ఇంటెన్సిఫై మాడ్యులేటెడ్‌ రేడియోథెరపీ, ర్యాపిడ్‌ ఆర్క్‌ రేడియోథెరపీ, గేటెడ్‌ ర్యాపిడ్‌ ఆర్క్‌ రేడియోథెరపీ వంటి రకరకాల శక్తిమంతమైన రేడియేషన్‌ చికిత్సలు చేయొచ్చు. ఇందులో కోన్‌ బీమ్‌ సీటీ స్కాన్‌ కూడా ఉంటుంది. ఇది చికిత్స చేస్తున్నప్పుడు స్కాన్‌ చేస్తుంది. రోగి పడుకున్న తీరును, కదలికలను పసిగడుతూ చాలా కచ్చితంగా మిల్లీమీటరు తేడా లేకుండా క్యాన్సర్‌ కణితులపై రేడియోధార్మిక కిరణాలను ప్రసరింపజేస్తుంది. సెకండుకు వందసార్లు కచ్చితత్వాన్ని బేరీజు వేసుకుంటూ పనిచేస్తుంది కూడా. దీంతో సమయమూ ఎంతో ఆదా అవుతుంది. ప్రస్తుతమున్న పరికరాలతో రేడియేషన్‌ చికిత్సకు అరగంట వరకు పడితే దీంతో కొద్ది నిమిషాల్లోనే చికిత్స పూర్తవుతుంది. అధునాతమైన ఈ ట్రూబీమ్‌ పరికరాన్ని మన హైదరాబాద్‌లోని అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఇలాంటి పరికరాలు దేశంలో మరో రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి.

  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.