ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Burning in the Chest Why?,ఛాతీలో మంట ఎందుకు?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ఛాతీలో మంట. చాలామంది దీని గురించి అంతగా పట్టించుకోరు గానీ.. కొందరిని మాత్రం ఇది తెగ ఇబ్బంది పెడుతుంటుంది. రకరకాల చిట్కాలతో అప్పటికప్పుడు ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తుంటారు కూడా. నిజానికి ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి దోహదం చేసే అంశాలేంటి? వీటిని తెలుసుకుంటే ఛాతీమంట తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చు.
సాధారణంగా మనం భోజనం చేసినపుడు అది ఆహారనాళం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఈ జీర్ణాశయానికీ ఆహారనా'ళానికీ మధ్య బిగుతైన కండర వలయం (స్పింక్టర్) ఉంటుంది. ఇది తలుపులా తెరచుకుంటూ జీర్ణాశయంలోకి ఆహారం వెళ్లేలా చేసి, వెంటనే మూసుకుపోతుంటుంది. దీనివల్ల తిన్న ఆహారం తిరిగి ఆహారనాళంలోకి రాకుండా జీర్ణాశయంలోని ఆమ్లాల్లోనే ఉండిపోయి, జీర్ణమవుతుంది. అయితే ఒకవేళ ఈ కండరవలయం పూర్తిగా మూసుకోకపోతే జీర్ణాశయంలోని ఆమ్లాలు పైకి ఎగదన్నుకు వస్తాయి. దీన్నే రిఫ్లక్స్ అంటారు. ఇవి ఆహారనాళం లోపలిగోడలను చికాకు పరచి, నొప్పితో కూడిన మంట రావటానికి కారణమవుతాయి. కిందికి వంగినపుడు, పడుకున్నప్పుడు ఈ మంట, బాధ మరింత ఎక్కువవుతాయి కూడా. టమోటా ఉత్పత్తులు, మద్యం, కాఫీతో పాటు పుల్లటి, మసాలా, కొవ్వు పదార్థాలు కూడా కండరవలయానికి ఇబ్బంది కలిగిస్తాయి. ఫలితంగా ఛాతీలో మంట సమస్య గలవారికి ఆ బాధ మరింత ఎక్కువవుతుంది. అధికబరువు, కడుపునిండా తినటం, నడుము వద్ద గట్టిగా పట్టి ఉంచే బిగుతైన దుస్తులు ధరించటం, పొగ తాగటం కూడా ఛాతీలో మంట ముప్పు పెరిగేలా చేస్తాయి. కాబట్టి మంట ఎక్కువ కావటానికి దోహదం చేస్తున్న అంశాలకు దూరంగా ఉండటంతో పాటు తగు చికిత్స తీసుకోవటం తప్పనిసరి. లేకపోతే ఇది మరింత ముదిరి, ఇతరత్రా సమస్యలకు దారితీయొచ్చు.
- =========================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.