కొంతమందికి బస్సు/రైలు ప్రయాణం మొదలు పెట్టగానే వాంతులు మొదలవుతాయి. వాహనాల్లోని వాసనలు, కదలికల్ని తట్టుకోలేరు. గమ్యం చేరే వరకూ వాంతులతో ఇక్కట్లు పడుతుంటారు. దీనినే 'మోషన్ సిక్‌నెస్' అంటారు. పిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంది. వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మెదడుకు చేరే కదలికల సంకేతాల్లో తేడాలే దీనికి కారణం. వాహనంలో సీటులో కదలకుండా కూర్చున్నా .. వాహనం కదులుతుండటం వల్ల చెవుల్లో ఉండే సమతౌల్య కేంద్రం ప్రభావితమవుతుంది. ఫలితంగా కళ్లు తిరగటం, వికారంగా ఉండటం, వాంతులవ్వటం జరుగుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో చిన్నచిన్న చిట్కాలతో సమస్యను అధిగమించవచ్చు. సీట్లోనే కాస్త ముందుకు వంగి కూర్చోవటం, వాహనం మధ్య భాగంలో కూర్చోవటం వల్ల కొంత ఫలితం ఉంటుంది. నిమ్మకాయ వాసన చూడటం, అల్లంతో తయారు చేసిన స్వీట్లు అల్లంమురబ్బా వంటి వాటితో వికారం తగ్గుతుంది. ప్రయాణానికి అరగంట ముందు.. 'అవోమిన్(Avomin)' వంటి మందులు వేసుకుంటే వాంతులు ఆగిపోతాయి. మీ పిల్లల వైద్యుల్ని సంప్రదిస్తే సరైన మందుల్ని ఇస్తారు. కొంతమంది పిల్లలు వయసు పెరుగుతున్నకొద్దీ, లేదా తరచూ ప్రయాణాలు చేస్తున్నకొద్దీ ఈ సమస్య నుంచి బయటపడతారు.
- =====================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.