Saturday, January 8, 2011

పుట్టుమచ్చలు-ఫలితాలు , Birth moles and effects on Life


  • Birth mole appearence


మనిషి శరీరపురంగు వల్ల తెల్లవారనీ, నల్లవారనీ వర్గీకరిస్తాం. మెలనిన్‌ అనే రసాయనం ఎక్కువగా వుండటం వల్ల దేహం శ్యామల ఛాయను, ఆ రసాయనం చర్మంలో తక్కువగా వుండటం వల్ల ధవళ వర్ణాన్నీ సంతరించుకొంటుంది. ఒక వ్యక్తి జననం జరిగాక దాదాపు 20 సంవత్సరాల లోపు శరీరంపై పుట్టు మచ్చలు కనిపించడం ప్రారంభమవుతుంది. అప్పుడే పుట్టిన బేబీకి అస్సలు పుట్టు మచ్చలేని సందర్భం కూడా వుండవచ్చు. ప్రతి వందమంది శిశువుల్లో ఒకరు తప్పక ఎక్కువ సంఖ్యలో పుట్టు మచ్చలు కలిగి వుండటం జరుగుతుంది. మచ్చలు చర్మపు పై పొర అడుగున, పైన కూడ రూపుదిద్దు కుంటాయి. ఆసియా వాసుల్లో పాదాలపై పుట్టుమచ్చలు ఎక్కువగా కనిపిస్తాయని ఓ పరిశోధన వెల్లడిస్తోంది.

ఈ మచ్చలు చర్మంపై అలికినట్లుగా వుండటం, అతికినట్లుగా కూడానూ కనబడతాయి. ఇవి గుండ్రంగా, కోడిగుడ్డు ఆకారంలోను వుంటాయి. సాధారణంగా ఇవి చిన్న వయసులో కనబడి వయసుమీరే కాలంలో అదృష్యమవుతూవుంటాయి. శ్వేత జాతీయుల్లో సగటున ఒక్కొక్కరు ముప్పయి దాకా పుట్టుమచ్చలు కలిగివుండగా, అరుదుగా ఈ సంఖ్య నాలుగు వందలు దాకా వుండవచ్చునన్నది ఓ సమాచారం.

ప్రత్యేకంఒక వ్యక్తి అసంఖ్యాకంగా పుట్టుమచ్చలు కలిగివుండే సందర్భంలో అలాంటివి వారసత్వంగా వచ్చిన వాటిగా చెబుతారు. సూర్యకాంతిలోని అతీనీలలోహిత కిరణాలవల్ల చర్మం విఘాతం చెందుతుంది. సూర్యకాంతివల్ల, ప్రకటమయ్యే శరీర భాగాల్లో పుట్టుమచ్చలు ఉద్భవించే అవకాశం మెండుగా వుంటుంది. నల్ల చర్మంతో జన్మించిన వారికి తక్కువగా పుట్టుమచ్చలు వుంటాయి. దీనికి భిన్నంగా తెల్లనివారికి ఉంటాయని పరిశోధలు తెలుపుతున్నాయి. అతినీలలోహిత కిరణ చర్యవల్ల ప్రభావితం కాబడి కాన్సర్‌ సంక్రమించే అవకాశం పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. 'మెలనోమా' గా పిలువబడే చర్మ కాన్సర్‌, సూర్యకాంతిలోని అతినీల లోహిత కిరణాలకు చర్మం ఉదయం పదిగంలపైన, సాయంత్రం నాల్గుగంటల లోపు గురికావడం వల్ల, సంక్రమించే అవకాశం వుంటుంది. కాన్సర్‌ కారక పుట్టు మచ్చలను నిరోధించేందుకు పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంట్లు, తలపై వెడల్పాటి టోపీ ధరించడం వల్ల అధిగమించవచ్చు.

అమెరికాలోని శ్వేత జాతీయుల్లో అయిదు శాతం ప్రజలు మెలనోమా వ్యాధి బారిన పడగా నల్ల వారిలో ఈ సంఖ్య అల్పం! పుట్టుమచ్చల ఆకృతిలో మార్పు, వాటి నుంచి రసికారడం వంటి లక్షణాలు కనిపించినపుడు చర్మ కాన్సర్‌ సోకినట్లు భావించవచ్చు.

పుట్టుమచ్చలు -ఫలితాలు..

మనుషులను గుర్తించడానికి నమోదుచేసే అంశాలలో వేలిముద్రలు , పుట్టుమచ్చలు ముఖ్యమైనవి . ఈ రెండూకూడా ఎవరివి వారికే తప్పించి ... ఒకరికి ఉన్నట్లు మరొకరికి ఉండవు . అందుకె ప్రతి విద్యార్ధి కి వారి స్కూల్ రికార్డ్ లో తప్పనిసరిగా పుట్టుమచ్చలు నమోదుచేస్తారు . అవే వారికి జీవితకాలం గుర్తుగా నిలుస్తాయి . అయితే పుట్టుమచ్చలనేవన్నీ పుట్టుకతో రాకపోవచ్చు , పుట్టేసరికి తప్పనిసరిగా కొన్ని మచ్చలు అక్కడక్కడ ఉంటాయి . ఆ తరువాత కూడా ఇవి శరీరము మీద రావవచ్చును . . . అటువంటి మచ్చలు కూడా పుట్టుమచ్చలగానే మనం పరిగణిస్తుంటాం కాని వైద్య పరిభాషలో ఆరెండిండికీ తేడా ఉంటుంది .
ఎలా ఏర్పడతాయి :
శరీరము మీద అక్కడక్కడ చిన్న మచ్చ లేదా చుక్క ఏర్పడటానికి కారణము చర్మం లో వున్న సహజమయిన వర్ణకము ... దీనిని " మెలనిన్‌ " అంటారు . ఇది సూర్యకాంతిలోని హానికారక అతినీలలోహిత కిరణాలను గ్రహించి మనల్ని రక్షిస్తుంది . మెలనిన్‌ తయారీకి చర్మం లో మెలనోసైట్ అనే ప్రత్యేక కణాలున్నాయి . ఇవి చర్మం లోని బాహ్యస్తరం లేదా అంత:స్త్రరం లో వుండి మెలనిన్‌ ని ఉత్పత్తి చేస్తే ... ఆ మెలనిన్‌ నిమ్మదిగా చర్మం వెలుపలికి రవాణా అయి వస్తుంది . మెలనిన్‌ అనేది చర్మం పై అంతటా వ్యాప్తి చెందుతుంది . ఐతే కొన్ని సందర్భాలలో మెలనోసైట్ కణాలు కలిసికట్టుగా పనిచేస్తాయి , అందువలన మెలనిన్‌ దట్టం గా ఏర్పడి ఒకేచోట ఒక మచ్చగా లేదా చుక్క గా కనిపిస్తుంది . అదే పుట్టుమచ్చగా మనం పేర్కొంటాం . పుట్టుమచ్చలు ఎందుకు ఏర్పడాయి అనేది స్పష్టం గా తెలియదు . తల్లి కడుపులో వుండగానే ఇవి ఏర్పడతాయనేది స్పష్టం . తల్లి కడుపులో ఉండగానే పిండం మీద సూర్యకాంతి ప్రభావం వల్ల అలా ఏర్పడతాయేమోనని ఒక అభిప్రాయము , ఆలోచన . పుట్టుమచ్చల వల్ల ఎటువంటి నష్టమూ లేదు కాని కొన్ని రకాల పుట్టుమచ్చలు క్యాన్సర్ కారకమవుతుంటాయి .

పుట్తుమచ్చలు ఎలా ఉంటాయి :
సాధారణం గా పుట్టు మచ్చలు నలుపు లేదా ముదురు ఊదారంగులో ఉంటాయి .. ఆప్పుడప్పుడు అవి గోదుమ లేదా పసుపు రంగులో ఉంటాయి . ఈ రంగులు ఒకసారి స్పష్టం గా కనిపిస్తాయి ఒక్కొక్కసారి సరిగా కనిపించవు . మొత్తం మీద శారీరక స్థితి , ప్రధానం గా హార్మోన్లు పరిస్థితి బట్టి మారుతూ ఉంటాయి . చిన్న చుక్క లా ఉండవచ్చును లేదా ఒక సెంటీమీటర్ పరిమాణం లోనూ ఉండవచ్చును . పుట్టుమచ్చలు శరీరం మీద ఎక్కడ ఉన్నా అంతగా పట్టించుకోరుగాని ముఖం మీద ఉంటే వీటిని గురించి తరచుగా అలోచిస్త్తారు . ముఖం పై కొంతమందికి అందాన్ని ఇస్తాయి మరికొందరికి అందవికారానికి ఇవే కారణం అవుతాయి . నలుపు రంగు శరీరం గలవారిని కంటే తెలుపు వర్ణము గలవారికి ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి . నలుపే ఆడదానికి అందం అనే అనే జుట్టు కు రాసే నూనెల ప్రచారము .

పుట్టుమచ్చల ఫలితాలు --->
అంగసాముద్రికంలో శరీరలక్షణాల ఆధారంగా వ్యక్తి జీవితాన్ని చెబుతారు .అందులో పుట్టుమచ్చల ఆధారంగా కూడా కొన్నిఫలితాలు చెప్పగలుగుతారు. అయితే పుట్టుమచ్చలు ఒకటే కాక మిగతా విషయాలన్నీ సమన్వయించుకుని జ్యోతిష్యశాస్త్రజ్ఞుడు ఫలితాలు చెబుతాడు. అంతర్జాలంలో ఈ దొరికిన ఈ వివరాలను కేవలం సమాచారం కోసం మీకందిస్తున్నాను

శరీరంపై పుట్టుమచ్చలు ఏ రంగులో ఉన్నాయనడాన్ని బట్టి ఫలితాలను చెప్పేయవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా పుట్టుమచ్చలు నల్లగా ఉంటాయి. మరికొన్ని ఎరుపుగను, ఆకుపచ్చగను, తేనెరంగును, పసుపుపచ్చగను, గంధపురంగుగా ఉంటాయి. ఇందులో ఆకుపచ్చ, ఎరుపు రంగులతో కూడిన పుట్టుమచ్చలు కలిగిన వారికి శుభములు కలుగుతాయి. అయితే నలుపు రంగు దరిద్రమునకు, మరికొన్ని అశుభాలకు సూచకములని పండితములు అంటున్నారు. అయితే లేత నలుపు, ఆకుపచ్చరంగు, గంధపురంగును పోలిన పుట్టుమచ్చల వలన శుభఫలితాలుంటాయి.

అలాగే పుట్టుమచ్చల మీట వెంట్రుకలు ఉండి పలుచగా ఉండి అని కొంచెము పొడవు కలిగివున్నచో ఆ వ్యక్తి ధనవంతుడు, కీర్తివంతుడవుతాడని పురోహితులు చెబుతున్నారు. అలాగే ఆ వెంట్రుకలే దట్టముగా ఉండి కొంచెము పొట్టిగా ఉంటే అశుభ ఫలితాలు చేకూరుతాయి.ఇకపోతే.. పురుషులకు రెండు కనుబొమల మధ్య యున్నచో ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడు. బంధుప్రియుడవుతాడు. భోగములందు ఆసక్తి కలిగివుంటాడు. సువాసన ద్రవ్యముల పట్ల ప్రేమకలిగి వుంటాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

తల : తలలో పుట్టుమచ్చలు కలిగిన పురుషునికి గర్వము ఎక్కువ . వారు ప్రతి అంశాన్ని విమర్శనాత్మకం గా గమనిస్తారు . మంచి ఆశాభావం గలవారు , రాజకీయ , సామాజిక అంశాలలో మంచి శ్రద్ద కలిగిఉంటారు .

నుదుటి మీద ఉంటే : మీరు మంచి కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు. ఆర్థిక స్వతంత్రం ఉంటుంది. రాజకీయాల్లో రాణిస్తారు.

నుదుటి క్రింది భాగంలో ఉంటే : మీరు మంచి లక్ష్యాన్ని, ఏకాగ్రతను కలిగి ఉంటారు. 40 ఏళ్ల తర్వాత విజయం సాధిస్తారు.

కనుబొమ్మపై ఉంటే : మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈర్ష్య ఉండదు.

ముక్కుపై ఉంటే : కొంత మందిలో క్రమశిక్షణ లోపిస్తుంది.

చెవి : ఏ భాగము లో ఉన్నా ధనం కనిపిస్తూ ఉంటుంది . సమాజం లో గౌరవం తో కూడిన గుర్తింపు ఉంటుంది .

పెదవిపై ఉంటే : కొన్నిసార్లు మీ బంధువులు, స్నేహితుల విషయంలో మీకు ఈర్ష్య కలుగుతుంది.

బుగ్గపై ఉంటే : రాజకీయాల్లో రాణిస్తారు. స్థిరాస్తులు గడిస్తారు.

నాలుకపై ఉంటే : మీరు మంచి తెలివితేటలు, విద్యను కలిగి ఉంటారు.

గడ్డం : పై ఆడ , మగ వారిలో భిన్న గా ఫలితాలు ఉంటాయి . గడ్డం మధ్యలో మగవారికి ఉదారగుణము కలిగి ఉంటారు . ఆడ వారికి భక్తిభావం మెండు మంచి అదృష్టవంతులవుతారు .

భుజంపై ఉంటే : మీరు మర్యాదస్తులు, కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఆనందకరమైన దాంపత్య జీవితం కొనసాగిస్తారు.

మోచేయిపై ఉంటే : మీ జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు.

ఎడమ చంక భాగంలో ఉంటే : మీ ప్రారంభ జీవితంలో కొంత ఒడిదుడుకులున్నా తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి.

కుడి చంక భాగంలో ఉంటే : భద్రత విషయంలో మీరు చాలా మెళకువగా ఉంటారు.

మెడ భాగంలో ఉంటే : కొన్ని సమయాల్లో మీకు దురదృష్టం తప్పదు. ఇతరులు మిమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తారు.





నుదుటి పై భాగమునందు : పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు అహంకారము ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించగలరు. జ్ఞానవంతురాలు, కళలయందు ఆసక్తి ఎక్కువగా ఉండటమేగాక టీవీ మెగా సీరియల్స్‌కు కథ, మంచి బ్యానర్స్‌పై సినీ రచనలు చేయడం, పత్రికా రంగంలో ఉన్నత రచయత్రీ అయ్యే అవకాశం ఉంది.ప్రముఖ వ్యక్తులతో స్నేహం ఏర్పరుచుకోగలరు. వీరి సంసార జీవితం అంత పటిష్టంగా ఉండదు. కానీ సర్దుకుపోతే మంచి ఫలితాలుంటాయి. అయితే నుదుటిపై పుట్టుమచ్చగల స్త్రీలు భర్తను ఏ మాత్రం లెక్కచేయరు. చివరికి పిల్లల్ని సైతం పట్టించుకోరు. అయినప్పటికీ వీరికి అనుకూలమైన భర్త లభించడం వీరికి ప్లస్ పాయింటే. ఇంకా నుదుటిపై పుట్టుమచ్చగల స్త్రీలకు కలిగే సంతానం ఉన్నత స్థాయికి ఎదుగుతారు. వీరి జీవితం మొదట ఆకాశము ఆ తర్వాత నేల అనే విధముగా కష్ట సుఖాల కలయిక కొంత కాలం వీరు చెప్పిందే వేదం, వీరే రాణి అన్నవిధంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఎవరి ముఖమైనా చూడగానే మొదట నొసలు కనబడతాయి. ఈ నొసలు సువిశాలంగా ఉంటే ఆ వ్యక్తి మంచి ఆలోచనా పరుడు అవుతాడు. అంతేకాదు కీర్తివంతుడవుతాడు. అటువంటి నుదుటి భాగాన మచ్చయున్న పురుషుడు పదిమందిలోనూ మంచివాడనిపించుకుంటాడు. పరోపకారి అవుతాడు. ధనధాన్యములకు లోటు ఉండదు.

పుట్టుమచ్చ సరిగ్గా రెండు కనుబొమలకు మధ్య ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడు. భోగము నందు ఆసక్తిని కలిగినవాడుగా ఉంటాడు. సువాసన ద్రవ్యముల పట్ల ఆసక్తిని కలిగి ఉండి స్త్రీలను విశేషంగా ఆకర్షించగలవాడై వుంటాడు.

ఇక కుడి కనుబొమ మీద మచ్చయున్న వివాహము త్వరితగతిన అవుతుంది. సుగుణశీలయైన భార్య లభిస్తుంది. భార్య మూలంగా గొప్ప అదృష్టవంతుడవుతాడు. ఈ పురుషుడు శాంత స్వభావమును కలిగి ఉంటాడు. కుడి కంటిలోపల మచ్చ యుండినట్లయితే స్థిరాస్తులను కొనగల శక్తివంతుడవుతాడు.

కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే సంపదలను కలిగి ఉంటాడు. వాహన సౌఖ్యము లభిస్తుంది. మొత్తమ్మీద ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగా ఉంటారు. ఎడమవైపు పుట్టుమచ్చలు ఉంటే ఫలితాలు మిశ్రమము గా ఉంటాయి .

శరీరం ముందు భాగంలో ఉంటే : ఆకస్మిక ధన లాభం.

శరీరం వెనుక భాగంలో ఉంటే : మీరు కష్టపడి పని చేసినా ఆ పేరు ఇతరులకు దక్కుతుంది.


కంటిపై ఉంటే : మీరు నిజాయితీ పరులు, నమ్మకస్తులు.కనుబొమ్మపై ఉంటే : మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈర్ష్య ఉండదు.

చేతిపై ఉంటే : మీరు ప్రతిభ కలిగిన వాళ్లు, జీవితంలో విజయాన్ని సాధిస్తారు.మోచేయిపై ఉంటే : మీ జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు.

మడిమపై ఉంటే : మీరు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు.

కుడి మోకాలుపై ఉంటే : మీరు స్నేహభావాన్ని కలిగి ఉంటారు.

ఎడమ మోకాలుపై ఉంటే : మీరు విశృంఖల జీవన శైలిలో జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.


చంటి పిల్లల పుట్టుమచ్చలు :

చంటి పిల్లల వీపు కింద పచ్చటి పుట్టుమచ్చలు సహజంగా వచ్చినా, వాటివల్ల భవిష్యత్తులో కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం వుంది. కాబట్టి, వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు, సూచనలను పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది.చిన్నారుల బుగ్గలపై కమిలిపోయినట్లుగా ఎరుపుదనం చాలామందిలో కనిపిస్తుంది. అలాగే తలలో తెల్లటి పొలుసు ఆరు నుంచి ఎనిమిది నెలల వయసు శిశువుల్లో కనిపిస్తుంటుంది. వీటి విషయంలో కూడా చిన్న పిల్లల నిపుణులను కలిసి వారు చెప్పినట్లుగా నడుచుకోవాలి.
పుట్టుమచ్చలు – క్యాన్సర్‌


మన శరీరంలో చర్మంపై చాలా పుట్టుమచ్చలు ఉంటాయి. అవి రకరకాల సంఖ్యలో, సైజులలో, ఆకారములలో ఉంటాయి. కొన్ని చర్మం ఉపరితలంలో వుంటాయి. కొన్ని ఉబ్బెత్తుగా ఉంటాయి. చాలా వరకు గోధుమ రంగు నుండి నల్లరంగులో ఉంటాయి. చర్మకణాలలో ఉండే మెలనోసైట్లు ఇవి నల్లగా ఉండటానికి కారణము. పుట్టుమచ్చలలో మార్పులు రావటం సహజము. అది అందరిలో చూస్తుంటాము. ఒక్కోసారి అసాధారణంగా మచ్చలు పెరగటం, పుండుపడటం, రక్తం రావటం జరుగుతుంది. పుట్టుమచ్చలలో వచ్చే ఈ క్యాన్సర్‌ను ”మేలిగంట్‌ మెలనోమా” అంటారు.

"మేలిగ్ నెంట్‌ మెలనోమా "అను క్యాన్సర్‌. అమెరికాలో స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో ఆరోస్థానాన్ని, పురుషులలో వచ్చే క్యాన్సర్లలో ఐదవ స్థానాన్ని సంపాదించినది. చర్మానికి వచ్చే క్యాన్సర్లలో 4 శాతం ఈ మాలిగెంట్‌ మెలనోమా వల్ల వస్తుంది. మరియు 80 శాతం మంది దీని వల్ల చనిపోతారు. మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని జాతుల వారిలో ఈ వ్యాధి వస్తున్నా, నల్లజాతి వారికన్నా 17 నుండి 25 రెట్లు తెల్లజాతి వారిలో ఎక్కువ కనిపించవచ్చును.

కారణాలు

(1) ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నట్లయితే మిగతావారికి 10 శాతం ఎక్కువ రిస్కు ఉన్నట్లు కొన్ని అధ్యయనములలో తేలినది. ఈ మెలనోమా ఉన్న కుటుంబంలో ఎక్కువగా మ్యుటేటెడ్‌ జణఖచ్గీఆ అను జీన్‌ కనిపిస్తుంది. ఎక్కువగా ఆ కుటుంబ సభ్యులలో ఉంటుంది. (2) అధిక సంఖ్యలో పుట్టు మచ్చలు వేర్వేరు సైజులలో వుంటాయి. ఇటువంటి వారిలో మెలనోమా క్యాన్సరు ఎక్కువగా రావచ్చును. కొన్ని సాధారణ పుట్టుమచ్చలు ఒక్కోసారి సైజు పెరిగి ఈ విధంగా మారవచ్చును. (3) ఇమ్యునో సప్రెషన్‌ – సాధారణ ప్రజలకన్నా, అవయవ మార్పిడి జరిగి ఇమ్యునోసప్రెషన్‌లో ఉన్నవారిలో 5శాతం చర్మక్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా కిడ్నీ మార్పిడి జరిగిన వారిలో కనపడుతుంది. (4) అల్ట్రావయెలెట్‌ రేడియేషన్‌ ఎక్స్‌పోజర్‌ వల్ల, అతిగా ఎండ తగలడం వల్ల ఈ క్యాన్సర్‌ రావటానికి అవకాశం వుంది. (5) కోల్‌మార్‌, క్రియోసొలేట్‌, ఆర్సినిక్‌, రేడియంల వల్ల ఈ క్యాన్సరు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

మేలిగంట్‌ మెలనోమాలో రకాలు

(1) ఉబ్బెత్త్తుగా ఉన్నవి :- 70% ఈ కోవకు చెందినవి. ఎక్కువగా మధ్యవయస్సు వారిలో చూస్తాము. శరీరములో ఏ భాగమున అయినను రావచ్చును. ఎక్కువగా మగవారిలోను, ఆడవారిలోను వీపుపైభాగాన, ఆడవారిలో కాలుమీద కనిపిస్తుంది. మొదట ఇది చర్మం మీద ప్రాకుతుంది. ఆ తర్వాత చర్మంలోపలి భాగాలకు చొచ్చుకుపోతుంది. రకరకాల ఆకారాలలో, రకరకాల రంగులలో ఎక్కువగా గ్రే రంగు నుండి నలుపు రంగు వరకూ ఈ మచ్చలు ఉంటాయి.

(2) ఎర్రగా ఉబ్బెత్తుగా ఉన్నవి : 15-20 శాతం ఈ కోవకు చెందినవి. ముదురురంగు ఉబ్బుమచ్చలు లాగా పెరిగి, పుండు పడి రక్తం కారే అవకాశం ఉంది.

(3) లెంటిగో మేలిగ్నా మెలనోమా : 4-15 శాతం ఈ కోవకు చెందినవి. ముఖం మీద ముదురు బ్రౌన్‌ మచ్చలు 3-6 సెం.మీ. వరకు ఉంటాయి.

(4) ఏక్రల్‌ లెంటిజీనస్‌ మెలనోమా :- నల్లజాతి వారిలో ఎక్కువగా చూస్తాము. అరచేతులు, అరికాలు, వేళ్ళ చివరలో ఈ కాన్సరు వస్తుంది.

ఈ క్యాన్సరు లింఫ్‌ నాళాల ద్వారా లింఫ్‌ గ్రంథులకు, రక్తనాళాల ద్వారా వేర్వేరు భాగాలకు పాకుతుంది. (ఉదా : మెదడు, రొమ్ము, జీర్ణకోశము మొ||)

కనుక్కోవడం ఎలా ? : రకరకాల మచ్చలు ఎత్తు గాను, ఇర్రెగ్యులర్‌ అంచులతోను, రకరకాల సైజులలోను ఉంటాయి. ఎరుపు నుండి నలుపు రంగు దాకా ఉంటాయి. మచ్చలు పెరుగు తాయి. ఒక్కోసారి పుండు పడి రక్తం కారవచ్చును. కొన్నిసార్లు పుట్టుమచ్చలలో మార్పువచ్చి పెరిగి ఈ విధంగా మారే అవకాశం ఉంది. చిన్న ముక్కతీసి బయాప్సీ పరీక్ష ద్వారా కనుకోవచ్చును.

వైద్య విధానము

ప్రైమరీ ట్యూమర్‌ను శస్త్ర చికిత్స ద్వారా తొలగిస్తారు. ఈ మచ్చ ఎంత లోపలకు చొచ్చుకు పోయినది చూచి దానిని బట్టి ఎంత వరకు తీసివేయాలో నిర్ణయిస్తారు. లింఫ్‌ గ్రంథులను కొన్ని సందర్భాలలో ”రాడికల్‌ లింఫ్‌ నోడల్‌ డిసెక్షన్‌” ద్వారా తొలగిస్తారు. కొన్ని దూర ప్రదేశాలకు ఈ క్యాన్సరు వ్యాపించినపుడు, సందర్భాన్నిబట్టి శస్త్రచికిత్స ద్వారా కూడా తీసివేస్తారు. కొన్ని సందర్భాలలో ఆపరేషన్‌ ఆ తర్వాత రేడియోథెరపీ ఇస్తారు. మరికొన్ని సందర్భాలలో ట్యూమర్‌ వల్ల నొప్పి వస్తున్నపుడు, ట్యూమర్‌ కొన్ని ముఖ్యభాగాలకు ప్రాకినపుడు రేడియోథెరపీ ఇస్తారు. (ఉదా : మెదడుకు ప్రాకినపుడు) కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ కూడా వాడతారు.

మిట్టమధ్యాహ్నం ఎక్కువగా వేడి ఉన్న ఎండలో తిరగకపోవటం, చర్మాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించటం, నల్లకళ్ళద్దాలు ధరించడం మొదలగునవి పాటించడం వల్ల కొంత వరకు ఇవి రాకుండా చూడవచ్చును. కుటుంబంలో ఎవరికైనా ఇది ఉన్నపుడు కనీసం సంవత్సరానికి ఒకసారి చర్మవ్యాధుల వైద్యునిచే పరీక్ష చేయించుకోవటం మంచిది. ఒకసారి వ్యాధి ముదిరిన తర్వాత అరికట్టడం కష్టము. వయసు ప్రభావం వల్ల ఒక్కోసారి తెల్లమచ్చలు వచ్చి ఆపై నల్లమచ్చలు చర్మము మీద వస్తుంటాయి. ఈ కొత్త నల్లమచ్చలను చూచి కంగారు పడవద్దు. అవసరము అయితే డాక్టరును సంప్రదించండి.

మూలము : Wikipedia.org/

  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

2 comments:

  1. naku venupusa kindibagamulo peddha puttumach unnadi.

    ReplyDelete
  2. కరెక్ట్ గా 15-17 వెన్నుపూసల మద్యలో చిన్న గుల్లగా ఉంది ఏమైనా ప్రాబ్లం అవుతుందా

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.