-ఈ మధ్యకాలంలో చాలామందిలో పరిమళద్రవ్యాల వాడకం ఎక్కువైంది. ముఖ్యంగా స్ర్తీలను ఆకర్షించడానికి అనేకరకాల సెంట్లు, డియోడరెంట్లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. సెక్స్ సెంట్లుగా ముద్దుగా పిలుచుకునే వీటిల్లో ఎక్కువగా చెమటవాసన రంగరించిన సెంట్లకు లేదా డియోడరెంట్లకు గిరాకీ ఎక్కువ. ఇటువంటి కాస్మొటిక్స్‌లలో ఏ రకమైన వాసనలు కలపాలనే విషయం మీద అనేక రకాల పరిశోధనలు చేస్తూనేవున్నారు. పురుషుల లైంగికతను గురించి పరిశీలన చేసిన శాస్తజ్ఞ్రులు, స్ర్తీల జననేంద్రియాల వద్ద ఏర్పడే ఒక రకమైన వాసనకు ఎక్కువగా లైంగికోద్రిక్తత పొందుతున్నట్టుగా గుర్తించారు. ఈ విషయంలో స్ర్తీలు కూడా పురుషుల చెమట వాసనకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అయితే సంభోగ సమయంలో చెమట వాసన వల్ల మూడ్ అవుట్ అయిపోవడం కూడా జరుగుతుంటుంది. అటువంటివారు స్నానం చేసి, తిరిగి అటువంటి వాసనల మేళవింపుతో వున్న డియోడరెంట్లను
ఉపయోగిస్తారు.
జంతుజాతుల్లో, అండోత్పత్తి సమయంలో ఊరే స్వేదంలో కొన్ని రకాల రసాయనిక పదార్థాలు కలిసి ఒక ఘాటైన వాసనను వెదజల్లుతాయి.-ఆ వాసనకు ప్రేరేపితమైన పురుష జంతువులు, అప్రయత్నంగా సంభోగ చర్యకు ఉత్సాహాన్ని చూపెడతాయి. పునరుత్పత్తి ప్రక్రియ సజావుగా సాగడానికి ఇది ప్రకృతిసిద్ధంగా వుండే ఒక ఏర్పాటు.
కాగా చెమట వాసన వల్ల లైంగికోద్రేకం కలుగుతుందని, జననేంద్రియాలను శుభ్రం చేసుకోకుండా రతిలో పాల్గొనడం ఆరోగ్య కారణాల రీత్యా మంచది కాదంటున్నారు సెక్సాలజిస్టులు. అలాగే చర్మానికి పడుతుందో లేదో తెలుసుకోకుండానే మార్కెట్‌లో లభించే, రకరకాల సెంట్లను, డియోడరెంట్లను వాడడం కూడా మంచిది కాదు. వాటిల్లో వాసన కోసం చేర్చే కృత్రిమ పదార్థాల వల్ల, జననాంగాల వద్ద వున్న సున్నితమయిన చర్మపు కణాలు అలర్జీకి గురయ్యే ప్రమాదం వుంది. అందుచేత, శుభ్రత పాటించడం ఎంత ముఖ్యమో, ప్రకృతి సిద్ధమయిన మలినాలను పోగొట్టే వస్తువులను వాడడం కూడా అంతే ముఖ్యం. ఆయుర్వేద సబ్బులను వినియో గించడం, ఇంట్లోనే తయారు చేసుకున్న పొడులను ఉపయోగించడం వంటివి చేసి, తాజాగా వుండడానికి ప్రయత్నించాలి. సంభోగంలో పాల్గొనే ముందు, తర్వాత కూడా స్నానం చేయడం మంచిది.
-Courtesy with Surya Telugu daily Sunday magazine
- ========================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.