Monday, February 4, 2013

How to clear head lice?,పేలును వదిలించుకోవడము ఎలా?

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - How to clear head lice?-పేలును వదిలించుకోవడము ఎలా?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



సాధారణంగా చిన్న పిల్లల తలలో అంటే పాఠశాలకు వెళ్ళే బాలికల తలలో పేలు పడతాయి. ఒత్తుగా జుట్టు వున్న పిల్లల తలలో పేలు త్వరగా వృద్ధి చెందుతాయి. తలలో ఉండే పేలు, తల మీద చర్మం నుంచి రక్తం పీల్చుకుని బ్రతుకుతాయి. జుట్టుకు పట్టుకుని తలంతా కదులుతూ, తలకు దురదను కలిగిస్తాయి. గోళ్ళతో గోకడం, దువ్వెనతో గీరడం వల్ల తలమీద చర్మం చిట్లుతుంది. గోళ్ళలోని, దువ్వెన పళ్ళ మధ్య వున్న మురికి తలలో చేరుకుని చిట్లిన చర్మానికి ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది. అక్కడ పుండుపడి బాధకలుగుతుంది. పేలు అతి చిన్నగా ఉన్నప్పటికీ ఇవి వెంట్రు కలకు, తలమీద చర్మానికి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. పేలు తలలో ఉన్న ప్పుడు దురద సమస్య అధికంగా వుంటుంది.

పేలు అతిత్వరగా వృద్ధి చెందుతాయి. ఇది ఒకరి తలలోంచి మరొకరి తలలోకి ఎగురగలవు. పేలు తలలో పాకుతూంటే ఏర్పడే దురద బాధాకరంగా వుంటుంది. జుట్టు అశుభ్రతగా, జిడ్డుగా వున్నప్పుడు పేలు త్వరగా వ్యాప్తి చెందుతాయి. నలుగురిలో వున్నప్పుడు తల గోకుతూంటే ఎబ్బెట్టుగా వుంటుంది. దురద భరించలేక తలగోక్కోకుండా ఉండలేరు. అంతే కాకుండా, ఒక్కోసారి గోళ్ళల్లో పేలు చిక్కుకుంటాయి. వాటిని తీసి అందరూ ఎదుటా చంపడం నామోషీగా భావిస్తారు. అలాగే నేలమీద వదిలేస్తారు. బాలికల తలలోనే కాకుండా, ఒత్తుగా జుట్టున్న బాలుర తలలో కూడా పేలుపడతాయి. పాఠశాలలో బాల బాలికలు కలసి కూర్చోవడం, కలసి ఆడుకోవడం ద్వారా, తలలు దగ్గరగా ఉన్నప్పుడు పేలు ఎగిరి ఒకరి తలలోంచి మరొకరి తలలోకి చేరుకుం టాయి. అంతే కాకుండా, తలలో పేలున్నవారు వాడే దువ్వెనలను, తలగడలను, దుప్పట్లను తోటి వారు వాడటం వల్ల కూడా పేలు ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమిస్తాయి.

పేలు తలలో కదులుతూ, రక్తాన్ని పీలుస్తూంటే ఏర్పడే దురద వల్ల గోళ్ళలో తలమీద చర్మాన్ని గట్టిగా గీరడం వల్ల వెంట్రుకల కుదుళ్ళు బలహీన పడతాయి. ఆ కారణంగా జుట్టు ఊడిపోతుంది. పేలు దువ్వెనలోకి రావాలని ఎక్కువ సమయం తలను దువ్వడం వల్ల కూడా చర్మం చిట్లడం, పుండు ఏర్పడటమే కాక జుట్టు చిక్కుపడి, గట్టిగా దువ్వడం వల్ల వెంట్రుకలు రాలిపోతాయి. పేలు దువ్వెన పళ్ళ మధ్య చిక్కుకుని వచ్చినప్పటికీ, అవి తలలో పెట్టిన గుడ్లు తిరిగి పేలుగా మారి, తిరిగి వారికి పేల సమస్య ఏర్పడుతుంది. తలలోనే కాకుండా అవి ఒక్కోసారి తలలోంచి బయటకు వచ్చి మెడమీద, నుదుటిమీద కూడా పాకుతుం టాయి. వారి పేల సమస్య ఎదుటివారికి చీదర కలిగిస్తుంది. తలలో పేలున్నవారికి ఇతరులు దూ రంగానే ఉంటారు. అందువల్ల పేల సమస్యను తొలగించుకోటానికి కొన్ని పద్ధతులను పాటించాలి.

తలల్లో స్థిర నివాసం చేసుకుని ఉండే పేలు పీడను వదిలించుకోవాలంటే...

1. మెంతులను నానపెట్టి మెత్తగా రుబ్బి, ఆ ముద్దలో హారతి కర్పూరాన్ని కలిపి తలకు పట్టించి ఓ గంట తర్వాత తలస్నానం చేయాలి.
2. వేపాకును, మెంతి ఆకును మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి గంటా, గంటన్నర అయిన తర్వాత తలస్నానం చేయాలి.
3. కొబ్బరి నూనెలో వేపగింజలను వేపాకును వేసి కాచి, దాన్ని వడకట్టి ప్రతిరోజూ ఆ నూనెను జుట్టు కుదుళ్ళల్లోకి ఇంకేలా మసాజ్‌ చేసినట్లయితే పేలు చచ్చిపోతాయి.
4. తలస్నానానికి సీకాయపొడి, కుంకుడురసాన్ని వాడాలి.
5. మెంతి ఆకులను లేదా వేపాకులను మెత్తగా నూరి, అందులో నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే పేలు చనిపోతాయి.
6. పేలను సంహరించే మందులు ద్రవరూపంలోనూ, క్రీమ్‌ రూపంలోనూ మెడికల్‌ షాపుల్లో దొరుకుతాయి. వాటిని రాత్రి పడుకోబోయే ముందు తలకు పట్టించి, జుట్టంతా కవరయ్యేలా తలకు చిన్న తువ్వాలను చుట్టుకుని ఉదయం నిద్రలేవగానే తలస్నానం చేస్తే, పేలతో పాటు వాటి గుడ్లు నశించిపోతాయి.
7. దువ్వెనలలో మురికి చేరకుండా దువ్వెన పళ్ళను శుభ్రపరుస్తూండాలి. అంతేకా కుండా వారానికి ఒకసారి మరుగుతున్న నీటిలో దువ్వెనను నానపెట్టి శుభ్రపరచాలి.
8. తలగడను ఎండలోవేస్తూ, గలీబులను వేడి నీటిలో నానపెట్టి ఉతకాలి. డెట్టాల్‌ కలిపిన నీటిలో జాడించి, ఎండలో ఆరెయ్యాలి.
9. తలలో పేలున్నవారు వారానికి రెండుమూడుసార్లు గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తలస్నానానికి ముందు కాకర రసంకానీ, నిమ్మరసంకానీ తలకు పట్టించాలి.
10. జుట్టు జిడ్డుగానూ అపరిశుభ్రంగానూ లేకుండా వెంట్రుకల పరిశుభ్రతను పాటించాలి
11 .నాలుగు పెద్ద వెల్లుల్లి రేకలను మెత్తగా పేస్టులాగా చేసి, ఒక టీస్పూన్ నిమ్మరసంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. మసాజ్ పూర్తయ్యాక తలకు కాటన్ టవల్ చుట్టి రాత్రంతా అలాగే ఉంచేయాలి. ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా రోజు మార్చి రోజు... ఐదు రోజులపాటు చేసినట్లయితే పేలు, వాటి తాలూకు గుడ్లు పూర్తిగా నశించిపోతాయి.
12., అరకప్పు నీటిలో రెండు టీస్పూన్ల వైట్ వెనిగర్ కలిపి అందులో దూదిని ముంచి తలకు పట్టించి జట్టు కుదుళ్లకు, మాడుకు బాగా పట్టేటట్లుగా మసాజ్ చేయాలి. తరువాత కాటన్ టవల్ చుట్టి రాత్రంతా ఉంచాలి. ఉదయం మామూలుగా తలస్నానం చేయాలి.
13. ఉల్లిపాయలను మెత్తగా చేసి, రసాన్ని తలకు పట్టించి, తలను క్యాప్‌తోగానీ, క్లాత్‌తోగానీ కవర్ చేసేయాలి. అలాగే నాలుగు గంటలపాటు ఉంచి తలస్నానం చేయాలి. ఇలా మూడు రోజులపాటు చేసినట్లయితే పేల బెడద పూర్తిగా వదలిపోతుంది.

allopathic drugs for external use.
    1. Malathion,
    2. Carbaryl ,
    3. Lindane,
    4. Gamabenzene hexa chloride(Ascabiol lotion),
    5. Benzyl Benzoate(Dermin,Scabindon),
    6. Medikar shamphoo (good to kill lice),
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.