Saturday, June 18, 2011

గర్భిణి స్త్రీలు ఆహారం విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు , Awareness in food habits of pregnancy


  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgFzX5MIum0dxa7IkoPZyFw93IS0jIjD4YXQfzP8KPtN-r_3XqT-4oKdL5hrvi6xqf4NItfLQxTUoGs3d-kYSbZch3VRpzYEiO2Gd0C0MacP_AJfN6iigFN0vhj9dKb1yY3FRD5eLy2qEs/s1600/Pregnancy.jpg

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గర్భిణి స్త్రీలు ఆహారం విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



  • గర్భిణీ స్త్రీలు అన్ని రకాల ఆహార పదార్ధాలు అంటే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలతో చేసిన పదార్ధాలు, మాంసం మొదలైనవి తగిన మోతాదులో తీసుకోవాలి. తల్లికి ఎక్కువగా శక్తి లభించే ఆహార పదార్ధాలు ఇవ్వడం వలన తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టకుండా ఉంటారు. అలాగే కాన్పు సమయంలో, ప్రసవానంతర అత్యవసర పరిస్ధితులకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు. గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారం కొంచెంకొంచెంగా ఎక్కువ సార్లు తినాలి.

రోజూ తినే ఆహారం కంటే ఎక్కువ తినాలి. కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు పుల్లటి పండ్లు తీసుకోవాలి. పాలు, మాంసం, గుడ్లు,చేపలు, క్రొవ్వు పదార్దాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. మలబద్దకం లేకుండా ఎక్కువ ద్రవపదార్ధాలు, పీచుపదార్ధాలు తీసుకోవాలి.

సరైన పోషకాహారంతో పాటు సరైన విశ్రాంతి తీసుకోవాలి. (పగలు కనీసం 2 గంటలు, రాత్రి 8 గంటలు)
  • • గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉంటుంది. దీని వలన బరువు తక్కువ ఉన్న బిడ్డలు పుట్టడం, తల్లికి అధిక రక్తస్రావం కావడం జరుగుతుంది. కాబట్టి ఇనుము ఎక్కువగా ఉన్న ఆహారం అంటే ఆకుకూరలు, బెల్లం, రాగులు, ఎండిన పండ్లు (కర్జూరం, ద్రాక్ష ) , నువ్వులు, చెఱకురసం, ఉలవలు, మాంసం (కాలేయం) తీసుకోవాలి. రోజుకు ఒకటి చొప్పున ఐరన్ మాత్రలు తీసుకోవాలి. పోషకాహారం తీసుకుని ఆరోగ్యం గా ఉన్న స్త్రీకి సుఖప్రసవం జరుగుతుంది.

తీసుకోకూడని పదార్ధము :
  • బాగా ఉడకని మాంసము ముఖ్యము గా పందిమాంసము తినకూడదు .. దీనివల "toxoplasmosis"అనే ఇంఫెక్షన్‌ వచ్చి బిడ్డ మెదడు పెరుగుదలను దెబ్బతీయును లేదా పుట్టే బిడ్డ గుడ్దిదిగా పుట్తును .

  • కాల్చిన సముద్రపు చేపల రొట్టెలు (smoked seafoods)తినకూడదు . దీనివల " Listeriosis " అనే ఇంఫెక్షన్‌ వచ్చే అవకాశము ఉన్నది . దీనివల అబోర్షన్లు జరిగే అవకాశము ఉన్నది .

  • అతి వేడి చేసే పదార్దాలు అంటే ఆవకాయ ,మామిడికాయ,ఆవపెట్టిన కూరలు ,నువ్వులు,బొప్పాయి వంటివి తొలి నెలల్లొఅంటే 1-3 నెలల గర్భిణీ తీసుకోకూడదు.

  • పచ్చి గుడ్డు , సరిగా ఉడకని గుడ్లతో చేసిన పదార్ధములు తినకూడదు . పచ్చి గుడ్డు లో " Solmonella " అనే బాక్టీరియా వల్ల టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశము ఎక్కువ.

  • పాచ్యురైజేషన్‌ చేయని పాలతో తయారుఛేసిన జున్ను వంటి పదార్ధము లు తినకూడదు . పాచ్యురైజేషన్‌ చేయని పాలలో " Listeria " , Bovine T.B అనే బాక్టీరియా ఉంటుంది . దానివలన miscarriage అయ్యే ప్రమాధము ఉండును.

  • కాఫీ లోని కెఫిన్‌ మరియు కెఫినేటెడ్ డ్రింక్స్ మొదటి మూడు మాసాలలో ఎక్కువగా తీసుకోకూడదు . రోజుకి 200 మి.గ్రా. కంటే ఎక్కువ కెఫిన్‌ తీసుకుంటే గర్భస్రావము జరిగే ప్రమాధము ఉంది . కెఫిన్‌ డైయూరిటిక్ గా పనిచేయును . వంటిలోని నీరును బయటికి పంపివేయడం వలన డీహైడ్రేషన్‌ వచ్చే అవకాశము వలన గర్భస్రావము జరిగే చాన్స్ ఎక్కువ.

  • సారా (Alcohol) మరియు సారా సంబంధిత పదార్ధములు తీసుకోకూడదు . బేబీ పెరుగుదలను , ఆరోగ్యాన్ని దెబ్బతీయును. "foetal alcohol syndrome "కి దారితీయును . కాలేయసంబంధిత రుగ్మతలు బేబీకి కలుగును,

  • కాయకూరలు బాగా కడిగి తినాలి . కడగని ఆకుకూరలు , కాయలు , పండ్లు పైన " Toxoplasmosis" కలుగజేసే బాక్టీరియా ఉండును . ఇది చాలా ప్రమాదకరము .

  • విటమిన్‌ ' ఎ ' ఎక్కువగా ఉన్న మాంసాహారము అనగా లివర్ తో వండిన కూర తినకూడదు - దీనివలన బేబీ పుట్టికతో కూడుకున్న డిఫెక్ట్స్ తో పుట్టే అవకాశమున్నది. బీటా కెరటీన్‌ తో కూడుకొని ఉన్న విటమిన్‌ ' ఎ ' (కేరెట్స్ ) తినవచ్చును .

food to avoid during pregnancy in brief:

  • Alcohol--మత్తుపానీయాలు ,
  • Caffeine--కాఫీ , కెఫినేటెడ్ డ్రింక్స్ ,
  • Raw eggs -- పచ్చి , సరిగా ఉడకని గుడ్లు ,
  • fish with mercury-- మెర్కురీ మూలకము ఉన్న చేపలు ,,
  • Smoked sea food-- కాల్చిన సముద్రపు ఉత్పత్తులు ,
  • fish exposed to Industrial pollution-- కర్మాగారాల కెమికల్ తో కూడుకొని ఉన్న చేపలు ,
  • Raw shelfish -- పచ్చి , సరిగా ఉడక్ని ఆల్చిప్పలు , ఎండ్రకాలయలు ,
  • soft cheese -- పాచ్యురైజ్డ్ చేయని పాలతో చేసిన జున్ను ,
  • unwashed vegetables-- శుబ్రముగా కడగని కాయలు ,కూరలు ,
  • unpasteurized milk -- వేడిచేయని పాలు , పాలు పదార్ధాలు ,
  • Pickle and chilly chetnys-- కారము , మసాలా ,ఇంగువతో కూడుకున్న పచ్చళ్ళు , ఊరగాగలు ,

అపోహలు
  • కొన్ని రకాల పండ్లు తినడం మూలంగా మనకు సమస్యలు వస్తాయని, ముఖ్యంగా మహిళల విషయంలో ఎక్కువగా ఉంటాయనే అపొహ వుంది. వాస్తవాలను వాస్తవాలుగా తెలుసుకుంటే ఈ ప్రశ్నలు తిరిగి ఉత్పన్నం కావనే విషయాన్ని గుర్తించాలి.

కొన్ని రకాల అపోహలు
  • - బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుంది.
  • - కొబ్బరి నీళ్లు తాగితే చలువ చేసి జలుబు చేస్తుంది.
  • - మాంసాహారం కన్నా శాకాహారంలో ఎక్కువ మాంసకృత్తులుంటాయి.
  • - గుడ్లు తింటే వేడిచేసి, విరేచనాలు అవుతాయి. గర్భవతులు గుడ్లు తినకూడదు.
  • -నారింజ, అనాస తింటే జలుబు చేస్తుంది.
  • -నెలసరి సమయంలో నువ్వు లు తింటే అధిక రక్తస్రావం అవుతుంది.
  • -క్యారెట్‌, బీట్‌రూట్‌ కన్నా బలమైనది.
  • -కాకరకాయ రసం తాగితే డయాబెటిస్‌ ఉన్నవారికి ఉపయోగం ఉంటుంది.
  • - అరటి పండు తింటే పుట్టే పిల్లలు నల్లగా పుడతారు.
  • - జున్ను తింటే వాతం చేస్తుంది.
  • నిజానికి ఇవన్నీ మనం తరచుగా వినే విషయాలు. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఇవేవీ మనకు హాని చేసేవి కావన్న విషయం అర్థమవుతుంది. అందుకే వీటిని గురించి వాస్తవాలు తెలసుకోవలసిన అవసరం ఉంది.

-బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుందనడం ఎంత మాత్రం నిజం కాదు. ఇందు లో అధిక కేలరీలు ఉంటాయి. అందుకే తొందరగా జీర్ణం కాదు. అందువల్ల విరేచనాలు, బహిష్టు స్రావం కల్గవచ్చు. ఇది చాలా బలహీనంగా ఉన్న వారి లో మాత్రమే కనిపించే అవకాశం ఉంది.


-కొబ్బరి నీళ్లు తాగడం అందరికీ మంచిది. ఇందు లో ఎక్కువ మోతాదులో పొటాషియం+ లవణాలు ఉంటా యి. అందుకే ఎక్కువ తాగితే జలుబు చేసి కఫం రావచ్చు.అంతే కానీ కొబ్బరి నీళ్లు తాగితే జలుబురాదు.

-మాంసాహారంలో ఎక్కువ మాంసకృత్తులుంటాయి. మాంసం తినడం వల్ల శరీరం దృడంగానూ, బలంగానూ తయారవుతుంది. శాకాహారం కన్నా మాంసాహారం కొంతవరకూ మేలే.

- గుడ్లు తినడం వల్ల ఎటువంటి నష్టమూ ఉండదు.కానీ ఇందులో ఎక్కువ కేలరీలు ఉంటాయి గను త్వరగా జీర్ణం కాదు. అందు వల్ల అధికంగా తినకపోవడమే మంచిది. గర్భిణీలు మొత్తం ఉడక బెట్టినవితినాలి.

- నారింజ, అనాస తినడం వల్ల వెంటనే జలుబు వచ్చేయదు. అవి శీతాకాలంలోనో, చల్లగా ఉన్నప్పుడో తింటే జలుబు చేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇందులో ఉండే సోడియం, పొటాషియం లవణాలు సాధారణ స్థాయి నుండి అధికమయినట్లయితే ఊపిరితిత్తుల్లో కఫం చేరి జలుబు రావచ్చు. రోగ నిరోదక శక్తి తక్కువ ఉన్న వారికి వచ్చే ఆస్కారం ఉంది.

-నెలసరి సమయంలో నువ్వులు తినడం వల్ల బలంగా ఉంటారు. అలాగే నువ్వుల కేలరీల రేటు ఎక్కువగా ఉంటుంది గనక హార్మోన్లు సులువుగా విడుదల అవుతాయి. అందువల్ల రుతుస్రావం ఫ్రీగా అవుతుంది. దీన్నే ఎక్కువగా రక్తస్రావం అవుతుందను కొని భయపడి నువ్వులు తినొద్దు అంటారు.

-బీట్‌రూట్‌లో ఇనుము, బీటా కెరోటిన్లు... క్యారెట్‌ కన్నా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువల్ల బీట్‌రూట్‌ కన్నా క్యారెట్‌ కొంత వరకూ మంచిదే.

- కాకరకాయ రసం నేరుగా తాగకూడదు. దీనివల్ల మధుమేహం తగ్గదు. కానీ కాకరకాయ కన్నా కాకరకాయ గింజలు మధుమేహం తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. వాటిని పొడిచేసి తింటే మంచిది.

-అరటిపండు తినడం వల్ల పిల్లలు నల్లగా పుట్టరు. కానీ కొంత మందికి కుంకుమ పువ్వు తింటే పిల్లలు ఎర్రగా పుడతారు.

- జున్ను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో ఎక్కువగా కొవ్వు పదార్ధాలు ఉంటాయి. అందువల్ల ఎక్కువ తింటే అజీర్ణం చేయవచ్చు . అందుకే మిరియాలను కలుపుకొని తినాలి. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.





  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.