Tuesday, April 24, 2012

కార్డియో పల్మనరీ రిసస్సిటేషన్‌ (సిపిఆర్‌),హృదయ శ్వాస పునరుద్ధారణ .Cardio-pulmonary Resuccitation(CPR),కృత్రిమ శ్వాస

  •  
  •  image : courtesy with Naadi Vartha News paper.
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Cardio-pulmonary Resuccitation(CPR),కృత్రిమ శ్వాస- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


గుండె ఆగినట్లు తెలుసుకోవడమెలా?
హఠాత్తుగా Heart ఆగిపోయినప్పుడు మనిషిని బ్రతికించడానికి చేసే ప్రక్రియను కార్డియో పల్మనరీ రిసస్సిటేషన్‌ (సిపిఆర్‌) అంటారు. తెలుగులో దీనిని హృదయ శ్వాస పునరుద్ధారణ అనవచ్చు. సిపిఆర్‌ చేయడానికి ప్రత్యేక విద్యార్హతలేమీ అక్కరలేదు. అందరూ నేర్చుకోవచ్చు. ప్రమాదా నికి గురైన వ్యక్తిని కాపాడటానికి ఆ మనిషి పక్కన ఎవరుంటే వారు సిపిఆర్‌ చేయవచ్చు. గుండె హఠాత్తుగా ఆగిపోయినట్లు తెలుసుకోవ డానికి ఈ కింది సూచనలు గమనిస్తే చాలు.
స్పృహ కోల్పోవుట--అంతవరకూ స్పృహలో ఉన్న మనిషి అమాం తంగా స్పృహ కోల్పోతే గుండె ఆగిపోయినట్లు అనుమానించాల్సిందే.
నాడీ స్పందన కోల్పోవడం--నాడిని శరీరంలోని వివిధ భాగాల్లో పరీక్ష చేయవచ్చు. కాని సామాన్య ప్రజానీకానికి వీలయినది ఎడమచేయి మణికట్టు దగ్గర బొటన వేలు వైపు ఉన్న నాడి. దీనిని పరీక్షించవచ్చు.

ప్రక్రియలోని ముఖ్యాంశాలు
వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టాలి. వీలుంటే గట్టిగా ఉండే మంచంమీద కాని, నేలమీద కాని పడుకోబెట్టాలి. లేదా వీపు కింద బోర్డును కూడా దూర్చవచ్చు. ప్రత్యేకంగా వీటికోసం కాలాన్ని వృధా చేయడం అసలుకే ముప్పు వస్తుంది. ఈ సమయంలో ప్రతీ సెకనూ విలువైనదే.
శ్వాస ద్వారాల శుభ్రత---ముక్కు, నోరు, గొంతులో ఏమైనా అడ్డుకుని ఉంటే తీసివేసి శుభ్రపరచాలి.

కృత్రిమ శ్వాస, గుండె పునరుద్ధరణ
ఈ రెండు ప్రక్రియలు కలిపి ఒక్కసారే జరపాలి. కృత్రిమ శ్వాస ఉద్దేశ్యం ఊపిరితిత్తుల్ని గాలితో నింపడమూ, తద్వారా గాలిలోని ప్రాణవాయువు రక్తంలో లీనమవడమూ. ప్రాణవాయువుతో నిండిన రక్త ప్రసరణ లేకపోతే మెదడు కణాలు జీవించడం కష్టం. ప్రమాదానికి గురైన వ్యక్తి నోటి ద్వారా శాసనందించవచ్చు. ఇది చేసేప్పుడు వ్యక్తి ముక్కును మూసి ఉంచాలి. రెండవ విధానంలో నోటి ద్వారా ప్రమాదానికి గురైన వ్యక్తి ముక్కుద్వారా శ్వాసనందించవచ్చు. ఇది చేసేప్పుడు వ్యక్తి నోటిని మూసి ఉంచాలి.
గుండె వత్తిడి---గుండె, రొమ్ము ఎముకకు, వెన్నెముకకు మధ్య ఛాతీలో ఉంటుంది. అందుకే రొమ్ము ఎముక కింది భాగం మీద ఒక అరచేతి మీద ఇంకొక అరచేతిని ఆనించి గట్టిగా వెన్నెముకవైపు వత్తితే గుండెకు వత్తిడి కలిగి ఆ కారణంగా గుండెలో ఉన్న రక్తం శరీరానికి, ముఖ్యంగా మెదడుకు ప్రసరణమవుతుంది. ఈ ప్రక్రియను నిముషానికి 60 నుంచి 70 సార్లు చేయాలి. గుండె వత్తిడి, కృత్రిమ శ్వాస ప్రక్రియలు విడి విడిగా వివరించినా, రెండూ ఒకే సమయంలో చేయాలి. సిపిఆర్‌ ప్రక్రియ విజయవంతమైందని తెలుసుకోవడానికి వ్యక్తి కోల్పోయిన నాడి మళ్లీ అందుతుంది. వ్యక్తి కనురెప్పలు మన చేతివేళ్ల తాకిడికి స్పందిస్తాయి.
  • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.