Sunday, March 3, 2013

Pancreatic Cancer, క్లోమగ్రంధి క్యాన్సర్‌

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Pancreatic Cancer, క్లోమగ్రంధి క్యాన్సర్‌
-
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

శరీరంలోని ముఖ్యమైన గ్రంధుల్లో క్లోమం (పాన్‌క్రియాస్‌) ఒకటి. జీర్ణ వ్యవస్థ కు ఇది ప్రధానంగా దోహదపడుతుంది. శరీరంలో జీర్ణాశయం దిగువ బాగంలో దీన్ని గమనించవచ్చు. నాళ గ్రంధి హోదాలో ఇది  క్లోమరసాన్ని స్రవిస్తుంది. ఈ  క్లోమ రసాన్ని స్రవించే కణాల్ని రెండు రకాలుగా చెబుతారు. డక్టల్‌ కణాలు, ఎసినార్‌ కణాలు అని చెప్పవచ్చు. ఇందులో డక్టల్‌ కణాల నుంచి విడుదల అయ్యే బైకార్బనేట్‌ పదార్థాలు.. పాక్షికంగా జీర్ణమైన ఆహారంలోని ఆమ్లత్వాన్ని అదుపు చేయగలుగుతుంది. ఎసినార్‌ కణాలు ముఖ్యంగా  క్లోమరసం లోని ఎంజైవ్గుల చైతన్యానికి దోహద పడుతాయి . ఇక క్లోమరసంలోని ఎంజైవ్గులు వాటి పని తీరు...

-క్లోమరసం లో ఉండే ట్రిప్సినోజిన్‌ అనే ఎంజైమ్‌చైతన్య రూపం పొంది ట్రిప్సిన్‌ గా మారుతుంది. అప్పుడు అది మాంసక్రత్తులపై పనిచేసి  అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. కైమో ట్రిప్సినోజిన్‌ కూడా చైతన్యవంతం అయినప్పుడు మాంసక్రత్తుల్ని జీర్ణం చేసేందుకు ఉపకరిస్తుంది.  ఆహారంలోని ఎలాస్టిన్‌ లను జీర్ణం చేసే ఎలాస్టియేజ్‌, కేంద్ర కామ్లాలను జీర్ణం చేసే న్యూక్లియేజ్‌ లను క్లోమం స్రవిస్తుంది. ఇక్కడ స్రావితం అయ్యే అమైలేజ్‌.. పిండి పదార్థాల్ని జీర్ణం చేయటంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇక కొవ్వుల్ని సరళ రూపంలోకి మార్చే లైపేజ్‌ అనేది ప్రధానమైన ఎంజైమ్‌ గా చెప్పవచ్చు. అంతే కాకుండా కొవ్వుల్ని ప్రధానంగా జీర్ణం చేసేది క్లోమరసం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆహారంలోని అన్ని రకాల ప్రధాన పదార్థాల్ని క్లోమరసం సంశ్లేషణ చేస్తుంది.

-వినాళ గ్రంధి హోదాలో క్లోమం అనేక హార్మోన్‌లను స్రవించును. ఇవి నేరుగా రక్తంలోకి చే రిపోయి, ఆయా భాగాల మీద ప్రభావం చూపు తుంది. క్లోమంలోని ద్వీప కణాలు హార్మోన్‌ల స్రావకానికి మూలంగా నిలుస్తాయి. ఇందులో నాలుగు రకాల హార్మోన్‌లను గుర్తిస్తారు. ఆల్పా కణాలు గ్లూకగాన్‌ అనే హార్మోన్‌ను స్రవిస్తాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిని పెంచుతుంది. బీటా కణాలు ఇన్సులిన్‌ ను స్రవించును. ఇది రక్తంలోని గ్లూకోజ్‌స్థాయిని నియంత్రించును. ఇక డెల్టా కణాలు స్రవించే సొమాటో స్టాటిన్‌ అనే హార్మోను .. పైన చెప్పిన ఆల్ఫా, బీటా కణాల పనితీరును ప్రభావితం చేయును. గామా కణాలు క్లోమ పెప్టైడ్‌ అనే హార్మోన్‌ ను స్రవించును. ఈ హార్మోన్‌లు శరీరంలో విభిన్న జీవ రసాయన చర్యల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ హార్మోన్‌ ల స్రావకంలో హెచ్చు తగ్గులు ఏర్పడితే ఇతర జీవన క్రియలకు ఇబ్బంది ఏర్పడుతుంది.

-క్లోమ క్యాన్సర్‌ ను అనేక లక్షణాల్చతో పోల్చుకోవలసి ఉంటుంది. నొప్పిని ప్రధానంగా గుర్తించవచ్చు. మలం బూడిద రంగుకి, మూత్రం ముదురు రంగుకి మారవచ్చు. ఆకలి తగ్గిపోయి, నీరసం పెరిగిపోతుంది. బరువు తగ్గవచ్చు. వాంతులు అవుతుంటాయి. కడుపులో అస్థిమితంగా ఉంటుంది. అజీర్ణం అయి విరోచనాలు అవుతుండవచ్చు. గడ్డ కణితి, సిస్టుల విషయంలో ఏ ప్రాంతంలో సమస్య ఉంది అన్నది చాలా ప్రధానం. క్లోమంలోని తల భాగంలో కణితి ఏర్పడితే కామెర్లు బహిర్గతం అవుతాయి. అదే దేహం బాగంలో కానీ, తోక భాగంలో కానీ ఏర్పడితే నొప్పి వెనక్కి వ్యాపిస్తుంటుంది. ఈ రెండు ప్రాతిపదికలు గడ్డ కణితి, సిస్టుల విషయంలో పోల్చదగినవి. కానీ, ఐలెట్‌ సెల్సు విషయంలో మాత్రం శారీరక సమస్యలు తక్కువ. క్రియా పరమైని ఇబ్బందులు ఉంటాయి.

హైపో గ్లైసీమియా, డయేరియా, వంటి లక్షణాలు గుర్తించదగును. క్లోమ క్యాన్సర్‌ ఏర్పడి నప్పుడు తలెత్తే అన ర్థాల్ని రెండు రకాలుగా గుర్తించవచ్చు. క్లోమరసం సరిగ్గా   స్రవించకపోవటంతో ఎంజైమ్‌ల విని యోగం తగ్గిపోతుంది.-అమైలేజ్‌, ట్రిప్సిన్‌, లైపేజ్‌ వంటి ఎంజైమ్‌లు తగినంతగా అందు బాటులో లేకపోవటంతో జీర్ణ క్రియ మందగిం చిపోతుంది. సరైన జీర్ణం జరగక పోవటంతో ప్రధా న పదార్థాల సంశ్లేషణ నిలిచిపోతుంది. అటు, హార్మోన్‌ ల స్రావం కూడా తగ్గిపోతుంది. ఇన్సులిన్‌, గ్లూకాగాన్‌ వంటి హార్మోన్‌ల స్రావం తగ్గకపోవటంతో రక్తంలో గ్లూకోజ్‌ మట్టం సక్రమంగా ఉండదు. రోగం ముదిరిపోయినప్పుడు ఇతర అనర్థాలు పెరిగిపోతాయి. చివరకు క్యాన్సర్‌ చేసే చెడు అంచనాల్ని మించిపోతుంది.క్లోమ క్యాన్సర్‌ తలెత్త టానికి నిర్దిష్టమైన కారణం ఏమీ లేదు. జన్యుపర మైన అంశాలు గుర్తించుకోదగినది. కుటుంబంలో ఎవరికైనా ఉంటే రక్త సంబంధీకులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆధునిక జీవనశైలి, కాలుష్యం వంటి కారణాలు కూడా క్లోమ క్యాన్సర్‌ కు దోహదపడు తాయి. ఒత్తిళ్లతో కూడిన జీవన శైలి, వ్యాయామం లేకపోవటం, మానసిక ఆందోళనలు క్రియా పరమైన కారకాలుగా చెప్పవచ్చు. వీటిని సూటిగా కారణాలు గా అంచనా వేయటానికి ఉండదు.

-క్యాన్సర్‌కు ఆపరేషన్‌చేస్తే ప్రమాదం అన్న అపోహ కూడా ఉంది. ఆపరేషన్‌ చేయటం వలన క్యాన్సర్‌కణితి పగిలిపోయి, ఆ కణజాలం ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది అని చెబుతారు. ఇది ఎంత మాత్రం వాస్తవం కాదు. జీర్ణాశయ భాగాల్లో వచ్చే క్యాన్సర్‌లకు ఆపరేషన్‌ అనేది ఉత్తమ చికిత్స. క్యాన్సర్‌ను ఎంత ప్రాథమిక దశలో గుర్తించాం అన్నది ముఖ్యం. దీన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. కీమో థెరపీ, రేడియో థెరపీ లతో ఆధునిక చికిత్స సాధ్యం అవుతుంది. ఆపరేషన్‌ ద్వారా ఆ ప్రాంతంలో కణితిని కరిగించటానికి అవకాశం ఉంటుంది. ఒక వేళ క్యాన్సర్‌ముదిరిపోయినా మిగిలిన శేష జీవితం సాఫీగా  జరిగిపోయేలా చికిత్స అందించటానికి వీలవుతుంది. ఎక్కువగా మద్యం తాగే అలవాటు ఉన్నప్పుడు.. ఆల్కహాల్‌ నుంచి తయారయ్యే విష పదార్థాలు క్లోమ కణజాలంపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల సజీవకణజాలం శిథిలం అవుతుంది. కొంత కాలం తర్వాత ఈ శిథిల పదార్థాలు కణితిలుగా ఏర్పడుతాయి. ఈ కణితులు క్లోమంలో కానీ, క్లోమ నాళంలో కానీ ఏర్పడవచ్చు.

-క్లోమమునకు ఏర్పడే ముఖ్య సమస్యల్లో ఒకటిగా క్యాన్సర్‌ను చెప్పుకోవచ్చు. ఇది ఏ భాగంలో ఏర్పడుతుంది అనేది ప్రధానమైన అంశం. క్లోమ ము లో తల, దేహం, తోక అనే ప్రాంతాల్ని గుర్తించదగును. ఏ ప్రాంతంలో అవాంఛిత కణజాలం పేరుకు పోయి కణితి గా ఏర్పడుతుందో దాన్ని బట్టి వ్యాధి నిర్ధారణ, చికిత్స ఆధారపడి ఉంటాయి. ఈ కణితుల్ని ప్రాథమికంగా మూడు రకాలుగా గుర్తిస్తారు. కణజాలం పేరుకొని పోయి గట్టిగా ద్రఢ పడితే దాన్ని గడ్డ కణితి అంటారు. ఈ కణితులు నీటి బుడగల మాదిరి ఉంటే సిస్టులుగా వ్యవహరిస్తారు. వినాళ గ్రంధులకు సంబంధించిన ఐలెట్‌ కణజాలాల్లో కణితి ఏర్పడితే దాన్ని మూడో రకం గా అంటే ఐలెట్‌ సెల్సు క్యాన్సర్‌ గా గుర్తిస్తారు.

క్యాన్సర్‌ను గుర్తించటానికి కడుపు భాగంలో పరీక్షలు చేయించాలి. సీటీ స్కాను, ఎమ్‌ ఆర్‌ ఐ స్కాను వంటివి చేయించాలి. ఎండోస్కోపిక్‌ రెట్రాగ్రెడ్‌ కొలాంజియో పాన్‌క్రియాటోగ్రఫీ పరీక్ష శాస్ర్తీయంగా చేయించుకొంటే క్యాన్సర్‌సోకిన ప్రాంతాన్ని నిరి్‌‌దష్టంగా గుర్తించవచ్చు. అవసరమైతే ఆ ప్రాంతంలో క్లోమపు కణజాలాన్ని బయోప్పీ చేయించి క్యాన్సర్‌ను  నిర్దారించుకోవచ్చు. దీంతో పాటు కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట లివర్‌ ఫంక్షన్‌ టెస్టు, సీరమ్‌ బైలిరుబిన్‌ వంట పరీక్షలు కూడా అవసరం అవుతాయి.

Courtesy with Ayush@Surya Telugu Daily(February 25, 2013)
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.