మానసిక ప్రశాంతత కావాలంటే ఒక చక్కని మార్గం ధ్యానం. ధ్యానం అనేది ఒక మానసిక సత్ప్రవర్తన. అంటే సాధకుడు ప్రతీకార, యోచన బుద్ధి నుంచి అమితమైన విశ్రాంతి లేదా స్పృహను పొందడం. ధ్యానం అనేది పలు మతాలకు సంబంధించిన అంశం. దీనిని పురాతన కాలం నుంచి సాధన చేస్తున్నారు.
ధ్యానంతో మానసిక ప్రశాంతత మాత్రమే కాదు. నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందనీ, జ్ఞాపకశక్తి పెరుగుతుందనీ మీకు తెలుసా? ధ్యానం చేస్తున్నప్పుడు మెదడులో అల్ఫా రిథమ్ అనే తరంగం నియంత్రణలో ఉండటం వల్ల ఈ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. స్పర్శ, చూపు, చప్పుడు వంటి వాటికి జ్ఞానాలకు దోహదం చేసే మెదడులోని కణాల్లో ఈ అల్ఫా రిథమ్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది చీకాకుపెట్టే అంశాల వైపు ధ్యాస మళ్లకుండా చేసి ఏకాగ్రతను పెంపొందిస్తుంది. అందువల్ల ధ్యానం చేయటం ద్వారా మెదడులోని ఈ తరంగాలు నియంత్రణలో ఉంటున్నట్టు.. తద్వారా నొప్పి భావన తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. తరచూ ఏకాగ్రత లోపంతో బాధపడేవారికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడగలదని పరిశోధకులు సూచిస్తున్నారు.
అశాంతితో ఉన్నప్పుడు ఎటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని నా ప్రార్థన, ఫలితం దాదాపుగా చెడుగా ఉంటుంది. ఎదుటి వారికి ఏ విధంగా నష్టం చెయ్యకుండా ఉండటం వలన, వీలైతే తగినంత సహాయం చెయ్యడం వల్ల మనకు మానసిక ప్రశాంతత, జీవిత పరమార్థకత వస్తుంది. మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక విధంగా జీవితంలో యుద్ధం చేస్తూనే ఉన్నాం… దానిని గుర్తించి, ఎదుటి వారు ఎవరైనా, ఎటువంటి వారైనా ఇబ్బంది పెట్టకుండా ఉందాం.
మరికొంత సమాచారము కోసం -> ధ్యానము ఉపయోగాలు
- ============================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.