Wednesday, January 26, 2011

ఎలక్ట్రో థెరపీ , Electrotherapy



-విద్యుత్‌ పరికరాల వినియోగం, డెల్టాయిడ్‌ కండరాలను పునరుజ్జీవింపచేయడానికి వాడే గాల్వినిజం... వైద్యంలో విద్యుత్‌శక్తిని వాడడమే ఎలెక్ట్రోథెరపీ. వివిధ జబ్బులను నయం చేసేందుకు ఎలెక్ట్రోథెరపీ వినియోగి స్తారు. న్యూరోలాజికల్‌ వ్యాధులకు వాడే డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేటర్‌స వంటి విద్యుత్‌ పరిక రాలు వీటిలో ఉన్నాయి. గాయాలు త్వరగా మానడం కోసం విద్యుత్‌ వాడడానికి కూడా ప్రత్యేకించి ఈ పదాన్ని వినియోగించారు. ప్ర త్యామ్నాయ వైద్య పద్ధతులు, చికిత్సలకు కూ డా ఎలెక్ట్రోథెరపీ లేక ఎలెక్ట్రోమాగ్నెటిక్‌ థెరపీ ని వినియోగించారు. అయితే ఎముకల చికి త్సలో ఈ చికిత్స అనుకున్నంతగా ఉపయో గపడడంలేదని తెలుస్తోంది. కానీ, మిగతా చికిత్సల్లో ఇది పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తుంది.
ఎలక్ట్రోథెరపీ చరిత్ర...
కండరాల సమస్యల నివారణకు వాడే ఎల క్ట్రోథెరప్యూటిక్‌ ట్రిగ్గరింగుకు ప్రత్యక్షంగా వి ద్యుత్తు నివ్వడంకంటే ఆల్టర్నేటింగ్‌ నాణ్యమైన పద్ధతని ఎలెక్ట్రో థెరపీని రూపొందించిన గిలా మ్‌ డుషెన్‌ ప్రకటించాడు. డైరెక్టు కరెంట్ల ‘‘వా ర్మింగ్‌ ఎఫెక్ట్‌’’ చర్మానికి హాని కలిగిస్తుందం టాడాయన. బిగుసుకుపో యిన కండరాలకు హెచ్చు స్థాయి వోల్టేజీలో విద్యుత్తు ఇచ్చి నందువల్ల చర్మం పై పొక్కులు ఏర్పడతాయి. ఇంకా డిసి వల్ల ప్రతి బిగుసుకుపోయిన కండ రానికి కరెంటు ఇచ్చి నిలిపేసి మళ్ళీ ప్రారం భించాలి. కండరం పరిస్థితి ఎలావున్నా ఏసీ కరెంట్‌ వల్ల కండరాలు గట్టిగా పట్టేయడానికి దారితీయవచ్చు. గాయాలు త్వరగా మాన్ప డానికి ఎలక్ట్రోథెరపీ ఉపయోగపడవచ్చని 1999లో జరిపిన మెటా-ఎనాలిసిస్‌ నిర్థారించింది.

ఫిజియోథెరపీలో ఎలక్ట్రోథెరపీ ప్రాముఖ్యం
చురుకైన ఫిజియోథెరపీ చికిత్సా విధానంలో భాగంగా విద్యుత్తును వినియోగించడమే ఎలక్ట్రోథెరపీ. రోమ్‌ కాలం నాటినుంచి ఎలక్ట్రోథెరపీ వివిధ రూపాల్లో కొనసాగుతూవస్తోంది. ఫిజియోథెరపీ వైద్యవిధానంలో ప్రతిష్టాత్మక పాత్ర పోషిస్తోంది. మర్దన, కదలికలతో కూడుకున్న వ్యాయామాలు, వేడి ఐస్‌ప్యాక్‌లను వినియోగించడం వంటి ఫిజియోథెరపీ వైద్య పద్ధతులతో పాటు ఎలక్ట్రోథెరపీ విధానాలను వినియోగిస్తారు. ఫిజియోథెరపీకి కీలకమైన అనుబంధ వైద్యంగా ఎలక్ట్రోథెరపీ వినియోగించినట్లయితే రోగికి ఫలప్రదమైన ఫలితాలు చేకూరుతాయి.

ట్రాక్యుటేనియస్‌ ఎలక్ట్రికల్‌ నెర్వ్‌ స్టిమ్యులేషన్‌ (టెన్స్‌)...
జేబులో పట్టేంత సైజులో ఉండే ఈ పరికరం రోగి సులువుగా వినియోగించవచ్చు. చర్మం ద్వారా నరాలను కండరాలను ఉత్తేజపరిచి నొప్పినుంచి ఉపశమనం పొందడానికి ఇది తోడ్పడుతుంది. మెదడులో ఉండే సహజసిద్ధమైన నొప్పినివారకాల (పెయిన్‌ రిలీవర్స్‌-ఎండోర్ఫిన్స్‌) ఉత్పత్తికి దోహదపడుతుంది. ఎక్కడ శక్తిమంతంగా పనిచేస్తాయో అక్కడ ఎలెక్ట్రోడ్స్‌ను ఉంచవచ్చు. నొప్పిగా ఉన్న ప్రాంతంలో లేక అక్కడ ఉండే నరం మీద లేక శరీరానికి వ్యతిరేక దిక్కున ఉంచవచ్చు. ఉత్తేజం సరఫరా తీవ్రతను (ఇంటెన్సిటీ) పేషంటు అవసరాన్ని బట్టి మార్చవచ్చు. తక్కువ స్థాయిలో ఇచ్చే విద్యుత్‌ ఉత్తేజం అసౌకర్యంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలిక ఉపశమనం ఇస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

గాల్వినిక్‌ స్టిమ్యులేషన్‌ (జిఎస్‌)...
-కండరాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కండరానికి ఏసీ సరఫరా చేసినప్పుడు కండరంలో బలమలై మెలికలు పుడతాయని ఎలక్ట్రో థెరపీ విధానాన్ని కనిపెట్టిన గులావుమ్‌ డుషనే తెలుసుకున్నాడు. ఈ చికిత్స కండరాలు క్షీణించకుండా నివారిస్తుందని గాయాలు, పుండ్లు మానిన తరువాత కండరం పెరగడానికి తోడ్పడుతుందని రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కనుగొన్నారు. హైవోల్టేజి... జిఎస్‌ కండరాలు పట్టుకుపోవడాన్ని, మెత్తటికణజాలం వాపును తగ్గిస్తుంది. కనుక నొప్పి తగ్గుతుంది. ఐస్‌, వేడి, కదలికలు, బలమిచ్చే వ్యాయామాలవంటి ఇతర రూపాల్లో వున్న ఫిజియోథెరపీతో కలిపి చేసినట్లయితే వైద్యం తొలిదశలో ఇది శక్తిమంతమైందని తెలుస్తోంది.

ఇంటర్‌ఫెరెన్షియల్‌ కరెంట్‌ (ఐఎఫ్‌సి)...
ఈ విధమైన ఎలక్ట్రోథెరపీ టెన్స్‌ వంటిది. తక్కువ అసౌకర్యం కలిగిస్తూ చర్మాన్ని మరింత లోతుగా చొచ్చుకుపోతుంది. ఎండార్ఫిన్‌ ఉత్పత్తిని ఉత్తేజపరిచి నరాల ద్వారా నొప్పి సంకేతాల ప్రసారాన్ని నిలువరిస్తుంది. టెన్స్‌ వల్ల ఫలితం దక్కని తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నవారికి ఐఎఫ్‌సి తరచూ ఉపశమనం కలిగిస్తుంది.

అల్ట్రాసౌండ్‌...
ఈ విధమైన ఎలక్ట్రోథెరపీ శక్తిమంతంగా కీళ్ళనొప్పులు, కండరాల కణజాలం నొప్పుల నుంచి ఉపశమనమిస్తుంది. లోతైన వేడి మెత్తబరిచి కణజాలాన్ని విస్తరింపజేస్తుంది. ఫలితంగా కీళ్ళు పూర్తిగా బాగుపడతాయి. దిగువ వీపు నొప్పికి వెన్నెముకకు సంబంధించి అల్ట్రాసౌండ్‌ శక్తిమంతమైన చికిత్స. క్రమంగా కండరాన్ని సడలించడం, వ్యాయామానికి అనుబంధంగా దీన్ని వాడినట్లయితే ఇదెంతో బాగా పనిచేస్తుంది.

చెడు ప్రభావాలు, ముందు జాగ్రత్తలు...
చెడుప్రభావాలు అరుదే కానీ టెన్స్‌ లేక ఐఎఫ్‌సి యూనిట్స్‌ వాడిన తరువాత అప్పుడప్పుడూ తాత్కాలికంగా నొప్పి కలగవచ్చు. యూనిట్లపై వుండే అథెసివ్‌ ప్యాడ్ల వల్ల చర్మం ప్రకోపించవచ్చు. టెన్స్‌ ప్యాడ్లు కానీ ఐఎఫ్‌సి లేక జిఎస్‌ లీడులు కానీ గుండెపై లేదా పేస్‌మేకర్‌పై పెట్టకూడదు. అలా చేసినట్లయితే కార్డియాక్‌ ఎర్థిమియాకు దారితీయవచ్చు. ప్యాడ్లను గొంతుపై అమర్చినట్లయితే రక్తపోటు పడిపోతుంది. గర్భిణీ గర్భసంచీపై ఉంచినట్లయితే గర్భస్థపిండానికి హాని కలుగవచ్చు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఎలక్ట్రోథెరపీ విధానం మంచి సత్ఫలితాలను ఇస్తుంది.

  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

2 comments:

  1. వైద్యాన్ని అమ్ముకోవటమే లక్ష్యంగా పెట్టుకున్న వారు వైద్యవిద్యనేర్చుకున్నది పదిమందికి ఉపయోగపడాలనే సిధ్ధాంతాన్ని నమ్మిన మీలాంటివారిని చూసైనా కళ్ళుతెరవాలి. మీకృషి శ్లాఘనీయం . ప్రాచీన భారతీయ ఋషులు అనుసరించిన మార్గంలో ఇలా విజ్ఞాన్ని అందరికీ పంచే మార్గంలో మీపయనం విజయవంతంగా సాగాలని జగన్మాతను వేడుకుంటూన్నాను.

    ReplyDelete
  2. Ihaveseen your blogs.They are very good and useful especially for lay people.please continue your good work.Ihave written English toTelugu Medicaldictionarywhich is going to be published shortly.

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.