మామూలుగా సబ్బులు , షాంపూలు కొనుక్కొనే సమయములో మంచి సువాసనలు వెదజల్లుతున్నాయా లేదా అని పరిశీలించుకుంటాము . గుబాళింపులు బావుంటేనే వాటి ఎంపిక - లేకుంటే లేదు . అయితే ఎగ్జిమా , ఎలర్జీ వచ్చే గుణము గలవారు మాత్రం ఘాటైన వాసలను లేని ఉత్పత్తుల్ని మాత్రమే ఎంచుకోవాలి.
సబ్బులు , షాంపూలు , కండిషనర్లు ఇతర కాస్మోటిక్స్ లోని పదార్ధాలు ఎలర్జీలకు లేదా అప్పటికే గ ల ఎగ్జిమాను ఎక్కువ అవడానికి కారణమవుతాయి. నికెల్ , లినాలూల్ , కోబాల్ట్ మున్నగు పదార్ధాలు ఎలర్జీ కారకగుణాలు కలిగివుంటాయి. ఆక్షిడైజ్డ్ లినాలూల్ ఎగ్జిమా రావడానికి ఎక్కువగా కారణమవుతుంటుంది . ఇది అనేక ఉత్పత్తుల్లో కనిపిస్తుంది . లెవెండర్ , మింట్ లలో సహజముగా కనిపించే సువాసన పదార్ధమైన లినాలూల్ ఆక్షిజన్ తో్ కలిసినప్పుడు ఎలర్జీకి దారితీస్తుంది . ఆక్షిడైజ్డ్ లినాలూల్ ఎక్ష్పోజర్ ను తగ్గించేందుకు సోప్ , షవర్ క్రీమ్ పెద్దపెద్ద ప్యాక్స్ కొనుగోలుని తగ్గించుకోవాలి . సీసా వాడిన ప్రతిసారీ టాప్ మార్చితే ఆక్షిడైజ్డ్ ప్రభావము కొంత తగ్గుతుంది లేదా కార్క్ మూతలు వాడాలి .
ఆధునిక యుగంలో చాలామంది రకరకాల అలర్జీ వ్యాధుల బారిన పడుతున్నారు. కొందరికి ఆహార పదార్థాల సరిపడకపోవటం, రోగ నిరోధక శక్తి తక్కువుగా ఉండటంవలన, మరికొందరికి దుమ్ము, ధూళి, చల్లని పదార్థాలు మొదలైన వాటివల్ల అలర్జీ కలుగుతుంది. ఏ మనిషినైనా అలర్జీ కలిగించే పదార్థాలను అలర్జెన్స్ అంటారు. ఒక వ్యక్తి తనకు సరిపడని పదార్థం (అలర్జెన్) తీసుకున్నప్పుడు అతడి శరీరంలోని రక్షణ వ్యవస్థ తేలికగా ఎక్కువుగా స్పందించి అలర్జీని కలిగిస్తుంది.
లక్షణాలు : అలర్జీవలన ముక్కునుండి నీరు కారడం, ముక్కు బిగుసుకొని పోయి శ్వాస ఆడక పోవడం, ఉదయం లేవగానే ఆగకుండా తుమ్ములు రావటం, దగ్గుతోపాటు ఆయాసం రావటం, ఛాతి బరువుగా అనిపించటం, కళ్ళు ఎర్రబడి నీరు కారడం, ఒంటిపై దద్దుర్లు, చర్మం పొడిగా మంటగా అనిపించటం, దురద రావటం, ఘాటైన వాసనలు పడకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉడటం.
- =========================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.