Sunday, January 2, 2011

రెస్పిరేటరీ ఫైల్యూర్ ,Respiratary Failure


శరీరము లో ప్ర్రాణవాయువు తగ్గి కారబన్‌ డైయాక్షైడ్ ఎక్కువై శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగితే దానిని రెస్పిరేటరీ ఫీల్యూర్ (Respiratary Failure) అంటారు . దీనిలో రోగి పరిష్తితి విషమిస్తుంది . ఆయాసము , బాగా చెమటలు పట్టడం , నాడి వేగంగా కొట్టుకుపోవడం , ఊపిరి ఆడకపోవడం , శరీరము నీలముగా మారడం , అయోమయ పరిస్థితి ఉంటాయి .

ఆక్షిజన్‌ , కార్బండైయాక్షైడ్ వాయువులు మార్పిడి సరిగా శ్వాసకోశ మండలములో జరుగదు . రక్తం లో ఆక్షిజన్‌ శాతము తగ్గితె " హైపోక్షీమియా(Hypoxemia) అని , కారబండయాక్షైడ్ లెవలు ఎక్కువైతె " హైపర్ కాప్నియా(Hypercapnia)అని అంటారు . రక్తం లో PaO2 80mmHg కంటే అధికం గాను , PaCO2 45 mmHg కంటే తక్కువగాను ఉండాలి (నార్మల్ వ్యాల్యు). రెస్పిరేటరీ ఫైల్యూర్ " హైపర్ క్యాప్నియా ఉన్నదీ ... లేనిదీ బటీ రెండురకాలుగా విభజించారు .
  • - chest X-ray in ARDS.
టైప్ 1 : ఇందులో తక్కువ ఆక్షిజం మార్పిడి (hypoxemia) ఉంటుంది కాని హైపర్ క్యాప్నియా ఉండదు . ఊపితిత్తులలో రక్తప్రసరణకు తగ్గట్తుగా గాలి ప్రసరణ జరగకపోవడం వలన ఇది సంభవిస్తుంది .

ప్యారంకైమల్ డిసీజెస్ ,
కుడి నుండి ఎడమ షంట్స్ ,
పల్మనరీ ఎంబాలిజం ............ మున్నగునవి .

టైప్ 2 : ఇందులో గాలి పోవు మార్గం లో అంతరాయం వలన కార్బండైయాక్షైడ్ లెవల్ పెరుగుతుంది . హైపర్ క్యాప్నీయా వలన ఆయాసము వస్తుంది .

బ్రీదింగ్ ఎఫర్ట్ తగ్గిపోతుంది (ఫెటిగ్ వలన )
వాయువుల మార్పిడికి ఊపిరితిత్తుల పరిమాణము తగ్గడం వలన -- emphasema .

రెస్పిరేటరీ ఫైల్యూర్ కి కారణాలు :

ఊపిరి తిత్తుల సంభందితమైనవి ->
ఉబ్బసము , ఎంఫసిమ , సి.ఒ.పి.డి , న్యుమోనియా , న్యూమోతొరాక్ష్ , హీమోతొరాక్ష్ , సిస్టిక్ ఫైబ్రోసిస్ మున్నగునవి .
హార్ట్ సంభందితమైనవి ->
పల్మనరీ ఎడీమ , సెరిబ్ర్రొ వ్యాస్కులార్ ఏక్షిడెంట్ , ఎరిత్మియాస్ , కంజెస్టివ్ హార్ట్ ఫైల్యూర్ , మున్నగునవి ,

ఇతర సంభందిత వ్యాధులు ->
మెటబాలిక్ ఎసిడోసిస్ లో
మార్ఫిన్‌ ఇంటాక్షికేషన్‌ లో ,
మెదడు వాపు జబ్బులలో ,
ప్రమాదాల వలన ఊపితితిత్తుల వ్యాధులు . మున్నగునవి .

చికిత్స :
ఎమర్జెన్సీ గా చేసేదాన్ని Cardio respiratory resucitation అంటాము . ఎండోట్రేకియల్ ట్యూబ్ పెట్టి ఊపిరి కుత్రిమం గా ఇవ్వాలి . రెస్పిరేటరీ స్టిములెంట్స్ ... Doxopram ఇస్స్తారు . . .ఊపిరి ఆగకుండా ఉండడానికి ,
ఈ జబ్బును కలిగించే కారణము తెలుసుకొని తగిన చికిత్స చేస్తారు వైద్యులు .







  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.