Tuesday, June 23, 2009

పాదాలు ఎందుకు వాస్తాయి ?,Why do we get edema feet?

=====================================================

శారీరక కణజాలాల్లో ద్రవాంశము సంచితమవడం వల్ల వాపు తయారవుతుంది . వాపు వలన శరీరం బరువు పెరుగుతుంది . ఈ లక్షణాలు కాళ్ళు , పదాలలో ఎక్కువగా కనిపిస్తుంది . అయితే ఉదరభాగం , నడుము , మోచేతులు , ముఖం లో కుడా వాపు కనిపించవచ్చును ... వాపు మరి ఎక్కువగా ఉన్నప్పుడు ఆయాసం రావచ్చును . ఉపిరి తిత్తులలో నీరు చేరి ప్రాణవాయువు మార్పిడి అడ్డుకోవడం కుడా జరుగుతుంది . స్త్రీ పురుషులలో ఇది కనిపించినా ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది .. ఎందుకంటే వాళ్ళలో వచ్చే హార్మోణుల హెచ్చుతగ్గుల వల్ల .

మూత్రపిండాలు శరీరం లోని అదనపు నీటిని , సోడియం అనే పదార్దాన్ని సమర్ధవంతం గా బహిర్గత పర్చలేనప్పుడు వాపు జనిస్తుంది . మూత్రపిండాల వైఫల్యం వంటి వ్యాదులలో ఇలా జరుగుతుంది . మూత్ర పిండాలు వ్యాధిగ్రస్తమవడం వల్ల రక్తం లోని ప్రోటీన్ ముఖ్యం గా 'ఆల్బుమిన్ ' మూత్రం ద్వార అధికం గా తప్పించుకుని పోతుంది .... దాని మూలంగా రక్తంలో ఆల్బుమిన్ గణనీయం గా తగ్గిపోయి ,రక్తం లోని ద్రవంశం పలుచబడి రక్తనాల గోడలనుంచి నీరు కణజాలం మధ్యకు చేరుతుంది . .. దీనితో వాపు వస్తుంది.

కొన్ని వ్యాదులలో ప్రత్యెక లక్షణం గా వాపు కనిపిస్తుంది , కారణాలు --

 • గుండె రక్తాన్ని తోడే శక్తిని కోల్పోయినపుడు ,
 • కాలేయ వ్యాధులు బాగా ముడురినప్పుడు ,
 • శరీరం లో ప్రోటీన్ పదార్ధము తగ్గిపోయినపుడు , రక్తహీనత ఉన్నవారిలో ,
 • మూత్ర పిండాలు వ్యాదిగ్రస్తమైనపుడు ,
 • బాగా ముదిరిన పాండురోగము (gross Anaemia),
 • కాలేయం వ్యాది గ్రస్తమైనపుడు (సిర్రోసిస్ లివర్ )-పొట్టలో నీరు చేరుతుంది ,
 • ఊబకాయము ఉన్నవారు ఎక్కువసమయం నిల్చోని పనిచేస్తే కాళ్ళు వాపులు వస్తాయి(హైపోస్టాటిక్ ఎడీమా అంటారు)
 • రక్తపోటు ఎక్కువగా ఎక్కువకాలము ఉన్నవారిలోనూ కాళ్లు వాపు వస్తుంది .
 • థైరాయిడ్ తక్కువగా పనిచేయడం వల్ల (హైపో థైరాయిడ్) శరీమంతా వాపు కనిపిస్తుంది ,
 • బెరి బెరి అనే వ్యాదిలోను శరీరంతా నీరు చేరుతుంది .-- ఇద్ బి1 విటమిన్‌ లోపము వల్ల వస్తుంది ,
ఇతర కారణాలు :
Eating a poor diet high in salt and carbohydrates
Taking birth control or hormone replacement therapy pills
Pregnancy
PMS
Sodium retention
Muscle injury
Varicose veins
History of phlebitis
Allergic reactions
Preeclampsia
Neuromuscular disorders
Trauma
Laxative abuse
Diuretics abuse
Drug abuse

వాపు అనేది కేవలం కాలు , చెయ్యి వంటి ఏదో ఒక భాగానికే పరిమితమైతే దానిని స్థానిక సమస్యల కారణం గా భావించాలి ,ఉదా : సిరల్లోని రక్తం లో రక్తపు గడ్డలు తయారై రక్త ప్రవాహానికి అడ్డుపడటం , స్థానికంగా రక్తనాళాలకు దెబ్బ తగలడం ,ఫైలేరియా వంటి సందర్భాలలో వాపు శరీరం లో ఒక భాగంలోనే కనిపిస్తుంది , మూత్రపిండాలు, కాలేయం , గుండె సమస్యలలో వాపు శరీరము ఇరువైపులా సరిసమానము గా కనిపిస్తుంది ,.
పాదాలలో ముందుగా నీరు చేరుతున్నట్లైతె --- గుండె లోపాలు ఉన్నట్లు భావించాలి ,
ముఖం ముందుగా ముఖ్యము గా ఉదయం ఉబ్బరిస్తే మూత్రపిండాలు లోవ్యాదులున్నట్లు గా భావించాలి ,
కడుపులో నీరు చేరితే లివరు (కాలేయము )చెడిపోతున్నాదని గుర్తించాలి .

విశ్లేషణ , పరీక్షలు :

వ్యాధిగ్రస్తుల కాళ్ళ మీద తయారైన వాపునుబట్టి సమస్య తీవ్రతను అంచనా వేయవచ్చును. చర్మాన్ని వేలితో నొక్కి చూడాలి ... గుంట పడితే అదనపు నీరు చేరినలు అర్ధం . మూత్రపిండాలు , కాలేయం , గుండె వంటి అవయవాలు వ్యాధిగ్రస్త మైతే కొన్ని లేబరిటరీ పరేక్షలు చేసి .. ఉదా. నీరుడు పరేక్ష , రక్తం పరేక్ష , ఛాతీ ఎక్షురే , ఎకో కార్డియోగ్రాం వంటి పరేక్షలు అవరమవుతాయి.

కాళ్ళు వాపు వచ్చిన వెంటనే మంచి డాక్టర్ ని కలిసి వైద్యం తీసుకోవాలి .
ప్రధమ చికిత్స : (ఫస్ట్ ఎయిడ్):
 • మంచి మాంసకృత్తుల తో కూడుకున్న ఆహారము తీసుకోవాలి,
 • పొట్టపురుగుల మందు -- albendal tab ఒకటి ఉదయం పరగడుపున తీసుకుంటే మంచిది.
 • తాత్కాలికం గా వాపు తగ్గడానికి -- tab. Lasix , ఒక మాత్ర చొప్పున్న 4-5 daysa తీసుకోవాలి,
 • పడుకునే టపుడు కాళ్ళ వైపు ఎత్తు గా ఉన్నా పరుపు పై పాడుకోవాలి .. కాళ్ళు వాపులు తగ్గుతాయి .


3 comments:

 1. చాలా మంచి సమాచారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదములు.
  tab. Lasix 40 mg లేదా ఇంకా తక్కువ తీసుకోవాలో సూచించగలరు.

  ReplyDelete
 2. ధన్యవాదాలు

  ReplyDelete
 3. ధన్యవాదాలు

  ReplyDelete

Your comment is very important to improve the Web blog.