Wednesday, April 25, 2012

శారీరక రుగ్మత తెలిపే వాంతి,Vomiting is a warning signal


  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - వాంతి - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...





జ్వరంలాగే వాంతులు కూడా శరీరంలో ఏదో సమస్యతలెత్తిందని తెలియజేసే లక్షణం. వాంతి కావటమనేది ఒక రోగం లేదా అస్వస్థత కాకుండా, శరీరం ఏదో ఇబ్బందిని చెబుతోందని తెలియజేసే వార్నింగ్‌ సిగ్నల్‌ మాత్రమే.వాంతులు ఎంత తీవ్రంగా ఉన్నాయి? ఎప్ప టినుంచి జరుగుతున్నాయి? వాంతి చేసుకున్న  పదార్థం ఏ రంగులో ఉంది? వాంతితోపాటు కని పిస్తున్న మిగిలిన లక్షణాలు ఏమిటి? అనే అంశా లనుబట్టి వాంతులకు కారణమేమిటో చూచా యగా  పసిగట్టవచ్చు.

వాంతి--బలవంతంగా జీర్ణకోశంలోని పదార్ధాలు నోరు, అరుదుగా ముక్కు ద్వారా బయటకు రావడాన్ని వాంతి బహువచనం వాంతులు (Vomiting) అంటారు. ఇది ఒక వ్యాధి లక్షణము. కొన్ని ప్రాంతాలవారు దీనినే కక్కు అంటారు. వాంతులు వివిధ కారణాల వలన కలుగుతాయి. జీర్ణాశయంలోని కారణాలు, తల నొప్పి వంటి కొన్ని మెదడుకు సంబంధించిన బయటి కారణాలు. వాంతి అవుతుందేమో నన్న భయాన్ని వికారం అంటారు. ఎక్కువగా  వాంతులవుతున్నప్పుడు వీటిని ఆపడానికి వైద్యం అవసరం. తీవ్రమైన పరిస్థితులలో ద్రవాలను నరం ద్వారా ఎక్కించవలసి వస్తుంది.

శరీరం తనకుతానుగా వెలువరించే వాంతులు నిజమైన వాంతులు లేదా ట్రూ వామిటింగ్స్‌లోకి వస్తాయి. శరీరంవెలువరించే వాంతులు నాలుగు దశలలో  జరుగుతాయి. మొదటగా వాంతి రావ డానికి సూచనగా వికారంగా ఉంటుంది. తరు వాత నోటిలో నీరు ఊరడం జరుగుతుంది. ఈ దశను వాటర్‌బ్రాష్‌ దశ అంటారు. మెదడులో లాలాజల ఉత్పత్తి కేంద్రం, వాంతిని ప్రేరేపించే కేంద్రం పక్కపక్కనే ఉండటం దీనికి కారణం. ఆ తరువాత దశను డోక్కోవడం అంటారు. వాంతి చేసుకోవాలనే తపన గొంతునుంచి వస్తుంటుంది. ఎంత డోక్కున్నప్పటికీ వాంతి కాదు. చివరగా వాంతి చేసుకోవడం జరుగుతుంది. లోపలినుంచి  పదార్థాలు వాంతి ద్వారా బైటకు వస్తాయి.
వాంతిని ప్రేరేపించే కేంద్రం మెదడు అడుగు భాగాన ఉండే బ్రెయిన్‌ స్టెమ్‌లో ఉంటుంది. రక్త ప్రవాహంలో శరీరానికి సరిపడని పదార్థాలు ఉన్నప్పుడు మెదడులోని వాంతిని ప్రేరేపించే కేంద్రంలోని రిసెప్టార్స్‌ వాటిని తట్టుకోలేక జీర్ణా శయం, అన్నవాహిక కండరాలు సంకోచ వ్యాకో చాలు జరిగేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా వాంతి జరుగుతుంది. వాంతి మరొక రకంగా కూడా జరుగుతుంది. జీర్ణాశయం, ప్రేవుల్లో కొన్ని రకాల అప్‌సెట్స్‌ సంభవించినప్పుడు మెదడులోని వామిటింగ్‌ కేంద్రం  ప్రేరణకు గురవుతుంది.


కలుషిత ఆహారంకలుషిత ఆహారాన్ని తిన్నప్పుడు కొన్ని గంటల తరువాత లోపల అసౌకర్యాన్ని  ఫీలవుతాము. వాంతులు మొదలవుతాయి. ఎన్ని గంటలలోపల వాంతులు  మొదలవుతాయనేది మన శరీరంలో ప్రవేశించిన సూక్ష్మక్రిములు లేదా వాటి తాలూకు విషం ప్రభావాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి రెండు మూడు గంటలు పట్టవచ్చు. కొన్నిసార్లు 24 గంటలు కూడా పట్టవచ్చు.  సాధారణంగా వికారం, వాంతులు అతి తీవ్రంగా ఉంటాయి. అప్పుడప్పుడూ పొత్తికడుపులో పోట్లు, చెమట పట్టడం ఉంటుంది. అయితే ఇవి కొద్దిసేపు మాత్రమే. లోపలికి చేరిన కలుషితాహారాన్ని బైటకు పంపడానికి శరీరం చేసే ప్రయత్నమే వాంతి. ఈ ప్రయత్నంలో వికారంగా ఉండటం, వాంతులు కావడంతోపాటు విరేచనాలు కూడా ఉండే అవకాశం ఉంది. కొన్ని రకాల వైరస్‌ల వలన కూడా వికారం, వాంతులు కావడం జరుగుతాయి. దీనికి ఉదాహరణ అతిసార వ్యాధి. ఈ వ్యాధిలో జీర్ణాశయం, ప్రేవులు వాపునకు గురి కావడం జరుగుతాయి. వాంతులు, నీళ్ల విరేచనాలు మొదలవుతాయి. బస్సుల్లో,  రైలులో ప్రయాణించే కొందరిలో వాంతులు కావడాన్ని మనం గమనిస్తూ ఉంటాము. మన శరీరపు బ్యాలెన్స్‌ మెకానిజమ్‌ తలకు పక్క భాగంలో శబ్దాలను మెదడుకు చేరవేసే చెవి లోపి భాగానికి పక్కన పుర్రె తాలూకు ఎముకలలో నిర్మితమై ఉంటుంది. ఇక్కడ నిండుగా ఉన్న ద్రవంతో కూడిన మూడు అర్థ చంద్రాకారపు కాలువలు ఉంటాయి. తలను పక్కకు తిప్పినప్పుడల్లా కాలువ లైనింగ్‌ మీద ఉండే సూక్ష్మ కేశ నాళికలు ప్రేరణ చెందుతుంటాయి. ఈ కేశనాళికల చలనానికి సంబంధించిన ఈ ప్రేరణ అధికమైనప్పుడు వికారంగా అనిపిస్తుంది. దానినుంచి వాంతులు అవుతాయి. దీనిని మోషన్‌ సిక్‌నెస్‌ అంటారు.
కొన్ని రకాల మందులకు వాంతి కలిగించే గుణం ఉంటుంది. చేపనూనెతో చేసిన కాప్సూల్స్‌, యాంటీబయాటిక్స్‌లో అత్యధిక భాగం, ఆస్తమాకు వాడే థియోఫిలైన్‌, నొప్పిని తగ్గించడానికి వాడే మాత్రలు, ఎక్కువ మోతాదులో తీసుకునే పొటాషియం, జింక్‌ మాత్రలు, కేన్సర్‌ నివారణకు వాడే మందులు మొదైలనవి వాంతులు తెప్పిస్తాయి.


కొన్ని కారణాలు :
  •  జీర్ణ వ్యవస్థ,

    * జీర్ణాశయం వాపు (ఆహార సంబంధమైనవి, వైరస్),
    * పైలోరిక్ స్టెనోసిస్ (చిన్న పిల్లలలో ఎక్కువగా కనబడుతుంది),
    * ప్రేగులో అడ్డంకి
    * విపరీతమైన కడుపు నొప్పి,
    * పిత్తాశయము(gall blader), క్లోమము(pancreas), ఉండుకము(Appendix), కాలేయము(Liver) వాటికి సంబంధించిన వాపులు,
    * ఆహర సంబంధిత అలర్జీ (పిల్లలకు పట్టే పాలలోని లాక్టోజ్ పడకపోవడం),

  • మెదడు మరియు జ్ఞానేంద్రియాలు,

    * ఎక్కువగా కదలిక వలన లోపలి చెవిలోని జ్ఞానేంద్రియాల మూలంగా,
    * తలకు దెబ్బ తగలడం,
    * మెదడులో రక్తస్రావం,
    * మైగ్రేన్ అనే ప్రత్యేకమైన తలనొప్పి,
    * మెదడులో ట్యూమర్లు,
    * మెదడులోని పీడనం ఎక్కువగా ఉండటం.,

  • జీవ క్రియలు,

    * రక్తంలో కాల్షియమ్ ఎక్కువ కావడం,
    * యురీమియా (రక్తంలో యూరియా ఎక్కువ కావడం, మూత్రపిండాల వైఫల్యం కారణంగా,
    * అధివృక్క గ్రంధి(Adrenal gland) వైఫల్యం,
    * రక్తంలో గ్లూకోజ్ తక్కువ కావడం,

  •  గర్భానికి చెందినవి,

    * ముత్యాల గర్భం,
    * Hyperemesis, Morning sickness,

  • మందులు, ఇతర పానీయాలు,

    * ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం,
    * ఓపియమ్ తీసుకోవడం,
    * కాన్సర్ వైద్యంలో వాడుతున్న మందులు,

  • మానసినమైనవి,

    * మానసిక కారణాల మూలంగా వారంతట వారే వాంతి చేసుకోవడం,
    * అసహ్యమైన వాటిని చూచినా, వాసన చూసినా, ఆలోచించినా కొందరిలో వాంతవుతుంది.
    * ఎక్కువ మోతాదులో రేడియేషన్,
    * ఫిట్స్ మొదలైన తీవ్రమైన క్రియలు,
    * అతిగా భయం,


చికిత్స :
  • సాధారణము గా వాంతిని కలిగించే కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. డోకులకు , వాంతులకు యాంటి ఎమెటిక్స్ వాడుతారు . యాంటి ఎమిటిక్స్ ... మెదడు లోని కీమోరిసెప్టార్ ట్రిగ్గర్ జోన్‌ (chemo receptor trigger zone) ని అదుపు చేయడము వలన ఈ ప్రక్రియ జరుగుతుంది . కొన్ని యాంటి ఎమిటిక్స్ రిసెప్టార్ బిందువులను inhibit చేయడము వలన వాంతి ప్రక్రియ అదుపులో ఉంటుంది . ఉదా : anticholinergics, antihistamines, dopamine antagonists, serotonin antagonists, and cannabinoids are used as anti-emetics.

మార్కెట్ లో దొరికే కొన్ని మాత్రలు పేర్లు :
  • Tab . Domperidone (Domestal) one tab three time / day.
  • Tab. Doxylamaine succinate (Doxynate) 1 tab 2-3 time / day
  • Tab . (Avomine) 2-3 tabs / day.
  • Tab . Stemtil 2-3 tabs / day

చిన్నపిల్లల విషయము లో వైద్యుని సంప్రదించాలి . 

  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.