Sunday, December 19, 2010

Hints for good digestion , జీర్ణ శక్తికి సహకరించే కొన్ని సూచనలు • [GIT..+intestines.gif]
 • Human Digestive System -- మానవ జీర్ణ వ్యవస్థ

జీర్ణము : డైజషన్‌ అనేది ఆహారాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి రక్త ప్రవాహం‌లో కలిసిపోయేలా చేసే ఒక యాంత్రిక‌ మరియు రసాయనిక ప్రక్రియ.ఆహారం యొక్క పెద్ద అణువులను చిన్నవిగా మార్చడం.

ముక్కు ద్వారా శ్వాస తీసుకునే జీవులు, ఆహారాన్ని నోటి ద్వారా తీసుకుని, దానిని పళ్లతో నములుతాయి. ఇక్కడ రసాయన ప్రక్రియ ప్రారంభమవుతుంది. లాలాజల గ్రంధుల సాయంతో లాలాజలంలో రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. దీనిని మాస్టికేషన్‌ అంటారు. తర్వాత ఇది పోట్టలోని ఈసోపేగస్ ‌లోకి వెళతాయి. అక్కడ హైడ్రాలిక్‌ యాసిడ్‌ సూక్ష్మక్రిములను చంపేసి, కొంత ఆహారాన్ని యాంత్రికంగా ముక్కలు‌ చేస్తుంది. (ఉదాహరణకు ప్రొటీన్ల యొక్క డీన్యూట్రిషన్‌) కొంత భాగాన్ని రసాయన మార్పులు చేస్తాయి. హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ అనేది తక్కువ స్థాయిలో పిహెచ్‌ను కలిగి ఉంటుంది. ఇది ఎంజైమ్‌లకు చాలా ఉపయోగకరం. కొంత సమయం తర్వాత (మానవుల్లో గంట లేదా రెండు గంటలు, కుక్కల్లో 4 నుంచి ఆరు గంటలు, పిల్లుల్లో మరికొంత తక్కువ సమయం,...) కైమ్‌ అనే ద్రవం ఏర్పడుతుంది. ఈ కైమ్‌ అనేది చిన్న ప్రేగుల‌ ద్వారా వెళ్లి, అక్కడ 95 శాతం పోషక విలువలను తీసుకుంటుంది. అక్కడి నుండి పెద్ద ప్రేగుల ‌ ద్వారా వెళ్లి మరియు మల విసర్జన‌ ద్వారా విసర్జించబడుతుంది.ఇతర జీవక్రిములు‌ ఆహారాన్ని అరిగించుకోవటానికి విభిన్న పద్దతులను ఆచరిస్తాయి.
అజీర్ణము : తిన్నది సరిగా జీర్ణము కాకపోవడాన్ని , కడుపులొ గాస్ ఫార్మయి ఇబ్బంది కలిగించినపుడు , ఆహారము కడుపులో పులిసి మంట అనిపించునపుడు , అజీర్తి విరోచనాలు అవుతున్నపుడు , కడుపు ఉబ్బరము ,త్రేన్పులు రావడము .. అనిపించినపుడు ... మనకు తినంది సరిగా జీర్ణము అవలేదని అంటాము ... అదే అజీర్ణము . వ్యక్తిని బట్టి , తినే ఆహారము బట్టి , జీర్ణరసాలు ఊరడం బట్టి , శరీరము ఏదైనా వ్యాధి బట్టి జీర్ణ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది . అజీర్ణానికి మూల కారణము కనుగొని చికిత్స చేయవలది ఉంటుంది . తాత్కాలికము గా జీర్ణము అవడానికి అనేక మార్గాలు ఉన్నాయి .
 • తేలికగా జీర్ణమయ్యేపదా్ర్ధాలు తినడము ,
 • తక్కువగా ఆహారము తీసుకోవడము ,
 • కారము , మసాల వస్తువులు తగ్గించి తినడం ,
 • జీర్ణ టానిక్ లు వాడడము ,
 • యోగా ఆసనాలు ప్రాక్టిస్ చేయడము ,
 • రెగ్యులర్ గా వ్యాయామము చేయడము ,
 • శరీరము లో ఇతరత్రా వ్యాధులు ఉన్నాయేమో తనికీ చేయించుకోవడము ,
 • అజీర్ణానికి కారణము తెలుసుకోవడానికి మంచి డాక్టర్ ని సంప్రదించడము ,

జీర్ణశక్తికి సహకరించే యోగాసనాలు:--Courtesy : Eenadu vasundara

ఏంతినాలన్నా భయం? తింటే ఏమవుతుందో.. అరుగుతుందో అరగదో? త్రేన్పులు.. కడుపు మంట ఈ ఇబ్బందులు పడేవారికి యోగాలో చక్కని మార్గాలున్నాయంటున్నారు నిపుణురాలు అరుణ.

వజ్రాసనం

ఇంద్రుడి వజ్రాయుధం ఎంత శక్తిమంతమైందో ఆ ఆసనం కూడా అంత శక్తిమంతమైనది. ఒక మొత్తటి చాప మీద రెండు కాళ్లు వెనక్కి మడిచి కూర్చోవాలి. రెండు చేతులని రెండు మోకాళ్ల మీద ఉంచి వెన్నెముక నిటారుగా ఉంచాలి. కళ్లు మూసుకొని ధ్యాస అంతా జీర్ణాశయం మీద ఉంచాలి. ఇలా ఐదు నిమిషాలు కూర్చోవాలి. జీర్ణాశయ సమస్యలతో అంటే అరుగుదల లేకపోవడం, గ్యాస్‌, కడుపులో మంట, త్రేన్పులు వంటి సమస్యలకు ఈ ఆసనం చక్కని పరిష్కారం. భోంచేసిన తర్వాత వజ్రాసనంలో ఐదు నిమిషాలు కూర్చుంటే చక్కని ఫలితం అందుతుంది. సాధారణంగా యోగాసనాలు ఖాళీ కడుపుతోనే చెయ్యాలి. ఈ ఒక్క ఆసనం మాత్రం తిన్న తర్వాత వేయొచ్చు.

నావాసనం

కూర్చుని కాళ్లు రెండు కొంచెం మడిచి ఉంచి మెల్లగా రెండు కాళ్లు నిటారుగా ఉంచాలి. తల, భుజాలు వెనక్కి ఉంచాలి. చేతులు, రెండు కాళ్లు పక్కన ఉండాలి. మొత్తం బరువుని పిరుదులు మీద ఉంచాలి. ధ్యాస అంతా పొట్టమీద ఉంచాలి. అలా రెండు నిమిషాలు పాటు ఉండాలి. ఇలా మూడు సార్లు చెయ్యాలి. ఇలా చేయడం వల్ల పొట్ట తగ్గడమే కాకుండా జీర్ణాశయ సమస్యలు నుంచి దూరంగా ఉండవచ్చు.

ఉడ్డియాన బంధ

ఉడ్డియాన అంటే పొట్ట. బంధ అంటే బంధించడం. త్రిబంధాల్లో ఇదెంతో ముఖ్యమైంది. ఇది జీర్ణాశయ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. కొవ్వు తగ్గించడంలో సాయపడుతుంది. పొట్ట దగ్గర కొవ్వు పెరగకుండా చూస్తుంది.జీర్ణాశయానికి విశ్రాంతి లభిస్తుంది. వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ నిలబడి కొంచెం ముందుకు వంగి కూడా ఈ బంధం చేయొచ్చు. వజ్రాసనంలో కూర్చొని రెండు చేతులు మోకాళ్ల మీద ఉంచాలి. బాగా దీర్ఘంగా గాలిని లోపలకు ముక్కుతో తీసుకొని మొత్తం గాలిని నెమ్మదిగా బయటికి వదిలేయాలి. గాలిని బయటకు వదిలి అలాగే ఉండి పొట్టను లోపలకు లాగి ఉంచాలి. గాలిని తీసుకోకూడదు. వదలకూడదు. అలా ఎంత సేపు ఉండగలుగుతారో అంత సేపు ఉండి తర్వాత గాలిని తీసుకొంటూ రిలాక్స్‌ అవ్వాలి. ఇలా నాలుగు సార్లు చెయ్యాలి. మీరు రెండు నిమిషాలు ఉండి ఒక్కసారి చేస్తే చాలు. అల్సర్‌ ఉన్న వాళ్లు ఈ బంధం చెయ్యకూడదు.

ఉదరాకర్షణాసనం

ఉదరం అంటే పొట్ట. ఈ ఆసనం వేసేటప్పుడు మోకాలితో పొట్టని వత్తిపెట్టి చేస్తాం కాబట్టి ఉదరాకర్షణాసనం అని అంటారు. రెండు కాళ్లు కొంచెం దూరంగా పెట్టి కూర్చోవాలి. రెండు చేతులు రెండు మోకాళ్ల మీదా పెట్టి ముందుగా ఎడమ మెకాలిని క్రింద ఉంచాలి. కుడిమోకాలిని పొట్టవైపు వత్తి ఉంచి.. ఎడమవైపునకు ఉంచి గాలిని వదిలేస్తూ తిరిగి చూడాలి. గాలిని తీసుకొంటూ సమస్థితికి రావాలి. ఇలా ఎడమ వైపు ఒకసారి కుడివైపునకి ఒకసారి మార్చిమార్చి పది నుంచి ఇరవై సార్లు చెయ్యాలి. మోకాలి నొప్పులు అధికంగా ఉండేవారు ఈ రకం ఆసనాలు వెయ్యకూడదు.

అనులోమ విలోమ ప్రాణాయామం

సుఖాసనంలో కూర్చొని ఎడమ చెయ్యి ఎడమ మోకాలు మీద చిన్‌ముద్ర (బొటన వేలు, చూపుడు వేలును కలిపి మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచాలి)లో ఉంచి కుడి చెయ్యి నాసికాముద్రలో అంటే చూపుడు వేలు మధ్యవేలు మడిచి చిటికెన వేలు, ఉంగరం వేలు నిటారుగా ఉంచాలి. ముందుగా కుడిముక్కు మూసి ఎడమ ముక్కుతో గాలిని తీసుకొని కుడిముక్కుతో గాలిని వదిలి మరల అదే ముక్కుతో గాలి తీసుకొని ఎడమ ముక్కు నుంచి వదలాలి. ఇది ఒక రౌండు అంటారు. ఇలా ఐదు నుంచి పది నిమిషాలు చెయ్యాలి.

అజీర్ణానికి ఆయుర్వేద వైద్య చిట్కాలు

1. పచ్చి అరటికాయను ఎండబెట్టి పొడిచేసి ఉప్పుతో 1 నుంచి 2 గ్రాముల పొడిని కలిపి సేవించిన అజీర్ణం తొగలగిపోవును.
2. బెల్లముతో శొంటిపొడి కలిపి భోజనమునకు ముందు తినుచున్న అజీర్ణము పోవును.
3. ఉప్పునీళ్లు త్రాగిన అజీర్ణం పోవును.
4. కరక్కాయల పొడి బెల్లం కలిపి సేవించచున్న అజీర్ణము నశించును.
5. అల్లం, జీలకర్ర సైంధవలవణము నిమ్మరసంలో ఊరవేసి ప్రతిరోజు ఉదయం సేవించిన అజీర్ణము తొలగిపోవును.
6. మర్రిచెక్క పొడిచేసిగాని కషాయం పెట్టిగాని సేవించిన అజీర్ణము పోవును.
7. సైంధవ లవణము అల్లము సమానంగా కలుపుకొని ఉదయం, సాయంత్రం 3 గ్రాములు భోజనములందు సేవించిన అన్నిరకముల అజీర్ణరోగములు నశించును.
సంబంధిత సమాచారం

 • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.