- Alzemers disease is a part Senile Dementia.
కొన్ని సమయాల్లో మతిమరుపు అనేది కూడా వరమౌతుందని అదే మరో సందర్భంలో శాపమౌతుందన్నారు. వృద్ధాప్యంలో వచ్చే అల్జిమర్స్ వ్యాధి కారణంగా వ్యక్తులు చిన్ననాటి విషయాలను మాత్రమే గుర్తుంచుకోగలుగుతారు. అల్జిdమర్స్ ఉన్న రోగులు తమ జీవితంలోని తాజా పరిణామాలను, వ్యక్తులను మరచిపోతారు. ఫలితంగా తమ దైనందిన విధుల నిర్వహణలోనూ వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులతో కమ్యూనికేషన్ జరపడం వారికి కష్టసాధ్యమవు తుంది. అల్జిమర్స్‌కు అడ్డుకట్ట వేయాలంటే ఒత్తిడిని నివారించడమే పరిష్కారమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
జీవితచరమాంకంలో ప్రశాంత జీవనం గడపాల్సిన ఎందరో వృద్ధులు తమకు సోకిన అల్జీమర్స్ వ్యాధితో మతిమరుపు సమస్యతో సతమతమవుతున్నారు. అల్జీమర్స్ వ్యాధిని గుర్తించి, చికిత్స చేయడమే కాదు...వారికి, వారి సంరక్షకులకు కౌన్సెలింగ్ అందించటంతోపాటు వివిధ సేవలు అందించటమే లక్ష్యంగా హైదరాబాద్ కేంద్రంగా అల్జీమర్స్ అండ్ రిలేటెడ్ డిజార్డర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఆర్‌డీఎస్ఐ) దక్కన్ చాప్టర్‌ను ఏర్పాటు చేశారు న్యూరాలజీ నిపుణురాలు డాక్టర్ సువర్ణ అల్లాడి.
"డిమెన్షియా అంటే మెదడుకున్న శక్తి క్రమంగా సన్నగిల్లడం. డెమన్షియా అంటే ఒక రోగం కాదు, అనేక రోగాల సముదాయం. మనిషి మెదడు లోపల కొన్ని కణాలు దెబ్బతినడంవల్ల మనిషిలో అనేక నైపుణ్యాలు కనుమరుగైపోతాయి. ముఖ్యంగా తెలివితేటలు, నేర్చుకునే సమర్థత, సమస్యా పరిష్కారశక్తి వంటివి బాగా తగ్గిపోతాయి. ఎంత పాండిత్యంగల వారైనా దీని బారిన పడ్డారంటే భాష మీద ఆధిపత్యం, ఏకాగ్రత, భాషాచాతుర్యం, పరిశీలనాశక్తి వంటివి దారుణంగా దెబ్బతింటాయి. దీనికితోడు మనిషి ప్రవర్తనలో ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. డెమన్షియావల్ల జ్ఞాపకశక్తిలో లోపం ఏర్పడి ఆ మనిషికి మరుపు
మొదలవుతుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తుఉండదు. కొత్త సంగతులు విన్నా వాటిని గుర్తులో ఉంచుకోలేరు. క్రమక్రమంగా ఈ సమస్య పెరుగుతూ ఉంటే ఏడాదిలోపులో జరిగిన ముఖ్య సంఘటనలను కూడా మరచిపోతారు. బాగా ముదిరితే ... ఇంట్లో మనుషుల్ని క్రమంగా గుర్తుపట్టలేకపోవడం ప్రారంభమవుతుంది. తిండి తిన్న పది నిముషాలకే దాని మాట మరచి తనకు ఎప్పుడు తిండి పెట్టారు అని అడుగుతారు ఈ డెమన్షియా బాధితులు. ఒకొక్కప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడే మూత్ర విసర్జన కూడా చేసేస్తూ ఉంటారు.
డిమెన్షియాలో పలు రకాలున్నా, ఇందులో సర్వసాధారణమైనది అల్జీమర్స్ వ్యాధి. డెమన్షియా వచ్చిన వారిలో సగం మందికి పైగా ఈ ఆల్‌జైమర్ డెమన్షియా వస్తుంది. ఇది ఎందుకు వస్తుందో పూర్తిగా ఇంకా తెలియరాలేదు. కాకపోతే కొంతమంది దీనిని వారసత్వపు సమస్యగాను, మరికొందరు ఆడవారికి ఎక్కువగా వస్తుందని అంటారు. ఈ వ్యాధి సాధారణ లక్షణం మతిమరుపు. సాధారణ వైద్యులకు సైతం అంతుపట్టని ఈ వ్యాధితో ఒక్క హైదరాబాద్‌లోనే 40వేల మంది అవస్థలు పడుతున్నారు. అల్జీమర్స్ వ్యాధి మెదడులోని జీవకణాలను ఒక్కొక్కటిగా నిర్జీవం చేస్తూ, మెదడును సరిగా పనిచేయనీయకుండా చేస్తుంది. అమిలాయిడ్ అనే ప్రొటీన్ పొరలుగా మేట వేసుకుపోవటం, మెదడులోని జీవకణాల్లో ఉండే అతి సూక్ష్మ ఫిలమెంట్లు ఒకదానితో ఒకటి పెనవేసుకు పోవడం ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి వంశపారంపర్యంగా లేదా లోపభూయిష్టమైన జన్యువుల ప్రభావం వల్ల సంక్రమించవచ్చని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది.
లక్షణాలు : అల్జీమర్స్‌తో బాధపడే వారు విలక్షణంగా ఉంటారు. వృద్ధాప్యం మీద పడేకొద్దీ మతిమరుపు పెరుగుతుంది. ఈ వ్యాధి ఉన్న వారికి కుటుంబసభ్యుల పేర్లు కూడా గుర్తుండవు. పొయ్యి మీద ఏదన్నా పెట్టి మర్చిపోతారు. భోజనం చేశామో లేదో గుర్తుండదు.
అల్జీమర్స్ సొసైటీ శ్రీకారం
"రాష్ట్రంలో 1990వ సంవత్సరం వరకు అల్జీమర్స్ అనే వ్యాధి అంటే వైద్యులకు కూడా అవగాహన లేదు. ఈ వ్యాధి ఏదో పాశ్యాత్య దేశాలకు చెందిన వ్యాధి అనుకునే వారు. నేను బెంగుళూరులోని నిమ్‌హాన్స్, కేంబ్రిడ్జ్‌లో అల్జీమర్స్ వ్యాధిపై ప్రత్యేకంగా శిక్షణ పొంది వచ్చి నిమ్స్‌లోని న్యూరాలజీ డిపార్టుమెంట్‌లో ప్రొఫెసర్‌గా చేరాను. మతిమరుపు సమస్యతో సతమతమవుతూ ఎందరో రోగులు న్యూరాలజీ విభాగానికి చికిత్సకు వచ్చే వారు. వృద్ధాప్యంలో అల్జీమర్స్‌తో బాధపడుతున్న వారికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చికిత్స చేయాలనే ఉన్నతాశయంతో నిమ్స్‌లో ప్రత్యేకంగా మెమోరీ క్లినిక్‌ను ఆరంభించాను. ఈ క్లినిక్‌లో న్యూరాలజీ నిపుణులతోపాటు సైకాలజిస్ట్‌లు, ఫీిజియోథెరపిస్టులు, కౌన్సెలర్లను అందుబాటులో ఉంచాం. ఇక్కడ జబ్బును గుర్తించడంతోపాటు చికిత్స చేయడమే కాదు వారికి ఫిజికల్ యాక్టివిటీ అవసరమని గుర్తించాం. అల్జీమర్స్ వ్యాధిగ్రస్థులకే కాదు వారి సంరక్షకులకు కూడా కౌన్సెలింగ్ అందించేందుకు వీలుగా అల్జీమర్స్ సొసైటీని ఆరంభించాం. ఈ సొసైటీలో వైద్యులే కాదు, అల్జీమర్స్ రోగుల సంరక్షకులను కూడా భాగస్వాములను చేశాం.
శారీరకంగా వివిధ కార్యక్రమాలతో యాక్టివ్‌గా ఉంచడం ద్వారా మెదడును ఆరోగ్యవంతం చేసి మతిమరుపు ముప్పును తగ్గించవచ్చు.
అల్జీమర్స్ సేవల్లో సొసైటీ ముందడుగు
రాష్ట్రంలో అల్జీమర్స్ పీడితులకు సేవలందించటంలో సొసైటీ ముందడుగు వేసింది. గడచిన ఆరేళ్లలో రెండువేల మంది రోగులకు సేవలందించాం. 28 అవగాహన శిబిరాలు నిర్వహించి వైద్యులు, రోగులు, సంరక్షకులకు అవగాహన కల్పించాం. 200కుపైగా హోం విజిట్స్ చేసి రోగులకు సేవలతోపాటు సంరక్షకులకు 32 సమావేశాలు నిర్వహించాం. ప్రతిఏటా మెమొరీ వాక్‌లు నిర్వహించి ఈ వ్యాధిపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం. అల్జీమర్స్ పీడితులకు మెరుగైన సేవలందించేందుకు మా సొసైటీ ఆధ్వర్యంలో భవిష్యత్‌లో అల్జీమర్స్ డిసీజ్ సెంటర్‌ను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నాం'' అన్నారు ---డాక్టర్ సువర్ణ.
మెమొరీ వాక్ 2012
అల్జీమర్స్ వ్యాధిపై అవగాహన కల్పించడమే కాదు రోగులకు వివిధ రకాల శారీరక యాక్టివిటీల ద్వారా సాంత్వన కల్పించవచ్చనే వాస్తవాన్ని ప్రచారం చేసేందుకు వీలుగా ప్రపంచ అల్జీమర్స్ డే సందర్భంగా ఈ నెల 16 వతేదీన హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డుపై జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు మెమొరీ వాక్ 2012 చేపడుతున్నాం. నగర మేయర్ ముహమ్మద్ మాజిద్ హుసేన్ ప్రారంభించనున్న ఈ వాక్‌లో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
- డాక్టర్ సువర్ణ అల్లాడి-అడిషనల్ ప్రొఫెసర్-డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూరాలజీ-నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-హైదరాబాద్-అధ్యక్షురాలు, ఏఆర్‌డీఎస్ఐ, దక్కన్ చాప్టర్
చికిత్స :
వృద్ధాప్యంలో తీవ్ర మతిమరుపును, తికమకను తెచ్చిపెట్టే అల్జీమర్స్ రోజువారీ పనులను బాగా దెబ్బతీస్తుంది. ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని నివారించుకునే వీలుంది.
- * ఒమేగా-3, ఒమేగా-6, విటమిన్ ఈ, బీ12 దండిగా లభించే అవిసెలు, అక్రోటుపప్పు, పిస్తా, బాదం, జీడిపప్పు, పెరుగు, పాలు, మాంసం, చేపల వంటివి తరచుగా తీసుకోవాలి.
- * వ్యాయామం వల్ల అల్జీమర్స్ ముప్పూ తగ్గుతుంది. మెదడుకు రక్తసరఫరా బాగా జరుగుతుంది. దీంతో కొత్త మెదడు కణాలు అభివృద్ధి చెందే ప్రక్రియ కూడా ప్రేరేపితమవుతుంది.
- * మెదడుకు మేత పెట్టే చిక్కు సమస్యలను పరిష్కరించటం, పదకేళీలు పూరించటం, చదరంగం ఆడటం వంటివి చేయాలి. మెదడులోని కణాలు చురుకుగా ఉండేలా చేస్తున్నకొద్దీ ఆరోగ్యకరమైన కణాలు సజీవంగా ఉంటాయి. రోజూ ధ్యానం మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
- * వారానికి కనీసం మూడు సార్లయినా తాజా పండ్లు తినాలి. వీటిల్లోని ఫాలీఫెనాల్స్‌కు అల్జీమర్స్‌ను నివారించే సామర్థ్యముంది.
- * తగినంత నిద్రపోవాలి. ఇది మెదడును తాజాగా ఉంచుతుంది. శరీరానికి, మనసుకు విశ్రాంతి కలిగిస్తుంది. వయసు మీద పడకుండా చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు మెదడునూ చురుకుగా ఉంచుతాయి.
- * మద్యం, పొగ అలవాట్లకు దూరంగా ఉండాలి.
అల్జీమర్స్‌కు నిద్ర మందు!
వయసు పెరుగుతున్నకొద్దీ తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే 'అల్జీమర్స్' ముప్పూ పెరుగుతుంటుంది. ఈ సమస్యకు కచ్చితమైన చికిత్సలేవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. కాబట్టి దీన్ని నివారించుకునే మార్గాలపై పరిశోధకులు చాలాకాలంగా దృష్టి సారించారు. దీనికి సంబంధించి తాజాగా ఒక మంచి సమాచారం బయటపడింది. కంటి నిండా నిద్రపోతే అల్జీమర్స్‌ను నివారించుకునే అవకాశమున్నట్టు వెల్లడైంది. మెదడులో అమీలాయిడ్ బీటా గార పేరుకుపోవటమనేది అల్జీమర్స్‌కు సూచిక. రోజుకి 5 గంటల కన్నా తక్కువ సేపు నిద్రపోయే వృద్ధులతో పోలిస్తే.. కంటినిండా నిద్రపోయే వృద్ధుల మెదళ్లలో గార పోగుపడటం తక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మెదడులో గార మోతాదుకూ నిద్రకూ సంబంధం ఉంటున్నట్టు ఇంతకుముందూ వెల్లడైంది. నిద్ర సరిగా పట్టకపోవటం వల్లనే అమీలాయిడ్ గార పోగుపడుతుందని కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ.. మెదడులో తలెత్తే మార్పులు నిద్రకు భంగం కలిగించే అవకాశముందని జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన అడమ్ స్పైరా అంటున్నారు. నిద్ర అలవాట్లు మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతాయని, అందువల్ల నిద్ర సరిగా పట్టేలా చూసుకుంటే అల్జీమర్స్‌ను నివారించుకునే అవకాశమూ ఉందని సూచిస్తున్నారు. నిద్రపోయే సమయంలో మెదడులోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతున్నట్టు ఇటీవల ఒక అధ్యయనంలోనూ వెల్లడైన సంగతిని ఉదహరిస్తున్నారు. మెదడులో చురుకైన సర్క్యూట్లలోని నాడీకణాలు అమీలాయిడ్ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి.. వీటిని శాంతింప జేయటం, నిద్ర సరిగా పోవటం ద్వారా అల్జీమర్స్‌ను నివారించుకునే వీలుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అంతమాత్రాన నిద్రమాత్రలు ఈ ముప్పును తగ్గించగలవని అనుకుంటున్నారేమో. అలాంటి అవకాశమేమీ లేదు. నిద్ర సమస్యల నుంచి తప్పించుకోవటానికి నిద్ర మాత్రలు వేసుకునేవారికీ అల్జీమర్స్ ముప్పు పొంచి ఉంటోందనే సంగతిని గుర్తుంచుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు
- Brain exercise medicine,మతిమరుపునకు మెదడుకు పని మందు
Alzemers Day on sept.21.సెప్టెంబర్ 21న ‘వరల్డ్ అల్జీమర్స్ డే’----- చాలామంది వ్యక్తులు పెద్ద వయస్సు వచ్చిందంటే అల్జీమర్స్ అంటే మతిమరపు వ్యాధితో బాధపడుతుంటారు. వయసుతోపాటు మోమొరీ తగ్గటం సహజంగా వచ్చేస్తుంది. కనుక ప్రధానంగా మీ మెదడుకు పని కల్పిస్తుండాలి.
-ఖాళీగా ఉండే మెదడు దయ్యాల ఇల్లు అనే సామెత ఉంది. ఇది సామెతే కాదు అక్షరాలా వాస్తవం కూడా. మన శరీరంలో ఏ భాగమైనా సరే వాడ కుండా లేదా ఉపయోగించకుండా ఉంటే అది మొండిగా తయారవుతోంది. పదును తగ్గుతుంది. అదేవిధంగా మన మెదడు కూడాను. చేయటానికి మెదడుకు పని ఏముంటుందనుకుంటారు? కానీ మీరు మీ చేతులు, కాళ్ళు ఏవి కదపాలన్నా అవి మీకు తెలియకుండానే జరుగుతుంటాయి. కానీ కొన్ని విషయాలలో విచక్షణతో మీరు జాగ్రత్తగా వ్యవహరించ వలసిన అవసరం వస్తుంది. అప్పుడే మీరు మీ మెదడుకు పని కల్పించుతున్నట్లు తెలుసుకుంటారు. ఇంత ప్రధానమైన ఈ శరీర భాగానికి మనం పదును పెట్టాలి. అందుకుగాను మీ మెదడుకు కొన్ని వ్యాయామాలు కావాలి. వయస్సు పైబడు తోందంటే మనమందరం మెదడుకు గల పదును కోల్పోతూ ఉంటాం. కానీ మెదడుకు రెగ్యులర్‌గా పని కల్పిస్తుంటే, మీ తెలివితేటలు మరింత వికసిస్తాయి. జ్ఞాపకశక్తి నశించకుండా ఉంటుంది. వయసు పైబడుతున్నపటికీ మీలో మతిమరపు వ్యాధి రాకుండా ఉంటుంది.
మీ మెదడుకు ఐదు ప్రధాన వ్యాయామాలు
మెమొరీ గేమ్ --- చాలామంది వ్యక్తులు పెద్ద వయస్సు వచ్చిందం టే అల్జీమర్స్ అంటే మతిమరపు వ్యాధితో బాధపడుతుంటారు. వయసుతోపాటు మోమొరీ తగ్గటం సహజంగా వచ్చేస్తుంది. కనుక ప్రధానంగా మీ మెదడుకు పని కల్పిస్తుండాలి. మీ స్కూలు తోటి విద్యార్థుల పేర్లను మరో మారు జ్ఞాపకం చేసు కోండి. ఈ వ్యాయామం మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఏదెైనా ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా కాఫీ బ్రేక్‌లో చేయవచ్చు.
* విచక్షణ మనం విచక్షణగా వ్యవహరించి బ్రెయిన్‌కు వ్యాయామం కల్పించాలి. చాలాసార్లు మనం మనకు తెలియ కుండానే నిచక్షణ చూపుతాం. కనుక ప్రతి పని మీరు కొంత లాజిక్‌తో చేయాలి. అందుకుగాను, కొంత రాజకీయాల వంటివి పట్టించుకోవాలి. వాటిపై చర్చలు చేయాలి. నిర్ణయాలకు రావాలి. ఇప్పుడు మీ మెదడు పదును ఎక్కినట్లే.
* శ్రద్ధ పెట్టటం గతంలో మీరు మీ స్కూల్ టీచర్‌కు తరగతి గదిలో చూపిన శ్రద్ధ నేడు ఆఫీసులో చూపుతున్నారా? చూప లేరు. వయసుతో పాటు మీకు శ్రద్ధ కూడా తగ్గుతుంది. ఆందోళనగా ఉంటారు. మీ శ్రద్ధను మెరుగుపరచటానికి గాను కొంచెంద బాధాకర వ్యాయామం చేయాలి. ఆఫీస్‌లో బాగా మాట్లాడే కొలీగ్‌ను ఎంచుకోండి. అతను ఏ చెత్తవిషయాలు మాట్లాడి నా శ్రద్ధగా వినండి. అది మీలోని శ్రద్ధను మెరుగుప రుస్తుంది.
* పజిల్స్ చేయటం ఈ పని పిల్లలదనుకుంటాం. కానీ పిక్చ ర్ పజిల్స్, సుడోకు వంటివి ఓదడుకు మంచి వ్యాయామం. లేదంటే, బజారులో తిరిగేటప్పుడు దుకాణాల బోర్డులు చదవం డి. వాటిని మరల అదే వరసలో గుర్తు చేసుకోండి.
* భాషాపర వెైపుణ్యం మెదడు వ్యాయామాలలో బ్రెయిన్‌కి కొత్త భాషను నేర్పించటం మంచి వ్యాయామం. కనుక ఇప్పటి వరకూ మీకు తెలియని భాష ఒకటి సాధన చేయండి. మార్గ దర్శకంగా అది బాగా వచ్చినవారిని ఒకరిని ఎంచుకోండి. వారితో మాట్లాడటం సాధన చేస్తే మీ మెమొరీ మెరుగు వుతుంది. బ్రెయిన్‌కు మంచి వ్యాయామంగా ఉంటుంది.
ఈ మెదడు వ్యాయామలు మిమ్మల్ని రోజువారీ జీవితంలో ఎఞతో చురుకుగా ఉండేలా చేస్తాయి. కనుక నేటి నుండే మీ మెదడుకు పని కల్పించండి. తెలివైన వారుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి.
- Courtesy with : డాక్టర్ నవీన్ కుమార్ వెనిగళ్ళ- న్యూరాలజిస్ట్, గ్లోబల్ హాస్పిటల్,-- లక్డీకపూల్, హైదరాబాద్.
- ===========================
సర్, కొన్ని రోజులుగా మీ ఈ బ్లాగ్ ని చూస్తున్నాను. మాములు జనాలకి తెలియని చాలా విషయాలు చెపుతున్నారు, పిల్లల నుండి పెద్దల వరకు , పురుషులకి స్త్రీలకి , అందరికి సంబందించిన వ్యాదులు, జాగ్రత్తలు, చికిత్సలు, ఆధునిక వైద్య చికిత్స విదానలు ఇలా ఎన్నో విషయాలని చెప్పడానికి మీ అమూల్యమయిన సమయం కేటాయిస్తున్నందుకు ధన్యవాదాలు.
ReplyDeleteThere is a research in India on Alzheimer disease the company name is Suven Life Sciences Ltd the only company in the world (www.suven.com/) it is a hyderabad based company.
ReplyDeleteThere is a company on Alzheimer disease research in world the company name is suven life sciences ltd www.suven.com/ this is a hyderabad based comany.
ReplyDelete