Saturday, April 21, 2012

Ulcer and Cancer difference,అల్సర్ కి క్యాన్సర్ కి తేడా ఏమిటి?
  • http://4.bp.blogspot.com/-oUbpQm20PyM/TWJyjL8zYII/AAAAAAAABgs/FZcbTTTGzwQ/s1600/peptic%2Bulcer.jpg
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు 
జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -అల్సర్ కి క్యాన్సర్ కి తేడా - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • నీరు తక్కువ తాగడము వల్లనో , లేక పెరుగుతున్న మానసిక ఒత్తిడి వల్లనో ప్రతి   ఒక్కరు జీవిత కాలములో ఏదో ఒక దశలో అల్సర్ కు గురి అవడము జరుగుతుంది . అందుకనే విద్యార్ధులలో పరీక్షల సమయములో ఎక్కువగా నోటిపూత గమనిస్తూ ఉంటాము . సాదారనము గా మూడు , నాలుగు రోజులలో తగ్గిపోయే అల్సర్లు అంతకంటే ఎక్కువకాలము ఉండి తరుచుగా భాధిస్తూ ఉంటే ఎవ్వరికైనా అనేక అనారోగ్య అనుమానాలు వేధిస్తు ఉంటాయి. అల్సర్ లకు సంబంధించి నోటి పూతతో పాటు , పెప్టిక్ అల్సర్ , గ్యాస్ట్రిక్ అల్సర్ , ఈసోపేగల్ అల్సర్ , కదలలేని పరిస్థితి లో మంచానికి పరిమితమైనపుడు ఏర్పడే పుండ్లు , సిఫిలిస్ , హెర్పిస్ వలన జెనిటల్ మర్మావయవాలలో అల్సర్లు , డయాబెటిక్ న్యూరోపతిక్ తో కాళ్ళలోవచ్చే అల్సర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. 

జీర్ణవ్యవస్థకు సంబంధించిన అల్సర్ ను పెప్టిక్ అల్సర్ అంటాము . జీర్ణకోశము , చిన్నప్రేగులలొ ఇవి పుడతాయి. జీర్ణ కోశములో ఉంటే ;;; గ్యాస్ట్రిక్ అల్సర్ గాను , చిన్నప్రేగులో ఉంటే డియోడినల్ అల్సర్ గానూ పిలుస్తారు . జీర్ణవ్యవస్థలో ఎక్కువగా కనిపించే ఈ పూత 1% వరకు క్యాన్సర్ గా మారే ప్రమాధము ఉంది . గ్యాస్ట్రిక్ అల్సర్ ఎక్కువగా క్యాన్సర్ గా మారే ప్రమాదము ఉంది  .

1980 వరకు అల్సర్ కు , పూతకు మసాలా ఆహారము , కారము , ఒత్తిడి , ఆల్కహాల్ తాగడము , పొగాకు సంబంధిత మత్తుపదార్ధాలు నమలడము , తిన్డము అనుకునేవారు . దాదాపు వంద సంవత్సరాలు అల్సర్ కు కారణము అవే అనుకొని వీలైనంత వరకు వాటికి దూరం గా ఉండమని సలహాలు ఇచ్చేవారు వైద్యులు . 1982 లో " టారీమార్షల్ మరియు రాబిన్‌ వారెన్‌ " అనే ఇద్దరు డాక్టర్లు  జీర్ణ వ్యవస్థకు సంబంధించిన పూత , అల్సర్ లకు కారణము " హెలికోబాక్టర్ పైలోరి (Helicobactar pylori) ... హెచ్.పైలోరి .. అనే బ్యాక్టీరియా అని కనుగొన్నారు . దీనికి వారికి నోబెల్ బహుమతి వచ్చింది .  మన జనాభాలో 90% మంది ఎప్పుడో ఒకప్పుడు ఈ బాక్టీరియాకు గురి అవుతారు .ఇవి డియోడినం లో నిరరంతరము ఉండి  జీవిస్తూ ఉంటాయి.  ఒత్తిడి , ఎసిడిటి , స్మోకింగ్ , ఆల్కహాల్ తాగడము వంటి కారణాలవల్లనో  లేక శరీర తత్వమువల్లనో జీర్ణవ్యవస్థ లైనింగ్ దెబ్బతిని ఈ బాక్టీరియా వలన అల్సర్ ఏర్పడడము జరుగుతుంది .

వ్యాధి లక్షణాలు

జీర్ణాశయం అల్సర్‌ : బాగామంటతో కూడిన నొప్పి. అన్నం తింటూనే ఎక్కువై, 3,4 గంటల తర్వాత తగ్గుతుంది. అన్నం సహించకపోవడం. ఆకలి మందగించడం. వాంతుల వడం. బరువు తగ్గడం. వాంతి అయితే నొప్పి తగ్గడం. ఇవి దీని సాధారణ లక్షణాలు. జీర్ణాశయంలో రక్తస్రావం జరిగితే, కాఫీ, డికాక్షన్‌ లాగ వాంతులవడం, మనిషి నీరసిం చిపోవడం జరుగుతుంది. ఇది అత్యవసర పరిస్థితి.

డ్యుయోడినల్‌ అల్సర్‌ : కడుపు పైభాగంలో మంటతో కూడిన నొప్పి. ఖాళీ కడుపు వున్నప్పుడు నొప్పి అధికమవుతుంది. అన్నం తిన్న రెండు, మూడు గంటలు దాటిన తర్వాత, అర్థరాత్రి, తెల్లవారు జామున అధికనొప్పి రావడం. అప్పుడేమైన తిని నీళ్లు తాగితే తగ్గుతుంది. ఇవి ముఖ్య లక్షణాలు. దీని లోపల, పుండు నుండి రక్తస్రావం జరిగితే వాంతితో పాటు, తారులాగా నల్లగా విరేచనమవుతుంది. ఇది అత్యవసర పరిస్థితి.

విపరీతలక్షణాలు : అల్సర్‌ నుండి రక్తస్రావం అవుతుంది. గ్యాస్ట్రిక్‌ అవుట్‌లెట్‌ అవరోధం. పుండు వున్న చోట రంధ్రం పడడం. పైలోరిక్‌ స్టినోసిస్‌ ఏర్పడడం. పుండు క్యాన్సర్‌గా మారటం.

వ్యాధి / బాదలను ప్రేరేపితము చేసే కారకాలు : 


*వంశపారంపర్యంలో ఒక రకమైన జన్యువుల వల్ల.

*పొగతాగే వారిలో అవకాశం అధికం.

*గాస్ట్రినోమ అనే క్లోమగ్రంథిలో పెరిగే గడ్డ వల్ల.

*కొంతమందిలో గ్యాస్ట్రోజెజునాష్టమి ఆపరేషన్‌ చేసిన తర్వాత ఏర్పడొచ్చు.

*ఎక్కువ ఆందోళన చెందేవారిలో.

*మద్యం అపరిమితంగా సేవించేవారిలో.

*ఎక్కువ కారం, పులుపు, మసాల దినుసులు వాడే వారిలో.

*జీర్ణాశయంలో ఎక్కువ యాసిడ్‌ తయారవటం వల్ల.

*'హెచ్‌.పైలోరి' అనే సూక్ష్మజీవుల కడుపు లో చేరడము వలన .

వొళ్లు నొప్పులు తగ్గించే (పెయిన్‌కిల్లర్స్‌) కొన్ని మందుల వల్ల.ఈ పెప్టిక్‌ అల్సర్‌ ఏర్పడుతాయి.

ఎలా మొదలవుతుంది ?

*జీర్ణాశయంలో ఎక్కువ జీర్ణరసం ఉత్పత్తి.

*జీర్ణాశయం లోపలి వుండే పల్చటి పొర (గ్యాస్ట్రిక్‌ మ్యూకోజ) దెబ్బతిన్నప్పుడు (మద్యం అతిగా సేవించే వారిలో ఆస్పిరిన్‌ మొదలైన మందులు *వాడేవారిలో ఆ పొర దెబ్బ తింటుంది.)

*పెస్సిన్‌ ఆమ్లం ఎక్కువ ఉత్పత్తి అయి గ్యాస్ట్రిక్‌ మ్యూకోజా దెబ్బతిన్నప్పుడు.

*చర్మం కాలినప్పుడు, కొన్ని రక్త ప్రసరణ రోగాలు వచ్చినప్పుడు.

వ్యాధి నిర్ధారణ

జిఐ ఎండోస్కోపి, బేరియం ఎక్సరే, రాపిడ్‌ బయాప్సి‌ (హెచ్‌.పైలోరి కనుక్కోవడానికి)

దాదాపు గ్యాస్ట్రిక్ అల్సర్ లాగానే పొట్టకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. చాలా కాలము గా వస్తూ , పోతూ ఉండే అల్సర్లే ... కాన్సర్ గా మారిపొతాయి. అల్సర్ చుట్టూ దలసరిగా కణితి లా తయావుతుంది . .ట్రీట్మెంట్ కూడా కణితి వచ్చిన ప్రదేశము , స్టేజ్ , వయస్సు , ఇతర ఆరోగ్యవిషయాలపై ఆధారపడి ఉంటుంది . లింఫ్ నోడ్స్ క్యాసర్ కు గురి అయితే చికిత్స కష్టమవుతుంది . జీర్ణ కోశాన్ని కొంతబాగము , చిన్నపేగులలో కొంతభాగాన్ని లింఫ్ నోడ ను వీలైనంతవరకు తీసివేయడము , . .చేస్తారు . కీమోథెరఫీ కూడా అవసరము ఉంటుంది . ఈ సర్జరీ తర్వాత సప్లిమెంటరీ ట్రీట్మెంట్ ... విటమిన్‌ - డి  , కాల్సియం , ఐరన్‌ , విటమిన్‌ బి.కాంప్లెక్ష్ అవసరము ఉంటుంది.

మంచి గ్యాస్ట్రోఎంటిరాలగిస్ట్ / గాస్ట్రిక్ సర్జన్‌ ని సంప్రదించాలి.

స్టమక్ క్యాన్సర్ లక్షణాలు మొదటి  దశలో అంత ప్రస్పుటంగా ఉండవు . అనుమానించేంత  స్థాయిలో లక్షణాలు బయటపడ్డాయంటే అప్పటికే క్యాన్సర్ స్టేజీ ఎక్కువగా ఉంటుంది . ప్రతిసంవత్సరము ప్రపంచవ్యాప్తం గా సుమారు 8,00,000 మంది ఈ క్యాన్సర్ వ్యాది కి బలైపోతున్నారు .  హెలికోబాక్టర్ పైలోరి  ఈ క్యాంసర్ కు దాదాపు 70% - 80% వరకు కారణము . వీటికి చెడు అలవాట్లు ... మద్యము , పొగ , మసాలా పదార్ధాలు దోహదపడతాయి. హెలికోబాక్టర్ పైలోరి మనము తీసుకునే నీటిలోనే ఉంటుంది. అందుకే పరిశుభ్రమైన నీటిని , ఆహారాన్ని తీసుకోవాలి. పాస్ట్ ఫుడ్స్ తినరాదు . తిన్నవారందరికీ ఈ వ్యాధి వస్తుందనుకోవడమూ పొరపాటే . అనేకానేక కారణాలు , కారకాలు సమ్మిలిత ఫిలితంగా ఈ అల్సర్ / క్యాన్సర్ వస్తుంది . ప్రజలలో అవగాహన కోసమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశము . ----డా .వండాన శేషగిరిరావు . శ్రీకాకుళం ,
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.