లైకెన్ ప్లానస్ అనేది దురద, బుడిపెలు, పొక్కులు, పొలుసులతో కూడిన చర్మవ్యాధి. లేత వంగపండు రంగులో అనేక కోణాలు కలిగిన ఆకృతిలో కొద్దిపాటి పొలుసులతో కనిపిస్తుంది. చేతులను మోచేతుల వద్ద ముడిచే చోట, పాదాలన మడమల వద్ద వంచే చోట, జననేంద్రియాలపైన, నోటిలోపల ఎక్కువగా ఈ రకం బుడిపెలు, మచ్చలు తయారవుతుం టాయి. వ్యాధి నిరోధక శక్తి అదుపు తప్పడం వల్ల ఈ వ్యాధి ప్రాప్తిస్తుంది. ఈ వ్యాధుల్లో వ్యాధి నిరోధక శక్తిని సక్రమ మార్గంలో నడిపించే రసాయన చికిత్సలు అవసరమవుతాయి.
కారణాలు
లైకెన్ ప్లానస్ వ్యాధికి ఇతమిద్ధమైన కారణాలు తెలియనప్పటికీ, కణ మధ్యవర్తిత్వ చర్య (సెల్ మీడియేటెడ్ రెస్పాన్స్) కారణంగా ప్రాప్తిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే వాటిలో ప్రతిజనక, ప్రతి రక్షక పదార్థాల తయారీ కీలకమన్నది తెలిసిందే. వ్యాధి నిరోధక శక్తి నియంత్రణ తప్పి స్వయం ప్రేరితంగా మారే ఇతర వ్యాధుల్లో కూడా లైకెన్ ప్లానస్ అనుబంధ లక్షణంగానో, లేదా పరతంత్ర లక్షణం గానో కనిపిస్తుంది.
పెద్దపేగులో వ్రణాలు తయార వడం, తల మీద జుట్టు వలయాకారపు మచ్చలుగా రాలిపోవడం, బొల్లి మచ్చలు, చర్మం కింద ఉండే రక్తనాళాలు వాపునకు గురై చర్మాన్ని, కండరాలను ఇన్‌ఫ్లమేషన్‌కు గురి చేయడం, అదుపాజ్ఞల్లో ఉండే కండరాలు అదుపు తప్పి వాలిపోవడం వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో లైకెన్ ప్లానస్ కనిపించే అవకాశం ఉంది. కాగా, హెపటైటిస్ సి వైరస్ ఇన్‌ఫెక్షన్లలోనూ, దీర్ఘ కాలపు కాలేయపు వ్యాధుల్లో నూ, కాలేయపు కణజాలం గట్టిపడటం వల్ల ప్రాప్తించే లివర్ సిరోసిస్ వ్యాధిలోనూ సమాంత రంగా లైకెన్ ప్లానస్ ఉండటాన్ని పరిశీలకులు గమనించారు.
కొంతమందిలో వ్యాధి ఆనువంశికంగా ప్రాప్తిస్తుం టుంది. హెచ్.ఎల్.ఎ-బి 27 లేదా హ్యూమన్ ల్యూకో సైట్ యాంటిజెన్ ఉండే కుటుంబాల్లో ఈ వ్యాధి ఉనికి కనిపించడాన్నిబట్టి ఈ వ్యాధికి జన్యు పరమైన అంశ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. మానసిక ఒత్తిడి వల్ల వ్యాధి నిరోధక శక్తి వికటించి లైకెన్‌ప్లానస్ మచ్చలు ఉధృతమయ్యే అవకాశం ఉంటుంది. జనాభాలో దాదాపు 1 నుంచి 2 శాతం మంది లైకెన్ ప్లానస్‌తో బాధపడుతున్నారని అంచనా. పురుషుల్లో కంటే స్త్రీలలో దీని ఉనికి ఎక్కువ. దీనికి వయస్సుతో నిమిత్తం లేదు. ఏ వయస్సులోనైనా రావచ్చు. కాని 30 - 60 సంవత్సరాల మధ్య వయస్సులో ఎక్కు వగా కనిపిస్తుంది.
ఈ వ్యాధి అనేక సందర్భాల్లో అప్రధా నంగా, అస్పష్టంగా మొదలవుతుంది. ముందుగా మణికట్టు, మోచేతుల మడతల్లో మచ్చలు మొదల వుతాయి. వారం, పదిరోజుల్లో శరీరమంతా మచ్చలు వస్తాయి. 2 నుంచి 16 వారాల్లో గరిష్ట స్థాయికి చేరుతాయి. ఈ వ్యాధిలో దురద ఉంటుంది. అయితే మచ్చల తత్వాన్నిబట్టి దురద ఉంటుంది. గట్టిపడి గాట్లుగా తయారైన మచ్చల మీద ఎక్కువవ స్థాయిలో దురద ఉంటుంది. నోటిలో కనిపించే పొడలు లక్షణరహితంగా ఉండ వచ్చు. లేదా మంటను కలిగించవచ్చు.
వ్యాధిని సకాలంలో గుర్తించి వ్యాధి నిరోధక శక్తిని సక్రమమార్గంలో నడిపించే ఆయుర్వేద రసాయన చికిత్సలను, స్వస్థస్యోర్జస్కర చికిత్సలను చేస్తే చర్మంపైన మచ్చలు 50 శాతం కేసుల్లో ఆరు నెలల్లో తగ్గిపోతాయి. 18 నెలల్లో 85 శాతం కేసుల్లో మచ్చలు పూర్తిగాపోతాయి. అయితే నోటి లోను, శ్లేష్మపు పొరల మీద ఏర్పడే మచ్చలు తగ్గడానికి రెండునుంచి మూడేళ్లు పడుతుంది. శ్లేష్మపు పొరలు వ్యాధి ప్రభావానికి లోనవడం సర్వ సాధారణం. చర్మం మీద వ్యాధి లక్షణాలు కనిపిం చక పోయినప్పటికీ, శ్లేష్మపు పొరలు మాత్రమే వ్యాధి చిహ్నాలను ప్రదర్శించవచ్చు. నోటిలో నాలుక అంచుమీద, బుగ్గల లోపలా మచ్చలు కనిపిస్తాయి. లేత వగపండు రంగు మీద బూడిద రంగులో కాని, తెల్లని రంగులో కాని చారికలు కనిపిస్తాయి. మచ్చలు చిన్నవిగా ఆరంభమై విస్తరిస్తాయి. చిగుళ్ల మీద మాత్రం అరుదుగా కనిపిస్తాయి.
-నోరు తడారిపోవడం, నోటిలో ఒక రకమైన లోహపు రుచి అనిపిస్తుండటం కొంతమందిలో కని పించే లక్షణాలు. తంబాకు, పొగాకు వంటివి వినియోగించే వారిలో ఈ మచ్చలు కేన్సర్‌గా పరిణ మించే అవకాశాలున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ తరహా మచ్చలు గొంతు లోపల, టాన్సిల్స్ గ్రంథుల మీద, యోని పెదవుల మీద, మలద్వారం చుట్టుప్రక్కల ప్రదేశంలోనూ కనిపించవచ్చు. పురుషాంగపు మణి మీద వవ్తే సంభోగ సమయం లో నొప్పి వస్తుంది. దురద కూడా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో మూత్రమార్గం ఇరుకుగా తయారయ్యే అవకాశం ఉంది.వ్యాధి ప్రభావానికి లోనైన వారిలో 10 శాతం మందికి గోళ్లు దెబ్బ తినే అవకాశం ఉంది. గోళ్ల రంగు ముదురు రంగులో కనిపించడం, గోళ్ల మీద నిట్ట నిలువుగా ఉబ్బెత్తుగా గాట్లు, గాడి వంటివి ఏర్పడటం జరుగవచ్చు. చర్మంపైన లైకెన్ ప్లానస్ మచ్చలు ఏర్పడిన వారిలో కొంతమందికి తలలోని చర్మం మీద దురద, పొలుసులతో కూడిన బొడిపెలు తయారై జుట్టు ఊడిపోతుంది.
మడమల మడతల్లో మచ్చలు తయారైన సంద ర్భాల్లో దీర్ఘకాలంపాటు కొనసాగుతాయి. ఇలాంటి సందర్భాల్లో చర్మం రంగు మారడమే కాకుండా విపరీ తమైన దురద ఉంటుంది. లైకెన్ ప్లానస్ వ్యాధిలో కనిపించే మచ్చలను వాటి రూపాన్ని బట్టి, ప్రదర్శితమయ్యే తీరునుబట్టి వివిధ వర్గాలు గా విభజించారు.ఎక్కువ మందంగా తయార వడం, ఎండిపోయి అట్టకట్టడం, పై పొర తినే యడం వల్ల వ్రణం మాదిరిగా తయారవడం, వెంట్రుక కుదురు వద్ద బొడిపెలు తయారవడం, వలయాలుగా తయారవడం, నిలువు గీతలుగా మచ్చలు కనిపించడం, నీటి పొక్కుల రూపంలో ఉండటం, బిందువులుగా కనిపించడం వంటివి కొన్ని రూపాలు.
లక్షణాలు
లైకెన్ ప్లానస్ వ్యాధి లక్షణాలు కొన్ని ఇతర వ్యాధుల్లో కూడా కనిపిస్తాయి కనుక వ్యాధి నిర్ధారణ నిదానం అవసరమవుతుంది. ముఖ్యంగా పిటీరియా సిస్ రోజియా, గట్టేట్ సొరియాసిస్, ప్లేక్ సొరియా సిస్, సిఫిలిస్, టీనియా కార్పోరిస్ వంటి వ్యాధుల ను పరిగణించడం అవసరం.ఈ వ్యాధి వల్ల సాధారణంగా ప్రాణహాని ఉండదు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే 18 నెలల్లో తగ్గిపోతుంది. అయితే అసాత్మ్యకర ఆహార విహారాల వల్ల వ్యాధి తిరగబెట్టి దీర్ఘకాలం బాధించే అవకాశాలున్నాయి. చర్మం మీద తయారైన మచ్చల వల్ల కేన్సర్ భయం లేకపోయినప్పటికీ, నోటిలో తయారైన మచ్చలు కేన్సర్‌గా మారే అవకాశం ఉంది. అయితే ఇది కూడా చాలా తక్కువ శాతం కేసుల్లోనే జరుగు తుంది. మహిళల్లో జననేంద్రం వద్ద తయారైన లైకెన్ ప్లానస్ మచ్చలు స్క్వామస్ సెల్ కార్సినోమాగా పరిణమించే అవకాశం కొంత ఉంది.
చికిత్స
సరియైన చికిత్స లేదు . . కాని దాని ప్రభావాన్ని కొన్ని మందులవలన తగ్గించవచ్చును .
స్టిరాయిడ్స్ -- నోటిద్వారాను , పైపూతగాను వాడాలి ,
విటిన్ ఎ , రెటినోయిడ్స్ వాడితే పొలుసులు గా ఉన్న చర్మము నున్నగా అవుతుంది .
ఇమ్మ్యునో సప్రెసెంట్శ్ (immuno suppressants) వాడాలి ,
Hydroxy choroquine కొంతవరకు పనిచేస్తుంది .
Tacrolimus
Dapsone ,
UVB phototherapy ,
Aloe vera ,
purslane
వంటి మందులు వాడుతున్నారు . మీకు దగ్గరి లో ఉన్న ఫామిలీ డాక్టర్ ని గాని , చర్మవ్యాదుల నిపుణులను గాని సంప్రదిస్తే మంచి సలహా ఇస్తారు .
- ============================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.