Thursday, June 18, 2009

దగ్గు , Cough

  • దగ్గు.నిర్వచనం :

శ్వాస మార్గం ద్వారా ఏవైనా అవాంఛిత పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు (Cough). ఒంట్లో తలెత్తిన మరేదో సమస్యకు దగ్గు ఓ లక్షణం మాత్రమే. శరీరం మొత్తాన్ని అతలాకుతలం చేసే దగ్గు అయితే దాన్ని ఎలాగైనా తగ్గించెయ్యాలని నానా తంటాలూ పడటం సరికాదు. ఎందుకంటే దగ్గు అనేది మన ఊపిరితిత్తులకు మంచి రక్షణ లాంటిది.

అందుకే దగ్గు వీడకుండా వేధిస్తున్నప్పుడు దుగ్గు మందు తాగేసి, దాన్ని అణిచివెయ్యాలని ప్రయత్నించకుండా అసలు దగ్గుకు కారణం ఏమిటన్నది తెలుసుకుని, దానికి చికిత్స తీసుకోవటం శ్రేయస్కరం. చాలా దగ్గు ముందులు తాత్కాలికంగా దగ్గును అణిచివేస్తాయిగానీ లోపల అసలు సమస్య అలాగే ఉండి, అది మరింత ముదురుతుంటుంది. కోన్ని భయకరమైన ఊపిరితిత్తుల జబ్బులు బాగా ముదిరి ప్రాణాలు పోయే ప్రమాధము కలుగవచును.

దగ్గు రకాలు--

Coughing
Coughing
  • 1. కఫం లేని పొడి దగ్గు:
  • 2. మామూలు కఫంతో కూడిన దగ్గు:
  • 3. రక్త కఫంతో కూడిన దగ్గు:

కారణాలు

  • చాలా రకాల ఊపిరితిత్తుల సమస్యల్లో దగ్గు ప్రాథమిక లక్షణం. దీనిక్కారణం ఊపిరితిత్తుల్లో పేరుకుపోయే రకరకాల స్రావాల్ని బయటకు పంపించేందుకు దగ్గు సహకరిస్తుంది.
  • గాలిలోని రకరకాల కాలుష్యాలను, విషతుల్యాలను లోపలికి పీల్చినప్పుడు కూడా దగ్గు మొదలై, వాటిని బలంగా బయటకు తోసేస్తుంది. సిగరెట్‌ పొగ, దుమ్ము, పుప్పొడి, రసాయనాలు ఇలా చాలా పదార్ధాలు శ్వాస ద్వారా లోపలికి చేరినప్పుడు, వీటిని బయటకు పంపించేసేందుకు మన ఊపిరితిత్తులు దగ్గు రూపంలో వేగంగా స్పందిస్తాయి.
  • ఇక ముక్కుల్లో ఇన్‌ఫెక్షన్‌, అలర్జీ, సైనుసైటిస్‌, గొంతు నొప్పి, కొన్ని రకాల గుండె జబ్బులు, వీటన్నింటిలో కూడా దగ్గు రావచ్చు.
  • ఊపిరి తిత్తుల జబ్బు అయిన - tracheobronchitis, pneumonia, pertussis and tuberculosis లలో దగ్గు వచ్ఛును ఇవి చాలా ప్రమాదమయినవి.
  • మనిషి దగ్గటానికి మానసిక కారణాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు కొందరు సభల్లో మాట్లాడటానికి ముందు దగ్గి గొంతు సవరించుకొంటారు.

ఛికిత్స :

సాదారణము గా దగ్గు తో భాధ పడేవారు దగ్గును అణిఛివేయడానికి ప్రయత్ణించ కుండా వైద్య సలహాతీసుకొని తగిన మందులు వాడడం మంచిది. తాత్కాలికము గా .. ఈ క్రింది సిరప్-లు వాడవచును.

దగ్గు మందుల్లో రకాలు-

Cough Syrup
Cough Syrup

దగ్గు తగ్గేందుకు వాడే సిరప్‌లను 'యాంటీ టస్సివ్స్‌' అంటారు. వీటిలో ఒకో మందు ఒకో రకంగా పని చేస్తుంది.

గొంతులో పని చేసేవి--Lozenges

ఇవి గొంతులో చికాకు, పట్టేసినట్టుగా అనిపించటం, శ్వాస ఇబ్బంది వంటి బాధలను తగ్గిస్తాయి. పైగా లాలాజలం ఎక్కువ తయారయ్యేలా ప్రేరేపించటం ద్వారా గొంతులో హాయిగా ఉండేలా చేస్తాయి. దీంతో దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. మార్కెట్లో దొరికే రకరకాల 'లింక్టస్‌' రకం మందులు ఇవే.--Grilinctus lozenges , charana cough drops, vicks , etc.

కఫం తోడేసేవి-cough expectorants.

కఫం చిక్కగా వస్తున్నప్పుడు ఈ రకం మందుల్ని వాడతారు. ఇవి శ్వాస నాళాల్లో స్రావాలను పెంచుతాయి. దీంతో చిక్కటి కఫం కాస్తా.. పల్చబడి, త్వరగా బయటకు వెళ్లి పోతుంది. పొటాసియం సిట్రేట్‌ వంటివి ఈ రకం మందులు.--

Ascoril , Avil expectorant , Deletus-p ...మున్నగునవి.

దగ్గును అణచివేసేవి-cough supressants .

ఇవి కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసి, ఒంట్లో దగ్గుకు సంబంధించిన సహజ స్పందనలనే అణిచివేస్తాయి. పొడి దగ్గు తగ్గేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. కఫం వస్తుంటే మాత్రం వీటితో ఉపయోగం ఉండదు, పైగా కఫం లోపలే పేరుకుపోయి నష్టం కూడా జరుగుతుంది. బయట దొరికే 'కోడీన్‌' రకం మందులన్నీ ఇవే.--

Corex Dx , Sirircodin-D , Cosome , Tossex , Codistar , మున్నగునవి .

మ్యూకోలైటిస్‌-- mucolytics.

ఈ మందులు చిక్కని కళ్లెను పల్చన చేస్తాయి. దీంతో దగ్గినప్పుడల్లా కళ్లె బయటకు వెళ్లిపోతుంది.--

Tossex-Br , Alpha Zedex , Mucomix , మున్నగునవి .

దగ్గు మందులతో జాగ్రత్తలు

  • దగ్గును అణిచివేసే మందులు నాడీ వ్యవస్థ మీద పని చేసి మలబద్ధకం మొదలవ్వచ్చు.
  • కొన్ని దగ్గు మందులతో మగత, అలసట వంటి సమస్యలు రావచ్చు.కొన్ని దగ్గుమందులు తీసుకున్న తర్వాత మత్తుగా అనిపించవచ్చు. కాబట్టి వీటిని అందరూ, ఎప్పుడుబడితే అప్పుడు వాడెయ్యటం అంత మంచిది కాదు. ముఖ్యంగా డ్రైవింగ్‌ చేసేవాళ్లు వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
  • కఫం వస్తుంటే వైద్యుల సలహా మేరకే దగ్గు మందులు వాడాలి.
  • దగ్గు విషయంలో మార్కెట్లో దొరికే సిరప్‌ల కంటే ఇంటి చిట్కాలే మేలు.
  • దగ్గుకు నీరు మంచి మందు. నీళ్లు ఎక్కువగా తాగితే కఫం త్వరగా పల్చబడి బయటకు వెళ్లిపోతుంది. నీరు తాగటం వల్ల కఫాన్ని తేలిగ్గా తోడెయ్యవచ్చు.
  • అలర్జీ కారణంగా దగ్గు వస్తున్నవాళ్లు చల్లగాలిలోకి వెళ్లకపోవటం, రోజూ ఆవిరి పట్టటం మంచిది.
  • వారాల తరబడి కఫం-దగ్గు తగ్గకపోతే ఒక్కసారి కళ్లె పరీక్ష చేయించుకోవటం మంచిది.

-----------------------------------

*వ్రాసిన వారు - డా.శేషగిరిరావు- యం.బి.బి.యస్*

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.