అన్ని అవయవాలలాగానే చర్మము కూడా ఏజింగ్ ప్రోసెస్ కు లోనవుతుంది . అందువలన చర్మము ముడతలు పడడము , కళ్ళు కింద ఉబ్బడము , కళ్ళ కింద చారలు , కల్లకింద నల్లగా అవడము , కళ్ళకింద వలయాలు , నుదిటిపై ముడతలు వంటివి ఏర్పడతాయి. అందమంటే చర్మమే కదా! తెల్లటి శరీరచ్ఛాయతో మెరిసిపోవటమే సగం అందానికి కారణం. రోజులు పెరిగే కొద్ది శరీరపు చర్మసౌందర్యం మెరుపు తగ్గిపోతుంది వయసువలనే . కాంతులీనే చర్మాన్ని తిరిగి సంపాదించకోలేక పోయినా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు సత్పలితాలు కనిపిస్తాయి .
జాగ్రత్తలు :
జీవన విధానము లో మార్పులు :
ఎండదెబ్బకు గురికావడము ,
ధూమపానము ,
ఆహారపు అలవాట్లు ,
ఒత్తిడి ,
ఫ్రీరాడికిల్స్ పేరుకుపోవడం ,
నిద్రలేమి ,
జన్యుసంబంధ కారణాలు ,
ఎక్కువ గంటలు పనిచెయ్యడం ,
సూర్యరశ్మికి ఎక్ష్పోజ్ అవడము ........................ముఖ్యమైనవి .
ముడతలు లేకుండా ఉండాలంటే ధూమపానము మానండి . ఎండకు ఎక్ష్పోజ్ అవవద్దు , పోషకాహారము తీసుకోవాలి -- నిమ్మజాతి పండ్లు తినాలి . ఆకుకూరలు వాడాలి , కనీషము 8-10 గంటలు నిద్రపోవాలి , ఎ , సి , డి, ఇ , విటమిన్లు కలిగిన ఆహారము తీసుకోవాలి .
చర్మ ఆరోగ్యానికి :
ఎక్కువగా నీరు త్రాగాలి ... నీరు త్రాగితే శరీరములోని మలినాలు , విషపదార్ధాలు బయటికి విసర్జించబడి చర్మము ఆరోగ్యము గా ఉంటుంది . రోజుకు సుమారు 2 లీటర్లు నీరు త్రాగాలి. ఎండలో తిరగటం ఎక్కువ శారీరకశ్రమ, ఇవన్నీ చర్మసొగసును మసక బారేలా చేసి నల్లబరుస్తుంది. స్నానం చేశాక తుడుచుకున్నపుడు చూసుకుంటే మన చర్మపు రంగు ఏమిటో ప్రస్తుతం బైటికి కనిపించే శరీర అవయవాల రంగేమిటో తెలుస్తుంది. అంత తేడా వుండటానికి కారణం బట్టలతో చర్మాన్ని రక్షణగా వుంచకపోవటం, అలా అని శరీరం అంతా బట్టలతో చుట్టుకోమని కాదు స్నానం చేశాక కాలాన్ని బట్టి మాయిశ్చరైజర్ రాసుకోవటం, చలికాలం అయిత కోల్డ్ క్రీము రాసుకోవటం చేయాలి. మనం చేయాల్సింది ఎండలో బైట తిరిగేటపుడు కేర్ తీసుకోవటం, బ్యూటీ పార్లర్‌కు వెళ్ళే మీకు తెలియనిది కాదు. పార్లర్‌లో ఫేషియల్ చేయించుకొని ఎండలో బైటికి వచ్చి ఇంటి కొచ్చి చూసేసరికి అయ్యో అలానే వున్నానే అక్కడే పార్లర్‌లోనే కాసేపాగి వచ్చినా సరిపోయేది లేదా సాయంత్రం వెళితే సరిపోయేదే, అని అనుకోవటం సహజం.
అంటే ఎండలో వుంటే రెండు వందలు పెట్టి చేయించు కున్న ఫేషియల్ కూడా పోతుందంటే రోజూ ఎండలో ఏ మాత్రం కేర్ లేకుండా తిరిగే మీ చర్మపు రంగులో ఎంత మార్పు వస్తుంది. కారణం అర్ధమయిందిగా, సూర్యుని నుంచి వచ్చే యూవి కిరణాలు చర్మసౌందర్యాన్ని డిస్ట్రబ్ చేస్తాయి. మెరిసిపోయే మీ అందాన్ని హరింపచేస్తాయి.విటమిన్ 'సి' మెలనిన్ ఉత్పత్తిని నిషేధించి చర్మం రంగును, కాంతిని మెరుగు పరుస్తుంది. వయసుని పళ్ళరసాలు తగ్గిస్తాయి. సూర్యకిరణాల్లో హాని చేసే యూవి-బి కిరణాల నుంచి కూడా విటమిన్ 'సి'వల్ల రక్షణ పొందవచ్చు. శరీరఛాయ నల్లబడకుండా ఎక్సట్రా బెనిఫిట్ ఇస్తుంది. కాబట్టి సూర్మరశ్మి శరీరానికి అవసరమైనంత తీసుకోవాలి.
ఎక్కువగా ఎండలో వుంటే చర్మం నల్లబడి పోతుంది. ఇప్పటి దుస్తులు కూడా అలానే వున్నాయి. శరీరానికి ఎండ బాగా తగిలే విధంగా వుంటున్నాయి. చర్మానికి కొత్తదనముతో పాటు చర్మము చిట్లకుండా వుండాలంటే ఆహారములో మార్పులు రావాలి. అంటే విటమిన్ 'ఎ' వుండే ఆహార పదార్ధాలను తీసుకోవాలి.
బీట్‌రూట్ సహజ క్లెన్సర్‌లా పనిచేసి చర్మాన్ని ప్రకాశవంతంగా, కోమలంగా మృదువుగా వుంచుతుంది.సాధారణంగా ముఖానికి ఎటువంటి మేకప్ చేయకుండా వుండటమే మంచిది. మరీ అవసరమైతే తప్ప మేకప్ వేసుకోకూడదు. అందులో మేకప్‌కు మీరు వాడే సామాగ్రి బ్రాండెడ్ అయి వుండాలి. సాధారణ ప్యాకలు అంటే ఇంట్లో చిట్కాలను ఉపయోగించి ప్యాక్స వేసుకోవచ్చు. దీని వలన ముఖానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స వుండవు. అంతేకాక ముఖం పై ముడతలు కూడా రావు.
ఆహారములో మార్పులు :
టివిలో, పేపర్‌లో వచ్చే ప్రకటలను చూసి వందల రూపాయలు పోసి అనేక రకాల క్రీములు కొంటున్నారు. వాటివల్ల ఎంతవరకు ప్రయోజనం కలుగుతుందనేది మాత్రం ప్రశ్నగానే మిగిలి పోతోంది. అందుేక కృత్రిమంగా తయారు చేసే క్రీములపై ఆధార పడడం అంత మంచిది కాదంటున్నారు సౌందర్య నిపుణులు.సహజసిద్ధంగా తయారయ్యే పండ్లు, నట్స్‌తో కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు అంటున్నారు వారు.
మనం నిత్యం ఉపయోగించే పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. కేవలం శరీరానికి శక్తి నివ్వడమే కాకుండా చర్మానికి మంచి కాంతి తేవడంలో ఇవి ఎంతగానో దోహదపడుతాయి.
నారింజ :
నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌ను ఉత్పత్తి చెయ్యడంలో సహా యపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమినసి అవసరమవుతుంది. నారింజ జ్యూస్ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది.
బొప్పాయి :
చూడగానే నోరూరించే బొప్పాయి పండులో తక్కువ కేలరీలుంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.నిర్జీవమైన చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. బొప్పాయి గుజ్జుతో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే మంచిది.
గోధుమలు :
గోధుమలలో బి గ్రూపుకు చెందిన విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. చర్మంలో మరణించిన కణాల స్థాన ంలో కొత్తకణాల పెరుగుదలలో ముఖ్యపాత్ర వహిస్తాయి. స్ట్రెస్, ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా చర్మం పాడవకుండా కాపాడతాయి.పగిలిన చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది. వీటిలో ఉండే నియాసిన్, చర్మ ణాలు రక్తంలో ఉన్న పోషకాలను గ్రహించేలా చేస్తుంది. గోధుమపిండితో చేసే బిస్కెట్స్, బ్రెడ్‌ను ఎక్కువగా తినాలి.
ప్రొద్దుతిరుగుడుపువ్వు గింజలు : తేలికగా, క్రిస్పీగా ఉండే ఈ గింజలలో ఫాటీ యాసిడ్స్ ఉంటాయి.ఇవి చర్మం తేమ ను కోల్పోకుండా చేసి కోమలంగా తయారు చేస్తుంది. బ్లాక్‌ెహడ్స్‌ను నిర్మూలిస్తాయి. మచ్చలు కూడా తగ్గుతాయి. వారానికి రెండుసార్లు రెండు టేబుల్ స్పూన్‌ల ప్రొద్దుతిరుగుడు గింజలు తీసుకోవాలి. వంటకు కూడా సన్‌ఫ్లవర్‌నూనెను ఉపయోగించడం మంచిది.
గింజధాన్యాలు :
చర్మకణాల పెరుగుదలకు ఉపయోగపడే ప్రోటీన్లు గింజ ధాన్యాలలో అధిక మోతాదులో ఉంటాయి. చుండ్రును నిర్మూలించే బయోటిన్ అనే పోషకం వీటిలో ఉంటుంది. బయోటిన్ జుట్టు త్వరగా పెరగడానికి తోడ్పడుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా గింజధాన్యాలు తింటే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ధాన్యాలను ఉడకబెట్టి గుగ్గిళ్ళ రూపంలో తీసుకుంటే చాలా మంచిది. దీనివల్ల నెట్ కేలరీలు, జింక్ అధికశాతం లభిస్తాయి. జింక్ దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల కలిగే రాషెస్ రాకుండా చేస్తుంది. క్రమం తప్పకుండా గింజధాన్యాలు తినడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. కలబంద ప్రతిరోజూ కలబంద జ్యూస్ తాగడం వల్ల చర్మంపై వచ్చే దురదలు, మొటిమలు, పి గ్మెంటేషన్ సమస్యలను తగ్గించుకోవచ్చు. రోజుకు 30 మిల్లీ లీటర్ల జ్యూసును తీసుకోవాలి.
నట్స్ : బాదం, కర్జూరాల వంటి డ్రై ఫ్రూట్స్‌లో క్యాలరీలు, జింక్ అధిక శాతం ఉం టాయి. జింక్ దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల కలిగే రాషెస్ రాకుండా చేస్తుంది. రఫ్‌గా ఉండే చర్మాన్ని మృదువుగా చేస్తుంది. క్రమం తప్పకుండా నట్స్ తినడం వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది. జీర్ణప్రక్రియలో కూడా డ్రైఫ్రూట్స్ చాలా ఉపయుక్తంగా ఉంటాయి. వీటిలో ఉండే పీచు పదార్థాలతో మలబద్ధకం నివారణ అవుతుంది.
- ======================================
chala bagundi mee yokka sugetion
ReplyDeletevery very good sugitions thak u
ReplyDelete