Monday, March 11, 2013

Baldhead, బట్టతల

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Baldhead, బట్టతల -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


అందం. ఆకర్షణ. ఆత్మవిశ్వాసం... ఇలా మన జుట్టుకు, తలకట్టుకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే తల మీది నుంచి కురులు కనుమరుగవుతున్న కొద్దీ మనసులో ఏదో వెలితి మొదలవుతుంది. ఏదో కొరతగా, న్యూనతగా, లోపంగా.. ఇలా రకరకాల భావాలు మనసులో ముసురుకుంటూ.. విపరీతమైన మథనం మొదలవుతుంది. ఇక దాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. టోపీలతో మొదలుపెట్టి విగ్గులు, గమ్మింగ్‌, వీవింగ్‌ వంటి ఎన్నో మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అయితే అవన్నీ కూడా చాలా తాత్కాలికమైనవి. ఇప్పటి వరకూ ఈ 'కేశ రాహిత్యాన్ని' అధిగమించేందుకు ఒక్క శాశ్వత పరిష్కారం కనుగొనబడలేదు.

కారణాలు :

బట్టతల అనేది స్థూలంగా జన్యుపరంగా, వంశపారంపర్యంగా వచ్చే సమస్య! ఇది కొందరిలో 20, 30 ఏళ్లకే వస్తే మరికొందరిలో 50 ఏళ్ల తర్వాత రావచ్చు. వయసు పెరుగుతున్నకొద్దీ హార్మోన్ల ప్రభావంతో జుట్టు వూడిపోవటం కొంత సహజమే. కానీ వీరిలో వేగంగా రాలిపోతూ పరిస్థితి 'బట్టతల'కు దారి తీస్తుంది. బట్టతల విషయంలో ఎన్నో సిద్ధాంతాలున్నాయిగానీ ప్రధానంగా పురుష హార్మోన్‌ అయిన 'టెస్టోస్టిరాన్‌'.. జన్యుపరమైన కారణాల రీత్యా.. వీరిలో తల మీది చర్మంలో 'డీ హైడ్రో టెస్టోస్టిరాన్‌'గా మారిపోతూ.. వేగంగా వెంట్రుకలు వూడిపోయేందుకు కారణమవుతుందన్న భావన బలంగా ఉంది. అందుకే సాధారణంగా యుక్తవయసులో ఒంట్లో టెస్టోస్టిరాన్‌ స్థాయి పెరుగుతుండే దశ నుంచే ఈ బట్టతల రావటమన్నదీ మొదలవుతుంది. తల మీది వెంట్రుకలన్నీ ఒకే రకంగా కనిపించినా అవి హార్మోన్లకు స్పందించే తీరు వేరేగా ఉంటుంది. ఈ హార్మోన్‌ ప్రభావం మాడు మీద, నుదురు దగ్గరి చర్మం మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎంత బట్టతల ఉన్నవారికైనా సరే.. వెనక భాగంలోనూ.. ఇరుపక్కలా కొన్ని వెంట్రుకలు దట్టంగా మిగిలే ఉంటాయి.
* బట్టతల పురుషులకే వస్తుందన్నది ఒక అపోహ. ఎందుకంటే ఇది స్త్రీలలోనూ కనిపిస్తుంది.
* చాలామంది తాము వాడుతున్న షాంపూలు, నీళ్లు పడక జుట్టు రాలిపోయిందని భావిస్తుంటారుగానీ వీటి ప్రభావం చాలా తక్కువ.
* బట్టతల రావటానికి 80-90 శాతం జన్యువులు, వంశపారంపర్య లక్షణాలే మూలం.
* తల్లిదండ్రుల్లో ఎవరికి బట్టతల ఉన్నా సంతానానికి రావొచ్చు. ఒకవేళ వారిద్దరికీ లేకపోయినా.. వంశంలో ముందు తరాల వారికి ఉన్నాతర్వాతి తరాలకు సంక్రమించొచ్చు. జన్యు ప్రభావం అందరిపైనా ఒకే తీరులో ఉండాలనేం లేదు. ఒకరికి వచ్చి మరొకరికి రాకపోవచ్చు

ట్రీట్మెంట్ :

బట్టతల వచ్చేసిందని బాధపడాల్సిన పనిలేదు. నలుగురిలో తిరగలేక ఇంట్లోనే కూర్చోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. బట్టతల వస్తున్న తొలినాళ్లలో వెంట్రుకలు వూడిపోకుండా ఉండేందుకు వైద్యులు 'మినాక్సిడిల్‌' 'ఫినాస్టిరైడ్‌' వంటి కొన్ని లోషన్లు సిఫార్సు చేస్తారు. అయితే వీటిని జీవితాంతం వాడుకుంటూనే ఉండాలి, వీటితో కొన్ని దుష్ప్రభావాలూ ఉంటాయి. ఇవి ....
  •  విగ్గులు ధరించటం,
  • సిలికాన్‌ గమ్మింగ్‌,
  • హెయిర్‌ వీవింగ్‌
--వంటి చాలా కృత్రిమ పద్ధతులున్నాయిగానీ ఏవీ సహజంగా, శాశ్వతంగా ఉండేవి కావు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బట్టతల సమస్యను శాశ్వతంగా అధిగమించేందుకు 'హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌' విధానాన్ని ఆశ్రయిస్తున్నారు.

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ :

తల వెనక భాగంలో రాలిపోకుండా దట్టంగా మిగిలి ఉన్న వెంట్రుకలను కుదుళ్లతో సహా తీసుకువచ్చి... మాడు మీద, ముందు భాగంలో నాటటం 'హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌' విధానం ప్రత్యేకత. ఈ వెంట్రుకల కుదుళ్లు హార్మోన్ల ప్రభావానికి లొంగే రకం కాదు కాబట్టి.. నాటిన తర్వాత ఇవి రాలకుండా అలాగే ఉండిపోతాయి. జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. అందుకే 'హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌' పూర్తిగా విజయవంతమైన ప్రక్రియగా నిలబడింది. దీనితో ఎలాంటిహానీ ఉండదు.

* హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో మెదడుకు ప్రమాదమని కొందరు భయపడుతుంటారు. కానీ ఇది నిజం కాదు. ఇది కేవలం చర్మం పై భాగానికి సంబంధించిన ప్రక్రియ మాత్రమే. దీంతో ఎలాంటి హానీ ఉండదు. మరికొందరు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందేమోనని అపోహ పడుతుంటారు.
అన్ని ఆపరేషన్ల అనంతరం వాడినట్టుగానే ఐదారు రోజులు మందులు వేసుకుంటే సరిపోతుంది. 3-6 నెలల పాటు విటమిన్‌ మాత్రలు వేసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. ఈ మందులు పెద్దగా ఖరీదైనవేమీ కాదు.
* ఇతరుల వెంట్రుకలు, కృత్రిమ సింథటిక్‌ వెంట్రుకల వంటివాటిని మన శరీరం తిరస్కరిస్తుంది. కాబట్టి ఎవరి వెంట్రుకలు వారికే అమర్చే విధానంతో ఏ ఇబ్బందీ ఉండదు.
* గడ్డం, మీసం దగ్గర వెంట్రుకలు లేనివారికి కూడా హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయొచ్చు. ఇందులో ఒక వెంట్రుక, రెండు వెంట్రుకలను మాత్రమే తీసి నాటుతారు.
* కనుబొమల్లో తేడాలను కూడా సరిచేయొచ్చు. వీటిని నాటేటప్పుడు దిశ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. సాధారణంగా కనుబొమలు అంతగా పెరగవు. కానీ ఇతర ప్రాంతం నుంచి తెచ్చి నాటిన వెంట్రుకలు త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు ట్రిమ్‌ చేసుకుంటూ ఉండాలి.
 హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌! ఇటీవలి కాలంలో ఈ విధానం మరింత మెరుగులు దిద్దుకుంది. తలకట్టును దాదాపు సహజసిద్ధంగా తీర్చిదిద్దే స్థాయికి చేరుకుని, ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రాచుర్యం సాధించింది.
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.