Sunday, January 2, 2011

Night blindness , రేచీకటి





రాత్రిపూట చూపు ఆనకపోవడాన్ని " రేచీకటి " అంటారు . ఇది రెండు కారణాలు వల్ల వస్తుంది . 1. విటమిన్‌ ' ఎ ' లోపము వల్ల , 2. వంశపారంపర్యము గా సంక్రమించే " రెటినైటిస్ పిగ్మెంటోజా " వ్యాది వల్ల . విటమిన్‌ ఎ లోపము వల్ల కలిగే రేచీకటిని పోగొట్టుకోవచ్చును . వంశపారంపర్యము గా వచ్చే రేచీకటికి సరైన చికిత్సలేదు . వంశము లో ఎవరికైనా రెటినైటిస్ పిగ్మెంటోజా వుంటే వారిలో మేనరికపు వివాహాలు చేసుకోకూడదు .

రేచీకటి (Night blindness) ఆహారంలో విటమిన్ ఎ లోపం కారణంగా ఎక్కువగా పిల్లలకు సంభవిస్తున్న వ్యాధి. పోషకాహారం తీసుకోని పిల్లలలోను , తరచూ విరోచనాలు అయ్యేవారిలోనూ విటమిన్‌ లోపము ఏర్పడుతుంది . కంటిలోని తెల్లపొర ప్రకాశిస్తూ ఉండకుండా, పొడి ఆరిపోయినట్లుగా ఉండును. కంటి గ్రుడ్డు మీద తెల్లని మచ్చలు కనబడును. వ్యాధిగ్రస్తులు మసక వెలుతురులో వస్తువులను సరిగా చూడలేరు. ఇంకా అశ్రద్ధ చేస్తే అంధత్వము కలుగవచ్చును.

విటమిన్ ఎ ఎక్కువగా ఉన్న బొప్పాయి, కారట్, కోడిగ్రుడ్డు, తాజా ఆకుకూరలు, పాలు మొదలైనవి ఆహారంలో సమృద్ధిగా ఇవ్వాలి. అంధత్వ నిర్మూలన పధకం క్రింద దేశంలోని పిల్లల్ని రేచీకటి నుండి రక్షించడానికి 9 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు పిల్లలకి 6 నెలల కొకసారి విటమిన్ ఎ ద్రావణం నోటిద్వారా ఇస్తున్నారు.

  • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.