Wednesday, January 26, 2011

హోమియోపతీ ,Homeopathy


ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతి , ముఖ్యంగా భారత దేశంలో దీనికి లభిస్తూన్న ప్రజాదరణ, తద్వారా ప్రభుత్వాదరణ, ప్రపంచంలో మరెక్కడా లేదనడం అతిశయోక్తి కాదు. ఈ పద్ధతి దరిదాపు రెండు వందల ఏళ్ళబట్టీ వాడుకలో ఉన్నప్పటికీ దీనికి శాస్త్రీయమైన పునాదులు లేవనే నింద ఒక చెరగని మచ్చలా ఉండిపోయింది. . కాని హోమియోపతీ వైద్యం వల్ల వ్యాధి నయమైన వారు చాలా మంది ఉన్నారు.

మొట్టమొదట హోమియో వైద్యులైన డా.సామ్యూల్ హనిమాన్ ఈ పదాన్ని వాడేరు. అల్లోపతి వైద్య విధానములో ఒక వ్యక్తికి జబ్బు వలన కలిగే బాధలను అణచి వేయుటకు(To suppress)మందులను వాడేవిధానమని ఆయన ఉద్దేశము. ఇది హోమియో వైద్యవిధానానికి వ్యతిరేక ప్రక్రియ. ఉదాహరణకి జ్వరము తగ్గడానికి ఉష్ణోగ్రతను తక్కువచేసే 'పారసిటమాల్ 'ను అల్లోపతి లో వాడుతాము. ఈ పరసిటమాల్ జ్వరము ఉన్నవారిలోను , జ్వరములేనివారిలోనూ ఉస్ణోగ్రతను తగ్గిస్తుంది. హోమియో వైద్యవిధానములో అలా కాకుండా జ్వరమునకు వాడే మందు నార్మల్ వ్యక్తులలో జ్వరమును పుట్టిస్తుంది , జ్వరముతో బాధపడేవారిలో జ్వరమును తగ్గిస్తుంది. డా.హనిమాన్‌ ఈ సూత్రాన్ని " సిమిలియా సిమిలబస్ క్యురంటర్ ('similia similibus curantur)" అని నిర్వచించారు . హోమియో(homeo=similar) పతీ (pathy=suffering) రుగ్మత అని అర్ధము .
హోమియోపతీ అన్నది హోమోయిస్ (ఒకే రకమైన), పేథోస్ (బాధ, రోగ లక్షణం) అనే రెండు గ్రీకు మాటలని సంధించగా పుట్టిన మాట. కనుక కావలిస్తే దీనిని తెలుగులో సారూప్యలక్షణవైద్యం అనొచ్చు. ఉష్ణం ఉష్ణేత శీతలే అన్నట్లు, వజ్రం వజ్రేనభిద్యతే అన్నట్లు ఒక పదార్ధం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధని నివారించటానికి అదే పదార్ధాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతీ మూల సూత్రం. ఈ వైద్యపద్ధతిని, ఈ మాటని కనిపెట్టినది సేమ్యూల్ హానిమాన్ (Samuel_Hahnemann; 1755-1843) అనే జెర్మనీ దేశపు వైద్యుడు. ఈయన వైద్య కళాశాలకి వెళ్ళి లక్షణంగా అప్పటి వైద్యశాస్త్రం అధ్యయనం చేసేడు. ఆ రోజులలో వైద్యం అంటే నాటు వైద్యమే. రోగానికి కారణం మలినపు రక్తం అనే నమ్మకంతో రోగి రక్తనాళాలని కోసి రక్తం ఓడ్చేసేవారు. దేహనిర్మాణశాస్త్రం (ఎనాటమీ), రోగనిర్ణయశాస్త్రం, రసాయనశాస్త్రం అప్పటికి ఇంకా బాగా పుంజుకోలేదు. కనుక అప్పటి వైద్య విధానాలలో హానిమాన్ కి లోపాలు కనిపించటం సహజం. ఈ లోపాలని సవరించటానికి ఆయన ఒక కొత్త పద్ధతిని కనిపెట్టేడు. అదే హోమియోపతీ. హోమియోపతీ వాడుకలోకి వచ్చిన తరువాత హోమియోపతీ భక్తులు ఇప్పుడు వాడుకలో ఉన్న "ఇంగ్లీషు వైద్యాన్ని" ఎల్లోపతీ (allopathy) అనటం మొదలు పెట్టేరు. అంతేకాని ఇంగ్లీషు వైద్యులు ఎవ్వరూ వారి వైద్యపద్ధతిని "ఎల్లోపతీ" అని అనరు.

దరిదాపు రెండున్నర శతాబ్దాల క్రితం పుట్టిన ఈ పద్ధతి కాలక్రమేణా కొన్ని మార్పులు చెందింది. మొదట్లో హానిమాన్ ప్రవచించిన పద్ధతిని సనాతన హోమియోపతీ (classical homeopathy) అనీ, ఇప్పుడు వాడుకలో ఉన్న పద్ధతిని అధునాతన హోమియోపతీ (modern homeopathy) అనీ అందాం. కాని ఇప్పుడు వాడుకలో ఉన్నది ముఖ్యంగా సనాతన పద్ధతియే.

పూర్తి వివరాలకోసం వికిపిడియాను చూడండి - హోమియోపతి


హోమియోపతి వైద్య విధానం-- రామకృష్ణప్రసాద్‌,హోమియోవైద్యుడు .

హోమియోపతి వైద్యవిధానంలో మూలసూత్రాల గురించి విపులంగా ‘ఎఫారిసమ్‌’ రూపంలో డా. హానిమన్‌ ‘ఆర్గనాన్‌ ఆఫ్‌ మెడిసిన్‌’ అనే పుస్తకంలో విశదీకరించారు. ఈ వైద్య గ్రంథాన్ని బైబిల్‌ ఆఫ్‌ మెడిసిన్‌గా భావించవచ్చును. ఈ విధానం కేవలం హోమియోపతి వైద్యవిధానానికే ప్రత్యేకం. ఇందులో వ్యాధిగురించి, రోగి గురించి, వైద్యుడు పాటించవలసిన నియమాల గురించి వ్రాయబడివుంది. దీనిని సరైన విధంలో అర్థం చేసుకుని వైద్యులు చికిత్స చేసినచో సాధ్యమైనన్ని తరుణ వ్యాధులు, దీర్ఘకాలవ్యాధులను సమూలంగా నిర్మూలించవచ్చును.

డా.హానిమన్‌ దీర్ఘకాలవ్యాధుల గురించి కానిక్‌ డిసీజెస్‌ అనే బృహత్తర వైద్య గ్రంథాన్ని రచించారు.ఇందులో దీర్ఘకాలవ్యాధు లను సోరా, ెసైకోసిస్‌, సిఫిలిస్‌ అని మూడురకాలుగా వర్గీకరిం చారు. ఇందులో ‘సోరా’ను మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డిసీజెస్‌గా చెబు తారు. ఇందులో కేవలం ఫంక్షనల్‌ మార్పులు ఉన్న వ్యాధులు వస్తాయి. అంటే మానసిన ఆందోళన, సాధారణ జలుబు, చర్మవ్యాధులు, పొడిదగ్గు, నీళ్ల విరోచనాలు మొదలైనవి.

ఈ ‘సోరా’ అనే మియస్మాటిక్‌ దీర్ఘకాలవ్యాధికి సైకోసిస్‌ అనే మరో దీర్ఘకాలికవ్యాధి తోడయినప్పుడు శరీరంలోని కణాలలో ఎక్కువ వృద్ధి ఏర్పడి పాథలాజికల్‌ మార్పులు వచ్చి కణుతులు (ట్యూమర్స్‌), పులిపిరులు, గనేరియా, పైల్స్‌, టాన్సిలైటిస్‌ లాంటి జబ్బులు వస్తాయి. సిఫిలిస్‌ అనే మూడోరకం వ్యాధి కలిగిన ప్పుడు కణాలకు నష్టం వాటిల్లి ‘డెస్ట్రక్టివ్‌’ డిసీజెస్‌ (వ్యాధులు) వస్తాయి. ఇది బాగా ముదిరిన బ్రాంకైటిస్‌, న్యూమోనియా, టీబీవ్యాధి, సిఫిలిస్‌, క్యాన్సర్‌, పార్కిన్‌సన్‌ వ్యాధులు వస్తాయి. ఈ దీర్ఘకాలవ్యాధులలో ఏ రోగిలో ఏది ఉధృతంగా ఉందో తెలుసుకోవడం వలన, వారి మానసిక స్థితిని పరిగణ నలోకి తీసుకోవడం వలన వ్యాధి నిర్ధారణ కొరకు హోమియోపతి మం దు ఉపయోగపడుతుంది.
హోమియో మందు ‘ఇన్‌డివిడ్యులైై జేషన్‌’ విధానం ద్వారా మందు నిర్ధారణ జరుగుతుంది. ‘నో టూ ఇన్‌డిడ్యుయల్స్‌ ఆర్‌ సేమ్‌’ అనే సూత్రానికి లోబడి ప్రతి వ్యక్తికి శరీర లక్ష ణాలను బట్టి మందులు వేర్వేరు గా ఇస్తా రు. ఉదాహరణకు టైఫాయిడ్‌ జ్వ రంతో బాధపడుతున్న 10 మంది రోగులను పరిశీలిస్తే వారు ఒకే వ్యాధితో బాధపడుతు న్నప్పటికీ వారి వ్యాధి లక్షణాలు మాత్రం వేరుగానే ఉంటాయి. వారిలోనే ఒకరికి ఉద యం వేళలో జ్వరం వస్తే మరొకరికి రాత్రివే ళల్లో జ్వరం వస్తుంది. ఇలా వాళ్ల శరీర తత్వా న్ని బట్టి మందులు ఉంటాయి. ‘సిమిలిమమ్‌’ హోమియో మందు ను ‘మెటీరియా మెడికా’లోని ‘డ్రగ్‌ పిక్చర్స్‌’ ఆధారంగా ఎంపిక చేసి ఇచ్చినట్లయితే ఆ వ్యాధి ఒకే మందుతో సమూలంగా నిర్మూలించబడుతుంది. ఈ కార ణాలచే మామూలు శాస్ర్తీయ పరిశోధ నా పద్ధతులలో హోమియో వైద్యం యొక్క శాస్ర్తీయతను పరీక్షిం చలేము, నిర్ధారించలేము. ఈ సూత్రానికి లోబడి హోమియోపతి వైద్యం ఒక నూతన శాస్ర్తీయ వైద్యవిధానంగా చెప్పబడుతోంది.

హోమియోపతి మందుల సూక్ష్మీకరణ...
పద్ధతి (పొటెన్‌టైజేషన్‌) అనే ప్రత్యేకమైన ఫార్మాస్యూటికల్‌ పద్ధతిలో హోమియో మందు లు తయారు చేయబడతాయి. మందులు ముడి రూపంలో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించిన పుడు ఇతర దుష్ఫలితాలు ఏర్పడతాయి. బ్యాక్టీరి యా, వైరస్‌ మొదలైనవి మూలకారణంగా భావిం చబడవు. మనిషిలో మొదట రోగనిరోధకశక్తి తగ్గినపుడు మాత్రమే బాక్టీరియాగానీ, వైరస్‌గానీ దాడిచేసి రోగిలో రోగాన్ని కలుగజేస్తాయి.సాధారణంగా ఏ వైరస్‌ కూడా మనిషిని ఏమీ చేయలేవు. అందువలన ఏ మందైతే మూల ణా న్ని అనగా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుం దో అప్పుడే ఆ వ్యాధి సమూలంగా నయం చేయ బడుతుంది.

కేవలం వైరస్‌ను చంపడం వల్ల రోగం నిర్మూలించబ డదు.సరిగ్గా అదేపనిని హో మియోపతి వైద్యం వల్ల సాధ్యమవుతుంది.సూక్ష్మీకరణపద్ధతిలో తయారు చేయబడిన హో మియోపతి మందులు రోగిలోని రోగనిరోధక కణాలకు పునరుజ్జీవం కల్పించి ఎలాంటి దుష్ఫలి తాలు లేకుండా వ్యాధిని నయం చేస్తాయి.ముడి రూపంలో ఉన్న మందుల మూల పదార్థాలను సూక్ష్మీకరణ పద్ధతిలో తూరు చేయడం వల్ల వాటిలో ఉన్న శక్తి పరమా ణువుల రూపంలో విడుదలై ఆ మందులో నిక్షిప్తమై ఉంటాయి. హోమియో పతి విధానం డా. హానిమన్‌ మేధోశక్తికి నిదర్శనం. శాస్ర్తీయపరంగా ఎటువంటి అభివృద్ధి చెందని 18వ శతాబ్దంలో ఆయన కనుగొన్న కొన్ని సూత్రాలకు ఇప్పటి శాస్త్రీయ విధానాలు ఇంకా అందుకోలేకపో తున్నాయనడానికి ఇది ఒక ఉదాహరణ.

భౌతి కశాస్త్రంలో పేర్కొనబడినవిధంగా ‘అవగాడ్రోస్‌ లా’ ప్రకారం ప్ర పంచంలోని ఏ మూల పదార్థమైనా తీసుకుని పరిశోధన చేసినప్పుడు 1012 వరకు మాత్రమే ఆ మూలపదా ర్థంలోని అణువును గుర్తించగలుగుతారు. కానీ 18వ శతాబ్దం లోనే ఒక ముడిరూపంలో ఉన్న మందును తీసుకుని సూక్ష్మీ కరిస్తే 1012 కంటే ఎన్నో రెట్లు అధికంగా పెరుగుతుందని ఊ హించి పరిశోధనలు చేసి దశాంశపద్ధతి పొటెన్సీ, శతాంశ పద్ధతి పొటెన్సీ, 50 మిల్లీసిమల్‌ పొటెన్సీని కనుగొన్నారు. డా.హానిమన్‌ ఎవరికీ అందని మహా శాస్తవ్రేత్త. ఆయన పరిశోధనలను ఇప్పటి శాస్ర్తీయ పద్ధతిలో నిర్థారించ డానికి భౌతిక శాస్తవ్రేత్తలకు ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో వేచిచూడాల్సిందే...


  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

2 comments:

Your comment is very important to improve the Web blog.