Friday, June 26, 2009

దంతాల చిగుళ్ళు వాపు , Gingivitis


చిగుళ్ళు వాపునకు గురి కావడాన్ని వైద్య పరిభాషలో జింజివైటిస్ అంటారు . బాక్టీరియా కారణం గా చిగుళ్ళు దెబ్బ తనడం ద్వారా ఈ వ్యాధి ఏర్పడుతుంది .
చిగుళ్ళకు దంతాలకు మధ్య ఉండే సన్నని ఖాళీ స్థలాల్లో ఆహారపు తునకలు పేరుకు పోవడం , దంతాలపై పాచి (Tartar )ఏర్పడటం ద్వార అక్కడ బాక్టీరియా చేరుతుంది . దంతాలపైన సందుల్లో నిలువ ఉండే పదార్దాలు అతి సుక్ష్మమైన పరిమాణం లో ఉన్నప్పటి కీ వాటిలోకి బాక్టీరియా చేరి రసాయనాలను , విషపదర్దాలను ఉత్పత్తి చేస్తాయి ... ఫలితం గా అ దంతాల చుట్టూ ఉన చిగురుభాగం ఎర్రగా కండి , వాపు ఏర్పడుతుంది . ఈ స్థితిని 'ఇన్ఫ్లమేషన్ 'అని వ్యవహరిస్తారు . ఈ ఇంఫమేషన్ దీర్ఘకాలం పటు కొనసాగితే దవడ ఎముక దెబ్బతిని దంతాలు వదులు గా తయారై వుడిపోయే ప్రమాదం ఉంది. తరువాత " నేక్రోతిజిన్ అల్సిరేటివ్ జింజివైటిస్ "మారే ప్రమాదం ఉంది . కొంతకాలనికు " Peridontitis " (దంతాల చుట్టూ దంతాలకు ఆధారం గా ఉండే కణజాలం (peridontium) - వ్యాధిగ్రస్తం అయి పళ్ళు వుడిపోతాయి .

చిగుళ్ళ వ్యాధి లక్షణాలు : (Symptoms)
 • నోటినుండి దుర్వాసన ,
 • చిగుళ్ళ నొప్పి,
 • చిగుళ్ళ నుండి రక్తం కారడం ,
 • పళ్ళు వుడిపోవడం ,
చిగుళ్ళ వ్యాధికి దోహదం చేసే అంశాలు :
 • గర్భధారణ ,
 • మదుమేహం ,
 • ఎక్కువకాలం కొన్ని మందులు వాడడం - ఉదా: సంతాన నిరోధక మాత్రలు ,రక్తపోటు తగ్గించే కొన్ని మాత్రలు ,
 • పౌస్తికహర లోపము ,
 • దంతాల శుభ్రం చేసుకోవడం లో అవగాహనా లోపము ,
ప్రధమ చికిస్థ :
 • దంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం ,
 • దంత వైద్యుల తో దంతాల పైన ఏర్పడిన పాచిని తొలగించుకోవడం (స్కేలింగ్)
 • భోజనం తరువాత నోరు బాగా కడుక్కోవాలి. రాత్రి పడుకునే ముందు .. దంత దావం చేస్తే మంచిది.
 • మౌత్ వాష్ లోషన్ తో నోరుని పుక్కలించాలి .
 • విటమిన్ సి .ఉన్నా ఆహారము గాని , మాత్రలు గాని తీసుకోవాలి .
వాడవలసిన మందులు --
 • tab. Ciprodex-TZ మాత్రలు పెద్దవరికైతే రోజుకి రెండు -- 5 రోజులు వాడాలి.
 • tab. Becozyme C forte .. రోజుకి రెండు - 10 రోజులు వాడాలి.
 • Betadin mouth wash -- రెండు పూటలా పుక్కలించాలి ,
 • ఎవైనా మాత్రలు ముందుగా వాడుతున్నట్లయితే డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవాలి.
 • 10 రోజుల్లో తగ్గక పొతే దంత వైద్యుని కలవాలి .

పెరియోడాంటైటిస్‌
దంతాలకు ఆధారంగా దంతాల చుట్టూ ఉండే కణజాలం (పెరియోడాం టియమ్‌) వ్యాధిగ్రస్తం కావడాన్ని పెరియోడాంటైటిస్‌ అంటారు. ఈ వ్యాధిని గతంలో పయోరియా ఆల్వియోలారిస్‌ అనేవారు. కొన్ని రకాల ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులు కలిసికట్టుగా దంతాల చుట్టూ ఉండే కణజాలాన్ని నాశనం చేయడం ఆధారంగా దీనిని పయోరియా ఆల్వియోలారిస్‌ అనేవారు.

పెరియోడాంటైటిస్‌లో దంతం అమరిఉన్న ఎముక క్రమంగా దెబ్బ తింటూ, దంతం వదులుగా కావడానికి, తగిన చికిత్స తీసుకోని పక్షంలో దంతం ఊడిపోవడానికి కారణమవుతుంది పెరియోడాంటైటిస్‌ దంతాలను అతుక్కుని పెరిగే బాక్టీరియా కారణంగా సోకుతుంది. ఈ వ్యాధి అనేకమందిలో కనిపిస్తుం టుంది. దంతాల చుట్టుప్రక్కల భాగాలను పరీక్షించడం ద్వారానూ, ఎక్స్‌రేల ద్వారానూ దంతవైద్యులు ఈ సమస్యను నిర్ధారిస్తారు.

పరిష్కారం

చిగుళ్ల వ్యాధులు, పెరియోడాంటైటిస్‌ వంటి సమస్యలను సరైన సమయంలో కనుగొని చికిత్స తీసుకోని పక్షంలో దంత క్షయం, దంతాలు ఊడిపోవడం వంటి ఇక్కట్లను ఎదుర్కొనాల్సి వస్తుంది. దంతాల చుట్టూ చేరే బాక్టీరియాను తొలగించడానికి ప్రస్తుతం అందు బాటులోకి వచ్చిన నూతన చికిత్సా విధానం ఎయిర్‌ఫ్లో విధానం. దీనిలో ఒక సాధనాన్ని చికిత్స చేయాల్సిన భాగంలోకి అమర్చి దంతాలపై పేరుకున్న పాచి వంటి వాటిని స్కేలింగ్‌ పద్ధతిలో శుభ్రం చేస్తారు. తరువాత అతి తక్కువ ఒత్తిడితో గాలిని, నీటిని, శుభ్రం చేయడానికి ఉపయోగించే ఔషధాన్ని పంపు తారు. ఈ సాధనం ద్వారా దంతాలను శుభ్రం చేయడమే కాకుండా, చిగుళ్లను మెత్తగా మసాజ్‌ చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియ దంత సంరక్షణలో మరింత ఆశావహ ఫలితాలను ఇస్తుంది.

Updates :


చిగుళ్లవ్యాధి.. చేపనూనె రక్ష
వాపుతో పాటు తీవ్రమైన నొప్పితో వేధించే చిగుళ్లవ్యాధి బారిన పడకూడదని కోరుకుంటున్నారా? అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపల వంటివి తీసుకోండి. ఎందుకంటే ఇవి తరచుగా తీసుకుంటున్నవారిలో చిగుళ్లవ్యాధి వచ్చే అవకాశం 23-30 శాతం తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ యాసిడ్లలో ముఖ్యంగా డీహెచ్‌ఏ, ఈపీఏ చిగుళ్లవ్యాధిని సమర్థంగా అడ్డుకుంటున్నాయని తేలింది. చేపల్లో సార్త్డెన్స్‌, మాకెరెల్‌, స్వార్డ్‌ఫిష్‌లతో పాటు అవిసె గింజలు (ఫ్లాక్స్‌ సీడ్స్‌), వాల్‌నట్స్‌ల్లోనూ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి.

50-65 వయసువారిలో సుమారు 11 శాతం మంది ఈ చిగుళ్లవ్యాధి బారిన పడుతున్నారని అంచనా. ఇక 75 ఏళ్లు పైబడినవారిలోనైతే 20 శాతం మందికి పైగా దీంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఈ చిగుళ్లవ్యాధి రావటానికి కారణమేంటో తెలుసా? చిగుళ్ల చుట్టూ బ్యాక్టీరియా పేరుకుపోవటమే. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే క్రమంగా చిగుళ్ల కణజాలం తగ్గిపోయి దంతం మధ్య ఖాళీ ఏర్పడుతుంది. దీంతో దంతానికి అవసరమైన దన్ను లేకుండాపోయి బలహీనపడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే దీని నుంచి కాపాడుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. అయితే కచ్చితంగా ఎంత మొత్తంలో చేపనూనె తీసుకోవాల్సి ఉంటుందనేది మాత్రం వివరించలేదు. కానీ వారానికి రెండుసార్లు చేపలను తినటం ఒక్క చిగుళ్ల వ్యాధికే కాదు.. మొత్తం ఆరోగ్యానికీ మేలు చేస్తుందని ఆరోగ్య సంస్థలు నిర్దేశిస్తున్నాయి. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు.. గుండెలయ తప్పటం, గుండెపోటు, పక్షవాతం వంటివి రాకుండా చూస్తాయనీ నిపుణులు ఎప్పట్నుంచో చెబుతున్నారు కూడా.

 • =========================
visit my website : Dr.Seshagirirao.com

1 comment:

Your comment is very important to improve the Web blog.