Wednesday, January 26, 2011

హిప్పోథెరపీ ,Hypnotherapy,సమ్మోహన చికిత్స (హిప్నోథెరపీ)

హిప్నోథెరపీ(సమ్మోహన చికిత్స) గురించి భారతీయులకు తెలియనిదేమీకాదు కాదు. మన పురాణాల్లో సమ్మోహన విద్య, యుద్ధాల్లో సమ్మోహనాస్త్రం మనకు తెలిసిందే. మోహిని తన అందాన్నే సమ్మోహనాస్త్రంగా ప్రయోగించి ఆమృతం దేవతలకు దక్కేట్లు చేసింది. ఆధునిక యుగంలో హిప్నోథెరపీ (సమ్మోహన విద్య) అమృత కలశంగా నేటి మానవుడికి ఉపయోగపడడమే కాకుండా... అది సత్ఫలితాలను సాధిస్తోంది.


‘హిప్నోసిస్‌’ అంటే ఏమిటి?
మైమరిచిన మానసిక స్థితిలో వైద్యం చేయడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న వైద్య విధానరాల్లో ఒకటి. ప్రపంచమంతటా ప్రతి సంస్కృతిలో ఏదో ఒకరూపంలో ఉంటూవస్తోంది. న్యాయసమ్మతంగానే దీన్ని మౌలికమైన మనోవైజ్ఞానిక చికిత్సగా వివరించారు. ఇటీవల ఆవిర్భవించిన మనోవైజ్ఞానిక చికిత్సావిధానాలకు ఇది ఆధారంగా వుంది. ఇది వివాదాస్పద విషయం. ఇలాంటి మారిన చైతన్య స్థితులు(ఆల్టర్డ్‌ స్టేట్స్‌) వేల సంవత్సరాలుగా తెలిసిందే అయినప్పటికీ ‘హిప్నోసిస్‌’ (గ్రీకు పదం ‘హిప్నోస్‌’ అంటే నిద్ర) పదం 1840లో స్కాటిష్‌ వైద్యుడు డా జేమ్స్‌ బ్రేడ్‌ ప్రతిపాదించాడు. కానీ ఈ పదం హిప్నోసిస్‌ అనుభవాన్ని సరిగా వర్ణించదు. సమ్మోహక దశ (హిప్నోటిక్‌ స్టేట్‌) అనేక విధాలుగా పూర్తిగా నిద్రకు భిన్నమైంది.

-మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్తజ్ఞ్రానాన్ని బట్టి హిప్నోసిస్‌ను నిర్దిష్టంగా నిర్వచించలేము. కానీ మధ్యేమార్గంగా మానసిక భౌతిక విశ్రాంతి పొందిన మానసిక స్థితిగా చెప్పుకోవచ్చు. ఈ దశలో మన సుప్తచేతన చైతన్యవంతమైన మనసుతో సంభాషించగలుగుతుంది. హిప్నోసిస్‌ ఏమిటనే దానికంటే ఏమి చేస్తుందనే దృక్కోణం నుంచి హిప్నోసిస్‌ను నిర్వచించడం మంచిది. మనలో ఉన్న సత్తాను వెలికితీయడానికి విస్తృతంగా స్వీకరించిన అద్భుతమైన పద్ధతిగా భావిస్తారు. ఈ మానసిక స్థితి వ్యక్తి తనంతటతానే గానీ (సెల్ఫ్‌ హిప్నోసిస్‌) లేక మరో వ్యక్తి సహాయం తో గానీ సాధించవచ్చు. ఈ మరో వ్యక్తి సుశిక్షితుడైన వృత్తిపరమైన నిపుణుడైతే, ిహప్నోసిస్‌ లో ఉన్న వ్యక్తిలో సత్ఫలితాలనిచ్చే విధంగా మారిన మానసిక స్థితిని వినియోగించినట్లయితే అలాంటి క్రమాన్ని ‘హిప్నోథెరపీ’ అంటారు.

హిప్నోథెరపీ - విశ్లేషణ...
మనోవైజ్ఞానిక చికిత్స, కౌన్సెలింగ్‌ (కొన్ని సందర్భాల్లో టాకింగ్‌ క్యూర్‌) భావోద్రేకపరమైన, మనోవైజ్ఞానిక రుగ్మతల చికిత్సనంటారు. దీని ద్వారా అనవసరమైన అలవాట్లు, అవాంఛనీయమైన అనుభూతులకు మనోవైజ్ఞానిక మెళకువలు మాత్రమే ఉపయోగించి చికిత్స చేస్తారు. అసంతృప్తికరమైన ఆలోచనాధోరణులు, అనుభూతులు, ప్రవర్తనల నుంచి తప్పించి అర్థవంతమైన ప్రత్యామ్నాయాలు క్లయింట్లకు అంటే ప్రజలకు అందివ్వడమే ఈ చికిత్స లక్ష్యం. వ్యక్తి వికాసం పెంపొందిం చడానికి మనలోని సత్తా సంకెళ్ళు ఛేదించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనోవైజ్ఞానిక చికిత్స (సైకలాజికల్‌ థెరపి) ఎన్నో రూపాల్లో అందుబాటులో ఉంది. వీటిలో హిప్నోథెరపీ భిన్నమైంది.

-క్లయింటు సుప్తచేతన మనసును పరిశీలించి చికిత్స చేస్తుంది. ఆచరణలో, హిప్నోథెరపిస్టు తరచూ క్లయింటును ప్రశాంతంగా ఉండండని ఆదేశిస్తుంటాడు. తరచూ క్లయింటు ఊహాశక్తిని ఉపయోగిస్తాడు, కథలు చెప్పడం మొదలుకుని ఉపమలు, ప్రతీకలు (క్లయింటును బట్టి) అతనికి సరాసరి సూచనలిచ్చి క్లయింటులో సత్ఫలితాలనిచ్చే మార్పు తీసుకువస్తారు. సమస్యలు క్లయింటు గతంలో ఉన్నాయని భావించి వాటిని ఛేదించడానికి విశ్లేషణాత్మక మెళకులను కూడా ప్రయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో క్లయింటు ప్రస్తుత జీవితం, ప్రస్తుత సమస్యలపై (హియర్‌ అండ్‌ నౌ) దృష్టి కేంద్రీకరించవచ్చు.

క్లయింటులో మారాలన్న పట్టుదల ఉన్నట్లయితే (థెరపిస్టు ప్రయత్నాలపై పూర్తిగా ఆధారపడకుండా), మంచికే మార్పు వస్తుందనే విశ్వాసం ఉన్నట్లయితే ఎంతో సహయపడుతుందని సాధారణంగా భావిస్తారు. ఇదే మంచి మార్పుకు శ్రీకారం. ఏ మెళకువ ఉపయోగించినా థెరపిస్టు చికిత్స చేస్తున్నపుడు క్లయింటు సౌకర్యవంతంగా వున్న అనుభూతి కలగడం బహుశా చాలా ముఖ్యమైన విషయం. హిప్నోథెరపీలో ఇది ప్రత్యేక ప్రాముఖ్యమున్న అంశం. వైద్యుడిపై విశ్వాసం వున్నట్లయితే చికిత్స నాణ్యత ఎంతగానో పెరుగుతుంది. ఈ కారణంగానే మొదటి సెషన్‌ మాత్రమే క్లయింటు బుక్‌ చేసుకోవాలి, ఆ తర్వాతి సిట్టిగులను వారి ఇష్టానికి వదిలేయాలి.

-ఇతర అనేక మనోవైజ్ఞానిక చికిత్సలకు భిన్నంగా హిప్నోథెరపీని స్వల్పకాలిక విధానంగా భావిస్తారు. ఇందులోనే సత్ఫలితాన్నిచ్చే మార్పు రావాలి. ఒకవేళ మార్పు వచ్చినట్లయితే కొన్ని సెషన్లలోనే బయటపడాలి. ఆచరణలో హిప్నాటిక్‌ పద్ధతులను ఇతర తగిన సలహా, చికిత్సాపరమైన మెళకువలతో హిప్నోథెరపిస్టులు జోడిస్తారు. ప్రత్యేక కేసుల్లో వివిధ తరహాల నైపుణ్యాలను మేళవించి ఉపయోగిస్తున్నారన్న విషయంలో ఏదైనా అనుమానం వుందా? అయితే వారుపయోగించే పద్ధతి గురించి థెరపిస్టును నేరుగా అడిగి తెలుసుకోవాలి.

ఎవరిని హిప్నొటైజ్‌ (సమ్మోహితుల్ని) చేయవచ్చు?
ఈ ప్రశ్నకు ‘ప్రతి ఒక్కరినీ సమ్మోహితుల్ని చేయవచ్చన్న’ది జవాబు. కానీ, కొందరు ఇతరులకంటే హిప్నటైజ్‌ అవడానిి ఎక్కువ సిద్ధంగా ఉన్నారు. హిప్నటైజ్‌ చేసే సమయంలో ఒకరి సానుకూలత మీద కూడా ఆధారపడివుంటుంది. ఈ సుముఖత కూడా ఇతర అనేక అంశాలపై ఆధారపడివుంటుంది. లాభదాయకమైన ఫలితం పొందడానికి ఏస్థాయి తన్మయత్వం అవసరమనేది మరో ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంపై కొంత భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ తన్మయత్వం వాస్తవ స్థాయి (లేక లోతు) సాధించాలనుకున్న సానుకూలమైన ఫలితాలకు ప్రత్యక్ష సామీప్యం లేదని చాలామంది పరిశోధకులు ఏకీభవిస్తారు.

-తగినంత సమయం ఇస్తే (ఇది ఎంతో ముఖ్యమైన అంశం) చికిత్స నుంచి ఆశించిన ఫలితం దక్కవచ్చు. మన వర్తమాన సమాజంలో సమయం ప్రత్యేక ప్రాముఖ్యమున్న విషయం. ఎందుకంటే నేటి సమాజం తమ ప్రతికోరికా చిటికెలో తీరాలని భావిస్తుంది. హిప్నోథెరపీ అనూహ్యంగా శక్తిమంతంగా పనిచేయవచ్చు. కానీ అది మాయాజాలం కాదు. కానీ సరైన దినుసులు ఉంటే, సమయం సరైనదైతే, అనువైన థెరపిస్టు దొరికినట్లయితే క్లయింటు తన లక్ష్యాలన్నీ సాధించవచ్చు.

హిప్నోథెరపీ వల్ల ఎవరికి ప్రయోజనం?
-మళ్ళీ, ఈ ప్రశ్నకు కూడా ‘అందరినీ’ అన్నదే జవాబు. ఒక వ్యక్తిలోని అంతర్గత సత్తాను వెలికితీయడానికి, ఎవరూ తమ పూర్తి సత్తాను వినియోగించడం లేదన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ జవాబు అక్షరాలా నిజమే. కానీ, నిద్రాణంగా ఉన్న సత్తా ఒక్కటే కాదు. సానుకూలమైన మార్పుకోసం లోలోపలి వనరుల్ని వాడుకలోకి తీసుకురావడానికి కూడా హిప్నోథెరపీ ఎంతో ప్రభావశాలిగా ఉపయోగపడుతుంది. ఈ విషయంలో మన శరీరంలోనే స్వతహాగా ఉన్న మాన్పే సామర్థ్యాన్ని హిప్నోథెరపీతో ప్రేరేపించవచ్చు.

పర్యవసానంగా హిప్నోథెరపీతో నయమయ్యే సమస్యల జాబితా చాలా సుదీర్ఘంగానే ఉంది. కానీ, మానసిక ఒత్తిడి, ఆందోళన, తత్తరపాటు, భయాలు, అవాంఛనీయమైన అలవాట్లు, వ్యవసనాలు (సిగరెట్లు, మెక్కడం, మద్యపానం), సరిగా నిద్రలేకపోవడం, ఆత్మవిశ్వాసం కొరవడడం, ఆత్మ గౌరవం తక్కువస్థాయిలో ఉండడం, పరీక్షలంటే భయం, నలుగురిలో మాట్లాడాలంటే భయం, ఎలర్జీలు, చర్మవ్యాధులు, మైగ్రేన్‌ తలనొప్పి, ఇర్రిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబిఎస్‌) వీటిలో ముఖ్యమైనవి.

ఇవే కాక ఆపరేషన్లలో సాధారణ మత్తుమందులు (ఎనీస్థటిక్స్‌) పనిచేయని పరిస్థితుల్లో హిప్నోథెరపీ విలువైన ప్రత్యామ్నాయంగా రుజువైంది. నొప్పి నియంత్రణలో, క్రీడలు, కళాత్మక ప్రదర్శనలను పెంపొందించడానికి కూడా ఎంతో ఉపయోగపడేదిగా రుజువైంది. ఇతర సలహాపరమైన మెళకువలకు తోడుగా బాంధవ్యాలపరమైన సమస్యలను పరిష్కరించడానికి కూడా తోడ్పడుతుంది. కోపావేశాన్ని నియంత్రించే వ్యూహాల్లో కూడా ఉపయోగపడుతుందని తెలుస్తోంది. హిప్నోథెరపి ఇంకా ఎన్నో రంగాల్లో మనిషి బాధను ఉపశమింపచేసే శక్తి హిప్నోథెరపీకి వున్నా ఇది వినియోగించకూడాని సందర్భాలు కూడా ఉన్నాయి. డిప్రెస్సివ్‌ ఇల్‌నెస్‌, మూర్ఛ, సైకాసిస్‌ (సీజోఫ్రీనియా) ఇంకా కొన్ని శ్వాసకు సంబంధించిన సమస్యలు ఈ కోవకు చెందినవి.

కొన్ని సర్వసాధారణమైన భయాందోళనలు...
-హిప్నోసిస్‌లో ‘తమపై నియంత్రణ’ కోల్పోతారని ప్రజలు కొన్ని సందర్భాల్లో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కానీ హిప్నోసిస్‌లో ఎంత లోతుల్లోకి వెళ్ళినా వారెంత నిశ్చేతనంగా ఉన్నట్లు కనిపించినా నిజానికి పరిస్థితి పూర్తిగా వారి అదుపులో ఉంటుంది. వారనుకుంటే మాట్లాడగలరు (మాట్లాడకూడదనుకుంటే అలానూ ఉండగలరు).లేచి నిల్చుని వారనుకున్నప్పుడు గదివిడిచి వెళ్ళిపోగలరు. హిప్నొటైజ్‌ చేసిన వ్యక్తి చేత వారి నైతిక నిర్ణయానికి వ్యతిరేకంగా లేక మతపరమైన నమ్మకాలకు విరుద్ధంగా ఏమీ చేయించలేరు. వేదిక మీద ప్రదర్శనలో అన్ని విధాల పనులు చేయించినందువల్ల ప్రజలకేర్పడిన తప్పుడు అవగాహన కారణంగా నియంత్రణ కోల్పోతారని అనిపిస్తుంది. కానీ, వేదిక మీద ప్రదర్శనలో పాల్గొనడం పూర్తిగా స్వచ్ఛంద క్రమమని (హప్నాటిస్టుకు ‘అనుమతి’ ఇస్తారు) తెలుసుకోవాలి. కనుక తాము చేయబోతున్నదేమిటో తెలియని కార్యకర్త ఉండడు.


హిప్నోథెరపీ లక్ష్యాలు:

* నొప్పి తగ్గించే మందుల అవసరాన్ని తగ్గించడం
* శిశుజననం జీవితంలో చాలా ప్రశాంతమైన ఘట్టంగా చేయడం
* ప్రసూతి అలసటను తగ్గించడం
* తల్లి, బిడ్డ, ఇతర సిబ్బంది అందరూ కలిసి దీనిలో పాలుపంచుకోవడం
* లామేజ్ పద్దతుల కన్నా తక్కువ హైపర్ వెంటిలేషన్ ను అందించడం
* సంప్రదాయ పద్దతుల స్థానంలో శాస్త్రబద్దమైన విధానాల ద్వారా శిశుజననానికి ఈ ప్రక్రియ తోడ్పడుతుంది.

ఉదాహరణలు

* జనన శిక్షకులను జనన సహాయకులంటారు.
* బిడ్డను పట్టుకోవడాన్ని, శిశువును గ్రహించడం అంటారు.
* గర్భాశయ సంకోచాన్ని గర్భాశయ సర్జ్ అంటారు.

పరిమితులు

తల్లికి గాని, కడుపులోని భ్రూణానికి గాని హిప్నోథెరపీ వల్ల హాని కలుగుతుందని స్పష్టంగా ఇంతవరకు గుర్తించలేదు. కాని కొన్ని నష్టాలు మాత్రం ఉన్నాయి.

* హిప్నాసిస్ విభాగానికి చెందిన వాళ్లలో ప్రసూతి సమయం ఎక్కువగా ఉంటునట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది.
* హిప్నోసిస్ కోసం తగిన విధంగా తయారుచేయడానికి నొప్పి తగ్గించే ఇతర విధానాల కన్నా ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల చాలా మంది ప్రసూతి వైద్యులు దీనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
* నొప్పి భరించగలిగే స్థాయిలో ఉండే హిప్నోసిస్ వల్ల జనన ప్రక్రియ గురించిన జ్ణాపకశక్తిని తగ్గిస్తుంది.


  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.