ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Non-Alcoholic fatyliver disease,నాన్-ఆల్కాహాలిక్ ఫ్యాటీలివర్ డిసీజ్,Nonalcoholic steatohepatitis(NASH)
- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
కాలేయంలో కొవ్వు పేరుకు పోయినప్పుడు వచ్చే వ్యాధుల్ని సకాలంలో గుర్తించి చికిత్స చేయించుకోకుంటే రక్తపోటు తదితర వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అధిక స్థాయిలో మద్యం సేవించే వారిలో కాలేయంపై ప్రభావం ఎక్కువగా పడి ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తున్నట్లు వైద్య పరిశోధనల్లో తేలింది. ఇది మరింత విస్తృతమైనప్పుడు నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటీస్ (ఎన్.ఎ. ఎస్.హెచ్.డి) వ్యాధిగా మారు తున్నట్లు నిపుణులు చెప్తారు. ఈవ్యాధి అత్యంత తీవ్రమైన రూపంగా మారు తున్నా నిపుణులు చేస్తున్న ప్రయోగాలలో వ్యాధి కారకాలు తెలియక పోవ టం తో... దీనిని అంతుచిక్కని, ప్రాణాంతక కాలేయ వ్యాధిగా గుర్తిస్తున్నారు.
వ్యాధి లక్షణాలు
నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటీస్ వ్యాధి బారిన పడిన వారిలో ప్రధానంగా ఆయాసం, శారీరక అనారోగ్యం, కుడివైపు - ఎగువు- ఉదరం వద్ద అసౌక ర్యంగా ఉంటుంది. ముత్త్తు పానీయాలకు అలవాటు పడిన ఎక్కువ మందిలో పాక్షిక కామెర్ల వ్యాధి వచ్చి క్రమంగా ఎన్.ఎ.ఎఫ్.ఎల్.డి గా రూపాంతరం చెందుతుంది. వీరిలో (స్థూలకాయం, కంబైన్డ్ హైపర్ లిపిడెమియో, మధుమేహం(రకం2)మరియు అధిక రక్తపోటు వ్యాధులకూ దారితీసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ లక్షణాలతో బాధ పడే వారు కాలేయ పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్థారించుకోవాల్సి ఉంటుంది. అలాగని ఇష్టాను సారం మందులు వాడినా ప్రమాదమే... వైద్యుల సలహా మీదే మందులు వాడాలి... ఎందుకంటే ఒక్కోసారి మందులతో కూడా...ఈవ్యాధి వచ్చే అవకాశాలున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం గమనార్హం.
రోగ నిర్ధారణ ఇలా...
కాలేయంలో ఉండే వివిధ రకాల ఎంజైమ్‌లలో ఏర్పడే అసమతౌల్యం కారణంగానే వచ్చే దానిని గుర్తించబడు తుంది. కడుపులో వచ్చే తీవ్ర మంటలు కారణంగా ఫైబ్రోసిన్ తీవ్రత ని అంచనా వేస్తారు. ఇందుకోసం కణజాల పరీక్షను చేయాల్సి ఉంటుంది. ఇందులో కాలేయ ఫైబ్రోసిస్‌ను, స్టీటోసిస్‌ను అంచనా వేసేందుకు స్టీటోటెస్ట్ (చర్మానికి రంధ్రం చేయకుండా చేసే చిన్న పాటి పరీక్ష) ద్వారా ఈ రోగ నిర్ధారణ చేయవచ్చని ఇటీవలే నిపుణులు వెల్లడించారు. అయితే ఈ పరీక్షా పద్ధతులు విస్తృత ఆమోదం పొందల్సివుంది.
ఇక హెపటోసైట్ నిర్మూలనలో భాగంగా నిర్వహించే అపోప్టోసిస్ పరీక్షలలో సైతం ఈవ్యాధి బయటపడుతున్నట్లు కొందరు నిపునులు చెప్తుండగా.... ఎరైథ్రోసైట్ అవక్షేప రేటు, శ్వేతకం (అల్బుమిన్) మరియు మూత్రపిండ పనితీరుని గుర్తించే క్రమంలో చేసే రక్త పరీక్షల్లో సైతం ఈ రోగాన్ని గుర్తించ వచ్చది మరికొందరు చెప్తున్నారు. మానవ శరీరంలో ప్రోటీన్‌లను తయారు చేయడంలో కాలేయం కీలకం కావటంతో ఆ దిశగా కూడా వ్యాధిని గుర్తించేందుకు అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇదికాక..ఇంటర్నేషనల్ నార్మలైజ్డ్ రేషియో రక్త పరీక్షలు (సెరాల జీ), హెపటైటిస్ ఎ,బి,సి, ఇబివి, సిఎమ్‌వి మరియు హెర్పెస్ వైరస్‌ల రుబెల్లా తదితరాలు తెలుసుకునే క్రమంలో చేసే రక్త్త పరీక్షలో , థైరాయిడ్ పరీక్షలు చేయించుకొంటున్న వారిలో టి.యస్.హెచ్ గుర్తించడం ద్వారా ఎన్.ఎ. యస్.హెచ్ ని నిర్దారిస్తారు.
కాలేయంలో కొవ్వు బాగా పేరుకుపోవడంతో కడుపులో తీవ్రమంటగా అనిపిస్తే.. దీనిని ఎన్.ఎ.యస్.,హెచ్ గా పిలుస్తారు. సగటున 20 శాతం మందిలో ఎన్..ఎ.యస్.హెచ్ కనిపిస్తోంది. అయితే ఇంత వరకూ వైద్య శాస్త్రవేత్తలు ఎన్ని నిర్థారణ పరీక్షలు నిర్వహించినా... ఎన్.ఎ.ఎల్.డి రావటానికి ఇదీ ఖచ్చితమైన కారణంగా ఇప్పటికీ గుర్తించలేక పోవటం ఆందోళన కరమే...
బరువూ వ్యాధి లక్షణమే....
అధిక బరువు ఉన్న వారిలో సైతం ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇందుకు ఫ్యాటీ లివర్ వ్యాధి పరీక్షలు చేసుకోవటం ద్వారా ఈ వ్యాధి నిర్థారన చేసుకోవచ్చు. కేవలం బరువు ఎక్కువగా ఉన్న వారినే కాదు బరువు తక్కువగా ఉన్న వారిలోనూ ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆహార నియమాలలో మార్పులు చేసుకుంటూ... పౌష్టికాహారాన్ని తీసుకుంటే వ్యాధిని తగ్గించుకోవచ్చు. కొంతమందిలో పుట్టుకతోనే ఈవ్యాధి లక్షణా లు కనిపించవచ్చు. అలాగే తమ కుటుంబంలో కాలేయం వ్యాధి తరతరాలు గా వస్తున్నా... ఈ వ్యాధి లక్షణాలు కనిపించే ఆస్కారం ఉంది. అవయవాల్లో అసాధారణ పరిస్థితులు ఏర్పడినా... ఫైబ్రోసిస్(cirrhosis) లేదా సిర్హోసిస్ లక్షణాలతో బాధపడుతున్నా.... ఈ వ్యాధి ఉన్నదీ లేనిదీ నిర్థారించుకునేందుకు ఖచ్చితం గా వైద్య పరీక్షలు చేసుకోవాల్సిందే.
చికిత్స:
ఎన్.ఎ.ఎఫ్.ఎల్.డి కి సంబంధించిన అనేక చికిత్సలపై అధ్యయ నాలు జరు గుతున్నాయి. అలనైన్ ట్రాన్సామానాస్ తదితర చికిత్సలు తోడ్పడు తున్నా.. కణజాల అసాధారణతలను తొలగించడం ద్వారా రోగ అంత్య స్థాయిలను తగ్గించడానికి ఈ చికిత్సలు సరిపోవ టంలేదన్నది నిపుణుల మాట.
శరీర బరువుకు చికిత్స:
క్రమ పద్దతితో బరువు తగ్గడం ద్వారా సూలకాయం తగ్గటం ద్వారా రోగుల్లో పరిస్థితిని మెరుగుపర్చుడమేకాక అయితే బరువు తగ్గాలన్న తాపత్రయంతో శరీరంపై వత్తిడి చేయటం, భోజనాదులు మానేయటం చేస్తే అది ఎన్.ఎ.ఎఫ్.ఎల్.డి వ్యాధిని మరింత తీవ్రంచేస్తుందని గమనించడండి. ఓ పద్దతి ప్రకారం శరీరాన్ని తగ్గించుకున్న వారిలో అంతర్లీనంగా వ్యాధి ఉన్నప్పటికీ అది తీవ్రరూపం దాల్చ కుండా ఉన్నట్లు పలు అధ్యయనలు నిర్థారించాయి కూడా .
కాగా ఇటీవల జరిగిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ లివర్ డిసీజ్‌న్ వార్షిక సమావేశంలో ప్రవేశపెట్టి నివేదిక వివరాలు ప్రకారం చూస్తే.... బరువు తగ్గించేందుకు ఇష్టను సారంగా శస్త్రచికిత్స చేయించుకొంటున్న రోగుల్లో అధిక శాతం మందిలో ఈ వ్యాధి అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పి పరిస్థితి ని వివరించాయి.
ఈ మందులు వాడకూడదు :
అమియోడారోన్, యాంటీవైరల్ డ్రగ్స్ (న్యూక్లియోసైడ్ అన లాగ్‌లు), ఆస్పిరిన్ అరుదుగా పిల్లల్లో రెయెస్ సిండ్రోమ్‌లో భాగంగా ఉంటుంది, కార్టికోస్టెరాయిడ్‌లు, మెథోట్రెక్సేజ్, టామో క్సిఫెన్, టెట్రాసైక్లిన్. ఇలాంటి ఔషధలు వారిలోను ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వీటితో కాసింత ప్రయోజనం
ఇన్సులిన్ సెన్సిటైజెర్‌లు, యుర్సోడియోక్సీకొలిక్ యాసిడ్ మరియు లిపిడ్- తగ్గించే జౌషదాలు, ఎన్.ఎ.ఎఫ్.ఎల్.డి వ్యాధిని తగ్గించడంలో కొంత మేరకు సహకరిస్తున్నాయని... అయితే వైద్య సలహాలు లేనిది ఈ వ్యాధి నివారణకోసం ఎలాంటి మందులు ఇష్టాను సారం వాడరాదన్నది నిపుణుల హెచ్చరిక.
డా|| రవీంద్రనాధ్-చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్-గ్లోబల్ హాస్పిటల్-సర్జికల్ గాస్ట్రో ఎంటి రాలజి స్ట్, లక్డీ కపూల్, హైదరాబాద్
- ======================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.