Friday, September 16, 2011

గర్భిణీ స్త్రీలు తెలుసుకోవలసిన విషయాలలు , Things to know by pregnent women
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గర్భిణీ స్త్రీలు తెలుసుకోవలసిన విషయాలలు , Things to know by pregnent women- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


స్త్రీలు బహిష్టు కాకుండా నెల గడిచింది అంటే ఆవిడ గర్భిణీ అని అర్ధం(ప్రెగ్నెంట్ అని అంటారు. ). ప్రేగ్నేన్సి అయిందనడానికి మొదట గ్రావిండెక్స్ టెస్ట్ చేస్తారు. స్త్రీ గర్బవతి అంటే ఆమె యురిన్లో 'గోనడోట్రోఫిన్' అనే హార్మోన్ అదికంగా వుంటుంది. దీన్ని గ్రావిండెక్స్ టెస్ట్ ద్వార గర్భిణీ అని నిర్ధారణ జరుగుతుంది. ఋతుక్రమం ఓ నెల ఆగిపోవడం గర్భం ధరించినట్లే లెక్క. నిజానికి ఆమె అప్పటికే రెండు వారాల గర్భానిగా వుంటుంది.


పిండం కొంచెం కొంచం పెరుగుతుంది. యామ్నియోసెంటిసిస్ టెస్ట్ (Amniotic fluid test-AFT)చేసుకోవాలి. ఈ పరీక్ష రెండు సార్లు చేస్తారు. 11 - 14 వారాల లోపు లేధా 14 - 18 వారాల లోపు పరీక్ష చేసి ఆరోగ్య అనారోగ్య వివరాలను తెలుసుకుంటారు. క్రోమోజోమల్ లేదా అనువంశిక వ్యాధల విషయాలను తెలుసుకోవచ్చును . ముఖ్యము గా ఈ క్రింది వ్యాధులు నిర్ధారణ కోసం చే్స్తారు .
 • డౌన్స్ సిండ్రోమ్‌(Down syndrome),
 • ట్ర్రైసోమి 13(Trisome 13),
 • ట్రైసోమి 18(Trisome 18),
 • ఫ్రాజిలీ ఎక్ష్ (Fragle X),
ఈ 12 వారాలు నిండే సరికి పిండానికి మనిషి రూపు రేఖలు వస్తాయి. అవయవాలు ఏర్పడి గుండె కొట్టుకోవడం జరుగుతుంది. స్కానింగ్ వచ్చినతరువాత పై పరీక్ష చేయడము లేదు .


గర్భిణీ స్త్రీలకు వేవిళ్ళు సర్వసాధారణం. నిస్త్రానం. గుండెల్లో మంట, మలబద్దకం, నడుము నొప్పి, కాళ్ళ కండరాలు చిక్కపట్టినట్లున్డుట, వారికోజ్ వేయిన్స్(varicose veins) , గజ్జలో నొప్పి, కాళ్ళు-చేతులు తిమ్ముర్లు వుంటాయి. డయాబిటీస్ పరీక్ష చేసుకోవాలి. గ్లుకోస్ పరిమాణం తెలుసుకోవాలి. ఎందుకంటే వీరికి 'జెస్టేషనల్ డయాబిటీస్' అనే ప్రత్యేక వ్యాది వస్తుంది.


ఏడు మాసాలు నిండిన తరువాత ఒక పర్యాయము వైద్యునికి చూపించాలి. ఎనిమిదవ నెలలో రెండుసార్లు, తొమ్మిదవ నెల వారానికి ఒకసారి డాక్టర్ని కలవాలి.


ప్రసవం జరగబోయే ముందు రోజులో యోనిలో తిమ్ముర్లు, పిండం బరువుకు యోని నరాలపై వొత్తిడి కలిగి త్తిమ్ముర్లు వస్తాయి. స్తనాల బరువుకు చేతులు, వ్రేళ్ళులో తిమ్ముర్లు వస్తాయి. చివరి నెలలో గర్భిణిల చేతులు, మోహము వాపు , తలనొప్పి, చూపు మసక, పొట్టపై భాగంలో నొప్పి వుంటే డాక్టరు సలహా తీసుకోవాలి. ఈ పరిస్థితిని ప్రీ-ఎక్లాంప్సియా (pre-eclampsia) అంటారు. ఇది ఎక్లాంప్సియా(eclampsia) గా మారకుండా వైద్య సలహా , చికిత్స తీసుకోవాలి.


మలబద్దక సమస్య గర్భినీస్త్రీలకు సహజం. కనుక పండ్లు, కూరగాయలు, ద్రవపదార్ధాలు, పాలీష్ చేయని బియముతో అన్నము, గోధుమలు తినాలి. స్తనాల బరువు పెరగడం వల్ల నడుంనొప్పి, గర్భకోశం బరువు పెరగడం వలన నడుం క్రింద భాగంలో నొప్పి వుంటుంది. సామన్యవ్యాయామం
చేస్తే మంచిది. కుర్చునేటపుడు నడుముకు ఆనుడు వుండేలా చూసుకోవాలి.

కొంతమందికి స్రావాలు కనిపిస్తాయి. అందుకు కారణం కాస్డీడా, ట్రైయ్కొమోనాస్ ఇన్‌ఫెచ్షన్స్, గనేరియా, సిఫిలిస్ లాంటి సుఖ వ్యాధుల మూలంగా కనిపిస్తుంటాయి. అందుకు చికిత్స చేయించుకోవాలి. అపుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా వుంటారు.


గర్భకోస గజ్జల్లో ఒక్కోసారి బాధ ఎక్కువగా వుంటుంది. ఇందుకు వేడి కాపటం మంచిది. పడుకొని మోకాళ్ళు పోత్తపైకి ముడుసుకోవటం ద్వారా ఉపసమనం కలుగుతుంది.


మొత్తానికి గర్భిణి స్త్రీలకు, నిద్రలేమి తప్పదు. పడుకోపోయే ముందు వేడిపాలు త్రాగాలి. పగలు కొంచెం వ్యాయామం చేస్తే రాత్రి బాగా నిద్ర పడుతుంది. స్త్రీలకు ఆహార విహారాలలో కావలసినంత స్వేచ్చ ఇవ్వాలి.


గర్భిణి స్త్రీలు తమ బరువు పెరుగుతున్నారా? లేదా? గమనించుకోవాలి. తొమ్మిది నెలలో గర్భిణి-ఎనిమిది లేక తొమ్మిది కిలోల బరువు పెరగాలి. పెరగనిచో ఏదో సమస్య ఉన్నట్లే. కనుక డాక్టర్ను సంప్రదించాలి. చివరి నెలలో అకస్మాత్తుగా బరువు పెరగడం మంచిది కాదు. తల్లికాబోయే ఆమెకు
మంచి పోషకాహారం ముఖ్యం. పచ్చటి ఆకుకూరలు, గుడ్లు, పండ్లు, మాంసము మొదలగు ఆహరం తీసుకోవాలి.


సాధారణంగా మన ఆహారంలో ఎక్కువగా పిందిపదర్దాలున్న పప్పులు, ధాన్యాలు, గోదుములు, బియ్యం, జొన్నలు, రాగులు, బంగాళ దుంపలు, కర్రపెండలం, చిలగడదుంపలు, అరటి, బ్రెడ్, పండ్లు వీటితో పాటు మాంసకృత్తులు ఎక్కువగా వున్నఆహారం తీసుకోవాలి.పప్పులు, చిక్కులు, వేరుశనగలు, సోయబీన్సులు, పచ్చటి ఆకుకూరలు, పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, మాంసము వీటిలో వుంటాయి. సోయబీన్సు, వేరుసనగలో మాంసకృత్తులు ఎక్కువగా వుంటాయి. ప్రతిరోజు గుప్పెడు వేరుసనగలు తింటే శరీరానికి సరిపడా మాంసకృత్తులు లభిస్తాయి.


గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ స్వేదము అలుము కోవడం అనేది సహజము . ఈస్ట్రోజన్‌ స్థాయిలు తగ్గి , ఉష్ణోగ్రత మార్పులకు సెన్సిటివిటీ పెరగడం వల్ల ఇలా జరుగుతుంది . ఆహారము లో చక్కని మార్పులు చేసుకోండి . ప్రోటీన్లు , పీచు పదార్దాలు , ఖనిజాలు , విటమిన్లు అధికం గా తీసుకోండి . రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు త్రాగండి . కొబ్బరి నీరు , నిమ్మరసము , తాజాపండ్ల రసాలు ఎక్కుమగా తీసుకోండి . ధైరాయిడ్ ఫంక్షన్‌ పరీక్షలు చేయించుకోండి ... థైరాయిడ్ పనిలో ఎచ్చు తగ్గులు వలన చెమటలు పట్టె ఆస్కారము ఉన్నది .


ప్రీఎక్లంప్సియా (Pre-eclampsia) అనేది గర్భము ధరించి ఉన్న సమయములో పెరిగే రక్తపోటు ( ప్రెగ్నెన్సీ ఇన్ద్యూస్డ్ హైపర్ టెన్షన్) , పాదాల వాపు తో పాటుగా మూత్రములో పెద్ద మొత్తములో ప్రోటీన్లు ఉండడం అనే ఒక వైద్య పరిస్థితి. ప్రీఎక్లంప్సియా అనేది ఒక రోగ కారకం కంటే కొన్నిరోగ చిహ్నముల సమాహారముగా చెప్పబడుతుంది, ఈ స్థితికి కారణమైన వేరు వేరు కారణములు చాలానే ఉన్నాయి. గర్భస్థమావి లోని కొన్ని పదార్ధములు వలన ఈ ఇబ్బందికి గురికాబోతున్న, తల్లి కాబోతున్న స్త్రీ యొక్క రక్త నాళములలో ఎండోలెథియమ్ పనితీరు సరిగా లేనట్లుగా కన్పిస్తుంది. ఈ జబ్బులో రక్తపోటు బాగా పెరుగుతూ ఉండడం అనేది బాగా తెలుస్తూ ఉండే ఒక గుర్తు, అలాగే అది మాములుగా మాతృ సంబంధిత ఎండోలెథియమ్, మూత్రపిండాలు మరియు కాలేయములను దెబ్బ తీస్తుంది మరియు వాసోకన్స్ట్రి క్టివ్ కారణములు వాటికి తోడుగా రెండవ ప్రభావముగా ఉంది.

ప్రీఎక్లంప్సియా గర్భధారణ జరిగిన 20 వారముల నుండి పెరగడం మొదలు అవ్వవచ్చు(ఇది అంతగా పెరుగుదల లేని మొదటి 32 వారములకు ముందుగా ఉంటే త్వరగా వచ్చింది అని భావిస్తారు). రోగులలో ఇది ఎదిగే విధానము మారుతూ ఉంటుంది; చాలా మందిలో ఇది ముందుగానే కనుగొనబడినది. అలాంటి సందర్భములలో శస్త్రచికిత్స చేయడము లేదా బలవంతముగా ప్రసవము అయ్యేలా చేయడము-తప్ప మరొక చికిత్స మార్గము లేదు. ఇది చాలా కష్టము అయిన ప్రసవములలో మాములుగా వచ్చే పెద్ద ఇబ్బంది; ఇది తల్లి మరియు ఇంకా పుట్టని బిడ్డ పై కూడా ప్రభావము చూపిస్తుంది. ప్రీఎక్లంప్సియా అనేది ప్రసవము అయిన ఆరు వారముల తరువాత కూడా రావచ్చును.


 • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

2 comments:

 1. it is highly appreciated work sir. your information is very much useful. M.S.N.Murthy, President, Spoorthy Empowerment and Livelihoods Welfare Society (R), East Godavari.

  ReplyDelete
 2. Hello sir.... Pregnency tym lo dates(karjuralu) tinavachha...

  ReplyDelete

Your comment is very important to improve the Web blog.