నేటి ఉరుకుల పరుగులు జీవితంలో చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు తరుచుగా డయాబెటిస్ వ్యాధికి గురవుతున్నారు. తెలియని ఒత్తిడి, వంశపారంపర్యం, కాలుష్యం వంటి వాటివల్ల పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఆధునిక జీవితంలోని వేగాన్ని అందుకునేందుకు వ్యక్తులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో ఆహారపు అలవాట్ల నుంచి జీవనశైలి వరకూ ప్రభావితం అవుతున్నది. డయాబెటిస్ వ్యాధి లక్షణాలు గుర్తించి, దాని నివారణకు వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు.
డయాబెటిస్(మధుమేహ వ్యాధి)
మన శరీరం కోట్లకొద్దీ కణాలతో నిర్మితమై ఉంటుంది. ప్రతి కణానికి శక్తినిచ్చే ఇంధనం ‘గ్లూకోజ్’. ఇది రక్తంలో ఉండి, రక్తం ద్వారా అన్ని కణాలకూ చేరుతుంది. ఈ గ్లూకోజ్ రక్తంలో తగిన మోతాదులు ఉంటే అన్ని శరీర భాగాలనూ ఆరో గ్య వంతంగా ఉంచుతుంది. ఇదే గనుక మోతాదు మించితే విషంగా మారి అన్ని శరీర భాగాలనూ హరించి వస్తుంది. రక్తంలో గ్లూకోస్‌ను లెవల్స్ మోతాదు మించి ఉండటమే డయాబెటిస్.
ఘగర్ మోతాదును నియంత్రించే హోర్మోన్ ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ తక్కువ ఉండడం వల్ల, లేదా దీని పనితనం తక్కువ కావడం వల్ల రక్తంలో షుగర్ లెవల్ మోతాదుకు మించి పెరిగిపోతుందది. దీనినే డయాబెటిస్, మధుమేహం, ఘగర్ వ్యాధి అంటారు. ఈ వ్యాధి వల్ల శరీరంలోని అన్ని భాగాలకు ముప్పే. దీని వల్ల చెడి పోవు భాగాలు ముఖ్యంగా కళ్లు, కిడ్నీ, పాదం.
డయాబెటిక్ రెటినోపతి...
మన కళ్ళు సజీవ కెమెరాల్లాంటివి. కెమెరాలాగ ఇవి నిరంతరం, మనం చూస్తున్న దృశ్యాలను ఫోటోలు తీసి మెదడుకు పంపిస్తూ ఉంటాయి. కెమెరాలో ఫిల్మ్ ఉన్నట్లు మన కంటిలో కూడా ఫిల్మ్ ఉంటుంది. ఇదే రెటినా. ఇది ఉల్లి పోరలా పల్చ గా ఉండి కంటి లోపల వెనుకభాగంలో చాపలా విస్తరించి ఉంటుంది. రెటినా కంటిలో అతిముఖ్య భాగం.
రెటినాకు రక్తం సరఫరా చేసే రక్త నాళాలను ‘రెటివల్ బ్లడ్ వెసెల్స్’ అంటారు. ఇవి రెటినాలో శాఖోపశాఖాలుగా విస్తరించి ఉంటాయి. ఘగర్ వ్యాధి ఈ రెటినా రక్త నాళాలను బలహీనపరిచి వాటికి తూట్లు పడేలా చేస్తుంది. అందువల్ల ఈ నాళాలు లీక్ అవడం మొదలవుతుంది. రెటినాలో ఈ లీకేజీ అంచెలంచెలుగా పెరిగి ఆఖరి స్టేజీలలో తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. ఘగర్ వల్ల వచ్చే ఈ ంటి నాళాల జబ్బునే డయాబెటిక్ రెటినోపతి అంటారు. రక్తంలో ఉన్న నీరు లేదా క్రొవ్వు పదార్దాలు లీక్ అవ్వచ్చు లేదా రక్తమే లీక్ అవ్వచ్చు.
రక్తం లీకేజీలను ‘రెటినల్ హెమరేజెస్’ అంటారు. నీటి లీకేజీని ఎడిమా అని, క్రొ వ్వు పదార్దాల లీకేజీని ‘ఎక్యుడేట్స్’ అని అంటారు. ఈ వ్యాధి స్టేజీలుగా పెరిగి ఆఖరి దశలో తీవ్ర రక్తస్రావం జరుగును. ఈ ఆఖరి స్టేజిలలో పేషెంటుకు చూపు తగ్గి కంటి లక్షణాలు కనిపించును అంతవరకు పేషెంటుకు తన కంటిలో ఉన్న ప్రమాదం గురించి ఏ ఒక్క క్లూ కూడా ఉండదు. కంటిలో ఏ విధమైన అవస్థయూ ఉండదు. రోగి తన కంటిలో అవస్థ మొదలయ్యాక, రెటినా స్పెషలిస్ట్ వద్దకు వెళితే, అప్పటికే వ్యాధి ఆఖరి స్టేజీలలో ఉండి, ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఇలాంటి పరి స్థతిలో శాశ్వతంగా అంధులయ్యే అవకాశం ఉన్నది.
డయాబెటిస్ రెటినోపతి అంధత్వానికి చికిత్స లేదు. నివారణ ఒక్కటే మార్గం...
ఈ వ్యాధిని మనం తగిన సమయంలో లేజర్ ట్రీట్‌మెంట్ ఇచ్చి, ఇంకా ముదరకుండా నివారించవచ్చు. అంతే గాని దీనిని మొత్తంగా తొలగించలేం. అంటే అంధత్వం రాకుండా ఆపవచ్చు, కానీ వచ్చాక ఏమీ చెయ్యలేం.
డయాబెటిక్ రెటినోపతికి ఒకటే చికిత్స. దీనిని మనం తొలి దశలోనే గ్రహించి, అవసరమైనప్పుడు లేజర్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం ద్వారా, వ్యాధి ముదరకుండా ఆపవచ్చు. అంటే ఈవ్యాధిని మొక్కగా ఉన్నప్పుడే త్రుంచేయాలి. అది పెరిగి పెద్దదైతే ఏమీ చెయ్యలేం. అంధత్వం ఖాయం.
ఘగర్ ఉన్న ప్రతివారు క్రమం తప్పకుండా రెటినా స్పెషలిస్ట్‌చే రెటినా స్క్రీనింగ్ చేయించుకోవాలి. అవసరమైనప్పుడు రెటినా యాంజియోగ్రఫీ, లేసర్ ట్రీట్‌మెంట్ చేయించుకోవాలి. క్రమశిక్షణతో ఈ విధానాన్ని పాటించడం వల్ల మాత్రమే ఈ వ్యాధి వల్ల వచ్చు అంధత్వాన్ని ఆపగలం.
ఈ వ్యాధి గురించిన కొన్ని సందేహాలు- సూచనలు
డయాబెటిక్ రెటినోపతి వ్యాధి ఎంత సీరియస్?
శరీరానికి హార్ట్ ఎటాక్ ఎంత సీరియస్సో, ఆఖరి స్టేజీల్లో ఈ వ్యాధి కంటి చూపుకు సంబంధించి అంత సీరియస్.
‘గుడ్ ఘగర్ కంట్రోల్’ అంటే ఏమిటి?
తినక ముందు ఘగర్ లెవల్ 110ఎంజి శాతం, తిన్న తరువాత150నుంచి160ఎంజి శాతం ఉండటాన్నే గుడ్ షుగర్ కంట్రోల్ అంటారు.
డయాబెటిస్ రెటినోపతి వచ్చే అవకాశాలు ఎవరిలో ఎక్కువ?
చాలాకాలం నుంచి ఘగర్ ఉన్న వాళ్ళు.
ఘుగర్ లెవల్స్‌ను ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంచుకోనివారు.
ఘగర్ లెవల్స్‌లో వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు.
ఘగర్‌తో పాటు బి.పి, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం తదితర అవస్థలు ఉన్నవారు.
ఈ పై వారిలో కంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
డయాబిటిక్ రెటినోపతిని ముందుగా గుర్తించడం ఎలా?
పేషెంటు తనకు తానుగా ఈ వ్యాధిని గుర్తించడం సాధ్యం కాని పని. దీనిని గుర్తించడానికి ఒకే ఒక మార్గం డైలేటెడ్ రెటినల్ ఎగ్జామినేషన్ (కంటి పాపను పెద్దదిగా చేసి, రెటినా పరీక్ష చేయడం).
డయాబిటిక్ రెటినోపతి ఒక స్టేజిగా ప్రారంభమై అంచెలంచెలుగా పెరుగుతూ పోతుంది. తొలుత స్టేజీలలో పేషెంటుకు ఏ విధమైన కంటి లక్షణాలూ ఉండవు. ఈ వ్యాధి బాగా ముదిరి ఆఖరి స్టేజీకి వెళ్లినపుడు మాత్రం కంటి చూపు తగ్గుతుంది. అంతవరకూ పేషెంటుకు తన కంటిలో ఉన్న ప్రమాదం గురించి ఏ మాత్రం అనుమానం రాదు. దురదృష్టవశాత్తు ఈ ఆఖరి దశలలో చికిత్స ప్రభావవంతంగా ఉండదు. పేషెంటు జీవితాంతం గుడ్డివాడిగా ఉండే పరిస్థతి ఏర్పడవచ్చు. ఈ వ్యాధి ఒక బాంబు లాంటిది. ఇది కంటిలో ఉన్నప్పుడు ఏ లక్షణాలూ ఉండవు. అది పేలిప్పుడు మాత్రమే దాని లక్షణాలు బయటపడతాయి. కాని అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయి ఉంటుంది. వ్యాధిని మొదలే గ్రహించి బాంబును ఏరి పారెయ్యడమొక్కటే దీనికి నివారణ. ఈ విషయం తెలియక చాలామంది ఘగర్ వ్యాధిగ్రస్తులు, తమ కంటిలో ఏమీ అవస్థ లేదనే అపోహలో ఉండి, ఆఖరి స్టేజీలలో మాత్రమే రెటినా స్పెషలిస్టు వద్దకు వెళ్లడం జరుగుతుంది. ఇందువల్లనే మన ప్రాంతంలో ఈ వ్యాధి మూలంగా గుడ్డి వారిగా మారిన వారి సంఖ్య చాలా హెచ్చుగా ఉన్నది.
ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటి?
ఈ వ్యాధికి ఎర్లీ వార్నింగ్ సైన్స్(ముందుగానే హెచ్చరించు లక్షణాలు) ఏమీ ఉండవు. ఆఖరి దశలలో దీని లక్షణాలు కని పిస్తాయి. ఆకస్మాత్తుగా చూపు పోవడం, కంటి ముందు నల్లటి చుక్కలు కనిపించడం కొన్ని లక్షణాలు. ఇవన్నీ కంటిలో తీవ్ర రక్తస్రావం అయినప్పుడు కనిపించే లక్షణాలు. (రెటినాలో సూక్ష్మభాగం వాపు) వచ్చినపుడు చూపు మందగిస్తుంది.
ప్యూపిల్ డైలటేషన్ అంటే ఏమిటి?
రెటినా మన కనుగుడ్డు లోపల, వెనుకభాగంలో ఒక స్క్రీన్‌లా పరచుకొని ఉంటుంది. దీనిని చూడడానికి ఒకే ఒక మార్గం కనుపాప. మామూలుగా మన కనుపాప చిన్నదిగా ఉంటుంది. అందులోంచి మొత్తం రెటినా కనిపించదు. (సినిమా ధియే టర్ హాలులో, మనం బయట నిలబడి తలుపు సందులో నుంచి చూడటం లాంటిది. ఆ తలుపు ఎంత పెద్దగా తెరచిఉంటే మనకు అంత స్క్రీన్ కనిపిస్తుంది). మన కనుపాప తలుపు సందువంటిది. దానిని పెద్దదిగా చేస్తే మనకు లోపల రేటినా మొత్తంగా కనిపిస్తుంది. పరీక్ష క్షుణ్ణంగా చేయగలం. కనుపాపలు పెద్దదిగా చేసే ప్రక్రియనే ఫ్యూపిల్ డైలటేషన్ అంటారు. దీనికోసం కంటిలో ఒక చుక్కల మందు వేస్తారు. దీనికి కనీసం అరగంట నుంచి గంటన్న రవకు సమయం పడుతుంది. దీని తర్వాత మూడు, నాలుగు గంటల పాటు దగ్గరి చూపు కొద్దిగా మసగ్గా మారుతుంది. అలాగే కొద్దిసేపు ఫోటో ఫోభియా (వె లుగును చూడలేని స్ధితి) ఉంటుంది. ఇవి ఏమాత్రం ప్రమాదం లేనివి.
రేటీనా స్క్రీనింగ్ అంటే...
మన శరీరంలోని కొన్ని వ్యాధులు మొక్కదశలో ఏ విధమైన లక్షాణాలూ చూపించవు. వ్యాధి పెరిగి పెద్ద మానైనప్పుడే దాని లక్షణాలు బయట పడుతాయి. కానీ అప్పటికే పరిస్ధితి విషమిస్తుంది. మానును పీకి పారేయడం కుదరని పని. క్యాన్సర్ వ్యాధి దీనికి ఉదహరణ. డయాబెటిక్, రెటినోపతి కూడ ఈ కోవలేకే వస్తుంది. దీనిని మొక్క దశలోనే తుడిచి వేయాలి. ఆలా చేయ్యాలంటే ఎర్లీ స్టేజీలోనే దానిని గ్రహించాలి. రేటినా స్పెషలిస్టుకు చూపించి రేటినాలో వ్యాధి ఉన్నది లేనిది చూసుకో వాలి. దీనినే రెటీనా స్క్రీనింగ్ అంటారు.
ప్రివెన్షన్ అనగానేమి...
రేటినా స్క్రీనింగ్‌లో వ్యాధి ఉన్నదని, బయటపడితే అది ఇంకా ముదిరి అంధత్వం రాకుండా ఆపడానికి లేజర్ ట్రీట్‌మెంటు ఇవ్వాలి. దీనినే ప్రివెన్షన్ అంటారు. అంధత్వ నిరోధక చికిత్స అన్న మాట.
రెటినాటలో ఇస్కీమియా అంటే ఏమిటి
రెటినాలో రక్తం లీక్ కావడం వల్ల కొన్ని రెటినా భాగాలకు రక్తం అందక నిర్వీర్యం అయిపోతాయి. ఇలా చచ్చుబడిన భాగా లనే ఇస్కీమీక్ ఏరియాస్ అంటారు. ఈ ఇస్వీమిక్ భాగాలు విషం చిందించి మిగిలిన మాములు భాగాలను కూడ నాశనం చేస్తుంది.
ఫండస్ ఫ్లోరెసిన్ యాంజీయోగ్రాఫీ అంటే...
రెటినా స్క్రీనింగ్‌లో మనకు లీకేజీ ఎఫెక్ట్‌స తెలుస్తాయి. కానీ అవి ఎక్కడ నుంచి లీక్ అవుతున్నాయనేది తెలియదు. యాంజి యోగ్రాఫీలో మనకు లీకేజీ స్పాట్స్ తెలుస్తాయి. అలాగే రెటినల్ ఇస్కీమియా వగైరాల గురించి మనకు అవగాహన వ స్తుంది. ఈ రిపోర్టు బట్టి లేజర్ ట్రీట్‌మెంటుకు ఎన్ని సిట్టింగ్స్ అవసరమనేది నిర్ధారిస్తారు. కొన్ని రకాల రిపోర్ట్సు వస్తే కంటి ఇంజక్షన్ సైతం ఇవ్వాలి ఉంటుంది.
దీని వల్ల సైడ్ ఎఫెక్ట్‌స ఏమైనా ఉన్నాయా...?
దీని తర్వాత రెండు రోజుల వరకు పెషంట్‌కు మూత్రం ఆరెంజ్ రంగులో వస్తుంది. చర్మం కూడ కొద్దిగా పసుపు రంగులోకి మారొచ్చు, కానీ ఇవన్నీ తాత్కలికమే. కొద్ది మందికి ఇంజక్షన్ తర్వాత వాంతి కావచ్చు. చాల అరుదుగా అలర్జిక్ రియాక్షన్ కూడా కావచ్చు.
రెటినా స్క్రీనింగ్ ఎవరితో చేయించుకోవాలి?
రెటినా వ్యాధులలో ప్రత్యేక శిక్షణ పొందిన రెటినా స్పెషలిస్టు దీనికి సరైన వ్యక్తి. వీరు లభ్యం కాకపోతే రెటినా పరీక్షలో అనుభవం ఉండి ఆ పరికారాలు ఉన్న ఏ డాక్టరైనా సరే.
రెటినా స్క్రీనింగ్ ఎప్పుడు చేయించుకోవాలి, తిరిగి ఎప్పుడు అవసరం?
డయాబెటిస్ ఉందని నిర్ధారణ అయిన వెంటనే రెటినా స్క్రీనింగ్ చేయించుకోవాలి. లోపల ఉన్న రెటినా పరిస్ధితిని బట్టి తిరి గి ఎప్పుడు, ఎప్పుడు స్క్రీనింగ్ అవసరం అనేది చెప్తారు. సామాన్యంగా ఏడాదికి ఒక్కసారి చేయించుకోవాలి.
లేజర్ ట్రీట్‌మెంటు ఎవరితో చేయించుకోవాలి..
లేజర్ ట్రీట్‌మెంటు క్లీష్టమైన ప్రక్రియ. దీని గురించి మంచి అవగాహన, శిక్షణ ఉన్న రెటినా స్పెషలిస్టుతోనే చేయించు కోవాలి.
లేజర్ ట్రీట్‌మెంటు ఒక సారి చేయించుకుంటే సరిపోతుందా...?
ముమ్మాటికీ అరికట్టదు. మాములుగా మూడు నుంచి 5 తడవలు అవసరం. రోగికి షుగర్ ఉన్నంత కాలం, డయాబెటిక్ రెటినోపతి కూడ వారితోనే ఉంటుంది. షుగర్‌కు ఎలాగైతే అప్పుడప్పుడు పరీక్షలు చేయించుకుంటారో రెటినాకు కూడ పరీక్షలు చేయించుకోవాలి. అవసరం పడ్డపుడు లేజర్ పరీక్షలు సైతం చేయించుకోవాలి.
లేజర్ ట్రీట్‌మెంట్ వల్ల చూపు పెరగుతుందా...?
పెరగదు. ఇది ప్రెవెంటివ్ మాత్రమే. లేజర్ ట్రీట్‌మెంటు వ్యాధి ఇంకా పెరగకుండా, స్టెబిలైజ్ మాత్రమే చేస్తుంది. అంతేకానీ పోయిన చూపును తీసుకురాదు.
నాకు చాల సంవత్సరాల నుంచి షుగర్... కంటిలో ఏ అవస్థాలేదు, అయినా రెటినా స్క్రీనింగ్ చేయించు కోవాలా...?
తప్పకుండా చేయించు కోవాలి, మీకు కంటి లక్షణాలు కనిపించే సరికి లోపలి వ్యాధి పూర్తిగా ముదిరిపోయి ఉంటుంది. అంతవరకు మీరు ఆగితే శాశ్వతంగా అంధులయ్యే ఆస్కారం ఉంటుంది.
నాకు చాల ఏళ్ల నుంచి షుగర్. ఎప్పుడు రెటినా స్క్రీనింగ్ చేయించుకోలేదు, నిన్న సడన్‌గా చూపు పోయింది ఏమి చేయాలి...?
మీకు కంటిలోపల తీవ్ర రక్తస్రావం అయి ఉంటుంది. రెటినల్ డిటాచ్‌మెంట్ కూడా ఉండవచ్చు. ఇలాంటి పరిస్ధితుల్లో క్లిష్టమైన రెటినల్ సర్జరి అవసరం పడవచ్చు. చూపు తిరిగి వచ్చే అవకాశాలు మాత్రం చాలా తక్కవ.
రెగ్యులర్ రెటినా స్క్రీనింగ్, లేజర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటే సరిపోతుందా...?
చాలా వరకు అవును. కానీ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటేనే ట్రీట్‌మెంటు సక్రమంగా పనిచేస్తుంది. షుగర్ ఎక్కవగా ఉం టే లేజర్ ట్రీట్‌మెంటు తీసుకున్నా వ్యాధి తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నది. షుగర్ మాత్రమే కాకుండా బి.పి, ఎనీమియా, కిడీ్ని సమస్యలు ఇతర అంశాలు అన్నింటిని నార్మల్‌గా ఉంచుకోవాలి.
షుగర్ కంట్రోల్‌లో ఉంటే సరిపోతుందా...? ఇంకేమైనా పరీక్షలు అవసరమా...?
టోటల్ చెకప్ చేయించుకోవాలి. ముఖ్యంగా కిడ్ని, హార్ట్ పరీక్షలు చేయించుకోవాలి. బ్లడ్ లిపిడ్ కూడ చాలా అవసరం. వీటి గురించి డయాబిటాలజిస్టుతో డిస్కస్ చేయాలి.
నేను రెటినా స్పెషలిస్టు వద్దకు వెళ్లినప్పుడల్లా నాకంట్లో చుక్కల మందు వేసి ఒక గంటసేపు కూర్చోబెడతారు. అది ఎందుకు...? అది అంత అవసరమా...?
అవును, రెటినా పరీక్షకు చాలా అవసరం.ఈ చుక్కల మందు కంటి పాపను పెద్దదిగా చేసి రెటినా యొక్క వివిధ భాగాలను పరీక్ష చేయుటకు వీలు కల్పిస్తుంది.
రెటినల్ సర్జరి అంటే ఏమిటి...అది ఎప్పుడు అవసరం...?
రెటినాను కొద్దిగానైనా బతికించడానికి చేసే చికిత్సను విట్రియో రెటినల్ సర్జరి అంటారు. కాంప్లికెటెడ్ స్టేజీలలో దీని అవసరం పడుతుంది. ఇది ఆఖరి ప్రయత్నం అన్ని దారులు మూసుకుపోయి ఇక ఏమీ చేయలేని పరిస్ధితుల్లో ఇది చేస్తారు. దీని ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉంటాయి. దీని అవసరం రాకుండా చూసుకోవడమే ఉత్తమం.
-డా.జి.మురళీమోహన్, డయాబెటిస్ వైద్య నిపుణులు,కామినేని ఆసుపత్రి,ఎల్బీనగర్, హైదరాబాద్,
- ====================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.