Sunday, March 31, 2013

Hyperbaric Oxygen Therapy(HBOT),హైపర్‌బేరిక్‌ ఆక్సిజన్‌ థెరపీ (హెచ్‌బీఓటీ)

  •  


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Hyperbaric Oxygen Therapy(HBOT),హైపర్‌బేరిక్‌ ఆక్సిజన్‌ థెరపీ (హెచ్‌బీఓటీ)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినప్పుడు ఆ గాయాలు ఎంత త్వరగా నయమైతే అంత మంచిది. ఆలస్యం అవుతున్నకొద్దీ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తే అవకాశముంది. కొన్నిసార్లు ఈ ఇన్‌ఫెక్షన్‌ ఒళ్లంతా విస్తరించి ప్రాణాల మీదికీ రావొచ్చు. అందుకే వైద్యులు శక్తిమంతమైన యాంటీబయోటిక్‌ మందులతో గాయాలు త్వరగా నయమయ్యేలా చూసేందుకే ప్రాధాన్యమిస్తారు. అయినప్పటికీ కొందరికి గాయాలు ఎంతకీ మానకుండా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారికి ఉపయోగపడేందుకు రూపొందించిందే హైపర్‌బేరిక్‌ ఆక్సిజన్‌ థెరపీ (హెచ్‌బీఓటీ). మనదేశంలోనూ కొన్ని ఆసుపత్రుల్లో ఇదిప్పుడు అందుబాటులోకి వస్తోంది. హెచ్‌బీఓటీ పరికరంలో ఒత్తిడితో కూడిన ఓ పొడవాటి గాజు గది ఉంటుంది. బయటి వాతావరణం గాలిలో ఆక్సిజన్‌ 20% ఉంటే.. ఇందులో 100% ఆక్సిజన్‌ ఉంటుంది. గాయాలైనవారిని ఈ గాజుగదిలో పడుకోబెట్టటమే ఇందులోని చికిత్స. గాయాలు మానటంలో ఆక్సిజన్‌ కీలకపాత్ర పోషిస్తుంది. మొండి గాయాలు, మధుమేహం పుండ్లు, కాలిన గాయాలు ఏర్పడిన భాగంలో రక్తసరఫరా తగ్గిపోతుంది. గాయాలు మరీ తీవ్రమైతే అసలు రక్తసరఫరానే ఉండదు. అందువల్ల ఆ భాగానికి ఆక్సిజన్‌ అసలే అందదు. అయితే హెచ్‌బీఓటీలో ఒత్తిడిని 1.5 నుంచి 3 రెట్ల వరకు పెంచటం వల్ల శరీరంలోకి ఆక్సిజన్‌ సరఫరా అధికమవుతుంది. దీంతో గాయాలు ఏర్పడిన భాగానికి అవసరమైన మేరకు ఆక్సిజన్‌ అందుతుంది. కొత్త కణాలు, సూక్ష్మ రక్తనాళాలు పుట్టుకొచ్చి గాయం మానే ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. ఈ పద్ధతిలో ఒకసారి చికిత్సకు సుమారు 60-90 నిమిషాల సమయం పడుతుంది. గాయం తీవ్రతను బట్టి దాదాపు 10 నుంచి 20 సార్ల వరకు చికిత్స చేయాల్సి ఉంటుంది. మామూలుగా గాయం మానటానికి నెలరోజులు పడుతుందనుకుంటే.. హెచ్‌బీఓటీ పద్ధతిలో పదిహేను రోజుల్లోనే నయమైపోతుంది. ఇది కాస్త ఖరీదైన చికిత్సే అయినప్పటికీ మొండి గాయాల విషయంలో మంచి ఫలితం కనబరుస్తుండంతో ఆదరణా బాగానే పెరుగుతోంది.
  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Flakes in big vessels of neck and danger, మెడ దగ్గరి పెద్ద రక్తనాళాల్లో పూడికల ప్రమాదం,పక్షవాతం లో కెరోటిడ్‌ ధమనుల పాత్ర

  •  


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Flakes in big vessels of neck and danger, మెడ దగ్గరి పెద్ద రక్తనాళాల్లో పూడికల ప్రమాదం,పక్షవాతం లో కెరోటిడ్‌ ధమనుల పాత్ర- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    చాలా చిన్న అవరోధం చాలు.. చెట్టంత మనిషిని నిలువునా కుప్పకూల్చటానికి! అది గుండెలోని రక్తనాళాల్లో కావచ్చు.. మెదడులోని రక్తనాళాల్లో కావచ్చు.. కాళ్లలోని రక్తనాళాల్లో కావచ్చు.. ఇలా శరీరంలోని ఏ కీలక రక్తనాళాల్లో, ఎక్కడ అవరోధం తలెత్తినా పరిస్థితి ప్రాణాల మీదికే వస్తుంది. గుండెలోని రక్తనాళాల్లో అవరోధం తలెత్తితే గుండెపోటు తథ్యం. అలాగే మెదడులోని రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడితే పక్షవాతం సిద్ధం. నిజానికి ఇలా మెదడు లోపలి రక్తనాళాల్లోనే కాదు... ఆ మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్లే 'మెడ' దగ్గరి పెద్ద రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినా కూడా.. పరిస్థితి ఇంతే ప్రమాదకరంగా ఉంటుంది!

    మొత్తం పక్షవాతం బాధితుల్లో నూటికి 10 మంది ఇలా మెడ దగ్గరి రక్తనాళాల్లో కొవ్వు పూడికల కారణంగానే విపత్తు బారినపడుతున్నారని చెబుతున్నాయి గణాంకాలు! అందుకే ఈ పూడికలను నియంత్రించుకోవటమన్నది.. ఇప్పుడు పక్షవాతం నివారణలో ఒక కీలకాంశంగా పరిణమిస్తోంది.

పక్షవాతం అతిపెద్ద సమస్య. గుండెపోటు తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రజలను బలి తీసుకుంటున్న ఈ సమస్యకు మూలం... రెండు రకాలు. మొదటిది- మెదడులోని రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడి, కొంత మెదడు భాగానికి రక్తప్రసారం నిలిచిపోవటం. దీన్నే 'ఇస్కీమిక్‌ స్ట్రోక్‌' అంటారు. పక్షవాతం బాధితుల్లో ఎక్కువ శాతం మంది ఇలా ఇబ్బందుల పాలవుతున్న వాళ్లే! ఇక రెండోది- మెదడులోని రక్తనాళాలు ఎక్కడోచోట చిట్లి రక్తం గడ్డకట్టి, పక్షవాతం బారినపడటం. దీన్ని 'హెమరేజిక్‌ స్ట్రోక్‌' అంటారు. మొత్తమ్మీద రక్తనాళాలు చిట్లి గడ్డకట్టటం కంటే కూడా... మెదడులోని రక్తనాళాల్లో అడ్డంకులు, అవరోధాలు ఎదురై, మెదడులోని కొంత భాగానికి రక్తప్రసారం నిలిచిపోవటమన్నదే చాలా ఎక్కువ. ఇలా మెదడులోని రక్తనాళాల్లోకి అవరోధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి ఎక్కడివన్నది కీలకం. చాలా సందర్భాల్లో శరీరంలోని ఇతరత్రా భాగాల్లో చిన్నచిన్న రక్తపు గడ్డలు, కొవ్వు పూడికలు తయారై.. వాటికి సంబంధించిన చిన్నచిన్న పలుకులు, ముక్కల వంటివి రక్త ప్రవాహంలో కలిసి కొట్టుకుపోతూ.. మెదడులోకి వెళ్లి... అక్కడి రక్తనాళాల్లో అవరోధంగా ఏర్పడి, రక్తప్రవాహాన్ని నిలిపివెయ్యటం ముఖ్యమైన సమస్య. ముఖ్యంగా మెడ దగ్గర ఉండే 'కెరోటిడ్‌' ధమనుల్లో కొవ్వు పూడికలు, కొలెస్ట్రాల్‌ ముద్దలు ఏర్పడి.. వాటి నుంచి చిన్నచిన్న పలుకుల్లాంటివి విడివడి మెదడులోకి వెళ్లి.. పక్షవాతం సమస్యను తెచ్చిపెట్టటం ఎక్కువగా కనబడుతోంది. అందుకే ఇప్పుడీ కెరోటిడ్‌ ధమనులకు ప్రాధాన్యం ఎంతో పెరుగుతోంది.

పక్షవాతం: కెరోటిడ్‌ ధమనుల పాత్ర
భారతీయులను, ముఖ్యంగా హైదరాబాద్‌ వైద్య నిపుణులు సేకరించిన గణాంకాలను చూస్తే (హైదరాబాద్‌ స్ట్రోక్‌ రిజిస్ట్రీ)- మొత్తం పక్షవాతం కేసుల్లో 10% వరకూ ఇలా మెడ దగ్గరి కెరోటిడ్‌ ధమనుల్లో సమస్య వల్లే ముంచుకొస్తున్నాయి. మిగతా 90% కేసులకు మెదడులోని రక్తనాళాల్లోనే సమస్యలు తలెత్తతటమో, లేదూ ఇతరత్రా రక్తనాళాల్లో ఏర్పడిన రక్తం గడ్డలు మెదడులోకి వెళ్లి అడ్డుపడటమో.. ఇలా ఇతరత్రా అంశాలు కారణమవుతున్నాయి. ప్రతి వంద మంది పక్షవాతం బాధితుల్లో పది మందికి కెరోటిడ్‌ ధమనుల్లో పూడికలు ఉంటున్నాయంటే కచ్చితంగా దీని గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 10 శాతమూ చాలా వరకు నివారించదగ్గవే. ఈ సమస్యను ముందే గుర్తించే అవకాశం ఉంటే వీరు పక్షవాతం బారినపడకుండా నివారించుకోవచ్చు.

కెరోటిడ్‌లలో సమస్య: గుర్తించేదెలా?
* సాధారణంగా రక్తనాళాల (వాస్క్యులర్‌) సర్జన్లు... మెడ దగ్గర చెయ్యి పెట్టి నొక్కి చూడటం, అలాగే స్టెతస్కోప్‌తో చూడటం ద్వారా కెరోటిడ్‌ ధమనుల్లో రక్త ప్రవాహం తీరు ఎలా ఉందో పరిశీలిస్తారు. ఈ సమయంలో ఒక రకమైన కంపన ధ్వని (థ్రిల్‌/బ్రూయీ) వినపడితే లోపల పూడిక వస్తోందని అనుమానించవచ్చు. ఒకసారి ఇలా అనుమానం బలపడితే రక్తనాళం లోపలి సమస్యను కచ్చితంగా నిర్ధారించుకునేందుకు మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి.

* అలాగే గుండెకు బైపాస్‌ ఆపరేషన్‌ చేయించుకునే వారందరికీ ఆపరేషన్‌కు ముందు ఈ కెరోటిడ్‌ ధమనులు ఎలా ఉన్నాయన్నది పరీక్షిస్తారు. ఎందుకంటే ఈ ధమనుల్లో పూడికలు ఉంటే.. సర్జరీ సమయంలో పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

* అరుదుగా కొందరికి ఒక కాలుగానీ, లేదా కాలూచెయ్యీ వంటి రెండు అవయవాలుగానీ బలహీనంగా అనిపించి.. మళ్లీ ఒకటి రెండు గంటల్లో అంతా మామూలుగా సర్దుకుంటుంది. ఇటువంటి లక్షణం కనబడితే దాన్ని విస్మరించకూడదు. దీన్నే 'ట్రాన్సియెంట్‌ వీక్‌నెస్‌', 'ట్రాన్సియెంట్‌ ఇస్కీమిక్‌ ఎటాక్‌' అంటారు. ఇలాంటి లక్షణం కనబడిన వారికి కెరోటెడ్‌ ధమనుల్లో పూడికల సమస్య ఉందని కచ్చితంగా అనుమానించాల్సి ఉంటుంది, వీరికి పరీక్ష అవసరం. విస్మరిస్తే మున్ముందు వీరికి పూర్తిస్థాయి పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

* ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మినట్టు అనిపించి, తర్వాత కోలుకోవటం (ట్రాన్సియెంట్‌ బ్లాక్‌అవుట్‌) కూడా కెరోటిడ్‌లలో పూడికలు వస్తున్నాయని చెప్పే ఒక సంకేతం. ఎందుకంటే కంటిలోని రెటీనా పొరకు రక్తాన్ని అందించే రక్తనాళం కూడా ఈ కెరోటిడ్‌ ధమని నుంచే వెళుతుంది. ఒకవేళ ఈ రక్తనాళం పూడుకుంటే రెటీనాకు రక్తసరఫరా తగ్గి, ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మినట్టు అనిపించవచ్చు.. తర్వాత కోలుకుంటారు. ఇటువంటి లక్షణాలు కనబడితే కెరోటిడ్‌ ధమనుల్లో ఎక్కడన్నా పూడికలు వచ్చాయేమోనని కచ్చితంగా అనుమానించి మరిన్ని పరీక్షలు చెయ్యాల్సిందే.

పైస్థాయి పరీక్షలు
* కెరోటిడ్‌ రక్తనాళాల్లో పూడికలు గుర్తించేందుకు కచ్చితమైన, తేలికైన మార్గం- కలర్‌ డాప్లర్‌ పరీక్ష. మెడ దగ్గర అల్ట్రాసౌండ్‌ పరికరాన్ని ఉంచితే లోపల రక్తనాళంలో పరిస్థితి ఏమిటి? పూడిక ఉందా? ఉంటే అది ఏ స్థాయిలో ఉంది? ఎంత దూరం ఉంది? అది ఏ రకం? ఈ వివరాలన్నీ దానిలో తెలుస్తాయి.

దీనిలో సమస్యను గుర్తించిన తర్వాత మరింత స్పష్టత కోసం 'యాంజియోగ్రఫీ' చేస్తారు. తొడ దగ్గరి నుంచి రక్తనాళం ద్వారా సన్నటి తీగను మెడ వరకూ పంపి.. దాని ఆధారంగా రక్తనాళం లోపల పరిస్థితిని గుర్తించే సాధారణ యాంజియోగ్రామ్‌ పరీక్ష కావచ్చు, లేకపోతే సీటీస్కాన్‌ లేదా ఎమ్మారై స్కానింగుల సాయంతో చేసే సీటీయాంజియోగ్రఫీ, ఎమ్మార్‌ యాంజియోగ్రఫీ కావచ్చు.. వీటిలో ఏది చేసినా సమస్య ఆనుపానులను చూడటం సాధ్యపడుతుంది. సమస్య ఎంత విస్తరించింది, ఎంత దూరం ఉందన్నది గుర్తిచటం ముఖ్యం. ఒకసారి యాంజియోగ్రామ్‌ చేసి సమస్యను గుర్తిస్తే ఇక దానికి చికిత్స ఎలా చెయ్యాలన్నది ఆలోచించవచ్చు.

* ఒకసారి కెరోటిడ్‌ ధమనుల్లో సమస్య ఉందని గుర్తిస్తే... శరీరంలో ఇంకా ఇతరత్రా రక్తనాళాల్లో కూడా.. అంటే గుండెలోని రక్తనాళాల్లో, కాళ్లలోని రక్తనాళాల్లో కూడా సమస్యలున్నాయేమో గుర్తించటం అవసరం. అందుకని అవసరాన్ని బట్టి వైద్యులు ఆ పరీక్షలూ సూచిస్తారు.

చికిత్సలు
1. మందులతో చికిత్స: పూడిక స్థాయిని బట్టి తొలిదశలో మందులతోనే చికిత్స చెయ్యటానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా కెరోటిడ్‌ ధమని లోపల పూడిక 70% కంటే తక్కువుంటే మందులు ఇవ్వటానికే ప్రయత్నిస్తారు. ఇందుకోసం రక్తం చిక్కబడకుండా చూసే క్లోపిడోగ్రెల్‌, ఆస్పిరిన్‌ వంటి మందులతో పాటు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించే అటార్వోస్టాటిన్‌ వంటి మందులు ఇస్తారు. పూడిక 70% కంటే ఎక్కువ ఉండి, కొన్ని లక్షణాలు కూడా కనబడుతుంటే మాత్రం కెరోటిడ్‌ ధమనుల్లోని పూడిక తొలగించేందుకు స్టెంట్‌ పెట్టటమో, లేక సర్జరీ చెయ్యటమో అవసరమవుతుంది.

2. స్టెంట్‌ అమర్చటం: కెరోటిడ్‌ ధమనుల్లో పూడిక వచ్చిన చోట.. ఒక స్ప్రింగు వంటి స్టెంట్‌ను అమర్చి.. పూడిక రక్తప్రవాహానికి అవరోధంగా తయారవ్వకుండా చూడటం 'కెరోటిడ్‌ ఆర్ట్రీ స్టెంటింగ్‌' ప్రక్రియ లక్ష్యం. తొడ దగ్గరి నుంచి తీగ మెడలోని రక్తనాళం వరకూ పంపించి.. ముందు- పూడిక పైభాగాన ఒక సున్నితమైన జల్లెడ వంటి 'ఫిల్టర్‌' అమరుస్తారు. ఎందుకంటే స్టెంట్‌ అమర్చే సమయంలో కొన్నిసార్లు అక్కడి కొవ్వు ముద్దలు కొన్ని విడివడి, అవి రక్తప్రవాహంలో కలిసి మెదడులోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి అలా జగరకుండా నివారించేందుకు ముందే పైభాగాన ఫిల్టర్‌ అమర్చి, అప్పుడు పూడిక వద్ద బెలూన్‌ను ఉబ్బించి, స్టెంట్‌ అమర్చి, తర్వాతఫిల్టర్‌నూ, బెలూన్‌నూ తీసేస్తారు. స్టెంట్‌ అమర్చటంతో అవరోధం తగ్గి.. రక్తనాళంలో రక్తప్రవాహం మెరుగవుతుంది.

3. సర్జరీ చేసి శుభ్రం చెయ్యటం: మెడ దగ్గర చర్మంపై గాటు పెట్టటం ద్వారా కెరోటెడ్‌ ధమనిని చేరుకుని.. పూడికకు కిందాపైనా ఆ నాళాన్ని మూసేసి.. ఆ మధ్య భాగంలో పేరుకొని ఉన్న కొవ్వు ముద్దను తొలగించి.. రక్తనాళాన్ని తిరిగి కుట్టేయటం సర్జరీ విధానం. దీన్నే 'కెరోటిడ్‌ ఎండార్ట్రెక్టమీ' అంటారు. దీంతో నాళంలో పూడిక తొలగిపోతుంది. ఆపరేషన్‌ సమయంలో మెదడుకు రక్తసరఫరా ఆగకుండా చూసేందుకు కొన్నిసార్లు ప్రత్యామ్నాయంగా మరో గొట్టం (షంట్‌) అమర్చి.. సర్జరీ చేసి.. తర్వాత షంట్‌ తీసేస్తారు.

కొన్నిసార్లు స్టెంట్‌ అమర్చే సమయంలోనే పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో స్టెంటింగ్‌ చెయ్యటం మంచిదా? సర్జరీ మంచిదా? అన్న మీమాంస చాలాకాలం నడిచిందిగానీ క్రమేపీ దీర్ఘకాలిక ఫలితాలను అధ్యయనం చేస్తే- మన్నికైన ఫలితాలను, ఈ ప్రక్రియల సమయంలో తలెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకుని చూస్తే సర్జరీనే మేలని ఇప్పుడు గుర్తించారు. సర్జరీలో కూడా చాలా నైపుణ్యం చాలా ముఖ్యం.

సర్జరీ తర్వాత...
సర్జరీతో పేరుకున్న కొవ్వును తొలగిస్తారుగానీ ఆ తర్వాత మళ్లీ పేరుకోకుండా చూసుకోవటం ముఖ్యం. కాబట్టి హైబీపీ ఉన్నవారు దాన్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. స్టాటిన్స్‌, రక్తం చిక్కబడకుండా చూసే యాంటీప్లేట్‌లెట్‌ మందులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. అలాగే పొగతాగే అలవాటున్నవారు మానెయ్యటం, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవటం, కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం, నిత్యం వ్యాయామం చెయ్యటం వంటి జాగ్రత్తలూ అవసరం.

సాధారణంగా బైపాస్‌ ఆపరేషన్‌ చేయించుకునే వాళ్లందరికీ మెడ దగ్గరి కెరోటిడ్‌ ధమనులు ఎలా ఉన్నాయన్నది పరీక్షిస్తారు. చాలామందిలో 30, 40 శాతం పూడికలే ఉంటాయి. వీరికి చాలావరకూ మందులతోనే చికిత్స సరిపోతుంది. అయితే కొద్దిమందిలో 70% మించి ఉంటుంది, వీరికి బైపాస్‌ ఆపరేషన్‌ సమయంలోనే... ఈ కెరోటిడ్‌ ధమనులను శుభ్రం చేసే ఆపరేషన్‌ కూడా పూర్తిచేసేస్తారు. దీనివల్ల రోగికి ఖర్చు తగ్గుతుంది, పక్షవాతం ముప్పు కూడా తగ్గుతుంది.

* సాధారణంగా ఒక వైపు కెరోటెడ్‌ ధమనికే పూడికలు ఉంటాయి. అరుదుగానే రెండు వైపులా ఉండొచ్చు. అలాంటి వారికి ముందు ఒకటి చేసి, తర్వాత మరోవైపు చేస్తారు. మొత్తానికి కెరోటిడ్‌ ధమనుల్లో పూడికలను ముందే అనుమానించటం ద్వారాగానీ, కాలుచెయ్యి బలహీనపడటం వంటి స్వల్పస్థాయి పక్షవాతం లక్షణాల ద్వారాగానీ.. ఈ కెరోటిడ్‌ ధమనుల సమస్యను ముందే గుర్తించి.. దీనికి చికిత్స అందించటం ద్వారా పక్షవాతం రాకుండా నివారించుకోవటం ముఖ్యం.

కెరోటిడ్‌ ధమనులు: వీటిలో ఏమవుతుంది?
గుండె నుంచి రక్తాన్ని బయటకు తెచ్చే అతిపెద్ద రక్తనాళం బృహద్ధమని నుంచి మొదలై... మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్లే రెండు ప్రధాన రక్తనాళాలు ఈ కెరోటిడ్‌ ధమనులు. ఇవి మెడకు రెండువైపులా ఉంటాయి. మెదడుకు రక్తసరఫరా అందించటానికి మరో రెండు ధమనులు (వెర్టిబ్రల్‌) కూడా ఉన్నాయిగానీ ఈ కెరోటిడ్‌ ధమనులు రెంటిదీ ప్రధాన పాత్ర. ఇవి కింది నుంచి పెద్ద గొట్టాల్లా వచ్చి.. మెడ దగ్గర రెండుగా చీలతాయి. వీటిలో 'ఇంటర్నల్‌ కెరోటిడ్‌' అన్నది మెదడుకు సరఫరా అందిస్తుండగా.. 'ఎక్స్‌టర్నల్‌ కెరోటిడ్‌' ధమని తల, మెడ తదితర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. కీలకమైన విషయం ఏమంటే- కింది నుంచి వచ్చే ప్రధాన నాళం ఇలా మెడ దగ్గర రెండుగా చీలుతుంది కాబట్టి ఇక్కడ రక్త ప్రవాహ వేగాల్లో, పీడనాల్లో తేడా ఉంటుంది. దీనివల్ల రక్తనాళం లోపల ఇక్కడ కొవ్వు ముద్దలు పేరుకుని, పూడికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కొవ్వు ముద్దనే 'అథెరోమా' అంటారు. ఇలా కొలెస్ట్రాల్‌ ముద్ద ఏర్పడి.. అక్కడ పూడిక రావటం వల్ల రక్తప్రవాహ మార్గం సన్నబడిపోయి రక్తసరఫరా తగ్గటం ఒక సమస్య. రెండోది ఈ ముద్ద నుంచి చిన్నచిన్న పలుకులు, ముక్కలు విడిపోయి, అవి రక్తప్రవాహంలో కలసి మెదడులోకి చేరి, మెదడులోని చిన్నచిన్న రక్తనాళాల్లో అడ్డుపడి.. అక్కడ రక్తసరఫరాకు అవరోధంగా మారతాయి. దీంతో మెదడులోని ఆ ప్రాంతానికి రక్తసరఫరా నిలిచిపోయి.. పక్షవాతం ముంచుకువస్తుంది. కెరోటిడ్‌ ధమనుల్లో పూడికల కారణంగా ముంచుకొచ్చే పక్షవాతం సమస్య ఇది!

కెరోటిడ్‌లలో పూడిక ముప్పు: ఎవరికి ఎక్కువ?
రక్తనాళాల్లో పూడికలు రావటాన్ని 'అథెరోస్ల్కెరోసిస్‌' అంటారు. ఈ పూడికలన్నవి గుండెలో, కాళ్లలో, కెరోటిడ్‌ ధమనుల్లో ఎక్కడైనా రావచ్చు. ఇలా పూడికలు వచ్చే ముప్పు-
* మధుమేహుల్లో * హైబీపీ ఉన్నవారిలో, * పొగతాగే వారిలో,
* రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువుండే వారిలో, * పెద్ద వయసు వారిలో,

... వీరందరిలోనూ ఎక్కువ. కాబట్టి వీరంతా జాగ్రత్తగా ఉండటం అవసరం. గుండెలోగానీ, కాళ్లలోగానీ పూడికలు వస్తున్న లక్షణాలున్నా, అలాగే ఒకసారి స్వల్పస్థాయి పక్షవాతం బారినపడినా- వాళ్లు కెరోటిడ్‌ ధమనుల పరిస్థితి ఎలా ఉందన్నది కచ్చితంగా పరీక్ష చేయించుకోవటం అవసరం.

డా.పి.సి.గుప్త ,వాస్క్యులార్ సర్జన్‌ , కేర్ హాస్పిటల్ ,హైదరాబాద్@ ఈనాడు సుఖీభవ.
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Pregnancy and awareness, గర్భము మరియు అవగాహన

  •  


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Pregnancy and awareness, గర్భము మరియు అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సంబరం
అమ్మాయి నెల తప్పిందనగానే మొదలవుతుంది.. సంబరం! ఇక వేవిళ్లు, మొక్కులు, సూడిదలు, సీమంతాల నుంచి.. నట్టింట పసిబిడ్డ కేరింతలు కొట్టే వరకూ ప్రతిదీ పండగే! ఇల్లంతా ఒకటే కోలాహలం. ఇదో ప్రకృతి పండుగ.
పునరుత్పత్తికి మూలమైన గర్భధారణ, ప్రసవాలు ప్రకృతి సహజమైన శారీరక ప్రక్రియలు. వీటి విషయంలో తరతరాలుగా, సంప్రదాయంగా వస్తున్న విజ్ఞానం అనంతరం. అయితే ఇప్పుడీ తరతరాల తీగలు తెగిపోతున్నాయి. కుటుంబాలు చిన్నవైపోతూ... అమ్మలు, బామ్మలు దగ్గరుండే పరిస్థితి లేదు. వెన్నుదన్నుగా ఉండేవారు కరవౌతున్నారు. దీంతో గర్భధారణ అనగానే గుండె నిండా సంబరంతో పాటే... నేటితరం తల్లులకు మనసులో ఏదో మూల చిన్నచిన్న సంకోచాలూ పీడించటం ఎక్కువవుతోంది. మరోవైపు సంప్రదాయ విజ్ఞానంతో పాటే బోలెడు అశాస్త్రీయమైన నమ్మకాలూ జనం నోళ్లలో నలుగుతున్నాయి.

ఆహారం
చాలామంది గర్భిణులు 'ఇద్దరి కోసం తినాలని' నమ్ముతూ దీన్నే ప్రచారం చేస్తుంటారు. కానీ వాస్తవానికి అతిగా తినటం వల్లే సమస్యలు తలెత్తుతాయి. ఇష్టంగా తినటం, బిడ్డకు కావాల్సినంత పోషకాలను అందించేలా తినటం ముఖ్యం. గర్భిణి తీసుకునే ఆహారం వారికి పుట్టే పిల్లలనూ ప్రభావితం చేస్తుందని అధ్యయనాల్లో గుర్తించారు. గర్భిణులు కొవ్వు పదార్ధాలు, స్వీట్ల వంటివి ఎక్కువగా తినటం వల్ల వారికి పుట్టే పిల్లలు కూడా వాటి పట్ల ఇష్టాన్ని పెంచుకుంటారు. ఇది మంచిది కాదు. కాబట్టి గర్భిణి ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవటం తనకే కాదు, పుట్టే పిల్లలకూ మంచిది. దీర్ఘకాలంలో ప్రభావం చూపే అంశం ఇది. గర్భిణులు మాంసకృత్తులు దండిగా తీసుకోవాలి. అవసరమైతే ప్రోటీన్‌ సప్లిమెంట్‌ అయినా తీసుకోవాలి. గర్భిణులు ఉప్పు తగ్గించాల్సిన అవసరమూ లేదు.

సంతోషం
గర్భిణి బాధ, కోపం, దుఃఖం వంటి ప్రతికూల భావోద్వేగాలేవీలేకుండా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా గడపటం బిడ్డ ఎదుగుదలపై ఎంతో మంచి ప్రభావం చూపిస్తుందని తాజా పరిశోధనలెన్నో గుర్తించాయి. తల్లిదండ్రులు బిడ్డలకు కేవలం జన్యువులు మాత్రమే అందిస్తారనుకోవటం పొరపాటు. తల్లి మనసులో ఏం జరుగుతోంది, తల్లి ఎటువంటి భావోద్వేగాలను అనుభవిస్తోందన్నది కడుపులోని బిడ్డకు తెలియకపోవచ్చు.. కానీ ప్రతి భావోద్వేగమూ తల్లిలో ఎన్నో శారీరక, రసాయనిక మార్పులు తెస్తుంటుంది. ఆగ్రహం, ఆందోళన, భయం వంటి ఉద్వేగాలు తల్లిలో రకరకాల రసాయనిక మార్పులు తెస్తాయి. తత్ఫలితంగా బిడ్డ ఎదుగుదల ప్రభావితమవుతుందని అధ్యయనాల్లో స్పష్టంగా గుర్తించారు. కాబట్టి గర్భిణి హాయిగా, విశ్రాంతిగా, ఉల్లాసంగా గడపటం చాలా ముఖ్యమని, కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఇటువంటి వాతావరణాన్ని కల్పించటం ముఖ్యమని గుర్తించాలి.

విశ్రాంతి
అమ్మాయి నెల తప్పిందంటే చాలు.. ఇక కాలు కింద పెట్టకుండా, మంచం దిగకుండా చూడాలన్న ధోరణి చాలా కుటుంబాల్లో కనబడుతుంటుంది. ఇది సమర్థనీయం కానేకాదు. అస్సలేమాత్రం శారీరక శ్రమ లేకుండా ఎప్పుడూ తిని పడుకోవటం వల్ల 'గర్భిణీ మధుమేహం', కాళ్లలో రక్తం గడ్డలు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి. గర్భిణులకు 8 గంటల రాత్రి విశ్రాంతి అవసరం. పక్కకు తిరిగి పడుకోవటం, కాళ్ల మధ్య దిండు పెట్టుకోవటం వల్ల సౌకర్యవంతంగా ఉండి, నిద్ర హాయిగా పడుతుంది. ఇక పగటిపూట మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకున్నా చురుకుగా తిరుగుతూ, శరీరానికి  ఎంతోకొంత వ్యాయామం ఉండేలా చూసుకోవటం ముఖ్యం. రోజూ 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామం చెయ్యటం మరీ మంచిది. నిజానికి వ్యాయామం వల్ల నడుము నొప్పి, అలసట, కాళ్ల వాపుల వంటివి కొంత తగ్గుతాయి కూడా. నడక, ఈత, యోగ.. గర్భిణులకు ఇవెంతో మేలు చేస్తాయి.

బొప్పాయి, అనాస
చాలామంది గర్భిణులు బొప్పాయి, అనాస పండ్లు తినకూడదనీ, తింటే గర్భస్రావాలు అవుతాయని నమ్ముతుంటారుగానీ దీనికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలూ లేవు. ఇటువంటి నమ్మకాలు విదేశాల్లో ఎక్కడా కనబడవు, అక్కడి గర్భిణులు వీటిని నిశ్చింతగా తింటూనే ఉన్నారు. కాకపోతే మన సమాజంలో, సంస్కృతిలో ఈ నమ్మకం బలంగా ఉంది కాబట్టి వీటిని తిని, ఆ తర్వాత మనసులో లేనిపోని భయాలు పెట్టుకోవటం వృధా. గర్భిణులు ఆందోళనలకు గురికాకుండా, ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. నిజానికి మనకు ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి కాబట్టి గర్భిణులు తమకు ఇష్టమైన రకరకాల పండ్లు తినొచ్చు. ఏవైనా గానీ పండ్లు దండిగా తినటం మాత్రం అవసరం. పండ్ల నుంచి రకరకాల పోషకాలతో పాటు పీచు కూడా లభిస్తుంది. దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలూ తగ్గుతాయి.

ఉద్యోగం
సాధారణంగా శారీరకంగా శ్రమ, ఒత్తిడి లేని ఉద్యోగాలైతే నెలలు నిండే వరకూ చేసుకోవచ్చు. సౌకర్యవంతమైన కుర్చీల్లో కూర్చోవటం, ఎత్తుమడాలు లేని చెప్పులు వేసుకోవటం, వారానికి 40 గంటలకు మించి పని చెయ్యకపోవటం, ప్రతి 4 గంటలకూ ఓ పావు గంట పని నుంచి విశ్రాంతి తీసుకుని నాలుగు అడుగులు వేసి రావటం మంచిది. గర్భిణులకు రసాయనాలు, రేడియేషన్‌ వంటివాటి మధ్య, లేదా వేడిగా ఉండే వాతావరణంలో ఉద్యోగాలు మంచిది కాదు. పని గురించీ, అక్కడి వాతావరణం గురించీ వైద్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం మంచిది. నిలబడి చేసే ఉద్యోగాలైతే 24 వారాల నుంచీ మానెయ్యటం మేలు. రాత్రి షిఫ్టుల వల్ల నెలలు నిండకుండానే కాన్పయ్యే అవకాశం పెరుగుతున్నట్టు గుర్తించారు. కాబట్టి రాత్రి షిఫ్టు ఉద్యోగులు ముందుగానే వైద్యులతో చర్చించి జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.

దంత శ్రద్ధ
గర్భిణికి చిగుళ్ల వ్యాధి వంటివి ఉంటే నెలలు నిండక ముందే కాన్పు వచ్చే ముప్పు ఎక్కువని పరిశోధకులు శాస్త్రీయంగా నిర్ధారించారు. చాలామంది స్త్రీలు అసలు దంత వైద్యుల వద్దకు వెళ్లటానికే ఇష్టపడరు. తల్లి ఆరోగ్యానికీ, గర్భం సజావుగా సాగటానికీ.. రెంటికీ దంత సమస్యలేవీ లేకుండా చూసుకోవటం ముఖ్యమని గుర్తించాలి. వీలైతే గర్భం ధరించటానికి ముందే దంత పరీక్షకు వెళ్లటం ఉత్తమం. లేదంటే కనీసం గర్భం దాల్చిన వెంటనే అన్నా వెళ్లాలి. కారణం దంత చికిత్సలేమైనా అవసరమైతే (ఉదా|| యాంటీబయాటిక్స్‌, ఎక్స్‌రేల వంటివి) నాలుగో నెల వచ్చేలోపే పూర్తి చేసుకోవటం మంచిది. ముఖ్యంగా నెలలు నిండకుండానే కాన్పు అయ్యే రిస్కు ఎక్కువగా ఉన్నవాళ్లకు (ఉదా. కవలలు ఉన్నవాళ్లు, సర్విక్స్‌ బిగుతుగా లేనివాళ్లు మొ||) ఇది మరీ అవసరం.

నీరు
నీరు ఎక్కువగా తాగటం ఎవరికైనా మంచిది, గర్భిణులకు మరీ మంచిది. ఎందుకంటే ఒంట్లో నీరు తగ్గితే కండరాలు బిగుసుకోవటం పెరుగుతుంది. గర్భాశయం కూడా ఒక రకమైన కండరమే. కాబట్టి గర్భిణులకు 'డీహైడ్రేషన్‌' మంచిది కాదు. అందుకే వీరు రోజుకు కనీసం 1.5 నుంచి 2 లీటర్ల నీరైనా తాగాలి. నీళ్లు ఎక్కువ తాగటం వల్ల తరచుగా టాయ్‌లెట్‌కు వెళ్లాల్సి వస్తుంది, ఈ రూపేణా శరీరానికి కొంత కదలిక, నడక ఉంటాయి. ఆఫీసుల్లో, ఇళ్లలో ఎక్కువ సేపు కూర్చుని పని చేసేవారికి.. ఆ పని నుంచి ఇదో రకమైన తప్పనిసరి విరామంగా పనికొస్తుంది.

కుంకుమ పువ్వు
మంచి చాయగల తెల్లటి పిల్లలు పుడతారన్న నమ్మకంతో కుంకుమ పువ్వు తీసుకునే గర్భిణులు ఎంతోమంది. ఇదెంత వరకూ నిజమో ఎవరికీ తెలియదు. కుంకుమ పువ్వు అనేది ఓ రకమైన సుగంధ ద్రవ్యం. సాధారణ వంటకాల్లో కూడా దీన్ని చాలా కొద్ది మోతాదులోనే వాడతారు. కానీ శ్రీలంక వంటి దేశాల్లో గర్భిణులు దీన్ని రోజూ స్పూనుకు పైగా తింటున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని అదీ మితంగా తీసుకుంటే నష్టం ఉండకపోవచ్చు గానీ ఎక్కువ మొత్తంలో, అదీ ఆరేడు నెల్ల పాటు రోజూ తీసుకోవటం ఎంత వరకూ సురక్షితమో తెలియదు. కాబట్టి ఏదీ అతిగా తినకుండా ఉండటం మంచిది.

వ్యసనాలు
సాధారణంగా స్త్రీలు పొగ, మద్యం, మాదక ద్రవ్యాల వంటి వాటికి దూరంగా ఉంటారని అందరం భావిస్తుంటాంగానీ ఈ ఆధునిక కాలంలో ఈ నమ్మకం పూర్తి నిజం కాదనీ.. ఇటీవలి కాలంలో ఆడపిల్లల్లోనూ ఈ అలవాట్లు మెండుగానే ఉంటున్నాయని వెల్లడవుతోంది. పైగా నానాటికీ ఇది పెరుగుతోంది కూడా. చాలామంది తమకు తెలియకుండానే దానికి బానిస అయిపోతుంటారు. గర్భిణులు ఎట్టి పరిస్థితుల్లోనూ పొగ, మద్యం, మాదక ద్రవ్యాల వంటివాటి జోలికి వెళ్లకూడదు.

బీపీ, వాపు
తల్లీబిడ్డల శ్రేయస్సు దృష్ట్యా గర్భిణులు క్రమం తప్పకుండా.. ఆర్నెల్లు నిండే వరకూ నెలకోసారి, 28 నుంచి 36 వారాల వరకూ రెండు వారాలకోసారి, 36 వారాల తర్వాత కాన్పయ్యే వరకూ వారంవారం గైనకాలజిస్ట్‌ను కలిసి చూపించుకోవాలి. వైద్యుని వద్దకు వెళ్లిన ప్రతి సారీ బరువు, బీపీ రెండూ చూస్తారు. కాళ్ల వాపు ఉందేమో గమనిస్తుంటారు. గర్భిణులకు కాళ్ల వాపు కొంత సహజమేగానీ బీపీ పెరగకుండా కేవలం కాళ్ల వాపు ఉంటే పెద్ద సమస్య కాదు. కాళ్ల కింద ఎత్తుగా దిండుపెట్టుకు పడుకోవటం, కాళ్లు మెలికేసుకుని కూర్చోకుండా ఉండటం అవసరం. అయితే బీపీ పెరుగుతూ, కాళ్ల వాపులూ పెరుగుతుంటే మాత్రం దానిపై ఓ కన్నేసి ఉంచాల్సిందే. ముఖం ఉబ్బరించినా, కళ్ల చుట్టూ వాపు వచ్చినా, చేతులు వాచినా, కాళ్లు చీలమండలు మరీ ఎక్కువగా వాచిపోయినా, ఒక కాలు ఎక్కువగా వాచి నొప్పిగా ఉన్నా వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి.

ప్రయాణాలు
చాలామంది నెలలు నిండుతున్న సమయంలో సీమంతానికి, పుట్టింటికి.. అంటూ ప్రయాణాలు కడుతుంటారు. వాస్తవానికి మొదటి మూడు నెలలూ, ఆఖరి మూడు నెలలూ దూర ప్రయాణాలు అంత మంచిది కాదు. 3-6 నెలల మధ్య ప్రయాణాల వల్ల ఇబ్బందేం ఉండదు. 6-9 నెలల మధ్య (ఆఖరి త్రైమాసికం) మాత్రం ప్రయాణాలు చెయ్యకపోవటం ఉత్తమం. మూడు గంటల కంటే ఎక్కువ సమయం పట్టే సుదూర ప్రయాణాలకు రైళ్లు, విమానాలు సురక్షితం. రైళ్లలో లేచి కాస్త నడవచ్చు, టాయ్‌లెట్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది కాబట్టి రైలు సురక్షితమైనదే. కాకపోతే ఆఖరి నెలల్లో రైల్లో దూర ప్రయాణాల వల్ల మధ్యలో ఏదైనా వైద్య సహాయం అవసరమైతే కష్టమవుతుంది. గర్భిణులు పుట్టింటికి వెళుతుంటే మొత్తం వైద్యపరమైన రికార్డులన్నీ వెంట తీసుకువెళ్లాలి. ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటే మధ్యమధ్యలో లేచి నాలుగు అడుగులు వేయటం, ద్రవాహారం ఎక్కువగా తీసుకోవటం మంచిది. బయట అమ్మే ఆహారం, నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి బయట ఏమీ తీసుకోకుండా ఉండటం, తమతో నీరు ఆహారం తీసుకువెళ్లటం చాలా ముఖ్యం.

జుట్టు శ్రద్ధ
గర్భధారణ తర్వాత శారీరకంగా చాలా మార్పులు సహజం. జుట్టు కూడా ఇందుకు మినహాయింపేం కాదు. నిజానికి గర్భిణుల శరీరంలో ఈస్ట్రోజెన్‌ హార్మోను స్థాయులు బాగా పెరుగుతాయి. ఇవి సహజంగా రాలిపోతుండే వెంట్రుకలను కూడా రాలనివ్వకుండా, మరింత కాలం అలాగే కొనసాగేలా చేస్తాయి. దీనివల్ల గర్భిణులకు జుట్టు పెరుగుతుండటమేగానీ రాలిపోవటమన్నది చాలా అరుదు. అయితే కాన్పు తర్వాత ఈ హార్మోన్ల స్థాయి తగ్గి, ఒక్కసారిగా సాధారణ స్థితికి వచ్చేస్తుంది. దీంతో అప్పుడు వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. సాధారణంగా కాన్పు తర్వాత మూడు నెలలకు వెంట్రుకలు రాలిపోవటం మొదలై.. క్రమేపీ సద్దుకుంటుంది. గర్భిణులు జుట్టు మరీ ఎక్కువగా రాలిపోతుంటే మాత్రం వైద్యులకు చూపించుకుని పోషకాహార లోపం, థైరాయిడ్‌ సమస్యల వంటివేమైనా ఉన్నాయేమో చూపించుకోవటం మంచిది.

స్కానింగులు
గర్భిణులకు స్కానింగులు చేస్తుంటారుగానీ చాలామందికి వీటి ప్రాధాన్యం ఏమిటో తెలియదు. గర్భం దాల్చిన తర్వాత వివిధ దశల్లో మొత్తం మూడు స్కానింగులు చెయ్యటం ముఖ్యం. ఇవన్నీ ఆల్ట్రాసౌండ్‌ స్కానింగులే. వీటిని చేసే విధానం ఒకటేగానీ.. వీటిలో ప్రతి స్కానింగుకూ ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది. ఒక్కో స్కానింగులో ఒక్కో అంశం మీద దృష్టిపెట్టి చూస్తారు. 3వ నెల చివర్లో ఒకసారి (పిల్లల్లో జన్యు సమస్యలేమైనా ఉన్నాయేమో చూసే ఎన్‌టీ స్కాన్‌), 18-20 వారాలప్పుడు రెండోసారి స్కానింగ్‌ (బిడ్డకు శరీరం మీద నిర్మాణపరమైన లోపాలేమైనా వస్తున్నాయేమో చూసే అనామలీ స్కాన్‌), 7వ నెల చివర్లో మరో స్కానింగ్‌ (బిడ్డ ఎదుగుదల ఎలా ఉందో చూసేందుకు చేసే గ్రోత్‌ స్కాన్‌) చేస్తారు. గర్భిణికి ఈ మూడు స్కానింగులూ ముఖ్యమైనవే.

మూడు మందులు
ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు గర్భం దాల్చిన దగ్గరి నుంచీ (వీలైతే అసలు గర్భం దాల్చక ముందు నుంచే) ఆరంభించి కాన్పు అయ్యే వరకూ కూడా తీసుకోవాలి. తొలినాళ్లలో వికారంగా ఉంటుంది కాబట్టి ఐరన్‌ మాత్రలు ఆ దశలో ఇవ్వకపోయినా మూడో నెలలో ఆరంభించి కాన్పు తర్వాత మూడు నెలల వరకూ కొనసాగించాలి. ఇక క్యాల్షియం మాత్రలు ఐదో నెల చివర్లో ఆరంభించి.. కాన్పు తర్వాత బిడ్డకు పాలిచ్చినంత కాలం కొనసాగించాల్సి ఉంటుంది. ఇవి వేసుకోవాల్సిన మందులు. ఇక గర్భిణులకు మధ్యలో నొప్పుల వంటి బాధలు తలెత్తితే అత్యవసరంగా 'ప్యారాసెటమాల్‌' మాత్ర తీసుకోవచ్చు. దానితో బాధలు తగ్గకపోతే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలిగానీ సొంత వైద్యాలు కూడదు. ప్యారాసెటమాల్‌ మించి మరే మందునూ సొంతగా వేసుకోకూడదు. ముఖ్యంగా శక్తిమంతమైన నొప్పి నివారిణి మందులైన ఐబూప్రోఫెన్‌, కాంబిఫ్లామ్‌, నిముసులైడ్‌, ఓవరాన్‌ వంటి 'ఎన్‌ఎస్‌ఏఐడిఎస్‌' రకాలను దూరంగా ఉంచాలి. గర్భిణులు నొప్పి ఏదైనా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటమే మంచిది.

వేవిళ్లు
హార్మోన్ల మార్పుల కారణంగా కొందరికి గర్భం దాలుస్తూనే వాంతులు, వికారంతో వేవిళ్లు తీవ్రంగా ఉంటాయి. దీంతో ఒంట్లో నీరు తగ్గిపోవటం, విపరీతమైన నీరసం వంటి సమస్యల్లోకి జారిపోతుంటారు. ఈ వేవిళ్ల బాధలు సాధారంగా రెండు లేదా మూడు నెలలకల్లా సర్దుకుంటాయి. కాకపోతే పిండం ఎదుగుదలలో ఈ మొదటి 3 నెలలూ కీలకమైనవి కాబట్టి ఈ సమయంలో తల్లి తీవ్రమైన పోషకాహార లోపంలోకి వెళితే ఏమవుతుందోనన్న భయం చాలామందిని వేధిస్తుంటుంది. ఈ వేవిళ్ల బాధల నుంచి ఉపశమనానికి కొన్ని చిట్కాలు పాటించొచ్చు. పొట్ట ఖాళీగా ఉంటే వికారం పెరుగుతుంది కాబట్టి తరచూ ఏదో ఒకటి తింటుండాలి. ఉదయం పడక మీదే ఒక బ్రెడ్డు ముక్కో, బిస్కట్టో తిని, కొద్దిసేపాగి లేవటం మంచిది. ఆహారం కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకుంటే కడుపులో ఆమ్లం ఉత్పత్తి తగ్గి, వికారం తగ్గుతుంది. వికారంగా అనిపిస్తే నిమ్మ, ఉసిరి, అల్లం వంటి పుల్లటి ముక్కలను బుగ్గన పెట్టుకోవచ్చు. మరీ అవసరమైతే వైద్యుల సలహాతో సురక్షితమైన మందులు తీసుకోవాల్సి ఉంటుంది.

రుగ్మతలు
మధుమేహం, మూర్ఛ, థైరాయిడ్‌, ఆస్థమా, అలర్జీ వంటి సమస్యలున్నా నిశ్చింతగా పిల్లలను కనొచ్చు.. కాకపోతే వీరు ముందే వైద్యులతో చర్చించి, అప్పుడు గర్భం దాల్చటం మంచిది. ఎందుకంటే గర్భిణులు వీటికి వాడే కొన్ని రకాల మందులు తీసుకోకూడదు. కాబట్టి అవసరమైతే వైద్యులు మందులు మారుస్తారు. గర్భం సమయంలో వ్యాధులు ఉద్ధృతం కాకుండా ముందుగానే కచ్చితమైన నియంత్రణ చికిత్స అందిస్తారు. ముఖ్యమైన విషయం- గర్భిణులెవరూ తాము ఎప్పుడూ వాడుకునే మందులను వైద్యులను సంప్రదించకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపకూడదు. చాలామంది మందులు వేసుకుంటే కడుపులోని బిడ్డకు హాని జరుగుతుందని మానేస్తుంటారుగానీ నిజానికి మానేస్తేనే ఆయా వ్యాధులు ఉద్ధృతమై, వాటిని నియంత్రించటం కూడా కష్టంగా తయారవుతుంది. దీనివల్ల బిడ్డకు హాని జరిగే అవకాశాలు ఎక్కువ. పైగా థైరాయిడ్‌ వంటి సమస్యల్లో నెలలు నిండుతూ, బరువు పెరుగుతున్న కొద్దీ క్రమేపీ మందుల మోతాదు పెంచాల్సి కూడా వస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా గర్భం దాల్చినప్పుడూ, కాన్పు తర్వాతా కూడా వైద్యులను సంప్రదించటం కీలకం.

నడుము నొప్పి
గర్భిణులకు నెలలు నిండుతూ, బిడ్డ పెరుగుతున్న కొద్దీ పొత్తికడుపు కండరాలు సాగుతూ.. పొట్టపెరుగుతుండటం వల్ల వెన్ను మీద భారం పెరిగి నడుము నొప్పి సహజం. కాన్పుకు అవసరమైన కడి ఎముకలు విశ్రాంతిగా ఉండేందుకు సహకరించే రిలాక్సిన్‌ వంటి హార్మోన్లు వెన్ను లిగమెంట్ల మీదా పని చేసి నొప్పిని పెంచుతాయి. కాబట్టి భుజాలు కొద్దిగా వెనక్కిపెట్టుకుని నిటారుగా నిలబడటం, కూర్చునేటప్పుడు వెనక ఒక మెత్తటి దిండు పెట్టుకోటం, అలాగే కాళ్లు వేళ్లాడేసుకోవటం కాకుండా పాదాల కింద ఎత్తు పెట్టుకోవటం, ఎక్కువసేపు కూర్చుని లేదా నిలబడి ఉండిపోకుండా కదలుతుండటం, వెల్లికిలా కాకుండా పక్కకు తిరిగి పడుకోవటం, హీల్‌ లేని చెప్పులు వాడటం, వస్తువులు కింది నుంచి ఎత్తేటప్పుడు వంగకుండా జాగ్రత్త వహించటం, నడుముకు వేడినీటి కాపడం పెట్టుకోవటం, మసాజ్‌, యోగా వంటివి చెయ్యటం ముఖ్యం.

పరీక్షలు
తల్లీబిడ్డల శ్రేయస్సు కోసం గర్భిణులకు వైద్యులు కొన్ని పరీక్షలు చేయిస్తుంటారు. ఇవి చాలా ముఖ్యం. గర్భం రాగానే- సంపూర్ణ రక్త పరీక్ష(సీబీపీ), మూత్ర పరీక్ష, మూత్రం కల్చర్‌ పరీక్ష, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌-బి, వీడీఆర్‌ఎల్‌ పరీక్షలు, రక్తంలో షుగర్‌, థైరాయిడ్‌ పరీక్షలు.. ఇవి ముఖ్యం. అప్పటికే గర్భిణికి రక్తహీనత, మధుమేహం, థైరాయిడ్‌ వంటి సమస్యలుగానీ, పైకి తెలియని ఇన్ఫెక్షన్లుగానీ ఉంటే వీటిలో తెలుస్తాయి. వాటితో తల్లీబిడ్డలకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా వైద్యులు వెంటనే చికిత్స అందిస్తారు. ఇక ఆ తర్వాత: 26-28 వారాలప్పుడు గర్భిణి మధుమేహం వస్తోందేమో చూసేందుకు గ్లూకోజు తాగించి చేసే రక్త పరీక్ష(జీసీటీ), 32 వారాలప్పుడు మరోసారి సంపూర్ణ రక్తపరీక్ష, 36 వారాలప్పుడు మరోసారి సుగర్‌ పరీక్ష చేయిస్తారు. ఇవి చాలా ముఖ్యం.

శృంగారం
గర్భం దాల్చిన తర్వాత శృంగారం వల్ల గర్భస్రావాలు అవుతాయేమో, ఇన్ఫెక్షన్లు వస్తాయేమో, లోపల పెరుగుతున్న బిడ్డకు హాని జరుగుతుందేమోనన్న అనుమానాలు తరచుగా వినిపిస్తుంటాయి. సహజంగా గర్భం దాల్చిన వారి విషయంలో ఇటువంటి సందేహాలు అక్కరలేదు. లోపల పిండం దృఢమైన గర్భాశయ కండరాల నడుమ, అదీ ఉమ్మనీరులో ఉంటుంది కాబట్టి సెక్స్‌ వల్ల సమస్యలేవీ తలెత్తవు. గర్భాశయ ముఖద్వారం కూడా చిక్కటి జిగురుతో మూసుకుపోయి ఉంటుంది కాబట్టి లోపలికి ఇన్ఫెక్షన్లేవీ చేరలేవు. నెలలు నిండే వరకూ కూడా శృంగారంలో పాల్గొనచ్చు. అయితే గర్భం దాల్చిన తర్వాత స్త్రీల వాంఛల్లో తేడాలు రావచ్చు. కాబట్టి వీటి గురించి దంపతులు మనసు విప్పి మాట్లాడుకోవటం ఉత్తమం. తరచుగా గర్భస్రావాలు అవుతున్నవారు, యోని నుంచి రక్తస్రావం, మాయ ముందుకుండటం, నొప్పుల వంటి ఇతరత్రా సమస్యలున్నవారు మాత్రం సెక్స్‌కు దూరంగా ఉండటం మంచిది.

Courtesy with Dr.Pranithi Reddy , Hyd@Eenadu sukhibhava(30 Dec 2012)
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, March 30, 2013

Hints for reduction of body weight, బరువు తగ్గడానికి సూచనలు

  •  
  • image : courtesy with Eenadu news paper

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Hints for reduction of body weight, బరువు తగ్గడానికి సూచనలు -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


సన్నగా కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే ఆ క్రమంలో తెలియకుండా చేసే చిన్నచిన్న పొరబాట్లతో ఫలితం కనిపించకపోగా, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేం.
'ప్రతి రోజూ పెద్ద కప్పు కాఫీ తాగడం వల్ల ఏడాదికి నాలుగున్నర కేజీల బరువు పెరుగుతారు' అని తెలిపారు బ్రిటన్‌కి చెందిన అధ్యయనకర్తలు. చిన్న కప్పు కాఫీ తీసుకున్నా ఎంత లేదన్నా 153 కెలొరీలు అందుతాయి. కాబట్టి దానికి బదులుగా బ్లాక్‌ కాఫీని తీసుకుంటే మంచిదనీ, దీనివల్ల కేవలం 35 కెలొరీలే అందుతాయనీ సుమారు రెండువేల మందిపై చేసిన ఈ అధ్యయనం వెల్లడించింది. జంక్‌ ఫుడ్‌ని తగ్గిస్తున్నా కాఫీ తీసుకోవడం వల్ల అందే చక్కెరలు తెలియకుండానే బరువును పెంచుతాయి. దీర్ఘకాలంలో అనారోగ్యాలకు కారణమవుతాయి.
* కనీసం గంటపాటు వ్యాయామం చేస్తే చాలా త్వరగా సన్నబడొచ్చు అనే ఉద్దేశం చాలామందిది. దాంతో అదేపనిగా వ్యాయామం చేయడం మొదలుపెడతారు. కానీ యూనివర్శిటీ ఆఫ్‌ కోపెన్‌హాగన్‌ ప్రకారం ప్రతిరోజూ క్రమం తప్పకుండా అరగంటపాటు వ్యాయామం చేస్తే మూడు నెలల్లో కనీసం రెండున్నర కిలోల బరువు తగ్గే అవకాశం ఉంది.

* తీసుకునే తిండికి తగ్గ వ్యాయామం చేస్తే సరిపోతుంది తప్ప, డైటింగ్‌ నియమాలు పాటించాల్సిన అవసరం లేదనుకుంటారు కొందరు. కానీ బరువు తగ్గాలనుకుంటే కొన్ని రకాల పదార్థాలు ముఖ్యంగా చీజ్‌, బిస్కెట్లూ, కేక్‌లూ, చిప్స్‌ లాంటివి తగ్గించి లోఫ్యాట్‌ డైట్‌ని పాటించాలి. ఇలా చేయడం వల్ల ఆర్నెల్లలోనే వూహించిన దానికన్నా ఎక్కువ బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

* బరువు తగ్గాలనుకుంటే ఒత్తిడినీ అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఉద్వేగాలూ బరువు పెంచుతాయి. ఏ మాత్రం ఒత్తిడిగా ఉన్నా, అతిగా ఉద్వేగాలకు లోనయినా తెలియకుండానే ఎక్కువగా తినేస్తాం. అదే బరువు పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఉద్వేగాలను సాధ్యమైనంత వరకూ నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, March 25, 2013

Thyroid problems in females,మహిళ లో థైరాయిడ్‌ సమస్య

  •  
  • image: courtesy with Eenadu news paper

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Thyroid problems in females,మహిళ లో థైరాయిడ్‌ సమస్య- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



నెలసరి సరిగ్గా రాకపోతే... థైరాయిడ్‌ ఉందేమో అన్న సందేహం. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోతే... వైద్యులు సూచించే పరీక్షల్లో థైరాయిడ్‌ పేరు ఉంటుంది. విపరీతంగా బరువు పెరిగిపోతున్నా కలిగే భయం... థైరాయిడ్‌. ఇన్ని రకాలుగా ప్రభావం చూపే ఈ సమస్యకు సంబంధించిన కారణాలూ, నివారణ మార్గాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.
పదేళ్ల క్రితం థైరాయిడ్‌ సమస్య కేవలం మూడు శాతం మందిలో ఉండేది. ఇప్పుడు అది ఇరవై శాతం కన్నా ఎక్కువనే చెప్పాలి. ఇదిలా ఉండగా, థైరాయిడ్‌తో బాధపడే వాళ్లలో ఎక్కువ మంది మహిళలే అని చాలా అధ్యయనాలు స్పష్టం చేశాయి. 'థైరాయిడ్‌లో మార్పుల వల్ల సమస్యలు తలెత్తుతాయి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి' అంటూ సూచించాయి. థైరాయిడ్‌ అనేది ఎండోక్రైన్‌ గ్రంథి. ఇది గొంతు దగ్గర ఉంటుంది. దీన్నుంచి థైరాయిడ్‌ హార్మోను విడుదల అవుతుంది. ఇది విడుదల కావడానికి ముందు మెదడు నుంచి థైరాయిడ్‌ స్టిములేటింగ్‌ హార్మోను (టి.ఎస్‌.హెచ్‌.) విడుదలై ఈ గ్రంథిని ఉత్తేజితం చేస్తుంది. అప్పుడే హార్మోను విడుదల అవుతుంది. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగడానికి అయోడిన్‌ ఖనిజం కీలక పాత్ర వహిస్తుంది. ఎప్పుడైతే ఆ ఖనిజం శరీరానికి తక్కువగా అందుతుందో థైరాయిడ్‌ హార్మోను పనితీరులో మార్పులు మొదలవుతాయి. అలాగే కొన్నిసార్లు పిట్యూటరీ గ్రంథి, హైపోథాలమస్‌ పని తీరులో లోపం ఉన్నా కూడా ఈ సమస్య రావచ్చు. మరికొన్నిసార్లు శారీరక, మానసిక ఒత్తిడి కూడా థైరాయిడ్‌ పనితీరులో మార్పు తెస్తుంది.

రెండు రకాలుగా సమస్య...
థైరాయిడ్‌ హార్మోను సరిగ్గా విడుదల అయినప్పుడే శరీరంలో ప్రతి కణం సరిగ్గా పనిచేసి, జీవక్రియ పనితీరు బాగుంటుంది. ఆ హార్మోను విడుదలలో ఎప్పుడైతే సమతుల్యత లోపిస్తుందో అప్పుడు సమస్యలు తప్పవు. సాధారణంగా ఇది రెండు రకాలుగా ఇబ్బందికి లోనుచేస్తుంది. థైరాయిడ్‌ గ్రంథి పని తీరు విపరీతంగా పెరిగినప్పుడు దాన్ని హైపర్‌ థైరాయిడిజం అంటాం. తక్కువగా పని చేస్తున్నప్పుడు హైపో థైరాయిడిజంగా పరిగణిస్తాం. చాలామందిలో కనిపించేది హైపో థైరాయిడిజమే. ఈ రెంటికీ కొన్ని రకాల లక్షణాలుంటాయి.

హైపర్‌ అయితే: థైరాయిడ్‌ హార్మోను ఎక్కువగా విడుదల అవుతుంది. టి3, టి4 హార్మోన్లు ఎక్కువగా విడుదలై, టీఎస్‌హెచ్‌ తగ్గిపోతుంది. దాంతో జీవ క్రియల పనితీరు వేగం పెరుగుతుంది. గుండె దడ, బరువు తగ్గిపోవడం, అకారణంగా చెమటలు పట్టడం, పేగుల కదలిక ఎక్కువగా జరిగి విరేచనాలు కావడం, కనుగుడ్లు బయటకు వచ్చినట్లు కనిపించడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

హైపో లక్షణాలివి:. ఈ పరిస్థితిలో థైరాయిడ్‌ హార్మోను తక్కువగా విడుదలవుతుంది. టి3, టి4 హార్మోన్లు తగ్గుతాయి. టీఎస్‌హెచ్‌ పెరుగుతుంది. ఈ మార్పుతో అనారోగ్య సమస్యలూ మొదలవుతాయి. దీనికి థైరాయిడ్‌ గ్రంథి ఇన్‌ఫెక్షన్‌ ఒక కారణం. కొన్నిసార్లు ఈ సమస్య వంశపారంపర్యంగా రావచ్చు. ఎక్కువగా ప్రసవానంతరం కూడా రావచ్చు. ఈ మార్పులతో జీవక్రియ పనితీరు మందగిస్తుంది. దాంతో నిస్తేజంగా, నీరసంగా కనిపిస్తాం. శరీరంలో చురుకుదనం తగ్గుతుంది. బరువు పెరిగిపోతారు. చుట్టూ ఉన్నవారికి చెమటలు పడుతుంటే, ఈ సమస్య ఉన్నవారికి మాత్రం చలిగా అనిపిస్తుంది. వీటన్నింటితో పాటూ మలబద్ధకం, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, విపరీతంగా ఒళ్లు నొప్పులూ, గోళ్లు కూడా విరిగిపోయినట్లు కనిపించడం, డిప్రెషన్‌, పిల్లలు కలగకపోవడం, రక్తహీనత, నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ కావడం లాంటి మార్పులూ కనిపిస్తాయి. కొందరిలో కనుబొమలు వూడిపోతాయి. గొంతు కూడా బొంగురుపోతుంది. ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. చర్మం పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తోంటే థైరాయిడ్‌ సమస్య కారణమా అన్నది పరీక్ష చేయించుకోవాలి.

హార్మోను సమతుల్యత లోపిస్తే...
పై లక్షణాలు కనిపించినప్పుడు హార్మోను పరీక్షను సూచిస్తారు. హైపో థైరాయిడిజం ఉన్న వాళ్లలో టి3, టి4 తక్కువగా ఉంటాయి గనుక ఆ శాతాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ హైపర్‌ ఉంటే టి3, టి4 ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ గ్రంథి పనితీరును తగ్గించడానికి మందులు వాడతారు. అంటే సమస్యను బట్టి మందులుంటాయి. జీవ క్రియల పనితీరు బాగుండాలంటే థైరాయిడ్‌ పని తీరులో సమతుల్యత సరిగ్గా ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే నెలసరిలో మరీ ముందుగా లేదా మరీ ఆలస్యంగా రావొచ్చు. ఒక్కోసారి అసలు రాకపోవచ్చు కూడా. అలాగే అమ్మాయిలు పొడవు పెరగకపోవడం, విపరీతంగా బరువు పెరగడం జరుగుతుంది. నెలసరి అసలు మొదలుకాకపోవడం, పెళ్లయ్యాక గర్భం రాకపోవడం, ఒకవేళ వచ్చినా తరచూ ఏవో సమస్యలు చుట్టుముడుతుంటే తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి.

గర్భధారణ సమయంలో మొదటి మూడునెలల తరవాతే శిశువులోని థైరాయిడ్‌ గ్రంథి పనిచేయడం మొదలవుతుంది. దాంతో అప్పటివరకూ ఆ గర్భస్థ శిశువు తల్లిలోని థైరాయిడ్‌ గ్రంథిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాబోయే తల్లిలో ఆ సమస్య ఉందా లేదా అన్నది గుర్తించడానికి గర్భం దాల్చిన వెంటనే థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. తల్లికాని వారిలో ఈ హార్మోను టి.ఎస్‌.హెచ్‌. స్థాయులు 5.5 వరకూ ఉండొచ్చు. గర్భిణుల్లో అయితే 2.5 నుంచి 3.5 వరకూ టి.ఎస్‌.హెచ్‌. స్థాయులు మాత్రమే ఉండాలి. ఏ మాత్రం తేడా ఉన్నా డాక్టర్‌ సలహాతో మందులు వాడాలి. లేదంటే అది బిడ్డ మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఉమ్మనీరు తగ్గడం లాంటి సమస్యలూ ఉంటాయి. కొన్నిసార్లు బిడ్డ పుట్టడంతోనే హైపోథైరాయిడిజం సమస్య ఉండొచ్చు. కాబట్టి తల్లిలో ఆ సమస్య ఉందని తేలితే పాపాయి పుట్టిన వెంటనే పరీక్ష చేయించాలి. అలాగే ప్రసవమైన వారిలోనూ హైపో థైరాయిడిజం ఎక్కువగా కనిపిస్తుంది గనుక విపరీతంగా బరువు పెరుగుతున్నట్లు కనిపించినా, నెలసరిలో తేడా వచ్చినా తేలిగ్గా తీసుకోకుండా పరీక్ష చేయించుకోవాలి.

ఏ ఇబ్బందుల్లేకుండా...
* ఈ సమస్య ఏ వయసు వారిలోనయినా తలెత్తవచ్చు. ముఖ్యంగా హైపో థైరాయిడిజం జీవితాంతం కొనసాగవచ్చు కాబట్టి డాక్టర్‌ సలహాతో మందులు వాడాలి. హైపర్‌ ఉన్నవాళ్లు మందులు వాడితే తగ్గిపోతుంది. కానీ తగ్గిందని నిర్థరించుకునేందుకూ కచ్చితంగా మళ్లీ పరీక్ష చేయించుకోవాలి. కొన్నిసార్లు థైరాయిడ్‌ గ్రంథి వాస్తుంది. అది కొన్నిసార్లు క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది. అలాంటి తేడా కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.

* అయోడిన్‌ ఉన్న ఉప్పు వాడటం వల్ల ఈ సమస్యను చాలామటుకు రాకుండా చూసుకోవచ్చు. సాధారణంగా పునరుత్పత్తి వయసులో ఉండే అమ్మాయిలు రోజుకు 150 మైకో గ్రాములూ... గర్భిణులూ, బాలింతలూ రోజుకి 250 మైక్రో గ్రాముల అయోడిన్‌ తీసుకోవాలి. అరటిపండ్లూ, క్యారెట్లూ, కోడిగుడ్డు పచ్చసొన, వెల్లుల్లి, పాలకూర, ఉల్లిపాయలూ, బంగాళాదుంపలూ ఎక్కువగా తినడం వల్లా అయోడిన్‌ అందుతుంది.

* థైరాయిడ్‌ హార్మోను పని తీరు సక్రమంగా ఉండేందుకు జింక్‌, రాగి లాంటి ఖనిజాల పాత్రా కీలకమే. జింక్‌ కోసం.. ఓట్‌మీల్‌, గింజలూ, చేపలూ, నట్స్‌ లాంటివి ఎంచుకోవాలి. రాగి పోషకాల కోసం గుడ్లూ, వాల్‌నట్లూ, ఎండుద్రాక్ష, చిక్కుడు జాతి గింజలను ఎంచుకోవచ్చు. కొన్ని పదార్థాలు థైరాయిడ్‌ హార్మోన్లపై ప్రభావం చూపుతాయి. అందుకే సమస్యను నిర్ధరించాక అలాంటివాటిని తగ్గించాలి. ముఖ్యంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, చిలగడదుంపలు, ముల్లంగి, పాలిష్‌చేసిన బియ్యం, గోధుమలు, సోయా ఉత్పత్తులు, కాఫీ, కూల్‌డ్రింక్స్‌ని సాధ్యమైనంత వరకూ తక్కువగా తీసుకోవాలి.

* ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల థైరాయిడ్‌ హార్మోను పనితీరు మెరుగవుతుంది. రోజూ కాసేపు నడవడం, డాన్స్‌ ప్రాక్టీస్‌ చేయడం, ఏదయినా ఆట ఆడటం, యోగా చేయడం వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలి. ఒత్తిడి కూడా థైరాయిడ్‌ హార్మోనుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి దాన్ని అదుపులో ఉంచేందుకు ప్రయత్నించాలి. ప్రాణాయామం లాంటివి ప్రాక్టీస్‌ చేస్తే ఒత్తిడిని పెంచే హార్మోన్లు అదుపులో ఉంటాయి.

--Courtesy with Dr.Pranathi Reddy MS (uro Gynaecologist) , Hyd.
  • =========================
 Visit my website - > Dr.Seshagirirao.com/ http://dr.seshagirirao.tripod.com/

Friday, March 22, 2013

Uterine cancer, Endometrial cancer,గర్భాశయ క్యాన్సర్ , ఎండోమెట్రియల్ క్యాన్సర్ , యుటెరైన్‌ క్యాన్సర్




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Uterine cancer, Endometrial cancer,గర్భాశయ క్యాన్సర్ , ఎండోమెట్రియల్ క్యాన్సర్ , యుటెరైన్‌ క్యాన్సర్ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 గర్భసంచి లో ఒక లైనింగ్ లాగా ఉండి ప్రతి నెలా గర్భం దాల్చడానికి అనువుగా మందం గా తయారయి , గర్భం ధరించకపోతే నెలసరిలో స్రవించబడేదే ఎండోమెట్రియం . సగటుగా ఎండోమెట్రియం 6.7 మి.మీ.ఉంటుంది. నెలసరి ముందు మందం గా ఉండటము , తర్వాత తగ్గడము జరిగే ఎండోమెట్రియం హార్మోనుల అసమతుల్యత వలన మరీ పలుచగా తయారయితే సంతాన లేమికి దారితీస్తుంది. మెనోపాజ్ దశలో ఎండోమెట్రియం పలుచగా మారుతుంది. పిల్లల్ని కనే వయసులో మరీ ఎక్కువగా ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ పెరిగితే మందముగా , ఎక్కువగా ప్రొజెస్టిరాన్‌ ఉన్న బర్త్ కంట్రోల్ పిల్స్ వాడితే ఎండోమెట్రియం పలుచగా మారిపోతుంది. గర్భదారణ సమయములో మందముగా తయారయ్యే ఎండోమెట్రియం ద్వారానే పిండానికి పోషకాలు , ఆక్షిజన్‌ అందుతాయి. అందుకనే సంతానలేమి సమస్యలతో బాధపడేవారికి చేసే పరీక్షలలో , కృత్రిమ గర్భధారన పద్ధతులలో సంతాన భాగ్యము పొందాలనునే వారికి చేసే పరీక్షలలో ఎండోమెట్రియం ఎంత మందం గా ఉందో నిర్ధారించే పరీక్ష కీలకమైనది . 6mm - 14mm ఉండే ఎండోమెట్రియం గర్భధారణకు అనువుగా ఉంటుంది.

ఎండోమెట్రియం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా మందం గా ఉండడము లేదా ఎక్కువ పలుచగా ఉండటము  వంటి సమస్యలతో పాటు ఫైబ్రాయిడ్ , సిస్ట్ , ఎండోమెట్రియాసిస్ , ఎండోమెట్రియక్ క్యాన్సర్  వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈస్ట్రోజన్‌ లెవల్స్ శరీరములో  దీర్ఘకాలికంగా ఉన్నా , ఒక్క బిడ్డకు కూడా జన్మనివ్వని స్త్రీలలో, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన స్త్రీలకి , నెలసర్లు 9 ఏళ్ళ కంటే ముందు , మెనోపాజ్ దశకు లేటుగా చేరుకునే స్త్రీలలో , అధిక బరువు ఉన్న స్త్రీలలో ఎండోమెట్రియల్ క్యాన్సర్  వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

గర్భాశయం లో లైనింగ్  గా ఉండే ఎండోమెట్రియం (కొన్ని సందర్భాలలోనెలసర్లు ప్రారంభం కాని అమ్మాయిలలో , మినోపాజ్ దశ తర్వాత కూడా) గర్భాశయం బయట ఇతర అవయవాలచుట్టూ కూడా పెరగటం ప్రారంభిస్తుంది. . . దీన్నే ఎండోమెట్రియాసిస్ అంటారు. అధికం గా పెరిగిన  ఎండోమెట్రియం వలన పొత్తికడుపు నొప్పి , కలయికలో నొప్పి , మూత్రము అదుపులో లేకపోవడం , అజీర్తి , అలసట వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి.  అండాశయాల చుట్టూ పెరిగిన ఎండోమెట్రియం చుట్టూ రక్తం చేరి  బ్రౌన్‌ కలర్ లో కనిపించడము వలన వాటిని " చాక్ లెట్  సిస్ట్ (chocolate cyst)" అంటారు. ఎండోమెట్రియాసిస్ , ఎండోమెట్రియల్ క్యాన్సర్ లక్షణాలు ఒకేలా ఉండడమే కాకుండా ఎండోమెట్రియాసిస్  ఉన్నవారికి  ఒవేరియన్‌ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా నాన్‌హాడ్ కిన్స్ లింఫోమా(Non-Hodgkin's lymphoma ) , పిట్యూటరీ , థైరాయిడ్  గ్రంధి క్యాన్సర్ కూడా వచ్చె ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి  ఎండోమెట్రియాసిస్ తో బాధపడే వారు ఈ విషయాలపై అవగాహన పెంపొందించుకొంటే  మంచిది .  ఎండోమెట్రియల్ ఫైబ్రాయిడ్స్ లేక  యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్ చిన్నగా చాలా మందిలో ఎటువంటి లక్షణాలు  కలిగించకుండా కూడా ఉంటాయి. పెద్దగా ఉండి పొత్తి కడ్పు బరువుగా ఉండడము , నెలసరిలో రక్తస్రావము ఎక్కువ కావడము , మూత్రము అదుపులో లేకపోవడము మొదలగు లక్షణాలు కనిపిస్తే మందులు లేక  సర్జరీ వంటి చికిత్స తప్పనిసరి.

దాదాపుగా ఎండోమెట్రియాసిస్ , యుటెరైన్‌సిస్ట్ , ఫైబ్రాయిడ్ , గర్భసంచి క్యాన్సర్  లక్షణాలు ఒకేలా ఉంటాయి. అంతే కాకుండా గర్భసంచికి సంబంధించిన ఈ సమస్యలు తెలెత్తడానికి కూడా కారణాలు లేదా  రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఒకేలా ఉంటాయి.  అందుకనే లక్షణాలు కంపించినప్పుడు సమస్య ఏమై ఉంటుందా ? అని సరిగా పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.  నెలసరి మధ్యలో రక్తస్రావము కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

స్త్రీలలో గర్భసంచి ముఖ ద్వరము సంబంధించిన క్యాన్సర్ , ఒవేరియన్‌ క్యాన్సర్ తర్వాత ఎక్కువగా కనిపించేది గర్భాశయ క్యాన్సర్ . గర్భసంచిలో కణితి పెరిగిన ప్రదేశాన్ని బట్టి అనేక రకాలుగా విభజిస్తారు. లక్షణాలు కనిపించినప్పుడు " పాప్  స్మియర్ " తో పాటు ఎండోమెట్రియల బయాప్సి , హిస్టెరోస్కోపి, ఆల్ట్రాసౌండ్  వంటి పరీక్షలు చేసి గర్భసంచికి సంబంధించిన ఏ సమస్య అయి ఉంటుందో నిర్ధారిస్తారు. క్యాన్సర్ అని నిర్ధారణ అయితే మాత్రం ప్రధానము గా సర్జరీ నే చికిత్స . దశను బట్టి గర్భసంచిని , చుట్టూ ఉన్న లింఫ్ నాళాలను , అండాశయాలను తీసివేస్తారు. తొలిదశలో గుర్తిస్తే  కీహోల్ సర్జరీ లకు కూడా చేయగలుగుతారు.

స్టేజ్ 1 కంటే ఎక్కువ దశ ఉంటే గర్భాశయాన్ని తీసివేశాక రేడియో , కీమోథెరఫీలను దశను బట్టి ఎన్నిసార్లు ఇవ్వాలో నిర్ధారిస్తారు. ఈ క్యాన్సర్ 55 నుండి  65 ఏళ్ళ స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంది .వయస్సు పై బడేకొద్ది ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది.  బ్రెస్ట్ క్యాన్సర్ కు టోమాక్షిఫెన్‌ మందు వాడిన స్త్రీలు , ఇతర కారణాల వలన పెర్విస్ కు రేడియేషన్‌ థెరఫీ తీసుకున్నవారు , హార్మోన్‌థెరఫీ ఎక్కువగా తీసుకున్నవారు , 55 ఏళ్ళు పైబడినవారిలో నెలసరిలు ఆగని స్త్రీలు , స్మోకింగ్ అలవాటు ఉన్నవారు తగిన పరీక్షలు చేయించుకుంటూ ఏవైనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యము చేయకుండా ఉండడము చాలా మంచిది.డాక్టర్ సలహామేరకు క్రమము తప్పకుండా " పాప్ స్మియర్ , ఆల్ట్రాసౌండ్ , కాల్పోస్కోపి, హిస్టెరో స్కోఫీ చీయించుకుంటూ ఉండాలి  

Courtesy with - Dr. Ch . Mohana Vamsy ,Omega hos. Hyd. @Swathi weekly magazine.
  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, March 18, 2013

ముందే రుతుచక్రం,ప్రికాషియస్‌ ప్యూబర్టీ,Precocious puberty

  •  


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ముందే రుతుచక్రం,ప్రికాషియస్‌ ప్యూబర్టీ,Precocious puberty- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

    వయసుకు తగ్గట్టుగా శారీరక మార్పులు జరిగితేనే ఆనందం. రుతు చక్రానికీ ఇదే వర్తిస్తుంది. సాధారణంగా పన్నెండు నుంచి పదిహేనేళ్లలోపు మొదలవ్వాల్సిన రుతుక్రమం పదేళ్లలోపే వచ్చేస్తే... దానిని ఓ సమస్యగానే భావించాలి. అవగాహనతో ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

అమ్మాయి... బాల్యం నుంచి యౌవనంలోకి అడుగుపెట్టే క్రమంలో శారీరక మార్పులు సహజం. ముఖ్యంగా ఎముకలూ, కండరాల ఎదుగుదలా, శరీర ఆకృతిలో తేడా, సంతానోత్పత్తికి అనువుగా మరికొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వీటన్నిటితో పాటూ రుతుచక్రం కూడా సాధారణంగా వచ్చే మార్పే. ఇది పన్నెండు నుంచి పదిహేనేళ్ల లోపు మొదలవ్వాలి. కానీ ఈ మధ్య కాలంలో పదేళ్ల వయసుకి ముందే రుతుచక్రం మొదలవడం ఎక్కువవుతోంది. ఈ పరిస్థితిని 'ప్రికాషియస్‌ ప్యూబర్టీ' అంటున్నాం. మూడు నాలుగేళ్ల ముందుగానే ఇలా జరగడానికి ఇవీ కారణాలని స్పష్టంగా చెప్పలేం! కానీ కొన్ని రకాల సమస్యలు ఆ పరిస్థితికి దారితీస్తున్నాయని అధ్యయన కర్తలు చెబుతున్నారు.

యౌవన మార్పులంటే...
ఆడపిల్ల రజస్వల అవడానికి గల కారణాలు తెలుసుకునే ముందు అసలు బాల్యం నుంచి యౌవనంలోకి అడుగుపెట్టే సమయంలో శారీరకంగా ఎలాంటి మార్పులు జరుగుతాయనేది తెలుసుకోవాలి. మెదడులో ఈ ప్రక్రియ మొదలై గోనాడోట్రోఫిన్‌ హార్మోను విడుదలవుతుంది. అది పిట్యూటరీ గ్రంథికి చేరి ఎల్‌హెచ్‌, ఎఫ్‌ఎస్‌హెచ్‌ అనే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఈ రెండూ అమ్మాయిల్లో శారీరక మార్పులు జరిగేందుకు తోడ్పడే ఈస్ట్రోజెన్‌ను అండాశయాల్లో
విడుదలయ్యేలా చేస్తాయి. అప్పట్నుంచి శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ తరవాతే నెలసరి వస్తుంది.

ఇన్‌ఫెక్షన్లు లేదా కణుతులు కావచ్చు..
కొన్నిసార్లు ఎలాంటి సమస్యలూ, లోపాలూ లేకుండానే రుతుచక్రం ముందుగా వచ్చేయవచ్చు. మరికొన్ని సార్లు మెదడు లేదా వెన్నెముకలో కణితి ఉండటం, అమ్మాయి పుట్టే సమయంలో మెదడులో నీరు చేరి కణితిగా మారడం, మెదడూ వెన్నెముకపై రేడియేషన్‌ ప్రభావం ఎక్కువగా ఉండటం, వాటికి గాయాలవడం కూడా అందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. తక్కువ మందిలో కావచ్చు కానీ జన్యు పరమైన సమస్యలూ అందుకు కారణం అవుతాయి.

వీటిల్లో ఎముకలూ, చర్మం రంగుని ప్రభావితం చేసే జన్యు సమస్య 'మెక్‌క్యూన్‌ ఆల్‌బ్రైట్‌ సిండ్రోమ్‌' ఒకటి. దీనివల్ల హార్మోన్ల మార్పులు జరుగుతాయి. అడ్రినల్‌, పిట్యూటరీ గ్రంథులూ, అండాశయాల్లో లోపాల వల్లా శరీరంలో ఈస్ట్రోజెన్‌ హార్మోను త్వరగా విడుదలవుతుంది. ఇన్‌ఫెక్షన్లూ, హార్మోన్ల పనితీరులో తేడా, హైపో థైరాయిడిజం వల్ల కూడా రుతుచక్రం ముందే వచ్చేయవచ్చు. వయసూ, శరీరాకృతికి తగినట్లు సరైన బరువు లేకపోయినా సమస్యే. పీలగా
కనిపించే వారిలో రుతుక్రమం త్వరగా వచ్చేస్తుంది. సెక్సు హార్మోనుగా పరిగణించే ఈస్ట్రోజెన్‌, టెస్టోస్టీరాన్‌లను కొన్ని సమస్యలకు మాత్రల రూపంలో తీసుకోవడం వల్ల కూడా ముందే రుతుక్రమం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అండాశయాల్లో ఉండే కణుతులు, సిస్ట్‌లు కూడా ఈ మార్పును  తీసుకురావచ్చు. పిల్లలు జంక్‌ఫుడ్‌ని ఎక్కువగా తినడం, అది పడకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమే అని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.

లక్షణాలను గుర్తించవచ్చు...
అంతగా వూహ తెలియని వయసులో రుతుక్రమం మొదలు కావడంతో చాలామంది అమ్మాయిలు భయపడతారు. రొమ్ముల పెరుగుదల, మొటిమలు రావడం, చేతులు కింద వెంట్రుకలు రావడం వంటివి అర్థం కాక అయోమయానికి గురవుతారు. అదీకాక తమ వయసు వారి కన్నా ముందే గబగబా పొడవు పెరుగుతారు. ఎముకలు కూడా త్వరగా పరిణతి చెందుతాయి. అయితే రుతుక్రమం మొదలై కొన్నాళ్లు గడిచేప్పటికి ఆ ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. దాంతో కొన్నేళ్ల తరవాత చూసుకొంటే వయసుకు తగిన పొడవు ఉండరు. ఈ మార్పుల్ని పట్టించుకుని తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే
వయసుకు తగిన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న వయసులో రుతుక్రమం  మొదలైన అమ్మాయిల్లో తోటి వారితో పోల్చుకుని ఆత్మన్యూనతకు లోనవడం, అది ఒత్తిడికి దారితీయడం, చురుగ్గా లేకపోవడం లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమయంలో తల్లి పాత్ర ఎంతో కీలకం. శరీర నిర్మాణం, రుతుక్రమం రావడం గురించి అమ్మాయికి వివరించాలి. కొన్నేళ్లు ముందు రావడం సమస్య కాదనీ, అలా జరుగుతుంటుందనీ చెప్పాలి. స్కూల్లో, చుట్టు పక్కల వాళ్లు ఆటపట్టించినా, ఏదయినా మాట అన్నా ఆత్మన్యూనతకు గురికాకుండా సర్ది చెప్పాలి. ఈ విధంగా ముందుగా మెచ్యూర్‌ అయిన వాళ్లపై టీవీ, నెట్‌ ఆకర్షణల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనిని తల్లిదండ్రులు గుర్తు పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కొన్నాళ్లు రాకుండా..
చిన్నవయసులోనే రుతుక్రమం మొదలైనప్పుడు లేదా అంతకన్నా ముందే ఆ లక్షణాలను గుర్తించడానికి వైద్యులు కొన్ని పరీక్షలు చేస్తారు. అమ్మాయి చేయి, మణికట్టును ఎక్సరే తీసి ఎముక వయసును గుర్తిస్తారు. ఎముకల ఎదుగుదల ఎంత వేగంగా ఉంది అన్న దాన్నిబట్టి హార్మోన్ల పనితీరుని తెలుసుకుంటారు. అలాగే రక్తపరీక్ష, గోనాడోట్రోఫిన్‌ హార్మోను పరీక్ష చేస్తారు. వాటిని బట్టి ఇతర హార్మోన్ల గురించి తెలుసుకుంటారు. మెదడులో లోపాలేమైనా
ఉన్నాయా లేదా అన్నది తెలుసుకునేందుకు ఎంఆర్‌ఐని చేయించుకోమంటారు. కొన్నిసార్లు హైపోథైరాయిడిజం కూడా ఈ సమస్యకు కారణం కాబట్టి థైరాయిడ్‌ పరీక్ష  చేయించుకోమంటారు. వీటివల్ల కేవలం రుతుక్రమం గురించి తెలుసుకోవడమే కాదు, అందుకు కారణమయ్యే ఇతరత్రా సమస్యలనూ గుర్తించవచ్చు. .

తాత్కాలికంగా ఆగిపోయేలా..
పరీక్షలన్నీ చేశాక సమస్యను బట్టి చికిత్స ఉంటుంది. ఎలాంటి కారణం లేకుండా రుతుక్రమం మొదలయ్యిందని తేలితే కొన్నిరకాల మాత్రలను సూచిస్తారు డాక్టర్లు. అయితే కొన్నిసార్లు ఆ ముందును ప్రతినెలా ఇంజెక్షన్‌ రూపంలో చేయించుకోమంటారు. దానివల్ల కొంతకాలం పాటు ప్రతినెలా వచ్చే నెలసరి ఆగిపోతుంది. రుతుక్రమానికి తగినట్లుగా వయసు వచ్చే వరకూ వాటిని వాడాల్సి ఉంటుంది. ఒక్కసారి సరైన వయసు వచ్చాక డాక్టర్‌ సలహాతో వాటిని మానేయవచ్చు. ఆ తరవాత మళ్లీ మార్పులు మొదలవుతాయి. మెదడులో కణుతుల్లాంటివి ఉంటే వాటికి చికిత్స చేయడం వల్ల కూడా ఈ మార్పు జరగకుండా కొంతకాలం అదుపులో ఉంచవచ్చు.

ముందు జాగ్రత్తగా..
సమస్య వచ్చాక చికిత్స తీసుకోవడం కన్నా ముందు జాగ్రత్త పడటం మంచిది. ఏ రూపంలో కూడా ఈస్ట్రోజెన్‌, టెస్టోస్టీరాన్‌ హార్మోన్లను వాడకుండా చూడాలి.  అలాగే వయసుకు తగినట్లుగా శారీరక వ్యాయామం ఉండాలి. కనీసం ఇరవై నిమిషాలు నడక లేదా యోగా లాంటివి చేయించడం అవసరం. ఒత్తిడి  సాధ్యమైనంత వరకూ తగ్గించాలి. అలాగే జంక్‌ఫుడ్‌ని తగ్గించి బదులుగా పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి

-Dr.Pranathi Reddy (Urogynaecologist)@Eenadu vasundara
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, March 16, 2013

Attention Deficit Disorder(ADD), సావధానత లోపం డిజార్డర్

  •  


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Attention Deficit Disorder(ADD), సావధానత లోపం డిజార్డర్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


సావధానత లోపం డిజార్డర్ (కూడా ADD పిలుస్తారు) మరియు సావధానత లోటు అధికకార్యశీలత లోపం (ADHD) పాఠశాల వయస్సు పిల్లలకు చాలా తరచుగా

కనిపించే ప్రవర్తన శైలులు వివరించడానికి వాడే పదాలు. ఈ లోపాలు ఉన్న పిల్లలు hyperactive, ADHD విషయంలో, అతిగా హఠాత్తు, శ్రద్ధ లేని మరియు.

ఎక్కువ కాలము  కూర్చుని లేదా సుదీర్ఘ కాలం  ఒక వస్తువుపై  క్రియాశీల కలిగి ఉండటానికి  ఇబ్బంది పడతారు. ఇది ఒక రకమైన మానసిక రుగ్మత. సుమారు 8%-

10% చిన్నపిల్లలలోనూ , బడికి వెళ్ళే చిన్నరులలోనూ , కొంతమంది పెద్దవారినోనూ కనబడుతూ ఉంటుంది.

లక్షణాలు :
ఏ పనిమీదా ఏకాగ్రత చూపలేరు ,
ఎక్కువ సమయం పట్టే విషయం పై విసుగు చెంది అతి గా ప్రవర్తిస్తారు .
పెద్దవారైతే రెస్ట్ లెస్స్ గా (విశ్రాంతి లేనట్లు ) ప్రవర్తిస్తారు.
పనిచేయడము లో ఏకాగ్రత లేకపోవడము వలన  చిన్న చిన్న విషయాలకే తప్పులు చేస్తూ ఉంటారు.
తరచుగా ఒక పనినుండి వేరె పనికి మారుతూ ఉండే స్వభావము కలిగిఉంటారు.
ఒక పద్దతి లేని పని విధానాలు ప్లాన్‌ చేస్తూ ఉంటారు .. మధ్యలో విడిచిపెట్టే స్వభావము ఉంటుంది .
మతిమరుపు తో కొన్ని పనులు, వెళ్ళవలసిన ఫంక్షన్‌ లు మిస్సవుతుంటారు.
ఎక్కడా ఒక దగ్గర నిలకడగా కూర్చోలేరు అటూ ఇటూ పవార్లు కొడుతూ ఉంటారు.
చీటికీ మాటీకీ అసహనము ప్రవర్తిస్తూ ఉంటారు .
ప్రశ్న పూర్తికాకుండానే జావాబు చెప్పేందుకు ప్రయత్నిస్తారు .
తరచుగా ఇతరుల పనిలో లేదా ప్రవర్తనలో అంతరాయములు కలుగజేసే స్వభావము ఉంటుంది.
అవసరము లేనిచోట కల్పించుకొని మాట్లాడుతూ ఉంటారు.

ఎటెన్సన్‌ డెఫిసిట్ డిశార్డర్ తో ఇతర సమస్యలు :
గాబరా (anxiety) ,
సూక్ష్మ గ్రహణ శక్తి లోపించుడము (learning disorders),
మాట్లాడే లేదా వినికిడిలో సమస్యలు (speech and hearing problems),
చేస్తున్న పనినే మళ్ళి మళ్ళీ చేసే స్వభావము (obsessive compulsive disorder),
ప్రవర్తన లో వ్యతిరేక స్వభావము , విమర్శించే మనస్తత్వము కలిగిఉంటారు (conduct disorder)

చికిత్స :
రెండు విధానాలు . 1. మానసిక చికిత్స , 2. మందూలతో వైచ్యము .

సైకొలాజికల్ చికిత్స :  తల్లి దండ్రుల పాత్ర చాలా ముఖ్యము . విసుగు గమ్నించి ... వేరే పనిమీద ఏకాగ్ర పెట్టే విధము గా ట్రినింగ్ ఇస్తూఉండాలి. నెగటివ్ గా అస్సలు

మాట్లాడకూడదు. తరచు ఇతర పిల్లలతో కలిసి కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి.

మందులు : మెదడును ఉత్తేజ పరచే మందులు అంటే .... methylphenidate (Ritalin),
Amphetamines (Dexedrine),
మంచి డైట్ అన్ని విటమిన్ల తో కూడుకున్న పోషకాహారము ఇవ్వాలి .

  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, March 11, 2013

Baldhead, బట్టతల

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Baldhead, బట్టతల -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


అందం. ఆకర్షణ. ఆత్మవిశ్వాసం... ఇలా మన జుట్టుకు, తలకట్టుకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే తల మీది నుంచి కురులు కనుమరుగవుతున్న కొద్దీ మనసులో ఏదో వెలితి మొదలవుతుంది. ఏదో కొరతగా, న్యూనతగా, లోపంగా.. ఇలా రకరకాల భావాలు మనసులో ముసురుకుంటూ.. విపరీతమైన మథనం మొదలవుతుంది. ఇక దాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. టోపీలతో మొదలుపెట్టి విగ్గులు, గమ్మింగ్‌, వీవింగ్‌ వంటి ఎన్నో మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అయితే అవన్నీ కూడా చాలా తాత్కాలికమైనవి. ఇప్పటి వరకూ ఈ 'కేశ రాహిత్యాన్ని' అధిగమించేందుకు ఒక్క శాశ్వత పరిష్కారం కనుగొనబడలేదు.

కారణాలు :

బట్టతల అనేది స్థూలంగా జన్యుపరంగా, వంశపారంపర్యంగా వచ్చే సమస్య! ఇది కొందరిలో 20, 30 ఏళ్లకే వస్తే మరికొందరిలో 50 ఏళ్ల తర్వాత రావచ్చు. వయసు పెరుగుతున్నకొద్దీ హార్మోన్ల ప్రభావంతో జుట్టు వూడిపోవటం కొంత సహజమే. కానీ వీరిలో వేగంగా రాలిపోతూ పరిస్థితి 'బట్టతల'కు దారి తీస్తుంది. బట్టతల విషయంలో ఎన్నో సిద్ధాంతాలున్నాయిగానీ ప్రధానంగా పురుష హార్మోన్‌ అయిన 'టెస్టోస్టిరాన్‌'.. జన్యుపరమైన కారణాల రీత్యా.. వీరిలో తల మీది చర్మంలో 'డీ హైడ్రో టెస్టోస్టిరాన్‌'గా మారిపోతూ.. వేగంగా వెంట్రుకలు వూడిపోయేందుకు కారణమవుతుందన్న భావన బలంగా ఉంది. అందుకే సాధారణంగా యుక్తవయసులో ఒంట్లో టెస్టోస్టిరాన్‌ స్థాయి పెరుగుతుండే దశ నుంచే ఈ బట్టతల రావటమన్నదీ మొదలవుతుంది. తల మీది వెంట్రుకలన్నీ ఒకే రకంగా కనిపించినా అవి హార్మోన్లకు స్పందించే తీరు వేరేగా ఉంటుంది. ఈ హార్మోన్‌ ప్రభావం మాడు మీద, నుదురు దగ్గరి చర్మం మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎంత బట్టతల ఉన్నవారికైనా సరే.. వెనక భాగంలోనూ.. ఇరుపక్కలా కొన్ని వెంట్రుకలు దట్టంగా మిగిలే ఉంటాయి.
* బట్టతల పురుషులకే వస్తుందన్నది ఒక అపోహ. ఎందుకంటే ఇది స్త్రీలలోనూ కనిపిస్తుంది.
* చాలామంది తాము వాడుతున్న షాంపూలు, నీళ్లు పడక జుట్టు రాలిపోయిందని భావిస్తుంటారుగానీ వీటి ప్రభావం చాలా తక్కువ.
* బట్టతల రావటానికి 80-90 శాతం జన్యువులు, వంశపారంపర్య లక్షణాలే మూలం.
* తల్లిదండ్రుల్లో ఎవరికి బట్టతల ఉన్నా సంతానానికి రావొచ్చు. ఒకవేళ వారిద్దరికీ లేకపోయినా.. వంశంలో ముందు తరాల వారికి ఉన్నాతర్వాతి తరాలకు సంక్రమించొచ్చు. జన్యు ప్రభావం అందరిపైనా ఒకే తీరులో ఉండాలనేం లేదు. ఒకరికి వచ్చి మరొకరికి రాకపోవచ్చు

ట్రీట్మెంట్ :

బట్టతల వచ్చేసిందని బాధపడాల్సిన పనిలేదు. నలుగురిలో తిరగలేక ఇంట్లోనే కూర్చోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. బట్టతల వస్తున్న తొలినాళ్లలో వెంట్రుకలు వూడిపోకుండా ఉండేందుకు వైద్యులు 'మినాక్సిడిల్‌' 'ఫినాస్టిరైడ్‌' వంటి కొన్ని లోషన్లు సిఫార్సు చేస్తారు. అయితే వీటిని జీవితాంతం వాడుకుంటూనే ఉండాలి, వీటితో కొన్ని దుష్ప్రభావాలూ ఉంటాయి. ఇవి ....
  •  విగ్గులు ధరించటం,
  • సిలికాన్‌ గమ్మింగ్‌,
  • హెయిర్‌ వీవింగ్‌
--వంటి చాలా కృత్రిమ పద్ధతులున్నాయిగానీ ఏవీ సహజంగా, శాశ్వతంగా ఉండేవి కావు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బట్టతల సమస్యను శాశ్వతంగా అధిగమించేందుకు 'హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌' విధానాన్ని ఆశ్రయిస్తున్నారు.

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ :

తల వెనక భాగంలో రాలిపోకుండా దట్టంగా మిగిలి ఉన్న వెంట్రుకలను కుదుళ్లతో సహా తీసుకువచ్చి... మాడు మీద, ముందు భాగంలో నాటటం 'హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌' విధానం ప్రత్యేకత. ఈ వెంట్రుకల కుదుళ్లు హార్మోన్ల ప్రభావానికి లొంగే రకం కాదు కాబట్టి.. నాటిన తర్వాత ఇవి రాలకుండా అలాగే ఉండిపోతాయి. జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. అందుకే 'హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌' పూర్తిగా విజయవంతమైన ప్రక్రియగా నిలబడింది. దీనితో ఎలాంటిహానీ ఉండదు.

* హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో మెదడుకు ప్రమాదమని కొందరు భయపడుతుంటారు. కానీ ఇది నిజం కాదు. ఇది కేవలం చర్మం పై భాగానికి సంబంధించిన ప్రక్రియ మాత్రమే. దీంతో ఎలాంటి హానీ ఉండదు. మరికొందరు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందేమోనని అపోహ పడుతుంటారు.
అన్ని ఆపరేషన్ల అనంతరం వాడినట్టుగానే ఐదారు రోజులు మందులు వేసుకుంటే సరిపోతుంది. 3-6 నెలల పాటు విటమిన్‌ మాత్రలు వేసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. ఈ మందులు పెద్దగా ఖరీదైనవేమీ కాదు.
* ఇతరుల వెంట్రుకలు, కృత్రిమ సింథటిక్‌ వెంట్రుకల వంటివాటిని మన శరీరం తిరస్కరిస్తుంది. కాబట్టి ఎవరి వెంట్రుకలు వారికే అమర్చే విధానంతో ఏ ఇబ్బందీ ఉండదు.
* గడ్డం, మీసం దగ్గర వెంట్రుకలు లేనివారికి కూడా హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయొచ్చు. ఇందులో ఒక వెంట్రుక, రెండు వెంట్రుకలను మాత్రమే తీసి నాటుతారు.
* కనుబొమల్లో తేడాలను కూడా సరిచేయొచ్చు. వీటిని నాటేటప్పుడు దిశ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. సాధారణంగా కనుబొమలు అంతగా పెరగవు. కానీ ఇతర ప్రాంతం నుంచి తెచ్చి నాటిన వెంట్రుకలు త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు ట్రిమ్‌ చేసుకుంటూ ఉండాలి.
 హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌! ఇటీవలి కాలంలో ఈ విధానం మరింత మెరుగులు దిద్దుకుంది. తలకట్టును దాదాపు సహజసిద్ధంగా తీర్చిదిద్దే స్థాయికి చేరుకుని, ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రాచుర్యం సాధించింది.
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, March 10, 2013

Lower Abdominal pain during Sex,సెక్స్ లో పాల్గొంటే పొత్తికడుపులో నొప్పి

  •  
  • image - Courtesy with "http://www.teluguone.com/"

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Lower Abdominal pain during Sex,సెక్స్ లో పాల్గొంటే పొత్తికడుపులో నొప్పి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




కొందరు స్త్రీలకి సెక్స్ లో పాల్గొంటే పొత్తికడుపులో నొప్పి వస్తుంది. దాంతో వాళ్ళకి సెక్స్ లో పాల్గొనాలని ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ఒకవేళ కోరికతో సెక్స్ లో పాల్గోన్నప్పటికి ఆ తర్వాత బాధపడతారు. గర్భస్రావాలు అయినప్పుడు, కాన్పు అయినప్పుడు తగిన శుభ్రత పాటించకపోయినా, యాంటిబయోటిక్ మందులు వాడకపోయినా యోనిలోపల వ్యాధి క్రిములు చేరుతాయి. ఈ క్రిములు గర్భాశయంలోపలి చేరతాయి. ఆపైన ఫెలోపియన్ ట్యూబుల్లోకి చేరతాయి. వ్యాధిక్రిములు సోకడంతో గర్భాశయం దాని పక్కనే ఉండే ట్యూబులు, ఓవరీస్ పుండుగా మారతాయి.

గర్భాశాయంలోకి వ్యాధిక్రిములు ప్రవేశించిన తోలి దశలో కొంతమందికి జ్వరం వస్తుంది. చలిచలిగా అనిపిస్తుంది. మూత్రంలో మంట కలుగుతుంది. పొత్తికడుపు బిగదీస్తుంది. అందరిలోనూ ఈ బాధలు ఇంతగా లేకపోయినా కొంతైనా వాపు లోపల ఉంటుంది. ఆ వాపు వల్ల సెక్స్ లో పాల్గొన్నప్పుడు నొప్పి కలుగుతుంది. ఇన్ ఫెక్షన్ వల్ల గర్భాశయం,ఫెల్లోపియన్ ట్యూబులు, ఓవరీస్ వాచినప్పుడు పొత్తికడుపు దిగువన కొంత చీము కూడా చేరవచ్చు. గర్భాశయం ప్రేగుల వాపునే వైద్యభాషలో పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్ (పి.ఇ.డి.) అంటారు. పి.ఇ.డి. పరిస్థితి కొందరిలో క్రానిక్ గా ఉండిపోతుంది. దీర్ఘకాలంగా ఇటువంటి పరిస్థితి నెలకొన్నప్పుడు వేరే బాధలు లేకపోయినా సెక్స్ లో పాల్గొంటే బాధ అనిపించడం ఉంటుంది. పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్ ఎక్కువమంది స్త్రీలల్లో ఇంటిదగ్గర కాన్పులైన వాళ్ళలోనూ, నాటుమంత్రసానుల చేత కాన్పులు చేయించుకున్నవాళ్ళల్లోనూ కనబడుతుంది. దానికి కారణం కాన్పు సమయంలో తగిన శుభ్రత పాటించకపోవడం, ఇటువంటి స్త్రీలు కాన్పు అయ్యాక తిరిగి దాంపత్యంలో పాల్గొంటే సెక్స్ లో
పాల్గొన్న ప్రతిసారీ బాధ అనిపిస్తుంది.

సెక్స్ అయిపోయిన తరువాత వెంటనే కాని, ఆ మరుసటి రోజు కాని పొత్తికడుపు బిగదీసి బాగా బాధ అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే ఆసుపత్రిలలోనే కాన్పు అవ్వాలి. చాలామంది స్త్రీలు కాన్పు అయిన తర్వాత డైపర్స్ గా పాతగుడ్డలు వాడతారు. పాతగుడ్డలు వాడటం వల్ల వాటిలో ఉన్నటువంటి క్రిములు యోనిలోకి చేరి గర్భాశయం ప్రేగులు వాచినట్లు చేస్తాయి. అందుకని కాన్పు సమయంలోనూ, మామూలు మెన్సస్ సమయంలో కూడా కేర్ ఫ్రీ వంటి పరిశుభ్రమైన డైపర్స్ నే  ఉపయోగించాలి. గర్భాశాయంలోకి బాక్టీరియా వంటి వ్యాధిక్రిములు చేరడం వల్ల ఎండోమెట్రైటిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధి కలిగినవారిలో గర్భాశయంలోని పొరలు వాచుతాయి. ఇటువంటి పరిస్థితి అకస్మాత్తుగా జరగవచ్చు. లేదా నిదానంగా జరగవచ్చు ఈ పొరల వాపు కొద్దికాలమే ఉండవచ్చు లేదా దీర్ఘకాలం ఉండవచ్చు.

పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్ ఉన్నా, ఎండోమెట్రైటిస్ ఉన్నా తెల్లబట్ట అవుతుంది. సెక్స్ లో పాల్గొన్నప్పుడు నొప్పి అనిపిస్తుంది. గనేరియా వంటి సుఖవ్యాధులు వచ్చినవారిలోనూ, అబార్షన్లు అయినవారిలోనూ వెంటనే తగిన చికిత్స పొందకపోయినట్లయితే గర్భాశయం పేగు వాపు, ఎండోమెట్రైటిస్ డిసీజ్ వస్తుంది. సుఖవ్యాధులు వచ్చినవాళ్ళలో యోనిమార్గం పుండుగా మారడమే కాకుండా గర్భాశయం పేగు కూడా వాచుతుంది. కొందరిలో సుఖవ్యాధులు దీర్ఘకాలంగా మిగిలిఉంటాయి. ఇలాంటివారితో సెక్స్ లో పాల్గొంటే పొత్తికడుపులో నొప్పి వస్తుంది. చాలామంది స్త్రీలు సెక్స్ లో పాల్గొన్నప్పుడు నొప్పి అన్పించి ఆ తర్వాత నొప్పిలేకపోవడంతో నొప్పిని నిర్లక్ష్యం చేస్తారు. కాని వ్యాధిక్రిములు తన ప్రభావాన్ని చూపిస్తూ గర్భాశయం ట్యూబులు మూసుకుపోయేలా చేస్తాయి. దాంతో గర్భం రాదు.

కొంతమంది స్త్రీలకి కొన్ని రకాల భంగిమల్లో సెక్స్ లో బాధ అనిపిస్తుంది. దానికి ఇన్ ఫెక్షన్ ఒక ప్రాంతం వరకే పరిమితం అవడం కారణం. ఏది ఏమైనా రతిలో పాల్గొన్నప్పుడు నొప్పి అనిపిస్తే వైద్యపరీక్షలు అవసరం. అల్ట్రాసౌండ్ స్కానింగ్, రక్తపరీక్షలు వీరికి అవసరం  అవుతాయి. కాన్పులైనప్పుడు యోనిమార్గం చీరుకుపోవడంవల్ల, యోని దగ్గర కుట్లు పడటం వల్ల కొందరికి సెక్స్ లో పాల్గొంటే నొప్పి అన్పించవచ్చు. కొందరికి ఏ వాపు లేకుండానే కామోద్రేకం క్లైమాక్స్ చేరినప్పుడు పొత్తికడుపు దగ్గర నొప్పి అన్పిస్తుంది.ఈ నొప్పి కొద్ది నిముషాలుండి తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని "ఆర్గజమిక్ పెయిన్'' అంటారు. గర్భాశయం పక్కన ఉన్న ప్రేగు స్పాజం కి లోనుకావడం వల్ల ఈ బాధ కలుగుతుంది.
  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, March 3, 2013

Drug Resistance and diseases, వ్యాధినిరోధకత-వ్యాధులు

  •  
  •  image : courtesy with : Eenadu news paper
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Drug Resistance and diseases, వ్యాధినిరోధకత-వ్యాధులు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్‌ ఆరోగ్యంపై పెనుప్రభావం ప్రాణాంతకమవుతున్న విచ్చలవిడి వాడకం నిరోధకతను పెంచుకుంటున్న బ్యాక్టీరియా
ఇన్‌ఫెక్షన్లతో పెరుగుతున్న మరణాలు వైద్యనీతిని పక్కనపెడుతున్న ఆస్పత్రులు ప్రభుత్వ నియంత్రణ లేదు బ్యాక్టీరియాను నిర్వీర్యం చేయడానికి వాడాల్సిన మందులవి. ఎంత వాడాలో, ఎలా వాడాలో, ఎవరికి వాడాలో చెప్పే వైద్యనీతిని అనుసరించే వాటిని వాడాలి.
లేదంటే శరీరం నిర్వీర్యమవుతుంది. లోపలికి ప్రవేశించిన సూక్ష్మక్రిమి ఏ మందుకూ లొంగని మొండిఘటమవుతుంది. ఇంత ప్రమాదమనీ తెలిసీ  యాంటీబయాటిక్స్‌ను ఇష్టానుసారం ఉపయోగించే అలవాటు ఇటీవల కాలంలో బాగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సత్వర ఉపశమనం  కలిగిస్తున్నామన్న పేరు కోసం పలు ఆస్పత్రులు, పలువురు వైద్యుల్లో ఈ ధోరణి వ్యాపిస్తుండడంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. రోగుల తెలియనితనమూ వారిని ప్రమాదపుటంచుల్లోకి నెడుతోంది. వాడమన్నన్ని రోజులూ వాడకుండా రోగం తగ్గిందని ఆపేస్తుండడం వల్ల కూడా మొండిరోగాలు తయారవుతున్నాయి.

ఔషధాల వాడకంపై ఆంక్షలున్న అమెరికాలోనే... మోతాదుకు మించి మందుల వాడకం, ఆస్పత్రుల్లో సోకుతున్న వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఏటా లక్షమందికి పైగా మరణిస్తున్నారు. ఔషధాల వాడకంపై కఠిన మార్గదర్శకాలులేని మన దేశంలో ఈ తరహా మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇన్‌ఫెక్షన్లకు గురైన వారికి మెరుగైన చికిత్సలు అందించే సాంక్రమిక వ్యాధి  నిపుణుల(Infectious disease specialists) కొరత మన దేశంలో తీవ్రంగా ఉంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆర్థం చేసుకోవచ్చు.

వైద్యుల అనాలోచిత ధోరణి
ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్న రోగులకు 10% యాంటీబయాటిక్స్‌ అవసరంకాగా, త్వరగా నయం కావాలనే భావనతో 30% అధిక మోతాదు మందులు ఇస్తున్నారు. దీనివల్ల త్వరగా ఉపశమనం కలిగినా, భవిష్యత్తులో మందులకు లొంగని రీతిలో బ్యాక్టీరియా, వైరస్‌లు రూపాంతరం చెందుతాయని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల నివారణ కోసం సగటున రోజుకు 500 మంది రోగులకు
'కార్బాపీనమ్స్‌'(Carbapenems are a class of β-lactam antibiotics with a broad spectrum of antibacterial activity. They have a structure that renders them highly resistant to most β-lactamases.) వాడుతున్నారు. దీనికి రూ.5వేల నుంచి రూ.16 వేల వరకు ఖర్చవుతుంది. ఈ మందులు అందరికీ అవసరం లేదు. ఇన్ఫెక్షన్‌ బాగా ఎక్కువగా ఉన్నవారికే వాడాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో ఉన్న రోగులు త్వరగా కోలుకుంటే, కొత్త రోగులను చేర్చుకోవచ్చన్న అనైతిక ఆలోచనతో వీటిని ఇష్టానుసారం వాడుతున్నారని జాతీయ పౌష్ఠికాహార సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. కార్బాపీనమ్స్‌ మందులు ఒకసారి వాడితే ఆ తరవాత సాధారణ మందులు పూర్తిస్థాయిలో ప్రభావం చూపించవు. ఇది చాలా ఆందోళనకర పరిణామం. మలేరియా, గన్యా, టైఫాయిడ్‌, డెంగీ జ్వరాలు,  పిరితిత్తులు, మూత్రసంబంధిత సమస్యలకు ఇటీవల కాలంలో ఔషధాలు వాడుతున్నా... త్వరగా నయం కాకపోవడానికి యాంటీబయాటిక్స్‌ మందులు మోతాదుకు మించి వాడుతుండం ఒక కారణం.

ఇది మరో ప్రమాదం..
ఆస్పత్రుల్లోని ఇంటెన్సివ్‌కేర్‌లో బ్యాక్టీరియా పొంచి ఉంటుంది. అక్కడికి వచ్చే వారికి అప్పటికే రోగనిరోధకత తక్కువ ఉండడంతో వారికి ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశాలుంటాయి. దానికి తోడు నియంత్రణ లేకుండా ఔషధాలు వాడడం వల్ల వాటికి లొంగని విధంగా అవి తయారై పరిస్థితిని విషమం చేస్తాయి. ఆస్పత్రిలో ఇంటెన్సివ్‌కేర్‌లో 48 గంటల కంటే ఎక్కువ కాలం ఉంటే... రోగి శరీరంలోకి బ్యాక్టీరియా ప్రవేశించినట్లేనని ఇన్‌ఫెక్షియస్‌ వ్యాధుల చికిత్స నిపుణులు డాక్టర్‌ ఎన్‌.సునీత 'ఈనాడు'తో చెప్పారు. ఏడు రోజుల కంటే ఎక్కువ ఉన్న రోగికి ఇన్‌ఫెక్షన్లు రావడానికి 70% అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మందుల వాడకంపై నియంత్రణ లేకపోవడం, ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్ల నివారణకు పటిష్ఠమైన విధానాలు లేకపోవడమే కారణమన్నారు. ఇష్టారాజ్యంగా మందులు వాడడం తదితర కారణాలతో మొండివ్యాధులుగా మారిన తరవాత, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి వస్తున్న కేసుల్లో సగటున ప్రతి రోజు 10 వరకు ''గ్రామ్‌ నెగెటివ్‌ బ్యాక్టీరియా కేసులు''   నమోదవుతున్నాయి. ఇది చాలా ఆందోళనకర పరిణామమని డాక్టర్‌  సునీత చెప్పారు. ఢిల్లీలోని అఖిలభారత వైద్యవిజ్ఞానసంస్థలో రోగులపై అధ్యయనం చేయగా... 11శాతం మంది ఆస్పత్రిలో పలురకాల ఇన్‌ఫెక్షన్లకు (ప్రత్యేకించి గ్రామ్‌ నెగెటివ్‌ బ్యాక్టీరియా) గురైనట్లు తేలింది. ఈ పరిస్థితిని నియంత్రించకపోతే, భవిష్యత్తులో చాలా రకాల వ్యాధులకు ఎక్కువ తీవ్రత(డోసేజీ) ఉన్న మందులు వాడాల్సి వస్తుందన్నారు. దీనివల్ల సహజంగా ఉండే రోగనిరోధకశక్తి దెబ్బతింటుందన్నారు.

కొంపముంచుతున్న ఉజ్జాయింపు చికిత్సలు:
వైద్యపరీక్షలు (కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ) చేసిన తరవాత రోగికి యాంటీబయాటిక్స్‌ ఇవ్వాలి. మన దేశంలో ఈ తరహా విధానాలు పరిమితంగా కొన్ని ఆస్పత్రుల్లో మాత్రమే అమలవుతున్నాయి. ప్రతి చిన్న సమస్యకు యాంటీబయాటిక్స్‌ వాడడం అలవాటుగా మారిపోయింది. రోగ నిర్ధారణ చేయకుండానే చాలా మంది వైద్యులు ఉజ్జాయింపుగా చికిత్సలు చేస్తున్నారు. చాలా చోట్ల రోగనిర్ధారణ పరీక్షల్లోనూ కచ్చితత్వం, నాణ్యత ఉండడం లేదు. దీనివల్ల మందులు వాడినా ఫలితం ఉండడం లేదు.
ఇవీ కారణాలు
* ఎలాంటి జబ్బునైనా త్వరగా నయం చేశామని పేరు సాధించాలనే తపన ప్రైవేటు ఆస్పత్రులతో పాటు వైద్యుల్లో పెరిగింది.
* కొత్త రోగిని చేర్చుకుంటే, వైద్యపరీక్షలు, శస్త్రచికిత్సల ద్వారా ఆదాయం వస్తుంది. అందుకే రోగులకు అధిక మోతాదు మందులు ఇచ్చి, కొంత ఉపశమనం రాగానే ఇంటికి పంపిస్తున్నారు.
* గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు ఇష్టారాజ్యంగా యంటీబయాటిక్స్‌ ఇస్తున్నారు.
* మందుల తయారీ కంపెనీలు యాంటీబయాటిక్స్‌ విక్రయాలు పెంచుకోవడానికి ఆదాయంలో దాదాపు 25శాతం దుకాణాలు, వైద్యులకు ప్రోత్సహకాలుగా ఇస్తున్నాయి. దీనివల్ల కూడా యాంటీబయాటిక్స్‌ వాడకం పెరుగుతోంది.  ప్రభుత్వ ఆస్పత్రులకు కొనుగోలు చేస్తున్న మందుల్లో సుమారు రూ.65 కోట్లు యాంటీబయాటిక్స్‌ ఉన్నాయి. వీటిని తగ్గించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.  ఇన్‌ఫెక్షియస్‌ వ్యాధుల నివారణ విభాగంలో వైద్యులకు శిక్షణ ఇచ్చే సంస్థలు మూడు మాత్రమే ఉన్నాయి.
 1. హిందూజా(ముంబాయి),
2. సీఎంసీ(వేలూరు),
3. అపోలో(చెన్నై)లో మాత్రమే ఈ శిక్షణ అందుబాటులో ఉంది. పెరుగుతున్న ఇన్‌ఫెక్షన్ల తీవ్రత దృష్ట్యా కొన్ని మినహాయింపులతో ఈ కోర్సులను విస్తరించడానికి భారతీయ వైద్యమండలి తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

చెన్నై ప్రకటన---యాంటీబయాటిక్స్‌ విచ్చలవిడి వినియోగంపై గత ఏడాది ఆగస్టులో చెన్నైలో నిర్వహించిన సమావేశంలో కేంద్రఆరోగ్య మంత్రిత్వశాఖ, వైద్యపరిశోధన మండలి, మందుల కంపెనీలు, వైద్యరంగ నిపుణులు పలు అంశాలపై చర్చించారు. యాంటీబయాటిక్స్‌ నియంత్రణ విధానం తీసుకురావాలని నిర్ణయించినా ఇంతవరకు అమల్లోకి రాలేదు. ఔషధకంపెనీలు లాబీయింగ్‌ చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
* ఆస్పత్రుల్లో 72 గంటల కంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్‌ వాడాల్సి వస్తే, మరో వైద్యనిపుణుడి సిఫారసు తప్పనిసరి.
* కార్బాపీనమ్స్‌ వల్ల ఇంటెన్సివ్‌కేర్‌లో చికిత్స పొందుతున్న వారిలో 51% మందిలో మందుతీవ్రతను తట్టుకునే స్థాయి పెరిగింది. ఈ తరహా మందుల వాడకంపై వైద్యులు జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఆస్పత్రుల్లో ఔషధాల వాడకంపై పర్యవేక్షణ కోసం అక్కడ పనిచేసే వైద్యులతో అంతర్గతంగా కమిటీ ఏర్పాటు చేయాలి.
* జిల్లా, రాష్ట్రస్థాయుల్లో పర్యవేక్షణ కోసం ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీలు, ప్రతి నెలా సమీక్షా సమావేశాలు.
* ఎంబీబీయస్‌, పీజీ వైద్యకోర్సుల్లో ఔషధాల వాడకంపై ప్రత్యేక శిక్షణ.
* తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో యాంటీబయాటిక్స్‌ వాడకాన్ని తగ్గించడానికి వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మందుల దుకాణాల్లో వైద్యుల సిఫారసులు లేకుండా యాంటీబయాటిక్స్‌ విక్రయాలకు వీల్లేకుండా నిబంధనలు కఠినతరం చేశారు. ఈ తరహా విధానాలు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి.
* ఔషధనియంత్రణశాఖ ద్వారా పటిష్ఠమైన నిఘా.

-- ఇన్‌ఫెక్షియస్‌ వ్యాధుల చికిత్స నిపుణులు డాక్టర్‌ ఎన్‌.సునీత @ఈనాడు దినపత్రిక-హైదరాబాద్‌ 03-మార్చి-2013
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Pancreatic Cancer, క్లోమగ్రంధి క్యాన్సర్‌

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Pancreatic Cancer, క్లోమగ్రంధి క్యాన్సర్‌
-
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

శరీరంలోని ముఖ్యమైన గ్రంధుల్లో క్లోమం (పాన్‌క్రియాస్‌) ఒకటి. జీర్ణ వ్యవస్థ కు ఇది ప్రధానంగా దోహదపడుతుంది. శరీరంలో జీర్ణాశయం దిగువ బాగంలో దీన్ని గమనించవచ్చు. నాళ గ్రంధి హోదాలో ఇది  క్లోమరసాన్ని స్రవిస్తుంది. ఈ  క్లోమ రసాన్ని స్రవించే కణాల్ని రెండు రకాలుగా చెబుతారు. డక్టల్‌ కణాలు, ఎసినార్‌ కణాలు అని చెప్పవచ్చు. ఇందులో డక్టల్‌ కణాల నుంచి విడుదల అయ్యే బైకార్బనేట్‌ పదార్థాలు.. పాక్షికంగా జీర్ణమైన ఆహారంలోని ఆమ్లత్వాన్ని అదుపు చేయగలుగుతుంది. ఎసినార్‌ కణాలు ముఖ్యంగా  క్లోమరసం లోని ఎంజైవ్గుల చైతన్యానికి దోహద పడుతాయి . ఇక క్లోమరసంలోని ఎంజైవ్గులు వాటి పని తీరు...

-క్లోమరసం లో ఉండే ట్రిప్సినోజిన్‌ అనే ఎంజైమ్‌చైతన్య రూపం పొంది ట్రిప్సిన్‌ గా మారుతుంది. అప్పుడు అది మాంసక్రత్తులపై పనిచేసి  అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. కైమో ట్రిప్సినోజిన్‌ కూడా చైతన్యవంతం అయినప్పుడు మాంసక్రత్తుల్ని జీర్ణం చేసేందుకు ఉపకరిస్తుంది.  ఆహారంలోని ఎలాస్టిన్‌ లను జీర్ణం చేసే ఎలాస్టియేజ్‌, కేంద్ర కామ్లాలను జీర్ణం చేసే న్యూక్లియేజ్‌ లను క్లోమం స్రవిస్తుంది. ఇక్కడ స్రావితం అయ్యే అమైలేజ్‌.. పిండి పదార్థాల్ని జీర్ణం చేయటంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇక కొవ్వుల్ని సరళ రూపంలోకి మార్చే లైపేజ్‌ అనేది ప్రధానమైన ఎంజైమ్‌ గా చెప్పవచ్చు. అంతే కాకుండా కొవ్వుల్ని ప్రధానంగా జీర్ణం చేసేది క్లోమరసం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆహారంలోని అన్ని రకాల ప్రధాన పదార్థాల్ని క్లోమరసం సంశ్లేషణ చేస్తుంది.

-వినాళ గ్రంధి హోదాలో క్లోమం అనేక హార్మోన్‌లను స్రవించును. ఇవి నేరుగా రక్తంలోకి చే రిపోయి, ఆయా భాగాల మీద ప్రభావం చూపు తుంది. క్లోమంలోని ద్వీప కణాలు హార్మోన్‌ల స్రావకానికి మూలంగా నిలుస్తాయి. ఇందులో నాలుగు రకాల హార్మోన్‌లను గుర్తిస్తారు. ఆల్పా కణాలు గ్లూకగాన్‌ అనే హార్మోన్‌ను స్రవిస్తాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిని పెంచుతుంది. బీటా కణాలు ఇన్సులిన్‌ ను స్రవించును. ఇది రక్తంలోని గ్లూకోజ్‌స్థాయిని నియంత్రించును. ఇక డెల్టా కణాలు స్రవించే సొమాటో స్టాటిన్‌ అనే హార్మోను .. పైన చెప్పిన ఆల్ఫా, బీటా కణాల పనితీరును ప్రభావితం చేయును. గామా కణాలు క్లోమ పెప్టైడ్‌ అనే హార్మోన్‌ ను స్రవించును. ఈ హార్మోన్‌లు శరీరంలో విభిన్న జీవ రసాయన చర్యల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ హార్మోన్‌ ల స్రావకంలో హెచ్చు తగ్గులు ఏర్పడితే ఇతర జీవన క్రియలకు ఇబ్బంది ఏర్పడుతుంది.

-క్లోమ క్యాన్సర్‌ ను అనేక లక్షణాల్చతో పోల్చుకోవలసి ఉంటుంది. నొప్పిని ప్రధానంగా గుర్తించవచ్చు. మలం బూడిద రంగుకి, మూత్రం ముదురు రంగుకి మారవచ్చు. ఆకలి తగ్గిపోయి, నీరసం పెరిగిపోతుంది. బరువు తగ్గవచ్చు. వాంతులు అవుతుంటాయి. కడుపులో అస్థిమితంగా ఉంటుంది. అజీర్ణం అయి విరోచనాలు అవుతుండవచ్చు. గడ్డ కణితి, సిస్టుల విషయంలో ఏ ప్రాంతంలో సమస్య ఉంది అన్నది చాలా ప్రధానం. క్లోమంలోని తల భాగంలో కణితి ఏర్పడితే కామెర్లు బహిర్గతం అవుతాయి. అదే దేహం బాగంలో కానీ, తోక భాగంలో కానీ ఏర్పడితే నొప్పి వెనక్కి వ్యాపిస్తుంటుంది. ఈ రెండు ప్రాతిపదికలు గడ్డ కణితి, సిస్టుల విషయంలో పోల్చదగినవి. కానీ, ఐలెట్‌ సెల్సు విషయంలో మాత్రం శారీరక సమస్యలు తక్కువ. క్రియా పరమైని ఇబ్బందులు ఉంటాయి.

హైపో గ్లైసీమియా, డయేరియా, వంటి లక్షణాలు గుర్తించదగును. క్లోమ క్యాన్సర్‌ ఏర్పడి నప్పుడు తలెత్తే అన ర్థాల్ని రెండు రకాలుగా గుర్తించవచ్చు. క్లోమరసం సరిగ్గా   స్రవించకపోవటంతో ఎంజైమ్‌ల విని యోగం తగ్గిపోతుంది.-అమైలేజ్‌, ట్రిప్సిన్‌, లైపేజ్‌ వంటి ఎంజైమ్‌లు తగినంతగా అందు బాటులో లేకపోవటంతో జీర్ణ క్రియ మందగిం చిపోతుంది. సరైన జీర్ణం జరగక పోవటంతో ప్రధా న పదార్థాల సంశ్లేషణ నిలిచిపోతుంది. అటు, హార్మోన్‌ ల స్రావం కూడా తగ్గిపోతుంది. ఇన్సులిన్‌, గ్లూకాగాన్‌ వంటి హార్మోన్‌ల స్రావం తగ్గకపోవటంతో రక్తంలో గ్లూకోజ్‌ మట్టం సక్రమంగా ఉండదు. రోగం ముదిరిపోయినప్పుడు ఇతర అనర్థాలు పెరిగిపోతాయి. చివరకు క్యాన్సర్‌ చేసే చెడు అంచనాల్ని మించిపోతుంది.క్లోమ క్యాన్సర్‌ తలెత్త టానికి నిర్దిష్టమైన కారణం ఏమీ లేదు. జన్యుపర మైన అంశాలు గుర్తించుకోదగినది. కుటుంబంలో ఎవరికైనా ఉంటే రక్త సంబంధీకులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆధునిక జీవనశైలి, కాలుష్యం వంటి కారణాలు కూడా క్లోమ క్యాన్సర్‌ కు దోహదపడు తాయి. ఒత్తిళ్లతో కూడిన జీవన శైలి, వ్యాయామం లేకపోవటం, మానసిక ఆందోళనలు క్రియా పరమైన కారకాలుగా చెప్పవచ్చు. వీటిని సూటిగా కారణాలు గా అంచనా వేయటానికి ఉండదు.

-క్యాన్సర్‌కు ఆపరేషన్‌చేస్తే ప్రమాదం అన్న అపోహ కూడా ఉంది. ఆపరేషన్‌ చేయటం వలన క్యాన్సర్‌కణితి పగిలిపోయి, ఆ కణజాలం ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది అని చెబుతారు. ఇది ఎంత మాత్రం వాస్తవం కాదు. జీర్ణాశయ భాగాల్లో వచ్చే క్యాన్సర్‌లకు ఆపరేషన్‌ అనేది ఉత్తమ చికిత్స. క్యాన్సర్‌ను ఎంత ప్రాథమిక దశలో గుర్తించాం అన్నది ముఖ్యం. దీన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. కీమో థెరపీ, రేడియో థెరపీ లతో ఆధునిక చికిత్స సాధ్యం అవుతుంది. ఆపరేషన్‌ ద్వారా ఆ ప్రాంతంలో కణితిని కరిగించటానికి అవకాశం ఉంటుంది. ఒక వేళ క్యాన్సర్‌ముదిరిపోయినా మిగిలిన శేష జీవితం సాఫీగా  జరిగిపోయేలా చికిత్స అందించటానికి వీలవుతుంది. ఎక్కువగా మద్యం తాగే అలవాటు ఉన్నప్పుడు.. ఆల్కహాల్‌ నుంచి తయారయ్యే విష పదార్థాలు క్లోమ కణజాలంపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల సజీవకణజాలం శిథిలం అవుతుంది. కొంత కాలం తర్వాత ఈ శిథిల పదార్థాలు కణితిలుగా ఏర్పడుతాయి. ఈ కణితులు క్లోమంలో కానీ, క్లోమ నాళంలో కానీ ఏర్పడవచ్చు.

-క్లోమమునకు ఏర్పడే ముఖ్య సమస్యల్లో ఒకటిగా క్యాన్సర్‌ను చెప్పుకోవచ్చు. ఇది ఏ భాగంలో ఏర్పడుతుంది అనేది ప్రధానమైన అంశం. క్లోమ ము లో తల, దేహం, తోక అనే ప్రాంతాల్ని గుర్తించదగును. ఏ ప్రాంతంలో అవాంఛిత కణజాలం పేరుకు పోయి కణితి గా ఏర్పడుతుందో దాన్ని బట్టి వ్యాధి నిర్ధారణ, చికిత్స ఆధారపడి ఉంటాయి. ఈ కణితుల్ని ప్రాథమికంగా మూడు రకాలుగా గుర్తిస్తారు. కణజాలం పేరుకొని పోయి గట్టిగా ద్రఢ పడితే దాన్ని గడ్డ కణితి అంటారు. ఈ కణితులు నీటి బుడగల మాదిరి ఉంటే సిస్టులుగా వ్యవహరిస్తారు. వినాళ గ్రంధులకు సంబంధించిన ఐలెట్‌ కణజాలాల్లో కణితి ఏర్పడితే దాన్ని మూడో రకం గా అంటే ఐలెట్‌ సెల్సు క్యాన్సర్‌ గా గుర్తిస్తారు.

క్యాన్సర్‌ను గుర్తించటానికి కడుపు భాగంలో పరీక్షలు చేయించాలి. సీటీ స్కాను, ఎమ్‌ ఆర్‌ ఐ స్కాను వంటివి చేయించాలి. ఎండోస్కోపిక్‌ రెట్రాగ్రెడ్‌ కొలాంజియో పాన్‌క్రియాటోగ్రఫీ పరీక్ష శాస్ర్తీయంగా చేయించుకొంటే క్యాన్సర్‌సోకిన ప్రాంతాన్ని నిరి్‌‌దష్టంగా గుర్తించవచ్చు. అవసరమైతే ఆ ప్రాంతంలో క్లోమపు కణజాలాన్ని బయోప్పీ చేయించి క్యాన్సర్‌ను  నిర్దారించుకోవచ్చు. దీంతో పాటు కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట లివర్‌ ఫంక్షన్‌ టెస్టు, సీరమ్‌ బైలిరుబిన్‌ వంట పరీక్షలు కూడా అవసరం అవుతాయి.

Courtesy with Ayush@Surya Telugu Daily(February 25, 2013)
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, March 1, 2013

Scents and Deodorants not good for health,పరిమళద్రవ్యాల వాడకం ఆరోగ్యానికి మంచిదికాదు

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Cents and Deodorants not good for health,పరిమళద్రవ్యాల వాడకం ఆరోగ్యానికి మంచిదికాదు -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



-ఈ మధ్యకాలంలో చాలామందిలో పరిమళద్రవ్యాల వాడకం ఎక్కువైంది. ముఖ్యంగా స్ర్తీలను ఆకర్షించడానికి అనేకరకాల సెంట్లు, డియోడరెంట్లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. సెక్స్‌ సెంట్లుగా ముద్దుగా పిలుచుకునే వీటిల్లో ఎక్కువగా చెమటవాసన రంగరించిన సెంట్లకు లేదా డియోడరెంట్లకు గిరాకీ ఎక్కువ. ఇటువంటి కాస్మొటిక్స్‌లలో ఏ రకమైన వాసనలు కలపాలనే విషయం మీద అనేక రకాల పరిశోధనలు చేస్తూనేవున్నారు. పురుషుల లైంగికతను గురించి పరిశీలన చేసిన శాస్తజ్ఞ్రులు, స్ర్తీల జననేంద్రియాల వద్ద ఏర్పడే ఒక రకమైన వాసనకు ఎక్కువగా లైంగికోద్రిక్తత పొందుతున్నట్టుగా గుర్తించారు. ఈ విషయంలో స్ర్తీలు కూడా పురుషుల చెమట వాసనకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అయితే సంభోగ సమయంలో చెమట వాసన వల్ల మూడ్‌ అవుట్‌ అయిపోవడం కూడా జరుగుతుంటుంది. అటువంటివారు స్నానం చేసి, తిరిగి అటువంటి వాసనల మేళవింపుతో వున్న డియోడరెంట్లను
ఉపయోగిస్తారు.

జంతుజాతుల్లో, అండోత్పత్తి సమయంలో ఊరే స్వేదంలో కొన్ని రకాల రసాయనిక పదార్థాలు కలిసి ఒక ఘాటైన వాసనను వెదజల్లుతాయి.-ఆ వాసనకు ప్రేరేపితమైన పురుష జంతువులు, అప్రయత్నంగా సంభోగ చర్యకు ఉత్సాహాన్ని చూపెడతాయి. పునరుత్పత్తి ప్రక్రియ సజావుగా సాగడానికి  ఇది ప్రకృతిసిద్ధంగా వుండే ఒక ఏర్పాటు.

 కాగా చెమట వాసన వల్ల లైంగికోద్రేకం కలుగుతుందని, జననేంద్రియాలను శుభ్రం చేసుకోకుండా రతిలో పాల్గొనడం ఆరోగ్య కారణాల రీత్యా మంచది కాదంటున్నారు సెక్సాలజిస్టులు. అలాగే చర్మానికి పడుతుందో లేదో తెలుసుకోకుండానే మార్కెట్‌లో లభించే, రకరకాల సెంట్లను, డియోడరెంట్లను వాడడం కూడా మంచిది కాదు. వాటిల్లో వాసన కోసం చేర్చే కృత్రిమ పదార్థాల వల్ల, జననాంగాల వద్ద వున్న సున్నితమయిన చర్మపు కణాలు అలర్జీకి  గురయ్యే ప్రమాదం వుంది. అందుచేత, శుభ్రత పాటించడం ఎంత ముఖ్యమో, ప్రకృతి సిద్ధమయిన మలినాలను పోగొట్టే వస్తువులను వాడడం కూడా అంతే ముఖ్యం. ఆయుర్వేద సబ్బులను వినియో గించడం, ఇంట్లోనే తయారు చేసుకున్న పొడులను ఉపయోగించడం వంటివి చేసి, తాజాగా వుండడానికి ప్రయత్నించాలి. సంభోగంలో పాల్గొనే ముందు, తర్వాత కూడా స్నానం చేయడం మంచిది.

-Courtesy with Surya Telugu daily Sunday magazine
  • ========================
 Visit my website - > Dr.Seshagirirao.com/