Monday, April 29, 2013

Respiratory diseases in Summer , వేసవిలో శ్వాసకోశ వ్యాధులు

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Respiratory diseases in Summer , వేసవిలో  శ్వాసకోశ వ్యాధులు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



సంవత్సరంలో కొన్ని మాసాల్లోనే అధికంగా ప్రబలే శ్వాసకోశ వ్యాధులు రాసురాను వేసవిలో కూడా రావడం ఇటీవలి కాలంలో కనిపిస్తున్నది. గత కొన్నేళ్లనుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కూడా వీటి బారినపడి ఇబ్బందులకు గురైన వారి సంఖ్య చాలా పెరిగింది. నిజానికి ఈ మాసాల్లో శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు తగ్గుముఖం పట్టడం, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గడం సర్వసాధారణం. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న ఈ మార్పులకు వాతావరణంలో జరిగే ఒడుదోడుకులే కారణమని అనిపిస్తుంది. అకాల వర్షాలుపడటం, సముద్రంలో ఏర్పడే అల్పపీడనం వంటి మార్పుల వలన వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ శాతాలతో పోలిస్తే ఒక రోజు ఉన్నట్లు మరొక రోజు ఉండటం లేదు. ఈ కారణంగా వాతావరణంలో ఉండే సక్ష్మజీవులు (బాక్టీరియా, వైరస్‌) అధికమై వ్యాధులు వచ్చేలా చేస్తున్నాయి. వీటిలో ప్రధాన కారకాలు వైరస్‌లు. వైరస్‌లలో రెస్పిరేటరీ సిన్సిషియల్‌ వైరస్‌, అడినో వైరస్‌, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌, బాక్టీరియా స్ట్రెప్టోకాకస్‌, హెచ్‌-ఇన్‌ఫ్లూయెంజా ముఖ్యమైనవి.

ప్రధానంగా ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు వాటిలో తరచుగా జరిగే జన్యుపరమైన మార్పుల వలన కొత్త తరహా వ్యాధులను కలిగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తాయి. వ్యాక్సిన్‌ల ద్వారా ఈ రకమైన వ్యాధులు ప్రబలకుండా చేసే అవకాశం ఉంది. కాని తరుచుగా జరిగే జన్యుమార్పుల వలన వచ్చే కొత్త వైరస్‌లకు వ్యాక్సిన్‌లను తయారు చేసి విడుదల చేసే నాటికి అవి మళ్లి కొత్త రూపు దాలుస్తున్నాయి.

చలికాలం నుంచి వేసవి కాలంలోకి ప్రవేశిస్తున్నప్పుడు, వాతావరణంలోని వేడి గాలిని పీలిస్తే సున్నితంగా ఉండే శ్వాస నాళాలు, వాటి పైన ఉండే పొర (మ్యూకస్‌, సిలియా) కూడా దెబ్బతింటాయి. అలాగే ఎండ ప్రభావానికి గొంతు తడారిపోతున్నదని చల్లని నీళ్ళు(ice water) తాగితే గొంతులోని సున్నితమైన పొరలు ఈ వేడి, చలి మార్పులు తట్టుకోలేక దెబ్బ తింటాయి. ఇలా దెబ్బతిన్న గొంతు, స్వరపేటిక, శ్వాసనాళాలలో వైరస్‌, బాక్టీరియా తేలికగా ప్రవేశించి, రక్తంలోకి చేరి వాధ్యులను కలుగచేస్తాయి.

వీటి వలన జలుబుతోపాటు, దగ్గు, గొంతునొప్పి, గొంతు తడి ఆరిపోవడం, దగ్గులో కఫం, జ్వరం, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర సమస్యలు ఏర్పడతాయి. అడినోవైరస్‌తో వచ్చే వ్యాధి కారణంగా కళ్ళ కలకలు, గొంతులో బిళ్లలు (లిఫ్‌నోడ్స్‌) తోపాటు ఒళ్ళు నొప్పులు, జ్వరం కూడా వస్తాయి. సాధారణంగా వారం రోజుల్లో తగ్గిపోయే ఈ వ్యాధి లక్షణాలు కొంతమందిలో ఈ వ్యాధి తీవ్రంగా మారడానికి కూడా ఈ వాతావరణ మార్పులే కారణం.

ఏంచేయాలి?

ఈ వ్యాధులు అంటు వ్యాధులు గనుక వ్యాధిగ్రస్తులు దగ్గేప్పుడు, తుమ్మేప్పుడు రుమాలును నోటికి అడ్డంగా పెట్టుకోవాలి.
ఒకరి నుండి మరొకరికి చేతుల ద్వారా కూడా ఈ వ్యాధులు సోకవచ్చు. కనుక చేతులు శుభ్రపరచుకుంటూ ఉండాలి.
గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి తరచుగా పుక్కిలించాలి. పసుపు లేదా మెంథాల్‌ వేసిన నీటి ఆవిరిని రోజూ రెండుమూడు సార్లు పట్టాలి. ఒక్కసారిగా అతి చల్లని నీటిని తాగకూడదు. వాతావరణ పరిస్థితి బట్టి మామూలు నీటిలో కొద్ది కొద్దిగా చల్లని నీరు కలుపుతూ తాగాలి. ఐస్‌క్రీమ్స్‌, కూల్‌డ్రింక్స్‌ తీసుకున్నట్లయితే, వీలైనంత త్వరగా గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి ఆ నీటితో పుక్కిలించాలి. దగ్గు, జ్వరం నాలుగైదు రోజుల్లో తగ్గకపోతే, యాంటిబయాటిక్స్‌ వంటి మందులను వైద్య సలహా మేరకు వాడాల్సి ఉంటుంది.
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, April 28, 2013

Wisdom teeth Awareness - జ్ఞానదంతాలు అవగాహన

  •  



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Wisdom teeth Awareness - జ్ఞానదంతాలు అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



జ్ఞానం వచ్చిన తర్వాత వచ్చే దంతాలు కనుక వీటిని జ్ఞాన దంతాలు అంటారు. సాధారణంగా 17-21 సంవత్సరాల మధ్య వయసులో ఇవి వస్తుంటాయి. రెండు దవడల చివరలో వచ్చే నాలుగు శాశ్వత దంతాలే జ్ఞానదంతాలు. సరైన పద్ధతిలో చక్కగా వచ్చిన జ్ఞానదంతాలు నోటికి ఎంతో విలువైనవి. అలాకాకుండా అవి సరిగ్గా రాకుండా ఇబ్బందులు కలిగిస్తే వాటిని తీసివేయాల్సి ఉంటుంది. కొందరిలో దవడలు ఉండాల్సినంత పెద్దవిగా ఉండవు. అప్పుడు జ్ఞానదంతాలు రావడానికి సరైన స్థలం ఉండదు. దీనితో చాలా ఇబ్బంది అవుతుంది. అవి దవడల నుంచి క్రిందికి రావడానికి బదులు ప్రక్కలకి రావచ్చు. ఒక్కొక్కసారి బైటికి రావడానికి స్థలం లేక కొంత భాగమే బయటికి వచ్చి, పూర్తిగా రాకుండా ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. అలాంటి సందర్భాలలో శస్త్రచికిత్స చేసి వాటిని తీసివేయలా అక్కర్లేదా అని విషయాన్ని దంతవైద్యుడు నిర్ధారిస్తాడు. కొన్ని సందర్భలలో జ్ఞాన దంతాల్ని తీసి వేయకపోతే ఆరోగ్యం పూర్తిగా పాడైపోయే ప్రమాదముంది. కొంత వరకే జ్ఞానదంతాలు బయటికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో చిగుళ్ళు లోపలికి సూక్ష్మ జీవులు ప్రవేశించి ఇన్‌ఫక్షన్‌ని కలిగించే ప్రమాదముంది. దవడలు గట్టిపడడం, వాపు, నొప్పి అలాంటి సందర్భాలలో కనిపించే లక్షణాలు.

జ్ఞానదంతాలు బయటికి రావడానికి సరైన స్థలంలేనప్పుడు అవి పక్కనున్న దంతాల మీద ఒత్తిడి కలిగించి వాటి ఆరోగ్యాన్ని పాడుచేయవచ్చు. ఇలాంటి సందర్భాలలో జ్ఞానదంతాలకి ముందుండే రెండు మోలార్స్‌ మీద ప్రభావం పడి తీరుతుంది. అప్పుడు ఆహారం సమలడం, తినడం చాలా ఇబ్బంది అవుతుంది.

బయటికి రాకుండా ఇబ్బంది పెట్టే జ్ఞానదంతాల దగ్గర ద్రవ పదార్థాలు నిండిన సంచీలలా ఏర్పడడంగాని, కంతులు రావడంగాని జరగవచ్చు. దాంతో ఆ ప్రాంతంలో చిగుళ్లు, దవడ ఎముక దెబ్బ తింటాయి. సాధారణంగా ఇరవై సంవత్సరాలలోపే ఇబ్బంది పెట్టే జ్ఞాన దంతాలను తొలగించేప్పుడు కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఎందుకంటే చిన్న వయసులో దంతాల మూలాలు పూర్తిగా గట్టిగా దవడలో బిగుసుకుపోయి ఉండవు. అందుకు శస్త్రచికిత్సలో చుట్టు ప్రక్కల నరాల దెబ్బతినవు. చికిత్స తర్వాత గాయం కూడా త్వరగా మానుతుంది.

జ్ఞానదంతాల్ని తీసివేసేటప్పుడు స్థానికంగా ఆ ప్రాంతంలో మాత్రమే మత్తుమీందు నిచ్చి ఆ దంతాన్ని తీసివేస్తుంటారు. మొదట్లో కొద్దిగా వాపు వచ్చి అసౌకర్యం కలగవచ్చు. క్రమంగా మందుల ద్వారా ఆ వాపును తగ్గించవచ్చు. శస్త్రచికిత్స తర్వాత మొదట్లో ద్రవపదార్థాల్ని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. తర్వాత క్రమంగా మెత్తటి ఘనపదార్థాల్ని ఆ తర్వాత మామూలు ఆహారాన్ని తీసుకోవాలి. కొంతమందికి శస్త్రచికిత్స తర్వాత ఆ ప్రాంతంలో స్పర్శ కాస్త తక్కువగా అనిపించవచ్చు. కొంత సమయం తర్వాత ఆ ప్రాంతం మామూలుగా అయిపోతుంది. కాబట్టి జ్ఞానదంతాలు రావడంలో ఎలాంటి సమస్యలున్నా వెంటనే దంతవైద్యుడ్ని కలవడం మంచిది.జ్ఞానదంతాలకు సకాలంలో చికిత్స చాలా అవసరం. జ్ఞానం కలిగే యుక్తవయసులో వచ్చే ఈ జ్ఞాన దంతాల సమస్యతో యువతీ యువకుల ఎలాంటి ఇబ్బందులు పడకుండా విజ్ఞతతో వ్యవహరించాలి.


  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Non-Alcoholic fatyliver disease,నాన్‌-ఆల్కాహాలిక్‌ ఫ్యాటీలివర్‌ డిసీజ్‌,Nonalcoholic steatohepatitis(NASH)

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Non-Alcoholic fatyliver disease,నాన్‌-ఆల్కాహాలిక్‌ ఫ్యాటీలివర్‌ డిసీజ్‌,Nonalcoholic steatohepatitis(NASH)
-
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



  
  

కాలేయంలో కొవ్వు పేరుకు పోయినప్పుడు వచ్చే వ్యాధుల్ని సకాలంలో గుర్తించి చికిత్స చేయించుకోకుంటే రక్తపోటు తదితర వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అధిక స్థాయిలో మద్యం సేవించే వారిలో కాలేయంపై ప్రభావం ఎక్కువగా పడి ఫ్యాటీ లివర్‌ వ్యాధి వస్తున్నట్లు వైద్య పరిశోధనల్లో తేలింది. ఇది మరింత విస్తృతమైనప్పుడు నాన్‌ ఆల్కహాలిక్‌ స్టీటోహెపటైటీస్‌ (ఎన్‌.ఎ. ఎస్.హెచ్.డి) వ్యాధిగా మారు తున్నట్లు నిపుణులు చెప్తారు. ఈవ్యాధి అత్యంత తీవ్రమైన రూపంగా మారు తున్నా నిపుణులు చేస్తున్న ప్రయోగాలలో వ్యాధి కారకాలు తెలియక పోవ టం తో... దీనిని అంతుచిక్కని, ప్రాణాంతక కాలేయ వ్యాధిగా గుర్తిస్తున్నారు.

వ్యాధి లక్షణాలు

నాన్‌ ఆల్కహాలిక్‌ స్టీటోహెపటైటీస్‌ వ్యాధి బారిన పడిన వారిలో ప్రధానంగా ఆయాసం, శారీరక అనారోగ్యం, కుడివైపు - ఎగువు- ఉదరం వద్ద అసౌక ర్యంగా ఉంటుంది. ముత్త్తు పానీయాలకు అలవాటు పడిన ఎక్కువ మందిలో పాక్షిక కామెర్ల వ్యాధి వచ్చి క్రమంగా ఎన్‌.ఎ.ఎఫ్‌.ఎల్‌.డి గా రూపాంతరం చెందుతుంది. వీరిలో (స్థూలకాయం, కంబైన్డ్‌ హైపర్‌ లిపిడెమియో, మధుమేహం(రకం2)మరియు అధిక రక్తపోటు వ్యాధులకూ దారితీసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ లక్షణాలతో బాధ పడే వారు కాలేయ పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్థారించుకోవాల్సి ఉంటుంది. అలాగని ఇష్టాను సారం మందులు వాడినా ప్రమాదమే... వైద్యుల సలహా మీదే మందులు వాడాలి... ఎందుకంటే ఒక్కోసారి మందులతో కూడా...ఈవ్యాధి వచ్చే అవకాశాలున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం గమనార్హం.

రోగ నిర్ధారణ ఇలా...

కాలేయంలో ఉండే వివిధ రకాల ఎంజైమ్‌లలో ఏర్పడే అసమతౌల్యం కారణంగానే వచ్చే దానిని గుర్తించబడు తుంది. కడుపులో వచ్చే తీవ్ర మంటలు కారణంగా ఫైబ్రోసిన్‌ తీవ్రత ని అంచనా వేస్తారు. ఇందుకోసం కణజాల పరీక్షను చేయాల్సి ఉంటుంది. ఇందులో కాలేయ ఫైబ్రోసిస్‌ను, స్టీటోసిస్‌ను అంచనా వేసేందుకు స్టీటోటెస్ట్‌ (చర్మానికి రంధ్రం చేయకుండా చేసే చిన్న పాటి పరీక్ష) ద్వారా ఈ రోగ నిర్ధారణ చేయవచ్చని ఇటీవలే నిపుణులు వెల్లడించారు. అయితే ఈ పరీక్షా పద్ధతులు విస్తృత ఆమోదం పొందల్సివుంది.
ఇక హెపటోసైట్‌ నిర్మూలనలో భాగంగా నిర్వహించే అపోప్టోసిస్‌ పరీక్షలలో సైతం ఈవ్యాధి బయటపడుతున్నట్లు కొందరు నిపునులు చెప్తుండగా.... ఎరైథ్రోసైట్‌ అవక్షేప రేటు, శ్వేతకం (అల్బుమిన్‌) మరియు మూత్రపిండ పనితీరుని గుర్తించే క్రమంలో చేసే రక్త పరీక్షల్లో సైతం ఈ రోగాన్ని గుర్తించ వచ్చది మరికొందరు చెప్తున్నారు. మానవ శరీరంలో ప్రోటీన్‌లను తయారు చేయడంలో కాలేయం కీలకం కావటంతో ఆ దిశగా కూడా వ్యాధిని గుర్తించేందుకు అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇదికాక..ఇంటర్నేషనల్‌ నార్మలైజ్డ్‌ రేషియో రక్త పరీక్షలు (సెరాల జీ), హెపటైటిస్‌ ఎ,బి,సి, ఇబివి, సిఎమ్‌వి మరియు హెర్పెస్‌ వైరస్‌ల రుబెల్లా తదితరాలు తెలుసుకునే క్రమంలో చేసే రక్త్త పరీక్షలో , థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకొంటున్న వారిలో టి.యస్‌.హెచ్‌ గుర్తించడం ద్వారా ఎన్‌.ఎ. యస్‌.హెచ్‌ ని నిర్దారిస్తారు.

కాలేయంలో కొవ్వు  బాగా పేరుకుపోవడంతో కడుపులో తీవ్రమంటగా అనిపిస్తే.. దీనిని ఎన్‌.ఎ.యస్.,హెచ్‌ గా పిలుస్తారు. సగటున 20 శాతం మందిలో ఎన్..ఎ.యస్.హెచ్‌ కనిపిస్తోంది. అయితే ఇంత వరకూ వైద్య శాస్త్రవేత్తలు ఎన్ని నిర్థారణ పరీక్షలు నిర్వహించినా... ఎన్‌.ఎ.ఎల్.డి రావటానికి ఇదీ ఖచ్చితమైన కారణంగా ఇప్పటికీ గుర్తించలేక పోవటం ఆందోళన కరమే...

బరువూ వ్యాధి లక్షణమే....

అధిక బరువు ఉన్న వారిలో సైతం ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇందుకు ఫ్యాటీ లివర్‌ వ్యాధి పరీక్షలు చేసుకోవటం ద్వారా ఈ వ్యాధి నిర్థారన చేసుకోవచ్చు. కేవలం బరువు ఎక్కువగా ఉన్న వారినే కాదు బరువు తక్కువగా ఉన్న వారిలోనూ ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆహార నియమాలలో మార్పులు చేసుకుంటూ... పౌష్టికాహారాన్ని తీసుకుంటే వ్యాధిని తగ్గించుకోవచ్చు. కొంతమందిలో పుట్టుకతోనే ఈవ్యాధి లక్షణా లు కనిపించవచ్చు. అలాగే తమ కుటుంబంలో కాలేయం వ్యాధి తరతరాలు గా వస్తున్నా... ఈ వ్యాధి లక్షణాలు కనిపించే ఆస్కారం ఉంది. అవయవాల్లో అసాధారణ పరిస్థితులు ఏర్పడినా... ఫైబ్రోసిస్‌(cirrhosis) లేదా సిర్హోసిస్‌ లక్షణాలతో బాధపడుతున్నా.... ఈ వ్యాధి ఉన్నదీ లేనిదీ నిర్థారించుకునేందుకు ఖచ్చితం గా వైద్య పరీక్షలు చేసుకోవాల్సిందే.

చికిత్స:

ఎన్‌.ఎ.ఎఫ్‌.ఎల్‌.డి కి సంబంధించిన అనేక చికిత్సలపై అధ్యయ నాలు జరు గుతున్నాయి. అలనైన్‌ ట్రాన్సామానాస్‌ తదితర చికిత్సలు తోడ్పడు తున్నా.. కణజాల అసాధారణతలను తొలగించడం ద్వారా రోగ అంత్య స్థాయిలను తగ్గించడానికి ఈ చికిత్సలు సరిపోవ టంలేదన్నది నిపుణుల మాట.

శరీర బరువుకు చికిత్స:

క్రమ పద్దతితో బరువు తగ్గడం ద్వారా సూలకాయం తగ్గటం ద్వారా రోగుల్లో పరిస్థితిని మెరుగుపర్చుడమేకాక అయితే బరువు తగ్గాలన్న తాపత్రయంతో శరీరంపై వత్తిడి చేయటం, భోజనాదులు మానేయటం చేస్తే అది ఎన్‌.ఎ.ఎఫ్‌.ఎల్‌.డి వ్యాధిని మరింత తీవ్రంచేస్తుందని గమనించడండి. ఓ పద్దతి ప్రకారం శరీరాన్ని తగ్గించుకున్న వారిలో అంతర్లీనంగా వ్యాధి ఉన్నప్పటికీ అది తీవ్రరూపం దాల్చ కుండా ఉన్నట్లు పలు అధ్యయనలు నిర్థారించాయి కూడా .

కాగా ఇటీవల జరిగిన అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లివర్‌ డిసీజ్‌న్‌ వార్షిక సమావేశంలో ప్రవేశపెట్టి నివేదిక వివరాలు ప్రకారం చూస్తే.... బరువు తగ్గించేందుకు ఇష్టను సారంగా శస్త్రచికిత్స చేయించుకొంటున్న రోగుల్లో అధిక శాతం మందిలో ఈ వ్యాధి అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పి పరిస్థితి ని వివరించాయి.

ఈ మందులు వాడకూడదు :

అమియోడారోన్‌, యాంటీవైరల్‌ డ్రగ్స్‌ (న్యూక్లియోసైడ్‌ అన లాగ్‌లు), ఆస్పిరిన్‌ అరుదుగా పిల్లల్లో రెయెస్‌ సిండ్రోమ్‌లో భాగంగా ఉంటుంది, కార్టికోస్టెరాయిడ్‌లు, మెథోట్రెక్సేజ్‌, టామో క్సిఫెన్‌, టెట్రాసైక్లిన్‌. ఇలాంటి ఔషధలు వారిలోను ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వీటితో కాసింత ప్రయోజనం

ఇన్సులిన్‌ సెన్సిటైజెర్‌లు, యుర్సోడియోక్సీకొలిక్‌ యాసిడ్‌ మరియు లిపిడ్‌- తగ్గించే జౌషదాలు, ఎన్‌.ఎ.ఎఫ్‌.ఎల్‌.డి వ్యాధిని తగ్గించడంలో కొంత మేరకు సహకరిస్తున్నాయని... అయితే వైద్య సలహాలు లేనిది ఈ వ్యాధి నివారణకోసం ఎలాంటి మందులు ఇష్టాను సారం వాడరాదన్నది నిపుణుల హెచ్చరిక.


డా|| రవీంద్రనాధ్‌-చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌-గ్లోబల్‌ హాస్పిటల్‌-సర్జికల్‌ గాస్ట్రో ఎంటి రాలజి స్ట్‌, లక్డీ కపూల్‌, హైదరాబాద్‌

  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, April 23, 2013

Alzemers disease Awareness,అల్జీమర్స్ వ్యాధిపై అవగాహన


  •  
  •  Alzemers disease is a part Senile Dementia.
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Alzemers disease Awareness,అల్జీమర్స్ వ్యాధిపై అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



 కొన్ని సమయాల్లో మతిమరుపు అనేది కూడా వరమౌతుందని అదే మరో సందర్భంలో శాపమౌతుందన్నారు. వృద్ధాప్యంలో వచ్చే అల్జిమర్స్‌ వ్యాధి కారణంగా వ్యక్తులు చిన్ననాటి విషయాలను మాత్రమే గుర్తుంచుకోగలుగుతారు. అల్జిdమర్స్‌ ఉన్న రోగులు తమ జీవితంలోని తాజా పరిణామాలను, వ్యక్తులను మరచిపోతారు. ఫలితంగా తమ దైనందిన విధుల నిర్వహణలోనూ వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులతో కమ్యూనికేషన్‌ జరపడం వారికి కష్టసాధ్యమవు తుంది. అల్జిమర్స్‌కు అడ్డుకట్ట వేయాలంటే ఒత్తిడిని నివారించడమే పరిష్కారమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

జీవితచరమాంకంలో ప్రశాంత జీవనం గడపాల్సిన ఎందరో వృద్ధులు తమకు సోకిన అల్జీమర్స్ వ్యాధితో మతిమరుపు సమస్యతో సతమతమవుతున్నారు. అల్జీమర్స్ వ్యాధిని గుర్తించి, చికిత్స చేయడమే కాదు...వారికి, వారి సంరక్షకులకు కౌన్సెలింగ్ అందించటంతోపాటు వివిధ సేవలు అందించటమే లక్ష్యంగా హైదరాబాద్ కేంద్రంగా అల్జీమర్స్ అండ్ రిలేటెడ్ డిజార్డర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఆర్‌డీఎస్ఐ) దక్కన్ చాప్టర్‌ను ఏర్పాటు చేశారు న్యూరాలజీ నిపుణురాలు డాక్టర్ సువర్ణ అల్లాడి.

"డిమెన్షియా అంటే మెదడుకున్న శక్తి క్రమంగా సన్నగిల్లడం. డెమన్షియా అంటే ఒక రోగం కాదు, అనేక రోగాల సముదాయం. మనిషి మెదడు లోపల కొన్ని కణాలు దెబ్బతినడంవల్ల మనిషిలో అనేక నైపుణ్యాలు కనుమరుగైపోతాయి. ముఖ్యంగా తెలివితేటలు, నేర్చుకునే సమర్థత, సమస్యా పరిష్కారశక్తి వంటివి బాగా తగ్గిపోతాయి. ఎంత పాండిత్యంగల వారైనా దీని బారిన పడ్డారంటే భాష మీద ఆధిపత్యం, ఏకాగ్రత, భాషాచాతుర్యం, పరిశీలనాశక్తి వంటివి దారుణంగా దెబ్బతింటాయి. దీనికితోడు మనిషి ప్రవర్తనలో ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. డెమన్షియావల్ల జ్ఞాపకశక్తిలో లోపం ఏర్పడి ఆ మనిషికి మరుపు
మొదలవుతుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తుఉండదు. కొత్త సంగతులు విన్నా వాటిని గుర్తులో ఉంచుకోలేరు. క్రమక్రమంగా ఈ సమస్య పెరుగుతూ ఉంటే ఏడాదిలోపులో జరిగిన ముఖ్య సంఘటనలను కూడా మరచిపోతారు. బాగా ముదిరితే ... ఇంట్లో మనుషుల్ని క్రమంగా గుర్తుపట్టలేకపోవడం ప్రారంభమవుతుంది. తిండి తిన్న పది నిముషాలకే దాని మాట మరచి తనకు ఎప్పుడు తిండి పెట్టారు అని అడుగుతారు ఈ డెమన్షియా బాధితులు. ఒకొక్కప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడే మూత్ర విసర్జన కూడా చేసేస్తూ ఉంటారు.

డిమెన్షియాలో పలు రకాలున్నా, ఇందులో సర్వసాధారణమైనది అల్జీమర్స్ వ్యాధి. డెమన్షియా వచ్చిన వారిలో సగం మందికి పైగా ఈ ఆల్‌జైమర్ డెమన్షియా వస్తుంది. ఇది ఎందుకు వస్తుందో పూర్తిగా ఇంకా తెలియరాలేదు. కాకపోతే కొంతమంది దీనిని వారసత్వపు సమస్యగాను, మరికొందరు ఆడవారికి ఎక్కువగా వస్తుందని అంటారు. ఈ వ్యాధి సాధారణ లక్షణం మతిమరుపు. సాధారణ వైద్యులకు సైతం అంతుపట్టని ఈ వ్యాధితో ఒక్క హైదరాబాద్‌లోనే 40వేల మంది అవస్థలు పడుతున్నారు. అల్జీమర్స్ వ్యాధి మెదడులోని జీవకణాలను ఒక్కొక్కటిగా నిర్జీవం చేస్తూ, మెదడును సరిగా పనిచేయనీయకుండా చేస్తుంది. అమిలాయిడ్ అనే ప్రొటీన్ పొరలుగా మేట వేసుకుపోవటం, మెదడులోని జీవకణాల్లో ఉండే అతి సూక్ష్మ ఫిలమెంట్లు ఒకదానితో ఒకటి పెనవేసుకు పోవడం ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి వంశపారంపర్యంగా లేదా లోపభూయిష్టమైన జన్యువుల ప్రభావం వల్ల సంక్రమించవచ్చని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది.

లక్షణాలు : అల్జీమర్స్‌తో బాధపడే వారు విలక్షణంగా ఉంటారు. వృద్ధాప్యం మీద పడేకొద్దీ మతిమరుపు పెరుగుతుంది. ఈ వ్యాధి ఉన్న వారికి కుటుంబసభ్యుల పేర్లు కూడా గుర్తుండవు. పొయ్యి మీద ఏదన్నా పెట్టి మర్చిపోతారు. భోజనం చేశామో లేదో గుర్తుండదు.

అల్జీమర్స్ సొసైటీ శ్రీకారం
"రాష్ట్రంలో 1990వ సంవత్సరం వరకు అల్జీమర్స్ అనే వ్యాధి అంటే వైద్యులకు కూడా అవగాహన లేదు. ఈ వ్యాధి ఏదో పాశ్యాత్య దేశాలకు చెందిన వ్యాధి అనుకునే వారు. నేను బెంగుళూరులోని నిమ్‌హాన్స్, కేంబ్రిడ్జ్‌లో అల్జీమర్స్ వ్యాధిపై ప్రత్యేకంగా శిక్షణ పొంది వచ్చి నిమ్స్‌లోని న్యూరాలజీ డిపార్టుమెంట్‌లో ప్రొఫెసర్‌గా చేరాను. మతిమరుపు సమస్యతో సతమతమవుతూ ఎందరో రోగులు న్యూరాలజీ విభాగానికి చికిత్సకు వచ్చే వారు. వృద్ధాప్యంలో అల్జీమర్స్‌తో బాధపడుతున్న వారికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చికిత్స చేయాలనే ఉన్నతాశయంతో నిమ్స్‌లో ప్రత్యేకంగా మెమోరీ క్లినిక్‌ను ఆరంభించాను. ఈ క్లినిక్‌లో న్యూరాలజీ నిపుణులతోపాటు సైకాలజిస్ట్‌లు, ఫీిజియోథెరపిస్టులు, కౌన్సెలర్లను అందుబాటులో ఉంచాం. ఇక్కడ జబ్బును గుర్తించడంతోపాటు చికిత్స చేయడమే కాదు వారికి ఫిజికల్ యాక్టివిటీ అవసరమని గుర్తించాం. అల్జీమర్స్ వ్యాధిగ్రస్థులకే కాదు వారి సంరక్షకులకు కూడా కౌన్సెలింగ్  అందించేందుకు వీలుగా అల్జీమర్స్ సొసైటీని ఆరంభించాం. ఈ సొసైటీలో వైద్యులే కాదు, అల్జీమర్స్ రోగుల సంరక్షకులను కూడా భాగస్వాములను చేశాం.

శారీరకంగా వివిధ కార్యక్రమాలతో యాక్టివ్‌గా ఉంచడం ద్వారా మెదడును ఆరోగ్యవంతం చేసి మతిమరుపు ముప్పును తగ్గించవచ్చు.

అల్జీమర్స్ సేవల్లో సొసైటీ ముందడుగు

రాష్ట్రంలో అల్జీమర్స్ పీడితులకు సేవలందించటంలో సొసైటీ ముందడుగు వేసింది. గడచిన ఆరేళ్లలో రెండువేల మంది రోగులకు సేవలందించాం. 28 అవగాహన శిబిరాలు నిర్వహించి వైద్యులు, రోగులు, సంరక్షకులకు అవగాహన కల్పించాం. 200కుపైగా హోం విజిట్స్ చేసి రోగులకు సేవలతోపాటు సంరక్షకులకు 32 సమావేశాలు నిర్వహించాం. ప్రతిఏటా మెమొరీ వాక్‌లు నిర్వహించి ఈ వ్యాధిపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం. అల్జీమర్స్ పీడితులకు మెరుగైన సేవలందించేందుకు మా సొసైటీ ఆధ్వర్యంలో భవిష్యత్‌లో అల్జీమర్స్ డిసీజ్ సెంటర్‌ను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నాం'' అన్నారు ---డాక్టర్ సువర్ణ.

మెమొరీ వాక్ 2012
అల్జీమర్స్ వ్యాధిపై అవగాహన కల్పించడమే కాదు రోగులకు వివిధ రకాల శారీరక యాక్టివిటీల ద్వారా సాంత్వన కల్పించవచ్చనే వాస్తవాన్ని ప్రచారం చేసేందుకు వీలుగా ప్రపంచ అల్జీమర్స్ డే సందర్భంగా ఈ నెల 16 వతేదీన హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డుపై జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు మెమొరీ వాక్ 2012 చేపడుతున్నాం. నగర మేయర్ ముహమ్మద్ మాజిద్ హుసేన్ ప్రారంభించనున్న ఈ వాక్‌లో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

- డాక్టర్ సువర్ణ అల్లాడి-అడిషనల్ ప్రొఫెసర్-డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూరాలజీ-నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-హైదరాబాద్-అధ్యక్షురాలు, ఏఆర్‌డీఎస్ఐ, దక్కన్ చాప్టర్

చికిత్స :

వృద్ధాప్యంలో తీవ్ర మతిమరుపును, తికమకను తెచ్చిపెట్టే అల్జీమర్స్‌ రోజువారీ పనులను బాగా దెబ్బతీస్తుంది. ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని నివారించుకునే వీలుంది.

  • * ఒమేగా-3, ఒమేగా-6, విటమిన్‌ ఈ, బీ12 దండిగా లభించే అవిసెలు, అక్రోటుపప్పు, పిస్తా, బాదం, జీడిపప్పు, పెరుగు, పాలు, మాంసం, చేపల వంటివి తరచుగా తీసుకోవాలి.
  • * వ్యాయామం వల్ల అల్జీమర్స్‌ ముప్పూ తగ్గుతుంది. మెదడుకు రక్తసరఫరా బాగా జరుగుతుంది. దీంతో కొత్త మెదడు కణాలు అభివృద్ధి చెందే ప్రక్రియ కూడా ప్రేరేపితమవుతుంది.
  • * మెదడుకు మేత పెట్టే చిక్కు సమస్యలను పరిష్కరించటం, పదకేళీలు పూరించటం, చదరంగం ఆడటం వంటివి చేయాలి. మెదడులోని కణాలు చురుకుగా ఉండేలా చేస్తున్నకొద్దీ ఆరోగ్యకరమైన కణాలు సజీవంగా ఉంటాయి. రోజూ ధ్యానం మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
  • * వారానికి కనీసం మూడు సార్లయినా తాజా పండ్లు తినాలి. వీటిల్లోని ఫాలీఫెనాల్స్‌కు అల్జీమర్స్‌ను నివారించే సామర్థ్యముంది.
  • * తగినంత నిద్రపోవాలి. ఇది మెదడును తాజాగా ఉంచుతుంది. శరీరానికి, మనసుకు విశ్రాంతి కలిగిస్తుంది. వయసు మీద పడకుండా చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు మెదడునూ చురుకుగా ఉంచుతాయి.
  • * మద్యం, పొగ అలవాట్లకు దూరంగా ఉండాలి.

అల్జీమర్స్‌కు నిద్ర మందు!


వయసు పెరుగుతున్నకొద్దీ తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే 'అల్జీమర్స్‌' ముప్పూ పెరుగుతుంటుంది. ఈ సమస్యకు కచ్చితమైన చికిత్సలేవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. కాబట్టి దీన్ని నివారించుకునే మార్గాలపై పరిశోధకులు చాలాకాలంగా దృష్టి సారించారు. దీనికి సంబంధించి తాజాగా ఒక మంచి సమాచారం బయటపడింది. కంటి నిండా నిద్రపోతే అల్జీమర్స్‌ను నివారించుకునే అవకాశమున్నట్టు వెల్లడైంది. మెదడులో అమీలాయిడ్‌ బీటా గార పేరుకుపోవటమనేది అల్జీమర్స్‌కు సూచిక. రోజుకి 5 గంటల కన్నా తక్కువ సేపు నిద్రపోయే వృద్ధులతో పోలిస్తే.. కంటినిండా నిద్రపోయే వృద్ధుల మెదళ్లలో గార పోగుపడటం తక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మెదడులో గార మోతాదుకూ నిద్రకూ సంబంధం ఉంటున్నట్టు ఇంతకుముందూ వెల్లడైంది. నిద్ర సరిగా పట్టకపోవటం వల్లనే అమీలాయిడ్‌ గార పోగుపడుతుందని కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ.. మెదడులో తలెత్తే మార్పులు నిద్రకు భంగం కలిగించే అవకాశముందని జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన అడమ్‌ స్పైరా అంటున్నారు. నిద్ర అలవాట్లు మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతాయని, అందువల్ల నిద్ర సరిగా పట్టేలా చూసుకుంటే అల్జీమర్స్‌ను నివారించుకునే అవకాశమూ ఉందని సూచిస్తున్నారు. నిద్రపోయే సమయంలో మెదడులోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతున్నట్టు ఇటీవల ఒక అధ్యయనంలోనూ వెల్లడైన సంగతిని ఉదహరిస్తున్నారు. మెదడులో చురుకైన సర్క్యూట్లలోని నాడీకణాలు అమీలాయిడ్‌ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి.. వీటిని శాంతింప జేయటం, నిద్ర సరిగా పోవటం ద్వారా అల్జీమర్స్‌ను నివారించుకునే వీలుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అంతమాత్రాన నిద్రమాత్రలు ఈ ముప్పును తగ్గించగలవని అనుకుంటున్నారేమో. అలాంటి అవకాశమేమీ లేదు. నిద్ర సమస్యల నుంచి తప్పించుకోవటానికి నిద్ర మాత్రలు వేసుకునేవారికీ అల్జీమర్స్‌ ముప్పు పొంచి ఉంటోందనే సంగతిని గుర్తుంచుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు
  • Brain exercise medicine,మతిమరుపునకు మెదడుకు పని మందు

Alzemers Day on sept.21.సెప్టెంబర్‌ 21న ‘వరల్డ్‌ అల్జీమర్స్‌ డే’----- చాలామంది వ్యక్తులు పెద్ద వయస్సు వచ్చిందంటే అల్జీమర్స్‌ అంటే మతిమరపు వ్యాధితో బాధపడుతుంటారు. వయసుతోపాటు మోమొరీ తగ్గటం సహజంగా వచ్చేస్తుంది. కనుక ప్రధానంగా మీ మెదడుకు పని కల్పిస్తుండాలి.

-ఖాళీగా ఉండే మెదడు దయ్యాల ఇల్లు అనే సామెత ఉంది. ఇది సామెతే కాదు అక్షరాలా వాస్తవం కూడా. మన శరీరంలో ఏ భాగమైనా సరే వాడ కుండా లేదా ఉపయోగించకుండా ఉంటే అది మొండిగా తయారవుతోంది. పదును తగ్గుతుంది. అదేవిధంగా మన మెదడు కూడాను. చేయటానికి మెదడుకు పని ఏముంటుందనుకుంటారు? కానీ మీరు మీ చేతులు, కాళ్ళు ఏవి కదపాలన్నా అవి మీకు తెలియకుండానే జరుగుతుంటాయి. కానీ కొన్ని విషయాలలో విచక్షణతో మీరు జాగ్రత్తగా వ్యవహరించ వలసిన అవసరం వస్తుంది. అప్పుడే మీరు మీ మెదడుకు పని కల్పించుతున్నట్లు తెలుసుకుంటారు. ఇంత ప్రధానమైన ఈ శరీర భాగానికి మనం పదును పెట్టాలి. అందుకుగాను మీ మెదడుకు కొన్ని వ్యాయామాలు కావాలి. వయస్సు పైబడు తోందంటే మనమందరం మెదడుకు గల పదును కోల్పోతూ ఉంటాం. కానీ మెదడుకు రెగ్యులర్‌గా పని కల్పిస్తుంటే, మీ తెలివితేటలు మరింత వికసిస్తాయి. జ్ఞాపకశక్తి నశించకుండా ఉంటుంది. వయసు పైబడుతున్నపటికీ మీలో మతిమరపు వ్యాధి రాకుండా ఉంటుంది.

మీ మెదడుకు ఐదు ప్రధాన వ్యాయామాలు


    మెమొరీ గేమ్‌ --- చాలామంది వ్యక్తులు పెద్ద వయస్సు వచ్చిందం టే అల్జీమర్స్‌ అంటే మతిమరపు వ్యాధితో బాధపడుతుంటారు. వయసుతోపాటు మోమొరీ తగ్గటం సహజంగా వచ్చేస్తుంది. కనుక ప్రధానంగా మీ మెదడుకు పని కల్పిస్తుండాలి. మీ స్కూలు తోటి విద్యార్థుల పేర్లను మరో మారు జ్ఞాపకం చేసు కోండి. ఈ వ్యాయామం మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఏదెైనా ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా కాఫీ బ్రేక్‌లో చేయవచ్చు.
   * విచక్షణ మనం విచక్షణగా వ్యవహరించి బ్రెయిన్‌కు వ్యాయామం కల్పించాలి. చాలాసార్లు మనం మనకు తెలియ కుండానే నిచక్షణ చూపుతాం. కనుక ప్రతి పని మీరు కొంత లాజిక్‌తో చేయాలి. అందుకుగాను, కొంత రాజకీయాల వంటివి పట్టించుకోవాలి. వాటిపై చర్చలు చేయాలి. నిర్ణయాలకు రావాలి. ఇప్పుడు మీ మెదడు పదును ఎక్కినట్లే.
   * శ్రద్ధ పెట్టటం గతంలో మీరు మీ స్కూల్‌ టీచర్‌కు తరగతి గదిలో చూపిన శ్రద్ధ నేడు ఆఫీసులో చూపుతున్నారా? చూప లేరు. వయసుతో పాటు మీకు శ్రద్ధ కూడా తగ్గుతుంది. ఆందోళనగా ఉంటారు. మీ శ్రద్ధను మెరుగుపరచటానికి గాను కొంచెంద బాధాకర వ్యాయామం చేయాలి. ఆఫీస్‌లో బాగా మాట్లాడే కొలీగ్‌ను ఎంచుకోండి. అతను ఏ చెత్తవిషయాలు మాట్లాడి నా శ్రద్ధగా వినండి. అది మీలోని శ్రద్ధను మెరుగుప రుస్తుంది.
   * పజిల్స్‌ చేయటం ఈ పని పిల్లలదనుకుంటాం. కానీ పిక్చ ర్‌ పజిల్స్‌, సుడోకు వంటివి ఓదడుకు మంచి వ్యాయామం. లేదంటే, బజారులో తిరిగేటప్పుడు దుకాణాల బోర్డులు చదవం డి. వాటిని మరల అదే వరసలో గుర్తు చేసుకోండి.
   * భాషాపర వెైపుణ్యం మెదడు వ్యాయామాలలో బ్రెయిన్‌కి కొత్త భాషను నేర్పించటం మంచి వ్యాయామం. కనుక ఇప్పటి వరకూ మీకు తెలియని భాష ఒకటి సాధన చేయండి. మార్గ దర్శకంగా అది బాగా వచ్చినవారిని ఒకరిని ఎంచుకోండి. వారితో మాట్లాడటం సాధన చేస్తే మీ మెమొరీ మెరుగు వుతుంది. బ్రెయిన్‌కు మంచి వ్యాయామంగా ఉంటుంది.
    ఈ మెదడు వ్యాయామలు మిమ్మల్ని రోజువారీ జీవితంలో ఎఞతో చురుకుగా ఉండేలా చేస్తాయి. కనుక నేటి నుండే మీ మెదడుకు పని కల్పించండి. తెలివైన వారుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి.

  •    Courtesy with : డాక్టర్‌ నవీన్‌ కుమార్‌ వెనిగళ్ళ-    న్యూరాలజిస్ట్‌, గ్లోబల్‌ హాస్పిటల్‌,--    లక్డీకపూల్‌, హైదరాబాద్‌.
   
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Burning in the Chest Why?,ఛాతీలో మంట ఎందుకు?

  •  



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Burning in the Chest Why?,ఛాతీలో మంట ఎందుకు?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    ఛాతీలో మంట. చాలామంది దీని గురించి అంతగా పట్టించుకోరు గానీ.. కొందరిని మాత్రం ఇది తెగ ఇబ్బంది పెడుతుంటుంది. రకరకాల చిట్కాలతో అప్పటికప్పుడు ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తుంటారు కూడా. నిజానికి ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి దోహదం చేసే అంశాలేంటి? వీటిని తెలుసుకుంటే ఛాతీమంట తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చు.

సాధారణంగా మనం భోజనం చేసినపుడు అది ఆహారనాళం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఈ జీర్ణాశయానికీ ఆహారనా'ళానికీ మధ్య బిగుతైన కండర వలయం (స్పింక్టర్‌) ఉంటుంది. ఇది తలుపులా తెరచుకుంటూ జీర్ణాశయంలోకి ఆహారం వెళ్లేలా చేసి, వెంటనే మూసుకుపోతుంటుంది. దీనివల్ల తిన్న ఆహారం తిరిగి ఆహారనాళంలోకి రాకుండా జీర్ణాశయంలోని ఆమ్లాల్లోనే ఉండిపోయి, జీర్ణమవుతుంది. అయితే ఒకవేళ ఈ కండరవలయం పూర్తిగా మూసుకోకపోతే జీర్ణాశయంలోని ఆమ్లాలు పైకి ఎగదన్నుకు వస్తాయి. దీన్నే రిఫ్లక్స్‌ అంటారు. ఇవి ఆహారనాళం లోపలిగోడలను చికాకు పరచి, నొప్పితో కూడిన మంట రావటానికి కారణమవుతాయి. కిందికి వంగినపుడు, పడుకున్నప్పుడు ఈ మంట, బాధ మరింత ఎక్కువవుతాయి కూడా. టమోటా ఉత్పత్తులు, మద్యం, కాఫీతో పాటు పుల్లటి, మసాలా, కొవ్వు పదార్థాలు కూడా కండరవలయానికి ఇబ్బంది కలిగిస్తాయి. ఫలితంగా ఛాతీలో మంట సమస్య గలవారికి ఆ బాధ మరింత ఎక్కువవుతుంది. అధికబరువు, కడుపునిండా తినటం, నడుము వద్ద గట్టిగా పట్టి ఉంచే బిగుతైన దుస్తులు ధరించటం, పొగ తాగటం కూడా ఛాతీలో మంట ముప్పు పెరిగేలా చేస్తాయి. కాబట్టి మంట ఎక్కువ కావటానికి దోహదం చేస్తున్న అంశాలకు దూరంగా ఉండటంతో పాటు తగు చికిత్స తీసుకోవటం తప్పనిసరి. లేకపోతే ఇది మరింత ముదిరి, ఇతరత్రా సమస్యలకు దారితీయొచ్చు.
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Diabetes and Hypertension combined complications,మధుమేహం-హైబీపీ లతో దుష్ప్రభావాలు-జాగ్రత్తలు

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Diabetes and Hypertension combined complications,మధుమేహం-హైబీపీ లతో దుష్ప్రభావాలు-జాగ్రత్తలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    రెండు శత్రువులు. ఒక్కోటీ ఒక్కో విలయం! ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా కళ్ల నుంచి కాళ్ల వరకూ మన శరీరం మొత్తాన్నీ దెబ్బ తియ్యగల సమర్థమైనవే. అలాంటి రెండూ కలిసిపోయి.. ఏక కాలంలో జంటగా దాడికి దిగితే? పరిస్థితి వూహించటం కష్టం. ఇప్పుడు మధుమేహం, హైబీపీ ల విషయంలో జరుగుతున్నది అదే. ప్రపంచ మానవాళికి నేడు అతి పెద్ద శత్రువుగా అవతరించిన మధుమేహం... దాదాపు దానంత ప్రమాదకారీ అయిన హైబీపీ.. దేనికదే పెద్ద సమస్యలనుకుంటుంటే.. ఒకటి చాలదన్నట్టు చాలాసార్లు రెండూ తోడుదొంగల్లా కలిసే ఉంటున్నాయి. ఒకటి వచ్చిందంటే.. అది తన జంటను తెచ్చుకుంటోంది. రెండూ కలిస్తే ఇవి శరీరంలో తీవ్ర దుష్ప్రభావాలను తెచ్చిపెడతాయి. ఇదో జటిల సమస్య! అందుకే అసలీ రెండూ దరి చేరకుండా చూసుకోవటం ఉత్తమం. ఒకటి వస్తే కనీసం రెండోది రాకుండా జాగ్రత్తపడటం అవసరం. ఇక రెండూ వస్తే.. వీటితో దుష్ప్రభావాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవటం అనివార్యం!.

ఒకటి అగ్ని. మరోటి వాయువు! ఒకదానికి మరోటి తోడైతే రెండూ కలిసి సృష్టించే విలయం చాలా తీవ్రంగా ఉంటుంది. మన శరీరంలో కూడా మధుమేహానికి- అధిక రక్తపోటు (హైబీపీ) తోడైతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. దీన్ని గురించి కాస్త వివరంగా చూద్దాం. మధుమేహం కారణంగా సహజంగానే గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినటం, కంటి చూపు (రెటినోపతి) దెబ్బతినటం వంటి దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఎక్కువ. ఇక ఈ మధుమేహానికి హైబీపీ కూడా తోడైతే ఈ దుష్ప్రభావాలు త్వరగా ముంచుకొచ్చే అవకాశాలు, అవి మరింత ఉద్ధృతమయ్యే అవకాశాలు పెరుగుతాయి. పైగా సమస్యేమంటే మధుమేహులలో చాలామందికి హైబీపీ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. ఈ రెండు రుగ్మతల మధ్యా ఉన్న సంబంధం అటువంటిది.

ముప్పు ఎక్కువ
* సాధారణ ఆరోగ్యవంతుల కంటే మధుమేహులకు హైబీపీ వచ్చే ముప్పు రెండు రెట్లు ఎక్కువ. అలాగే హైబీపీ ఉన్న వారికి మధుమేహం వచ్చే అవకాశం రెండున్నర రెట్లు అధికం!

* మధుమేహుల్లో వయసు పెరుగుతున్న కొద్దీ రక్తపోటు కూడా పెరుగుతుంటుంది.

* సగటున 45-75 ఏళ్ల మధ్య వయసు మధుమేహుల్లో 40-60% మందికి హైబీపీ కూడా ఉంటోంది.

* అమెరికాలో మూత్రపిండాలు విఫలమై ఏటా డయాలసిస్‌ (రక్తశుద్ధి) వరకూ వస్తున్న కేసులు దాదాపు 3.5 లక్షలుంటున్నాయి. వీరిలో సగానికి సగం మందికి (50%) అధిక రక్తపోటు, మధుమేహం రెండూ ఉంటున్నాయి! దీన్నిబట్టి ఈ రెండూ ఉన్నవారిలో మూత్రపిండాల వైఫల్యం ఎక్కువగా ఉంటోందని తేలికగానే అర్థం చేసుకోవచ్చు.

* మన దేశంలో పరిస్థితి ఎలా ఉందో గుర్తించేందుకు ముంబైలో ఒక అధ్యయనం చేశారు. ఆసుపత్రికి వస్తున్న మధుమేహుల్లో 40% మందికి హైబీపీ కూడా ఉంటున్నట్టు దీనిలో తేలింది.

* మధుమేహం ఉన్న వారికి హైబీపీ వచ్చే అవకాశాలుంటాయి. అలాగని ముందుగా మధుమేహం వచ్చి, ఆ తర్వాత హైబీపీ వస్తుందనుకోవటానికి లేదు. ఎందుకంటే చాలామందిలో మధుమేహం రావటానికి చాలా సంవత్సరాల ముందు నుంచే అధిక రక్తపోటు ఉండి ఉండొచ్చు.

ఒకటొస్తే.. మరొకటి.. ఏమిటీ బంధం?

మధుమేహం, హైబీపీల మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఇవి రావటానికి దోహదం చేసే అంశాలు కూడా చాలా వరకూ ఉమ్మడిగా ఉంటున్నాయి. ముఖ్యంగా చాలామందిలో మధుమేహం, హైబీపీలతో పాటు బొజ్జ (సెంట్రల్‌ ఒబేసిటీ), ఒంట్లో ఇన్సులిన్‌ ఉండి కూడా అది సమర్థంగా వినియోగం కాకపోవటం (ఇన్సులిన్‌ నిరోధకత- రెసిస్టెన్స్‌), రక్తంలో కొలెస్ట్రాల్‌ వంటి కొవ్వుల స్థాయి పెరగటం వంటివి కలగలిసి ఉంటున్నాయి. వీటన్నింటినీ కలిపి శరీరంలో జీవక్రియలకు సంబంధించిన ఒక రుగ్మతగా (మెటబాలిక్‌ సిండ్రోమ్‌) గుర్తిస్తున్నారు. మధుమేహం, హైబీపీల కారణంగా ఆపాదమస్తకం.. అంటే మెదడు నుంచి గుండె, మూత్రపిండాలు.. ఇలా కాళ్ల వరకూ ఉండే రక్తనాళాలన్నీ ప్రభావితం కావచ్చు. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం వంటి ముప్పులతో పాటు మూత్రపిండాల పనితీరు మందగించటం, గుండెలోని ఎడమ జఠరిక మందం కావటం వంటివీ వీరిలో ఎక్కువ.

తరచూ పరీక్షిస్తేనే హైబీపీ బయటపడుతుంది!

మధుమేహం వల్ల ఏవో కొన్ని సమస్యలూ, బాధలూ తలెత్తుతుంటాయి కాబట్టి ఏదో దశలో వైద్యులను సంప్రదిస్తుంటారు. కానీ హైబీపీ ఉన్నా పైకి ఎలాంటి బాధలూ, లక్షణాలూ కనబడవు. అందుకే దీన్ని 'సైలెంట్‌ కిల్లర్‌' అంటారు. చాలామందిలో హైబీపీని తొలిసారి గుర్తించే సమయానికే గుండె జబ్బు, మూత్రపిండాల వ్యాధి (నెఫ్రోపతీ), చూపు తగ్గటం వంటివి సమస్యలు ముంచుకొచ్చేస్తున్నాయి. మధుమేహం బయటపడినప్పుడే కొందరిలో అధిక రక్తపోటూ ఉండొచ్చు. అందువల్ల తరచుగా వైద్యులతో పరీక్ష చేయించుకోవటం అన్ని విధాలా మంచిది. అప్పుడే వీటిని తొలిదశలోనే పట్టుకోవటం, నియంత్రణలో ఉంచుకోవటం సాధ్యపడుతుంది.

రక్తపోటు పెంచే మందులు వాడకూడదు
హైబీపీ ఉన్నవాళ్లు, అలాగే మధుమేహం-హైబీపీ రెండూ ఉన్నవాళ్లు కొన్ని మందుల వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి:
* నొప్పులు తగ్గేందుకు వాడే ఐబూప్రోఫెన్‌, డైక్లోఫెనాక్‌, ఎసైక్లోఫెనాక్‌ వంటి 'ఎన్‌ఎస్‌ఏఐడీ' రకం మందులను వైద్యుల సలహా లేకుండా వాడకూడదు.

* జలుబు మందులు కూడా వైద్యులను సంప్రదించకుండా సొంతంగా కొనుక్కొని వేసుకోకూడదు.

* ఈస్ట్రోజెన్‌ వంటి హార్మోన్లు, కార్టిజోన్‌ సంబంధ స్టిరాయిడ్లు, సైక్లోస్పోరిన్‌, ఎరిత్రోపొయిటిన్‌, కొకైన్‌, నికోటిన్‌ వంటివి వాడరాదు.

అదుపు ముఖ్యం
*మధుమేహం, హైబీపీ రెండూ ఉన్నవారు రెంటినీ అదుపులో ఉంచుకోవటం ముఖ్యం. స్థూలకాయులైతే బరువు తగ్గటానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
* మధుమేహం అదుపులో ఉండేందుకు సంబంధించిన ఆహార నియమాలతో పాటు హైబీపీని నియంత్రించటానికి ఉప్పు కూడా తగ్గించాలి. ఆహారంలో రోజుకి 2 గ్రాముల సోడియం (ఉప్పు) మించకుండా చూసుకోవాలి.
* పచ్చళ్లు, అప్పడాలు, ఆలూచిప్స్‌, ఉప్పు బిస్కట్లు, ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాల వంటివి మానెయ్యాలి.
* వైద్యుల సలహా మేరకు రోజూ కనీసం 30 నిమిషాల సేపు వేగవంతమైన నడక వంటి వ్యాయామాలు చెయ్యాలి.
* పొగ, మద్యం పూర్తిగా మానెయ్యాల్సిందే.

రెండూ ఉంటే.. మందులు తప్పవు
మధుమేహంతో పాటు హైబీపీ కూడా ఉన్నవాళ్లు ఆహార నియమాలను పాటించటంతో పాటు మందులనూ వేసుకోవటం అవసరం. ఎందుకంటే ఈ రెండూ ఉన్నవారిలో బీపీని నియంత్రణలోకి తేవటం అంత తేలిక కాదు. అసలు చాలామందికి ఒకే రకం మందు కాకుండా రెండు, మూడు, అవసరమైతే 4 రకాల మందులు వాడితేనే గానీ రక్తపోటు అదుపులోకి రాకపోవచ్చు. మందుల్లో- రామిప్రిల్‌, లిసినోప్రిల్‌ వంటి ఏసీఈ ఇన్‌హిబిటార్లు ముఖ్యమైనవి. వీటితో కొందరిలో దగ్గు వంటి దుష్ప్రభావాలు కనబడొచ్చు. ఇలాంటి వారికి లోసార్టాన్‌, టెల్మిసార్టాన్‌, ఓల్మిసార్టాన్‌ వంటి ఏఆర్‌బీ మందులు ఉపయోగపడతాయి. వీటిని వాడుతున్న సమయంలో వైద్యుల సలహా మేరకు మూత్రపిండాల పరీక్షలు (క్రియాటినైన్‌, యూరియా), రక్తంలో పొటాషియం పరీక్షలూ చేయించుకుంటూ ఉండాలి.

* ఇతర రక్తపోటు మందులతో పాటు హైడ్రోక్లోర్‌థయజైడ్‌ వంటి మూత్రం రావటానికి దోహదం చేసే మందులను వాడితే మంచి ఫలితం కనబడుతుంది.

* అవసరమైతే యాంలోడిపిన్‌, ఎస్‌.యాంలోడెపిన్‌ వంటి క్యాల్షియం బ్లాకర్లనూ వాడాల్సి రావొచ్చు.

* గుండెజబ్బు ఉన్నవారికి మెటోప్రోలాల్‌, బిసోప్రొలాల్‌, కార్విడిలాల్‌ వంటి బీటా బ్లాకర్లు ఉపయోగపడతాయి.

* ఎప్పుడైనా సరే, బీటా బ్లాకర్లు, క్లోనిడిన్‌ వంటి రక్తపోటు మందులను హఠాత్తుగా ఆపకూడదు, అలా ఆపితే దుష్ఫలితాలు వస్తాయి. బీపీ మందుల మోతాదులు తగ్గించటం, పెంచటం వంటివన్నీ వైద్యుల సలహా మేరకే చేయాలి.

చాలామందిలో మధుమేహం, హైబీపీ రెండూ కలిసి ఉంటాయి. వీటిపై చాలామందికి తగినంత అవగాహన లేకపోవటం, మందులు సరిగా వాడకపోవటం, వైద్యుల సలహాలను పాటించకపోవటం వల్ల ఈ రెంటి మూలంగా తలెత్తే సమస్యలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మధుమేహులు తరచుగా మధుమేహ పరీక్షలతో పాటు బీపీ పరీక్ష కూడా చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు ఏమాత్రం పెరిగినా దాన్ని కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి.

లేస్తే బీపీ తగ్గుతుంటే!
కొంతమంది మధుమేహుల్లో అటానమిక్‌ న్యూరోపతి (స్వయంచాలక నాడీమండలం అవ్యవస్థ) అనే సమస్య ఉంటుంది. దీని మూలంగా వీరిలో పడుకున్నప్పుడు రక్తపోటు ఎక్కువగానూ, నిలబడినప్పుడు తక్కువగానూ ఉంటుంది. ఇలా నిలబడినప్పుడు సిస్టోలిక్‌ రక్తపోటు 20 మి.మీ. కన్నా తగ్గుతుంటే- కళ్లు తిరగటం, తల తేలికగా ఉండటం, చెమటలు, వాంతి వచ్చినట్లుండటం, చూపు మసకగా ఉండటం, కొద్దిసేపు సొమ్మసిల్లటం (సింకొపీ) వంటి 'పోశ్చరల్‌ హైపోటెన్షన్‌' లక్షణాలు బాధించొచ్చు. ఇవి కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించి, తగు చికిత్స తీసుకోవటం మంచిది.

మధుమేహుల్లో బీపీ : ఎంత ఉండొచ్చు?
ఎవరికైనా సరే రక్తపోటు 120/80, అంతకన్నా తక్కువ ఉండటం అత్యుత్తమం. దీన్ని 'ఆప్టిమల్‌' అంటారు. ఇక ఆ పై అంకె (సిస్టోలిక్‌) 130 లోపు.. కింది అంకె (డయాస్టోలిక్‌) 85 కన్నా తక్కువుంటే రక్తపోటు సాధారణ (నార్మల్‌) స్థాయిలో ఉందని అర్థం. పై అంకె 140 కన్నా ఎక్కువగానూ కింది అంకె 90 కన్నా ఎక్కువగానూ ఉంటే దాన్ని 'అధిక రక్తపోటు (హైబీపీ)'గా పరిగణిస్తారు. మధుమేహుల్లో కీలకమైన అవయవాలు దెబ్బతినకుండా ఉండాలంటే సిస్టోలిక్‌ రక్తపోటు 130, అంతకన్నా తక్కువగానూ.. డయస్టోలిక్‌ రక్తపోటు 80, అంతకన్నా తక్కువగానూ ఉండాలి. మధుమేహులంతా బీపీ కచ్చితంగా ఈ పరిమితుల్లోనే ఉండేలా చికిత్స తీసుకోవటం చాలా అవసరం.

ముందే గుట్టు చెప్పే-మూత్ర పిండాలు

మధుమేహుల్లో మూత్రపిండాల వ్యాధి (నెఫ్రోపతీ) అన్నది.. మూత్రంలో సూక్ష్మాతిసూక్ష్మ స్థాయిలో సుద్ద (మైక్రో అల్బుమిన్‌) పోవటంతో మొదలవుతుంది. అప్పుడే రక్తపోటు పెరగటం కూడా ప్రారంభమవుతుంది. అందువల్ల తరచుగా వైద్య నిపుణులతో 'మైక్రో అల్బుమిన్‌' పరీక్ష చేయించుకోవటం అవసరం. మూత్రంలో అల్బుమిన్‌ మోతాదు పెరుగుతున్నకొద్దీ టైప్‌-2 మధుమేహుల్లో చాలామందిలో అధిక రక్తపోటూ ఉంటుందని గుర్తించాలి. నెఫ్రోపతీ వల్ల రక్తపోటు పెరగటం, అలాగే రక్తపోటు పెరగటం వల్ల నెఫ్రోపతీ ఉద్ధృతం కావటమూ జరుగుతుంటుంది. మొదట్నుంచే రక్తపోటును, రక్తంలో చక్కెర మోతాదును అదుపులో ఉంచుకుంటే సమస్య ఈ నెఫ్రోపతీ వరకూ రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినా మరింత ముదరకుండా జాగ్రత్త పడొచ్చు.

కొలవటంలో.. జాగ్రత్తలు

రక్తపోటు చూపించుకోవటానికి గంట ముందు నుంచీ కాఫీ, టీ, పొగ తాగకూడదు. చూపించుకోవటానికి వెళ్లినప్పుడు కూడా ముందు 5 నిమిషాలు విశ్రాంతిగా కూర్చోవాలి.
* బీపీ కొలిచే సమయంలో కుర్చీ వెనక భాగానికి ఆనుకొని కూచోవాలి. అవసరమైతే పడుకొని కూడా రక్తపోటు పరీక్ష చేయించుకోవచ్చు. గాలి పట్టీ కట్టే చేయిని గుండెకు సమాంతరంగా ఉంచాలి.
* రక్తపోటు కొలిచేందుకు పాదరసంతో పనిచేసే స్ఫిగ్మోమానోమీటరే సరైన సాధనం. ఇప్పుడు విరివిగా వాడకంలోకి వస్తున్న ఎనిరాయిడ్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు మంచివే అయినా వాటిని ప్రతి ఆర్నెల్లకోసారి కేలిబరేషన్‌ చేయించాల్సి ఉంటుంది.

హైబీపీ విషయంలో మిగతావారి కన్నా మధుమేహులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బీపీ 130/80, అంతకన్నా తక్కువగానే ఉండేటట్లు చూసుకోవాలి.
Courtesy with - డా.దక్షిణామూర్తి ఎండోక్రైనాలజిస్ట్ -తెనాలి @ ఈనాడు సుఖీభవ.
  • =======================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, April 21, 2013

Congenital Ano-Rectal Anamalies,పుట్టుకతోనే వచ్చే మలాశయ, మలద్వార లోపాలు

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Congenital Ano-Rectal Anamalies,పుట్టుకతోనే వచ్చే మలాశయ, మలద్వార లోపాలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మలద్వారం లేని మనిషిని వూహించగలమా? నవరంధ్రాల్లో అత్యంత కీలకమైన ఇటువంటి ఒక ద్వారం లేకుండా బిడ్డ పుడితే...? పుడితే కాదు.. తరతరాలుగా తరచూ ఎంతోమంది పిల్లలు సమస్యతో పుడుతూనే ఉన్నారు. కాకపోతే ఒకప్పుడు ఇది చాలా క్లిష్ట సమస్య... ఇప్పుడు దీన్ని చక్కదిద్దే విషయంలో మన వైద్యరంగం ఎంతోపరిణతి సాధించింది. ఈ సమస్యను సమర్థంగానే సరిచేస్తుండటం.. చాలామందికి తిరిగి సాధారణ జీవనాన్ని అందించే స్థితికి చేరుకోవటం చెప్పుకోవాల్సిన విషయం!

ఎందుకంటే ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 9 మంది పుడుతూనే ఏదో ఒక రకమైన వైకల్యంతో జన్మిస్తున్నారు. ఈ అవకరాలు, లోపాలన్నీ కూడా తల్లిగర్భంలో పిండం ఏర్పడే సమయంలోనే తలెత్తుతాయి. ఇలా పుట్టుకతో వచ్చే లోపాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినది- మలద్వారం సరిగా ఏర్పడకపోవటం! పుట్టుకతోనే వచ్చే మలాశయ, మలద్వార లోపాల్లో- కొన్ని క్లిష్టమైనవైతే కొన్నింటిని తేలికగా.. చిన్నపాటి ఆపరేషన్‌తోనే సరిచేసే వీలుంటుంది. మరికొన్నిమాత్రం జీవితాంతం అటు పిల్లలకూ, ఇటు తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు కూడా క్షోభ తెచ్చిపెడతాయి.

మనకు కొన్ని అవయవాల విలువ.. అవి సరిగా లేనప్పుడుగానీ తెలిసిరాదు.వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మల విసర్జనావయవం! ఇదెంత కీలకమైనదంటే 'సరిగ్గా పనిచేసే మలద్వారమనేది.. మనం అంతగా గుర్తించని ఓ గొప్ప, అమూల్యమైన బహుమతి' వంటిదని చెప్పాడు పాట్స్‌ మహాశయుడు. ('A properly functioning rectum is an unappreciated gift of greatest price')

ముఖ్యంగా మలమూత్రాల విషయంలో- మనం విసర్జించాలనుకున్నప్పుడే విసర్జన జరిగేలా దానిపై పట్టు ఉండటం ఎంతో ముఖ్యమైన అంశం. అది లేకపోతే జీవితం దుర్భరంగా తయారవుతుంది. అందుకే ఈ సమస్యకు ఇంతటి ప్రాధాన్యం కూడా.

ఐదువేలలో ఒకరు!
ప్రతి 5 వేల కాన్పుల్లో ఒకరు మలాశయ, మలద్వార లోపాలతో పుడుతున్నారని అంచనా. ఇది ఆడ పిల్లల్లో (44%) కంటే మగపిల్లల్లో మరికాస్త (56%) ఎక్కువ. నిజానికి ఈ సమస్య కొత్తదేం కాదు. అనాదిగా చూస్తున్నదే. అందుకే దీన్ని సరిచేసేందుకు క్రీస్తు పూర్వం నుంచీ కూడా రకరకాల చికిత్సా పద్ధతులను ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రామాణికమైన చికిత్సలు మాత్రం 1835లో ఆరంభమై.. 1982లో ఒక నిర్దిష్టమైన పద్ధతికి చేరిందని చెప్పొచ్చు. ఒక జబ్బుకు సరైన చికిత్సా విధానాన్ని, సమర్థమైన పద్ధతిని ఆవిష్కరించటానికి నిరంతరం ఎంతటి కృషి చెయ్యాల్సి ఉంటుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.

ఎందుకిలా?
పుట్టుకతో వచ్చే చాలా లోపాలకు కచ్చితమైన కారణాలను చెప్పటం కష్టం. జన్యు సంబంధమైనవి కావొచ్చు, రేడియోధార్మిక ప్రభావం వల్ల కావొచ్చు. గర్భిణుల్లో ఫోలిక్‌ యాసిడ్‌ వంటి విటమిన్ల లోపాల వల్ల పిల్లల్లో వెన్ను లోపాలు రావొచ్చు. కొన్ని రకాల మందులు కూడా కారణం కావొచ్చు. అయితే ఫలానా లోపం తలెత్తటానికి ఫలానాదే కారణమని ఇదమిత్థంగా చెప్పటం కష్టం. మలాశయ, మలద్వార లోపాలకు చాలావరకూ జన్యుపరమైన అంశాలే కారణమవుతుంటాయి. అందుకే కుటుంబంలో ఎవరైనా ఇలాంటి సమస్యతో పుడితే మరొకరికి వచ్చే అవకాశముంటుంది. తల్లి గర్భంలో పిండం తయారయ్యే క్రమంలో మలద్వారం, మలాశయం, మూత్ర, జననాంగాలు ఒక సంచిలా ఉంటాయి. 8-12 వారాల సమయంలో ఇవి ఎదుగుతాయి. 'యూరోరెక్టల్‌ సెప్టమ్‌' అనే పొర ఒకటి ఈ సంచీని రెండుగా విభజిస్తుంది. దీని కారణంగా 1. మలద్వారం, మలాశయం. 2. మూత్ర విసర్జన భాగం, జననేంద్రియాలుగా విడివడుతుంది. అయితే ఈ పొర సరిగా విలీనం కాకపోయినా మలద్వారం, మలాశయం సరిగా ఏర్పడవు.

మలద్వార లోపం గుర్తించేదెలా?
మలద్వార, మలాశయ లోపాలను శిశువు తల్లి గర్భంలో పెరుగుతుండగానే కనుక్కోవటం కష్టం. దీన్ని స్కానింగుల వంటివి సరిగా చెప్పలేవు. అందుకే కాన్పు జరగ్గానే బిడ్డను క్షుణ్ణంగా పరిశీలించాలి. సాధారణంగా మల విసర్జన అవయవ లోపాలేమైనా ఉంటే చూడగానే కనబడతాయి. ఇవేమీ గుండె జబ్బుల మాదిరిగా కనిపించకుండా ఉండిపోయేవి కావు. కాకపోతే చాలామంది ఒకప్పుడు 'ఆ.. ఉంటే ఏమవుతుందిలే' అని నిర్లక్ష్యం చేస్తుండేవారు. కానీ ప్రస్తుతం ప్రజల్లో చైతన్యం పెరగటం చెప్పుకోవాల్సిన అంశమే. ఒకవేళ వైద్యులు సరిగా గుర్తించకపోతే వినియోగదారుల న్యాయస్థానాలు జోక్యం చేసుకునే అవకాశమూ ఉంటుంది. కాబట్టి కాన్పు కాగానే వైద్యులు శిశువును ఆమూలాగ్రం పరీక్షించి, లోపాలేమైనా కనబడితే తప్పనిసరిగా తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావాలి. కళ్లు, ముక్కు, నోరు వంటి నవరంధ్రాలు ఉండాల్సిన చోట, తీరుగా ఉన్నాయా? లేవా? ముఖ్యంగా మలద్వారం ఎలా ఉంది? అన్నది చూడాలి. మలద్వారం ఉందని గమనించిన తర్వాత దాని పరిమాణాన్ని కూడా చూడాలి.

మగపిల్లల విషయంలో....
1. మలద్వారం కనిపించకపోతే ఆ ప్రదేశంలో అసలేదైనా మార్గం ఉందా? అది నల్లగా గానీ, ఆకుపచ్చ కలిసిన నీలి రంగులో గానీ ఉందా? మల ద్వారం- అది ఉండాల్సిన చోటు నుంచి పురుషాంగం చివరి భాగం వరకూ విస్తరించి ఉందా? ఇలా అన్నీ పరిశీలించాలి.

2. పురుషాంగం చివరి భాగం నుంచి నల్లటి మలం ఏమైనా కనిపిస్తోందా? అన్నదీ గమనించాలి.

3. రంధ్రం చిన్నగా ఉండి, దానికి రెండుపక్కలా చర్మం మడతలతో రెండుగా కనిపిస్తుందేమో చూడాలి.

4. మలద్వారం ఉండాల్సిన చోటుకీ, జననాంగాలకూ మధ్య ఉండే ప్రాంతం(పెరీనియం)లో ఎక్కడైనా నల్లటి ద్వారం కనిపిస్తుంటే 'లో ఏఆర్‌ఎం' అయ్యుంటుందని అనుమానించాలి.

5. ఈ పెరీనియం చదునుగా ఉంటే అది కాస్ల క్లిష్టమైన లోపం (హై అనామలీ) అయ్యిండొచ్చు.

6. బిడ్డ ఏడ్చినప్పుడు పెరీనియం ప్రాంతం ఉబ్బుతుంటే అది 'లోయర్‌ అనామలీ'గా భావించాలి.

ఆడపిల్లల విషయంలో...
మూడు రంధ్రాలూ ఉన్నాయా?ఉంటే మూడూ ఒకే చోట ఉన్నాయా? అవి ఉండవలసిన చోటే ఉన్నాయా? అనేది జాగ్రత్తగా గమనించాలి. మలద్వారం ఏమైనా యోని భాగంలో ఉందేమో, రెండూ కలిసి ఉన్నాయేమో పరిశీలించాలి. యోని, మలద్వారం మధ్య అడ్డుగా చర్మపొర ఉందో లేదో చూడాలి. ఒక్కోసారి యోని రంధ్రం నుంచి మలం బయటకు వస్తుండొచ్చు, దాన్ని 'రెక్టో వజైనల్‌ ఫిస్టులా' అంటారు. మలద్వారం గనక యోని కింది భాగంలో, చాలా దగ్గరలో ఉంటే 'రెక్టో వెస్టిబ్యూలార్‌ ఫిస్టులా' అంటారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత.. అనుమానం బలంగా ఉంటే నిపుణులైన వైద్యుల వద్దకు పంపటం మంచిది. లోపాలున్నా కూడా ఏదో దారిలో మల విసర్జన జరుగుతూనే ఉంటే అత్యవసరంగా ఆపరేషన్‌ అవసరం ఉండకపోవచ్చు. సాధారణంగా ఇటువంటి 'లో అనామలీ'ల్లో ఆపరేషన్‌ అత్యవసరం కాకపోవచ్చు. అసలు విసర్జన అయ్యే పరిస్థితి లేకపోతే మాత్రం దాన్ని తక్షణం ఏదో రీతిలో విసర్జన మార్గాన్ని ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉంటుంది.

ఇతర లోపాలూ ఉండొచ్చు!
పుట్టుకతో ఒక లోపం తలెత్తిన పిల్లల్లో.. ఇతరత్రా మరికొన్ని లోపాలూ ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వెన్ను లోపాలు, అన్నవాహిక, శ్వాసనాళం కలిసిపోయి ఉండటం, మూత్రపిండాల లోపాల వంటివి కొన్ని కలగలిసి ఉండొచ్చు. కాబట్టి శిశువును కూలంకషంగా పరీక్షించాలి. ఏదైనా అనుమానం తలెత్తితే తప్పనిసరిగా- ముక్కు ద్వారా ట్యూబును పంపి అన్నవాహిక సరిగానే ఉందా? లేదా? అలాగే మలద్వారం గుండా ట్యూబ్‌ పంపి అదెలా ఉందన్నది పరీక్షిచాలి.

ద్వార లోపాలు మూడు రకాలు
మలాశయ, మలద్వార లోపాలు ప్రధానంగా మూడు రకాలు.
1. లోపం కిందిస్థాయిలోనే ఉండే రకం (లో ఆనోరెక్టల్‌ అనామలీ)

2. మధ్యస్థంగా ఉండే రకం (ఇంటర్మీడియెట్‌ ఆనోరెక్టల్‌ అనమలీ)

3. పైస్థాయిలో ఉండటం (హై ఆనోరెక్టల్‌ అనామలీ).

వీటిలో ఒక్కో రకానికి ఒక్కో రకం దిద్దుబాటు ఆపరేషన్‌ అవసరమవుతుంది. ఏ రకమన్నది గుర్తించేందుకు ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ పరీక్షతో పాటు 'ఇన్‌వెంటోగ్రామ్‌' అనే పరీక్ష కూడా అవసరమవుతుంది. దీనికోసం బిడ్డను తలక్రిందుగా ఉంచి ఒక ప్రత్యేక పద్ధతిలో ఎక్స్‌-రే తీస్తారు. వీటితో లోపాన్ని కచ్చితంగా నిర్ధారించేంత వరకూ ఆపరేషన్‌ చెయ్యకూడదు. ఎందుకంటే ఒకసారి ఆపరేషన్‌ చేశాక దాన్ని తిరిగి సరిచేయటం చాలా కష్టమవుతుంటుంది.

చికిత్స
ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మలం బయటకు రావటానికి మలద్వారం చుట్టూ వాతలు పెట్టటం, కొందరు కత్తితో చిన్నగాటు పెట్టటం వంటి పనులు చేస్తున్నారు. ఇవి చాలా సమస్యలు తెచ్చిపెట్టటమే కాదు, బిడ్డ భవిష్యత్తును దెబ్బతీస్తాయి కూడా. ఒకసారి పొరపాటుగా వైద్యం చేస్తే ఆ తప్పును రెండోసారి సరిదిద్దటం అసాధ్యం. కాబట్టి నాటువైద్యాల జోలికి వెళ్లకూడదు. ఇటువంటి సమస్యలకు అనుభవం ఉన్న 'పిల్లల శస్త్రచికిత్స' నిపుణులే ఆపరేషన్‌ చేయాలి. ఎందుకంటే మలద్వార లోపానికి తొలిసారి చేసే ఆపరేషనే చాలా కీలకం. మంచి నైపుణ్యం, అనుభవం ఉన్న వైద్యులు ఆపరేషన్‌ చేస్తే ఆ బిడ్డ జీవితాంతం వేదన పడకుండా కాపాడొచ్చు. ఆపరేషన్‌ ప్రధాన సూత్రం ఒక్కటే- మనం బిడ్డకు మల విసర్జనపై మంచి పట్టు, నియంత్రణ ఉండేలా మలద్వారాన్ని ఏర్పాటు చెయ్యగలగాలి! చూడటానికి కూడా అది సరైన ప్రదేశంలో, తీరుగా ఉండాలి. మల విసర్జనపై నియంత్రణ లేకపోతే నిరంతరం మలం బయటకు వస్తుంటుంది. ఇది పిల్లలకు చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. దుర్వాసన వస్తుంటే స్కూల్లో తోటి విద్యార్థులెవరూ దగ్గరికి రానివ్వరు. పిల్లలను ఎక్కడకు తీసుకు వెళ్లాలన్నా ఇబ్బందే. ఇది తల్లిదండ్రులకూ ఎంతో వేదన కలిగిస్తుంది. ఈ వేదన భరించలేక 'మాకెందుకీ శిక్ష' అని నిరాశలోకి జారిపోయే వాళ్లూ ఉంటారు. నిజానికి ఇవాల్టి రోజున ఇంతటి వేదన అవసరం లేదు. ఈ సమస్యలను సరిదిద్దటానికి చక్కటి విధానాలు ఉన్నాయి.

* మగ పిల్లలకు గానీ, ఆడ పిల్లలకు గానీ మలద్వార లోపం కిందిస్థాయిలోనే ఉంటే (లో ఆనోరెక్టల్‌)... అంటే చర్మంతో మూసుకుపోయి ఉండటం, కలిసిపోయి ఉండటం వంటి సమస్యలుంటే ఆనోప్లాస్టీ అనే చిన్న ఆపరేషన్‌తోనే సరిచేసి, ద్వారం ఏర్పాటు చేస్తారు.

* ఆడపిల్లలకు మలద్వారం యోనికి దగ్గరగా ఉంటే రెండు దశల్లో ఆపరేషన్‌ అవసరమవ్వచ్చు. ముందు 'కట్‌బ్యాక్‌ ఆనోప్లాస్టీ' చేస్తారు. 9-12 నెలల తర్వాత మలాశయాన్ని యోని నుంచి వేరుచేసి దూరంగా, సరైన స్థానంలో ఉంచే ఆపరేషన్‌ చేస్తారు.

* ఇక మధ్యస్థాయి (ఇంటర్‌మీడియేట్‌) లోపానికి వైద్యుల అనుభవాన్ని బట్టి మొదటిసారే పూర్తిస్థాయి ఆపరేషన్‌ చేయొచ్చు. లేదంటే ముందు మలం బయటకు రావటానికి చిన్న ఆపరేషన్‌ చేసి, 12 నెలల తర్వాత పూర్తిస్థాయి ఆపరేషన్‌ చెయ్యచ్చు.

* ఇక సమస్య పైఎత్తున.. అదీ సంక్లిష్టంగా ఉండే 'హై ఆనోరెక్టల్‌ అనామలీ'ల విషయంలో- ముందు పొట్టమీద చిన్నరంధ్రం చేసి లోపల పెద్దపేగు నుంచి నేరుగా బయటకు ఒక గొట్టాన్ని అమరుస్తారు. దీన్ని 'కొలాస్టమీ' అంటారు. ఇది మలం బయటకు వచ్చేందుకు కృత్రిమంగా, తాత్కాలికంగా ఏర్పాటు చేసే మార్గం. అనంతరం 3వ నెలలో లేదా.. 9-12 నెలలలోపు పూర్తిస్థాయి శస్త్రచికిత్స చేస్తారు. చిన్నవయసులోనే చెయ్యటం వల్ల- నియంత్రణకు సంబంధించి మెదడు నుంచి ఆదేశాలు రావటం, అలవాటవ్వటం తేలిక అవుతుంది.

ఏ పద్ధతిలోనైనా మలాశయాన్ని 'ప్యూబోరెక్టల్‌ కండరం' గుండా తీసుకొచ్చి మలద్వారం ఉండే ప్రదేశంలో చర్మానికి అతుకుతారు. కండరాలను సరిగ్గా గుర్తించి.. సమర్థంగా ఆపరేషన్‌ చెయ్యటానికి ఇప్పుడు మజిల్‌ స్టిమ్యులేటర్‌, మోనిటర్‌ వంటి అత్యాధునికమైన సదుపాయాలు చాలా అందుబాటులోకి వచ్చాయి. పిల్లల్లో ఈ అవయవ నిర్మాణం తీరుతెన్నుల పట్ల వైద్యుల్లో అవగాహన బాగా పెరిగింది. కాబట్టి తల్లిదండ్రులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆపరేషన్‌ తర్వాత జాగ్రత్తలు చాలా ముఖ్యం. వైద్యులు చెప్పినట్టే చేస్తూ, ఆ భాగాన్ని పొడిగా ఉండేలా చూడాలి. కృత్రిమంగా ఏర్పాటు చేసిన మలద్వారం ముడుచుకుపోయే అవకాశముంటుంది. కాబట్టి దాన్ని అప్పుడప్పుడు ఎలా వెడల్పు చెయ్యాలో వైద్యులు తల్లిదండ్రులకు నేర్పిస్తారు. ఒకట్రెండు నెలల వరకూ ఇలా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మలాశయ, మలద్వార లోపాలకు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఫలితాలు కూడా బాగుంటున్నాయి. కాబట్టి నిరాశ చెందాల్సిన పని లేదు. ఈ జాగ్రత్తలతో పాటు బిడ్డకు సంబంధించి పోషణ, తల్లిపాలు పట్టటం, టీకాల వంటివన్నీ యథాప్రకారం జరిగేలా చూడటం అవసరం.
కచ్చితంగా లోపం ఏమిటన్నది నిర్ధారించేంత వరకూ ఆపరేషన్‌ చెయ్యకూడదు. ఎందుకంటే ఒకసారి ఆపరేషన్‌ చేశాక దాన్ని తిరిగి సరిచేయటం చాలా కష్టమవుతుంది. దీనికి తొలిసారి చేసే ఆపరేషనే చాలా కీలకం. మంచి నైపుణ్యం, అనుభవం ఉన్న వైద్యులు ఆపరేషన్‌ చేస్తే ఆ బిడ్డ జీవితాంతం వేదన పడకుండా కాపాడొచ్చు.
కొలాస్టమీతో భయం లేదు
మలం బయటకు వెళ్లేందుకు పొట్ట మీద అమర్చే గొట్టం 'కొలాస్టమీ' గురించి తల్లిదండ్రులు బాగా తెలుసుకోవాలి. ఇది తాత్కాలికమేనని గుర్తించాలి. ఇలా పొట్ట మీది నుంచి మలం బయటకు వచ్చినా ఏమీ కాదు. తరచుగా మలాన్ని తొలగిస్తూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దీన్ని బొడ్డుకు పక్కగా కుడివైపున గానీ ఎడమవైపున గానీ చేస్తారు. శిశువును సాయంత్రం పూట ఎండలో ఉంచాలి. దీంతో ఆ పక్కన చర్మం పొడిగా ఉంటుంది. ఒకోసారి పేగు సాగి పొడవుగా (ప్రొలాప్స్‌) అవుతుంది. భయపడాల్సిన పనిలేదు. కొనిసార్లు వీరికి విరేచనాలు అధికంగా కావచ్చు. ఈ సమయంలో శిశువుకు ఎక్కువ ద్రవాలను ఇవ్వాలి. ఈ పిల్లలను ఎక్కువగా ఏడ్పించకూడదు. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తే వెంటనే డాక్టరుకు చూపించాలి. మధ్య మధ్యలో హిమోగ్లోబిన్‌ స్థాయులను పరీక్షిస్తుండాలి. ముఖ్యంగా అధైర్యపడరాదు. ఈ సమస్యలకు చేసే శస్త్రచికిత్సలతో ఇప్పుడు మంచి ఫలితాలు ఉంటున్నాయి. క్లిష్టమైన సమస్యలున్నా ఆపరేషన్‌ తర్వాత ఎంతోమంది పిల్లలు ఇప్పుడు సాధారణ జీవితం గడపగలుగుతున్నారన్నది పెద్ద ఊరటనిచ్చే అంశం.

--Dr.Hanumantharayudu ,PaediatricSurgeon @Eeandu sukhibhava
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, April 20, 2013

History of Lyposuccion , లైపోసక్షన్ చరిత్ర

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -History of Lyposuccion , లైపోసక్షన్ చరిత్ర - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


లైపోసక్షన్  అందుబాటులోకి వచ్చిందిలా... 


శరీరంలోని ఒక నిర్ధిష్టమైన భాగంలో కొవ్వును కరిగించడం నే లైపోసక్షన్  అంటాము .

ఇన్‌పేషెంట్‌గా ఉన్న రోగులకు రక్తంగాని, సెలైన్‌గాని ఎక్కించడానికి వీలుగా మణికట్టు దగ్గర ఒక సూది అమర్చి ఉంచుతారు. దాన్ని ‘కాన్యులా’ అంటారు. ఇలాంటి ఒక  కాన్యులా అమర్చి కొవ్వును బయటకు పీల్చే ప్రక్రియను డాక్టర్ వ్యస్ గెరార్డ్ ఇల్లావుజ్ అనే ఫ్రెంచ్ సర్జన్ మొదటిసారిగా 1982లో ప్రయత్నించాడు. తన ప్రయత్నం  చాలామేరకు సఫలమైందని గుర్తించాడు. 1990లో అల్ట్రాసోనిక్ తరంగాల సహాయంతో కొవ్వును ద్రవరూపంలోకి మార్చి బయటకు పీల్చేసే ప్రక్రియ సత్ఫలితాలను ఇచ్చింది.

ఆ తర్వాత్తర్వాత గతంలో ఉన్న సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఒక లేజర్ మొన ఉండే శరీరంలోకి పంపించగల పరికరం (ప్రోబ్) సహాయంతో లోపల ఉన్న కొవ్వును తొలగించే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఈ ముఫ్ఫై ఏళ్లలో తక్కువ రక్తస్రావం, తక్కువ ఇబ్బందులు, తక్కువ దుష్ర్పభావాలు, తక్కువ రిస్క్ ఉండే అధునాతన ప్రక్రియలు అందబాటులోకి వచ్చాయి. అంతేకాదు...  మన శరీరంలోనే ఒక చోటినుంచి తొలగించిన కొవ్వును... అవసరమైన మరోచోటికి పంపే ప్రక్రియలూ అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రక్రియనే ‘ఆటోలాగస్ ఫ్యాట్ ట్రాన్స్‌ఫర్’ గా అభివర్ణించవచ్చు.

ఆపరేషన్‌కు ముందే కొన్ని జాగ్రత్తలు...

కొవ్వు తొలగింపు ఆపరేషన్ చేయించాలనుకున్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఉదాహరణకు లైపో ప్రక్రియకు కనీసం రెండు వారాల ముందు నుంచి పొగతాగకుండా ఉండటం చాలా మంచిది. పొగలోని నికోటిన్ రక్తప్రసరణ సంబంధమైన ప్రతిబంధకాలను ఏర్పరచవచ్చు. పొగతాగడం మానేయడం ద్వారా ఆ ప్రమాదాలను
నివారించే అవకాశం ఉంటుంది. మిగతా సర్జరీల్లోలాగే లైపో లోనూ శరీరంలో మరే ఇతర భాగాల్లో ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం రెండు వారాల ముందు నుంచి రక్తాన్ని పలచబార్చే మందులేవీ వాడకుండా ఉండటం అవసరం.

గుండెజబ్బు రోగులు లైపో ప్రక్రియకు ముందుగా కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి. వాస్తవానికి మీరు ఉండాల్సిన బరువెంత, ఉన్న బరువెంత, తొలగించాక ఉండబోయే బరువు వంటి అంశాలు, మహిళలైతే భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా వంటి విషయాలను ముందే డాక్టర్లతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలి.

గతంలో మీకు అయిన సర్జరీల సంగతులు, ఏవైనా జబ్బులతో బాధపడుతున్నారా, మీకు  ఉన్న అలర్జీలు, వాడుతున్న మందుల వంటి వివరాలు లైపో నిర్వహించబోయే నిపుణులకు వివరించాలి. హైబీపీ, థైరాయిడ్ సమస్యలు, మధుమేహం వంటి అన్ని వివరాలూ చెప్పాలి. దాని వల్ల లైపో ప్రక్రియలో ఏవైనా రిస్క్ పెరిగే అవకాశం ఉందా అన్న అంశాలను నిపుణులు అంచనా వేస్తారు.

అనుసరించాల్సిన మార్గదర్శకాలు : మనం అనుసరించాల్సిన లైపోసక్షన్ ఏదైనా కొన్ని మార్గదర్శకాలు అనుసరించడం తప్పనిసరి. అవి... ఏ ప్రాంతంలోని కొవ్వు తొలగించాలన్న విషయాన్ని రోగి, సర్జన్ ఇద్దరూ చాలా ముందుగానే నిర్ణయించుకోవాలి మిగతా అన్ని సర్జరీల్లోలాగే ఈ ప్రక్రియలోనూ రోగి తన ఆమోద పత్రాన్ని సంతకం చేసి ఇస్తారు ప్రక్రియకు ముందు, తర్వాత యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తారు రోగిని నించోబెట్టి కొవ్వు తొలగించాల్సిన ప్రాంతాలను మార్క్ చేస్తారు ఏయే ప్రాంతాల్లో కొవ్వు తొలగించాల్సి ఉంటుందో, ఆ ప్రదేశాల ఫొటోలు తీసుకుంటారు. ప్రక్రియ తర్వాత కూడా వాటి ఫొటోలు మళ్లీ తీస్తారు సర్జరీ రూమ్‌లోకి వెళ్లాక ప్రక్రియ నిర్వహించాల్సిన ప్రదేశంలో స్టెరిలైజేషన్ సొల్యూషన్ అయిన బెటాడిన్‌ను పూస్తారు అవసరాన్ని బట్టి లోకల్ అనస్థీషియా (ప్రక్రియ  నిర్వహించాల్సిన చోట మాత్రమే నొప్పి తెలియకుండా ఇచ్చే మత్తుమందు)ను ఇంజెక్షన్ ఇస్తారు. ఒకవేళ తొలగించాల్సిన  కొవ్వు 5 లీటర్ల కంటే ఎక్కువగా ఉంటే సాధారణంగా పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) ఇస్తారు లైపోలో శరీరంపై పెట్టే గాటు సాధారణంగా ఒక అంగుళంలో మూడో వంతు మాత్రమే ఉంటుంది సాధారణంగా రోగికి ఐవీ ఫ్లుయిడ్స్ ఎక్కిస్తూ ప్రక్రియను నిర్వహిస్తారు. ఎందుకంటే శరీరం నుంచి ఓ పక్క కొవ్వు తొలగిస్తూ ఉండటం వల్ల శరీంలోని ద్రవాల పాళ్లను సమంగా ఉంచడం కోసం (బ్యాలెన్స్ చేయడం కోసం) ఇలా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు రోగి తాలూకు రక్తపోటు, గుండె కొట్టుకునే తీరు, రక్తంలో ఆక్సిజన్ పాళ్లు తెలుసుకోవడం కోసం కొన్ని ఉపకరణాలను రోగికి అమర్చి ఉంచుతారు సాధారణంగా రోగి  అదేరోజు మేల్కోవడం, అటూ ఇటూ తిరగడం, అదే రోజు ఇంటికి వెళ్లిపోవడం చేయవచ్చు. అయితే ఐదు లీటర్ల కంటే ఎక్కువ కొవ్వు తొలగించిన వారు ఒక రోజు ఆసుపత్రిలోనే ఉండటం మంచిది.

కోలుకునే సమయం: రోగి మళ్లీ తన పనులు తానే చేసుకోవడం అన్నది తీసిన కొవ్వుపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా రెండు రోజుల నుంచి రెండు వారాల్లో పనులకు వెళ్లవచ్చు. అయితే కొవ్వు తొలగించిన తర్వాత చర్మం వదులవుతుంది కాబట్టి 6-8 వారాల పాటు చర్మాన్ని బిగుతుగా ఉంచే ఎలాస్టిక్ దుస్తులు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొందరిలో చర్మంలోనికి కరిగిపోయే కుట్లు కాకుండా తొలగించాల్సిన కుట్లు వేస్తే వాటిని 5 నుంచి 10 రోజుల తర్వాత తొలగించాలి. ఈ ప్రక్రియలో ఉండే నొప్పులు సాధారణంగా మూడు రోజుల నుంచి రెండు వారాల పాటు ఉంటాయి. చర్మంపై ఎర్రబడిన ప్రాంతం రెండువారాల్లో క్రమంగా మామూలు స్థితికి  వస్తుంది. వాపు తగ్గడానికి రెండు వారాల నుంచి రెండు నెలలు పట్టవచ్చు. సర్జరీ ఫలితాలు కనిపించడానికి నెల నుంచి ఆర్నెల్లు కూడా పట్టవచ్చు. సాధారణంగా చర్మంలోని కొవ్వు కణాలను తొలగిస్తారు కాబట్టి ఫలితాలు బాగానే ఉన్నా... ఆహారంపై నియంత్రణ లేకపోయినా, వ్యాయామం చేయకపోయినా ఉన్న కొవ్వు కణాలే విపరీతంగా పెద్దవై, ఈ సారి అస్తవ్యస్తంగా కొవ్వు పెరిగే అవకాశం ఉంది.

లైపోసక్షన్ అవసరమైన ప్రదేశాలు
సాధారణంగామన శరీరంలో లైపోసక్షన్ ప్రక్రియతో కొవ్వు తొలగించాల్సిన ప్రదేశాలివి...
పొట్ట, పిరుదుల పైభాగం, తొడల ముందు భాగం, నడుము, వీపు, మోకాళ్ల కింది భాగం, భుజాలు, గదమ కింద, పురుషుల రొమ్ముల్లో కొవ్వు పేరుకుని ఎత్తుగా కనిపించే చోట (గైనకోమాజియా).

ఎంత కొవ్వు తొలగిస్తారు...
ఒకరి శరీరం నుంచి ఒక సిట్టింగ్‌లో సురక్షితంగా ఎంత కొవ్వు తొలగించాలన్న విషయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీన్ని వైద్య నిపుణులు, రోగి చర్చించి ఒక నిర్ణయం   తీసుకుంటారు. ఒకేసారి మరీ ఎక్కువ కొవ్వు తొలగించినా అది కొన్ని సార్లు ప్రతికూలంగా పరిణమించవచ్చు. ఎందుకంటే కొవ్వు మరీ ఎక్కువగా తొలగించిన చోట గుంతలా సొట్ట కనిపించవచ్చు.

దుష్ర్పభావాలు (సైడ్ ఎఫెక్ట్స్)...
ఇవి వైద్యపరంగా పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సినవి కాకపోయినా రోగికి మాత్రం  అసౌకర్యం కల్పించవచ్చు. అవి... గాటు గాయంగా మారి కొద్దికాలం నొప్పితో బాధించవచ్చు. ఒకటి రెండు నెలల పాటు కొవ్వు తీసిన చోట వాపు ఉండవచ్చు. రోగికి నిర్వహించే ప్రక్రియను బట్టి మచ్చ ఏర్పడుతుంది. ఇది సాధారణంగా కొన్ని వారాల్లో తగ్గిపోవచ్చు. లైపో వల్ల వచ్చే నొప్పి తాత్కాలికమే. నొప్పి నివారణ మందులతో దీన్ని నివారించవచ్చు. కనీసం మూడు రోజుల పాటు ఎటూ కదలలేని పరిస్థితి వల్ల అసౌకర్యంగా ఉండవచ్చు.

కాంప్లికేషన్లు : చాలా అరుదుగా (అంటే 0.14% రోగుల్లో) కొన్ని కాంప్లికేషన్లు ఉండవచ్చు. అవి... మందుల వల్ల వచ్చే అలర్జీ, శరీరంలో గాటు పెట్టిన చోట ఇన్ఫెక్షన్ రావడం. దీన్ని యాంటీబయాటిక్స్‌తో తగ్గించవచ్చు. కొన్ని సందర్భాల్లో కొవ్వు తొలగించడానికి ఉపయోగించిన కాన్యులా వల్ల కొన్ని కణాలు దెబ్బతిని చర్మంపై మచ్చలా కనిపించవచ్చు. చాలా అరుదుగా కొన్ని సందర్భాల్లో చర్మం కణాలు మృతిచెందే ప్రమాదం ఉంది. చర్మంలో కొవ్వు తొలగించిన ప్రదేశాలను బట్టి ఒక్కోసారి శరీర సౌష్ఠవం దెబ్బతిని ఎగుడుదిగుడుగా కనిపించవచ్చు. కొందరిలో చర్మం తాలూకు సాగే గుణం సరిగా లేకపోవడం వల్ల (పూర్ ఎలాస్టిసిటీ వల్ల) కూడా ఈ ఎగుడుదిగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని టచప్ ప్రక్రియల ద్వారా దీన్ని సరిచేయవచ్చు కాన్యులా కదలికల వల్ల చర్మంపై బొబ్బలు రావచ్చు. ఇవి మినహా పెద్దగా దుష్ర్పభావాలు ఉండవు. అయితే అనుకున్న ఫలితాలు కనిపించడానికి మూడు నుంచి ఆర్నెల్ల సమయం కూడా ఒక్కోసారి అవసరమవుతుంది.

సాధారణంగా లైపో తర్వాతి ఫలితాలు దీర్ఘకాలం ఉంటాయి. కానీ కొన్నిసందర్భాల్లో పెరిగే వయసు, ఆహార నియమాలు పాటించకపోవడం, గర్భధారణ వంటి అంశాల వల్ల దీనితో అనుకున్నంత ఫలితం ఉండకపోవచ్చు. అయితే ఇలాంటి అవకాశాలు చాలా కొద్దిమందిలోనే ఉంటాయి.

వివిధ లైపో ప్రక్రియలు

సాధారణంగా కొవ్వు తొలగించే ప్రక్రియ కోసం అవసరమైనది ఒక ఖాళీ పైప్ (కాన్యులా), ఒక ఆస్పిరేటర్ (కొవ్వును లోపలి నుంచి పీల్చివేసే పరికరం). ఈ రెండు పరికరాల సహాయంతోనే రకరకాల మార్గాల్లో లైపోను నిర్వహిస్తారు. వాటిలో కొన్ని...

సక్షన్ అసోసియేటెడ్ లైపో (ఎస్‌ఏఎల్) : ఇది సాంప్రదాయికంగా చేసే లైపో. ఇందులో కొవ్వు ఉన్న చోట చిన్న గాటు పెట్టి దాని ద్వారా కొవ్వు ఉన్న చోటికి ఒక పైప్ (కాన్యులా)ను పంపుతారు. దాన్ని పీల్చేసే పరికరమైన వాక్యూమ్ డివైజ్‌కు కలుపుతారు. ఈ ప్రక్రియలో కొవ్వు ఉన్న చోటికి పైప్‌ను మ్యాన్యువల్‌గా కదిలిస్తూ కొవ్వును తొలగిస్తారు.

పవర్ అసిస్టెడ్ లైపో (పీఏఎల్) : ఇది కూడా పూర్తిగా సక్షన్ అసిస్టెడ్ లైపో (ఎస్‌ఏఎల్)లాగే ఉంటుంది. కానీ నిపుణుడు తానే స్వయంగా కాన్యులాను కదిలిస్తూ కొవ్వు ఉన్నచోటికి కాన్యులాను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.

అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపో (యూఏఎల్) : ఈ లైపోసక్షన్ ప్రక్రియలో అల్ట్రా సౌండ్  తరంగాలను శరీరంలోకి పంపే ప్రత్యేకమైన కాన్యులాను ఉపయోగిస్తారు. ఈ తరంగాలు  కొవ్వు కణాలను చిలికినట్లుగా చేస్తాయి. దాంతో అక్కడి కొవ్వు తేలికగా బయటకు వస్తుంది. 

స్మార్ట్ లైపో : ఇందులో లేజర్ సహాయంతో కొవ్వును ద్రవంలా మార్చి ఒక ట్యూబ్ సహాయంతో ఆ ద్రవాన్ని బయటకు తీస్తారు. ట్విన్ కాన్యులా (అసిస్టెడ్) లైపో (టసీఏఎల్ లేదా టీసీఎల్): ఇందులో ఒక ట్యూబ్‌లోనే అంతర్గతంగా మరో ట్యూబ్ ఉండే కాన్యులాను ఉపయోగిస్తారు. లోపలి ట్యూబ్‌ను కొవ్వు తొలగించడానికి ఉపయోగిస్తే, బయటి ట్యూబ్ సహాయంతో మరింత లోతుగా కొవ్వు కణాలను చేరడానికి ఉపయోగిస్తాయి.

ఎక్స్‌టర్నల్ అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్ (ఎక్స్‌యూఏఎల్ ఏఇ ఈయూఏఎల్) : సాధారణంగా యూఏఎల్ ప్రక్రియలో చర్మంపై కణాలు నశించడం (నెక్రోసిస్), నీటితిత్తులు ఏర్పడటం వంటి దుష్ర్పభావాలు కనిపిస్తుంటాయి. వీటిని నివారించడం కోసం   ఎక్స్‌యూఏఎల్ ప్రక్రియను అనుసరిస్తారు. ఇందులో అల్ట్రాసౌండ్ తరంగాలను శరీరం బయటి నుంచే చర్మం ద్వారా పంపి కొవ్వు తొలగిస్తారు.

వాటర్ అసిస్టెడ్ లైపోసక్షన్ (డబ్ల్యూఎల్) : ఇందులో ఫ్యాన్ ఆకృతిలో ఉండే నీటిని ఉపయోగిస్తారు. ఈ ఫ్యాన్ ఆకృతిలోని నీరు చర్మంలోపల ఉండే కొవ్వును పలచబారుస్తుంది.

కుట్లు: లైపో ప్రక్రియలో గాటు చిన్నగా ఉంటుంది. కొందరు సర్జన్‌లు ప్రక్రియ తర్వాత కూడా ఆ గాటును అలాగే తెరచి ఉంచేందుకే ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా లోపల మిగిలి ఉండే కొద్దిపాటి కొవ్వు కూడా బయటకు జారిపోతుందని వారి ఉద్దేశం. మరికొందరు ఈ గాటును పూర్తిగా కుట్టకుండా పాక్షికంగానే కుట్టి వదిలేస్తుంటారు.

-Courtesy with Saakshi News paper@Dr.Kishore Reddy of Hyd.
  • -----------------------------------------------------------------------------
రేడియో ఫ్రీక్సెన్సీతో 'కేర్‌' లైపోసక్షన్‌ చికిత్స-- 31 Aug 2011.
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి: శరీరంలో అదనంగా పేరుకుపోయే కొవ్వు కణాలను కేర్‌ హాస్పిటల్‌ వైద్యులు రేడియో ఫ్రీక్సెన్సీ సహాయంతో తొలగించారు. లైపోసక్షన్‌ చికిత్సలో భాగంగా తాము దేశంలో తొలిసారిగా రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించామని కేర్‌ హాస్పిటల్‌కు చెందిన ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ లక్ష్మీ సలీమ్‌ చెప్పారు. ఇజ్రాయిల్‌లో అమలు చేస్తున్న రేడియో ఫ్రీక్వెన్సీ ప్రక్రియ వలన ఒబేసిటితో ఇబ్బంది పడుతున్న వారిని చక్కని ఆరోగ్యవంతులుగా మార్చవచ్చని ఆమె పేర్కొన్నారు. అయితే లైపో సక్షన్‌ విధానాలను అనేక విధాలుగా అమలు చేస్తారని, ఇందుకోసం అనేక రకాల సర్జికల్‌ పరికరాలను ఉపయోగిస్తుం టారన్నారు. చేతి సహాయంతో, ఎలక్ట్రిసిటీ ద్వారా, అల్ట్రాసౌండ్‌, పేజర్‌ల సహాయంతో ఇంతవరకూ లైపో సక్షన్‌ చేస్తున్నారని తెలిపారు. ఆయా విధానాల వలన సమయం అధికంగా వెచ్చించాల్సి ఉంటుందని, రేడియో ఫ్రీక్వెన్సీలో డే కేర్‌ ప్రొసిజర్‌లో ఒబేసిటికి వైద్యం చేయవచ్చునని పేర్కొన్నారు. ఈ విధానంలో శరీరంలో ఎక్కడైతే కొవ్వు కణాలు పెరిగిపోయాయో వాటిని మాత్రమే తొలగిస్తారని, కొవ్వు కణాల సమీపంలో దీని ప్రభావం ఏమాత్రం ఉండకపోవడం వలన రోగికి అదనపు ఇబ్బందులు ఉండవని వివరించారు. కొవ్వు తొలగించడం వలన శరీరంపై ఎలాంటి ముడతలు కూడా ఏర్పడవని ఆమె తెలిపారు.
         

  • ============================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Ultrasonic Lyposuccion,అల్ట్రాసోనిక్ లైపోసక్షన్‌,నాన్ సర్జికల్ లైపోసక్షన్


  •  

  •  
 ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు-UltrasonicLyposuccion,అల్ట్రాసోనిక్ లైపోసక్షన్‌,నాన్ సర్జికల్ లైపోసక్షన్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
 


అందాలను ఇనుమడింపచేయడానికి అందుబాటులో ఉన్న కాస్మెటిక్ చికిత్సలలో ఇప్పుడు అల్ట్రాసోనిక్ లైపోసక్షన్ తాజాగా వచ్చిన అధునాతన చికిత్స. అల్ట్రాసౌండ్ విధానంలో సర్జరీ లేకుండా కొవ్వును కరిగించడం ఈ చికిత్స ప్రత్యేకత.  శరీరంలోని ఒక నిర్ధిష్టమైన భాగంలో కొవ్వును కరిగించడం ఈ విధానం ప్రత్యేకత. ఏ భాగంలో కొవ్వును కరిగించాలో ఆ భాగంలో మాత్రమే అల్ట్రాసౌండ్ తరంగాలను పంపించి కొవ్వును కరిగిస్తారు. శరీరంపై ఎటువంటి గాటు లేకుండా, నొప్పి అనేది లేకుండా ఈ చికిత్స జరుగుతుంది. ఈ చికిత్స వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ చికిత్సతో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరంలోని కొన్ని భాగాల్లో కొవ్వు అధికంగా పెరుకుపోవడం మూలంగా శరీరాకృతి దెబ్బతింటుంది.  డయాబెటిస్, అధిక రక్తపోటు, స్ట్రోక్, అథెరొస్కెరోసిస్, అర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చిపడతాయి. అధిక బరువును తగ్గించుకోవడం కోసం చాలా మంది సర్జరీలను ఆశ్రయిస్తుంటారు. ఈ సర్జరీకి ప్రత్యామ్నాయం నాన్ సర్జికల్ లైపొసక్షన్. సాధారణంగా  ముఖం, నడుము, పిరుదులు, మెడ, బుగ్గలు, భుజాల కింద కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. ఈ కొవ్వును కరిగిస్తే శరీరం మళ్లీ పూర్వాకృతి సంతరించుకుంటుంది. లైపోసక్షన్‌ను లైపోప్లాస్టీ (ఫ్యాట్ మోడలింగ్) అని కూడా అంటారు.

చికిత్సా విధానం
శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కణాలను కరిగించి, శరీరాకృతిని అందంగా తీర్చిదిద్దడానికి అల్ట్రాసౌండ్ తరంగాలను శరీరంలోకి పంపిస్తాము. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకునే నడుము, పిరుదులు, తొడలు, పొట్ట తదితర ప్రాంతాలలోనుంచి కొవ్వును కరిగించడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ ద్వారా శరీరంలోని కొవ్వు శాశ్వతంగా తొలగిపోతుంది. ఒకసారి తొలగించిన కొవ్వు కణాలు మళ్లీ ఏర్పడే అవకాశం లేదు. రక్త నాళాలు, నరాలకు  సంబంధించిన కణజాలానికి ఎటువంటి హాని జరగకుండా అల్ట్రాసౌండ్ తరంగాల ద్వారా చర్మంలోపల ఉండే కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. ఒకసారి  తొలగించిన కొవ్వు కణాలు మళ్లీ జీవం పోసుకోలేవు. దీని వల్ల ఇవి శాశ్వతంగా తొలగిపోయినట్లే.

నిర్ధారణ
శరీరంలో కొవ్వు ఏ మేర పేరుకుపొయింది. నీటి శాతం ఎంత ఉంది? కండరాల పరిస్థితి ఎలా ఉంది? తదితర అంశాలను బీసీఏ (బాడీ కంపోజిషన్ అనలైజర్) ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. మెడికల్ హిస్టరీని పరిశీలించడం, పేషెంట్‌తో డిస్కస్ చేసి కొవ్వు  తొలగించుకోవాలనుకుంటున్న ప్రదేశం ఫోటోలు, మెజర్‌మెంట్స్ తీయడం జరుగుతుంది. ఆ తర్వాతే నాన్ లైపోసక్షన్‌కు సలహా ఇవ్వడం జరుగుతుంది.

చికిత్సా విధానం
ఏ భాగంలో కొవ్వును కరిగించాలో నిర్ధారించుకున్న తర్వాత ఆ ప్రదేశంలోకి అల్ట్రాసౌండ్ వేవ్స్‌ని పంపించడం జరుగుతుంది. ముందుగా అల్ట్రాసొనిక్ జెల్ అప్లై చేసిలో ఫ్రీక్వెన్సీలో అల్ట్రాసోనిక్‌వేవ్స్‌ని ఫ్యాట్ సెల్స్ పైకి పంపించడం జరుగుతుంది. ఈ ట్రీట్‌మెంట్‌లొ రక్తనాళాలపై, నారాలపై ఎటువంటి ప్రభావం ఉండదు. పూర్తిగా సురక్షితమైన ట్రీట్‌మెంట్ ఇది. ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించుకోవాలని కోరుకునే వారికి ఇది ఉపయుక్తమైన ట్రీట్‌మెంట్. వారంలో రెండు రోజులు ఈ ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చికిత్స ద్వారా 10నుంచి 15 కేజీల బరువు తగ్గవచ్చు. శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉన్నట్టయితే సులువుగా బరువు తగ్గుతారు. తక్కువ సిట్టింగ్స్‌లో ట్రీట్‌మెంట్ పూర్తవుతుంది. నొప్పి ఉండదు. శరీరంలో కుట్లు, గాట్లు ఏర్పడవు. ఎక్కువకాలం తిరిగి ఫ్యాట్ చేరకుండా ఉంటుంది. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. లేజర్ ట్రీట్‌మెంట్, స్కిన్ ట్రీట్‌మెంట్ వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆకర్షణీయ రూపం కోరుకునే వారు అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే ఫలితం బాగుంటుంది.

కరిగిన కొవ్వు ఏమవుతుంది?

మనం తీసుకునే ఆహారం జీర్ణమైన తరువాత కొంత కొవ్వు శక్తిని ఇచ్చే సాధనంగా  మారుతుంది. కొంత కొవ్వు క్యాలరీల రూపంలో ఖర్చయిపోతుంది. మిగిలిన కొవ్వు శరీరంలో పేరుకుపోతుంది. అది ముఖ్యంగా పొట్ట, పిరుదులు, తొడలు, నడుము భాగాలలో నిల్వ   అవుతుంది. అల్ట్రాసౌండ్ తరంగాలు కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంతో అందులోని కొవ్వు ద్రవరూపంలో కాలేయం లోకి చేరుకుంటుంది. అక్కడ జీర్ణక్రియ పూర్తి చేసుకుని విసర్జన జరుపుకుంటుంది.

చికిత్సా కాలం ఎంత?
చికిత్సాకాలం 6 నుంచి 18 సెషన్లు ఉంటుంది. వారానికి రెండు సెషన్ల చొప్పున మూడు నుంచి 18 వారాలలో చికిత్స పూర్తవుతుంది. అయితే శరీరాకృతిని అందంగా మలచుకోవడం అన్నది రోగి చేతుల్లో కూడా ఉంటుంది. శరీరంలో నుంచి కొవ్వు తొలగిపోయిన తర్వాత రోగి బరువు తగ్గిపోతాడు. పాత అలవాట్లు మానకపోతే ఈ చికిత్స చేయించుకుని ప్రయోజనం ఉండదు. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలను చేయడం వంటి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకుంటే శరీరం అందంగా మారడం చాలా సులభం.

ప్రయోజనాలు
నాన్ సర్జికల్ లైపోసక్షన్ శరీరంపై ఎటువంటి గాట్లు లేకుండా, సర్జరీ లేకుండా, నొప్పి లేకుండా కొవ్వును కరిగించే చికిత్సా విధానం. నొప్పి ఉండదు. అనస్థీషియా అవసరం లేదు. మామూలుగా సర్జరీతో కూడిన లైపోసక్షన్ చేసుకున్న వారు సాధారణ స్థితికి రావడానికి వారం, పదిరోజులు పడుతుంది. కాని, నాన్ సర్జికల్ విధానంలో ఎటువంటి విశ్రాంతి అవసరం లేదు. వెంటనే తమ విధులకు హాజరుకావచ్చు. ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే ఆస్కారమే లేదు. శరీరంపైన దద్దుర్లు, చర్మం కందిపోవడం వంటివేవీ ఉండవు. చికిత్స కోసం ప్రతి సెషన్ అరగంటపాటు ఉంటుంది. ఫలితాలు మొదటి సెషన్‌లోనే కనపడడం చాలా అరుదైనప్పటికీ 4 సెషన్లు పూర్తయ్యేసరికి చెప్పుకోదగ్గ శారీరక మార్పులు స్పష్టంగా కనపడతాయి. శరీరంలో ప్రతి భాగానికి కనీసం 6 నుంచి 18 సెషన్లు అవసరమవుతాయి. ఒకసారి కొవ్వు కణాలను తొలగించిన తర్వాత అవి మళ్లీ ఆ ప్రాంతంలో వచ్చే అవకాశాలు ఉండవు. చికిత్స చేసుకున్న తరువాత ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

- డాక్టర్ జి. కిషోర్‌రెడ్డి,హెల్తీ కర్వ్ ్స స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్,రీబాక్ షోరూమ్ పైన,ఆర్‌టిఎ ఆఫీస్ సమీపంలో,తిరుమలగిరి,సికింద్రాబాద్

  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, April 18, 2013

Trouble with Increased blood flow in periods, నెలసరి లో అధిక రక్తస్రావంతో అవస్థ

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Trouble with Increased blood flow in periods, నెలసరి లో అధిక రక్తస్రావంతో అవస్థ-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    నెలసరి దగ్గరపడుతోందంటే కొందరు మహిళల్లో కంగారు. ఆ సమయంలో విపరీతమైన రక్తస్రావం కావడమే ఆ భయానికి కారణం. ఈ పరిస్థితి ఎప్పుడో ఓసారి ఎదురైతే సమస్యలేదు. తరచూ బాధ పడుతోంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా అవుతోందా లేదా అన్నది తెలుసుకునే ముందు అసలు ఆ సమయంలో సాధారణంగా ఎంత రక్తస్రావం అవ్వాలనే దానిపై అవగాహన ఉండాలి. సాధారణ నెలసరి అంటే తక్కువగా అలాగని మరీ ఎక్కువగా రక్తస్రావం కాకుండా ఉండటమే. సగటున అయితే ఐదు రోజులకు మించి నెలసరి ఉండకూడదు. ఆ సమయంలో ఇరవై నుంచి అరవై ఎంఎల్‌ దాకా రక్తస్రావం కావాలి. కానీ కొందరిలో అంతకన్నా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ పరిస్థితిని హెవీ పీరియడ్స్‌ అనొచ్చు.. దాన్ని తెలుసుకోవడం కష్టం అయినా, కొన్ని సంకేతాలను బట్టి ఎక్కువగా అవుతోందని గుర్తించవచ్చు. విపరీతంగా రక్తస్రావం కావడం, తరచూ న్యాప్‌కిన్లు మార్చుకోవాల్సి రావడం, ఒకేసారి రెండు న్యాప్‌కిన్లను వాడటం, రక్తం ముద్దలు ముద్దలుగా పడటం.. లాంటివన్నీ అధిక రక్తస్రావం సమస్యను సూచిస్తాయి.

ఇవీ కారణాలు...
అప్పుడే రుతుక్రమం మొదలైన వారి నుంచి మెనోపాజ్‌ దశకు చేరుకుంటున్న ఎవరైనా ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. ప్రతి పదిమందిలో దాదాపు ఆరుగురిలో ఈ సమస్య ఉన్నా, చాలాసార్లు అసలైన కారణాలు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు ప్రొస్టాగ్లాండిన్‌ అనే రసాయనం రక్తంలో ఉండే స్థాయిని బట్టీ ఈ సమస్య ఎదురవుతుంది. ఈ రసాయనం గర్భాశయ పొరపై ప్రభావం చూపి సమస్యగా మారుతుంది. ఇంకొన్నిసార్లు గర్భాశయానికి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు పెద్దగా ఉన్నప్పుడూ ఇలా జరగొచ్చు. కొన్నిసార్లు ఈ కింది కారణాలూ ఉండే అవకాశం ఉంది.

*గర్భాశయంలో ఉండే కండరాల్లో ఫైబ్రాయిడ్లు పెరుగుతాయి. ఇవి క్యాన్సర్‌ కణుతులు కావు కానీ, అవి కూడా అధికరక్తస్రావానికి దారితీస్తాయి.. ఎండోమెట్రియోసిస్‌, కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లూ, పాలిప్స్‌ లాంటివీ అధిక రక్తస్రావానికి దారితీస్తాయి. మధ్య వయసు మహిళల్లో చాలా అరుదుగా ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వల్ల కూడా అలా కావచ్చు. అలాగే కటివలయ భాగంలో వచ్చే ఇన్‌ఫెక్షన్లూ, క్లమీడియా లాంటి వాటితోనూ ఈ సమస్య ఎదురవుతుంది.

*పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌ (పీసీఓడీ)తో బాధపడే కొందరిలో ప్రతినెలా అండం సక్రమంగా విడుదల కాదు. అలాంటప్పుడూ ఈ సమస్య కనిపిస్తుంది. అలాగే థైరాయిడ్‌తో బాధపడుతోన్నా అధికరక్తస్రావం కావచ్చు.

*ఇతర సమస్యలకూ, కీమోథెరపీలో భాగంగా ఇచ్చే కొన్నిరకాల మందుల వల్లా కొన్నిసార్లు సమస్య తలెత్తుతుంది.

గుర్తించేందుకు పరీక్షలుంటాయి..
సమస్య కనిపించినప్పుడు ఆ సమయానికి తగిన జాగ్రత్తలు తీసుకుని మౌనం వహించడం కన్నా అది నిజమా కాదా అన్నది నిర్ధరించుకునేందుకు డాక్టర్‌ని సంప్రదించాలి. అలాంటప్పుడు గర్భాశయం, గర్భాశయ ముఖద్వారం సైజు, ఆకృతిని అంచనా వేసేందుకు కొన్ని పరీక్షలు చేస్తారు. అలాగే రక్తహీనత కూడా అధిక రక్తస్రావాన్ని సూచిస్తుంది. ప్రతినెలా ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉండి, ఆ లోపాన్ని భర్తీ చేసేందుకు ఐరన్‌ మాత్రల్ని తీసుకోని వారిలో రక్తహీనత సాధారణంగా కనిపించే సమస్య కాబట్టే ఆ పరీక్ష చేయించుకోమంటారు. వాస్తవానికి అధిక రక్తస్రావంతో బాధపడే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి రక్తహీనత ఉంటుంది.

ఒకవేళ గర్భాశయం, గర్భాశయ ముఖద్వారంలో ఎలాంటి సమస్యలూ లేకపోతే, వయసు నలభై లోపు ఉంటే అదనంగా ఎలాంటి పరీక్షలూ సూచించరు. సమస్య తీవ్రతను బట్టి మాత్రల్ని ఇస్తారు.
అలా కాకుండా వయసు నలభై అయిదేళ్లు దాటి, నెలసరి, నెలసరికీ మధ్యలో రక్తస్రావం అవుతోన్నా, కలయిక తరవాత రక్తం కనిపించడంతోపాటూ నొప్పిలాంటి లక్షణాలు కూడా ఉంటే డాక్టర్లు గర్భాశయం గురించి తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేస్తారు. ఆ పరీక్షలో కేవలం గర్భాశయం పనితీరు మాత్రమే కాదు.. ఫైబ్రాయిడ్లు, పాలిప్స్‌ లాంటివి ఉన్నా తెలుస్తాయి. అలాగే ఎండోమెట్రియల్‌ శాంపిల్‌ కూడా తీసుకుని పరీక్షిస్తారు. పరిస్థితిని బట్టీ హిస్టెరోస్కోపీ కూడా చేయాల్సి రావచ్చు.

మాత్రలే మొదటి చికిత్సగా..
ప్రత్యేక కారణం అంటూ లేకుండా సమస్య ఎదురైతే దాన్ని తగ్గించడానికి మాత్రల్ని సూచిస్తారు. అదే ఫైబ్రాయిడ్లూ, ఎండోమెట్రియోసిస్‌ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని బట్టి చికిత్స ఉంటుంది. ఈ వయసులో ఇచ్చే కొన్నిరకాల మాత్రలు దాదాపు నలభై నుంచి యాభై శాతం వరకూ రక్తస్రావాన్ని అదుపులో ఉంచుతాయి. అయితే వాటివల్ల నెలసరిలో వచ్చే నొప్పి, నెలసరి రోజుల్నీ తగ్గించలేం. వీటివల్ల చాలా అరుదుగా పొట్టలో అసౌకర్యంగా అనిపించవచ్చు.

*మరికొన్ని రకాల మాత్రలు కేవలం అధిక రక్తస్రావాన్నే కాదు, నెలసరి నొప్పినీ తగ్గిస్తాయి. వాటివల్ల ప్రొస్టాగ్లాండిన్‌ రసాయన ప్రభావం కూడా కొంతవరకూ అదుపులోకి వస్తుంది. అయితే పొట్టలో అల్సర్‌, ఆస్తమా లాంటి సమస్యలుంటే డాక్టర్లకు ముందే తెలపడం మంచిది.

*గర్భం రాకుండా వాడే మాత్రల్లో కంబైన్డ్‌ ఓరల్‌ కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ కూడా రక్తస్రావంతోపాటూ నెలసరి నొప్పినీ కొంతవరకూ తగ్గిస్తాయి.

*కొన్నిసార్లు మిరేనా గా చెప్పుకొనే లెవనార్జెట్రెల్‌ ఇంట్రా యూటరైన్‌ సిస్టమ్‌ కూడా ఈ సమస్యను చాలామటుకు తగ్గిస్తుంది. దీన్ని గర్భాశయంలో అమరుస్తారు. అది ప్రతిరోజూ కొద్దికొద్దిగా లెవనార్జెట్రిల్‌ అనే ప్రొజెస్టరాన్‌ హార్మోన్‌ని విడుదల చేస్తుంది. దాంతో నెలసరి చాలా తక్కువ కావచ్చు. లేదా కొంతకాలం ఆగిపోవచ్చు. ఆ సమయంలో వచ్చే నొప్పీ తగ్గుతుంది. ఇది ఎండోమెట్రియల్‌ పొరను పలుచన చేస్తుంది. ఈ మిరేనాని కనీసం ఐదేళ్లవరకూ అమర్చుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు వెంటనే తొలగించుకోవచ్చు. రక్తస్రావం సమస్య తగ్గడంతోపాటూ ఎక్కువకాలం గర్భం రాకుండా జాగ్రత్త పడాలనుకునే వారికి మంచి పరిష్కారం.

*ఇవన్నీ పనిచేయనప్పుడు ఆఖరి ప్రయత్నంగా డాక్టర్లు శస్త్రచికిత్సను చేయించుకోమంటారు. గర్భాశయాన్ని తీసేయడం లేదా అక్కడ ఉండే ఎండోమెట్రియల్‌ పొరను కరిగించడం ఈ శస్త్రచికిత్సలో భాగం. అదే ఎండోమెట్రియల్‌ ఎబ్లేషన్‌. ఇందులో ఎండోమెట్రియల్‌ పొరను సాధ్యమైనంతవరకూ తగ్గిస్తారు. ఈ శస్త్రచికిత్సను హీట్‌, మైక్రోవేవ్‌, క్రయోథెరపీ లాంటి ఏదో ఒక పద్ధతిలో చేస్తారు. ఆ తరవాత సమస్య దాదాపుగా తగ్గినా భవిష్యత్తులో గర్భం వచ్చే అవకాశం మాత్రం ఉండదు.

*పై చికిత్సలేవీ పనిచేయనప్పుడు..గర్భాశయాన్ని పూర్తిగా తీసేసే హిస్టెరెక్టమీ డాక్టర్లు సూచిస్తారు.

అదనంగా జాగ్రత్తలు..
అధికబరువున్న వాళ్లలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. కాబట్టి పోషకాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రక్తహీనత సమస్య ఉందని రక్తపరీక్షలో తేలితే ఐరన్‌ మాత్రల్ని తీసుకోవడంతో పాటూ ఇనుము అందించే పదార్థాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా బెల్లం, తోటకూర, గుడ్లు, ఎండుద్రాక్ష, సోయా లాంటివి రోజూ ఆహారంగా తీసుకోవాలి.
  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, April 6, 2013

Psychological problem in cancer patients,క్యాన్సర్‌ రోగుల్లో మానసిక సమస్యలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Psychological problem in cancer patients,క్యాన్సర్‌ రోగుల్లో మానసిక సమస్యలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


క్యాన్సర్‌ అంటే తగ్గని వ్యాధి అని ... ఇక తమకు చావు తప్పదని భయపడతారు రోగులు. నిజమే క్యాన్‌సర్ ఆదిలో గుర్తించక పోతే పూర్తిగా నయము చేయడము సాధ్యపడదు. సెంటిమెంట్స్ తోనూ , మూఢనమ్మకాలతోను , పేదరికము తోనూ కూడికొనిఉన్న భారతదేశములో క్యాన్‌సర్ అవునో కాదో గుర్తింపుకోసము ప్రజలు ముందుకు రావడములేదు. తీరా ముదిరిపోయిన తరువాత చేసేదేమీ ఉండదు. మానసికము గా బాధపడడమే మిగులుతుంది.

క్యాన్సర్‌ రోగుల్లో మానసిక అధికంగా ఉంటాయని శాస్త్రీయ అధ్యయనాల్లో వెల్లడైందని మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం చెప్పారు. దేశంలోని 20 ఆస్పత్రుల్లో నిర్వహించిన ఒక అధ్యయనంలో 40% మంది రోగుల్లో మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు నిర్థరణ అయిందన్నారు. క్యాన్సర్‌ తీవ్రత కన్నా, మానసిక సమస్యలతో చాలా మంది రోగుల్లో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోందన్నారు. దీన్ని నివారించడానికి క్యాన్సర్‌ చికిత్సలు చేసే ఆస్పత్రుల్లో మానసిక వైద్యుల పర్యవేక్షణలో చికిత్సలు అందించే విధానం అందుబాటులోకి రావలసిన ఆవశ్యకత ఉందని హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ క్యాన్సర్‌ సదస్సులో కలాం చెప్పారు. రక్త క్యాన్సర్‌ సోకిన తన ముగ్గురు స్నేహితులకు మానసికంగా ఎదురైన పరిస్థితులను ఈ సందర్భంగా వివరించారు. క్యాన్సర్‌ చికిత్సలకు దేశంలో ఆ తరహా విధానం లేదు,60% రోగులకు సాధారణ వైద్యులే దిక్కు. క్యాన్సర్‌ రోగులకు చికిత్సలు బాధాకరం కాకుండా నివారించడానికి అనుసరించాల్సిన విధానాలపై వైద్యులు, మానసిక నిపుణులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. క్యాన్సర్‌ సోకిన వారి కుటుంబసభ్యుల్లో మానసిక భయాందోళనలు తొలగించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలాం సూచించారు. దేశంలోని సుమారు 120 కోట్ల జనాభాకు దాదాపు 1200 మంది క్యాన్సర్‌ వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. దీనివల్ల మొత్తం క్యాన్సర్‌ రోగుల్లో దాదాపు 60% మందికి సాధారణ వైద్యులు చికిత్సలు అందిస్తున్నారని వివరించారు. ప్రతి జిల్లా ఆస్పత్రిలో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు సంబంధించిన వైద్యపరీక్షలు, చికిత్సలు అందించేందుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. దేశంలో వివిధ రకాల క్యాన్సర్ల తీవ్రతను అంచనా వేయడానికి ''రోగుల నమోదు విధానం'' తప్పనిసరి చేయాలన్నారు. వివిధ రకాల క్యాన్సర్‌ రోగాలకు కారకాలైన జన్యువులను గుర్తించి, వాటిపై పరిశోధనలను విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రోగులకు రేడియోథెరఫీ చికిత్సల్లో దుష్ప్రభావాలను నివారించడానికి నానో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

నాణ్యమైన సేవలు అందుబాటులో ఉన్నాయి: క్యాన్సర్‌కు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని ప్రముఖ క్యాన్సర్‌ వైద్యనిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు చెప్పారు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన చికిత్సలు అందించడానికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక సంపత్తిని సమకూర్చడానికి తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. క్యాన్సర్‌కు వివిధ విభాగాలకు చెందిన వైద్యనిపుణులు బృందాలుగా ఏర్పడి చికిత్సలు అందించే విధానం మన దేశంలో కూడా అందుబాటులోకి రావలసిన అవసరం ఉందని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ సినీనటుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఈ అంశంపై అంతర్జాతీయ సదస్సుల్లో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌ వ్యాధులపై మన దేశంలో విస్తృతంగా అధ్యయనం చేసిన డాక్టర్‌ డి.డి.పటేల్‌ను సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌ బారినపడ్డ వారికి చికిత్సలు అందడంలేదని డాక్టర్‌ పటేల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని క్యాన్సర్లపై విస్తృతస్థాయిలో పరిశోధనలు, రోగులకు మెరుగైన చికిత్సలు అందించడానికి రూ.1000 కోట్లతో ఢిల్లీలో జాతీయ క్యాన్సర్‌ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు.

-క్యాన్సర్‌ సదస్సులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం-ఈనాడు - హైదరాబాద్‌
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/