Sunday, August 25, 2013

Liver problems awareness-కాలేయ సమస్యల అవగాహన






ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Liver problems awareness-కాలేయ సమస్యల అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ప్రపంచ వ్యాప్తంగా కాలేయ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. అసహాజ ఆహారపు అలవాట్లు, జీవిన విధానం మరింతగా కాలేయ సమస్యలను జటిలం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఆరోగ్య సమస్య గా మారిపోయింది. సరైన అవగాహన లేకపోవడం వలన వ్యాధి మరింత ముదిరి ప్రాణం మిదకు తెచ్చుకుంటున్నారు. మరీ దీనికి పరిష్కారం ఏమిటి ? కాలేయ సమస్యలకు జీవితం బలి కావల్సిందేనా? ఇలాంటి ఎన్నో సమస్యలకు  చికిత్సతో నమ్మకమైన పరిష్కారం ఉందంటుంది .

జీవన క్రీయలో కాలేయం పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. కడుపులో ముదురు ఎరుపు రంగులో ఉండి, మెత్తగా ఉండి, కడుపులో కుడి భాగాన ఉదార విధానం కింద ఉంటుంది. కాలేయానికి రెండూ లోబ్స్‌ ఉంటాయి. వీటిలో నాలుగేసి విభాగాలుంటాయి. వీటిని సెగ్మెంట్స్‌ అంటారు. కాలేయంలో ప్రతి సెగ్మెంట్‌కు రక్త ప్రసరణ చేసి, తిరిగి వెనక్కు తెచ్చే నాళాలుంటాయి. కాలేయాలు మూడవ వంతు ఆరోగ్యంగా ఉన్నా ఆది చేసే పనులన్ని చేయగలుగుతుంది. కాలేయం చేసే పనులు చాలా ఉన్నాయి. రక్తంలోని విష పదార్ధాలను తొలగిస్తుంది. జీర్ణమైన ఆహారంలోని పోషకాలను స్వీకరిస్తుంది. కాలేయం సెక్యూరిటీ గార్డులాగా పని చేసి మనలను కాపాడుతుంది. కాలేయంలో 70 శాతం దెబ్బతిన్న మిగిలిన అన్ని పనులను నిర్వర్తించగలుగుతుంది. కాలేయ సమస్యలతో ముందుగా చెప్పుకోవలసింది హెపటైటిస్‌-బి,  హెపటైటిస్‌-సి, క్రానీక్‌ వైరల్‌ హెపటైటిస్‌, అల్కహాలిక్‌ హెపటైటిస్‌.

వైరల్‌ హెపటైటిస్‌
వైరస్‌లు కాలేయంలో చేరి కాలేయాన్ని పాడు చేస్తాయి. దీని వలన కొన్ని కణాలు చనిపోవడం వలన హెపటైటిస్‌ వస్తుంది. ముందు సామాన్య లక్షణాలుగా కనబడి తరువాత క్రానిక్‌గా మారి ప్రాణాంతకంగా మారుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అంటువ్యాధి. ఒకరి నుంచి మరొకరికిసునాయసంగా వ్యాపిస్తుంది. ఒక్కొక్క రకం వైరస్‌ వలన వచ్చే హెపటైటిస్‌ ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తారు. ఈ వైరస్‌లను హెపటో ట్రోఫిక్‌ వైరస్‌ అంటారక్‌ వీటిలో హెపటైటిస్‌-ఎ,హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సి,హెపటైటిస్‌-ఇ , మొదలైనవి దీర్ఘకాలికంగా మారి క్యాన్సర్‌, లివర్‌ సిర్రోసిస్‌, అసైటిస్‌ రావటానికి ప్రధాన కారణం అవుతాయి.

హెపటైటిస్‌ సి
హెపటైటిస్‌ సి భారతదేశంలో దాదాపు 14 మిలియన్ల మందిని బాధిస్తున్నది. ప్రతి సంవత్సరం దాదాపు 35,000 వేల కేసులు ఉంటున్నాయి.ఈ వ్యాధి వలన 8000 వేల నుంచి 10,000 వేల మంది దాకా చనిపోతున్నారు. 85 శాతం కేసులో మొండిగా మారి ఇబ్బంది పడుతున్నారు. హెపటైటిస్‌ సి వలన కొంత కాలేయం పాడైపోవడం వలన ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. దీర్ఘకాలిక హెపటైటిస్‌ సి ఇతరులకు సంక్రమింప చేయగలదు. కాలేయం పాడైపోతుంది.

ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌
మద్యం అలవాటు ఉన్నవారికి ఇది కనబడుతుంది. అలవాటు వలన కాలేయం పాడైపోతుంది. అతిగా మద్యం సేవించడం వలన శరీరానికి పోషకాలు అందక పోవడం, బరువు తగ్గడం, కాలేయం దెబ్బతినడం, రోగ నీరోదక శక్తి తగ్గిపోవడం, గుండెల్లో మంట, పుల్లటి త్రేన్పులు, పాంక్రియాస్‌ దెబ్బతినడం వంటి లక్షణాలు కనబడుతుంటాయి.

ఫాటీ లివర్‌
కాలేయంలోని కణాల స్థానంలో కొవ్వు పేరుకోవడాన్ని ఫాటీ లివర్‌ అంటారు. మద్యం తీసుకునే వారిలో ఇది ఎక్కువగా కనబడుతుంది. క్రమంగా కాలేయం ఉబుతుంది. కడుపులో నొప్పి, ముఖంపైన, బుగ్గలపైన మచ్చలు కనిపిస్తుంటాయి.

 చికిత్స--కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది .

లక్షణాలు
అమితమైన నీరసం, విపరీతమైన ఆలసట, జ్వరం, తలనొప్పి, ఆకలి మందగించడం, ఆకలి తగ్గడం, వికారం, కుడివైపున డొక్కలోనొప్పి, తరుచుగా విరేచనాలు, బరువు తగ్గడం, మూత్రం పసుపు పచ్చగా, కొన్నిసార్లు ఎరుపు రంగులో ఉంటుంది. కండరాల నోప్పులు, కీళ్ల నోప్పులు, చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి.

జాగ్రత్తలు

    మద్యం తాగడం మానివేయాలి.
    అసురక్షిత లైంగిక సంపర్కం కూడరాదు.
    రేజర్స్‌, టూత్‌బ్రష్‌, నెయిల్‌ కట్టర్స్‌ లాంటి వస్తువులు మరొకరితో పంచుకోరాదు.
    మానసిక ఒత్తిడిని తొలగించుకోవాలి.

  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

1 comment:

Your comment is very important to improve the Web blog.