Thursday, December 30, 2010

విటమిన్‌ డి ,Vitamin D



ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే భారతదేశంలో.. ప్రజలకు అసలు 'విటమిన్‌-డి' లోపమనేదే ఉండదని భావించేవారు. కానీ నేడది వట్టి అపోహేనని తాజా అధ్యయనాలన్నీ రుజువుచేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 90% మందికి విటమిన్‌-డి లోపం ఉంది. శారీరక శ్రమ లోపించటం.. వూబకాయం.. ధూమపానం.. వీటిన్నింటి మూలంగా నానాటికీ మన శరీరంలో విటమిన్‌-డి అవసరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఎండ ముఖం చూడకుండా.. ఎక్కడా ఒంటికి సూర్యరశ్మి సోకకుండా.. నెలలు, సంవత్సరాలూ నీడ పట్టునే గడపటం పెరిగిపోతోంది. ఫలితం.. ఎంతోమందిలో ఎంతోకొంత విటమిన్‌-డి లోపం కనబడుతోంది. మన శరీరంలో, మన ఆరోగ్య పరిరక్షణలో ఈ విటమిన్‌-డికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా.. ఇది అస్సలు మంచి పరిణామం కాదు.

విశేషాల పుట్ట
* సాధారణంగా విటమిన్లను మన శరీరం తయారు చేసుకోలేదు. వాటిని ఆహారం రూపంలో మనం బయటి నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక్క విటమిన్‌-డి మాత్రం మన శరీరంలోనే తయారవుతుంది. సూర్యరశ్మి సహాయంతో దీన్ని చాలావరకూ మన శరీరమే తయారు చేసుకుంటుంది, చాలా కొద్దిభాగం మాత్రమే ఆహారం ద్వారా లభిస్తుంది.

* వాస్తవానికి విటమిన్‌-డిలో డి1, డి2.. ఇలా 5 రకాలున్నాయిగానీ మనకు ఉపయోగపడేది 'డి3' అనేది మాత్రమే. దీన్నే 'కోలీకాల్సిఫెరాల్‌' అంటారు. ఇది మన శరీరంలో ఏదో ఒక్కచోటే తయారయ్యేది కాదు. రకరకాల దశల్లో, వివిధ రూపాల్లో పరిణామం చెందుతుంది.


విటమిన్‌ డి పనేమిటి? ప్రయోజనమేమిటి?
* అంతా విటమిన్‌-డి అన్నది ప్రధానంగా ఎముకల ఆరోగ్యానికే కీలకమైనదని భావిస్తుంటారు. అది వాస్తవమేగానీ.. దీనితో అనేకానేక ఇతరత్రా ప్రయోజనాలూ చాలా ఉన్నాయని పరిశోధనా రంగం గుర్తించింది.

* ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయటంలో విటమిన్‌-డి కీలక పాత్ర పోషిస్తుంది. తెల్లరక్తకణాలు చురుకుగా ఉండి, రోగకారక క్రిములతో పోరాడాలంటే మన శరీరంలో విటమిన్‌-డి తగినంత ఉండటం చాలా అవసరం.

* విటమిన్‌-డి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్లోమం లోని బీటా కణాల మీద పని చేసి ఇన్సులిన్‌ ఉత్పత్తి సజావుగా సాగుతుండేలా చేస్తుంది. ఇన్సులిన్‌ను తయారు చేసే కణాల విభజననూ నియంత్రిస్తుంటుంది. శరీర కణాలు ఇన్సులిన్‌ను గ్రహించేలా చూడటంలో కూడా దీనిది కీలక పాత్ర. చిన్నపిల్లల్లో టైప్‌-1 మధుమేహం రావటానికి విటమిన్‌-డి లోపమూ ఒక ప్రధాన కారణమని గుర్తించారు. దీనిపై ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి.
* విటమిన్‌-డికి ఉన్న మరో కీలకమైన ప్రయోజనం- ఇది శరీరంలో కణ విభజనను నియంత్రిస్తుంటుంది. ఇది లోపించి కణ విభజన శ్రుతి తప్పితే.. పరిస్థితి క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ముఖ్యంగా విటమిన్‌-డి లోపం వల్ల పెద్దపేగు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, ప్రోస్టేటు గ్రంథి క్యాన్సర్‌, క్లోమం క్యాన్సర్ల ముప్పు పెరుగుతోందని అధ్యయనాల్లో కూడా నిరూపణ అయ్యింది. కాబట్టి శరీరంలో విటమిన్‌-డి స్థాయులు సజావుగా ఉండేలా చూసుకోవటమన్నది క్యాన్సర్ల నివారణలో కూడా ముఖ్యమైన అంశం.

* ఎముకలకు విటమిన్‌-డితో ఏమిటి లాభం: ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం చాలా అవసరం. మనం తీసుకునే ఆహారంలోని క్యాల్షియం పేగుల ద్వారా రక్తంలో కలిసేలా చూసేది ఈ విటమిన్‌-డినే. అలాగే ఇది రక్తంలోని క్యాల్షియంను ఎముకల్లోకి పంపిస్తుంది, ఎముకలు క్షయం కాకుండా, అవి క్షీణించకుండా నిలువరిస్తుంటుంది. ఈ మూడూ ముఖ్యమైన ప్రయోజనాలు.

మరికాస్త ఎండ తగలనివ్వండి!
రోజులో ఎంత సమయం ఎండలో నిలబడితే మన శరీరానికి సరిపడినంత విటమిన్‌-డి తయారవుతుందన్నది కీలకమైన ప్రశ్నేగానీ దీనికి స్పష్టమైన సమాధానం మాత్రం లేదు. చర్మం కింద కొలెస్ట్రాల్‌ నుంచి ఈ 'కోలీ కాల్సిఫెరాల్‌' తయారవ్వటానికి తెల్లటి చర్మం గల పాశ్చాత్య దేశీయులు సుమారు 20-30 నిమిషాలు సూర్యరశ్మి తగిలేలా ఉండాలని గుర్తించారు. అదే మనం, నల్లజాతీయులు దానికి ఆరు రెట్లు ఎక్కువ సమయం సూర్యరశ్మిలో నిలబడితేనేగానీ ఆ మాత్రం విటమిన్‌-డి తయారవ్వదని తేలింది. ఇది పూర్తిగా సాధ్యమయ్యే విషయం కాదు. కానీ రోజులో కొన్ని గంటలపాటైనా సూర్యరశ్మి తగిలేలా ఆరుబయట గడపటం అన్ని విధాలా శ్రేయస్కరం.

* మన దేశంలో యూవీ కాంతి ఎక్కువే. అలాగే సముద్రతీర ప్రాంతంలోనూ, ఎత్తయిన కొండ ప్రాంతాల్లోనూ యూవీ కిరణాలు మరింత తీక్ష్ణంగానూ ఉంటాయి. అయినా కూడా మన భారతదేశంలో.. మిగతా అన్ని ప్రాంతాలతో పాటు కొండ ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో కూడా విటమిన్‌-డి లోపం ఎక్కువగా ఉందని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి కేవలం సూర్యరశ్మి ఎక్కువగా తగలకపోవటం ఒక్కటే విటమిన్‌-డి లోపానికి కారణమని భావించటానికి లేదు. విటమిన్‌-డి లోపం తలెత్తితే కచ్చితంగా చికిత్స తీసుకోవటం అవసరం.

ఆహారం
విఖ్యాత 'ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసిన్‌(అమెరికా)' తాజాగా నవంబరు 30న దీనికి సంబంధించిన కీలక నివేదిక వెలువరించింది. దీని ప్రకారం మనకు రోజుకు విటమిన్‌-డి 700 యూనిట్లు అవసరమవుతుంది. దాన్ని శరీరానికి సమకూర్చాలంటే ఆహారం ద్వారా కనీసం 1000 యూనిట్లు అయినా తీసుకోవాలి. ఇది కేవలం కొన్ని రకాల చమురు జాతి చేపల ద్వారానే లభిస్తుందిగానీ ఇవి మన దేశంలో అంతగా వాడుకలో లేవు. శాకాహారం ద్వారా ఇది మరింత అసాధ్యం. గుడ్డు నుంచీ చాలా తక్కువే లభిస్తుంది. షార్క్‌ లివర్‌, కాడ్‌ లివర్‌ ఆయిల్‌ నూనెల ద్వారా ఇది లభ్యమవుతుంది.


* పుట్టగొడుగుల్లో ఉంటుందిగానీ ఎండలో పెరిగిన పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఉంటుంది. అదే నీడలో పెరిగిన పుట్టగొడుగుల్లో పెద్దగా ఉండదని పరిశోధకులు గుర్తించారు.

ఎలా తయారవుతుంది?
* మన చర్మం కింది పొరల్లోని కొలెస్ట్రాల్‌.. సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాలను(యూవీ) గ్రహించి.. వాటి సహాయంతో 'కోలీ కాల్సిఫెరాల్‌(డి3)'ను తయారు చేస్తుంది. ఇది విటమిన్‌-డికి సంబంధించిన ప్రాథమిక రూపం. ఇది గ్లోబ్యులిన్‌, 'విటమిన్‌-డి బైండింగ్‌ ప్రోటీన్‌' అనే ప్రోటీన్ల సాయంతో రక్తంలో కలిసి.. లివర్‌ను చేరుతుంది. ఇందుకు పారాథైరాయిడ్‌ గ్రంథి స్రవించే 'పారాథార్మోన్‌', థైరాయిడ్‌ గ్రంథిలోని సి-కణాలు స్రవించే 'కాల్సిటోనిన్‌'.. కీలకమైనవి.

* లివర్‌ను చేరిన తర్వాత.. 'కోలీ కాల్సిఫరాల్‌' కాస్తా అక్కడ '25 హైడ్రాక్సి కాలీ కాల్సిఫరాల్‌'గా పరిణామం చెందుతుంది. ఇదే మన శరీరంలో కీలకమైన విటమిన్‌-డి రూపం. ఇలా తయారైనది 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది, రక్తంలో తిరుగాడుతుంటుంది.

* రక్తంలో తిరుగుతుండే '25 హైడ్రాక్సి కోలీకాల్సిఫెరాల్‌' ఆ తర్వాత.. మూత్రపిండాల్లోగానీ, తెల్లరక్తకణాల్లోగానీ చురుకైన విటమిన్‌-డి రూపంలోకి మారుతుంది. దాన్నే '1, 25 డైహైడ్రాక్సీ కోలీకాల్సిఫెరాల్‌'. మన శరీరంలో వినియోగమయ్యే కీలకమైన విటమిన్‌-డి రూపం ఇది.

* ఇన్ని దశల్లో పరిణామం చెందుతుంది కాబట్టే.. సూర్యరశ్మి సోకకపోవటం, ఆహారంలో విటమిన్‌-డి లోపించటం, పారాథైరాయిడ్‌ పనితీరు దెబ్బతినటం, లివర్‌ వ్యాధులు, కిడ్నీ జబ్బులు.. ఇలా ఎన్నో సందర్భాల్లో విటమిన్‌-డి లోపం తలెత్తుతుంది.
లోపిస్తే నొప్పులే!
* ఓ మోస్తరుగా లోపిస్తే ఆకలి మందగించటం, బరువు తగ్గటం, నిద్రలేమి, నిస్సత్తువ, నిస్త్రాణ, కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పుల వంటి సమస్యలు వేధిస్తుంటాయి. విటమిన్‌-డి మరింతగా లోపిస్తే.. రకరకాల ఎముకల సమస్యలు వెంటాడతాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి రకరకాల వ్యాధులూ చుట్టుముడతాయి.

ఎముక వ్యాధులు
* రికెట్స్‌: ఇది చిన్నపిల్లల్లో ఎక్కువ. కాళ్లు వంకర తిరిగిపోయి.. దొడ్డికాళ్లలా అవుతాయి. రొమ్ము ఎముకలు ముందుకు తోసుకొచ్చి పిట్టగూడులా అయిపోతారు. పిల్లల్లో ఎదుగుదల లోపించి నడవటం కూడా కష్టమైపోతుంది. ఎన్నేళ్లొచ్చినా పాకుతుంటారు. వీరికి విటమిన్‌-డి ఇస్తేత్వరగా లేచి తిరుగుతారు.
* ఆస్టియో మలేషియా: విటమిన్‌-డి లోపం కారణంగా యువతీ యువకుల్లో ఎక్కువగా కనబడే సమస్య ఇది. ఎముక పుష్టి తగ్గి నడక కష్టం కావటం, కూర్చుని లేవటం, మెట్లు ఎక్కటం కష్టంగా తయారవ్వటం వంటి సమస్యలుంటాయి. మరీ ముదిరితే వెన్నుపాము ఎముకలు విరగటం, తుంటి ఎముకలు విరగటం, వెన్నుపూసల మధ్య ఉండే డిస్కులు బెసగటం, దానివల్ల నాడులు నొక్కుకుని నొప్పుల వంటివి చాలా ఎక్కువ.
* ఆస్టియో పొరోసిస్‌: విటమిన్‌-డి లోపం వల్ల పెద్ద వయసు వారిలోఎముక పుష్టి తగ్గి అవి బోలుబోలుగా, పెళుసుగా మారిపోయే సమస్య చాలా ఎక్కువ. ఫలితంగా వీరిలో ఎముకల నొప్పులు, ఎముక విరగటమన్నదీ చాలా ఎక్కువ. నెలసరి నిలిచిపోయిన స్త్రీలలో హార్మోన్ల సమస్యలకు తోడు ఈ విటమిన్‌-డి లోపం కూడా తోడైతే ఆస్టియో పొరోసిస్‌ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆస్టియో పొరోసిస్‌ నివారణలో, చికిత్సలో విటమిన్‌-డి కూడా తీసుకోవటం ముఖ్యమైన అంశం.
* ఆస్టియో పీనియా: కండరాలు, ఎముకలు విపరీతమైన నొప్పులతో మంచం మీది నుంచి లేవటం, కదలటం కూడా కష్టంగా తయారవుతుంది.సాధారణంగా వృద్ధుల్లో ఎక్కువ.
* నాడుల బలహీనం: విటమిన్‌-డి నాడుల పనితీరుకూ కీలకం. కాబట్టి ఇది లోపిస్తే బ్యాలెన్స్‌ కోల్పోతుండటం, పాదాల్లో స్పందనలు తగ్గటం, కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు ఎక్కువగా వేధిస్తుంటాయి.

లోపాన్ని గుర్తించే పరీక్షలు
* చర్మం కింద తయారయ్యే 'కోలీ కాల్సిఫరాల్‌' గానీ, కిడ్నీల నుంచి వచ్చే '1, 25 డైహైడ్రాక్సీ కోలీ కాల్సిఫరాల్‌' గానీ శరీరంలో ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. లివర్‌లో తయారయ్యే '25 హైడ్రాక్సి కాలీ కాల్సిఫెరాల్‌' ఒక్కటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కాబట్టి శరీరంలో విటమిన్‌-డి తగినంత ఉందా? లేక లోపించిందా? అన్నది తెలుసుకునేందుకు ఈ '25 హైడాక్సి కోలీకాల్సిఫెరాల్‌' పరీక్ష చేయటమే ఒక్కటే పూర్తి కచ్చితమైన పద్ధతి. విటమిన్‌-డి లోపం ఉందా? లేదా? అన్నది దీని ఆధారంగానే కచ్చితంగా నిర్ధారిస్తారు.

రక్తంలో విటమిన్‌-డి స్థాయి తక్కువగా ఉంటే ఎముకల క్షయం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల 'ఆల్కలీన్‌ ఫాస్ఫటేజ్‌' ఎక్కువగా తయారవుతుంది. కాబట్టి రక్తంలో 'ఆల్కలీన్‌ ఫాస్ఫటేజ్‌' ఎక్కువగా ఉన్నా కూడా వారికి విటమిన్‌-డి లోపం ఎక్కువగా ఉన్నట్లే. అందుకని 'ఆల్కలీన్‌ ఫాస్ఫటేజ్‌' పరీక్ష చేసినా కూడా కొంత వరకూ విటమిన్‌-డి లోపం ఉందా? లేదా? అన్నది తెలుస్తుంది. అలాగే మనం తిన్న ఆహారం నుంచి క్యాల్షియాన్ని గ్రహించేది విటమిన్‌-డినే కాబట్టి ఒంట్లో క్యాల్షియం తక్కువున్నా కూడా విటమిన్‌-డి లోపం ఉందని భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఒంట్లో విటమిన్‌-డి లోపం ఉందా? లేదా? అన్నది తెలుసుకునేందుకు ఉపయోగపడే కీలకమైన రక్త పరీక్షలు ఏమంటే..

* 25 హైడ్రాక్సి విటమిన్‌ డి3 * పారాథార్మోన్‌ * ఆల్కలీన్‌ ఫాస్ఫటేజ్‌ * రక్తంలో క్యాల్షియం స్థాయి
అవసరాన్ని బట్టి వైద్యులు వీటిలో కొన్ని చేస్తారు. కాస్త చౌకగా పూర్తయ్యే ఆల్కలీన్‌ ఫాస్ఫటేజ్‌, పారాథార్మోన్‌ పరీక్షల మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. మొత్తానికి వీటి ఆధారంగా విటమిన్‌-డి లోపం ఉందా? లేదా? అన్నది ఒక అంచనాకు రావచ్చు.

చికిత్స ఏమిటి?
విటమిన్‌-డి లోపం తలెత్తితే దాన్ని సరిచేసుకునేందుకు పూర్తిగా ఆహారం, సూర్యరశ్మి మీదే ఆధారపడటం వల్ల ఉపయోగం ఉండదని అధ్యయనాల్లో స్పష్టమైంది. దీనికి కచ్చితంగా చికిత్స తీసుకోవాల్సిందే.
* విటమిన్‌-డి మాత్రల రూపంలో దొరుకుతుంది. 1000 నుంచి 2000 యూనిట్ల మాత్రలు లభ్యమవుతున్నాయి. అలాగే '1, 25 డై హైడ్రాక్సి కోలీ కాల్సిఫెరాల్‌' ఉండే 'కాల్‌సిట్రియాల్‌' అనే పొడి పొట్లాలు (శాచెట్లు) లభిస్తున్నాయి. వీటిని రోజుకు మూడుసార్లు తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్‌-డి3 ఇంజక్షన్‌ రూపంలో లభిస్తుంది. ఇది మన దేశంలో ఎక్కువగా వినియోగంలో ఉంది. దీన్ని నెలకోసారి తీసుకోవాల్సి ఉంటుంది, ఇదేమంత ఖరీదైనది కూడా కాదు. అవసరాన్ని బట్టి వైద్యులు వీటిని సిఫార్సు చేస్తారు. విటమిన్‌-డి లోపాన్ని అధిగమించేంత వరకూ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
* ఇటీవలి వరకూ కూడా.. శరీరంలో విటమిన్‌-డి మోతాదు ఎక్కువైతే దానివల్ల ఇతరత్రా అనర్థాలు తలెత్తుతాయని భావిస్తుండేవారు. కానీ అది సరికాదు. అది ఎక్కువైనా ఎటువంటి నష్టమూ ఉండదు.

  • గర్భిణుల్లో 'డి' లోపం -- పిల్లల్లో భాషా సమస్యలు
గర్భిణులు సరైన పోషకాహారం తీసుకోవటం తప్పనిసరి. దీంతో విటమిన్లు, ఇతర పోషకాల లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు. ఇది వారికే కాదు. పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. గర్భిణుల్లో విటమిన్ల లోపం.. ముఖ్యంగా విటమిన్‌ డి లోపం కారణంగా వారి పిల్లల్లో భాషా నైపుణ్యాలు దెబ్బతినే ముప్పు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. మూణ్నెల్లు దాటిన తర్వాత గర్భస్థ శిశువు మెదడులో భాషను నేర్చుకోవటంలో తోడ్పడే భాగం రూపుదిద్దుకోవటం ఆరంభిస్తుంది. అలాగే భావోద్వేగ, ప్రవర్తన వంటివాటి అభివృద్ధిలో పాలు పంచుకునే నిర్మాణాలు, మార్గాలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ సమయంలో విటమిన్‌ డి లోపం గనక ఏర్పడితే వారి పిల్లలు భాషను నేర్చుకోవటంలో మిగతావారికన్నా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టు ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా 18 వారాల సమయంలో గర్భిణుల రక్తంలో విటమిన్‌ డి మోతాదులను పరీక్షించారు. అనంతరం వారి పిల్లలు పెద్దయ్యాక 5, 10 ఏళ్ల వయసులో ప్రవర్తన, భాషా నైపుణ్యాలను పరిశీలించారు. గర్భిణిగా ఉన్నప్పుడు విటమిన్‌ డి లోపం గలవారి పిల్లల్లో భాషా సమస్యలు ఎదురవుతున్నట్టు తేలింది. మెదడు అభివృద్ధి చెందే కీలక సమయంలో విటమిన్‌ డి లోపం ఏర్పడటమే దీనికి కారణమవుతున్నట్టు పరిశోధకులు అనుమానిస్తున్నారు. పాలు, గుడ్లు, చీజ్‌, సాల్మన్‌ చేపల నుంచి విటమిన్‌ డి లభిస్తుంది. రోజులో కొంతసేపు ఎండలో నిలబడినా మన చర్మం దీన్ని తయారుచేసుకుంటుంది. అందువల్ల గర్భిణులు సమతులాహారం తీసుకుంటూ, కాసేపు ఎండలో నిలబడటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. విటమిన్‌ డి లోపం రాకుండా మాత్రలు వేసుకోవటమూ మంచిదేనంటున్నారు.
  • గుండెని రక్షించే విటమిన్‌'డి'
మనకు సంక్రమించే రకరకాల వ్యాధులకు మూలకారణం విటమిన్ల లోపంగానే వైద్యులు చెబుతుంటారు. ఈ లోపాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం. విటమిన్లు శరీరంలో తగినంతగా ఉండేలా చూసుకుంటే అనేక రకాల రోగాలకు చాలా దూరంగా ఉండవచ్చంటున్నారు నిపుణులు.

ప్రకృతిపరంగా లభించే విటమిన్లనైనా పుష్కలంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తే ఎప్పుడూ ఆరోగ్యంగా, హాయిగా ఉండవచ్చు. అలా ప్రకృతి సిద్ధం గా మనకు లభించే విటమిన్లలో ''డి'' విటమిన్‌ ఒకటి. ముఖ్యంగా ''డి''విటమిన్‌ లోపం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు దాడి చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

''డి'' విటమిన్‌ తగినంత పరిమాణంలో మన శరీరంలో లేకపోతే అధిక రక్తపోటు, ఊబకాయం, గుండెకు సంబంధించిన అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వారు చెప్పారు. అయితే శరీరంలో విటమిన్‌ ''డి'' లోపాన్ని అంత త్వరగా గుర్తించలేమని డాక్లర్లు అంటున్నారు. సంధ్యాసమయంలో సూర్యరశ్మి ద్వారా విటమిన్‌ ''డి'' పుష్కలంగా లభిస్తుంది . ఈ విటమిన్‌ లోపం వల్ల శరీరంలో రక్తం చిక్కబడి పలురకాల రుగ్మతలకు కారణభూతమవు తుంటాయి . మరి ఇక ఎటువంటి ఖర్చు లేకుండా లభించే ''డి'' విటమిన్‌ను వెంటనే పొందండి .

  • క్యాన్సర్లతో
ఎముకల ఆరోగ్యంలో విటమిన్‌ డి కీలకపాత్ర పోషిస్తుందన్నది తెలిసిందే. ఇది క్యాల్షియం, ఫాస్ఫరస్‌లను మన శరీరం బాగా గ్రహించేకునేలా చేసి ఎముక పటుత్వానికి ఎంతగానో తోడ్పడతుంది. విటమిన్‌ డి గ్రాహకాలకు అంటుకోవటం ద్వారా ఇది వివిధ జీవక్రియల్లో పాలు పంచుకుంటుంది కూడా. విటమిన్‌ డి ప్రయోజనాల్లో తాజాగా మరొకటి కూడా వచ్చి చేరింది. క్యాన్సర్‌ బారినపడ్డవారిలో ముఖ్యంగా.. రొమ్ము, పెద్దపేగు, లింఫ్‌ క్యాన్సర్ల బాధితుల్లో విటమిన్‌ డి స్థాయులు అధికంగా గలవారు ఎక్కువకాలం జీవిస్తున్నట్టు బయటపడింది. వీరిలో జబ్బు తిరగబెట్టటమూ చాలా ఆలస్యంగా జరుగుతుండటం విశేషం. చర్మం సూర్యకాంతి ప్రభావానికి గురైనప్పుడు శరీరం విటమిన్‌ డిని తయారుచేసుకుంటుంది. అందువల్ల రోజూ కాసేపు ఎండలో గడపటం.. అలాగే పాలు, పాలతో చేసిన పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఎముకలు గుల్లబారటం వంటి ఇతరత్రా సమస్యల నివారణకూ తోడ్పడుతుందని చెబుతున్నారు.

  • Vitamin D for tension-ఒత్తిడికి డి విటమిన్‌

ఒత్తిడినుంచి బయటపడాలంటే ముందు దానికి సంబంధించిన సంకేతాలు తెలియాలి. అతిగా తినడం, ఒంటరిగా ఉండాలనుకోవడం వంటివన్నీ ఒత్తిడికి సంకేతాలేనని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కి చెందిన అధ్యయనకర్తలు చెబుతున్నారు. ఇలాంటప్పుడు ఏవి పడితే అవి కాకుండా సరైన నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.

* రోజూ పొద్దున్నే కాసేపు ఎండలో కూర్చుంటే 'డి' విటమిన్‌ అందుతుంటారు కదా! ఈ పోషకం శరీరానికే కాదు, మానసిక సాంత్వనను అందించడంలోనూ కీలకంగా పని చేస్తుంది. ఈ విటమిన్‌ అందడం వల్ల మెదడు యాంటీ డిప్రెసెంట్‌ హార్మోనుగా పరిగణించే సెరటోనిన్‌ను విడుదల చేస్తుంది. దాంతో ముప్ఫై శాతం వరకూ ఒత్తిడి దూరం అవుతుందని టెక్సాస్‌ యూనివర్సిటీకి చెందిన అధ్యయన కర్తలు చెప్పారు. ఇందుకోసం పొద్దున్నే ఎండలో కూర్చోవడమే కాదు, అవసరాన్ని బట్టి వైద్యుల సలహాతో సప్లిమెంట్లను కూడా తీసుకోవాలి.

* బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడు డాన్స్‌ చేయడం కూడా మరో మంచి పరిష్కారం అంటారు నిపుణులు. దానివల్ల ఆందోళనలు దూరమై, ఆనందం కలుగుతుంది. శరీరంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. మంచి ఫలితాలు అందుకోవాలంటే వారంలో నాలుగుసార్లు కనీసం అరగంట పాటు డాన్స్‌ చేయాలి. దీనివల్ల తొమ్మిది వారాల్లో ఒత్తిడీ, మానసిక ఆందోళనా ఎలాంటి మాత్రలు వాడకుండానే 67 శాతం తగ్గాయని ఓ పరిశోధనలో తేలింది. మనసుని ప్రశాంతంగా ఉంచడంలో పాటలు కూడా కీలకంగా పనిచేస్తాయి. రోజులో పది, పదిహేను నిమిషాలు నచ్చిన పాటలు వినడం, పాడటం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. 
  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, December 27, 2010

బ్లాక్ హెడ్స్‌ ముఖము పై,Blackheads on face


  • photo - courtesy : Wikipedia.org.


ముఖాన్ని అందవిహీనంగా మార్చేవాటిలో బ్లాక్‌హెడ్స్ ప్రధానమైనవి. సెబాషియస్ అనే గ్రంథి నూనె పదార్థాన్ని(సెబమ్) అధికంగా విడుదల చేయడం వల్ల ఇవి ఏర్పడతాయి. చర్మానికి రంగునిచ్చే పిగ్మెంట్ ఎక్కువైనా ఈ సమస్య వస్తుంది. వెంటనే తగిన చికిత్స తీసుకుంటే వీటిని నివారించుకోవడమే కాకుండా అందాన్ని కాపాడుకోవచ్చు.

కారణాలు
* చర్మంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి వీలుగా సెబాషియస్ గ్రంథి నూనె పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ నూనె ఉత్పత్తి ఎక్కువైనప్పడు దానికి చర్మంలోని మలిన పదార్థాలు కూడా తోడయ్యి బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌గా ఏర్పడతాయి.
* చర్మంలో బ్లాక్‌హెడ్స్ ఏర్పడడానికి దుమ్ముకూడా ఒక కారణం. చర్మంలో పేరుకున్న దుమ్ము కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనికి నూనెకూడా జత కావడంతో బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి. .
ట బ్లాక్‌హెడ్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ గిల్లకూడదు. దీనివల్ల పరిస్థితి మరింత విషమిస్తుంది. గిల్లడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా చర్మంలోపలికి చొచ్చుకుపోయి మరింత హాని చేస్తుంది.

నివారణ చిట్కాలు
* ముల్లంగి విత్తనాలను పేస్ట్‌లాచేసుకుని దాన్ని నీళ్లతో కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలపాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. *మూడు నాలుగు కప్పుల నీటిని వేడిచేసి వాటికి రెండు టీ స్పూన్ల సోడా బైకార్బోనేట్ కలపాలి. ఓ టవల్‌ను ఈ నీటిలో ముంచి ముఖంపై ఉంచుకోవాలి. ఇలా ఐదారుసార్లు చేయాలి. ఇప్పుడు ఒక స్పూన్ పెరుగులో ఒక టీ స్పూన్ బియ్యం పిండిని కలుపుకుని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట రుద్దుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగే స్తేసరి.

* గంధపు చెక్క పొడికి రోజ్‌వాటర్ కలిపి ఆ పేస్ట్‌తో ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ విధంగా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్ త గ్గడంతోపాటు చర్మం చల్లగా ఉంటుంది.
*నాలుగు టేబుల్ స్పూన్ల బేకింగ్‌సోడాకు ఒక టీ స్పూన్ డెడ్‌సీ సాల్ట్, రెండు స్పూన్ల నీటిని కలుపుకోవాలి. దీంతో చర్మాన్ని రుద్దుకుంటే మంచి ఫలితం ఉంటుంది. * ఓట్‌మీల్ పౌడర్‌కు రోజ్‌వాటర్ కలుపుకుని ఆ పేస్ట్‌ను వేళ్లతో ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.
* సాధారణ చర్మతత్వం ఉన్నవారు ముల్తానీ మట్టికి రోజ్ వాటర్ కలుపుకుని చర్మంపై రాసుకోవాలి. దీనివల్ల బ్లాక్‌హెడ్స్ తగ్గిపోవడమే కాకుండా చర్మం నున్నగా అవుతుంది.
* మెంతి ఆకులను పేస్ట్‌లా దాన్ని చర్మంపై రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ప్రతిరాత్రి పడుకునే మందు ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే బ్లాక్‌హెడ్స్ తగ్గిపోతాయి. .
ట పెరుగులో నల్లమిరియాల పొడివేసి బాగా కలిపి దాన్ని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.
* తాజా కొత్తిమీర ఆకుల నుంచి తీసిన రసం ఓ టేబుల్‌స్పూన్, పసుపు అర టీ స్పూన్ తీసుకుని ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు రాసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే కడుక్కోవాలి. ఇలా ఓ వారం చేస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి.
* ద్రాక్షపండ్ల గుజ్జును బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.
* ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, ఒక టేబుల్ స్పూన్ దాల్చినచెక్క పొడిని కలుపుకుని పడుకునే ముందు ముఖానికి రాసుకుని ఉదయాన్నే కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* ఓ పావు కప్పు వేడినీటిలో ఒక టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్, మూడు చుక్కల అయోడిన్ వేసి చల్లారేవరకు అలానే ఉంచాలి. తర్వాత ఆ మిశ్రమంలో దూదిని ముంచి బ్లాక్‌హెడ్స్‌పై రాసుకోవాలి.
* పొట్లకాయ గుజ్జును ముఖానికి రాసుకోవడంవల్ల మొటిమలు, ముడతలు, వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ రాకుండా ఉంటాయి.

English (allopathic ) Treatment :

1. Ointment - Euchroma లేదా
2. Ointment - Femcinol -A లేదా
3. Ointment -Memotasone ఏదో ఒక ఆయింట్ మెంటు ను రోజూ ముఖము కడుగుకొని ఉదయము , సాయంత్రము రాసుకోవాలి .
  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

శాకాహారంతో జీర్ణం సులభం , Digestion Easy with Vegeterian




శాకాహారం జీర్ణమయినంత సులభంగా మాంసాహారం జీర్ణం కాదు. ఎదిగే వయసు పిల్లల్లో పౌష్టికాహారం అవసరం కొంత ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత వయసులో కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే పోషకాలు అవసరమవుతాయి. నిజానికి శాకాహారంలో లభించే పోషకాలు ఎవరికైనా సరిపోతాయి.ఏమిటిలా చిక్కిపోతున్నావ్? అని ఎవరైనా ప్రశ్నిస్తే, గుడ్లా? మాంసమా? చిక్కిపోక ఏం చేస్తాం? అంటూ ఎదురుప్రశ్న వేస్తుంటారు. చిక్కిపోవడానికి గల
అసలు కారణాల గురించి ఏ మాత్రం ఆలోచన ఉండదు. ఆకుకూరలు, కాయగూరలు తినడమే అసలు లోపం అన్నట్లుగా వారి ధోరణి ఉంటుంది. నిజానికి మనిషికి అవసరమైన అన్ని పోషకాలు, ప్రొటీన్లు శాకాహారంలోనూ సంపూర్ణంగా లభిస్తాయంటున్నారు నిపుణులు.

సిసలైన పౌష్టికాహారం అంటే మాంసాహారమేనన్న అభిప్రాయం ఉంది. అందుకే మాంసాహారానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. అంతిమంగా ఈ ఆహారపు అలవాట్లు జీర్ణకోశ సమస్యలకు దారి తీస్తాయి. శాకాహారం జీర్ణమయినంత సులభంగా మాంసాహారం జీర్ణం కాదు. ఎదిగే వయసు పిల్లల్లో పౌష్టికాహారం అవసరం కొంత ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత వయసులో కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే పోషకాలు అవసరమవుతాయి. నిజానికి శాకాహారంలో లభించే పోషకాలు ఎవరికైనా సరిపోతాయి. మాంసాహారం మీద ప్రీతితో అంతే మోతాదులో తీసుకుంటూ పోతే అవి జీర్ణం కావు. ఆకలి మందగించడంతో పాటు కడుపులో మంట, తేన్పులు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.

పౌష్టికాహారం పేరిట అదేపనిగా మాంసాహారం, గుడ్లు తీసుకుంటే వాటిని అరిగించుకోవడానికి జీర్ణకోశంపైన అనవసరపు భారం పడుతుంది. శరీరంలోని జీవశక్తి అదనంగా ఖర్చవుతుంది. శరీరతత్వంలో కొన్ని చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకలి మందగించడం, కడుపులో మంట, తేన్పులు, మలబద్ధకం వంటి సమస్యలు మొదలవుతాయి. మాంసాహారం, గుడ్లు పూర్తిగా మానకోవాలని కాదు. ఒక పరిమితిలో వాటిని తీసుకోవచ్చు. అయితే, మాంసాహారం నుంచి మాత్రమే కావలసిన పోషకాలు లభిస్తాయనుకోవడం సరికాదు. శాకాహారం నుంచి కూడా అవసరమైన ప్రొటీన్లతో పాటు పోషకపదార్థాలన్నీ లభిస్తాయి. పెద్దవారికి ఇవి అవసరానికంటే ఎక్కువే.

మొలకెత్తిన పెసర్లు, శనగలు
వీటి నుంచి ప్రొటీన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. తరుచూ వీటిని ఉపాహారంగా (బ్రేక్‌ఫాస్ట్) తీసుకోవడం వల్ల ఎంతో మేలు చేస్తాయి. మొలకెత్తిన గింజల్లో ప్రొటీన్లతో పాటు లవణాలు, విటమిన్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి.పైగా వీటిని జీర్ణించుకోవడంలో శరీరానికి ఎక్కువ శక్తి కూడా ఖర్చు కాదు. మొలకెత్తించే విధానం గింజలను నీటిలో నాలుగు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత వాటిని తడిగుడ్డలో మూట కట్టి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. కొంచెం గాలి తగిలేలా మూత కాస్త తెరిచి పెట్టాలి. సాధారణంగా 12 నుంచి 16 గంటల వ్యవధిలో ఇవి మొలకెత్తుతాయి. చలికాలంలో అయితే 24 గంటల దాకా పట్టవచ్చు.

నానబెట్టిన వేరుశనగలు
శరీరానికి కావలసిన ఎన్నో పౌష్టిక విలువలు, ప్రొటీన్లను వీటి ద్వారా పొందవచ్చు. వేరుశనగ గింజలను పన్నెండు గంటలపాటు నానబెట్టాలి. ఆ తరువాత నీరు తీసివేయాలి. ఇలా చేయడం వల్ల అందులోని హానికారక అంశాలన్నీ తొలగిపోతాయి. ఈ వేరుశనగలను బెల్లంతో కలిపి తీసుకుంటే ఎంతో శక్తి లభిస్తుంది. సలాడ్ క్యారెట్, కీర, బీట్‌రూట్, ఉల్లి, క్యాబేజీ, క్యాప్సికమ్‌లను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. అప్పుడప్పుడు పచ్చి బఠాణి, రుచి కోసం కొంచెం ఉప్పు, మిరియాల పొడి కలుపుకోవచ్చు. టమాటకు బదులుగా నిమ్మరసం కలుపుకోవచ్చు. సలాడ్ తినడానికి చాలా ముందు ఉప్పు కలిపి పెడితే నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తరువాత ఒకరకమైన వాసన వస్తుంది. కాబట్టి తినే సమయంలో మాత్రమే ఉప్పు కలుపుకోవాలి. రాత్రిపూట ఆహారంతో పాటు తీసుకుంటే చాలా మంచిది.

పప్పు, ఆకుకూరలు
పప్పులో ప్రొటీన్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఆకుకూరలో, ఇనుము, లవణాలు అధికంగా ఉంటాయి. రక్తహీనతను ఆకుకూరలు బాగా అరికడతాయి. నీరసం, అలసట తగ్గుతుంది. రక్తహీనత తగ్గడంతో పాటు రక్తస్రావ సమస్యలు కూడా నయమవుతాయి. వీటితో పాటు నానబెట్టిన ఎండు ద్రాక్ష, అత్తిపండు, నానబెట్టిన బాదం, నల్లరకం ఎండు ఖర్జూరం తీసుకోవడం శ్రేయస్కరం.

జాగ్రత్తలు
* తరచు వేపుడు పదార్థాలు, మైదా వంటలు, ఊరగాయలు తినడం మానేయాలి.
* ఉప్పు సగం టీ స్పూన్‌కు మించకుండా ఉండాలి.
* అవసరం ఉన్న వాళ్లు డాక్టర్‌ను సంప్రదించి రెండు లేక మూడు స్పూన్‌ల నెయ్యి వాడవచ్చు.
* సమయానికి భోజనం చేయాలి. రాత్రి భోజనం ఎనిమిది గంటల కంటే ముందే ముగించాలి.
* నిద్రా సమయానికి, రాత్రి భోజనానికి మధ్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండాలి.
* రాత్రి ఆహారంలో 50 శాతం పచ్చి కూరగాయలు, పళ్లు తీసుకోవాలి.
* అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు రాత్రి ఆహారంలో అన్నం కాకుండా గోధుమ పుల్కాలు, జొన్న రొట్టె తినడం మంచిది. * 35 ఏళ్లు దాటిన వారు వారానికి ఒక రోజు ఉపవాసం చేయడం ఆరోగ్యకరం. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు. వండని పదార్థాలు తీసుకోవడం, పళ్లు, పళ్ల రసాలు, మొలకెత్తిన గింజలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటివి తప్పనిసరిగా తీసుకోవాలి.

నీళ్లెప్పుడు తాగాలి?
ప్రతిరోజు మూడు లీటర్ల నీళ్లు తాగాలి. అజీర్తి, మలబద్ధకం, అర్షమొలలు, గాల్‌బ్లాడర్, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు అధికంగా నీరు తీసుకోవడం వల్ల తొలగిపోతాయి. భోజనానికి అరగంట ముందు, అరగంట తరువాత మాత్రమే నీరు తాగాలి. భోజన సమయంలో జీర్ణప్రక్రియ కోసం కేవలం ఒకటి రెండు గ్లాసుల నీరు తీసుకోవచ్చు. భోజనం చేస్తున్నప్పుడే అమితంగా నీరు తాగడం వల్ల ఎంతో నష్టం ఉంటుంది. ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి కొన్ని జీర్ణరసాలు తయారవుతుంటాయి.

భోజనసమయంలో లేక భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణరసాలు పలుచబారతాయి. దీనివల్ల తిన్న ఆహార పదార్థాలు జీర్ణం కాకుండా పోతాయి. కొంత మంది రోజుకు 5 నుంచి 6 లీటర్ల నీరు తాగుతుంటారు. దీనివల్ల నీటిని తిరిగి బయటకు పంపడంలో కిడ్నీలపై అనవసరపు భారం పడుతుంది. శరీరానికి అవసరమయ్యే నీరు మూడు లీటర్లే. ఆ పరిమితిని పాటించడమే ఆరోగ్యకరం.
  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, December 26, 2010

అతి సూక్ష్మపోషకాలు మనిషికి అవసరము , Trace elements are essential for humans

ఇనుము,
జింకు,
కాల్షియమ్‌,
క్రోమియం,
మెగ్నీషియం,
కాపర్‌,
ఫోలిక్‌ ఆమ్లం,
బి12
సెలీనియం
వంటి అతి సూక్ష్మ పోషకాలు కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలలో, తోటకూర, గోంగూర, బెల్లం, పచ్చి ఖర్జూర పండ్లు బాగా మాగినటువంటి పండ్లలో లభిస్తాయి. జామ, రేగి, బత్తాయి మధుమేహం ఉన్న వారు వాడవచ్చు. ఐరన్‌ మాత్రలు పడనివారు తోటకూర, గోంగూర, బెల్లం, పర్చి ఖర్జూర పండ్లు వాడితే రక్త వృద్ధికి తోడ్పడతాయి. పీచు పదార్థాలు, రక్తంలోని దోషాల నిర్మూలనకు పెద్దపేగు క్యాన్సర్‌ రాకుండా వుండేందుకు దోహదపడ్తాయి. మలబద్ధకం, జీర్ణప్రక్రియకు మేలు చేస్తాయి.

  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, December 25, 2010

అతిగా కూచుంటే..అనర్థమే , Too long siting is bad for health




కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు. తిండి సంగతేమో గానీ ఎక్కువసేపు కూర్చోవడం ఆరోగ్యాన్నే హరించివేస్తుందని సెలవిస్తున్నారు పరిశోధకులు. రోజుకి అరగంట సేపు వ్యాయామం చేసినా సరే.. దీర్ఘకాలం కూచొని పనిచేస్తే గుండెజబ్బులు, క్యాన్సర్‌తో పాటు వెన్నునొప్పి, తదితర సమస్యలూ చుట్టుముడుతున్నాయని హెచ్చరిస్తున్నారు.

మారుతున్న జీవనశైలి, పని పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివన్నీ మనిషిని కదలనీయకుండానే 'పని' కానిచ్చేస్తున్నాయి. దీంతో గంటల తరబడి కదలకుండా కూచోవటమూ అలవడుతోంది. మనలో చాలామంది మెలకువగా ఉన్నప్పుడు 95% సమయాన్ని కూచునే గడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎక్కువసేపు కూచోవటం అనేది గుండెజబ్బులు, అధిక రక్తపోటు, స్థూలకాయం, టైప్‌2 మధుమేహం, గుండెపోటు, కొన్నిరకాల కాన్సర్లకు దారి తీస్తున్నట్టు వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. వ్యాయామం చేస్తున్నప్పటకీ ఎక్కువసేపు కదలకుండా పనిచేస్తే ఈ ముప్పులు ముంచుకొస్తుండటం గమనార్హం.

అరగంట మించుతోందా?
కుర్చీలోంచి కదలకుండా 60 నిమిషాల సేపు టీవీ చూస్తున్నారా? అయితే గుండెజబ్బులు, క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ముంచుకొస్తున్నట్టే. నిజానికి స్థిరంగా కూచోవటం అనేది మానవులకు సరిపడదంటున్నారు పరిశోధకులు. ఈ సమయంలో మన శరీరంలోని లైపోప్రోటీన్‌ లైపేజ్‌ (ఎల్‌పీఎల్‌) అనే ఎంజైమ్‌ పనితీరు మందగిస్తుందని వివరిస్తున్నారు. ఇది వ్యాక్యూమ్‌ క్లీనర్‌లా పనిచేస్తూ.. రక్తంలోని చెడ్డ కొలెస్ట్రాల్‌ను పీల్చుకొని కండరాల రూపంలోకి మారుస్తుంది. కదలకుండా కూచుంటే మాత్రం ఈ ప్రక్రియ ఆగిపోతుంది. దీంతో రక్తంలో కొవ్వు పెరిగిపోయి చివరికది పొట్ట, తదితర భాగాల్లో నిల్వ ఉండిపోతుంది. ఎక్కువసేపు కదలకపోతే కండరాలూ మందకొడిగా తయారై బిగుసుకుపోతాయి. బరువు, బొజ్జ పెరుగుతాయి. పొట్ట భాగంలో పేరుకునే ఈ కొవ్వు చాలా ప్రమాదకరమైంది. ఇది రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచే హర్మోన్లను సైతం ఉత్పత్తి చేస్తుంది కాబట్టి.. రక్తనాళాలు పూడుకుపోవటం, స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వాటికీ దారితీస్తుంది.

వెన్ను సమస్యలు కూడా
ఎక్కువసేపు కూచోవటం వల్ల వెన్నెముక, భుజాలు, తుంటి సమస్యలూ పుట్టుకొస్తాయి. మన వెన్నెముక నిలబడేందుకు వీలుగా రూపొందింది. గంటలకొద్దీ వెన్నుని నిటారుగా ఉంచి సరైన ఆకృతిలో కూచోవాలంటే వీపు భాగంలోని కండరాలు చాలా బలంగా ఉండాలి. లేకపోతే వెన్నెముక ముందుకు వంగుతుంది. భుజాలు కిందికి వాలిపోతాయి. ఇది క్రమంగా భుజాలు, మెడ, నడుంనొప్పులకు దారి తీస్తుంది. ఆఫీసుల్లో కంప్యూటర్‌ టేబుళ్లు, కుర్చీల ఆకారం, ఎత్తు సరిగా లేకపోయినా వెన్నెముక దెబ్బతింటుంది. మెడ, వీపు, ఛాతీ, భుజాలు, చేతుల్లోని కండరాలు, నాడులపైనా ప్రభావం చూపుతుంది.

చిన్న పనులతో పెద్ద మేలు
గంటలకొద్దీ కదలకుండా కూచోవాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న చిన్న పనులతోనూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరిస్తున్నారు.

* కనీసం ప్రతి 20 నిమిషాలకు ఒకసారైనా కుర్చీలోంచి లేచి కాస్త అటూఇటూ తిరగాలి.
* రోజుకి కనీసం 40 నిమిషాల సేపైనా నడక అలవాటు చేసుకోవాలి. ఇది కీళ్లు బాగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
* ఆఫీసులో సహోద్యోగుల దగ్గరకు వెళ్లే అవకాశం ఉన్నప్పుడు ఫోన్లు, ఈ-మెయిళ్ల వంటివి చేయకుండా కాస్త కాళ్లకు పని కల్పించటం మంచిది.
* వీలైనప్పుడు శ్వాసను వదులుతూ కడుపును లోపలికి పీల్చుకొని 10 అంకెలు లెక్కబెడుతూ అలాగే ఉండండి. ఇది పొట్ట కండరాలు బలంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.
* ఒత్తిడి తగ్గి భుజాలు విశ్రాంతి పొందేందుకు వీలుగా అప్పుడప్పుడు భుజాలను పైకి లేపుతూ ఉండాలి.
* ఫోన్‌ వచ్చినపుడు లేచి నిలబడి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే కారిడార్‌లో పచార్లు చేస్తూ సంభాషించటం మేలు.
* వీలైనంతవరకు లిఫ్ట్‌ని వాడకుండా మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించాలి.

  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

డిస్క్‌ జారినప్పుడు(డిస్క్‌ ప్రొలాప్స్‌),Disk Prolapse


వయసుతో నడుంలోను, మెడలోను ఎముకల అరుగుదల, డిస్క్‌లలో ఏర్పడే డీజనరేషన్‌ మార్పులను స్పాండిలోసిస్‌ అంటామని గత వారం చెప్పుకున్నాం. అలాకాకుండా ప్రయాణాలలో ఏర్పడే అదుర్లు, నెత్తిమీద పెద్దపెద్ద బరువులు మోయటం, షేవింగ్‌ సెలూన్లలో అసహజ పద్ధతులలో మసాజ్‌ చేయించడం, వంగి అలవాటు లేని ఎక్కువ బరువులెత్తే ప్రయత్నం చేసినప్పుడు మెడ, నడుంలోని డిస్క్‌లు పక్కకు గాని, వెనుకకుగాని జరుగుతాయి. దీనినే డిస్క్‌ ప్రొలాప్స్‌ అంటాం. ఇది ముఖ్యంగా చిన్న వయసులో.. 20 నుండి 30 ఏళ్లలో రావడం అధికంగా ఉంటుంది.

సర్వైకల్‌ డిస్క్‌ప్రొలాప్స్‌

మెడలోని ఎముకలలో 5,6,7, ఎముకల మధ్యగల డిస్క్‌లు సాధారణంగా ఎక్కువగా స్లిప్‌ అవుతుంటాయి. ఎక్కువగా ముందుకు వంగి చదవటం, ద్విచక్ర వాహనాల్లో అధికంగా ప్రయా ణించటం, సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లు వృత్తి పరంగా ఎక్కువగా వంగి వుండటం, అలవాటు లేనివారు శీర్షా సనాన్ని ప్రయత్నించటం వల్ల డిస్క్‌ ప్రొలాప్స్‌ సమస్య ఉత్పన్నమవుతుంది.

లక్షణాలు : మెడ బిగుసు కుపోవడం, వున్నట్టుండి తీవ్రమైన నొప్పి కలగడం, మెడనుండి భుజం పైభాగానికి వెనుకకు తీవ్రంగా నొప్పి రావటం, భుజం నుండి మోచేతికి, చేతివేళ్ళ పొడవునా నొప్పి రావటం, మొద్దు బారతాయి. ఒక్కోసారి చేతి కండరాలు బలాన్ని కోల్పోతాయి.

రోగ నిర్ధారణ : ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ పరీక్ష అత్యంత కీలకమైనవి.

వైద్యం : స్పాండిలోసిస్‌లాగే హార్డ్‌ కాలర్‌, ట్రాక్షన్‌ ట్రీట్‌మెంట్‌ అవసరం. శస్త్ర చికిత్స చాలా అరుదుగా అవసరమవుతుంది.

లంబార్‌ డిస్క్‌ ప్రొలాప్స్‌

నడుంలోని 4,5 ఎముకల మధ్యగల డిస్క్‌లు వెనుకకు గానీ, పక్కకుగానీ స్లిప్‌ అవుతాయి. దీనికి ముఖ్యమైన కారణాలు వంగి బరువెత్తే ప్రయత్నం చేయటం. వెనుకసీట్లలో కూర్చొని ప్రయాణం చేసేటప్పుడు ఏర్పడే అదుర్లు. అధికంగా హైజంప్‌, లాంగ్‌జంప్‌ వంటి క్రీడలు.

లక్షణాలు : ఈ జబ్బులో డిస్క్‌ వెనుకకు పూర్తిగా జరిగినప్పుడు నడుం పూర్తిగా పట్టుకుపోయి నిద్రలో అటూ ఇటూ పొర్లడతారు. సొంతంగా లేవడం చాలా కష్టమవుతుంది. తీవ్ర నడుంనొప్పి, నడుం పక్కనగల కండరాలు పూర్తిగా వడ్డుకుపోయి నడుం బిగుసుకుపోతుంది. అలాకాక డిస్క్‌ పక్కకు తొలిగినప్పుడు నడుం నుండి కాళ్ళలోకి వచ్చే నరాలమీద ఒత్తిడి ఏర్పడి తొడవెనుక భాగం నుండి, మోకాలిలోనికి, పిక్క కండరాలకు కాలివేళ్ళలోనికి పాదపు అడుగు భాగానికి విపరీతమైన నొప్పి ఏర్పడుతుంది. ముఖ్యంగా నిలబడ్డప్పుడు, నడిచేటప్పుడు కాలిపొడవునా ఏర్పడే ఈ న్యూరాల్జిక్‌ నొప్పిని 'సయాటికా' అంటాం. ఒక్కోసారి ఈ నొప్పి తొడ వెనుక భాగంలో మోకాలి వరకు మాత్రమే రావచ్చు. దీనిని 'ఎటిపిల్‌ సయాటికా' అంటాం.

ఒక్కోసారి నడిచేటప్పుడు కాళ్లల్లోని రక్తనాళాలలో రక్తసరఫరా తగ్గి కాలిపొడవునా ఇదే రకమైన నొప్పి వస్తుంది. దీనిని 'వాస్క్యులార్‌ క్లాడికేషన్‌' అంటాం. ఈ జబ్బులో మొదటిసారి నడిచినప్పుడు వచ్చిన నొప్పి కొద్దిగా విశ్రాంతి తరువాత తగ్గుతుంది. మళ్ళీ నడక మొదలు పెట్టినప్పుడు మొదట నడిచిన దూరంలో సగదూరం నడిచినప్పుడే నొప్పి కనపడుతుంది. అంటే.. రక్తనాళాలలో సమస్య ద్వారా వచ్చే క్లాడికేషన్‌ నొప్పి, దాని దూరం మొదటిసారికన్నా రెండవసారి సగ దూరానికే నొప్పి వస్తుంది. అలా కాకుండా నడుంనుంచి వచ్చే నరాల నొప్పి నుండి వచ్చే 'సయాటికా' నొప్పిని న్యూరోలాజికల్‌ క్లాడికేషన్‌ అంటాం. ఇది కూడా విశ్రాంతి ద్వారా తగ్గుతుంది. కాని విశ్రాంతి తదనంతరం వచ్చే నొప్పి మళ్ళీ అదే దూరానికి వస్తుంది. అంటే వాస్క్యులర్‌ క్లాడికేషన్‌ దూరం వలె న్యూరోలాజికల్‌ క్లాడికేషన్‌ దూరం మారదు.

రోగ నిర్ధారణ : లంబార్‌ డిస్క్‌ ప్రొలాప్స్‌లో కూడా, ఎక్స్‌రే, సిటిస్కాన్‌, ఎంఆర్‌ఐ పరీక్షల ద్వారా రోగనిర్ధారణ చేస్తారు.

వైద్యం : ఈ వ్యాధి చికిత్సలో అతిప్రధానమైంది విశ్రాంతి. డాక్టర్‌ సలహా మేరకు లంబార్‌ బెల్ట్‌, ట్రాక్షన్‌తోపాటు మందులు వాడాలి. ఒక్కోసారి నరం ఒత్తిడి ఎక్కువై పాదం బలహీనపడి 'ఫుట్‌డ్రాప్‌' కూడా ఏర్పడవచ్చు. అత్యంత అవసరమైనప్పుడు మాత్రమే శస్త్ర చికిత్స చేయాలి.

--------------------------------------------------------------------
డాక్టర్‌ జె. భాను కిరణ్‌,ఆర్థొపెడిక్‌ సర్జన్‌,డాక్టర్‌ వెంకట రామప్ప హాస్పిటల్‌,సత్యసాయి మహిళాకళాశాల ఎదురుగ,బెంగళూరురోడ్డు, అనంతపురం.

  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌,Gastric Cancer


జీర్ణాశయంలో వచ్చే కేన్సర్‌లలో గ్యాస్ట్రిక్‌ చాలా సాధారణంగా కన్పిస్తుంది. చైనా, జపాన్‌ చిలీ వంటి దేశాలలో ఎక్కువగా కన్పిస్తుంది. స్త్రీలకన్నా పురుషుల్లో రెండింతలు ఎక్కువ. 60 ఏళ్ల నుండి 70 ఏళ్లలోపు వారిలో చాలా ఎక్కువ.

  • కారణాలు :
దీనికి ఇదమిత్తంగా ఇదే కారణం అని చెప్పడం కష్టం. కానీ కొన్ని కారణాలున్నాయి. అవి..

'ఎ' గ్రూపు బ్లడ్‌ ఉన్నవారిలో ఎక్కువని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.కొన్ని మానవ జాతులలో వారి సంతతికి ఎక్కువగా కన్పిస్తుంది. ఆహారంలో పాలు, ఎక్కువ కాల్చిన పదార్థాలు వాడడం వల్ల, ఎక్కువ ఉప్పు వాడేవారిలో వచ్చే అవకాశాలు ఎక్కువ. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశముంది. జీర్ణాశయంలో పాలిప్స్‌, క్రానిక్‌ గ్యాస్ట్రిక్‌ అల్సర్‌ వున్న వారిలో. జీర్ణాశయం కుంచించుకోపోయిన వారిలో. రక్తహీనతలో ముఖ్యంగా పర్నీషియన్‌ అనీమియా ఉన్న వారికి. పార్షియల్‌ గ్యాస్ట్రెక్టమి చేయించుకొన్న వారిలో కన్పించే అవకాశాలు ఎక్కువ.

  • లక్షణాలు :
పైకడుపు ఉబ్బరంగా వుండడం. నొప్పితో కూడిన బాధ. ఆహారం తీసుకొన్న తర్వాత బాధ ఎక్కువవుతుంది. ఆకలి నశించడం. కడుపులో వికారంగా వుండడం. బరువు తగ్గడం. వమనం వచ్చినట్టు వుండడం. జీర్ణాశయంలో రక్తస్రావం జరిగి వమన రూపంలో కాఫీ కలర్‌లో వస్తుంది. విరేచన రూపంలో అయితే నల్లగా తారులాగా వస్తుంది. అన్నీ తినడానికి మింగడానికి కూడా కష్టమవడం. పై కడుపులో గడ్డలాగా పరీక్ష చేస్తే చేతికి తగులుతుంది. రక్తహీనత. పడుకోబెట్టి పరీక్ష చేసినప్పుడు కడుపులో నీటి కదలిక. సన్నగా జ్వరం రావడం. నీరసం, ఆయాసం. కడుపులో నీరు చేరడం. జీర్ణాశయానికి రంధ్రంపడి కడుపులో రక్తస్రావం జరిగి ప్రమాదానికి గురవడం. ఇది పక్క అవయవాలకు పాకుతుంది. లివర్‌కు పాకినప్పుడు పచ్చకామెర్లు వుంటాయి. గొంతులో లింఫ్‌ గ్రంథులు వాయడం. స్త్రీల ఓవరీలో గడ్డలేర్పడతాయి. ఆసనం దగ్గర గ్రంథుల వాపు. చర్మంలో కంతులు ఏర్పడతాయి. చర్మంలో మార్పులొస్తాయి.

  • నిర్ధారణ :

డబుల్‌ కాంట్రాస్ట్‌ బేరియమ్‌ మీల్‌ ఎక్సరే గ్యాస్ట్రో స్కోపితో చూస్తారు. బయాప్సీ పరీక్ష చేస్తారు. బ్రెష్‌ సైటాలిజి చాలా ముఖ్యమైన పరీక్షలు.అవసరమైతే సిటి స్కానింగ్‌ కూడా చేస్తారు.
  • చికిత్స :
వ్యాధి ఆరంభ దశలో గ్యాస్ట్రెక్టమీ, సబ్‌టూటల్‌ గాని టోటల్‌ గ్యాస్ట్రెక్టమి చెయ్యాలి. మైటోమైసిన్‌, ఆడ్రియోమైసిన్‌ తర్వాత రేడియోథెరపీ చేస్తారు. ఆపరేషన్‌ వీలులేనప్పుడు ఉపశమనానికి సులభంగా జీర్ణమయ్యే ఆహారం కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు ఇవ్వాలి. నొప్పి తగ్గించడానికి పెంట్రోబెసిన్‌, వాంతులకు జోపర్‌ ఇంజెక్షన్లు ఇవ్వాలి. ద్వారం అవరోధం వుండి మూసుకోపోయినట్టు వుంటే 'డైలటేషన్‌' చేయాలి. ఐరన్‌, బి-12 మొదలైన మందులు ,ఐవి-విప్లూయిడ్స్‌లో మల్టీవిటమిన్‌ ఇంజక్షన్‌ కూడా ఇవ్వాలి.


--Article : Courtesy with డాక్టర్‌ హెచ్‌. కృష్ణమూర్తి-చీఫ్‌ ఫిజిషియన్‌, మల్లు వెంకటనర్సింహారెడ్డి మెమోరియల్‌ క్లీనిక్‌, ఎంహెచ్‌ భవన్‌,అజామాబాద్‌, హైద్రాబాద్‌.

  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

తుంటికీలు మార్పిడి శస్త్ర చికిత్స,Hip replacement Surgery


వివిధకారణాల వల్ల ఏర్పడే తుంటికీలు అరుగుదలలో ఇన్‌ఫెక్షన్‌ (క్షయ, ఆర్థ్రయిటీస్‌), రుమటాయిడ్‌ ఆర్థ్రయిటీస్‌, ఎవాస్కులర్‌ నెక్రోసిస్‌, పోస్ట్‌ఫాక్చర్‌ ఆర్థ్రయిటీస్‌, మందులు,ఆల్కహాల్‌ వల్ల వచ్చే ఆర్థ్రయిటీస్‌లో రకరకాల శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

మాక్‌ ముర్రేస్‌ ఆస్టియాటమీ చికిత్సలో దెబ్బతిన్న బంతి కీలు మీదపడే బరువు ఆక్సిస్‌ను సంపూర్ణంగా పక్కకు జరుపుతారు. దీని వల్ల దెబ్బతిన్న కీలు యథా తథంగా ఉన్నప్పటికీ నొప్పి పూర్తిగా తగ్గుతుంది. శాశ్వత ప్రాతిపదికన రోగి తన పనులన్నీ చేసుకోగలడు. గ్రామీణ వ్యవసాయ కుటుంబీల కులకు ఇది అత్యం త ఉపయోగకరమైన చికిత్స. నడకలో కొద్దిగా కుంటు ఉంటుంది. అలాగే నేలమీద కూర్చోగలిగినా కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ నొప్పి ఏమాత్రం ఉండదు. బరువైన పనులన్నీ సులభంగా చేయొచ్చు.ఖర్చు కేవలం 20 వేల లోపే అవుతుంది. జీవితాంతం రెండోసారి సర్జరీ చేయాల్సిన అవసరం రాదు.

తుంటీకీలు మార్పిడి

పైన పేర్కొన్న రుగ్మతలు కలిగిన వారిలో ముఖ్యంగా పట్టణ జీవనంలో ఉన్నవారికి ఏ ఇతర సర్జరీల ద్వారా కూడా తుంటికీలులో ఉపశమనం లభించదు. మాక్‌ ముర్రేస్‌ ఆస్టియాటమీలో భవిష్యత్తులో వచ్చే కొద్ది కుంటును రోగి ఇష్టపడనప్పుడు తుంటికీలును పూర్తిగా తొలగిస్తారు.కీలులోని బంతి భాగానికి, కప్పు భాగానికి మెటల్‌ అల్లారు, అల్ట్రాహైడెన్సిటీ పాలిఇథిలీన్‌పూత కలిగిన ఇంప్లాంట్స్‌ ఉపయోగించి శస్త్ర చికిత్స నిర్వహిస్తారు. దీన్లోకూడా సహజమైన బంతికీలు పూర్తిగా తొలగిస్తారు. బోన్‌సిమెంట్‌, పిన్స్‌, స్క్రూలు ఉపయోగించి కప్పు భాగాన్ని, బంతి భాగాన్ని బిగిస్తారు.

ఈ చికిత్స వ్యయం 1.5 లక్షల రూపాయల నుండి రెండు లక్షల రూపాయలవరకు ఉంటుంది. శస్త్ర చికిత్స తర్వాత శాశ్వతంగా నేలమీద కూర్చోలేరు. పాశ్చాత్య టారులెట్‌ ఉపయోగించాలి. ఎక్కువగా మెట్లు ఎక్కకూడదు. ఈ చికిత్స ఫలితం కూడా అధిక బరువు, ఇతర జబ్బులు వాటికి ఉపయోగించే మందులననుసరించి 10 నుంచి 15 ఏళ్ల వరకు సత్ఫలిస్తుంది. అంటే ఈ శస్త్రచికిత్సని కూడా వీలైనంత వరకు 60 ఏళ్లుపైన చేయించుకోవడం మంచిది. ఈ రెండు శస్త్రచికిత్సలు రెండింటిలోనూ రివిజన్‌ సర్జరీ, రీప్లేస్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ ఖర్చు, వయసు పెరిగేకొద్దీ శారీరక రుగ్మతలను దృష్టిలో ఉంచుకుని రివిజన్‌ సర్జరీలను ఆలోచించి చేయించుకోవాలి. ఈ సందర్భంగా ఒక సామెతను గుర్తు చేసుకోవాలి. అది నో ట్రీట్‌మెంట్‌ ఈజ్‌ బెటర్‌దాన్‌ ఓవర్‌ ట్రీట్‌మెంట్‌.

డాక్టర్‌ జె. భాను కిరణ్‌,ఆర్థొపెడిక్‌ సర్జన్‌,డాక్టర్‌ వెంకట రామప్ప హాస్పిటల్‌,త్యసాయి మహిళాకళాశాల ఎదురుగ,బెంగళూరురోడ్డు, అనంతపురం.
  • ==============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

సూర్యనమస్కారాలు ఆరోగ్య సూత్రాలు , Sun God Namaskaraalu Health hints










సూర్యుడు...చైతన్యానికి ప్రతీక, ఆరోగ్యానికి అధిపతి, క్రమశిక్షణకు మారుపేరు. సూర్యనమస్కారాలతో ఆ మూడూ సిద్ధిస్తాయంటారు సాధకులు.


ఆదిత్యస్య నమస్కారాన్‌ ఏ కుర్వన్తి దినేదినే
జన్మాంతర సహశ్రేషు దారిద్య్ర నోపజాయతే
నమః ధర్మవిధానాయ నమస్తే కృతసాక్షినే
నమః ప్రత్యక్షదేవాయ భాస్కరాయ నవోనమః

అనేకానేక నమస్కారాలతో నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పవిత్ర మంత్రాలతో నీ ఘనతను కీర్తిస్తున్నాం. మాకు ఆరోగ్యాన్నివ్వు. ఆయుర్దాయాన్నివ్వు. అలుపెరుగని చైతన్యాన్నివ్వు. ఆధ్యాత్మిక జ్ఞానాన్నివ్వు.
* * *

మనిషి కొలిచిన తొలిదేవుడు భానుడు. ఆ లేలేత కిరణం, ఆ ప్రచండ భానుతేజం, ఆ సంధ్యాసౌందర్యం...ప్రతీదీ ఓ అద్భుతమే! అందుకే ఏడుగుర్రాల తేరులో వూరేగించారు. 'ఆదిత్య హృదయం'తో కీర్తించారు. కోణార్కు, అరసవిల్లి ఆలయాలు కట్టించారు. రుగ్వేదంలో సూర్యుడిని కీర్తిస్తూ చాలా రుక్కులే ఉన్నాయి. భానుకిరణాలు బలహీనతల్ని నివారిస్తాయనీ రోగాల్ని నయంచేస్తాయనీ దుష్టశక్తుల్ని తరిమికొడతాయనీ ఉపాసకులను కవచంలా రక్షిస్తాయనీ వేనోళ్ల కొనియాడారు. పురాణాలు కూడా చాలా ప్రాధాన్యం ఇచ్చాయి. రామాయణంలో మహాబలవంతుడైన రావణుడిని జయించడానికి అగస్త్యమహాముని రాముడికి 'ఆదిత్య హృదయం' బోధించాడు. 'మహాభారతం'లో అరణ్యవాసంలో ఉన్న పాండవులకు అక్షయపాత్ర ఇచ్చింది సూర్యుడే. 'గీత'లో కృష్ణుడు 'నక్షత్ర రాశిలో నేను సూర్యుడిని' అని ప్రకటించాడు.

పన్నెండు భంగిమలు...
సూర్యారాధనలో నమస్కారాలే ప్రధానం. ప్రతి నమస్కారంలో ఓ ఆసనం ఉంటుంది. అలా వెుత్తం పన్నెండున్నాయి. ఇందులో ఏడు వైవిధ్యమైనవి. మిగిలిన అయిదూ వాటిలోంచే పునరావృతం అవుతాయి. నిటారుగా నిలబడటం, ముందుకు వంగడం, వెనక్కి వంగడం...ఇలా ప్రతి కదలికా శరీరంలోని ఏదో ఓ భాగం మీద ప్రభావం చూపుతుంది. పన్నెండు నమస్కారాలూ అయ్యేసరికి ఆ చైతన్యం శరీరమంతా విస్తరిస్తుంది. ప్రతి భంగిమా సూర్యమంత్రంతో వెుదలవుతుంది. దీనికీ ఓ కారణం ఉంది. మన పెద్దలు మంత్రానికి అపారమైన శక్తి ఉందని నమ్మారు. అందులోనూ, ప్రతి సూర్యమంత్రానికీ జోడించే 'ఓం'కారం మహా మహిమాన్వితమని భావించారు. సూర్యనమస్కారాలు చేస్తున్నప్పుడు శరీరం మీద ఎంత శ్రద్ధపెడతావో, మనసు మీదా అంతే ధ్యాస ఉండాలి. బాహ్య చైతన్యంతో ప్రారంభించి, అంతః చైతన్యాన్ని సాధించడమే సూర్యనమస్కారాల లక్ష్యం.

పన్నెండు ఆసనాలకు ఆ పన్నెండు మంత్రాలే ఎందుకన్న ప్రశ్నకూ యోగులు సమాధానం చెప్పారు. జ్యోతిషం ప్రకారం...సూర్యుడు రాశిచక్రంలోని పన్నెండు స్థానాల్లో సంచరిస్తాడు. ఆయా స్థానాల్లో ప్రవేశించగానే సూర్యుడి ముఖ కవళికల్లో వచ్చే మార్పులను బట్టి... పన్నెండు పేర్లూ వచ్చాయి. 'మిత్రాయ నమః' అంటూ సూర్యుడిని జగత్తుకంతా స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా కీర్తిస్తాం. 'రవయే నమః' అంటే ప్రకాశించేవాడని అర్థం. 'సూర్యాయ నమః' అన్న మంత్రం... చైతన్య స్వరూపుడిగా కొనియాడుతుంది. 'భానవే నమః'...అంధకారాన్ని తొలగించేవాడికి ఇవే మా నమస్కారాలు. అజ్ఞానాన్నీ అనారోగ్యాల్నీ దూరంచేసేవాడని కూడా అంతర్లీన భావం. ఇలా పన్నెండు మంత్రాలకూ పన్నెండు అర్థాలున్నాయి.

సూర్యనమస్కారాలు శరీరానికి చైతన్యాన్ని ఇస్తాయి. క్రమబద్ధమైన శ్వాస మనసును ప్రభావితం చేస్తుంది. ఓంకారంతో పలికే సూర్యమంత్రాలు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ఆరోగ్యం అంటే... శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం! సూర్యనమస్కారాల్లో ఈ మూడూ ఉన్నాయి.

శుభోదయం...
తెలతెలవారుతూ ఉంటుంది. కిలకిలమంటూ పక్షులు గూట్లోంచి బయటికొస్తాయి. లేతవెుగ్గలు సుకుమారంగా విచ్చుకుంటాయి. వెుక్కలు పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. ప్రకృతికే ఓ కొత్తకళ వచ్చేస్తుంది. అర్ధరాత్రి పార్టీలతో అపరాత్రి విందులతో అలసిసొలసిన ఆధునిక మానవుడు మాత్రం, అలారమ్‌ వోగినా పట్టించుకోడు. కోడి 'కొక్కొరకో' అంటూ అరిచిగీపెట్టినా స్పందించడు. ఆ అపసవ్య జీవనశైలితో ఆరోగ్యం నాశనమైపోతుంది. సూర్యనమస్కారాల్ని జీవితంలో భాగం చేసుకుంటే...అన్నిటికంటే ముందు బద్ధకం వదిలిపోతుంది. తెల్లవారుజామునే నిద్రలేస్తాం. బాలభానుడి దర్శనమే ఓ దివ్యానుభూతి. బంగారు వన్నెలో మెరిసిపోతుంటాడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తున్నప్పుడు...ఎక్కడలేని ప్రశాంతత. ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. సూర్యనమస్కారాల్లో - ఓ రూపమంటూ లేని ఆదిత్యుడిని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటాం. ఓ రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ సాధన మనలోని సృజనాత్మకతను ఇనుమడింపజేస్తుంది. సూర్యనమస్కారాల్లో ఏకాగ్రత ముఖ్యం. ఆలోచనల్లేని స్థితిని సాధించే క్రమంలో... తూనీగల్లా వచ్చిపోయే ఆలోచనల్ని ఎలాంటి స్పందనా లేకుండా, ఏ మాత్రం భావోద్వేగాలకు లోనుకాకుండా అచ్చంగా ఓ ప్రేక్షకుడిలా గమనిస్తాం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లనూ సమస్యలనూ ఎదుర్కోడానికి అవసరమైన శక్తి అలా మనకు ఒంటబడుతుంది. మంత్రం మన ఉచ్చరణ దోషాల్ని పరిహరిస్తుంది. తడబడకుండా సూటిగా భావాల్ని వ్యక్తం చేయగల నైపుణ్యాన్నిస్తుంది. కార్పొరేట్‌ ప్రపంచంలో పట్టాల కంటే గొప్ప అర్హత ఇది.

వూబకాయం, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు... ఆధునిక జీవితంలోని ప్రతి ఆరోగ్య సమస్యకీ సూర్యనమస్కారాల్లో పరిష్కారం ఉంది. పొద్దున్నే తూర్పు దిశగా నిలబడినపుడు శరీరంలోకి ప్రవేశించే విటమిన్‌-డి ఎముకల్ని శక్తిమంతం చేస్తుంది. ఆ కిరణాల ప్రభావంతో కొన్నిరకాల చర్మరోగాలు కూడా దూరమవుతాయని నిపుణులు నిర్ధరించారు. నేత్ర సంబంధ వ్యాధులు ఉన్నవారికి సూర్యదర్శనం చాలా మంచిది. సూర్యనమస్కారాల్లో భంగిమ ఎంత ముఖ్యవో, శ్వాసా అంతే ముఖ్యం. క్రమబద్ధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మలిన రక్తం తొలగిపోతుంది. అన్ని భాగాలకూ చక్కని రక్తప్రసరణ జరుగుతుంది. అలసట గాలికెగిరిపోతుంది.

సూర్యనమస్కారాల్లోని పన్నెండు ఆసనాలూ అపారమైన ప్రయోజనాల్ని కలిగించేవే. మొదటి ఆసనం...ఏకాగ్రతనిస్తుంది. రెండో ఆసనం... పొట్టలోని కొవ్వును తగ్గిస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. వెన్నులోని నరాలను శక్తిమంతం చేస్తుంది. చేతులకూ భుజాలకూ సత్తువనిస్తుంది. వూపిరితిత్తుల్లోని గదులను విశాలం చేస్తుంది. మూడో ఆసనం...ఉదర సమస్యలను తొలగిస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. నాలుగో ఆసనం...కాళ్లలోని కండరాలకు బలాన్నిస్తుంది. ఐదో ఆసనం...రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది. ఆరో ఆసనంలో ఛాతీ విశాలమవుతుంది. ఏడో ఆసనంలో బుద్ధివికాసం కలుగుతుంది. పునరావృతమయ్యే ఐదు ఆసనాలూ అదనపు ప్రయోజనాలను జోడిస్తాయి.

సూర్యనమస్కారాలు ముగిస్తే ప్రణామాసనం, హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం, అశ్వసంచలనాసనం, పర్వతాసనం, అష్టాంగాసనం, భుజంగాసనం...చేసినట్టే. అంటే, యోగా ద్వారా కలిగే ప్రయోజనాలు మన ఖాతాలో పడ్డట్టే. వాత, పిత్త, కఫ...ఈ మూడూ సమతౌల్యంగా ఉంటే, ఎలాంటి సమస్యలూ రావని ఆయుర్వేదం చెబుతుంది. సూర్యనమస్కారాలతో ఆ సమస్థితిని సాధించవచ్చు.

సూర్యనమస్కారాలు ఆధ్యాత్మిక సాధకులకూ దిశానిర్దేశం చేస్తాయంటారు యోగాచార్యులు. మన శరీరంలోని నాడులతో, గ్రంధులతో ముడిపడి వెుత్తంగా ఏడు శక్తికేంద్రాలున్నాయి...మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం వాటి పేర్లు. సూర్యనమస్కారాలతో ఏకాగ్రత కుదురుతుంది. దాంతోపాటే చక్ర కేంద్రాల్లో చైతన్యం కలుగుతుంది. అదే, కుండలిని జాగృతికి దారిచూపుతుంది. అంతకుమించిన ఆధ్యాత్మిక ఉన్నతి ఇంకెక్కడుంటుంది?అదే ఆనందం, బ్రహ్మానందం, మహదానందం!

మహాప్రసాదం!
రోజువారీ కార్యక్రమాల ద్వారా మన శరీరంలోని 35 నుంచి 40 శాతం కండరాల్లో మాత్రమే కదలికలు ఉంటాయి. మిగతావన్నీ పనీపాటా లేకుండా బద్ధకంగా ముడుచుకుని పడుంటాయి. పన్నెండు సూర్యనమస్కారాలతో 95 నుంచి 97 శాతం కండరాల్లో కదలిక వస్తుంది. మరుసటి రోజు 'రీఛార్జ్‌' చేసేదాకా అవి చురుగ్గా ఉంటాయి. సూర్యనమస్కారాల ప్రభావాన్ని తెలుసుకోడానికి ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు జరిగాయి. కర్ణాటకలోని గుల్బర్గా విశ్వవిద్యాలయంలో లోతైన పరిశోధనలు చేశారు. సూర్యనమస్కారాల్ని ఆరు రౌండ్లతో ప్రారంభించి...క్రమక్రమంగా ఇరవై నాలుగుదాకా తీసుకెళ్లడం ద్వారా... సాధకుల ఆరోగ్య పరిస్థితిలో వచ్చిన మార్పులను నవోదు చేశారు. ఇవి శ్వాసవ్యవస్థ మీద చాలా ప్రభావం చూపాయని నిపుణులు గుర్తించారు. ఊపిరితిత్తుల పనితీరు గణనీయంగా మెరుగుపడింది. మునుపటి కంటే ఎక్కువ సేపు పనిచేయగల సత్తువ వచ్చింది. శరీర వ్యవస్థ మరింత శక్తిమంతమైంది. బెనారస్‌ హిందూ యూనివర్సిటీ పరిశోధనలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. సూర్యనమస్కారాల వల్ల గుండెకు రక్తాన్ని చేరవేసే నాళాల్లోని అడ్డంకులు తొలగిపోవడం గమనించారు పాండిచ్చేరిలోని అరవిందాశ్రమం ప్రతినిధులు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పుణెశాఖ ప్రతినిధి డాక్టర్‌ దిలీప్‌ శార్దా ఐదువందల మందిపై తాను జరిపిన అధ్యయన ఫలితాల్ని పత్రికాముఖంగా వెల్లడించారు. ముఖ్యంగా ముప్ఫై నుంచి ఎనభై సంవత్సరాలవారిలో... రక్తపోటు క్రమబద్ధం అయినట్టు నిర్ధరించారు. కొలెస్ట్రాల్‌, బ్లడ్‌షుగర్‌, కొవ్వు...తదితరాల్లో ఆరోగ్యకరమైన తేడాను గుర్తించినట్టు చెప్పారు. అమెరికాలోని శాన్‌జోస్‌ స్టేట్‌ యూనివర్సిటీలోనూ కొన్ని అధ్యయనాలు జరిగాయి. వృద్ధాప్యాన్ని మందగింపజేయగల సామర్థ్యం సూర్యనమస్కారాలకు ఉందని విశ్వవిద్యాలయ వర్గాలు ప్రకటించాయి. జీవక్రియతో పాటు గుండె పనితీరు మీద కూడా వీటి ప్రభావం ఉంటుందని కె.బి.గ్రంట్‌ అనే హృద్రోగవైద్యుడు గుర్తించాడు. పొట్టచుట్టూ పేరుకుపోయే కొవ్వును సూర్యనమస్కారాలు సులభంగా కరిగిస్తాయని సాధకులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. 'జీవన తత్వయోగ' సంస్థ ప్రాచీనమైన పద్ధతికి చిన్నచిన్న మార్పులు చేసి డైనమిక్‌ సూర్యనమస్కారాల్ని రూపొందించింది. దీనివల్ల రెండుమూడుసార్లు సాధన చేసినా, అంతకు రెట్టింపు ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కొన్ని పరిమితులూ
సూర్యనమస్కారాలు ఎప్పుడు పుట్టాయి? ఆవిష్కర్త ఎవరనే విషయంలో స్పష్టత లేదు. పతంజలి యోగసూత్రాల్లో ఎక్కడా ఆ ప్రస్తావన లేదు. గత శతాబ్దంలో ఔంధ్‌ రాజైన భవన్‌రావు ప్రాచుర్యంలోకి తెచ్చినట్టు ఓ కథనం. ఆయన లండన్‌లో న్యాయశాస్త్రం చదువుతున్న రోజుల్లో వాటివల్ల తానెంత ప్రయోజనం పొందిందీ ఓ రచయితకి యథాలాపంగా చెప్పారట. వాటి ఆధారంగా 'టెన్‌ పాయింట్‌ వే టు హెల్త్‌' అనే పుస్తకం వచ్చిందనే వాదన ఉంది. ఆ అభిప్రాయాన్ని కాదనలేం. కానీ, భవన్‌రావు సూర్యనమస్కారాల సృష్టికర్త కాకపోవచ్చు. మహాఅయితే, వాటి ప్రచారానికి కృషిచేసి ఉండవచ్చు. వేదకాలం నాటికే అవి ఉనికిలో ఉన్నాయి. ఇప్పుడు, సూర్యనమస్కారాలు ప్రపంచవ్యాప్తంగా పరిచయమయ్యాయి. జపాన్‌లో పన్నెండు ముద్రల్లోంచి ఏడింటిని తీసుకుని సాధన చేస్తున్నారు. వివిధ దేశాల్లోని యోగా కేంద్రాల్లో సూర్యనమస్కారాల్ని కూడా నేర్పుతున్నారు.

వీటిని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో మాత్రం ఎన్నో అనుమానాలు. కొన్ని అపోహలూ ఉన్నాయి. సూర్యోదయ సమయంలో...తూర్పువైపుగా నిలబడి చేయడమే ఉత్తమం. సాధ్యం కాకపోతే, సూర్యాస్తమయంలో అయినా ఫర్వాలేదు. మిట్టమధ్యాహ్నవో, అర్ధరాత్రో చేయడం మంచిది కాదు. చాపకానీ దుప్పటి కానీ పరుచుకుంటే సౌకర్యంగా ఉంటుంది. వదులైన దుస్తులు వేసుకుంటే మంచిది. కాలకృత్యాలు ముగించుకున్నాకే ప్రారంభించాలి. ఖాళీ కడుపుతో చేయాలి. వెంటనే, భోజనం కూడదు. కాస్త సేదదీరాక మంచినీళ్లో పళ్లరసవో తీసుకోవచ్చు. ఎన్నిసార్లు చేయాలనే విషయంలో కచ్చితమైన నిబంధన లేదు. వెుక్కుబడిగా ఒకటిరెండుసార్లు చేయడం వల్ల లాభం ఉండదు. అలా అని, శరీరాన్ని హింసిస్తూ అదేపనిగా చేయడమూ నిష్ఫలమే. వయసు, ఆరోగ్య పరిస్థితి, అందుబాటులో ఉన్న సమయం...వంటి అంశాల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తీవ్రస్థాయిలో రక్తపోటు ఉన్నవారు, హృద్రోగులు, ఆర్థరైటిస్‌, హెర్నియా తదితర సమస్యలతో బాధపడుతున్నవారు దూరంగా ఉండటమే మేలు. వెన్నెముక సమస్యలున్నవారు నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. గర్భిణులు దాదాపు నాలుగు నెలల దాకా చేయవచ్చు. దీనివల్ల సుఖప్రసవం జరుగుతుంది. అయితే, వైద్యుల సలహా తప్పనిసరి. ప్రసవమైన నలభైరోజుల తర్వాత మళ్లీ ప్రారంభించవచ్చు. ఇక, ఎనిమిదేళ్లలోపు పిల్లలు ప్రత్యేకంగా సూర్యనమస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ వయసులో ఆటపాటల్ని మించిన వ్యాయామం ఏముంటుంది? ఆరోగ్యవంతులైన వృద్ధులకూ ఎలాంటి పరిమితుల్లేవు. మహిళలకు నెలసరి రోజుల్లో తీవ్ర రక్తస్రావం వంటి సమస్యలుంటే, ఆ మూడునాలుగు రోజులూ ఆపేయడమే మంచిది.

సూర్యనమస్కారాలు చేస్తున్నప్పుడు...ఒత్తిడి వద్దు, తొందరవద్దు. ప్రశాంతంగా చేయాలి. శరీరానికి పూర్తి విశ్రాంతినివ్వాలి. ఆలోచనలకు పగ్గాలు వేయాలి. సూర్య మంత్రం మీదే దృష్టి కేంద్రీకరించాలి. ఆ తేజస్సును మనలో ఆవాహనం చేసుకోవాలి. క్రమంగా, సూర్యనమస్కారాలకు ప్రాణాయామాన్ని కూడా జోడిస్తే మరీ మంచిది.

సూర్యనమస్కారాలు ఖరీదైన వ్యవహారమేం కాదు. ఏ జిమ్ముకో వెళ్లాల్సిన పన్లేదు. ఓ వారవో, పదిరోజులో సుశిక్షితుడైన గురువు దగ్గర నేర్చుకుంటే చాలు. జీవితాంతం సాధన చేసుకోవచ్చు. యోగాలో ఉన్నట్టు వందలకొద్ది ఆసనాలూ ఉండవు. తికమకపడాల్సిన అవసరం లేదు. కొన్నింటినే పునరావృతం చేస్తూ వెళ్లడమే కాబట్టి, గుర్తుంచుకోవడం పెద్ద సమస్యేం కాదు. 'మాకు తీరిక లేదు'...అని వాదించేవారికి ఒకటే ప్రశ్న? 'రేపు ఏ గుండె జబ్బో వస్తే (రాకూడదనే కోరుకుందాం), సర్జరీ చేయించుకోడానికి కూడా టైం ఉండదా? ఏ రక్తపోటో చక్కెర వ్యాధో వేధిస్తే (వేధించకూడదనే ఆశ), డాక్టర్ల చుట్టూతిరగడానికి కూడా టైం ఉండదా?'. కొంపలేం మునిగిపోవు. రోజూ ఓ అరగంట కేటాయించినా చాలు. ప్రారంభంలో కాస్త నిదానంగా సాగినా, సాధన పెరిగాక వేగం పుంజుకుంటుంది. సూర్యనమస్కారాలు జీవితంలో భాగమైపోతాయి. సూర్యుడికి 'శుభోదయం' చెప్పడంతోనే మీ దినచర్య వెుదలవుతుంది.
* * *
యోగా గురువుగారిని అత్యాధునికమైన జిమ్‌కు తీసుకెళ్లాడు ఓ యువకుడు. అక్కడున్న పరికరాలన్నీ చూపిస్తున్నాడు.
'ఇది ఛాతీ వ్యాయామానికి సంబంధించింది...'
'ఇది చేతులకు సంబంధించింది'
'ఇది పొత్తికడుపు కోసం...'
అలా సాగుతోంది పరిచయం.
చివర్లో అడిగారు గురూజీ... 'ఇంతపెద్ద జిమ్ములో వెుత్తం శరీరానికంతా పనికొచ్చే పరికరం ఒక్కటీ లేదా?'.
బిక్కవెుహం వేశాడు సిక్స్‌ప్యాక్‌ కుర్రాడు.
మొత్తం శరీరానికే కాదు, మనసుకూ బుద్ధికీ కూడా ఒకటే వ్యాయామం...అవే సూర్యనమస్కారాలు!

వెలుగుల దేవుడికి వందనం
సూర్యనమస్కారాలు వెుత్తం పన్నెండు. ఎనిమిదో ఆసనం తర్వాత మళ్లీ నాలుగు, మూడు, రెండు, ఒకటి ఆసనాలే పునరావృతం అవుతాయి. ప్రణామస్థితి నుంచి ప్రణామస్థితి దాకా ఒక రౌండు. నిపుణుల పర్యవేక్షణలో సాధన ప్రారంభించడం మంచిది.











- డాక్టర్‌ పి.జి.కృష్ణమూర్తి, యోగాచార్యులు (ఈనాడు ఆదివారం)
  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Air Pollution , వాయు కాలుష్యము



అభివృద్ధి పేరిట మనం సాధించిన పెద్ద ప్రజారోగ్య సమస్య గాలి కాలుష్యం.గాలి కాలుష్యం గ్రామాల్లో కంటే పట్టణాల్లో ఎక్కువ. మన చుట్టూ ఉండే గాలి, నీరు, నేల, వాతారణం, వివిధ రకాల మొక్కలు, రకరకాల జంతువులు వీటన్నింటిని కలిపి పర్యావరణంగా పేర్కొనవచ్చు. మనం బ్రతకడానికి గాలి, నీరు, నేల, ఆహారం అవసరం. చెట్లు, పక్షులు, జంతువులను మనం జాగ్రత్తగా చూసుకుంటే......... మనకు కావలసినవి వాటి నుండి దొరుకుతాయి.


* వాయు కాలుష్యం, వాతావరణంలోకి రసాయనాలు మరియు పరమాణువులను విడుదల చెయ్యటం.సాధారణంగా గాలిని కలుషితం చేసే వాయువులు పరిశ్రమలు మరియు మోటార్ వాహనాలుచే ఉత్పత్తిచేయ్యబడే కార్బన్ మెనోఆక్సాయిడ్, సల్ఫర్ డైఆక్సైడ్, క్లోరోఫ్లూరోకార్బన్ (సిఎఫ్సి), నైట్రోజన్ ఆక్సైడ్ మొదలైన వాటిని కలిగి ఉంటాయి.కిరణ రసాయనిక ఓజోన్ మరియు పొగమంచు నైట్రోజన్ ఆక్సైడ్ మరియు హైడ్రోకార్బన్లు సూర్యరశ్మితో చర్య జరపటం వలన ఉత్పత్తి అవుతాయి.



* ప్రపంచవ్యాప్తంగా ఏటా గాలి కాలుష్యపు వ్యాధులతో 20 లక్షల మంది చనిపోతున్నారు.

* వాహనాల నుండి, గృహాల నుండి, పొగతాగడం వల్ల క్రిమి సంహారక మందుల నుండి, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషన్ల వాడకం నుండి సాధారణ గాలి కాలుష్యం అవుతుంది.

* నైట్రస్‌ ఆక్సైడ్‌, హైడ్రో కార్బనులు, ఓజోన్‌ డై ఆక్సైడ్‌, సీసం ఎక్కువ ప్రమాదాలు కలిగించే ప్రధాన కాలుష్య కారకాలు.

* గాలి కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల కేన్సర్‌, ఆస్మ్తా, పిల్లల్లో మానసిక ఎదుగుదల లేకపోడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

* గాలి కాలుష్యం తగ్గించడానికి పారిశ్రామిక ప్రాంతాలు నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలి.

* ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా వాడుకోవాలి.

* సొంత కార్ల వాడకం తగ్గించుకోవాలి.

* సైకిలు వాడకం, నడక గాలి కాలుష్యం బాగా తగ్గిస్తాయి.

* పొగ మానాలి.

* చెట్లు పెంచాలి.

*జనాభా పెరుగుదల నియంత్రించుకోవాలి.

* మనమంతా ప్రకృతి ప్రసాదించిన గాలిని రక్షించుకోవాలి. ఈ భూగోళం మనకూ, ఇతర జీవనరాశికి నివాస యోగ్యం చేయాలి.
  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, December 20, 2010

వినికిడి లోపం -కాక్లియర్‌ ఇంప్లాంట్‌లు , Deafness and Cochlear inflants


ఫోలేట్‌' లోపంతో వినికిడి తగ్గుతోంది!

ఒక వయసు వచ్చేసరికి వినికిడి శక్తి కొంత తగ్గటం సహజమే. చెవులలోని అత్యంత సున్నితమైన వినికిడి యంత్రాంగంలో క్షీణతతో పాటు... దీనికి మరికొన్ని అంశాలూ తోడవుతాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

భారీ శబ్దాల బారినపడటం, పోషకాహార లోపం, ముక్కు-చెవులలో ఇన్‌ఫెక్షన్ల వంటి వివిధ అంశాలు వినికిడి శక్తిని దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే వృద్ధాప్యంలో వినికిడి మందగించి, చెవుడు ముంచుకురావటానికి ఫోలేట్‌ (ఫోలిక్‌ యాసిడ్‌), బి12 విటమిన్ల లోపం కూడా కారణమవుతున్నట్టు తాజా అధ్యయనంలో గుర్తించారు.

ఒకే వయసు వృద్ధుల్లో మామూలుగా శబ్దాలు వినగలిగే వారితో పోలిస్తే వినికిడి లోపం ఉన్నవారి రక్తంలో 'ఫోలిక్‌ యాసిడ్‌' స్థాయులు తక్కువగా ఉంటున్నట్టు నైజీరియాలోని ఇబదాన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. ఇక ఫోలిక్‌ యాసిడ్‌ 35 శాతం తక్కువగా ఉంటే పెద్ద పెద్ద శబ్దాలు కూడా వినబడనంతగా చెవుడు ఉంటున్నట్టు గుర్తించారు. ఫోలేట్‌తో పాటు కొద్ది మోతాదులోనైనా 'విటమిన్‌ బి12' లోపం కూడా దీనికి కారణమవుతోంది. ఈ లోపాలను చాలా తేలికగా మందులతో, మాత్రలతో సరిచేయొచ్చని పరిశోధకులు గుర్తించటం విశేషం. ఫోలేట్‌, బి12 విటమిన్లను ఇచ్చినప్పుడు వినికిడి మెరుగుపడటమే కాకుండా... జ్ఞాపకశక్తి పెరగటం, కాళ్లూ చేతుల్లోని నాడుల పని తీరుతో పాటు కేంద్ర నాడీ మండల వ్యవస్థ కూడా శక్తిని పుంజుకుంటున్నట్టు గుర్తించారు.

ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనానికి చాలా ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా వయసు మీదపడుతున్న కొద్దీ సంప్రాప్తించే చెవుడు సమస్యను సరిచేయటం సాధ్యం కాదనే చిరకాల నమ్మకాన్ని ఇది మార్చేస్తుందని.. ఆ లోపాన్ని అధిగమించేందుకు కొందరికైనా ఇది మార్గం చూపుతుందని భావిస్తున్నారు.

వినికిడి లోపం -'కాక్లియర్‌ ఇంప్లాంట్‌'లు , Deafness and Cochlear inflants:

వృద్ధాప్యంలో నడక వేగం తగ్గొచ్చు. కదలికల్లో చురుకు తగ్గొచ్చు. ఆలోచనల్లో ఉరవడి తగ్గొచ్చు. కంటి చూపు మందగించవచ్చు. అలాగే వినికిడి శక్తీ మందగించవచ్చు. అయితే మిగతా లోపాలకూ దీనికీ చాలా తేడా ఉంది. దీనివల్ల మనిషి సామాజిక సంబంధాలే తెగిపోయి.. సంఘజీవనం కోల్పోయి.. ఏదో లోకంలో.. ఒంటరితనంలో కూరుకుపోవచ్చు. సమూహంలోనే ఏకాకిగా మారిపోవచ్చు. డిప్రెషన్లోకి జారిపోవచ్చు. ఒకప్పుడు దీన్ని ఎదుర్కొనటం కష్టంగా ఉండేది. వినికిడి లోపం ఒక స్థాయికి చేరుకున్న తర్వాత.. అందులో కూరుకుపోవటమే తప్పించి విరుగుడు ఉండేది కాదు. కానీ ఆధునిక డిజిటల్‌ శ్రవణ యంత్రాల ఆగమనంతో ఈ కొరత చాలా వరకూ తీరింది. వాటి వల్ల కూడా తీరని తీవ్ర వినికిడి లోపాన్ని ఇప్పుడు 'కాక్లియర్‌ ఇంప్లాంట్‌'లు తీరుస్తున్నాయి. వీటితో ఏ రకం చెముడునైనా అధిగమించే అవకాశం మన సొంతమవుతోంది.

మన వినికిడి అత్యంత సున్నితమైన ప్రక్రియ. అలాగే అత్యంత సంక్లిష్టమైనది కూడా. అందుకే ఒక వయసు వచ్చేసరికి చాలామందికి నిశితమైన ఈ ప్రక్రియలో కాస్త మందకొడితనం మొదలవుతుంది. మన దేశంలో కొన్ని లక్షల మంది ఇలా వయసు వచ్చేసరికి ఎంతోకొంత వినికిడి శక్తి తగ్గి యాతనపడుతున్నారు. 50 ఏళ్లు పైబడిన వారిలో ఇప్పుడు చాలామంది ఎంతోకొంత ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అలాగని వినికిడి సమస్య వృద్ధుల్లోనే అనుకోవటానికి లేదు. వాస్తవానికి ఈ సమస్య- పిల్లలతో సహా ఎవరికైనా, ఏ వయసులోనైనా, ఎప్పుడైనా రావచ్చు. అయితే వృద్ధాప్యంలో పలకరించే చెవుడుకు చాలా ప్రత్యేకతలున్నాయి. వీరిలో చాలామందికి సమస్య వినటంలో కంటే కూడా.. విన్నదాన్ని విడమర్చి అర్థం చేసుకునే శక్తిలో లోపం ఉంటుంది. ఇది వినిపించకపోవటం, చెవుడు వల్ల కాదు.. వృద్ధాప్యంలో సహజంగానే చురుకుదనం తగ్గటం వల్ల వచ్చే సమస్య! వృద్ధాప్యంలో శారీరక భాగాలన్నీ కొంత నెమ్మదించి, వెనకబడి, క్షీణించటం దీనికి మూలం. నిజానికి శబ్దాలు మనందరికీ వినిపించవచ్చు. కానీ వాటిని వినిపించుకుని, అర్థం చేసుకోవటమన్నది మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యాల్సిన పని. వృద్ధాప్యంలో ఈ ప్రయత్నం కాస్త నెమ్మదిస్తుంది. అందుకే చాలామంది వృద్ధులు తమకు సరిగా వినిపించటం లేదని ఖరీదైన మిషన్లు కొని పెట్టేసుకున్నా పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తుంటారు. దీనికి కారణం వినిపించకపోవటం కాదు.. విన్నది గ్రహించుకోలేకపోవటం! కాబట్టి ఆడియాలజిస్ట్‌లు ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే వృద్ధుల్లో వినికిడి సమస్యను ఆడియోమెట్రీ ద్వారా కచ్చితంగా అంచనా వేసి.. వినికిడి యంత్రాల వంటివి సూచిస్తారు.

వినికిడి లోపం రకరకాలు
మన చెవిని ప్రధానంగా మూడు భాగాలుగా చూస్తారు. ఇవి బయటి చెవి, మధ్య చెవి, అంతర్‌ చెవి. వినికిడి లోపానికి అరుదుగా మధ్య చెవి, తరచుగా అంతర్‌ చెవికి సంబంధించిన లోపాలే కారణమవుతుంటాయి. వీటిని ముఖ్యంగా మూడు రకాలుగా విభజిస్తారు.

* కర్ణభేరిలో రంధ్రం వల్ల, కర్ణభేరికి అనుసంధానంగా మధ్య చెవిలో ఉండే మూడు గొలుసు ఎముకల్లో ఒకటి గట్టిపడిపోవటం, వాటిలో మార్పులు రావటం వల్ల ఆ ప్రకంపనలు సరిగా కర్ణభేరికి చేరక కొందరిలో వినికిడి సమస్య తలెత్తుతుంది. అలాగే మధ్య చెవి నుంచి ముక్కుకు ఉండే యూస్టేషన్‌ ట్యూబు మూసుకుపోయి చెవిలో ద్రవాలు, జిగురు వంటి పదార్థాలు పేరుకుపోవటం, మధ్యచెవిలో కణుతులు రావటం వంటి సందర్భాల్లో కూడా కర్ణభేరికి ప్రకంపనలు చేరక వినికిడి తగ్గొచ్చు. ఈ తరహా సమస్యలన్నింటినీ 'కండక్టివ్‌ హియరింగ్‌ లాస్‌' అంటారు.

* ఇక అంతర్‌ చెవి చాలా సున్నితమైనది. చెవిలోని శ్రవణనాడులు బలహీనపడటం, కొన్ని రకాల మందులు వాడినప్పుడు ఈ నాడులు దెబ్బతినటం తదితర కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. వీటన్నింటినీ 'సెన్సరీ న్యూరల్‌ హియరింగ్‌ లాస్‌' అంటారు. అంతర్‌ చెవిలో తలెత్తే ఈ వినికిడి లోపానికి మందులు గానీ సాధారణ శస్త్రచికిత్సల వంటివేవీ గానీ పెద్దగా ఉపయోగపడవు. కొందరికి మధ్య చెవిలోనూ, అంతర్‌ చెవిలోనూ కూడా సమస్యలుండొచ్చు. దాన్ని 'మిక్స్‌డ్‌ హియరింగ్‌ లాస్‌' అంటారు.

* కొందరికి మధ్య చెవి, అంతర్‌ చెవి రెండూ బాగానే ఉండొచ్చుగానీ మెదడులో వినికిడికి సంబంధించిన కేంద్రం దెబ్బతిని ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. ఈ తరహా సమస్యను 'సెంట్రల్‌ ఆడిటరీ ప్రోసెసింగ్‌ డిజార్డర్స్‌' అంటారు. దీనికి మనం చెయ్యగలిగిందేం లేదు. వీటికి తోడు మన చుట్టూ ఉండే ధ్వని కాలుష్యం వల్ల చాలామందిలో మానసిక ప్రవర్తనలో అనేక మార్పుల వల్ల ఏకాగ్రత కోల్పోవటం, చీటికీమాటికీ సహనం కోల్పోవటం, నిశ్శబ్ద వాతావరణంలో ఉండేందుకు మొగ్గుచూపటం వంటి దుష్ప్రభావాలు కనబడుతున్నట్టు శాస్త్రీయంగా రుజువైంది. ఒక వయసు వచ్చే సరికి రకరకాల ఆరోగ్య సమస్యల మూలంగా సాధారణ ఆరోగ్యమూ క్షీణించటం తదితరాల వల్ల శ్రవణ నాడుల్లో సామర్థ్యం, సున్నితత్వం తగ్గటం, శ్రవణ ప్రక్రియ మందగించటం జరుగుతోంది. చాలామంది వృద్ధుల్లో ధ్వని కాలుష్యం కూడా వినికిడి సమస్య జఠిలం కావటానికి దోహదం చేస్తోంది. అయితే దీన్ని ఆడియాలజిస్టుల ద్వారా నిర్ధారించుకోవటం ముఖ్యం.

వినికిడి లోపం ఎప్పుడు?
సాధారణంగా 4-6 అడుగుల దూరం నుంచి ఎవరైనా వ్యక్తి మాట్లాడితే దాన్ని వినటంలో, గ్రహించటంలో ఇబ్బందిగా ఉంటే దాన్ని వినికిడి లోపంగా భావించవచ్చు. టెలిఫోన్లో ఎదుటి వ్యక్తి మాట్లాడేది అర్థం కాకపోవటం, నలుగురిలో సంభాషించేటప్పుడు మాటలు వినపడకపోవటం, మెల్లిగా మాట్లాడితే ఏదో వినపడుతున్నట్టున్నా ఆ విన్నదేమిటో అర్థం కాకపోవటం, టీవీ వాల్యూమ్‌ బాగా పెద్దగా పెట్టుకోవాల్సి వస్తుండటం.. ఒకప్పుడు బాగా మట్లాడేవారు కూడా క్రమేపీ మాటలు తగ్గించేస్తుండటం.. ఇవన్నీ 'వినికిడి లోపాన్ని' పట్టిచెప్పే లక్షణాలు.

కాస్త లోతుగా చూస్తే..
సాధారణంగా మనం వినే మంద్ర ధ్వనులు తక్కువ (లో) ఫ్రీక్వెన్సీలో ఉంటాయి, తీవ్ర స్వరాలు ఎక్కువ (హై) ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. ఉదాహరణకు స్త్రీల కంఠస్వరాలు హైఫ్రీక్వెన్సీ(బారిటోన్‌)లోకి వస్తాయి. పురుషుల కంఠధ్వని (బాస్‌) లోఫ్రీక్వెన్సీ కోవలోకి వస్తుంది. మొత్తమ్మీద మన మాటల్లోని ధ్వనులన్నీ కూడా 250 హెర్జ్‌ నుంచి 8000 హెర్జ్‌ లోపలే ఉంటాయి. ఆపైన ఉండే అతిధ్వనులు (అల్ట్రాసానిక్స్‌) మనకు వినపడవు. కాబట్టి ఈ 0-20 డెసిబుల్స్‌లో ఈ ఫ్రీక్వెన్సీలన్నీ బాగా వినపడుతుంటే మనకు వినికిడి బాగున్నట్టు. మనం వినే శబ్దాల్లో ఈ హై, లో ఫ్రీక్వెన్సీలు రెండూ కలగలిసి ఉంటాయి. ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటే మనం వాటిని గ్రహించటం చాలా కష్టం. ఈ రెండు ఫ్రీక్వెన్సీల శబ్దాలను విని, అర్థం చేసుకుంటేనే గ్రహింపు బాగా ఉంటుంది. కానీ కొందరికి పెద్ద వయసు వచ్చేసరికి హైఫ్రీక్వెన్సీలు సరిగా వినపడవు. వృద్ధాప్యంలో 95% మందిలో ఈ సమస్యే కనిపిస్తుంది. అందుకే చాలామంది వృద్ధులు కొన్ని మాటలు వింటున్నప్పుడు మధ్యలో 'ఆ.. ఏమన్నారు?' అని అడుగుతుంటారు. లోఫ్రీక్వెన్సీలు బాగానే వినపడుతున్నా హైఫ్రీక్వెన్సీల వినికిడి శక్తి తగ్గిపోవటాన్ని 'స్లోపింగ్‌ కర్వ్‌' అంటారు. దీనివల్ల మాటల్లోని అన్ని ధ్వనులూ సరిగా వినపడకపోవటం, వినిపించినా ఒక ధ్వనికి బదులు మరో ధ్వని (టేబుల్‌ అంటే కేబుల్‌లాగా) వినపడటం వంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా హైఫ్రీక్వెన్సీలకు దగ్గరగా ఉండే స, ష, జ, ఝ వంటి స్వరాలు సరిగా అర్థం కాక.. అన్నీ ఒకేలా వినపడతాయి.

* సాధారణంగా లోఫ్రీక్వెన్సీలన్నవి మనం శబ్దం ఉనికిని గుర్తించటానికి ఉపయోగపడితే హైఫ్రీక్వెన్సీలు ఆ వినిపించిన దాన్ని విడమర్చి, విశ్లేషించి అర్థం చేసుకోవటానికి ఉపయోగపడతాయి.

కాబట్టి ఈ హైఫ్రీక్వెన్సీ లోపం ఉన్న వారికి ఏవేవో ధ్వనులు వినపడుతుంటాయిగానీ అవి స్పష్టంగా, విడమర్చి అర్థం కావు. దీంతో అంతా గందరగోళంగా తయారవుతుంది. కాబట్టి వీరిలో

హైఫ్రీక్వెన్సీల వినికిడి లోపం ఎంత తీవ్రంగా ఉంది? దాన్ని ఏయే ఫ్రీక్వెన్సీల్లో ఎంత పెంచాలన్నది ఆడియాలజిస్ట్‌లు పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. వినికిడి లోపం ఒకరిలో ఉన్నట్టు మరొకరిలో ఉండదు. కొందరికి 90లలోనూ చక్కగా వినపడుతుంటే కొందరికి 60లలోనే వినికిడి శక్తి తగ్గొచ్చు. కొందరికి లోఫ్రీక్వెన్సీలు బాగుంటే కొందరిలో అవీ సమస్యగా తయారవ్వచ్చు. కాబట్టి వినికిడి లోపం ఎవరికి వారికే ప్రత్యేకం. దీన్ని కచ్చితంగా నిర్ధారించి అప్పుడు ఎలాంటి వినికిడి యంత్రాలు ఉపయోగపడతాయో సిఫార్సు చేస్తారు.

సులభంగా చెప్పుకోవాలంటే...
0-20 డెసిబుల్స్‌ అన్నది సాధారణ వినికిడి పరిధి అయినా.. 30, 35 డెసిబుల్స్‌ లోపం వచ్చే వరకూ కూడా పెద్దగా లోపంగా అనిపించదు. 40, 45 లోపం వచ్చేసరికి ఎవరైనా కాస్త మెల్లిగా మాట్లాడితే చాలు.. కాస్త బిగ్గరగా మాట్లాడితే బాగుండునని అనిపించటం ఆరంభమవుతుంది. దీంతో ఇంకోసారి చెప్పండని అడుగుతారు. 50, 55 వచ్చేసరికి ముందుకు వంగి ఏకాగ్రతగా వింటూ తరచూ మళ్లీ చెప్పండని అడుగుతుంటారు. 55-60 వస్తే ఈ మనిషి వినిపించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చెయ్యాల్సి వస్తుంది. మాట్లాడే వారిని పక్కన వచ్చి కూర్చోమనటం, ముఖం పెదాల కదలికలు చూడటం, గట్టిగా మాట్లాడమనటం.. ఇవన్నీ మొదలవుతాయి.

సాంకేతిక పరిజ్ఞానంతో..
సాధారణంగా వినికిడి సరిగా లేనివారికి 'ప్యూర్‌టోన్‌ ఆడియోమెట్రీ' పరీక్ష చేయటం ద్వారా ఏయే ధ్వనులు చక్కగా వినపడుతున్నాయన్నది స్పష్టంగా గుర్తించొచ్చు. కాస్త ఎక్కువ సమయం పట్టేదే అయినా ఇది అన్ని పరీక్షల కంటే ఉత్తమమైంది. దీంతో సమస్య ఏ స్థాయిలో, ఎక్కడ ఉందన్నది కచ్చితంగా తెలుస్తుంది. దీనిబట్టి ఆడియాలజిస్ట్‌లు లోపాన్ని అధిగమించేందుకు ఏం చెయ్యాలో, ఎటువంటి యంత్రాలు వాడాలో సూచిస్తారు.

డిజిటల్‌ మార్గం
ఒకప్పుడు అనలాగ్‌ రకం శ్రవణ యంత్రాలు విరివిగా వాడేవారుగానీ ఇవి నాణ్యత రీత్యా చాలా తక్కువస్థాయివి. వీటితో ధ్వని నాణ్యత చాలా తక్కువ. అలాగే ఏదో ఒక శ్రవణ యంత్రాన్ని షాపులో కొనుక్కోవటం కూడా సరైన పద్ధతి కాదు. మనం దృష్టిలోపం ఎంతో తెలుసుకుని కళ్లజోడు వేయించుకున్నట్టే శ్రవణ యంత్రాన్ని కూడా ఎవరికి వారు ప్రత్యేకంగా తీసుకోవాల్సిందే.

చెవుడు ఉన్న వారికి 80-85 శాతం మందికి 'డిజిటల్‌' శ్రవణ యంత్రం ఉపయోగపడుతుంది. దీన్ని ఎవరికివారు వినికిడి లోపాన్ని బట్టి ప్రోగ్రామింగ్‌ (అడ్జస్ట్‌మెంట్‌) చేయించుకునే వీలుంటుంది. 15-20 శాతం మందికి చెవుడు ఈ డిజిటల్‌ వినికిడి యంత్రం స్థాయిని మించి ఉంటుంది, వారికి ఆపరేషన్‌ చేసి చెవి వెనక అమర్చే 'కాక్లియర్‌ ఇంప్లాంట్‌'తో ఉపయోగం ఉంటుంది. మన దృష్టిలోపం లాగానే ఈ వినికిడి లోపం కూడా అలాగే ఉండిపోవచ్చు లేదూ క్రమేపీ (పవర్‌) పెరుగుతూ ఉండొచ్చు. బీపీ, మధుమేహం వంటి కొన్నికొన్ని వ్యాధుల వల్ల వేగంగానూ పెరగొచ్చు.

* ప్రోగ్రామింగ్‌: వినికిడి యంత్రాన్ని ఆడియాలజిస్టులు చెవుడుకు తగ్గట్టుగా ప్రోగ్రామింగ్‌ చేస్తారు. ఒకవేళ వినికిడి లోపం పెరుగుతుంటే- ఈ యంత్రాన్ని అందుకు తగ్గట్టుగా ట్యూనింగ్‌ చేస్తారు.

* డిజిటల్‌ యంత్రాల్లో బయటకు అంతగా కనబడని ఎన్నో రకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆడపిల్లలకు చెవి వెనకాల పెట్టుకునే చిన్నచిన్న, శక్తిమంతమైన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కాస్త ఖరీదు ఎక్కువే అయినా వీటితో జీవన ప్రమాణాలు ఎంతో మెరుగవుతాయి. మున్ముందు ఈ రేట్లు మరింత తగ్గే అవకాశమూ ఉంది.

* వినికిడి లోపం 75 డి.బి. కంటే ఎక్కువ ఉన్నవారికి వినికిడి యంత్రాలతో అంతగా ఉపయోగం ఉండదు. వారికి 'కాక్లియర్‌ ఇంప్లాంట్‌'తో ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా హైఫ్రీక్వెన్సీలు వినపడని వారికి, ఆ లోపం తీవ్రంగా ఉన్నవారికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సంజీవని వంటిది. ఇది డిజిటల్‌ యంత్రాల్లో అంతగా సాధ్యం కాదు. మొత్తానికి డిజిటల్‌ వినికిడి యంత్రం లేదా కాక్లియర్‌ ఇంప్లాంట్‌ల వాడకం పెరిగాక.. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఇవాల్టి రోజున ఏ రకం చెవుడు నుంచైనా బయటపడటం తేలికే అయ్యిందని చెప్పుకోవచ్చు!
గుర్తించే పరీక్షలు
వినికిడి శక్తిని గుర్తించటానికి, విశ్లేషించటానికి ఆడియాలజిస్టులు వివిధ ఆడియోమెట్రీ పరీక్షలు చేస్తారు. ముఖ్యంగా వ్యక్తి స్పందించి చెబుతున్న దాన్ని గుర్తించేవి (సబ్జెక్టివ్‌ పరీక్షలు) కొన్ని అయితే వ్యక్తి స్పందనలతో ప్రమేయం లేకుండా వినికిడి ఎంత ఉందన్నది అంచనా వేసి (ఆబ్జెక్టివ్‌) చెప్పేవి మరికొన్ని. అయితే వృద్ధాప్యంలో మాత్రం ఎక్కువగా వ్యక్తి స్పందనల మీద ఆధారపడి చేసే 'ప్యూర్‌టోన్‌ ఆడియోమెట్రీ' పరీక్షే ఎక్కువగా ఉపయోగపడుతుంది. వారి నుంచి సరైన స్పందన లేనప్పుడు, సందేహాస్పదంగా అనిపించినపుడు ఆబ్జెక్టివ్‌ పరీక్షలు చేస్తారు.

వీటిల్లో బెరా టెస్ట్‌, ఒటోఎకూస్టిక్‌ ఎమిషన్‌ టెస్ట్‌, ఇంపిడెన్స్‌ ఆడియోమెట్రీ టెస్ట్‌లు ముఖ్యమైనవి.

* బెరాటెస్ట్‌: ఆరు నెలల నుంచి ఏడాది లోపు పిల్లల్లో వినికిడి సమస్యను బెరా (బ్రెయిన్‌స్టెమ్‌ ఇవోక్‌డ్‌ రెస్పాన్స్‌డ్‌ ఆడియోమెట్రీ) పరీక్ష ద్వారా గుర్తిస్తారు. స్వల్పంగా మత్తు మందుతో నిద్రపుచ్చి ఈ పరీక్ష చేస్తారు. చెవి వెనక, నుదురు మీద ఎలక్ట్రోడ్‌లు అమర్చి.. చెవి లోపలికి శబ్దాలను పంపిస్తారు. దీని తర్వాత కొద్దిసేపయ్యాక మెదడులో కొన్ని తరంగాలు ఉత్పన్నమవుతాయి. అవి ఎన్ని మిల్లీసెకండ్లలో ఉత్పన్నమయ్యాయన్నదాన్ని బట్టి ఎలక్ట్రోడ్‌లు క్రోడీకరించి గ్రాఫ్‌ రూపంలో ఫలితాలను తెలియజేస్తాయి. ఇందులో వినికిడి సమస్యతో పాటు దానికి ఏ భాగం (మధ్యచెవి, లోపలిచెవి, నాడులు) కారణమవుతుందో కూడా తెలుస్తుంది. దీన్నిబట్టి వినికిడి లోపాన్ని 'అంచనా' వేస్తారు. ఇది వినికిడి లోపం ఎంత ఉండొచ్చన్నది అంచనా వేసే పరీక్ష మాత్రమేగానీ కచ్చితంగా ఇంత ఉందని చెప్పేది కాదు. ఇది ఆబ్జక్టివ్‌ పరీక్ష. సరిగా స్పందించలేని స్థితిలో ఉన్న వారికి ఇది బాగా పనికొస్తుంది.
* ఒటో ఎకూస్టిక్‌ ఎమిషన్‌ టెస్ట్‌: ఇందులో చెవిలోకి కొన్ని శబ్దాలను పంపిస్తారు. అప్పుడు లోపలి చెవిలో నుంచి కొన్ని తరంగాలు ఉత్పన్నమై కర్ణభేరి (టింపానిక్‌ మెంబ్రేన్‌) వైపు ప్రవహిస్తాయి. వాటిని ఈ యంత్రం గ్రహించి కంప్యూటర్‌ ద్వారా క్రోడీకరించి ఒక గ్రాఫ్‌ని ఇస్తుంది. ఇది కూడా వినికిడి శక్తిని అంచనా వేసే పరీక్ష. అయితే మధ్యచెవి కర్ణభేరికి రంధ్రం ఉన్నా, చెవిలో గులిమి ఉన్నా, పరీక్ష చేసే సమయంలో చుట్టుపక్కల ధ్వనికాలుష్యం ఉన్నా ఇందులో ఫలితం సరిగ్గా తేలదు.
* ఇంపిడెన్స్‌ టెస్ట్‌: మధ్య చెవిలో ఏవైనా సమస్యలుంటే అదేమిటన్నది దీని ద్వారా తెలుస్తుంది. గతంలో ఈ సమస్యలను తెలుసుకోవటానికి ఆపరేషన్‌ చేయాల్సి వచ్చేది. ఇంపీడెన్స్‌ అందుబాటులోకి వచ్చాక ఆ బెడద తప్పిపోయింది. ఈ పరీక్షలో చెవిలోకి ఒక గొట్టం పెడతారు. ఈ గొట్టంలో రిసీవర్‌, మైక్రోఫోన్‌, ప్రెషర్‌పంప్‌లు ఉంటాయి. ప్రెషర్‌ ద్వారా కర్ణభేరి బిగుతుగా ఉండేలా చేస్తారు. తర్వాత శబ్దాలను పంపించి వెనక్కి వచ్చిన తరంగాల మోతాదును లెక్కిస్తారు. ఒక రకంగా ఇది మద్దెల వంటి వాటి మీద చర్మం పొరను బిగించి చేసే పరీక్షలాంటిది. ఈ పరీక్షలో కర్ణభేరి కదలికలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. అలాగే ఎముకలకు అంటుకొని ఉండే 'స్టిపిడియస్‌ కండరం' సంకోచాలను బట్టి వినికిడి సామర్థ్యమూ బయటపడుతుంది.
* ప్యూర్‌టోన్‌ పరీక్ష: మూడేళ్లు దాటిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ ధ్వనులు విని స్పందించ గలిగిన వారెవరికైనా ఈ పరీక్ష చెయ్యచ్చు. ఇందులో చెవులకు హెడ్‌ఫోన్స్‌ పెట్టి, రకరకాల పౌనఃపున్యాల శబ్దాలను వినిపిస్తారు. ఏ చెవిలో శబ్దం వినిపించినా మీట నొక్కి స్పందించాల్సి ఉంటుంది. శబ్దాల తీవ్రతను బట్టి వినికిడి స్థాయిని గుర్తిస్తారు. ఉదాహరణకు 25 డెసిబెల్స్‌ దగ్గర అతి తక్కువ శబ్దాన్ని విన్నట్టుగా మీట నొక్కితే.. ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించి వినికిడి స్థాయి ఆ మేరకు ఉన్నట్టు గుర్తించి గ్రాఫ్‌ను రూపొందిస్తారు. ఈ గ్రాఫ్‌ మీద ఒక వైపు 250 నుంచి 8000 (హెర్ట్జ్స్‌) వరకు.. మరోవైపు 0 నుంచి 120 (డెసిబెల్స్‌) వరకు అంకెలుంటాయి. 0-25 డెసిబెల్స్‌ తీవ్రతలో అన్ని ఫ్రీక్వెన్సీల శబ్దాల వినికిడి స్థాయి నమోదైతే వినికిడి మామూలుగా ఉందని అర్థం. 25 డెసిబెల్స్‌ కన్నా వినికిడి స్థాయి మించుతున్నకొద్దీ సాధారణంగా ఉండాల్సిన దానికన్నా వినికిడి లోపం ఆ మేరకు ఉన్నట్లు గుర్తిస్తారు.
రెంటిలోనూ లోపం!
చాలామందికి వినికిడి లోపం రెండు చెవుల్లోనూ ఉంటుంది. అప్పుడే అది లోపం కింద బయటపడుతుంది. వాస్తవానికి ఒక చెవి బాగున్నా కూడా 95% వినికిడి శక్తి బాగానే ఉంటుంది. ఒక చెవే వినపడుతుంటే- 'స్టీరియోఫోనిక్‌' ప్రభావం.. అంటే ధ్వని ఏ దిక్కు నుంచి వస్తోందో చెప్పగలిగే శక్తి ఉండదు. అందుకే ఒకే చెవితో వినేవారు.. ఎవరన్నా పిలిస్తే అన్ని దిక్కులా వెతుక్కుంటుంటారు. అలాగే ఆ చెవితో సెల్‌ఫోన్‌లో మాట్లాడాలన్నా, ఆ చెవిలో గుసగుసలు చెప్పినా వినపడదు. అంతకు తప్పించి ఒక చెవిలో వినికిడి శక్తి బాగున్నవారు మాట్లాడటానికి ఏమీ ఇబ్బంది ఉండదు. వినికిడి బానే ఉంటుంది.

చెయ్యి చేసే మేలు
వినికిడి లోపం మొదలవగానే చాలామంది ముందుకు వంగి, చెవి వెనక చెయ్యి పెట్టుకుని.. డొప్పలా వంచి.. వింటుంటారు. దీన్నే 'కప్పింగ్‌ ఆఫ్‌ ఇయర్స్‌' అంటారు. ఇలా చేయటం వల్ల ధ్వని పరావర్తనానికి అవకాశం పెరుగుతుంది కాబట్టి సాధారణంగా ధ్వని 3-4 డెసిబుల్స్‌ ఎక్కువగా వినపడుతుంది. దీంతో వినికిడి చాలా మెరుగ్గా అనిపిస్తుంది. ఒకప్పుడు వినటానికి దోహదపడేలా ఇలాగే చెవి వెనక పెట్టుకునేందుకు రేకులాంటి పరికరం కూడా వాడేవారు!
తైలాలతో కష్టం, నష్టం
చెవిలో తైలాలు వేస్తే చెవుడు పోతుందన్న ప్రచారం ఉందిగానీ ఇది నిజం కాదు. మన మధ్యచెవి బయటి ప్రపంచంతో ఏ సంబంధమూ లేకుండా కర్ణభేరితోనే మూసుకుపోతుంది. కాబట్టి మనం బయటి నుంచి చెవిలో నూనెలాంటివి వేసినా అవి కర్ణభేరి దగ్గరకు వెళ్లి ఆగిపోవాల్సిందేగానీ లోనికి వెళ్లలేవు. కాబట్టి ఈ తైలాలతో ఏమాత్రం ప్రయోజనం ఉండదు. పైగా వీటి వల్ల లేనిపోని ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల వంటివీ వచ్చే ప్రమాదం ఉంది. ఇక కర్ణభేరిలో రంధ్రం ఉంటే తైలాలు మధ్యచెవిలోకి వెళ్లి పూర్తిగా వినికిడి లోపానికి దారీతీసే అవకాశం ఉంది.

ప్రొ|| వి.యు.నండూర్‌-ప్రొఫెసర్‌ అండ్‌ చీఫ్‌ ఆడియాలజిస్ట్‌-స్పీచ్‌ పెథాలజిస్ట్‌ (రిటైర్డ్‌)-ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రి, కోఠి, హైదరాబాద్‌,.

కొవ్వు పదార్థాలు మన వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి,
Fatty foods Diminish hearing ability


వింటున్నారా?.....'విన్నాను కానీ పూర్తిగా వినిపించలేదు' తరచూ తోటివారికి మీరిచ్చే సమాధానం ఇదే అయితే ఆ తప్పు మీది కాదు జంక్‌ఫుడ్‌దే అంటున్నారు వైద్యులు. జంక్‌ఫుడ్‌లో ఉండే కొవ్వు పదార్థాలు మన వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. రక్తంలో కొవ్వు ఎక్కువగా ఉండటంవల్ల చెవి నుంచి మెదడుకి చేరాల్సిన సంకేతాలకు మధ్యలోనే అంతరాయం ఏర్పడుతుందని గినియా పందులపై చేసిన ఓ పరిశోధనలో తేలింది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌(ఎల్‌డీఎల్‌)ను 50 శాతం మేర తగ్గించుకున్నా ఈ సమస్యనుంచి బయటపడొచ్చు అంటున్నారు వైద్యులు. ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ రక్త ప్రసరణను మందగించేలా చేయడమూ వినికిడి సమస్యకు మరో కారణంగా చెబుతున్నారు. చెడ్డ కొలస్ట్రాల్‌ను దూరం చేయాలంటే ఏం చేయాలంటారా? వ్యాయామంతో పాటు, వివిధ రకాల నట్స్‌ తింటే చాలు.

మధుమేహంతో వినికిడి లోపం-Defective hearing due to Diabetes

మధుమేహంతో గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధులు, చూపు కోల్పోవటం వంటి పలు సమస్యలు పొంచి ఉంటాయని నిపుణులు ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నారు. అయితే దీంతో వినికిడి లోపం ముప్పూ ఉంటోందని పరిశోధకులు కనుగొన్నారు. మధుమేహం లేనివారితో పోలిస్తే ఈ జబ్బుని సరిగా నియంత్రణలో పెట్టుకోలేని వృద్ధ మహిళల్లో వినికిడి లోపం చాలా ఎక్కువగా ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. మధుమేహంతో బాధపడుతున్న చిన్న వయసు మహిళలకూ ఈ ముప్పు పొంచి ఉంటోందని పరిశోధకులు వివరిస్తున్నారు. అయితే పురుషుల్లో ఈ ప్రభావం కనబడలేదు. నిజానికి స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే వినికిడి లోపం ఎక్కువ. అందువల్ల మధుమేహం మూలంగా పురుషుల్లో మరింత అధికంగా వినికిడి లోపం తలెత్తుతున్నా దాన్ని గుర్తించటం కష్టం కావటమే ఇందుకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటే వినికిడి లోపం బారిన పడకుండా, ఒకవేళ ఉన్నా అది మరింత తీవ్రం కాకుండా చూసుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. మధుమేహులు తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటున్నట్టుగానే వినికిడి పరీక్షలూ చేయించుకోవటం అవసరమని తాజా అధ్యయనం రుజువు చేస్తోంది.

Courtesy with Dr.ramakrishna ENT@Eeandu sukhibhava
  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

డయాబెటిక్‌ రెటినోపతి,Diabetic Retinopathy



నేటి ఉరుకుల పరుగులు జీవితంలో చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు తరుచుగా డయాబెటిస్‌ వ్యాధికి గురవుతున్నారు. తెలియని ఒత్తిడి, వంశపారంపర్యం, కాలుష్యం వంటి వాటివల్ల పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఆధునిక జీవితంలోని వేగాన్ని అందుకునేందుకు వ్యక్తులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో ఆహారపు అలవాట్ల నుంచి జీవనశైలి వరకూ ప్రభావితం అవుతున్నది. డయాబెటిస్‌ వ్యాధి లక్షణాలు గుర్తించి, దాని నివారణకు వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు.

డయాబెటిస్‌(మధుమేహ వ్యాధి)
మన శరీరం కోట్లకొద్దీ కణాలతో నిర్మితమై ఉంటుంది. ప్రతి కణానికి శక్తినిచ్చే ఇంధనం ‘గ్లూకోజ్‌’. ఇది రక్తంలో ఉండి, రక్తం ద్వారా అన్ని కణాలకూ చేరుతుంది. ఈ గ్లూకోజ్‌ రక్తంలో తగిన మోతాదులు ఉంటే అన్ని శరీర భాగాలనూ ఆరో గ్య వంతంగా ఉంచుతుంది. ఇదే గనుక మోతాదు మించితే విషంగా మారి అన్ని శరీర భాగాలనూ హరించి వస్తుంది. రక్తంలో గ్లూకోస్‌ను లెవల్స్‌ మోతాదు మించి ఉండటమే డయాబెటిస్‌.

ఘగర్‌ మోతాదును నియంత్రించే హోర్మోన్‌ ఇన్సులిన్‌. ఈ ఇన్సులిన్‌ తక్కువ ఉండడం వల్ల, లేదా దీని పనితనం తక్కువ కావడం వల్ల రక్తంలో షుగర్‌ లెవల్‌ మోతాదుకు మించి పెరిగిపోతుందది. దీనినే డయాబెటిస్‌, మధుమేహం, ఘగర్‌ వ్యాధి అంటారు. ఈ వ్యాధి వల్ల శరీరంలోని అన్ని భాగాలకు ముప్పే. దీని వల్ల చెడి పోవు భాగాలు ముఖ్యంగా కళ్లు, కిడ్నీ, పాదం.

డయాబెటిక్‌ రెటినోపతి...
మన కళ్ళు సజీవ కెమెరాల్లాంటివి. కెమెరాలాగ ఇవి నిరంతరం, మనం చూస్తున్న దృశ్యాలను ఫోటోలు తీసి మెదడుకు పంపిస్తూ ఉంటాయి. కెమెరాలో ఫిల్మ్‌ ఉన్నట్లు మన కంటిలో కూడా ఫిల్మ్‌ ఉంటుంది. ఇదే రెటినా. ఇది ఉల్లి పోరలా పల్చ గా ఉండి కంటి లోపల వెనుకభాగంలో చాపలా విస్తరించి ఉంటుంది. రెటినా కంటిలో అతిముఖ్య భాగం.

రెటినాకు రక్తం సరఫరా చేసే రక్త నాళాలను ‘రెటివల్‌ బ్లడ్‌ వెసెల్స్‌’ అంటారు. ఇవి రెటినాలో శాఖోపశాఖాలుగా విస్తరించి ఉంటాయి. ఘగర్‌ వ్యాధి ఈ రెటినా రక్త నాళాలను బలహీనపరిచి వాటికి తూట్లు పడేలా చేస్తుంది. అందువల్ల ఈ నాళాలు లీక్‌ అవడం మొదలవుతుంది. రెటినాలో ఈ లీకేజీ అంచెలంచెలుగా పెరిగి ఆఖరి స్టేజీలలో తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. ఘగర్‌ వల్ల వచ్చే ఈ ంటి నాళాల జబ్బునే డయాబెటిక్‌ రెటినోపతి అంటారు. రక్తంలో ఉన్న నీరు లేదా క్రొవ్వు పదార్దాలు లీక్‌ అవ్వచ్చు లేదా రక్తమే లీక్‌ అవ్వచ్చు.

రక్తం లీకేజీలను ‘రెటినల్‌ హెమరేజెస్‌’ అంటారు. నీటి లీకేజీని ఎడిమా అని, క్రొ వ్వు పదార్దాల లీకేజీని ‘ఎక్యుడేట్స్‌’ అని అంటారు. ఈ వ్యాధి స్టేజీలుగా పెరిగి ఆఖరి దశలో తీవ్ర రక్తస్రావం జరుగును. ఈ ఆఖరి స్టేజిలలో పేషెంటుకు చూపు తగ్గి కంటి లక్షణాలు కనిపించును అంతవరకు పేషెంటుకు తన కంటిలో ఉన్న ప్రమాదం గురించి ఏ ఒక్క క్లూ కూడా ఉండదు. కంటిలో ఏ విధమైన అవస్థయూ ఉండదు. రోగి తన కంటిలో అవస్థ మొదలయ్యాక, రెటినా స్పెషలిస్ట్‌ వద్దకు వెళితే, అప్పటికే వ్యాధి ఆఖరి స్టేజీలలో ఉండి, ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఇలాంటి పరి స్థతిలో శాశ్వతంగా అంధులయ్యే అవకాశం ఉన్నది.

డయాబెటిస్‌ రెటినోపతి అంధత్వానికి చికిత్స లేదు. నివారణ ఒక్కటే మార్గం...
ఈ వ్యాధిని మనం తగిన సమయంలో లేజర్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చి, ఇంకా ముదరకుండా నివారించవచ్చు. అంతే గాని దీనిని మొత్తంగా తొలగించలేం. అంటే అంధత్వం రాకుండా ఆపవచ్చు, కానీ వచ్చాక ఏమీ చెయ్యలేం.

డయాబెటిక్‌ రెటినోపతికి ఒకటే చికిత్స. దీనిని మనం తొలి దశలోనే గ్రహించి, అవసరమైనప్పుడు లేజర్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం ద్వారా, వ్యాధి ముదరకుండా ఆపవచ్చు. అంటే ఈవ్యాధిని మొక్కగా ఉన్నప్పుడే త్రుంచేయాలి. అది పెరిగి పెద్దదైతే ఏమీ చెయ్యలేం. అంధత్వం ఖాయం.
ఘగర్‌ ఉన్న ప్రతివారు క్రమం తప్పకుండా రెటినా స్పెషలిస్ట్‌చే రెటినా స్క్రీనింగ్‌ చేయించుకోవాలి. అవసరమైనప్పుడు రెటినా యాంజియోగ్రఫీ, లేసర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకోవాలి. క్రమశిక్షణతో ఈ విధానాన్ని పాటించడం వల్ల మాత్రమే ఈ వ్యాధి వల్ల వచ్చు అంధత్వాన్ని ఆపగలం.
ఈ వ్యాధి గురించిన కొన్ని సందేహాలు- సూచనలు

డయాబెటిక్‌ రెటినోపతి వ్యాధి ఎంత సీరియస్‌?
శరీరానికి హార్ట్‌ ఎటాక్‌ ఎంత సీరియస్సో, ఆఖరి స్టేజీల్లో ఈ వ్యాధి కంటి చూపుకు సంబంధించి అంత సీరియస్‌.

‘గుడ్‌ ఘగర్‌ కంట్రోల్‌’ అంటే ఏమిటి?
తినక ముందు ఘగర్‌ లెవల్‌ 110ఎంజి శాతం, తిన్న తరువాత150నుంచి160ఎంజి శాతం ఉండటాన్నే గుడ్‌ షుగర్‌ కంట్రోల్‌ అంటారు.

డయాబెటిస్‌ రెటినోపతి వచ్చే అవకాశాలు ఎవరిలో ఎక్కువ?
చాలాకాలం నుంచి ఘగర్‌ ఉన్న వాళ్ళు.
ఘుగర్‌ లెవల్స్‌ను ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంచుకోనివారు.
ఘగర్‌ లెవల్స్‌లో వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు.
ఘగర్‌తో పాటు బి.పి, హార్ట్‌ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం తదితర అవస్థలు ఉన్నవారు.
ఈ పై వారిలో కంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

డయాబిటిక్‌ రెటినోపతిని ముందుగా గుర్తించడం ఎలా?
పేషెంటు తనకు తానుగా ఈ వ్యాధిని గుర్తించడం సాధ్యం కాని పని. దీనిని గుర్తించడానికి ఒకే ఒక మార్గం డైలేటెడ్‌ రెటినల్‌ ఎగ్జామినేషన్‌ (కంటి పాపను పెద్దదిగా చేసి, రెటినా పరీక్ష చేయడం).
డయాబిటిక్‌ రెటినోపతి ఒక స్టేజిగా ప్రారంభమై అంచెలంచెలుగా పెరుగుతూ పోతుంది. తొలుత స్టేజీలలో పేషెంటుకు ఏ విధమైన కంటి లక్షణాలూ ఉండవు. ఈ వ్యాధి బాగా ముదిరి ఆఖరి స్టేజీకి వెళ్లినపుడు మాత్రం కంటి చూపు తగ్గుతుంది. అంతవరకూ పేషెంటుకు తన కంటిలో ఉన్న ప్రమాదం గురించి ఏ మాత్రం అనుమానం రాదు. దురదృష్టవశాత్తు ఈ ఆఖరి దశలలో చికిత్స ప్రభావవంతంగా ఉండదు. పేషెంటు జీవితాంతం గుడ్డివాడిగా ఉండే పరిస్థతి ఏర్పడవచ్చు. ఈ వ్యాధి ఒక బాంబు లాంటిది. ఇది కంటిలో ఉన్నప్పుడు ఏ లక్షణాలూ ఉండవు. అది పేలిప్పుడు మాత్రమే దాని లక్షణాలు బయటపడతాయి. కాని అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయి ఉంటుంది. వ్యాధిని మొదలే గ్రహించి బాంబును ఏరి పారెయ్యడమొక్కటే దీనికి నివారణ. ఈ విషయం తెలియక చాలామంది ఘగర్‌ వ్యాధిగ్రస్తులు, తమ కంటిలో ఏమీ అవస్థ లేదనే అపోహలో ఉండి, ఆఖరి స్టేజీలలో మాత్రమే రెటినా స్పెషలిస్టు వద్దకు వెళ్లడం జరుగుతుంది. ఇందువల్లనే మన ప్రాంతంలో ఈ వ్యాధి మూలంగా గుడ్డి వారిగా మారిన వారి సంఖ్య చాలా హెచ్చుగా ఉన్నది.

ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటి?
ఈ వ్యాధికి ఎర్లీ వార్నింగ్‌ సైన్స్‌(ముందుగానే హెచ్చరించు లక్షణాలు) ఏమీ ఉండవు. ఆఖరి దశలలో దీని లక్షణాలు కని పిస్తాయి. ఆకస్మాత్తుగా చూపు పోవడం, కంటి ముందు నల్లటి చుక్కలు కనిపించడం కొన్ని లక్షణాలు. ఇవన్నీ కంటిలో తీవ్ర రక్తస్రావం అయినప్పుడు కనిపించే లక్షణాలు. (రెటినాలో సూక్ష్మభాగం వాపు) వచ్చినపుడు చూపు మందగిస్తుంది.

ప్యూపిల్‌ డైలటేషన్‌ అంటే ఏమిటి?
రెటినా మన కనుగుడ్డు లోపల, వెనుకభాగంలో ఒక స్క్రీన్‌లా పరచుకొని ఉంటుంది. దీనిని చూడడానికి ఒకే ఒక మార్గం కనుపాప. మామూలుగా మన కనుపాప చిన్నదిగా ఉంటుంది. అందులోంచి మొత్తం రెటినా కనిపించదు. (సినిమా ధియే టర్‌ హాలులో, మనం బయట నిలబడి తలుపు సందులో నుంచి చూడటం లాంటిది. ఆ తలుపు ఎంత పెద్దగా తెరచిఉంటే మనకు అంత స్క్రీన్‌ కనిపిస్తుంది). మన కనుపాప తలుపు సందువంటిది. దానిని పెద్దదిగా చేస్తే మనకు లోపల రేటినా మొత్తంగా కనిపిస్తుంది. పరీక్ష క్షుణ్ణంగా చేయగలం. కనుపాపలు పెద్దదిగా చేసే ప్రక్రియనే ఫ్యూపిల్‌ డైలటేషన్‌ అంటారు. దీనికోసం కంటిలో ఒక చుక్కల మందు వేస్తారు. దీనికి కనీసం అరగంట నుంచి గంటన్న రవకు సమయం పడుతుంది. దీని తర్వాత మూడు, నాలుగు గంటల పాటు దగ్గరి చూపు కొద్దిగా మసగ్గా మారుతుంది. అలాగే కొద్దిసేపు ఫోటో ఫోభియా (వె లుగును చూడలేని స్ధితి) ఉంటుంది. ఇవి ఏమాత్రం ప్రమాదం లేనివి.

రేటీనా స్క్రీనింగ్‌ అంటే...
మన శరీరంలోని కొన్ని వ్యాధులు మొక్కదశలో ఏ విధమైన లక్షాణాలూ చూపించవు. వ్యాధి పెరిగి పెద్ద మానైనప్పుడే దాని లక్షణాలు బయట పడుతాయి. కానీ అప్పటికే పరిస్ధితి విషమిస్తుంది. మానును పీకి పారేయడం కుదరని పని. క్యాన్సర్‌ వ్యాధి దీనికి ఉదహరణ. డయాబెటిక్‌, రెటినోపతి కూడ ఈ కోవలేకే వస్తుంది. దీనిని మొక్క దశలోనే తుడిచి వేయాలి. ఆలా చేయ్యాలంటే ఎర్లీ స్టేజీలోనే దానిని గ్రహించాలి. రేటినా స్పెషలిస్టుకు చూపించి రేటినాలో వ్యాధి ఉన్నది లేనిది చూసుకో వాలి. దీనినే రెటీనా స్క్రీనింగ్‌ అంటారు.

ప్రివెన్షన్‌ అనగానేమి...
రేటినా స్క్రీనింగ్‌లో వ్యాధి ఉన్నదని, బయటపడితే అది ఇంకా ముదిరి అంధత్వం రాకుండా ఆపడానికి లేజర్‌ ట్రీట్‌మెంటు ఇవ్వాలి. దీనినే ప్రివెన్షన్‌ అంటారు. అంధత్వ నిరోధక చికిత్స అన్న మాట.

రెటినాటలో ఇస్కీమియా అంటే ఏమిటి
రెటినాలో రక్తం లీక్‌ కావడం వల్ల కొన్ని రెటినా భాగాలకు రక్తం అందక నిర్వీర్యం అయిపోతాయి. ఇలా చచ్చుబడిన భాగా లనే ఇస్కీమీక్‌ ఏరియాస్‌ అంటారు. ఈ ఇస్వీమిక్‌ భాగాలు విషం చిందించి మిగిలిన మాములు భాగాలను కూడ నాశనం చేస్తుంది.

ఫండస్‌ ఫ్లోరెసిన్‌ యాంజీయోగ్రాఫీ అంటే...
రెటినా స్క్రీనింగ్‌లో మనకు లీకేజీ ఎఫెక్ట్‌‌స తెలుస్తాయి. కానీ అవి ఎక్కడ నుంచి లీక్‌ అవుతున్నాయనేది తెలియదు. యాంజి యోగ్రాఫీలో మనకు లీకేజీ స్పాట్స్‌ తెలుస్తాయి. అలాగే రెటినల్‌ ఇస్కీమియా వగైరాల గురించి మనకు అవగాహన వ స్తుంది. ఈ రిపోర్టు బట్టి లేజర్‌ ట్రీట్‌మెంటుకు ఎన్ని సిట్టింగ్స్‌ అవసరమనేది నిర్ధారిస్తారు. కొన్ని రకాల రిపోర్ట్సు వస్తే కంటి ఇంజక్షన్‌ సైతం ఇవ్వాలి ఉంటుంది.

దీని వల్ల సైడ్‌ ఎఫెక్ట్‌‌స ఏమైనా ఉన్నాయా...?
దీని తర్వాత రెండు రోజుల వరకు పెషంట్‌కు మూత్రం ఆరెంజ్‌ రంగులో వస్తుంది. చర్మం కూడ కొద్దిగా పసుపు రంగులోకి మారొచ్చు, కానీ ఇవన్నీ తాత్కలికమే. కొద్ది మందికి ఇంజక్షన్‌ తర్వాత వాంతి కావచ్చు. చాల అరుదుగా అలర్జిక్‌ రియాక్షన్‌ కూడా కావచ్చు.

రెటినా స్క్రీనింగ్‌ ఎవరితో చేయించుకోవాలి?
రెటినా వ్యాధులలో ప్రత్యేక శిక్షణ పొందిన రెటినా స్పెషలిస్టు దీనికి సరైన వ్యక్తి. వీరు లభ్యం కాకపోతే రెటినా పరీక్షలో అనుభవం ఉండి ఆ పరికారాలు ఉన్న ఏ డాక్టరైనా సరే.

రెటినా స్క్రీనింగ్‌ ఎప్పుడు చేయించుకోవాలి, తిరిగి ఎప్పుడు అవసరం?
డయాబెటిస్‌ ఉందని నిర్ధారణ అయిన వెంటనే రెటినా స్క్రీనింగ్‌ చేయించుకోవాలి. లోపల ఉన్న రెటినా పరిస్ధితిని బట్టి తిరి గి ఎప్పుడు, ఎప్పుడు స్క్రీనింగ్‌ అవసరం అనేది చెప్తారు. సామాన్యంగా ఏడాదికి ఒక్కసారి చేయించుకోవాలి.

లేజర్‌ ట్రీట్‌మెంటు ఎవరితో చేయించుకోవాలి..
లేజర్‌ ట్రీట్‌మెంటు క్లీష్టమైన ప్రక్రియ. దీని గురించి మంచి అవగాహన, శిక్షణ ఉన్న రెటినా స్పెషలిస్టుతోనే చేయించు కోవాలి.

లేజర్‌ ట్రీట్‌మెంటు ఒక సారి చేయించుకుంటే సరిపోతుందా...?
ముమ్మాటికీ అరికట్టదు. మాములుగా మూడు నుంచి 5 తడవలు అవసరం. రోగికి షుగర్‌ ఉన్నంత కాలం, డయాబెటిక్‌ రెటినోపతి కూడ వారితోనే ఉంటుంది. షుగర్‌కు ఎలాగైతే అప్పుడప్పుడు పరీక్షలు చేయించుకుంటారో రెటినాకు కూడ పరీక్షలు చేయించుకోవాలి. అవసరం పడ్డపుడు లేజర్‌ పరీక్షలు సైతం చేయించుకోవాలి.

లేజర్‌ ట్రీట్‌మెంట్‌ వల్ల చూపు పెరగుతుందా...?
పెరగదు. ఇది ప్రెవెంటివ్‌ మాత్రమే. లేజర్‌ ట్రీట్‌మెంటు వ్యాధి ఇంకా పెరగకుండా, స్టెబిలైజ్‌ మాత్రమే చేస్తుంది. అంతేకానీ పోయిన చూపును తీసుకురాదు.

నాకు చాల సంవత్సరాల నుంచి షుగర్‌... కంటిలో ఏ అవస్థాలేదు, అయినా రెటినా స్క్రీనింగ్‌ చేయించు కోవాలా...?
తప్పకుండా చేయించు కోవాలి, మీకు కంటి లక్షణాలు కనిపించే సరికి లోపలి వ్యాధి పూర్తిగా ముదిరిపోయి ఉంటుంది. అంతవరకు మీరు ఆగితే శాశ్వతంగా అంధులయ్యే ఆస్కారం ఉంటుంది.

నాకు చాల ఏళ్ల నుంచి షుగర్‌. ఎప్పుడు రెటినా స్క్రీనింగ్‌ చేయించుకోలేదు, నిన్న సడన్‌గా చూపు పోయింది ఏమి చేయాలి...?
మీకు కంటిలోపల తీవ్ర రక్తస్రావం అయి ఉంటుంది. రెటినల్‌ డిటాచ్‌మెంట్‌ కూడా ఉండవచ్చు. ఇలాంటి పరిస్ధితుల్లో క్లిష్టమైన రెటినల్‌ సర్జరి అవసరం పడవచ్చు. చూపు తిరిగి వచ్చే అవకాశాలు మాత్రం చాలా తక్కవ.

రెగ్యులర్‌ రెటినా స్క్రీనింగ్‌, లేజర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే సరిపోతుందా...?
చాలా వరకు అవును. కానీ షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటేనే ట్రీట్‌మెంటు సక్రమంగా పనిచేస్తుంది. షుగర్‌ ఎక్కవగా ఉం టే లేజర్‌ ట్రీట్‌మెంటు తీసుకున్నా వ్యాధి తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నది. షుగర్‌ మాత్రమే కాకుండా బి.పి, ఎనీమియా, కిడీ్ని సమస్యలు ఇతర అంశాలు అన్నింటిని నార్మల్‌గా ఉంచుకోవాలి.

షుగర్‌ కంట్రోల్‌లో ఉంటే సరిపోతుందా...? ఇంకేమైనా పరీక్షలు అవసరమా...?
టోటల్‌ చెకప్‌ చేయించుకోవాలి. ముఖ్యంగా కిడ్ని, హార్ట్‌ పరీక్షలు చేయించుకోవాలి. బ్లడ్‌ లిపిడ్‌ కూడ చాలా అవసరం. వీటి గురించి డయాబిటాలజిస్టుతో డిస్కస్‌ చేయాలి.

నేను రెటినా స్పెషలిస్టు వద్దకు వెళ్లినప్పుడల్లా నాకంట్లో చుక్కల మందు వేసి ఒక గంటసేపు కూర్చోబెడతారు. అది ఎందుకు...? అది అంత అవసరమా...?
అవును, రెటినా పరీక్షకు చాలా అవసరం.ఈ చుక్కల మందు కంటి పాపను పెద్దదిగా చేసి రెటినా యొక్క వివిధ భాగాలను పరీక్ష చేయుటకు వీలు కల్పిస్తుంది.

రెటినల్‌ సర్జరి అంటే ఏమిటి...అది ఎప్పుడు అవసరం...?
రెటినాను కొద్దిగానైనా బతికించడానికి చేసే చికిత్సను విట్రియో రెటినల్‌ సర్జరి అంటారు. కాంప్లికెటెడ్‌ స్టేజీలలో దీని అవసరం పడుతుంది. ఇది ఆఖరి ప్రయత్నం అన్ని దారులు మూసుకుపోయి ఇక ఏమీ చేయలేని పరిస్ధితుల్లో ఇది చేస్తారు. దీని ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉంటాయి. దీని అవసరం రాకుండా చూసుకోవడమే ఉత్తమం.

-డా.జి.మురళీమోహన్‌, డయాబెటిస్‌ వైద్య నిపుణులు,కామినేని ఆసుపత్రి,ఎల్బీనగర్‌, హైదరాబాద్‌,
  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/