చాలామందికి హఠాత్తుగా మూడ్ మారిపోతుంటుంది. అసహనంగానూ, అంశాంతిగానూ, ఆందోళనగానూ ప్రవర్తిస్తారు. గతాన్ని తలచుకుని బాధపడడం, సమస్యలు ఎదుర్కొనే టప్పుడు సహనం, వివేకం కోల్పోవడం, సమస్యలకు తల్లడిల్లిపోతూ పరిష్కార దిశగా కాకుండా వ్యతిరేకంగా ఆలోచించడం, సన్నిహితుల ఎడబాటు, ఆప్తుల మరణం, ఆర్థిక పరమైన ఇబ్బందులు వారి మూడ్‌ను మార్చేస్తాయి. ఇతరుల మీద ఆగ్రహించడం, సరిగ్గా మాట్లాడక పోవడం లక్షణాలు ఏర్పడతాయి.అటువంటి వారికి తోటివారు దూరంగా వుంటారు. మూడ్ బాగాలేనట్లుంది అనుకుంటారు.
1.మూడ్ మారాలంటే... ఒక చాక్లెట్‌ను నోట్లో వేసుకుని చప్పరిస్తుండాలి.
2. చిక్కుడు, సోయాబీన్స్, అక్రూట్స్, బాదంపప్పు, ఓట్స్ లాంటివి ఆహార పదార్థాల్లో చేర్చాలి.
3.మితాహారం తీసుకోవడం మంచిది.
4. ప్రతి రోజు ఒక నిర్ణీత సమయంలోనే ఆహారాన్ని తీసుకోవాలి.
5.వ్యాయామం చేస్తే నూతన ఉత్సాహం కలిగి మంచి మూడ్‌లోకి వస్తారు.
6.విటమిన్-డి కి కూడా మూడ్‌ను మార్చేశక్తి ఉంది. అందువల్ల, సుప్ర భాత సమయంలో కానీ, సూర్యాస్తమయ సమయంలో కానీ, నీరెండలో గానీ నడవడం మంచిది. అప్పుడు, వారిలో చలాకీతనం హుషారు ఏర్పడుతుంది.
7.నెగిటివ్ థింకింగ్‌ను వదిలేసి పాజిటివ్‌గా ఆలోచించాలి.
8. మనస్సులో ఏర్పడే భావాలను అంటే దిగులు, బాధ, సమస్యలు లాంటివి అతి సన్నిహితులకు చెప్పుకుంటే మనస్సు తేలికయి మూడ్ మారుతుంది.
9.నిద్రలేమి కలిగితే శరీరంలో చురుకుతనం తగ్గుతుంది. చిరాకుగానూ నిరుత్సాహంగానూ, అశాంతిగానూ ఉంటుంది.
మూడ్ బాగా లేనప్పుడు కొంత సమయం నిద్రపోతే, ఆ తర్వాత సరైన మూడ్‌లోకి వస్తారు.
10. చేయవలసిన పనులు అధికమై, సమయం తక్కువగా
ఉంటే మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువవడం వల్ల చిరాకు, విసుగు కలుగుతాయి. అది ఏర్పడకుండా ఉండాలంటే ఇంటి పనులు విభజించుకుని, ఒక ప్రణాళిక ప్రకారం పనులను చేసుకోవాలి. మానసిక ఒత్తిడి కలుగకుండా జాగ్రత్త పడాలి.
11.తోటపని చేయడం, పచ్చని చెట్ల మధ్య గడపడం ద్వారా ఆనందం కలుగుతుంది. చక్కని మూడ్‌లోకి రాగలుగుతారు.. జీర్ణక్రియ బాగుం టుంది. ఆకలికూడా బాగా ఏర్పడుతుంది.
- ============================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.