- image : courtesy with Eenadu news paper
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Hints for reduction of body weight, బరువు తగ్గడానికి సూచనలు -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
సన్నగా కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే ఆ క్రమంలో తెలియకుండా చేసే చిన్నచిన్న పొరబాట్లతో ఫలితం కనిపించకపోగా, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేం.
'ప్రతి రోజూ పెద్ద కప్పు కాఫీ తాగడం వల్ల ఏడాదికి నాలుగున్నర కేజీల బరువు పెరుగుతారు' అని తెలిపారు బ్రిటన్‌కి చెందిన అధ్యయనకర్తలు. చిన్న కప్పు కాఫీ తీసుకున్నా ఎంత లేదన్నా 153 కెలొరీలు అందుతాయి. కాబట్టి దానికి బదులుగా బ్లాక్ కాఫీని తీసుకుంటే మంచిదనీ, దీనివల్ల కేవలం 35 కెలొరీలే అందుతాయనీ సుమారు రెండువేల మందిపై చేసిన ఈ అధ్యయనం వెల్లడించింది. జంక్ ఫుడ్‌ని తగ్గిస్తున్నా కాఫీ తీసుకోవడం వల్ల అందే చక్కెరలు తెలియకుండానే బరువును పెంచుతాయి. దీర్ఘకాలంలో అనారోగ్యాలకు కారణమవుతాయి.
* కనీసం గంటపాటు వ్యాయామం చేస్తే చాలా త్వరగా సన్నబడొచ్చు అనే ఉద్దేశం చాలామందిది. దాంతో అదేపనిగా వ్యాయామం చేయడం మొదలుపెడతారు. కానీ యూనివర్శిటీ ఆఫ్ కోపెన్‌హాగన్ ప్రకారం ప్రతిరోజూ క్రమం తప్పకుండా అరగంటపాటు వ్యాయామం చేస్తే మూడు నెలల్లో కనీసం రెండున్నర కిలోల బరువు తగ్గే అవకాశం ఉంది.
* తీసుకునే తిండికి తగ్గ వ్యాయామం చేస్తే సరిపోతుంది తప్ప, డైటింగ్ నియమాలు పాటించాల్సిన అవసరం లేదనుకుంటారు కొందరు. కానీ బరువు తగ్గాలనుకుంటే కొన్ని రకాల పదార్థాలు ముఖ్యంగా చీజ్, బిస్కెట్లూ, కేక్‌లూ, చిప్స్ లాంటివి తగ్గించి లోఫ్యాట్ డైట్‌ని పాటించాలి. ఇలా చేయడం వల్ల ఆర్నెల్లలోనే వూహించిన దానికన్నా ఎక్కువ బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
* బరువు తగ్గాలనుకుంటే ఒత్తిడినీ అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఉద్వేగాలూ బరువు పెంచుతాయి. ఏ మాత్రం ఒత్తిడిగా ఉన్నా, అతిగా ఉద్వేగాలకు లోనయినా తెలియకుండానే ఎక్కువగా తినేస్తాం. అదే బరువు పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఉద్వేగాలను సాధ్యమైనంత వరకూ నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
- ===================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.