Friday, December 12, 2014

Diabetes in women - స్త్రీలలో మధుమేహం

  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Diabetes in women -  స్త్రీలలో మధుమేహం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
 


 ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని సమాజాల్లో, అన్ని జాతుల్లోనూ కూడా స్త్రీలో మధుమేహం తక్కువనే గట్టి నమ్మకం ఉండేది. మన దేశంలో కూడా మధుమేహ బాధితులపై జరిగిన చాలా సర్వేల్లో ప్రతి ముగ్గురు పురుషులకు ఒక స్త్రీ (3:1) ఉంటున్నట్టు గుర్తించేవారు. కానీ గత 20, 30 ఏళ్లలో ఈ నమ్మకాలు పూర్తిగా పటాపంచలు అయిపోయాయి. మొట్టమొదటగా సూరినామ్‌, గయానా వంటి దక్షిణ అమెరికా దేశాల్లో భారతీయ సంతతికి చెందిన స్త్రీలలో మధుమేహం ఎక్కువగా ఉంటోందని గుర్తించారు. అయితే దీన్ని మన దేశంలోని స్త్రీలకు ఎంత వరకూ అన్వయించవచ్చన్న సందేహాలు ఉండేవి. కానీ క్రమేపీ మలేషియా, ఫిజీ వంటి దేశాల్లో జరిగిన అధ్యయనాల్లో కూడా భారత సంతతి స్త్రీలలోనే ఎక్కువగా కనబడుతోందని గుర్తించారు. ఎందుకిలా అన్నదానిపై చాలా చర్చలు జరిగాయి. భారతీయ సంతతి స్త్రీలు బరువు ఎక్కువగా, లావుగా ఉండటం ఒక కారణమన్న వాదన ఉంది. ముఖ్యంగా ఎత్తుకు తగ్గ బరువు కంటే ఎక్కువ ఉండటం, అలాగే తుంటి-నడుము నిష్పత్తి కూడా వీరిలో ఎక్కువగా ఉండటం ఒక సమస్య. పురుషుల కంటే స్త్రీలు లావు, బరువు పెరగటానికి కారణమేమిటో కచ్చితంగా చెప్పలేంగానీ హార్మోన్ల పాత్ర, ఆహారంలో కొవ్వుల పాత్ర కీలకమని భావించాల్సి ఉంటుంది. కారణమేదైనా మన దేశంలో కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్న సర్వేల్లో- పురుషుల్లో మధుమేహం ఏ స్థాయిలో ఉంటోందో స్త్రీలలోనూ అంతే ఉంటోందని స్పష్టంగా వెల్లడవుతోంది. కొన్నిప్రాంతాల్లో అయితే స్త్రీలలో కొంత శాతం ఎక్కువగా ఉంటోందని కూడా గుర్తిస్తున్నారు. వైద్యం విషయంలో స్త్రీలు తోసేసుకు తిరుగుతుండటం, కొంత తాత్సారం చెయ్యటం, ఆరోగ్య స్పృహ, శ్రద్ధ కొరవడటం తదితర కారణాల వల్ల మధుమేహం కారణంగా స్త్రీలలో దుష్ప్రభావాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ మధుమేహ ఫెడరేషన్‌ వంటి అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ఇప్పుడు స్త్రీలలో వచ్చే మధుమేహాన్ని ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. లక్షణాలు, చికిత్సల విషయంలో వీరికంటూ ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టంగా పేర్కొంటున్నాయి.

చిన్నవయసులోనే మధుమేహం బారినపడే ఆడపిల్లలకు సహజంగానే యుక్తవయసులో, గర్భధారణ సమయంలో చాలా ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వీరిలో తలెత్తే అవకాశం ఉన్న సమస్యలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. గర్భనిరోధక పద్ధతుల విషయంలో కూడా వీరిని కొంత ప్రత్యేకంగా గుర్తించక తప్పదు. ఇవి కాకుండా మధ్యవయసులో కూడా మధుమేహం కారణంగా స్త్రీలలో కొన్ని రకాల సమస్యలు ప్రత్యేకంగా కనబడుతుంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రుతుక్రమం అస్తవ్యస్తం కావటం, తరచూ తెల్లబట్ట, ఎటువంటి లక్షణాలూ లేకుండానే ప్రమాదాలు తెచ్చిపెట్టే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు.. ఇవన్నీ కీలకమైనవే. అరుదుగా కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వీరిలో ఎక్కువ. అందుకే వీటి గురించి స్త్రీలంతా అవగాహన పెంచుకోవటం చాలా అవసరం.
పురుషుల కంటే స్త్రీలలో ఐదేళ్ల ముందే మధుమేహం వస్తున్నట్టు గుర్తించారు. జీవితంలో త్వరగా మధుమేహం బారినపడటం, ఎక్కువగా దుష్ప్రభావాలకు గురవుతుండటం, వాటిలో కూడా మెదడు సంబంధ సమస్యలు ఎక్కువగా కనబడుతుండటం.. స్త్రీల విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలు.

తెల్లబట్ట
మధుమేహ స్త్రీలలో చాలా తరచుగా, ఎక్కువగా కనబడే సమస్య.. జననాంగ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు. వీరిని క్యాండిడియాసిస్‌ అనే సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. దీని ప్రధాన లక్షణాలు- దురద, తెల్లమైల. తెలుపు పెరుగులా, తరకలు తరకలుగా కనబడుతుంది. దుర్వాసన. పొత్తికడుపులో నొప్పి, నడుంనొప్పి కూడా ఉంటాయి. వైద్యులు స్పెక్యులమ్‌తో పరీక్షించి 'క్యాండిడియాసిస్‌'ను తేలికగానే గుర్తుపడతారు. అవసరమైతే ఇతరత్రా పరీక్షలు చేయిస్తారు. నిజానికి చాలామందిలో క్యాండిడియా ఇన్‌ఫెక్షన్‌తోనే మధుమేహం బయటపడుతుండటం గమనార్హం. దీనికి యాంటీఫంగల్‌ మాత్రలు, అవసరమైతే జననాంగంలో అమర్చే మాత్రలు ఇస్తారు. కొన్నిసార్లు ఇది మందులకు లొంగదు. ఇది మధుమేహుల్లో మరీ ఎక్కువ. వీరికి మరింత సమర్థవంతమైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇతరత్రా సమస్యలకు యాంటీబయోటిక్స్‌ వాడుతున్న వారిలో క్యాండిడియాసిస్‌ వచ్చే అవకాశం ఎక్కువ. కొందరికి క్యాండిడియాసిస్‌ తరచుగా వస్తుంటుంది. వీరికి కల్చర్‌ పరీక్ష చేసి.. ఫంగస్‌ ఎక్కడెక్కడ పెరుగుతోంది? ఏ మందుకు లొంగుతుంది? వంటివి తెలుసుకుని, దాన్నిబట్టి మందులను ఇస్తారు.

క్యాన్సర్‌ కార్పస్‌ సిండ్రోమ్‌
30-60 ఏళ్ల వారిలో.. వూబకాయం - మధుమేహం - అధికరక్తపోటు - జన్యుపరమైన అంశాలు - రక్తసంబంధీకుల్లో క్యాన్సర్లు - ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయులు ఎక్కువగా ఉండటం.. ఇవన్నీ క్రమంగా పెరుగుతుంటాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే చివరికి గర్భాశయ క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, కాలేయ క్యాన్సర్‌ వంటి వాటికి దారితీయొచ్చు. ఈ నాలుగు క్యాన్సర్లు ఈస్ట్రోజెన్‌తో సంబంధం ఉన్నవేనని గుర్తించటం అవసరం. యుక్తవయసులో అండాశయాల్లో నీటితిత్తులు ఎక్కువగా ఉండే పీసీవోడీ.. మధ్యవయసులో నెలమధ్యలో ఎరుపు కనబడుతుండే డీయూబీ.. 40ల్లో గర్భాశయంలో ఫైబ్రాయిడ్‌ కణితులు, ఎండోమెట్రియాసిస్‌.. 60ల్లో ఎండోమెట్రియోసిస్‌ క్యాన్సర్‌.. ఇవన్నీ ఒక చట్రంలా వస్తుండే సమస్యలు. వీటన్నింటినీ వేరుగా చూడలేం. కాబట్టి 30-60 ఏళ్ల మధుమేహ స్త్రీలు మధుమేహ పరీక్షలతో పాటు ఏటా పాప్‌స్మియర్‌, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, మామోగ్రఫీ కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. బరువును నియంత్రించుకోగలిగితే తీవ్ర సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

ఒంటి మీద ఫంగస్‌ ఇన్ఫెక్షన్లు
ఒంట్లో తేమ ఎక్కువగా ఉన్న వారికి ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల సమస్య చాలా ఎక్కువ. గ్లూకోజు ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇంకా ఇతరత్రా సమస్యలు కూడా చాలా ఉంటాయి. దీనివల్ల వీరిలో అన్ని రకాల ఫంగల్‌ ఇన్ఫెక్షన్లూ ఎక్కువ. మ్యుకర్‌మైకోసిస్‌ వంటి ఇన్ఫెక్షన్త్లెతే కేవలం మధుమేహుల్లోనే కనబడతాయి. కాబట్టి ఒంటి మీద తేమ ఎక్కువగా లేకుండా కాలి వేళ్ల మధ్యలో, చంకల్లో, గజ్జల్లో ఎక్కడైనా, చీర ముడతల్లో గానీ తేమ లేకుండా చూసే డస్టింగ్‌ పౌడర్‌ వేసుకోవటం అవసరం. క్లోట్రైమజోల్‌, నిస్టాటిన్‌, కీటొకొనజోల్‌, ఫ్లూకొనజోల్‌ వంటి యాంటీఫంగల్‌ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఏదో ఒకటి రెండు రోజుల చికిత్సలతో తగ్గేవి కావు. దీర్ఘకాలిక చికిత్స తీసుకోవటం తప్పనిసరి.
మధుమేహం తెచ్చిపెట్టే నానా దుష్ప్రభావాలూ దరి జేరకూడదనుకుంటే.. వాటి బెడద మనకు వద్దనుకుంటే.. మనం చెయ్యగలిగింది ఒక్కటే! దాన్ని కచ్చితంగా అదుపులో ఉంచుకోవటం! జీవితం అదుపు తప్పకుండా.. అటూఇటూ బెసిగిపోకుండా.. ఎన్నడూ నిర్లక్ష్యం వహించకుండా.. ఎక్కడా తేలికగా తీసుకోకుండా.. మధుమేహాన్ని కచ్చితంగా, ఇంకా చెప్పాలంటే కఠినంగా నియంత్రణలో ఉంచుకోవటం ఒక్కటే సరైన మార్గం.

పక్షవాతాలెక్కువ!
మన దేశంలో నిర్వహించిన సర్వేల్లో మధుమేహ పురుషుల్లో కంటే మధుమేహ స్త్రీలలో పక్షవాతం సమస్యలు అధికమని వెల్లడైంది. కారణాలేమిటో కచ్చితంగా చెప్పలేకపోయినా- మధుమేహ పురుషుల్లో గుండె జబ్బులు ఎక్కువగానూ, స్త్రీలలో మెదడుకు సంబంధించిన పక్షవాతం తరహా సమస్యలు ఎక్కువగానూ కనబడుతున్నాయి.
ఏ బాధలూ లేని మూత్ర ఇన్‌ఫెక్షన్లు

మహిళలు మధుమేహం
మధుమేహుల్లో పైకి ఎలాంటి బాధలూ లేకుండానే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఉండే అవకాశం చాలా ఎక్కువ. సాధారణ స్త్రీలలో ఈ ఇన్ఫెక్షన్లు 10% ఉంటే.. మధుమేహుల్లో 30% వరకూ కనబడతాయి. దీన్నే 'ఎసింప్టమాటిక్‌ బ్యాక్ట్రీయూరియా/పయూరియా' అంటారు. సాధారణంగా స్త్రీలలో మూత్రంలో చీముకణాలు 10 వరకూ ఉన్నా అది సహజమేనన్నట్లు వదిలేస్తారు. అలాగే స్త్రీల బ్యాక్టీరియా ఎక్కువగా కనిపించినా వైద్యులు కొంత వరకూ ఫర్వాలేదు, సహజమేనని వదిలేస్తారు. ఎటువంటి లక్షణాలూ లేవు కాబట్టి దీన్ని వదిలెయ్యటం ఒక అలవాటుగా వస్తోంది. అయితే దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యటానికి లేదని, దీనికి కచ్చితంగా చికిత్స చెయ్యటం అవసరమని అధ్యయనాలన్నీ చెబుతున్నాయి. సాధారణంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఉంటే- చలితో కూడిన జ్వరం, మూత్రంలో మంట, తరచుగా వెళ్లాల్సి రావటం, పొత్తికడుపు వెనక భాగంలో నొప్పి వంటి లక్షణాలుంటాయి. కానీ మధుమేహ స్త్రీలలో ఇవేవీ ఉండకపోవచ్చు. మధుమేహుల్లో నాడీమండల సమస్యల వల్ల (అటనామిక్‌ న్యూరోపతి) ఇటువంటి రక్షణ స్పందనలు కరవు అవుతాయి. కాబట్టి మధుమేహులకు మూత్రపరీక్షలో చీముకణాలు ఏ మాత్రం ఉన్నా కూడా తప్పనిసరిగా చికిత్స చెయ్యాలి. ముఖ్యంగా- ఇవి కల్చర్‌ పరీక్షల్లో బయటపడకపోవచ్చు. కాబట్టి ఎటువంటి అనుమానం వచ్చినా సాధారణ మూత్రపరీక్షే కీలకం.

* మధుమేహం అదుపులో పెట్టుకోవటంతో పాటు సాధారణ అవసరాల కంటే ఒకటిరెండు లీటర్ల నీరు ఎక్కువగా తాగాలి. కొందరికి సోడాసిట్రా/సిట్రాల్కా వంటి టానిక్కుల ద్వారా మూత్రంలో క్షార స్వభావం పెంచేందుకు ప్రయత్నిస్తారు. దీనివల్ల మూత్రంలో ఆమ్లతత్వం తగ్గి.. బ్యాక్టీరియా పెరుగుదల నిరోధమవుతుంది. మధుమేహులు వైద్యుల సలహా మేరకు దీన్ని వాడుకోవాలి. మూత్రాశయం గోడల్లో ఉండిపోయే ఇన్ఫెక్షన్లు కొద్దిరోజుల్లో పోయేవి కావు. అందుకోసం ఈ జాగ్రత్తలన్నీ దీర్ఘకాలం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది.

* ఎటువంటి లక్షణాలూ లేకుండా కేవలం మూత్రంలో చీముకణాల వంటివే కనబడుతుంటే దీర్ఘకాలం మధుమేహాన్ని నియంత్రించుకోవటం ద్వారా తగ్గించుకోవచ్చు. కానీ ఒకసారి లక్షణాలు కనబడితే మాత్రం.. అంటే చలితో జ్వరం, పొత్తికడుపులో నొప్పుల వంటి సమస్యలు తలెత్తుతుంటే- కచ్చితంగా శక్తిమంతమైన యాంటీబయాటిక్స్‌, అవసరమైతే ఇంజక్షన్ల రూపంలో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమంటే- ఈ ఇన్ఫెక్షన్‌ వల్ల రక్తంలో గ్లూకోజు పెరుగుతుంటుంది, మరోవైపు గ్లూకోజు పెరిగిన కొద్దీ ఇన్ఫెక్షన్లూ పెరుగుతుంటాయి. కాబట్టి.. ఈ రెంటికీ ఏకకాలంలో కచ్చితమైన చికిత్స ఇవ్వటం అవసరం. ఇలా కచ్చితమైన చికిత్స తీసుకోకపోతే ఇన్ఫెక్షన్లు రక్తంలోకి చేరిపోయి తలెత్తే తీవ్రమైన 'సెప్టిసీమియా' సమస్య స్త్రీలలో ఎక్కువగా కనబడుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన సమస్య. కాబట్టి మూత్రంలో ఇన్ఫెక్షన్లను.. లక్షణాలు ఉన్నా, లేకున్నా కూడా కచ్చితంగా చికిత్స తీసుకోవటం అవసరమని అంతా గుర్తించాలి. పైగా మూత్ర వ్యవస్థలో కింది నుంచి ఇన్ఫెక్షన్లు క్రమేపీ పైకి పాకి.. (రెట్రోగ్రేడ్‌ ఇన్ఫెక్షన్‌) కారణంగా కిడ్నీలు దెబ్బతినిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యటానికి లేదు.

* మధుమేహ స్త్రీలలో మూత్రం ఆపుకోలేని సమస్య రెండున్నర రెట్లు ఎక్కువ. మధుమేహం కారణంగా సంభవించే కండర క్షీణత, వాటి పనితీరు మందగించటం దీనికి కారణం కావచ్చని భావిస్తున్నారు.
పొత్తికడుపులో నొప్పి
మలమధుమేహ స్త్రీలలో కనిపించే మరో ముఖ్యమైన సమస్య 'పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌'. ఇందులో పొత్తికడుపులో ఎక్కడైనా ఇన్‌ఫెక్షన్‌ ఉండొచ్చు. ఇది గర్భసంచీ నుంచి, అండాశయాల నుంచి లోపలికి ఎక్కడికైనా వ్యాపించొచ్చు. సాధారణంగా కాన్పులు, సిజేరియన్లు, ట్యూబెక్టమీ, తరచుగా అబార్షన్ల వంటి చరిత్ర ఉన్నవారిలో ఆయా సమయాల్లో బ్యాక్టీరియా లోపలికి వెళ్లిపోయి లోపల నిద్రాణంగా ఉండిపోవచ్చు. రోగనిరోధక శక్తి బలంగా ఉన్నంత వరకూ ఇవేమీ ఇబ్బంది పెట్టకపోవచ్చు. కానీ ఏదైనా కారణాన రోగనిరోధకశక్తి బలహీనపడితే ఇక తరచుగా ఇన్‌ఫెక్షన్ల దాడి ఆరంభమవుతుంది. ఇలాంటి ఇన్‌ఫెక్షన్లు ఉన్న వారు ముందు తెలుపు అవుతుందని, పొత్తికడుపులో నొప్పి అనీ వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇది చూడటానికి చిన్న సమస్యే కావొచ్చు గానీ కొన్నిసార్లు తీవ్ర సమస్యగానూ మారొచ్చు. ఎందుకంటే ఫలోపియన్‌ ట్యూబు, అండాశయం కలిసేచోట ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడితే చీముగడ్డలా ఏర్పడే అవకాశం ఉంటుంది. దాన్ని తొలగించకపోతే హఠాత్తుగా పగిలి తీవ్ర ప్రమాదం ముంచుకురావొచ్చు. కొందరిలో ఇన్ఫెక్షన్‌ రక్తంలో చేరిపోయి 'సెప్టిసీమియా'కూ దారితీయొచ్చు. కొందరికి కేవలం గర్భసంచీలోనే పొరల్లో స్వల్పంగా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే నెలసరి అస్తవ్యస్తం అవుతుంది. దీంతో అక్కడ స్రావాలు చేరిపోయి ఫలోపియన్‌ ట్యూబ్‌ మూసుకుపోవచ్చు. దీన్ని హైడ్రోసాల్సింగ్స్‌ అంటారు. దీంతో తర్వాతి సంతానం కలగటంలో ఇబ్బందులు తలెత్తొచ్చు. తెలుపు కావటం, నడుం నొప్పి, పొత్తి కడుపు నొప్పి, సంభోగంలో నొప్పి, నెలసరి అస్తవ్యస్తం కావటం, రుతుస్రావం ఎక్కువగా అయిపోతుండటం వంటి లక్షణాలు కనబడతాయి. వీరిలో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కడుందో గుర్తించి- ఒక కోర్సు యాంటీబయోటిక్‌ మందులు ఇస్తే చాలావరకూ తగ్గుతుంది. ముఖ్యంగా మెట్రోనిడజోల్‌, ట్రినిడజోల్‌ వంటివి తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే యాంటీబయోటిక్‌ ఇంజెక్షన్లూ ఇస్తారు. ఒకవేళ తగ్గకపోతే మరోసారి యాంటీబయోటిక్‌ మందులు ఇస్తారు. ఏడాదికో, రెండేళ్లకో మళ్లీ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటే మందులు వాడాల్సి ఉంటుంది. ఇలా తరచుగా ఇన్‌ఫెక్షన్లు రావటం వల్ల కాన్సర్ల ముప్పూ పెరుగుతుంది. కాబట్టి ఏటా పాప్‌స్మియర్‌ వంటి పరీక్షలు చేయించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.

మొత్తానికి మధుమేహుల్లో ఈ పొత్తికడుపులో ఇన్ఫెక్షన్లు, పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌ పూర్తిగా నయం కావటం కష్టం. చాలాకాలం లోపలే ఉండిపోయి, మళ్లీ మళ్లీ వస్తుండొచ్చు. కాబట్టి వీటన్నింటికీ పూర్తి విరుగుడు ఏమంటే- రక్తంలో గ్లూకోజును కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం! దాంతో ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఇతరత్రా సమస్యలూ దరిజేరవు.
గర్భధారణ సమయంలో...
మధుమేహం ఉన్న గర్భిణులు అసలు గర్భధారణ ప్రయత్నాలకు ముందే కచ్చితంగా వైద్యులను సంప్రదించి, రక్తంలో చక్కెర మోతాదులను కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటంతో పాటు జాగ్రత్తలన్నీ తీసుకుని అప్పుడు గర్భధారణకు ప్రయత్నించటం అవసరం. ఇక మధుమేహ స్త్రీలు గర్భం ధరించినపుడు తొలి మూడు నెలల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తుంటాయి. వీరిలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా ఎక్కువే. ముఖ్యంగా క్యాండిడియాసిస్‌ అధికం. చాలామంది తెలుపు అవుతోందని వైద్యులను సంప్రదిస్తుంటారు. వైద్యులు పరీక్షిస్తే యోని మార్గంలో పెరుగు తరకల మాదిరిగా తెలుపు కనబడుతుంది. అలాగే మధుమేహ గర్భిణుల్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లూ తరచుగా వస్తుంటాయి. ముఖ్యంగా వీరిలో మూత్రంలో మంట వంటి లక్షణాలేవీ లేకుండా కూడా ఇన్ఫెక్షన్లు ఉండొచ్చు. ఇన్ఫెక్షన్లు ఉన్నవారిలో అబార్షన్లు, నెలలు నిండక ముందే కాన్పుల వంటి ముప్పులూ ఎక్కువే. కాబట్టి మధుమేహ గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి.
గర్భనిరోధకాల్లో తేడా
అందరిలా మధుమేహ స్త్రీలకు అన్ని రకాల గర్భనిరోధక సాధనాలూ పనికిరాకపోవచ్చు. నిజానికి బిడ్డకూ, బిడ్డకూ మధ్య గర్భనిరోధకంగా లూప్‌/కాపర్‌ టీ మంచి సాధనం. కానీ మధుమేహ స్త్రీలకు వీటిని అమర్చటం కుదరదు. వీటిని అమర్చినప్పుడు వీరిలో క్రమంగా ఇన్ఫెక్షన్లు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ల మూలంగా వీరిలో అబార్షన్ల ముప్పూ ఎక్కువే. కాబట్టి వీరికి మాత్రలు శ్రేయస్కరం. అయితే సాధారణ గర్భనిరోధ మాత్రలు వాడుతున్నప్పుడు పాలు తగ్గిపోతాయి. కాబట్టి వీరికి పాలు తగ్గకుండా, గర్భనిరోధానికి పనికి వచ్చేలా- ఒకే హార్మోను ఉండే మాత్రలు ఇస్తారు. వీటిని మర్చిపోకుండా క్రమం తప్పకుండా వేసుకోవాల్సిందే. ఈ మాత్రలతో కొందరిలో నెల మధ్యలో రక్తస్రావం (డీయూబీ- డిస్‌ఫంక్షన్‌ యూటరీన్‌ బ్లీడింగ్‌) కావచ్చు. దీన్ని తప్పనిసరిగా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.
సిజేరియన్లూ ఎక్కువే!
మధుమేహ గర్భిణులకు సిజేరియన్‌ చెయ్యాల్సి వచ్చే అవకాశమూ ఎక్కువే. మామూలు స్త్రీలలో సిజేరియన్‌ అవసరం 30% మందికి ఉంటే.. వీరిలో 60% వరకూ ఉంటుంది. పైగా వీరికి ఇన్‌ఫెక్షన్‌ ముప్పు ఎక్కువ కావటం వల్ల కోత త్వరగా మానదు. లోపల అక్కడక్కడ చీము గూడు కట్టుకొని జ్వరం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. కొన్నిసార్లు వీరిలో మాయ కూడా పూర్తిగా బయటకు రాదు. కాబట్టి కాన్పు అయ్యాక మూడు నెలల తర్వాత తప్పకుండా స్కానింగ్‌ చేసి పరీక్షించాల్సి ఉంటుంది.
నెలసరి అస్తవ్యస్తం
పిల్లలు పుట్టిన తర్వాత నెలసరి సరిగా రావటం లేదని చాలామంది డాక్టర్లను సంప్రదిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం పొట్ట దగ్గర కొవ్వు పేరుకోవటం. ఈ కొవ్వు నుంచి విడుదలయ్యే ఈస్ట్రియల్‌ (ఈ3) అనే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ నెలసరిని అస్తవ్యస్తం చేస్తుంది. ఇది మధుమేహుల్లో ఎక్కువ. రుతుస్రావం ఎక్కువ అవుతుండటం, గడ్డలు గడ్డలుగా పడుతుండటం వంటివి కనబడతాయి. దీంతో రక్తహీనత వస్తుంది. చాలామంది దీన్ని పట్టించుకోరు. సమయానికి చికిత్స తీసుకుంటే సమస్య ముదరకుండా చూసుకోవచ్చని గుర్తించాలి.

  • Dr.P.V .rao prof.HOD -diabetology NIMS hyd, & Dr.v.janaki prof.Gyaenecology ,Nilofer hos.Hyd, @eenadu sukhibhava.27-05-2014
  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, November 3, 2014

Diabetic Neuropathy,మధుమేహము లో నరాల సంబంధ వ్యాధులు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Diabetic Neuropathy,మధుమేహము లో నరాల సంబంధ వ్యాధులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



డయాబెటిస్‌ ఉన్నవారిలో సర్వసాధారణంగా కనిపించే కాంప్లికేషన్‌ నరాలు డామేజి కావటం్. దీనిని న్యురోపతి ('Neuropathy) అంటారు. రక్తంలో గ్లూకోజు అత్యధి కస్థారుులో ఎక్కువకాలంపాటు ఉన్నపడు రకరకాల విధాలుగా ఆ వ్యక్తి శరీరంలో నరాలు డామేజ్‌ కావటం మెుదలెడతారుు. డయాబెటిస్‌ మూలంగా వచ్చే నరాల డామేజి బాధాకరమే అరుునా చాలా సందర్భాలలో అది తీవ్రస్థారుుకి చేరుకోదు.

న్యురోపతిలో రెండురకాలు ఉంటాయి :
1. కాళ్ళకు, చేతులకు వచ్చే పెరిఫెరల్‌ న్యూరోపతి ('pheriperal 'Neuropathy) కూడా ఉంటుంది.
2. జీర్ణయంత్రాంగానికి, మూత్ర విసర్జన యంత్రాంగా నికీ, రక్తనాళాలకూ వచ్చే అటోనామిక్‌ న్యురోపతి ('autonomicNeuropathy).

రక్తంలోని గ్లూకోజును నిరంతరంగా ఎప్పటికపడు అదుపులో ఉంచుకోవటం ద్వారా అటోనామిక్‌ న్యురోపతి ('autonomicNeuropathy) రాకుండా చూసుకోవచ్చు.

  • జీర్ణయంత్రాంగానికి సంబంధించిన న్యూరోపతి:
దీని లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.
  •     తేన్పులు,
  •     మలబద్ధకం,
  •     గుండెల్లో మంట ('acidity),
  •     తెమలటం,
  •     వాంతులు,
  •     అన్నం తినగానే కడుపు ఉబ్బరంగా అనిపించటం,

    చికిత్స
    ఒకేసారి కడుపునిండా కాకుండా కొద్దికొద్దిగా నాలుగ యిదు సార్లు తినటం,    డాక్టరు పర్యవేక్షణలో మందుల వాడకం.

  •     రక్తనాళాలకు సంబంధించిన న్యురోపతి :

  •     దీని లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.
  •     గభాల్న లేచినపడు కళ్ళు బెైర్లు కమ్మటం.
  •     గుండె వేగంగా కొట్టుకోవటం.
  •     స్పృహ తప్పబోతున్నట్లు అనిపించటం.
  •     లోబీపి('low BP).
    చికిత్స కూర్చున్న లేక పడుకున్న పొజిషన్‌ నుంచి గభాల్న ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా లేచి నిలబడటం,
    డాక్టరు పర్యవేక్షణలో మందులు.



  •     పురుషాంగానికి సంబం దించిన న్యురోపతి :
    పురుషాంగానికి వెళ్లే నరాలు దెబ్బతినటం వల్ల వచ్చే లక్షణాలు ఈ కిందివిధంగా ఉంటాయి : అంగస్తంభన జరగకపో వటం, లేక స్తంభించిన అంగం ఎక్కువసేపు నిలవక పోవటం. దీనిని 'ED'అంటారు.స్కలన సమస్యలు. స్కలనం పొడి ('Dry') గా ఉండటం లేక అతి తక్కువ స్కలనం జరగటం.
    గమనిక : అంగస్తంభన సమస్యలు డయాబెటిస్‌ మూలంగానే కాకుండా ఇంకా ఇతర కారణాలవల్ల కూడా రావచ్చు. ఉదాహరణకు మందుల సైడ్గ ఎఫెక్ట్‌ కారణంగా, లోబీపి కారణంగా, డిప్రెషన్‌లో ఉన్నపడు, స్ట్రెస్‌ లేక ఏదెైనా ఆందోళన కారణంగా, భార్యాభర్తల మధ్య బెడిసికొట్టిన సంబంధాల కారణంగా, మొదలెైనవి...ఇన్ని కారణాలు ఉంటాయి కాబట్టి నేరుగా డయాబెటిస్‌ కారణంగానే అని అనుకో కుండా డాక్టరు చేత నిర్ధారణ చేయించు కోవటం అవసరం.

    చికిత్స--
    కౌన్సెలింగ్‌,
    మందుల వాడకం,
  •     స్ర్తీ జననేంద్రియాలకు సంబంధించిన న్యూరోపతి:
    స్ర్తీ జననేంద్రియాలకు వెళ్ళే నరాలు దెబ్బతినటం వల్ల ఈ కింది లక్షణాలు చోటుచేసుకుంటాయి.
    యోని పొడిగా ఉండటం.
    సంయోగంలో ‘భావప్రాప్తి’ సరిగా కలగకపోవటం లేక అసలు భావప్రాప్తే కలగకపోవటం

    చికిత్స
  •     కౌన్సిలింగ్‌
  •     ఈస్ట్రోజన్‌ తెరపి
  •     తడికోసం యోనికి రాసుకునే క్రీములు, లూబ్రికెంట్‌లు (ఔఠఛటజీఛ్చ్టిట)
   మూత్ర విసర్జన యంత్రాంగా నికి  చెందిన న్యురోపతి :--
    మ్త్రూయంత్రాంగ వ్యవస్థకు చెందిన నరాలు దెబ్బతినటం వల్ల వచ్చే లక్షణాలు ఈ కింది విధంగా    ఉంటాయి :
  •     ఒక్కసారిగా మ్త్రూవిసర్జన చేయలేకపోవటం (మూత్రాశయాన్ని - ఒకేసారి ఖాళీ చేయలేకపోవటం)
  •     కడుపు ఉబ్బరం
  •     మూత్రాన్ని ఆపుకోలేకపోవటం (అర్జెన్సీ)
  •     రాత్రులు మాటిమాటికీ మ్త్రూవిసర్జనకు వెళ్ళటం.
    చికిత్స
    డాక్టరు పర్యవేక్షణలో మందులవాడకం,    అవసరమయితే సర్జరీ

  

  •  మూలము    'courtesy With - డాక్టర్‌ సి.ఎల్‌. వెంకట్రావు, హైదరాబాద్‌.
  • =========================

Sunday, November 2, 2014

Pain disapears with exercise - వ్యాయామం వలన నొప్పి మాయం

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Pain disapears with exercise - వ్యాయామం వలన నొప్పి మాయం-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  
  •  

కాళ్ళు భుజాలు కొంచెందూరంగా ఉంచి గోడకు ఆనుకొని నిల్చోండి. నెమ్మదిగా నెమ్మదిగా గోడకుర్చీ వేసినట్లు కనిపించే విధంగా మోకాళ్ళను నడుముకి 98 డిగ్రీలు ముందుకు ఉండేట్లు క్రిందకు నడుముని జార్చండి. నడుము ముందుకు రాకూడదు. గోడను తాకే ఉండాలి. మళ్ళీ మామూలుగా రండి. ఇలా అయిదుసార్లు చేయండి. బోర్లా పడుకోండి, ఒక కాలు కండరాల్ని గట్టిగా బిగించి పెైకి లేపండి. అలా పెైకి లేపిన కాలుని 10 అంకెలు అనుకునేంతవరకూ అలాగే ఉంచండి. ఆ తర్వాత రెండో కాలుతో కూడా అలాగే చేయండి. అలా ఒక్కో కాలుతో అయిదుసార్లు చేయండి.

వెల్లకిలా పడుకోండి. చేతులు పక్కకి చాచి పడుకోవాలి. చేతులు పక్కకి చాచి పడుకోవాలి. ఒక కాలుని పెైకి లేపాలి. పది అంకెలు లెక్కపెట్టేంత వరకూ అలాగే ఉంచాలి. అలాగే రెండో కాలుతో చేయాలి. ఒక్కో కాలుతోనూ అయిదుసార్లు అలా చేయాలి. అలా చేసేటప్పుడు క్రింద ఉన్న కాలుని నిటారుగా ఉంచలేకపోతే మోకాలు దగ్గర కొద్దిగా వంచండి. రెండో కాలుని ఎత్తండి.ఒక కుర్చీలో నిటారుగా కూర్చొని ఒక కాలుని చాచి, రెండో కాలుని కొద్దిగా పైకెత్తుతూ అయిదేసిసార్లు ఒక్కో కాలుతోనూ చేయాలి. వీపు అనేటట్లు పడుకోవాలి. మోకాళ్ళను వంచి నెమ్మదిగా తలనెత్తి చేతుల్ని చాచి మోకాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే చేతుల్ని మోకాళ్ళకు తాకుతూ పది అంకెల్ని లెక్కపెట్టాలి. తిరిగి మామూలుగా వచ్చి మళ్ళీ చేయాలి. అలా పదిసార్లు చేయాలి.

-వెల్లకిలా పక్క మీద పడుకోండి. కాళ్ళని చాచి నెమ్మదిగా మోకాళ్ళను ఛాతీవెైపు తేవాలి. వాటి వెనుక చేతులుంచి అలా చేతులతో మోకాళ్ళను చాతిని ఎంత దగ్గరగా తేగలరో అంత దగ్గరగా తీసుకురండి. తలని పెైకి లేవనీకండి. కాళ్ళని క్రిందికి తెచ్చిన తరువాత నిటారు చేయకండి. అలా అయిదు సార్లు చేయాలి.కాళ్ళని దూరంగా ఉంచి నిల్చోండి. చేతుల్ని నడుము మీద ఉంచండి. మోకాళ్ళని నిటారుగా ఉంచండి. వీలెైనంత వెనక్కి నడుమును వంచండి. అలా ఆ భంగిమలో ఒకటి, రెండు సెకండ్లు శరీరానుంచి మళ్ళీ మామూలు భంగిమలోకి రావాలి. ఇలా రోజూ చేస్తే నడుముకి మంచింది.ఇలాంటి సమస్యల వల్ల సాధారణంగా నడుమునొప్పి, మెడనొప్పి వస్తుంటాయి. ఒక వేళ మెడలోంచి నొప్పి చేతుల్లోకి ప్రాకినట్టుండటం, తిమ్మిర్లు, మొద్దుబారినట్టుండడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వెైద్యుణ్ని కలవాలి.

నడుమునొప్పి కాళ్ళలోకి ప్రాకినా, తిమ్మిర్లెక్కినా మనకు వెన్ను సమస్యలున్నాయన్న అనుమానం రావాలి. నరాల మీద ఏదెైన కారణాల వల్ల వెన్నుపూసలో ఒత్తిడి పడితే, ఆ నరం వెళ్ళే మార్గంలో నొప్పి, తిమ్మిర్లు వస్తాయి.చాలా మంది ఈ సమస్యల్ని పట్టింకోకుండడం చూస్తుంటాం. అలాంటి వాళ్ళలో సమస్య తీవ్రమై శస్త్ర చికిత్స తప్పనిసరవుతుంది. మొదటి స్థాయిలో ఇంటువంటి సమస్యల్ని పసిగట్టు వెైద్యుణ్ని కలవాలి. మొదటి స్థాయిలో గుర్తించే లక్షణాల్ని ‘రెడ్‌ప్లాగ్స్‌’ అంటారు.

ఒక కుర్చీలో నిటారుగా కూర్చొని ఒక కాలుని చాచి, రెండో కాలుని కొద్దిగా పెైకెత్తుతూ అయిదేసిసార్లు ఒక్కో కాలుతోనూ చేయాలి. వీపు అనేటట్లు పడుకోవాలి. మోకాళ్ళను వంచి నెమ్మదిగా తలనెత్తి చేతుల్ని చాచి మోకాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే చేతుల్ని మోకాళ్ళకు తాకుతూ పది అంకెల్ని లెక్కపెట్టాలి. తిరిగి మామూలుగా వచ్చి మళ్ళీ చేయాలి. అలా పదిసార్లు చేయాలి.

- * మెడ, నడుమునొప్పి చేతుల్లోకి కాళ్ళలోకి వ్యాపిస్తే వెంటనే వెైద్యుడికి చూపించాలి.
 * చేతులూ, కాళ్ళలో తిమ్మిర్లు మంటలు, మొద్దుబారినట్లనిపిస్తున్నా అలసత్వం చేయకూడదు.
    *చిన్నదెైనా పెద్దదెైనా దెబ్బ తగిలినా తర్వాత మెడ, నడుములో నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. నొప్పితో పాటు జ్వరం వస్తే ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చి ఉండవచ్చుననే అనుమానం రావాలి.
   * నొప్పితో పాటు ఆకలి తగ్గినా, బరువు తగ్గినా వెన్నులో ఇన్‌ఫెక్షన్‌ గాని, కణితలు గాని వచ్చి ఉండవచ్చనే అనుమానం రావాలి. కాళ్ళలో గాని, చేతుల్లో గాని కండరాలలో పటుత్వం తగ్గినా, మలమూత్రాల మీద అదుపు తప్పినా, నడకలో మార్పు ఉన్నా వెంటనే వెైద్యుణ్ని సంప్రదించాలి.

    చాలా వరకు వెన్ను సమస్యలు మందులు, ఫిజియోథెరపిలతో తగ్గిపోతాయి. 5 శాతం కన్నా తక్కువ మంది రోగుల్లోనే శస్త్రచికిత్సల అవసరముంటుంది. వెన్ను శస్త్రచికిత్స గురించి ప్రజలలో చాలా అపోహలున్నాయి. వెన్ను శస్త్రచికిత్స జరిపితే కాళ్ళు, చేతులు పడిపోతాయని, ముందుకు వంగిలేకపోవడం బరువులెత్తకపోవడం లాంటివి చేయకూడదని ఎక్కువకాలం బెడ్గరెస్ట్‌ తీసుకోవాలని, నపుంసకత్వం కలగవచ్చని, ఆడవాళ్ళలో ప్రసవ సమయంలో వెన్నుకి మత్తు ఇవ్వడం వల్ల నడుమునొప్పి వసుందని భయాలున్నాయి. వెన్ను వంకర, (స్కోలియోసిస్‌, కైఫోసిస్‌) వస్తుంటే నడుము పెరిగే దాకా ఆగాలనుకుంటారు. అది తప్పు. ఏ వయస్సులో గుర్తిస్తే ఆ వయస్సులోనే శస్త్రచికిత్స చేయడం మంచిది. ఆగిన కొద్దీ వంకర వయసుతో పాటు పెరగవచ్చు. పెరిగే కొద్ది శస్త్రచికిత్స కష్టమవుతుంది.

    కొంతమంది మెడకు, నడువుకు వెైద్యుల సలహా లేకుండా మెడకు కాలర్‌లు, నడుముకి బెల్టులు వాడుతుంటారు. ఇది తప్పు, అలా ఎక్కువ కాలం వాడడం వల్ల మెడ, నడుము భాగాల్లో కండరాలు బలహీనపడతాయి. దీంతో వెన్ను సమస్యలు వస్తాయి. అందుకని వెైద్యుల సలహ ప్రకారం ఎన్ని రోజులు పెట్టుకోమంటే అన్ని రోజులే ఆ బెల్టులు వాడాలి. సలహ లేకుండా వీటిని ప్రయత్నించవద్దు.విపరీతంగా నొప్పి ఉందా? బెడ్ రెస్ట్‌ తీసుకుంటే తగ్గిపోతుందని కొందరు నెలల కొద్దీ విశ్రాంతి తీసుకుంటుంటారు. 48 నుంచి 72 గంటలకన్నా ఎక్కువ విశ్రాంతిని తీసుకోవడం మంచిందికాదు. అలా కదలకుండా ఉంటే కండరాలు బలహీనమయి, భవిష్యత్తులో వీటివలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

    మనం సరెైన పద్దతిలో బరువులెత్తకపోయినా వెన్ను నొప్పి కలగవచ్చు. ఎక్కువసేపు ఒకే భంగిమలో కదలకుండా కూర్చున్నా నడుము, మొడ నొప్పి రావచ్చు. పద్దతి ప్రకారం వ్యాయామం చేయకపోయినా, ఊబకాయంవల్లా, మానసిక ఒత్తిళ్ళు, ధూమపానం, సరెైన ఆహారం తీసుకోవకపోవడం వల్లా వెన్ను సమస్యలు రావచ్చు. మనం కూర్చునే కుర్చీల విషయంలో, వాటిలో కూర్చునే విధానంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. కుర్చీలో వెనక్కి జరిగి కూర్చోవాలి. కుర్చీ వెనుక భాకం మెడవరకూ ఉంటే మంచింది. కూర్చున్నప్పుడు మోకాలు తుంటి కన్నా ఎత్తులో ఉండకూడదు. పాదాలు రెండింటిని నేలమీద ఆన్చాలి. లేకపోతే పుట్‌ రెస్ట్‌ మీద ఉంచుకోవాలి. రోజు కనీసం అరగంట పాటు వారంలో అయిదు రోజులు నడవడం లేదా వ్యాయామం చేయాలి. నడక వల్ల నొప్పులు దూరమవడమే కాక, రక్తంలోంచి ఎముకలు కాల్షింని ఎక్కువగా తీసుకుని ఎముకలు గట్టిపడతాయి. సిగరెట్లు లాంటి అలవాట్లు మానుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానము, యోగా, పుస్తకపఠనం, ఆటలు, సంగీతంలాంటివి తోడ్పడతాయి. సమతులాహారాన్ని తీసుకోవాలి. తిరుతిళ్ళు మానేయాలి.

  •     Courtesy with : G.P.Vడాక్టర్‌ జి.పి.వి.సుబ్బయ్య--    స్పైన్‌ సర్జన్‌, గ్లోబల్‌ హాస్పిటల్‌, లక్డికాపూల్‌, హైదరాబాద్‌..

  • ======================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Osteo-arthritis at middle age,మోకాళ్ళ నొప్పులు నడివయసేలో

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Osteo-arthritis at middle age,మోకాళ్ళ నొప్పులు నడివయసేలో -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ..
  •  

  •  
మానవ శరీరం ఒక అత్యాధునికమైన యంత్రం. సంవత్సరాల తరబడి చేసే పనుల కారణంగా, నిలబడడం, నడక, కింద కూర్చోవడం వంటి అనేక కీలుపైన బరువు వేసే పనుల మూలంగా కీలులో ఉన్న స్ట్రక్చర్స్‌ బలహీనపడతారుు. కీలు కదిలినప్పుడల్లా ఎముకల మధ్యన రాపిడి తగ్గించడం కోసం కింది భాగంలో ఏర్పడిన కార్టిలేజ్‌ (cartilage) అనే ప్రొటీన్‌ (protein) పదార్ధం అరిగిపోతుంది. దీనితో పాటుగా ఇతర స్ట్రక్చర్స్‌ ద్రవ పదార్థాలు (sinovial fluid), రెండు ఎముకలని కలిపే లిగమెంట్లు (Ligaments), కీలు తొలగిపోకుండా ఉండటానికి కావలసిన మెనిస్కస్‌ ( meniscus), కీలు చుట్టూ ఉన్న కండరాలు (muscles) క్రమక్రమంగా క్షీణిస్తాయి . పెద్దవాళ్లలో మెుకాళ్ల నొప్పి మరింతగా బాధపెట్టడం అన్నది చాలా సాధారణమైన విషయం. కారణం మోకాళ్ల అరుగుదల. దీనినే ఆస్టియో ఆర్థరైటిస్‌ (Osteo-arthritis) అని అంటారు. కీళ్ల నొప్పుల వల్ల సామాజిక, మానసిక, శారీరక మార్పులు చేకూరుతారుు.

-మోకాళ్ల నొప్పిని ప్రారంభ సమయంలో నిర్లక్ష్యం చేస్తే నెమ్మది నెమ్మదిగా మరో కీలు, ఆ తరువాత పైకిపోకుతూ తుంటి, నడుము నొప్పులు కూడా మొదలవుతాయి. ఈ నొప్పుల మూలంగా నడక తగ్గడంతో శరీరం బరువు పెరుగుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు డయాబెటిస్‌, రక్తపోటు అదుపులో ఉండకపోవడంతో కాలక్రమేనా గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా అనగా హర్మోన్‌ మార్పులు, విపరీతమైన శరీర బరువు, పదే పదే కీలుకి దెబ్బలు తగలడం తదితర సమస్యలతో కూడా మోకాళ్ళ నొప్పులు బాధిస్తాయి.మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళుపైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది.

ఆస్టియో ఆర్థరెైటిస్‌(Osteo-arthritis)ని నిర్ధారించడం కోసం కావలసిన పరీక్ష మోకాలు ముందు, పక్క నుంచి తీసిన ఎక్స్‌రే(x-ray). ఎక్స్‌రే (x-ray)లో అరుగుదల మార్పులు కనిపిస్తాయి. ఎముకల మధ్యన ఖాళీ తగ్గడం, కీలు చివరలో కొత్త ఎముక నిర్మించబడుతుంది. అరుగుదల వంటి మార్పులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇతర లోపాలు తెలుసకోవడం కోసం రక్త పరీక్ష ఉపయోగపడుతుంది.

చికిత్స:
ఆస్టియో ఆర్థరెైటిస్‌ (Osteo-arthritis) వల్ల వచ్చే ఇతర సమస్యలు తగ్గించడానికి వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందు ఎముకలకి సంబంధించిన వైద్య నిపుణులని సంప్రదించి నొప్పి, వాపు తగ్గడానికి గల మందులు, తగ్గకపోతే కీళ్ల ఇంజెక్షన్‌ అవసరం పడుతుంది. దానితో పాటుగా కీళ్ల వ్యాయామం కోసం ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదించడం అత్యవసరం.
ఫిజియోథెరపి చికిత్స చేయించుకోవడం వల్ల వీలెైనంత వరకు త్వరగా మునుపటి జీవనం సాగించవచ్చు.

-ఫిజియో థెరపిస్ట్‌ మొదట్లో నొప్పి తగ్గించడం కోసం ఏదో ఒక అవసరమైన కరెంట్‌ పరికరం (ఐ.ఎఫ్‌.టి , అల్ట్రాసౌండ్‌ , ఐ.ఆర్‌.ఆర్‌. , ఎస్‌.డబ్లు.డి ) తో వారం పదిరోజుల వరకు చికిత్స చేస్తారు.నొప్పి తగ్గుతూ ఉండే కొద్ది తీసుకోవలసిన జాగ్రత్తలు, కండరాలు బలపడడానికి వ్యాయామాలు, తెలుసుకోవలసిందిగా సలహా ఇస్తారు.

    గుండె బాగా కొట్టుకుంటుంది.
    శరీరం అంతటా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
    కనీసం 200 క్యాలరీలు (ఇ్చజూౌటజ్ఛీట) ఖర్చు అవుతాయి.
    మంచి కొవ్వు (ఏఈఔ) పెరుగుతుంది.
    చెడు కొవ్వు (ఔఈఔ) తగ్గుతుంది.
    ఇన్సులిన్‌ సూక్ష్మత పెరగడంతో షుగర్‌ వ్యాధి అదుపులోకి వస్తుంది.
    రక్తపోటు నడక మొదలు పెట్టిన మొదట్లో కొద్దిగా పెరిగినా తరువాత అదుపులోకి వస్తుంది.

    - షుగర్‌, రక్తపోటు మూలంగా వచ్చే గుండె, కిడ్నీ, పక్షవాతం, నరాల బలహీనత, భుజం నొప్పి వంటి కీలు, కండరాల బాధలు, కంటి లోపాలు తదితర సమస్యలను వీలెైనంత వరకు నిర్మూలించవచ్చు.ఇవే కాకుండా నడక మూలంగా మెదడుకి ఎల్లప్పుడు రక్తప్రసరణ అందుబాటులో ఉండడం మూలంగా మెదడు బాగా చురుగ్గా పని చేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది, నిద్రలేమి సమస్య ఉండదు. కొంతవరకు వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గించవచ్చు.

    నడకకు సంబంధించిన కొన్ని చిట్కాలు:
 
        నడకకు 15 నిలతో మొదలుపెట్టి నడిచే సమయాన్ని 30-45 నిల వరకు పెంచండి.
        రోజులో ముపె్పై నిలు ఏకధాటిగా లేనిచో 10 నిలు పాటు వంతులుగా 5 సార్లు నడవచ్చు.
        బ్రిస్క్‌ వాకింగ్‌ .


        తీసుకోవలసిన జాగ్రత్తలు:
            ఎక్కువ సమయం నిల్చోవడం తగ్గించాలి.
            నొప్పిని పట్టించుకోకుండా నడవడం మంచిది కాదు.
            పదే పదే మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి.
            వెస్టెర్న్‌ టైప్‌ కమోడ్‌ ఉపయోగించాలి.


            వ్యాయామం:
                మోకాళ్లు నొప్పి లేనంతవరకు నడవడం అతి ముఖ్యమైనది.
                స్థరమైన సైకిల్‌ తొక్కితే మంచిది.
                ఈత కొట్టడం చాలా మంచి వ్యాయామం.


                ఇవన్నీ చేసినప్పటికీ నొప్పి తగ్గకపోతే, కొన్ని అడుగులు కూడా నడవడం ఇబ్బందికరంగా ఉంటే వెంటనే ఎముకల వెైద్య నిపుణుడిని సంప్రదించి శస్త్ర చికిత్స చేయించుకోవడం అవసరం. దీనినే టోటల్‌ నీ రీప్లేస్‌మెంట్‌ (knee replacement surgery) లేక కీళ్ల మార్పిడీ అంటారు. ఆర్టిఫిషియల్‌ మెటల్‌ ఇంప్లాంట్‌తో కీళ్ల మార్పిడి చేస్తారు.శస్త్ర చికిత్స తదుపరి కీళ్ళకు తగిన జాగ్రత్తలు మోకాళ్ళ వ్యాయామం నడిచే పద్ధతులు తెలుసుకోవడం ఫిజియోథెరపి అవసరం. ఇప్పుడు శస్త్ర చికిత్సను 5-6 సంలు వాయిదా వేయడంతో పాటు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళ జీవర సరళిని పెంపొందించుటకు ఒక కొత్త రకమైన పట్టీ (బ్రేస్‌) ‘అన్‌లోడర్‌ వన్‌’ అందుబాటులో ఉంది. ఈ పట్టీ వేసుకొని నడిస్తే శరీరం యొక్క బరువు కీళు చుట్టూ సరిసమానంగా పడడంతో కీళుకి నష్టం వాటిల్లదు, నడిచినా నొప్పి తెలియదు.

                    క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం 30 నిలు నడవడం మూలంగా అనేక ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి.
                    ఇప్పుడు మోకాలు చుట్టూ ఉన్న కండరాలకు బలం చేకూరుతుంది.
                    కీళు సులువుగా కదులుతుంది.
                    ఎముకలు బలపడతాయి.
                    బ్యాలెన్స్‌ పెరగడంతో తృటి ప్రమాదాలు తగ్గుతాయి.

                    చేతులు బాగా ఊపుతూ నడవగలిగినంత వేగంగా నడిస్తే చమట పడడంతో పాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీనితో మంచి ఫలితం దక్కుతుంది.
                    గమనిక: నడక వేగం మీరు పాట పాడలేనంత వీలుగ కాని లేక మాట్లాడగలిగేంత ఉండాలి.
                    సాధారణంగా మార్నింగ్‌ వాక్‌ ఎంచుకున్నా స్వచ్ఛమైన చల్లటి గాలి పీల్చుకోగలుగుతారు.

                    మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళ్లపెైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది.


  •                  Courtesy with :  డా వై. నందకిషోర్‌ కుమార్‌-- బి.పి.టి. (నిమ్స్‌), యం.యస్‌.స్పోర్ట్స్  (యు.కె.) ఫిజియోథెరపిస్ట్

  • =================================

Congenital hear diseases,పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Congenital hear diseases,పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  
  •  

 Congenital hear diseases,పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు--- గర్భంలో శిశువు గుండె నిర్మాణం సరిగా కాకపోయినా, రక్తనాళాలు తేడాగా ఉన్నా కలిగే గుండె జబ్బుల్ని కంజనెైటల్‌ హార్ట్‌ డిసిజెస్‌ అంటారు. పుట్టుకతో వచ్చే గుండెజబ్బులన్న మాట. ఈ జబ్బుల వల్ల గుండె రక్తనాళాల్లో రక్తప్రసరణ జరగాల్సిన విధంగా జరగదు. గుండె కొట్టుకునే పద్ధతిలో కూడా మార్పులు వస్తాయి.


-పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు ప్రధానంగా రెండు రకాలు. అవి ఎసైనోటిక్‌ లోపాలు, సైనోటిక్‌ లోపాలు. ఎసైనోటిక్‌ లోపాల వల్ల పిల్లలు ఎరగ్రా కనిపిస్తారు, సైనోటిక్‌ లోపాల వల్ల నీలంగా ఉన్న పిల్లలు పుడతారు.జన్మించిన పిల్లల్లో ఒక శాతం మంది గుండెలోపంతో పుడుతున్నారు. వీటిలో 80 శాతం ఇంతవరకు ముందు చెప్పుకున్న జబ్బులుంటే, 20 శాతం కొత్తవి కనిపించవచ్చు. పుట్టుకతో వచ్చే గుండెజబ్బులతో మూడవ వంతు వెంట్రిక్యులార్‌ సెప్టల్‌ ఢిఫెక్ట్‌కి సంబంధించినవి అవుతాయి.తల్లిదండ్రుల్లోగాని, అన్న-అక్కలలో గానీ గుండె జబ్బులు పుట్టుకతో వస్తే, వాళ్ళకి పుట్టుకతో గుండెజబ్బులు 4 నుంచి 5 శాతం వరకు రావచ్చు. నెలలు నిండకుండా పుట్టేవాళ్ళలో రెండు శాతం మందికి గుండెజబ్బులు పుట్టుకతో రావచ్చు. కొన్ని రకాల గుండెజబ్బుల గురించి తల్లి గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకోవచ్చు. సాధ్యమైనంత త్వరలో వాటిని సరిదిద్ది, సరెైన ఆరోగ్యకర జీవితాన్ని గడిపేటట్టు చేయవచ్చు.పుట్టుకతో ఈ గుండెజబ్బులతో పుట్టేవాళ్ళ సంఖ్య పెరగడం బట్టి గుండెజబ్బులతో బాధపడే పెద్దవాళ్ళ సంఖ్య ఉంటుంది.

పుట్టుకతో ఈ గుండె జబ్బులెందుకు వస్తున్నాయో తెలుసుకోవడానికి పూర్తిగా కారణాలు తెలీవు.
జన్యుపరమైన కారణాలు, పరిసరాల ప్రభావం కొంత వరకు ఉంటుందని భావిస్తున్నారు. 21, 13, 18 క్రోమోజోమ్స్‌ లోపాల వల్ల ముటేషన్స్‌ రావచ్చు. క్యాచ్‌ 22, వంశపారపర్యంగా వచ్చే ఎట్రియల్‌ సెప్టల్‌ డిసీజ్‌, అలగిల్లె సిండ్రోమ్‌, నూనాన్‌ సిండ్రోమ్‌ లాంటి జన్యుపరమైన అబ్నార్మాలటీస్‌.
తల్లి గర్భంలో ఇన్‌ఫెక్షన్స్‌ (రుబెల్లా), మందులు (ఆల్కాహాల్‌ హైడాన్‌టాయిన్‌, లిధియం, ధాలిడొమైడ్‌), మధుమేహం, ఫెైనెైల్‌ కిటోనూరియా, సిస్టమిక్‌ల్యేపస్‌, ఎరిథిమోటోసిస్‌లాంటి జబ్బుల వల్ల పుట్టుకతోనే గుండెజబ్బులు రావచ్చు.

పేటెంట్‌ డక్టస్‌ ఆర్టిరియోసిస్‌...
గర్భస్థ శిశివులో గుండె పల్మోనరి అర్టెరీ (ఊపిరితిత్తులకు చెడు రక్తం తీసుకువెళ్లే నాళం), అయోర్టాలా (శరీరానికి మంచి రక్తం తెచ్చే నాళం) మధ్య తాత్కాలిక దారి ఉంటుంది. పుట్టే వరకు శిశివు శ్వాశించదు కాబట్టి, అంతవరకు ఈ దారి ద్వారా ప్లసెంటా నుండి వచ్చే మంచి రక్తం అయోర్టాకు సరఫరా అవుతుంది. సాధారణంగా ఈ దారి శిశివు జన్మించిన కొన్ని గంటలు లేక రోజుల్లో మూసుకుపోతుంది. అలా మూసుకుపోకపోతే శిశివు డక్టస్‌ ఆర్టిరియోసిస్‌తో బాధపడుతుంది. నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. నెలలు నిండి పుట్టిన వాళ్ళలో తక్కువ. దీనివల్ల షంటు ద్వారా ఊపిరితిత్తులకు ఎక్కువ రక్తం పోతుంది. దీని ట్రీట్‌మెంట్‌ సులభం. చిన్న ఆపరేషన్‌తో మూసివేయవచ్చు. ఒక్కోసారి ఆపరేషన్‌ లేకుండా కూడా మూసివేయవచ్చు. ఆలస్యం చేస్తే ప్రమాదం అవ్వొచ్చు.

హైపోప్లేసియా...
హైపోప్లేసియా వల్ల కుడి లేక ఎడమ వెంట్రికల్‌ ఫేయిల్‌ అవుతుంది. గుండె ఒక భాగమే పనిచేస్తూ రక్తాన్ని శరీరంలోని భాగాలకి, ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది. ఇది చాలా అరుదు. ఇది సీరియస్‌ గుండె అనారోగ్యం. దీని హైపోప్లాస్టిక్‌ లెఫ్ట్‌ హార్ట్‌ సిండ్రోమ్‌ అంటారు, ఎడమ వెైపు గుండె దెబ్బతింటే, కుడివెైపు గుండె గదులు దెబ్బతింటే హైపోప్లాస్టిక్‌ రెైట్‌ సిండ్రోమ్‌ అంటారు. ఈ రెడు అనారోగ్యాలలోనూ గుండెకి శస్తచ్రికిత్స చేసి సరి చేయకపోతే ప్రాణాలు పోవచ్చు. గుండె నుంచి రక్తం తీసుకువెళ్లే, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో లోపాలుంటే వాటిని సరిచేయకపోతే ప్రాణాపాయం సంభవిస్తుంది. హైపోప్లేసియా గుండె జబ్బు సయనోటిక్‌ హార్ట్‌ డిఫెక్ట్‌.

అడ్డంకులు...
గుండె కవాటాలు, రక్తనాళాల్లో లోపముంటే రక్తం ప్రవాహాల్లో లోపాలు కలుగుతాయి. ఇవి ప్రధానంగా వాల్వ్‌ స్టినోసిస్‌, ‘కో ఆర్కేషన్‌ ఆఫ్‌ ది అయోర్టా బెైకస్పిడ్‌ అయోర్టిక్‌ వాల్వ్‌ స్టినోసిస్‌, సబ్‌ అయోర్టిక్‌ స్టినోసిస్‌ - చాలా అరుదుగా వస్తుంటాయి. రక్తనాళాలు సన్నపడడం, అడ్డంకులేర్పడటం వల్ల గుండె పెద్దది కావచ్చు. అధిక రక్తపోటు కలగవచ్చు.

గుండెలోపల గోడల లోపాలు...
Heartకణాలు గోడగా ఏర్పడి ఎడమ గుండెను, కుడి గుండెను వేరుచేసేది ‘స్టెప్టమ్‌’ పెై గదులు ఆరికల్ప్‌ మధ్య ఉండే గోడ, కింద నుండే గదులు వెంట్రికల్స్‌ మధ్య ఉండే గోడల్లో లోపాలు ఉండవచ్చు. అంటే సన్నటి రంద్రాలుండవచ్చు. వెంట్రిక్యులార్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌‌స సాధారణంగా కనిపించే లోపం.సి.హెచ్‌.డి. ఉన్న వాళ్ళలో 30 శాతం మంది అరికల్స్‌ మధ్య గోడలోపాలుంటాయి. దీనిని ‘ఫోరమెన్‌ ఒవెల్‌’ అంటారు. సెఫెక్ట్‌ డిఫెక్ట్‌ తీవ్రతను బట్టి ఇబ్బంది (మంచి చెడు రక్తాలు కలవడం) కలుగజేస్తాయి.

సయనోటిక్‌ డిఫెక్ట్‌...
రక్తంలో ఆక్సీజన్‌ తగ్గడం వల్ల శిశువులు నీలంగా ఉంటారుజ అందుకే బ్లూబేబి లేక సయనోటిక్‌ బేబి అంటారు. ట్రంకస్‌ ఆర్టిరియోసిస్‌, టోటల్‌ అనోమలస్‌ పల్మోనరి వీనస్‌ కనెక్షన్‌, టెట్రాలజీ అప్‌ ఫాలట్‌, గ్రేట్‌ వెజల్‌ ట్రాన్స్‌పొజిషన్‌, ట్రైకల్సిడ్‌ ఎట్రిషియాల వల్ల శిశువులు ఇలా కనిపించవచ్చు.
లక్షణాలు గుండెజబ్బు తీవ్రతను బట్టి ఉంటాయి. కొంతమంది పిల్లల్లో లక్షణాలుండవు. కొంతమంది పిల్లలు శ్వాశించడానికి ఇబ్బంది పడుతుంటారు. నీలంగా కనిపిస్తుంటారు. బాగా చెమట పడుతుంది. ఛాతినొప్పితో బాధపడుతుంటారు. గుండెలో గురగుర, శ్వాసకోసలో ఇన్‌ఫెక్షన్స్‌ లాంటి వాటితో బాధపడుతుంటారు.సి.హెచ్‌.డి. చాలా వాటికి సరిదిద్దడానికి శస్త్ర చికిత్స అవసరమవుతుంది. మందుల్ని వాడాల్సి వస్తుంది. డయూరిటిక్స్‌ డిజాక్సన్‌ వాడడం వల్ల గుండెలోని నీరు, సాల్ట్‌‌స తొలగించబడతాయి. గుండె చిన్నదెై బలంగా తయారవుతుంది. గుండె కొట్టుకోవడం తగ్గి కణాలలోంచి కొన్ని ద్రావకాలు బయటకు నెట్టబడతాయి.

కొన్ని లోపాల్ని సరిదిద్దడానికి శస్తచ్రికిత్స తప్పనిసరి, తల్లి కడుపులో శిశువు రూపొందుతుండంలో దోషాల వల్ల, గుండెకు రక్తం సరఫరా చేసే కరొనరి ఆర్టెరీలో ఆటంకాలు కలిగినా వచ్చే గుండెజబ్బులకు శస్తచ్రికిత్సలతో చాలా వరకు నయం చేయవచ్చు. సరెైన వయసులో చేయకపోతే జీవితం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఒకసారి అనుమానం వచ్చినప్పుడు స్పెషలిస్టును సంప్రదించండి.

  • Courtesy with  డా రవికుమార్‌ ఆలూరి--కార్డియాలజిస్ట్‌--గ్లోబల్‌ హాస్పిటల్‌, లక్డీకాపూల్‌,
  • ==========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Hints to Heart patients, హృద్రోగులకు జాగ్రత్తలు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- హృద్రోగులకు జాగ్రత్తలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  

  •  
 గుండె జబ్బు నివారణకు ముందస్తు జాగ్రత్తలు


చిన్న వయసులోనే గుండెపోటుకు గురైన వారసత్వ చరిత్ర ఉన్న వారు ఎప్పటి కప్పుడు కొలెస్ట్రాల్‌(cholesterol)  పరీక్షలు చేయించు కుంటూ కొలెస్ట్రాల్‌(cholesterol) ను నియం త్రించే చర్యలు చేపట్టాలి. కొలెస్ట్రాల్‌(cholesterol)  పెరగడం అన్నది ఆ వ్యక్తి లావుగా ఉన్నాడా సన్నగా ఉన్నాడా అన్నది ముఖ్యం కాదు. లావుగా ఉన్న వారిలో కొలె స్ట్రాల్‌(cholesterol)  నార్మల్‌గానే ఉండవచ్చు. సన్నగా ఉన్న వారి లో చాలా ఎక్కువగానూ ఉండవచ్చు. ఇవన్నీ రక్తపరీక్షల్లో తేలవలసిందే తప్ప శరీరం బరువు ఆధారంగా మాత్రం కాదు.

-కాకపోతే లావుగా ఉన్న వారిలో కాస్త ఎక్కువ మందిలో ఈ సమస్య ఉండవచ్చు. కుటుంబ చరిత్ర ఉన్న వారు చిన్న వయసు నుంచే కొలెస్ట్రాల్‌(cholesterol) పరీక్షలు చేయించు కుంటూ ఉండడం చాలా ముఖ్యం. తీవ్ర తను అనుసరించి ఆహార నియ మాలు పాటించడం కానీ, కొన్ని మందులు వేసుకోవడం ద్వారా గానీ కొలెస్ట్రాల్‌(cholesterol) ను నియంత్రణలో ఉంచవచ్చు. అలాగే గుండెపోటు రావడానికి మధుమేహం ఒక ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్న వారు వ్యాధిని పూర్తి నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ మందులు క్రమం తప్పకుండా వాడుతూ కనీసం ప్రతి మూడు మాసాలకు ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉంటే ఈ సమస్య నుంచి సురక్షితంగా బయటపడవచ్చు.

నిజానికి పురుషులతో పోలిస్తే స్ర్తీలలో గుండెపోటు తక్కువే. అయితే మధ్య వయసు వచ్చాక పురుషులతో సమానంగానే వీరూ గుండెపోట్లకు గురవుతారు. సహజంగా స్ర్తీలలో ఉండే ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ నిలిచిపోవడం అన్నది చాలా తక్కువ. కాకపోతే మెనోపాజ్‌ తరువాత మాత్రం పరిస్థితి మారిపోతుంది. దీనికి తోడు గర్భాశయాన్నీ, అండాశయాన్ని కూడా తొలగించిన వారిలో పురుషు లకు సమానంగానే గుండెపోటు వస్తుంది. అలా అని ఆ హార్మోన్‌ సప్లిమెంట్‌లు ఇవ్వడం ద్వారా ఈ స్థితిని అరికట్టలేం. గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ పేరుకు పోవడం వల్ల రక్తనాళం మూసుకుపోయి గుండె కండరానికి అవసరమైన రక్తం అందదు. ఈ పేరుకుపోవడం అన్నది నిదానంగా జరిగితే ఆ లక్షణాలు కూడా అంతే నిదానంగా కనబడతాయి.

-అలా కాకుండా ఏ కారణంగానైనా ఒక్కో సారి ఈ కొలెస్ట్రాల్‌ చిట్లిపోవచ్చు. సరిగ్గా అదే సమయంలో రక్తం గడ్డ కట్టి నాళం పూర్తిగా మూసుకుపోతుంది. అప్పటిదాకా ఏ 70 శాత మో ఉన్న అటంకం క్షణాల్లో నూరు శాతంగా మారిపోతుంది. ఆ వెంటనే గుండెపోటు వచ్చేస్తుంది. గుండె వేగం విపరీ తంగా పెరిగిపోయి ఆ తరువాత చాలా మందిలో గుండె కొట్టుకో వడం ఆగిపోతుంది. ఈ స్థితి ఏర్పడిన వారిలో సుమారు 50 శాతం మంది ప్రాణాలు కోల్పో వచ్చు. కొలెస్ట్రాల్‌ చితకడానికి కారణం పూర్తిగా తెలియక పోయినా శారీరక, మానసిక ఒత్తిళ్లు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. అందుకే కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించడం, పొగతాగడం కానీ, పొగాకు సంబంధిత వస్తువులు వాడటం గానీ పూర్తిగా మానుకోవడం ముఖ్యం.(డా శ్రీధర్‌ కస్తూరి-కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌-అవేర్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌ )

  • హృదయ స్పందన వేగం తగ్గితే...
 1) రక్త సరఫరా తగ్గడం వల్ల మెదడుకు తగినంత రక్తం సరఫరా కాదు.2) శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది.
3) నాడీ చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది.
వేగం పెరిగితే...
1) గుండె దడ వస్తుంది
2) సృహ తప్పడం జరుగుతుంది
3) తల తిరిగినట్లుగా అనిపిస్తుంది.
చికిత్స విధానం:
గుండె వేగం తగ్గినప్పుడు చాతి పెైభాగంలో చర్మం కింద ‘పేస్‌ మేకర్‌’ అమర్చి గుండె వేగాన్ని సరిదిద్దుతారు. గుండె వేగం పరిగినప్పుడు బీటా బ్లాకర్స్‌ గుండె లయను క్రమబద్దీకరించే మందులు ఇస్తారు.
గుండె లయ తప్పకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు:
1) మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి.
2) క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
3) బరువు పెరగకుండా చూసుకోవాలి.
4) రక్త పోటును అదుపులో పెట్టుకోవాలి.
5) కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి.
6) సమతూ ఆహారం తీసుకోవాలి.
7) పొగ తాగటం మానివేయాలి.
8) జీవనశెైలిని, ఆదనపు అలవాట్లు మార్చుకోవాలి.

  • - డా శ్రీధర్‌ కస్తూరి--అవేర్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, September 25, 2014

Ligament Tear-లిగమెంట్‌ టేర్‌

  •  

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Ligament Tear-లిగమెంట్‌ టేర్‌-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



బంధనాలు.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎలాంటివైనా సరే.. తెగిపోవాలనే కోరుకుంటాం! మన స్వేచ్ఛకు ప్రతిబంధకాలుగా భావిస్తూ వాటిని పటాపంచలు చేసెయ్యాలని చూస్తుంటాం. కానీ ఇది మన శరీరానికి మాత్రం వర్తించదు! ఎందుకంటే ఒంట్లో కొన్ని రకాల బంధనాలు తెగిపోతే ఆ బాధ వర్ణనాతీతం.

క్రీడల్లోనో లేదా ఏదైనా ప్రమాదాల్లోనో.. మోకాలికి బలమైన దెబ్బ తగిలితే.. మోకీలులో ఉండే ఈ లిగమెంట్లు తెగిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఇకసారి లిగమెంట్‌ తెగిందంటే ఇక పాట్లు తప్పవు. నడవాలంటే నొప్పి. కీలు స్థిరంగా ఉండదు. ఎప్పుడు బెసిగిపోయి పడిపోతామో భయం. ఒక రకంగా ఎముక విరిగినా దాన్నుంచి తేలికగానే బయటపడొచ్చేమోగానీ.. లిగమెంటు చినిగినా, తెగినా దాన్ని చక్కదిద్దుకోవటం అంత తేలిక కాదు. అది మళ్లీ అతుక్కుంటుందా? లేదా? సర్జరీతో సరవుతుందా? అసలు సరిచెయ్యాలా? వదిలేస్తే ఏమవుతుంది? ఇలా బోలెడన్ని సందేహాలు. అందుకే ఈ మోకీలు లిగమెంట్లకు సంబంధించిన సమగ్ర వివరాలను

కర్ర మీద కర్ర నిలబెట్టలేం. ఒకవేళ నిలబెట్టాలంటే ఏం చేస్తాం? వాటిని నిలబెట్టి.. రెండు పక్కలా.. వీలైతే రెంటి మధ్యలో కూడా.. తాళ్లో, మోకులో ఏవో ఒకటి బలంగా బిగించి కడతాం. మన కీళ్ల దగ్గర ఉండే లిగమెంట్లు కూడా సరిగ్గా ఈ తాళ్లలాంటి పాత్రే.. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే పెద్ద పాత్రే పోషిస్తుంటాయి! ఒకవైపు ఎముక మీద ఎముక బెసిగిపోకుండా నిలబడేలా చూస్తూనే.. కీలు అటూఇటూ కదులుతుండేందుకు.. స్వేచ్ఛగా వెనక్కీముందుకీ ఆడుతుండేందుకు ఈ లిగమెంట్లే మూలాధారంగా నిలుస్తాయి. మరీ ముఖ్యంగా మోకాలి కీలులో వీటి పాత్ర చాలా ఎక్కువ. అందుకే క్రీడల్లో లేదా ప్రమాదాల్లో మోకీలుకు బలమైన దెబ్బ తగిలితే.. ఎముకలు విరగొచ్చు. అంతే కాదు.. ఆ ఎముకలను పట్టి ఉంచే లిగమెంట్లు కూడా దెబ్బతినొచ్చు. అవి చిరగొచ్చు. పూర్తిగా తెగిపోనూ వచ్చు. ఇవే కాదు.. రెండు ఎముకల మధ్యా రబ్బరు కుషన్లలాగా ఉండే మినస్కస్‌ పొరలు కూడా చిరగొచ్చు, చిట్లిపోవచ్చు. ఈ స్థితిలో దెబ్బ తగిలిన వెంటనే పెద్ద ఇబ్బంది లేకపోయినా.. ఎక్స్‌రేలో అంతా బాగానే ఉన్నట్టనిపించినా.. క్రమేపీ మోకాలు వాచిపోయి అడుగు కదపాలంటే కష్టంగా తయారవ్వచ్చు. కీలు స్థిరత్వం పోయి.. నడుస్తుంటే పట్టు వదిలేస్తున్నట్టనిపించొచ్చు. మోకీలు బిగిసిపోయినట్లవ్వచ్చు. దీంతో నరకం కనిపిస్తుంది. ఇది ఒక రకంగా ఎముక విరగటం కంటే కూడా తీవ్రమైన.. కనబడకుండా ఇబ్బందిపెట్టే సమస్య. ఎముక అతుక్కున్నంత తేలికగా ఈ లిగమెంట్స్‌ అతుక్కోవు. ఈ స్థితిలో పరిస్థితిపై అవగాహన లేకపోతే.. దీన్ని గుర్తించటం, చక్కదిద్దుకోవటం పెద్ద సమస్యగా తయారవుతుంది.

బంధనాలు భద్రంగా ఉంటేనే..!
మన ఒంట్లోని ప్రతి కీలులోనూ ఎముక బంధనాలుంటాయి. వీటినే 'లిగమెంట్లు' అంటాం. ఇవి కీలులోని రెండు ఎముకలూ ఒకవైపు కదులుతూనే.. బిగువుగా, దగ్గరగా పట్టుకుని ఉండేందుకు దోహదం చేస్తాయి. ఈ బంధనాల వల్ల కీలు కదులుతూనే ఉంటుంది.. అలాగని ఎలా పడితే అలా కదిలిపోకుండా, బెసిగిపోకుండా స్థిరంగా కూడా ఉంటుంది. అందుకే కీలుకు లిగమెంట్లు అంత్యత కీలకమైనవి. అయితే వీటితో పాటు.. కీలు మొత్తాన్నీ కప్పి ఉండే కాప్స్యూల్‌ పొర, కొంత వరకూ కండరాలనూ-ఎముకలనూ పట్టి ఉంచే టెండాన్ల వంటివీ కీలు స్థిరత్వానికి సహకరిస్తుంటాయిగానీ వీటిలో ప్రధాన పాత్ర మాత్రం లిగమెంట్లదే. ఇవి దృఢంగా, భద్రంగా ఉంటేనే కీలు చక్కగా కదులుతుంటుంది. మన మోకాలి కీలులో ఈ లిగమెంట్ల పాత్ర మరీ కీలకం. ఎందుకంటే శరీరం బరువు మొత్తాన్నీ ఈ మోకీలే మోస్తుంటుంది, దానిచుట్టూ పెద్దగా దృఢమైన కండరాలూ అంతగా ఉండవు. అయినా మనం ఒంటి కాలు మీద కూడా స్థిరంగా నిలబడగలుగుతున్నామంటే అందుకు లిగమెంట్లు, కొంతవరకూ కీలు చుట్టూ ఉండే కాప్స్యూలే మూలం.

మోకీలుకు మూలాధారం 4 లిగమెంట్లు!
మోకీలులో- పైనుంచి వచ్చే తొడ ఎముక (ఫీమర్‌), కింది నుంచి వచ్చేపిక్క ఎముక (టిబియా).. ప్రధానంగా ఈ రెండూ ఒకదాని మీద మరోటి మడత బందులా ఆడుతుంటాయి. ఇవి ముందుకూ-వెనక్కూ మాత్రమే కాదు.. కొద్దిగా గుండ్రంగా, కాస్త పక్కలకు కూడా కూడా తిరుగుతుంటాయి. దీనివల్ల మనం నడిచేటప్పుడు చటుక్కున అటూఇటూ తిరిగినా, పక్కకు ఒరిగినా.. ఆ అనూహ్యమైన కుదుపును తట్టుకునే శక్తి కీలుకు ఉంటుంది. దీనికింతటి వెసులుబాటును తెచ్చేందుకు కీలులో ప్రధానంగా 4 లిగమెంట్లు ఉంటాయి. రెండు- కీలుకు రెండువైపులా తాళ్లలా గట్టిగా పట్టుకుని ఉండే 'కొల్లేటరల్‌' లిగమెంట్లు. మరో రెండు- కీలు లోపల రెండు ఎముకల మధ్యలో వాటిని కలుపుతూ 'X' ఆకారంలో ముందు నుంచి వెనక్కూ, వెనక నుంచి ముందుకూ బిగువుగా పట్టుకుని ఉంటాయి. వీటిలో ముందు నుంచి వెనక్కి ఉండేదాన్ని 'యాంటీరియర్‌ క్రూసియేట్‌ లిగమెంట్‌ (ఏసీఎల్‌)' అనీ, అలాగే వెనక నుంచి ముందుకు ఉండేదాన్ని 'పోస్టీరియర్‌ క్రూసియేట్‌ లిగమెంట్‌ (పీసీఎల్‌)' అనీ అంటారు. మొత్తానికి- కీలుకు మధ్యలో 2, కీలుకు రెండు పక్కలా మరో 2.. ఈ నాలుగూ కలిసి కీలుకు చక్కటి స్థిరత్వాన్ని ఇస్తుంటాయి. వీటికి ఉండే ప్రత్యేక గుణం- ఇవి సాగిపోవు. అలాగని అస్సలు సాగకుండా ఉండవు. కీలును ఒక పరిధి వరకూ అటూఇటూ వంగనిస్తాయి.

సాగటం.. తెగటం!
సాధారణంగా లిగమెంట్లు ఎన్నేళ్త్లెనా దృఢంగానే ఉంటాయి, వీటికి ఎలాంటి జబ్బులూ రావు. కాకపోతే ఆటల్లోనో, ప్రమాదాల్లోనో.. మన మోకీలు మీద విపరీతమైన ఒత్తిడి పడి.. అసాధారమైన కదలికలు వచ్చినప్పుడు.. ఇవి విపరీతంగా సాగిపోవచ్చు. ఇంకా ఒత్తిడి పడితే ఏకంగా తెగిపోవచ్చు. లేదూ, ఏదో ఒక వైపు నుంచి చిన్న ఎముక ముక్కతో సహా వూడిరావచ్చు. ఇవే పెద్ద సమస్యలు! ఇలాంటివి క్రీడాకారుల్లో ఎక్కువ. అలాగే బరువు ఎక్కువ ఉండే వారిలో, లేదా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, నడుస్తుంటే ముందుకు తూగటం.. పడిపోవటం వంటి అసాధారణ కదలికలు వచ్చినప్పుడు ఇవి గాయపడే అవకాశాలు చాలా ఎక్కువ. వీటికి జరిగే నష్టం.. ఒత్తిడి తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది.

* లిగమెంట్‌ బెణకటం (స్ప్రెయిన్‌): కీలు మీద తీవ్రమైన ఒత్తిడి పడి.. లిగమెంట్‌లోని తంత్రుల్లో చాలా కొద్దిగా మాత్రమే తెగితే దీన్ని గ్రేడ్‌-1 స్ప్రైన్‌ అంటారు. దీనివల్ల లిగమెంట్‌ బలం పెద్దగా తగ్గదుగానీ.. కొద్దిగా నొప్పి, వాపు ఉంటుంది. కొన్నిసార్లు తీవ్రత ఎక్కువగా ఉండి ఇది బాగా సాగి లూజుగా తయారవ్వచ్చు (గ్రేడ్‌-2). మొత్తానికి ఇవి చిన్న తరహా గాయాలే.

* లిగమెంట్‌ తెగిపోవటం (టేర్‌): లిగమెంట్‌ తట్టుకోలేనంతటి స్థాయిలోఅసాధారణ కదలికలు, ఒత్తిడి ఎదురైతే లిగమెంట్‌ తెగిపోవచ్చు. దీనిలో ప్రధానంగా రెండు రకాలు.

1. లిగమెంట్‌ ఎముకను అతుక్కునే చోట తెగి.. ఎముక ముక్కతో సహా పెళ్లలా వూడిరావటం. దీన్నే 'అవల్షన్‌' అంటారు, దీన్ని సర్జరీ చేసి.. తిరిగి వెనక్కి తీసుకువెళ్లి దాని స్థానంలో ఉంచి, స్క్రూలతో బిగించేస్తే ఎముకా-ఎముకా తేలిగ్గా అతుక్కుపోతాయి, ఇది పూర్తిగా నయమైపోతుంది.

2. లిగమెంట్‌ మధ్యలో చిరిగినట్లుగా తెగిపోవటం. ఇలా తరచుగా తెగేది.. కీలు మధ్యలో ఉండే ఏసీఎల్‌. దీనితో ఎదురయ్యే పెద్ద సమస్యేమంటే- ఇది ఉండేదే ఒక అంగుళం. తెగిపోతే తిరిగి అతకటానికి, కుట్టటానికి ఆధారంగా కూడా ఏమీ ఉండదు. అందుకే ఏసీఎల్‌గానీ, పీసీఎల్‌గానీ తెగితే.. కచ్చితంగా మరో ప్రత్యామ్నాయం ఏదైనా తీసుకొచ్చి.. మరమ్మతు చెయ్యాల్సిందేగానీ వీటినే తిరిగి కుట్టటానికి ఆస్కారం ఉండదు. పక్కలనుండే కొల్లేటరల్స్‌ తెగితే వాటిని సర్జరీతో సరిచేస్తారు.


  •  
* కొన్నికొన్ని ప్రత్యేక సందర్భాల్లో దెబ్బలు, గాయాల తీవ్రతను బట్టి రెండు, మూడు లిగమెంట్లు కూడా తెగిపోతాయి. ముఖ్యంగా ఫుట్‌బాల్‌ క్రీడాకారుల్లో ఏసీఎల్‌, ఎన్‌సీఎల్‌ రెండే కాదు.. కీలులో కింది వైపున ఉండే మినస్కస్‌ పొర కూడా దెబ్బతింటుంది.తెగటం.. ఎవరిలో ఎక్కువ?
లిగమెంట్లు, ముఖ్యంగా ఏసీఎల్‌ తెగిపోవటమన్నది క్రీడాకారులు, డ్యాన్సర్లలోనే కాదు.. పిల్లల్లో కూడా ఎక్కువే. అలాగే టీనేజీ ఆడపిల్లల్లో ఎక్కువ. పడిపోవటం, మోకాలు బలంగా నేలనుగానీ మరేదైనా గట్టి తలాన్ని ఢీకొనటం, నడుస్తూనో మెట్లు దిగుతూనే కాలు బెసగటం.. ఇలా ఏ సందర్భంలోనైనా ఇవి తెగిపోవచ్చు.

లక్షణాలు.. వెంటనే కనబడకపోవచ్చు!
లిగమెంట్లు బెణికినా, తెగినా.. వెంటనే నొప్పి, వాపు, నడక కష్టం కావటం వంటి సాధారణ లక్షణాలు ఉండొచ్చు. అయితే ఇవి అన్నిసార్లూ అంత తీవ్రంగా ఉండాలనేం లేదు. ముఖ్యంగా ఏసీఎల్‌ తెగినా.. వెంటనే లేచి తిరుగుతారు. మెల్లగా వాపు వంటివన్నీ తగ్గిపోతాయి కూడా. కానీ ఒకటి, రెండు వారాల తర్వాత కొద్దిగా వాపు, నడిచేటప్పుడు పట్టు వదిలేసినట్టు.. కీలు తొలిగిపోయినట్లు అనిపించటం వంటి ఇబ్బందులు మొదలవుతాయి. ఎక్స్‌-రే తీసినా అంతా బాగున్నట్టే అనిపించొచ్చు. ఎందుకంటే సాధారణ ఎక్స్‌రేలో ఎముకలు మాత్రమే కనబడతాయి. లిగమెంట్‌ల పరిస్థితి తెలియదు. అందుకని డాక్టరు స్వయంగా కీలును, చుట్టుపక్కల కండరాలను రకరకాల కోణాల్లో తిప్పి, నొక్కి పరీక్షించి లిగమెంట్‌ తెగిందని అనుమానిస్తారు. అవసరాన్ని బట్టి.. కీలును కొద్దిగా ఎడంగా లాగిపట్టి స్ట్రెస్‌-ఎక్స్‌రే తీస్తే ఎముకలు రెండింటి మధ్యా దూరం ఎక్కువ కనబడుతుంటుంది. ఎక్కువ దూరం జరుగుతున్నాయంటే లిగమెంట్‌ తెగిందని అనుమానిస్తారు. ఎమ్మారై స్కానింగు చేస్తే.. తెగిన విషయం స్పష్టంగా తెలుస్తుంది. అరుదుగా ఇందులో కూడా స్పష్టత రాకపోతే.. కీలులోకి కెమేరా గొట్టం (ఆర్థ్రోస్కోపీ) పంపి.. ప్రత్యక్షంగా చూడటం ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది.

చికిత్స ఏమిటి?
* ఓ మోస్తరు బెణుకు అయితే పెద్దపెద్ద చికిత్సల అవసరం ఉండదు. కొద్దిరోజులు ఐస్‌ కాపడం, ఎత్తు మీద పెట్టటం, నొప్పి తగ్గే మందులు, కొద్దిపాటి విశ్రాంతి, వాపు తగ్గిన తర్వాత వ్యాయామాలు చేస్తే చాలా వరకూ సర్దుకుంటుంది.

* పూర్తిగా తెగిపోతేనే సమస్య. కీలుకు పక్కవైపున ఉండే కొల్లేటరల్‌ లిగమెంట్లు తెగితే.. వాటికి సత్వరమే ఆపరేషన్‌ చేసి.. దగ్గరకు తెచ్చి అతుకుతూ కుట్లు వెయ్యటం అవసరం. ఆరువారాల విశ్రాంతితో ఇవి అతుక్కుపోతాయి. ఇక ఏసీఎల్‌గానీ, పీసీఎల్‌గానీ తెగితే.. అది మొత్తం అంగుళం కూడా ఉండదు, అదీ పీచుపీచుగా అయిపోతుంది. వాటిని దగ్గరకు తెచ్చి కుట్లు వేయటం కూడా కష్టం. అందుకని వీటి విషయంలో రకరకాల మార్గాలను అనుసరించాల్సి వస్తుంది.

తెగిన వెంటనే.. ఎటువంటి ప్రత్యేక చికిత్సా అవసరం ఉండదు. కొద్దివారాల పాటు విశ్రాంతి, నొప్పి తగ్గే మందులు, కీలుకు అవసరమైతే బ్రేసెస్‌తో సపోర్టు ఇస్తే సరిపోతుంది. ఈ దశలో కూడా కీలు కదల్చటం ముఖ్యం. లేకపోతే బిగిసిపోతుంది. ఇలా ఓ 40 రోజుల పాటు కొద్దిపాటి కదలికలు, విశ్రాంతి ఇస్తే నొప్పి, వాపు తగ్గుతాయి. ఈ స్థితిలో కీలు కదలికలను, రోగి జీవనశైలిని బట్టి చికిత్స ఏమిటన్నది నిర్ధారించాల్సి ఉంటుంది. క్రీడాకారుల వంటివారు కానప్పుడు సర్జరీ తొలి ప్రాధాన్యం కాదు. ఒకప్పుడు అంతగా శారీరక శ్రమ చెయ్యని, పెద్దవయసు వారికి సర్జరీ చేసి.. లిగమెంట్లను రిపేరు చెయ్యనవసరం లేదని భావించేవారుగానీ.. వీటిని సరిచెయ్యకపోతే కీలు అస్థిరంగా తయారవుతుంది. కొంతకాలం పాటు అలాగే ఉంటే అటూఇటూ కదిలిపోతూ త్వరగా కీలు అరిగిపోతోందని గుర్తించారు. అందుకని అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వైద్యులు లిగమెంట్లను మరమ్మతు చెయ్యటానికే ప్రయత్నిస్తారు. మరీ పెద్ద వయసు వారికి.. అది కుదరని పక్షంలో ఫిజియో థెరపీ చేస్తూ.. మోకీలు మీద భారాన్ని తగ్గించేలా మోకాలు వెనకాల ఉండే హ్యామ్‌స్ట్రింగ్‌ కండరాలను బలపరచటం వంటివి సిఫార్సు చేస్తారు. ఏసీఎల్‌ చేసే పనిని కొంతవరకూ హ్యామ్‌స్ట్రింగ్స్‌ తీసుకుంటాయి కాబట్టి దానివల్ల కీలు బెసగకుండా ఉంటుంది. క్రీడాకారులు, యువతీయువకుల వంటివారికి మాత్రం వీటిని మరమ్మతు చెయ్యక తప్పదు.

లిగమెంట్‌ తెగిపోయినప్పుడు మరీ వృద్ధులకు కాకపోయినా.. క్రీడాకారులు, యువతీయువకుల వంటివారికి మాత్రం వాటిని మరమ్మతు చెయ్యటం మేలు.

సర్జరీ
ఏసీఎల్‌, పీసీఎల్‌ మరమ్మతు ఎలా?

ఏసీఎల్‌గానీ, పీసీఎల్‌గానీ మధ్యలో తెగిపోతే అవి తిరిగి అతుక్కోవటం కష్టం. దానికి ఉన్న ఒకటే మార్గం.. దీనికి ప్రత్యామ్నాయం కల్పించటం! ఇందుకోసం ఒకప్పుడు కృత్రిమంగా తయారు చేసిన లిగమెంట్లను ప్రయత్నించారుగానీ అవి దీర్ఘకాలం మన్నటం లేదని తేలింది. కాబట్టి ఒంట్లోనే వేరే చోటి నుంచి లిగమెంట్‌లా దృఢంగా ఉండే భాగాన్ని తీసుకువచ్చి అతకొచ్చు (ఆటోగ్రాఫ్ట్‌). లేదంటే ఇతరుల నుంచి సేకరించినది తెచ్చి పెట్టచ్చు (ఆలోగ్రాఫ్ట్‌).

శరీరంలోనే ఇతర భాగం నుంచి సేకరించేందుకు ప్రధానంగా రెండు మార్గాలున్నాయి. 1. మోచిప్పకు అతుక్కుని ఉండే 'పటిల్లార్‌ టెండన్‌' నుంచి కొంత భాగం కత్తిరించి తీసుకొచ్చి వెయ్యచ్చు. 2. మోకాలు వెనకాల దృఢంగా ఉండే హ్యామ్‌స్ట్రింగ్‌ కండరం ముక్కను తీసుకొచ్చి అతకొచ్చు. ఇందుకోసం ఒకప్పుడు మోకాలిని పూర్తిగా తెరిచి సర్జరీ చెయ్యాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆర్థ్రోస్కోపీ విధానంలో కేవలం చిన్న రంధ్రాలు ద్వారానే పూర్తి చేస్తున్నారు. (సర్జరీ విధానం బాక్సులో)

మరమ్మతు తర్వాత సుమారు 40 రోజుల్లో కొత్తగా అతికిన లిగమెంట్‌లు అతుక్కుంటాయి. ఈలోపు జాగ్రత్తగా వ్యాయామాలు చేస్తూ వాటిని కుదురుకోనివ్వాలి. ఇవి దీర్ఘకాలం మన్నుతున్నాయని అధ్యయనాల్లో గుర్తించారు. సర్జరీ తర్వాత కనీసం ఆర్నెల్ల పాటు వ్యాయామాల వంటివి చెయ్యాలి. దీంతో అవి పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకుంటాయి.
మినస్కస్‌లు చినిగిపోతే!
కీలు లోపల.. అడుగువైపున అర్ధ చంద్రాకారంలో రెండు రబ్బరు వాషర్ల వంటి పొరలు ఉంటాయి. వీటినే మినస్కై అంటారు. దూకినప్పుడు, ఎగరటం వంటివి చేసినప్పుడు.. ఎముకలు గట్టిగా రుద్దుకోకుండా రబ్బరు కుషన్లలా ఇవి రక్షణ ఇస్తుంటాయి. వీటికి రక్తప్రసారం పెద్దగా ఉండదు. కాబట్టి ఇవి చిట్లితే అతుక్కోవటం కొంత కష్టం. సాధారణ నడకలో మన బరువుకు నాలుగు రెట్ల బరువు వీటి మీద పడుతుంది. అదే పరుగెడుతున్నప్పుడైతే దాదాపు పది రెట్లు ఎక్కువ పడుతుంది. ఎంత గట్టిగా ఉన్నా.. అసాధారణమైన ఒత్తిడి పడినప్పుడు ఇవి కూడా చినిగిపోవచ్చు. కీలులో ఈ చినిగిన ముక్కలు అడ్డుపడటం వల్ల లోపలి నుంచి శబ్దాలు, విపరీతమైన నొప్పి, కీలు బిగిసిపోయినట్లుండటం, పట్టు వదిలేసినట్టుండటం వంటి లక్షణాలు కనబడతాయి. వెంటనే వాపు రాకపోవచ్చు, మెల్లగా మర్నాటికి రావొచ్చు. ఒక్కోసారి ఏసీఎల్‌తో పాటు ఈ మినస్కస్‌లూ దెబ్బతింటాయి. ఇవి బయటివైపు చిరిగితే తిరిగి అతికించి కుడతారు. ఇలా 10% మందిలోనే సాధ్యపడుతుంది. అదే లోపలి వైపు చినిగితే.. సర్జరీ చేసి.. ఆ కాస్త ముక్క తీసెయ్యటం తప్పించి మరో మార్గం లేదు.

  • Courtesy with : Dr.K.Krushnayya (Orthopaedic surgeon) Medicity hos.Hyderabad@eenadu sukhibhava..23-09-2014
  • =========================

Saturday, September 13, 2014

Premature Overian failure-ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Premature Overian failure-ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


   అండాశయాలు కొందరిలో నలభైఏళ్లకన్నా ముందుగానే తమ పనిని ఆపేస్తాయి. దాంతో ముందే నెలసరులు ఆగిపోతాయి. ఆస్టియోపోరోసిస్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి! మెనోపాజ్‌ లక్షణాలు ముందుగానే కనిపించే ఈ సమస్యనే 'ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌' అంటారు.

అండాశయాలు.. స్త్రీ లక్షణాలు ఏర్పడడానికి ఇవే ప్రధాన కారణం. స్త్రీ ఆకృతి, నెలసరులూ, సంతాన సాఫల్యత ఇవన్నీ అండాశయాల పనితీరుపైనే ఆధారపడి ఉంటాయి. సాధారణంగా మెనోపాజ్‌ దశలోనే ఇవి తన పనితీరు ఆపేస్తాయి. దాంతో నెలసరులు ఆగిపోవడం.. ఎముకలు గుల్లబారడం ఇలా చాలా సమస్యలొస్తాయి. కానీ మెనోపాజ్‌ రాకుండానే కొందరిలో అండాశయాలు తన పనితీరు ఆపేస్తాయి. దాన్నే 'ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌' అంటారు. దాంతో ఈస్ట్రోజెన్‌ హార్మోను అందదు. అండాలు సరిగ్గా విడుదల కావు. ఫలితంగా సంతాన సాఫల్యతా తగ్గుతుంది.

లక్షణాలివి..
నెలసరిలో తేడాలు మొదలవుతాయి. రక్తస్రావం ఎక్కువగా లేదా తక్కువగా కావచ్చు. రోజులతరబడి ఉండొచ్చు. మరికొన్నిసార్లు నెలల తరబడి అసలు నెలసరే రాకపోవచ్చు. ఈ సమస్య సాధారణంగా ప్రసవమయిన వారిలో, లేదా గర్భనిరోధక మాత్రలు వాడటం ఆపేశాక ఎదురుకావచ్చు. ఒంట్లో ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, విపరీతంగా చెమటలు పట్టడం, జననేంద్రియాలు పొడిబారడం, మంటగా అనిపించడం, లైంగికవాంఛలు తగ్గడం వంటివి దీని లక్షణాలు.

ఎందుకిలా..
అసలు అండాశయాల పనితీరు ఎలా ఉంటుందనేదీ తెలుసుకోవాలి. సాధారణంగా నెలసరి సమయంలో పిట్యూటరీ గ్రంథి కొన్ని హార్మోన్లను విడుదల చేస్తుంది. వాటి ద్వారా అండాలున్న ఫాలికల్స్‌ విడుదలవుతాయి. వాటిలో ఒక్క ఫాలికల్‌ మాత్రమే పరిణతి చెందుతుంది. ఇది ఫెలోపియన్‌ ట్యూబుల్లోకి చేరి, వీర్యకణాలతో కలిసి ఫలదీకరణ చెందుతుంది. గర్భం వస్తుంది. అయితే.. ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌ ఉన్నవారిలో ఈ ప్రక్రియ ఇంత సజావుగా సాగదు. ఇందుకు దారితీసే కారణాలివి..

ఫాలికల్‌ డిప్లీషన్ ‌: ఇందుకు రెండు కారణాలుంటాయి. ఒకటి వంశపారంపర్యం. ముఖ్యంగా టర్నర్స్‌ సిండ్రోమ్‌ గురించి చెప్పుకోవాలి. ఈ సమస్య ఉన్న స్త్రీలకు రెండు ఉండాల్సిన ఎక్స్‌ క్రోమోజోమ్‌ ఒకటే ఉంటుంది. మానసిక సమస్య మొదలవుతుంది. ఇక రెండో కారణం.. కీమోథెరపీ రేడియేషన్‌ చికిత్సలు వంటివి తీసుకోవడం. ఈ చికిత్సలు శరీరంలోని కణాలపై ప్రభావం చూపుతాయి. సిగరెట్‌ పొగా, రసాయనాలూ, క్రిమి సంహారకాలూ, కొన్నిరకాల వైరస్‌లు కూడా అండాశయాల పనితీరుపై ప్రభావం చూపుతాయి.

ఫాలికల్‌ డిస్‌ఫంక్షన్ ‌: కొన్నిసార్లు అండాశయాల్లోని కణజాలానికి వ్యతిరేకంగా శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. ఇవి అండాల విడుదలపై ప్రభావం చూపుతాయి. ఇమ్యూనో డిసీజ్‌ పరీక్షల్లో ఈ యాంటీబాడీల గురించి తెలుసుకోవచ్చు. ఇందుకు కారణం ఏమిటో ఇంకా స్పష్టంగా తేలలేదు. వైరస్‌ ఒక కారణమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్నిసార్లు ఎలాంటి కారణాలు లేకుండానే అండాశయాల పనితీరు మందగిస్తుంది. అలాంటప్పుడు ఇమ్యూనో డిసీజ్‌ పరీక్షతోబాటు మిగతావీ చేయించాలి. చాలాసార్లు ముప్ఫైఅయిదు, నలభైఏళ్ల మధ్య ఈ సమస్య మొదలయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.

తల్లి కాలేకపోవచ్చు..
ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో చాలామంది మహిళలు కెరీర్‌కి ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే గర్భం దాల్చేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. అలా ఆలస్యంగా గర్భం దాల్చేవారిలో అండాశయాల పనితీరు సరిగ్గా లేకపోతే తల్లయ్యే ఆనందాన్ని పూర్తిగా దూరం చేసుకోవాల్సి రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో అరుదుగా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది.

ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఈస్ట్రోజెన్‌ హార్మోను కీలకంగా పనిచేస్తుంది. వాటి స్థాయులు తగ్గడం వల్ల నలభైల్లోనే ఎముకలు బలహీనమై పెళుసుబారడం మొదలవుతాయి. చిన్నవయసులోనే ఆస్టియోపోరోసిస్‌ వచ్చే ఆస్కారం ఎక్కువ.

సంతాన సాఫల్యత తగ్గడం, ఇతర సమస్యలూ, వేడి ఆవిర్లూ, చెటమలు పట్టడం... లాంటివన్నీ ఆ స్త్రీలను మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి.

పరీక్షలున్నాయి..
అండాశయాల పనితీరు ఎంత వరకూ తగ్గుతోంది.. అసలు అదేనా సమస్య అన్నది గుర్తించేందుకు కొన్నిరకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి..

ఫాలికల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోను(ఎఫ్‌ఎస్‌హెచ్‌)టెస్ట్ ‌: వాస్తవానికి ఎఫ్‌ఎస్‌హెచ్‌ అనేది హార్మోను. ఇది పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలై, అండాశయాల్లో ఫాలికల్స్‌ పెరిగేందుకు తోడ్పడుతుంది. ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌ సమస్య ఉన్నప్పుడు ఈ హార్మోను స్థాయుల్లో తేడా కనిపిస్తుంది.

ఈస్ట్రాడియాల్‌ టెస్ట్‌ : ఈస్ట్రాడియల్‌ అనేది ఈస్ట్రోజెన్‌ హార్మోనులో ఓ రకం. అండాశయాల పనితీరు తగ్గినప్పుడు రక్తంలో దీని శాతం తగ్గుతుంది.

ప్రొలాక్టిన్‌ టెస్ట్ ‌: ఇది సాధారణంగా తల్లిపాల ఉత్పత్తిని పెంచే హార్మోను. ప్రొలాక్టిన్‌ ఎక్కువగా ఉన్నప్పుడు అండం విడుదలలో తేడాలుంటాయి.

కార్యోటైప్ ‌: క్రోమోజోముల్లోని లోపాలను తెలుసుకునేందుకు ఈ పరీక్షను చేస్తారు. ఇది నలభైఆరు క్రోమోజోములను పరీక్షిస్తుంది. అండాశయాల పనితీరు తగ్గినప్పుడు రెండు ఉండాల్సిన ఎక్స్‌ క్రోమోజోములకు ఒకటే ఉన్నా, క్రోమోజోములకు సంబంధించి ఇతర సమస్యలున్నా ఈ పరీక్షలో తెలుస్తుంది.

ఎఫ్‌ఎంఆర్‌ఐ జీన్‌ టెస్టింగ్ ‌: ఇది ఎక్స్‌ క్రోమోజోమ్‌కి సంబంధించింది. వాటిల్లో లోపం ఉన్నప్పుడు ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది.

చికిత్స --
అండాశయాల పనితీరు ఆగిపోయినప్పుడు ఈస్ట్రోజెన్‌ హార్మోను లోపం ఉంటుంది. అందువల్ల.. దాన్ని భర్తీ చేసే దిశగా చికిత్సకు ప్రాధాన్యం ఇస్తారు.

ఈస్ట్రోజెన్‌ థెరపీ : ఆస్టియోపోరోసిస్‌, ఆవిర్లూ లాంటి సమస్యల్ని నివారించేందుకు వైద్యులు ఈ చికిత్సను సూచిస్తారు. ఈస్ట్రోజెన్‌ని చికిత్స రూపంలో ఇస్తారు. అయితే ఈస్ట్రోజెన్‌ వల్ల క్యాన్సర్‌ సమస్యలు రాకుండా ప్రొజెస్టరాన్‌ని కూడా సూచిస్తారు. ఇది గర్భాశయంలోని ఎండోమెట్రియం పొరకి రక్షణగా ఉంటుంది. ఈ రెండింటినీ వాడటం వల్ల మళ్లీ రక్తస్రావం కనిపించవచ్చు. అలాగని అండాశయాలు మళ్లీ పనిచేస్తున్నట్లు కాదు. రోగి ఆరోగ్య పరిస్థితి, ఉన్న ఇతర సమస్యలను బట్టీ ఈ హార్మోన్లను యాభై ఒక్క ఏళ్ల వరకూ వాడొచ్చు. ఆ తర్వాతా తీసుకోవడం మంచిది కాదు. తీసుకుంటే గుండె సంబంధ సమస్యలూ, రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ.

క్యాల్షియం, విటమిన్‌ డి : ఆస్టియోపోరోసిస్‌ని నివారించాలంటే ఈ రెండూ చాలా అవసరం. అండాశయాలకు సంబంధించిన సమస్యలున్నప్పుడు వైద్యులు బోన్‌డెన్సిటీ పరీక్ష చేసి మందుల్ని ఏ మోతాదులో వాడాలో నిర్ణయిస్తారు. సాధారణంగా పందొమ్మిది నుంచి యాభై ఏళ్లలోపు స్త్రీలు రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల క్యాల్షియంని ఆహారం లేదా సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాలి. ఆ వయసు తర్వాత పన్నెండొందల మిల్లీగ్రాములు తీసుకోవాలి. విటమిన్‌ డిని మాత్రం రోజుకు 600 - 800 ఇంటర్నేషనల్‌ యూనిట్ల లెక్కన సూచిస్తారు. ఒకవేళ రక్తంలో విటమిన్‌ డి స్థాయి తక్కువగా ఉందని తేలితే ఆ మోతాదును ఇంకా పెంచుతారు. ఈ సమస్య ఉన్నవాళ్లు ఆహారంలోనూ క్యాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దాంతోపాటూ నడకా, బరువులెత్తే వ్యాయామాలూ చేయడం కూడా చాలా అవసరం.

కృత్రిమ పద్ధతుల్లో : అండాశయాలు విఫలమైనవారికి సంతానసాఫల్యత కూడా తగ్గుతుందని చెప్పుకున్నా. ఇలాంటివారు ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ ద్వారా గర్భం దాల్చాల్సి రావచ్చు.

  • Courtesy with : Dr.Praneetha Reddy(Uro.gyaenocologist) Hyd.@eenadu vasundhara.
  • ==========================

Monday, September 1, 2014

Breast pain and scretions awareness-వక్షోజాల నొప్పి మరియు స్రావముల అవగాహన

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --వక్షోజాల నొప్పి మరియు స్రావముల అవగాహన -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


''రొమ్ములో నొప్పిగా ఉంటోంది..'' అని కొందరు ఫిర్యాదు చేస్తే.. ''అప్పుడప్పుడూ స్రావాలూ విడుదలవుతున్నాయి..'' ''తడుముతుంటే గడ్డల్లా తగులుతున్నాయి'' అంటుంటారు మరికొందరు. సమస్య ఎలాంటిదైనా క్యాన్సరేమో అనే భయం మాత్రం అందరిలోనూ ఉంటుంది. అయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉందన్నది నిర్ధరించుకోవడం చాలా అవసరం.
పుట్టినప్పట్నుంచే స్త్రీల వక్షోజాల్లో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. కొన్ని సమస్యలూ ఎదురవుతాయి. సాధారణంగా రొమ్ములో నొప్పీ, అసాధారణ స్రావాలూ, గడ్డలూ, ఆకృతిలో తేడాల వంటి సమస్యల్ని చాలామంది ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. పైగా అవి పుట్టిన పాపాయి దగ్గర్నుంచీ, రుతుక్రమం మొదలైనప్పుడూ, యౌవనంలో, గర్భిణిగా ఉన్నప్పుడూ, బిడ్డకు పాలిచ్చేప్పుడూ, నడివయసు నుంచి మెనోపాజ్‌ వరకూ... ఇలా ఏ దశలోనయినా ఇబ్బందిపెట్టవచ్చు. వీటిలో ఏవి హాని కలిగించేవో తెలియాలంటే మొదట వక్షోజాల నిర్మాణం గురించి తెలుసుకోవాలి. రొమ్ముల్లో అతి ముఖ్యమైన భాగం పాల గ్రంథి అయినప్పటికీ ఇతర కణజాలం కూడా ఉంటుంది. చర్మం, కొవ్వు పదార్థం, మందమైన టిష్యూ పొర (ఫేసియా), కండరాలూ, పక్కటెముకలూ, చనుమొనల వంటివన్నీ వాటి నిర్మాణంలో భాగమే. ఇవన్నీ ఒక్కో వయసులో ఒక్కోరకమైన మార్పు చెందుతూ వస్తాయి. పాల గ్రంథులైతే హార్మోన్లకి ఎక్కువగా స్పందిస్తాయి.

నొప్పి ఎందుకంటే...
ప్రతి స్త్రీకి ఏదో ఒక వయసులో ఈ బాధ ఉంటుంది. చాలామంది ఈ నొప్పి క్యాన్సర్‌కి సంకేతం అని భయపడతారు. అయితే ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సైక్లికల్‌. అంటే రుతుచక్రంతో ప్రతినెలా వచ్చే నొప్పి. ఇది నెల మధ్యలో మొదలై నెలసరి సమయం వరకూ పెరుగుతూ ఉంటుంది. హార్మోన్లు ఎక్కువగా స్రవించడం వల్ల వక్షోజాల్లోని కణాల్లో స్రావాలు ఎక్కువై, నొప్పి వస్తుంది. వక్షోజాలు కాస్త గట్టిగా అనిపిస్తాయి. ఈ నొప్పి మన శరీరధర్మంలో భాగం కాబట్టి భయం లేదు. నొప్పి నివారణ మందులు, విటమిన్‌ ఇ, ఈవెనింగ్‌ ప్రిమ్‌రోజ్‌ మాత్రల రూపంలో తీసుకోవడం, వక్షోజాలకు ఆసరా ఉండే లోదుస్తులు ధరిస్తే ఉపశమనం ఉంటుంది. నెలసరికి కొన్ని రోజుల ముందు కాఫీలూ, టీలూ, శీతలపానీయాలూ, వేపుళ్లూ తగ్గించుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది. అయినా ఫలితం లేదనుకుంటే సమస్య తీవ్రతను బట్టి మూత్రవిసర్జన ఎక్కువ కావడానికి మందులూ సూచిస్తారు వైద్యులు. కొన్నిసార్లు రుతుక్రమంతో సంబంధం లేకుండా కూడా నొప్పి ఉంటుంది. రొమ్ములో స్రావాలు నిలిచిపోయి, చిన్నచిన్న నీటి బుడగల్లా తయారైనా, లేదా రొమ్ములోని పాల నాళాల్లో స్రావాలు గట్టిపడినా నొప్పి ఉంటుంది. ఈ పరిస్థితిని ఫైబ్రోసిస్టిక్‌ డిసీజ్‌ అంటారు. ఒక్కోసారి రొమ్ముపైన సెగ్గడ్డల్లాంటివీ వస్తాయి. అప్పుడూ నొప్పి సహజం. అలాంటప్పుడు వైద్యులు పరీక్షించి కారణం తెలుసుకుని చికిత్స సూచిస్తారు.

చనుమొనల నుంచి స్రావాలు...
ఒక్కోసారి హార్మోన్ల ప్రభావం వల్ల చనుమొనల నుంచి నీరులాంటి స్రావం కనిపించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అది చిక్కగా, నెత్తురులా ఉండటం, బూడిద రంగులో, చీములా ఉంటే తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. ఇటువంటి డిశ్ఛార్జి ఫైబ్రోసిస్టిక్‌ డిసీజ్‌ లేదా పాల నాళాల్లో ప్యాపిలోమా గానీ క్యాన్సర్‌గానీ ఉందనడానికి సంకేతం. మామోగ్రామ్‌ చేస్తారు. ఆ స్రావాన్ని గాజుపలకపై సేకరించి పరీక్షిస్తారు. కారణం తెలుసుకుంటారు. కొన్నిసార్లు పాలలాంటి స్రావం కూడా చనుమొనల నుంచి వస్తుంది.

గెలక్టోరియా: అంటే వక్షోజాల నుంచి పాలు స్రవించడం, పాలిచ్చేప్పుడు కాకుండా ఇతర సమయాల్లోనూ ఇలా స్రవిస్తుంటే దీనికి కొన్ని కారణాలుంటాయి. మొదటిది ప్రొలాక్టిన్‌ లేదా పాల హార్మోను ఎక్కువగా తయారుకావడం. ఇది మెదడులో ట్యూమర్లతో, లేదా మూత్రపిండాల వైఫల్యం, లేదా కొన్నిరకాల మందులు వాడటం వల్ల కావచ్చు. ఒత్తిడి నివారణకు సంబంధించిన మందులు వాడటం వల్లా కావచ్చు. ఫలితంగా ప్రొలాక్టిన్‌ స్థాయులు పెరుగుతాయి. ఇలాంటప్పుడు నెలసరి ఆలస్యం అవుతుంది లేదా నిలిచిపోతుంది. ప్రొలాక్టిన్‌, థైరాయిడ్‌, ట్యూమర్‌ లేదని నిర్ధరించుకోవడానికి మెదడుకి సీటీస్కాన్‌ లాంటి పరీక్షలు అవసరం. ఒకవేళ వాడే మందులే కారణం అనుకుంటే వాటిని మానేయమంటారు వైద్యులు. మందులు సూచిస్తారు. ఇలాంటి స్రావాలు కనిపించగానే చాలామంది క్యాన్సర్‌ అనుకుంటారు కానీ తొంభై అయిదుశాతం పై కారణాలే ఉంటాయి.

వక్షోజాల్లో గడ్డలు...
చేతికి గడ్డలు తగులుతున్నాయని చెబుతుంటారు చాలామంది. చాలామంది పాలగ్రంథినే గడ్డ అనుకుని కంగారుపడతారు. అయితే రొమ్మును పరీక్షించడానికి ప్రత్యేక పద్ధతి ఉంటుంది. రెండువేళ్ల మధ్య వక్షోజాలను పట్టుకుని చూస్తే గడ్డల్లానే ఉంటాయి. అలా కాకుండా అరచేత్తో తడిమి, పరీక్షించుకుంటే నిజంగానే గడ్డలు ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుంది. ఒకవేళ ఆ సందేహం ఉంటే గనుక వైద్యులు మామోగ్రఫీ సూచిస్తారు. దీన్ని అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ ద్వారా చేయొచ్చు. ఎక్స్‌రే ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడు కూడా వ్యాధి నిర్ధరణ కాకపోతే ఎంఆర్‌ఐ చేస్తారు. నిజంగా గడ్డ ఉంటే గనుక తరవాత ఎఫ్‌.ఎన్‌.ఎ.సి. (ఫైన్‌ నీడిల్‌ యాక్టివేషన్‌ సైటాలజీ) పరీక్ష చేయించుకోమంటారు. సన్నటి సూదితో గడ్డలోని కణాలు సేకరించి వాటిని మైక్రోస్కోప్‌తో పరీక్షిస్తారు. అవసరాన్ని బట్టి బయాప్సీ చేస్తారు. బాగా అనుమానం ఉంటే గడ్డ తీసి పరీక్షిస్తారు. దానివల్ల అది క్యాన్సరా కాదా అన్నది తెలిసిపోతుంది.

సాధారణంగా చిన్నవయసులో చేతికి తగిలే గడ్డలు ఫైబ్రోఎడినోమా కావచ్చు. అవి తేలిగ్గా రొమ్ములో తగులుతాయి. చనుమొనల నుంచి ఎలాంటి స్రావాలూ విడుదలకావు. పెద్దగా ఉండి, వాటితో సమస్యలొస్తుంటే తప్ప చికిత్స అవసరంలేదు. వాటి పరిమాణం పెరుగుతూ, నొప్పీ ఉంటే గనుక శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించాలి. కొన్నిసార్లు వక్షోజాల్లోని కొవ్వంతా గడ్డకట్టి కూడా గడ్డలా తయారవుతుంది. అలాగే ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు కూడా గడ్డలా చేతికి తగులుతుంది. అప్పుడు మాత్రం జ్వరం, గడ్డ ఉన్న చోట చర్మం ఎర్రగా కందిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ ఆ గడ్డ గట్టిగా రాయిలా వక్షోజం లోపల అతుక్కుని ఉంటే పైన చర్మం కూడా దానికి అతుక్కుపోయి, చనుమొనల నుంచి రక్తంతో కూడిన స్రావాలూ వస్తుంటే క్యాన్సర్‌కి సూచన కావచ్చు. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.

బాలింతల్లో...
పాపాయికి పాలుపట్టడం కోసం వక్షోజాలను గర్భం దాల్చినప్పటి నుంచి చనుమొనల విషయంలో శ్రద్ధ పెట్టాలి. వక్షోజాలపై చర్మానికి మాయిశ్చరైజర్‌ లేదా కొబ్బరినూనె, నెయ్యి లాంటివి రాసుకోవచ్చు. ప్రసవ సమయం దగ్గరపడుతున్నకొద్దీ చనుమొనల్లోని నాళాలు తెరచుకుని ఉన్నాయా లేదా గమనించుకోవాలి. బిడ్డ పుట్టిన వెంటనే పాలివ్వడం మొదలుపెట్టాలి. లేదంటే పాలు తయారయ్యే సమయంలో రొమ్ములు బాగా గట్టిపడిపోయి, రెండుమూడు రోజులు నొప్పిగా అనిపిస్తాయి. వక్షోజాల్లో రక్తప్రసరణ ఎక్కువ కావడం, లింఫ్‌ గ్రంథుల్లో స్రావాలు పెరగడం దీనికి కారణం. ఈ సమయంలో కొందరికి బాహుమూలల్లో వాపు వచ్చేస్తుంది. ఇది సహజమైన వాపు. అలాగే చనుమొనలపై శ్రద్ధపెట్టకపోతే అవి పొడిబారి పగుళ్లు వచ్చి, బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశముంది. దాంతో విపరీతమైన నొప్పీ, వాపూ, ఎర్రబడటం, జ్వరం లాంటివి బాధిస్తాయి. ఇలాంటప్పుడు యాంటీబయోటిక్స్‌ వాడాల్సి రావచ్చు. ఆపరేషన్‌ చేసి చీము తొలగిస్తారు.

ఈ జాగ్రత్తలు అవసరం..
ప్రతినెలా నెలసరి అయిపోయిన వెంటనే వక్షోజాలను పరీక్షించి చూసుకోవాలి. ఏడాదికోసారి వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో రొమ్ముక్యాన్సర్‌ ఉన్న స్త్రీలు ముప్ఫైఅయిదు సంవత్సరాల నుంచి, ఇతరులు నలభై ఏళ్ల నుంచి ఏడాదికోసారి మామోగ్రఫీ చేయించుకోవాలి.

courtesy with Dr.Y.Savithadevi@Eenadu vasundhara news paper 01/09/2014
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, August 31, 2014

Detection of Cancer at an early stage,క్యాన్సర్‌ ముప్పు ముందే పసిగడదాం


  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Detection of Cancer at an early stage,క్యాన్సర్‌ ముప్పు ముందే పసిగడదాం-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

    గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కావచ్చు.. రొమ్ము క్యాన్సర్‌ కావచ్చు.. చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ప్రాణాంతకంగా మారుతుంది. కానీ అంతకన్నా ముందే క్యాన్సర్‌ రావడానికి ముఖ్య కారణాలూ.. ఆ ప్రమాదాన్ని సూచించే పరీక్షల గురించి వివరంగా తెలుసుకోగలిగితే... ముప్పును చాలామటుకు నిరోధించవచ్చు.

స్నేహితులూ లేదా బంధువులూ క్యాన్సర్‌ బారిన పడ్డారనో, దానివల్ల చనిపోయారనో విన్నప్పుడు ఒక క్షణం ఆందోళన చెందుతాం. కొన్నిసార్లు ఆ ప్రమాదం మనకీ ముంచుకొస్తుందా అన్న భయం కలుగుతుంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే ఆ సమస్యను నిరోధించవచ్చు. త్వరగా గుర్తించగలిగితే పూర్తి స్థాయిలో చికిత్స తీసుకునే వీలుంది. గణాంకాల ప్రకారం చూస్తే రొమ్ము, గర్భాశయ ముఖద్వారం, వూపిరితిత్తులూ, పేగుల క్యాన్సర్‌ బారిన పడిన వారూ, వాటితో చనిపోయేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా రొమ్ము క్యాన్సర్‌ బారిన పది లక్షల మంది, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో నాలుగులక్షల డెబ్భైవేల మంది, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌తో లక్షా తొంభై వేల మంది, అండాశయ క్యాన్సర్‌తో లక్షా తొంభై రెండువేల మంది బాధపడుతున్నారు. మహిళలు ప్రధానంగా గర్భాశయ ముఖద్వారం, రొమ్ము, ఎండోమెట్రియల్‌, అండాశయాలు, యోనిలో, బాహ్య జననేంద్రియాల్లోని క్యాన్సర్లతో బాధపడుతున్నారు. వీటిని గుర్తించడంలో ఆలస్యమైతే, శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సి వస్తుంది. రేడియేషన్‌, కీమోథెరపీ అవసరమవుతాయి. మానసికంగా కుంగిపోవడం, ఇతర దుష్ప్రభావాలనూ ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే క్యాన్సర్‌ ప్రమాద స్థాయిని వీలైనంత వరకూ తగ్గించుకునేలా ముందు నుంచీ జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇవే ప్రమాద సూచికలు..
ఒక్కో క్యాన్సర్‌కి కొన్ని ప్రమాద సంకేతాలు ఉంటాయి. వాటిని ముందే గుర్తించగలిగితే మంచిది.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌: చిన్నతనంలో పెళ్లి చేసుకుని, లైంగికచర్య ప్రారంభించడం, లైంగిక పరమైన ఇన్‌ఫెక్షన్లూ కొన్నిసార్లు ఈ సమస్యకు కారణమవుతాయి. ఎక్కువ రోజులు గర్భనిరోధక మాత్రలు వాడే వారిలోనూ ఈ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువని అధ్యయనాలు తేల్చాయి. కలయిక సమయంలో పురుషులు కండోమ్‌లు, స్త్రీలు డయాఫ్రమ్‌లు వాడాలి. విటమిన్‌ 'సి' లోపించకుండా చూసుకోవాలి. ఈ పోషకం ఉన్న జామ, ఉసిరి వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

రొమ్ము క్యాన్సర్‌: అధికబరువూ, పుట్టిన వారికి తల్లిపాలు ఇవ్వలేకపోవడం, పిల్లలు కలగకపోవడం, దీర్ఘకాలికంగా హార్మోన్లు వాడటం. కుటుంబంలో ఈ సమస్య ఉండటం దీనికి ప్రధాన కారణాలు. అందుకే తల్లిపాలు తప్పనిసరిగా పట్టాలి. హార్మోన్ల వినియోగాన్ని తగ్గించుకోవాలి.

ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌: స్థూలకాయం, మధుమేహం, ఈస్ట్రోజెన్‌ హార్మోను శరీరంలోనే ఎక్కువగా ఉండటం లేదా మాత్రల రూపంలో తీసుకోవడం, పీసీఓఎస్‌ (పాలీసిస్టీక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌), వంశపారంపర్యంగా రావడం, పిల్లలు లేకపోవడం వంటివి ఈ సమస్యను తెచ్చిపెడతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం, ఎక్కువకాలం ఈస్ట్రోజెన్‌ వాడకపోవడం, పీసీఓఎస్‌ ఉన్నవాళ్లు ప్రొజెస్టెరాన్‌ని మాత్రలు లేదా మెరీనా లూప్‌లా వాడటం వల్ల ఈ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

అండాశయ క్యాన్సర్‌: అధిక బరువూ, కుటుంబంలో ఈ సమస్య ఉన్నవారికి ఎక్కువగా వస్తుంది. ముందు బరువు తగ్గాలి. అయితే గర్భనిరోధక మాత్రలు వాడేవారికీ, పాలిచ్చే తల్లులకూ, కుటుంబనియంత్రణ కోసం ట్యూబెక్టమీ చేయించుకునేవారికీ ఈ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

రేడియేషన్‌కు దూరం...
యూరోపియన్‌ క్యాన్సర్‌ సొసైటీ క్యాన్సర్‌ నిరోధానికి కొన్ని జాగ్రత్తలు సూచించింది. వాటిల్లో...

* బరువును అదుపులో ఉంచుకోవాలి. దీనికోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజువారీ ఆహారంలో కాయగూరలూ, పండ్లూ ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. రోజులో ఒక కప్పు కొలతతో ఐదుసార్ల చొప్పున పండ్లూ, కాయగూరల్ని తీసుకోవాలి. జంతు సంబంధమైన ఆహారపదార్థాలు, కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి.

* ఉద్యోగినులు క్యాన్సర్‌ కారకాలైన రసాయనాలూ, రేడియేషన్‌, కాలుష్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రారంభంలోనే కనిపెట్టే పరీక్షలు..
క్యాన్సర్‌ ఏదయినా దాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా నయం చేసుకోవచ్చు. అందుకోసం రకరకాల పరీక్షలుంటాయి.

* గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ రావడానికి పదేళ్ల ముందునుంచే ఆ సూచనలు కనిపిస్తాయి. వాటిని పాప్‌స్మియర్‌, హెచ్‌పీవీ పరీక్షలతో గుర్తించవచ్చు. అందుకే దీన్ని అతి ముఖ్యమైన స్క్రీనింగ్‌ పరీక్ష అంటారు. పెళ్లయిన ఏడాది నుంచీ అరవై ఐదేళ్లవరకూ మూడేళ్లకోసారి పాప్‌ స్మియర్‌ని చేయించుకోవాలి. ఇప్పుడు దాంతోపాటూ హెచ్‌పీవీ పరీక్షా అందుబాటులో ఉంది కాబట్టి ఈ రెండూ చేయించుకోవడం మంచిది. ఈ టెస్ట్‌లో ఫలితం నార్మల్‌ అని వస్తే ఐదేళ్ల తరవాత మళ్లీ చేయించుకుంటే సరిపోతుంది.

* రొమ్ము క్యాన్సర్‌ ముప్పును ముందుగానే సూచిస్తుంది మమోగ్రఫీ. ప్రత్యేకమైన ఎక్స్‌రేలూ, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లతో రొమ్ములను పరీక్షిస్తారు. క్యాన్సర్‌ ఉంటే ఆ కణతులు చేతికి తగలడానికి రెండేళ్ల ముందే మామోగ్రఫీలో తేడాలు కనిపిస్తాయి. దీన్ని చేయించుకోవడం వల్ల రొమ్ముక్యాన్సర్‌తో మరణించే స్త్రీల సంఖ్య ఇరవై ఐదు శాతం తగ్గుతుందని అంటున్నాయి అధ్యయనాలు.

* ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌కోసం అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, ఎండోమెట్రియల్‌ బయాప్సీ, హిస్టరోస్కోపీ పరీక్షలు కీలకం. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లో ఎండోమెట్రియం పొర బాగా మందంగా కనిపించినా, బయాప్సీ చేశాక ఎ టిపికల్‌ కాంప్లెక్స్‌ హైపర్‌ప్లేసియా అన్న రిపోర్టు వచ్చినా క్యాన్సర్‌ ప్రమాదం ఉన్నట్లే.

* అండాశయ క్యాన్సర్‌కి ముందుగా గుర్తించే పరీక్షలు లేవు. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేసినప్పుడు అండాశయాల్లో గడ్డలూ, సిస్టులూ కనిపిస్తే.. క్యాన్సర్‌ని అంచనా వేసే ట్యూమర్‌ మార్కర్స్‌ పరీక్షలు సూచిస్తారు. సిఏ125, సిఇఏ, సీఏ 19-9, సీఏ 15-3 లాంటివి అందులో కొన్ని. అండాశయాల్లో కొన్నిరకాల ట్యూమర్లు ఉన్నప్పుడు హెచ్‌సీజీ అల్ఫా సీటో ప్రొటీన్‌ వంటి హార్మోన్ల పరీక్షలు చేస్తారు.

ఈ జాగ్రత్తలూ అవసరమే..
క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందనుకున్నప్పుడు మరికొన్ని జాగ్రత్తలూ తప్పవు.

* రొమ్ముక్యాన్సర్‌, కొన్నిరకాల అండాశయాల క్యాన్సర్లు వంశపారంపర్యంగా రావచ్చు. కుటుంబ చరిత్రలో అవి ఉన్నప్పుడు స్క్రీనింగ్‌ పరీక్షలు త్వరగా మొదలుపెట్టి, తరచూ చేయించుకోవాలి. రొమ్ముక్యాన్సర్‌ కోసం రక్తపరీక్ష (బీఆర్‌సీఏ 1 అండ్‌ 2 యాంటిజెన్ల పరీక్ష) తప్పనిసరి. తద్వారా క్యాన్సర్‌ కారకమైన జన్యువును ముందే గుర్తించవచ్చు.

* పాప్‌స్మియర్‌ తేడాలూ, హెచ్‌పీవీ పరీక్షలో పాజిటివ్‌ వచ్చినప్పుడు సర్వైకల్‌ క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ముప్ఫై ఐదేళ్ల నుంచే తరచుగా పరీక్షలు చేయించుకోవాలి.

* క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉందని తేలినప్పుడు ఆ భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా ముందుగానే తొలగించడం కూడా ఒక మార్గం. (ఉదాహరణకు వక్షోజాలూ, గర్భాశయం, అండాశయాల తొలగింపు).

* అకస్మాత్తుగా శరీరతత్వాల్లో తేడాలు, దుర్వాసనతో కూడిన వైట్‌ డిశ్ఛార్జి, నెలసరితో సంబంధం లేకుండా, కలయిక తరవాత రక్తస్రావం కావడం, చనుమొనల నుంచి రక్తంతో కూడిన డిశ్ఛార్జి వంటి వాటిని తేలిగ్గా తీసుకోకూడదు. అలాగే గొంతు బొంగురుపోవడం, మలబద్ధకం, తరచూ విరేచనాలు కావడం, మలంలో రక్తం వచ్చినా.. వైద్యుల్ని సంప్రదించాలి. అయితే ఇన్‌ఫెక్షన్ల ద్వారా వచ్చే కాలేయ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు టీకాలు ఉంటాయి. హెపటైటిస్‌ బి అందులో ఒకటి.

* గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని నివారిస్తుంది హెచ్‌పీవీ టీకా. ఇది మన దేశంలో అందుబాటులో ఉంది. ఈ టీకా క్యాన్సర్‌కి దారితీసే హెచ్‌పీవీ 16, 18 వైరస్‌లను నిరోధిస్తుంది. హెచ్‌పీవీ వైరస్‌ల వల్ల మలద్వారం, పేగులూ, గొంతు క్యాన్సర్లు వచ్చే ఆస్కారం కూడా ఎక్కువ. వాటినీ నివారించాలంటే టీకా తప్పనిసరి. దీన్ని పది నుంచి పన్నెండు ఏళ్లలోపు అమ్మాయిలకు మూడు విడతల్లో ఇస్తారు. చిన్నతనంలో తీసుకోని వారు నలభై ఐదేళ్ల వరకూ కూడా వేయించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. చర్మక్యాన్సర్‌ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఎండ ముఖ్యంగా అతినీలలోహిత కిరణాల ప్రభావం పడకుండా చూసుకోవాలి. పుట్టుమచ్చలు పెరగడం, కొత్త మచ్చలు కనిపించడం.. రంగు మారడం లాంటి సంకేతాలు కనిపిస్తే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. అది చర్మక్యాన్సర్‌ కావచ్చు.

Courtesy with : Dr.Savithadevi @ eenadu vasundhara.(02-06-2014).
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Hay fever- హే ఫీవర్‌

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Hay fever- హే ఫీవర్‌-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రోగ నిరోధక శక్తి అంతంతమాత్రంగా ఉన్న బాధితుడు పోలెన్‌, లేదా దుమ్ము వంటి అలెర్జెన్‌ను లోనికి పీల్చుకున్నప్పుడు అలెర్జిక్‌ రినైటిస్‌, లేదా హే ఫీవర్‌ వస్తుంది. ఇది ఒంట్లో యాంటీబాడీల ఉత్పత్తిని పెంచేస్తుంది. ఈ యాంటీబాడీలు చాలావరకు హిస్టమైన్లుండే మాస్ట్‌ కణాలతో బంధం ఏర్పరచుకుంటాయి. పొలెన్‌, దుమ్ము, హిస్టమైన్‌ (ఇతర రసాయనాల) ద్వారా ప్రభావిమైనప్పుడు ఈ మాస్ట్‌ కణాలు విడుదలవుతాయి. ఇది దురద, వాపు, శ్లేష్మం ఉత్పత్తి వంటివాటికి దారితీస్తుంది. ఈ లక్షణాల తీవ్రత వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంటుంది. బాగా సున్నితంగా ఉండే వ్యక్తుల్లో హైవ్స్‌, దురద వంటివి కన్పించవచ్చు. కలుషిత గాలిలో ఉండే క్లోరిన్‌, డిటర్జెంట్ల వంటి రసాయనాలు సాధారణ పరిస్థితుల్లోనైతే ఏమీ చేయవు. కానీ ఇలాంటప్పుడు మాత్రం పరిస్థితిని అవే చాలా తీవ్రతరం చేస్తాయి.

లక్షణాలు :

కంటి పై పొర ఉబ్బడం, చర్మం కందడం, ఎర్రబారడం, కనురెప్పలు ఉబ్బడం, దిగువ కనురెప్పలోని రకతనాళాలు నిశ్చలమవడం, ముక్కు దిగువ భాగంలో ముడతలు, ముక్కు టర్బినేట్స్‌లో వాపు, చెవుల్లో నిశ్చలత వంటివి అలెర్జిక్‌ రినైటిస్‌ ఉండే వ్యక్తుల్లో సాధారణంగా కన్పించే శారీరక లక్షణాల్లో కొన్ని.హాచ్‌! తుమ్ములు, కళ్ళలోను౦డి నీరుకారడ౦, కళ్ళు దురదపెట్టడ౦, ముక్కు చీదర, ముక్కు కారడ౦ వ౦టివి కోట్లాదిమ౦దికి వస౦త రుతువు ఆర౦భాన్ని సూచిస్తాయి. వారికి ఆ ఎలర్జీ సాధారణ౦గా పుప్పొడి ని౦డిన వాతావరణ౦ కారణ౦గా కలుగుతు౦ది. పారిశ్రామిక ప్రప౦చ౦లోని ప్రతి ఆరుగురిలో ఒకరు ఆయా రుతువుల్లో కలిగే పుప్పొడి ఎలర్జీలతో (ఈ ఎలర్జీలు హే ఫీవర్‌ అని కూడా పిలువబడతాయి) బాధపడుతున్నారని బిఎమ్‌జి (పూర్వ౦ బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌) అ౦చనా వేసి౦ది.
  • Treatment : 
ఇక్కడ ముఖ్యముగా ముందుగా బాధనివారణ కోసము మందులు వాడాలి .
జ్వరానికి : పరాసెటమాల్ 500 మి.గ్రా . రోజుకు 2 లేదా 3 సార్లు 4-5 రోజులు .
జలుబుకు : పారాసెతమాల్ తో కలిసిఉన్న సెట్రిజన్‌ + ప్రినెలెఫ్రిన్‌ హైడ్రోక్లోరైడ్ (ముక్కు దిబ్బడ పోవడానికి) మాత్రలు వాడాలి.
ఎలెర్జీకి : లీవో సిట్రజన్‌ 5 మి,గ్రా. రోజుకు 2 సార్లు 3-4 రోజూలు వాడాలి ,

పోలెన్‌ కళ్ళకు చేరకుండా సన్‌గ్లాసెస్ వాడాలి . పోలెన్‌ కు జుట్టు , బట్టలు మ్యాగ్నెట్ లాంటివి. . . బయటనుండి ఇంటికి వచ్చేటప్పుడు వీటిని బాగా విదలించుకొని రావాలి. దుస్తులు మార్చుకోవడము , స్నానము చేయడము వలన హే ఫీవర్ లక్షణాల తీవ్రత తగ్గిపోతుంది. ఒత్తిడికి , హేఫీవర్ కు లింక్ ఉంది. ఒత్తిడి స్థాయిలు పెరిగే కొద్దీ లక్షణాలు పెరుగుతాయి. యాంటీ హిస్టమిన్‌  నాజల్ డ్రాప్స్ , స్ప్రే లు , అవసరమైతే యాంటి హిస్టమిన్‌ ఐ డ్రాప్స్ వాడాలి. 
  • ======================
isit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, August 27, 2014

Brest cancer myths and truths-రొమ్ము క్యాన్సర్‌...కొన్ని వాస్తవాలు-అపోహలు

  •  


  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --రొమ్ము క్యాన్సర్‌...కొన్ని వాస్తవాలు-అపోహలు  -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

Breast Cancer - Myth and Reality: రొమ్ము కాన్సర్ ఎందుకు వస్తుంది? వస్తే ఏం జరుగుతుంది? దాన్ని తగ్గించుకోవడం ఎలా? ఇలాంటి పూర్తి వివరాల్ని హైదరాబాద్... ఒమేగా హాస్పిటల్స్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ చెబుతున్నారు. డాక్టర్ దత్తాత్రేయ ప్రకారం... రొమ్ములోని కణాలు కంట్రోల్ లేకుండా పెరిగి కణితిని ఏర్పరచుకున్నప్పుడు రొమ్ము కాన్సర్ అభివృద్ధి చెందుతుంది. ప్రాణాంతక కణితులు చుట్టుపక్కల కణజాలంలోకి లేదా శరీరంలోని సుదూర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతాయి. అయినప్పటికీ, ప్రమాద కారకాలను గుర్తించడం ప్రారంభ రోగ నిర్ధారణ, చికిత్సలో దీనిని నివారించడంలో సహాయపడుతుంది. రొమ్ము కాన్సర్ వచ్చే ప్రమాదానికి సంబంధించిన అనేక అంశాలలో వయస్సు ఒకటి. ఒక వ్యక్తి వయసు పెరిగేకొద్దీ రొమ్ము కాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కణాల యొక్క పునరావృత సామర్థ్యంతో పాటు కణాలలో అసాధారణ మార్పులు సంభవించే అవకాశం ఉంది.

50 ఏళ్లు దాటిన ఆడవారిలో రొమ్ము కాన్సర్ సర్వసాధారణం. నేషనల్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ (NCI) ప్రకారం, డాక్టర్లు 55-64 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో రొమ్ము కాన్సర్‌ను ఎక్కువగా నిర్ధారిస్తారు. 40 ఏళ్లలోపు మహిళల్లో 4% ఇన్వాసివ్ రొమ్ము క్యాన్సర్లను నిర్ధారిస్తారు. అయితే వారి 50 ఏళ్ళలో 23% మంది మహిళల్లో రోగ నిర్ధారణ జరిగింది. 60 నుండి 69 సంవత్సరాల వయస్సు గల మహిళలలో 27%. చిన్న వయస్సులో ఉన్న మహిళల్లో కొద్ది శాతం మాత్రమే బ్రెస్ట్ కాన్సర్ తో బాధపడుతున్నప్పటికీ, అన్ని వయసుల మహిళలు, ముఖ్యంగా రొమ్ము కాన్సర్ యొక్క బలమైన కుటుంబ చరిత్ర కలిగిన వారి రొమ్ములపై శ్రద్ధ వహించడం, స్వీయ పరీక్షలు చేయడం, ఏదైనా సమస్య ఉంటే చెప్పడం తప్పనిసరి.

50 ఏళ్లు దాటిన ఆడవారిలో రొమ్ము కాన్సర్ సర్వసాధారణం. నేషనల్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ (NCI) ప్రకారం, డాక్టర్లు 55-64 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో రొమ్ము కాన్సర్‌ను ఎక్కువగా నిర్ధారిస్తారు. 40 ఏళ్లలోపు మహిళల్లో 4% ఇన్వాసివ్ రొమ్ము క్యాన్సర్లను నిర్ధారిస్తారు. అయితే వారి 50 ఏళ్ళలో 23% మంది మహిళల్లో రోగ నిర్ధారణ జరిగింది. 60 నుండి 69 సంవత్సరాల వయస్సు గల మహిళలలో 27%. చిన్న వయస్సులో ఉన్న మహిళల్లో కొద్ది శాతం మాత్రమే బ్రెస్ట్ కాన్సర్ తో బాధపడుతున్నప్పటికీ, అన్ని వయసుల మహిళలు, ముఖ్యంగా రొమ్ము కాన్సర్ యొక్క బలమైన కుటుంబ చరిత్ర కలిగిన వారి రొమ్ములపై శ్రద్ధ వహించడం, స్వీయ పరీక్షలు చేయడం, ఏదైనా సమస్య ఉంటే చెప్పడం తప్పనిసరి.

భారతదేశంలో బ్రెస్ట్ కాన్సర్ ఎందుకు పెరుగుతోంది? ఎలా తగ్గించాలి? : భారతీయ మెట్రోపాలిటన్ నగరాల్లో మొదటి స్థానంలో ఉన్న మహిళల్లో రొమ్ము కాన్సర్ ప్రధాన కారణం. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రెండో స్థానంలో ఉంది. భారతదేశంలోని అన్ని నగరాల్లో రొమ్ము కాన్సర్ 25% నుంచి 32% వరకు ఉంటుంది. ప్రతి 4 నిమిషాలకు ఒక మహిళ రొమ్ము కాన్సర్తో బాధపడుతుండగా, భారతదేశంలో ప్రతి 13 నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్‌తో మరణిస్తోంది.

భారతదేశంలో బ్రెస్ట్ కాన్సర్ ఎందుకు పెరుగుతోంది? ఎలా తగ్గించాలి? : భారతీయ మెట్రోపాలిటన్ నగరాల్లో మొదటి స్థానంలో ఉన్న మహిళల్లో రొమ్ము కాన్సర్ ప్రధాన కారణం. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రెండో స్థానంలో ఉంది. భారతదేశంలోని అన్ని నగరాల్లో రొమ్ము కాన్సర్ 25% నుంచి 32% వరకు ఉంటుంది. ప్రతి 4 నిమిషాలకు ఒక మహిళ రొమ్ము కాన్సర్తో బాధపడుతుండగా, భారతదేశంలో ప్రతి 13 నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్‌తో మరణిస్తోంది.

భారతదేశం అంతటా రొమ్ము కాన్సర్ బాగా పెరగడం ప్రధానంగా వేగంగా పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, జనాభా పెరుగుదల, ముసలితనం ప్రభావితం కావడం వల్ల పెరుగుతున్న ధోరణులను చూపిస్తోంది. వైవాహిక స్థితి, స్థానం (పట్టణ / గ్రామీణ), BMI, తల్లి పాలివ్వడం, తక్కువ సమానత్వం, అధిక బరువు, మద్యపానం, ధూమపానం, వ్యాయామం లేకపోవడం, సరికాని ఆహారం, అధిక కాలుష్యం వంటి పర్యావరణ కారకాలు భారతదేశంలో ప్రధాన ప్రమాద కారకాలు. నిరక్షరాస్యత, అవగాహన లేకపోవడం, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆర్థిక పరిమితులు కారణంగా వ్యాధిని త్వరగా గుర్తించే పరిస్థితి లేదు. దీనివల్ల మరణాల రేటు పెరుగుతోంది. వ్యవస్థీకృత రొమ్ము కాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేకపోవడం, డయాగ్నోస్టిక్ పరికరాల కొరత కూడా రొమ్ము కాన్సర్ పెరగడానికి కారణమవుతున్నాయి. అందువల్ల కాన్సర్ ఇప్పటికే ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు ఇక్కడ ఎక్కువ మంది రోగులు అధునాతన చికిత్స పొందుతున్నారు. ముందస్తుగా గుర్తించడం ఒక మంచిపరిమామం. ఎందుకంటే రొమ్ము కాన్సర్‌కు చికిత్స చేయవచ్చు. రోగి కోలుకున్న తర్వాత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంది.

భారతదేశం అంతటా రొమ్ము కాన్సర్ బాగా పెరగడం ప్రధానంగా వేగంగా పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, జనాభా పెరుగుదల, ముసలితనం ప్రభావితం కావడం వల్ల పెరుగుతున్న ధోరణులను చూపిస్తోంది. వైవాహిక స్థితి, స్థానం (పట్టణ / గ్రామీణ), BMI, తల్లి పాలివ్వడం, తక్కువ సమానత్వం, అధిక బరువు, మద్యపానం, ధూమపానం, వ్యాయామం లేకపోవడం, సరికాని ఆహారం, అధిక కాలుష్యం వంటి పర్యావరణ కారకాలు భారతదేశంలో ప్రధాన ప్రమాద కారకాలు. నిరక్షరాస్యత, అవగాహన లేకపోవడం, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆర్థిక పరిమితులు కారణంగా వ్యాధిని త్వరగా గుర్తించే పరిస్థితి లేదు. దీనివల్ల మరణాల రేటు పెరుగుతోంది. వ్యవస్థీకృత రొమ్ము కాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేకపోవడం, డయాగ్నోస్టిక్ పరికరాల కొరత కూడా రొమ్ము కాన్సర్ పెరగడానికి కారణమవుతున్నాయి. అందువల్ల కాన్సర్ ఇప్పటికే ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు ఇక్కడ ఎక్కువ మంది రోగులు అధునాతన చికిత్స పొందుతున్నారు. ముందస్తుగా గుర్తించడం ఒక మంచిపరిమామం. ఎందుకంటే రొమ్ము కాన్సర్‌కు చికిత్స చేయవచ్చు. రోగి కోలుకున్న తర్వాత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంది.

రొమ్ము కాన్సర్ ను ముందుగా గుర్తించడానికి కొన్ని దశలు: 1. రొమ్ము కాన్సర్ నిర్ధారణ, లక్షణాలు, రొమ్ము కాన్సర్ పునరావృత పరీక్షలు, సరైన చికిత్స గురించి తెలుసుకోండి. 2. స్వీయ పరీక్షల గురించి తెలుసుకోండి. మీ రొమ్ములను మీ స్వంతంగా క్రమం తప్పకుండా పరిశీలించండి 3. మీ రొమ్ములలో ఏదైనా అసాధారణ అంశాలు ఉన్నట్లు అనిపిస్తే ఆంకాలజిస్టును కలవండి. 4. రొమ్ము క్యాన్సర్ ఆల్రెడీ ముందు తరాల వారికి ఉంటే... అలాంటి వారసత్వ మహిళలు, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. 5. వ్యాయామం, మద్యపాన పరిమితి వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి.

రొమ్ము కాన్సర్ ను ముందుగా గుర్తించడానికి కొన్ని దశలు: 1. రొమ్ము కాన్సర్ నిర్ధారణ, లక్షణాలు, రొమ్ము కాన్సర్ పునరావృత పరీక్షలు, సరైన చికిత్స గురించి తెలుసుకోండి. 2. స్వీయ పరీక్షల గురించి తెలుసుకోండి. మీ రొమ్ములను మీ స్వంతంగా క్రమం తప్పకుండా పరిశీలించండి 3. మీ రొమ్ములలో ఏదైనా అసాధారణ అంశాలు ఉన్నట్లు అనిపిస్తే ఆంకాలజిస్టును కలవండి. 4. రొమ్ము క్యాన్సర్ ఆల్రెడీ ముందు తరాల వారికి ఉంటే... అలాంటి వారసత్వ మహిళలు, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. 5. వ్యాయామం, మద్యపాన పరిమితి వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి.

రొమ్ము కాన్సర్‌కు సంబంధించిన మల్టీడిసిప్లినరీ విధానం, అవగాహన కార్యక్రమాలు, నివారణ కొలత, ముందస్తుగా గుర్తించడానికి స్క్రీనింగ్ కార్యక్రమాలు, చికిత్స సౌకర్యాల లభ్యత వంటివి... రొమ్ము కాన్సర్‌కు సంబంధించిన పెరుగుదల, మరణం రెండింటినీ తగ్గించడానికి చాలా ముఖ్యమైనవి. (Article by Dr. Palanki Satya Dattatreya, Medical oncologist, Omega Hospitals, Hyderabad)


  • ======================= 
Courtesy with eenadu vasundhara @Eenadu news paper
  • =======================
 Visit my website - > Dr.Seshagirirao.com/