Thursday, June 18, 2009

ఆరోగ్యం అనగా ఏమిటి?.,What is Health?


ఆరోగ్యము అంటే ?
  • ఒక వ్యక్తి శరీరములో ఏదైనా జబ్బు (disease) లేనంత మాత్రాన ... ఆ వ్యక్తీ ఆరోగ్యవంతుడని అనలేము.
ఒక వ్యక్తి ...
  • "శారీరకంగాను ,
  • మానసికంగాను ,
  • శరీరకవిధులనిర్వహణలోను ,
  • ఆర్ధికంగాను ,
  • సామాజికంగాను ...
తను ఉన్న ప్రదేశం లో సమర్ధవంతం గా నివసించ గలిగితే ... ఆరోగ్య వంతుడనబడును ".
  • (Mere absence of a disease in a person is not healthy. A person is said to be healthy " when is physically , mentally , physiologically , socially , financially " fit to live in his own circumstances .. then ... he / she is healthy)
ఆరోగ్యము మనిషి ప్రాధమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి , ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి , మంచి ఆరోగ్యకర పరిసరాలను కల్పించుకోవాలి. ఆరోగ్యముగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి . 'ఆరోగ్యకరమైన జీవనశైలి'ని అలవర్చుకోవడం తప్పనిసరి .

జీవనశైలి అంటే ?

ఆరోగ్యకరమైన జీనశైలి అనేది ఒక నైపుణ్యం. శాస్త్రీయంగా నేర్చుకోవాల్సిన విషయం. 'ఆరోగ్యమంటే... జబ్బులేకపోవడం మాత్రమే కాదు. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా 'ఒక మంచి పద్ధతి'గా ఉండడమే ఆరోగ్యం అని ప్రప్రంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెప్పింది. మనిషి శరీరంలో జరిగే లక్షలాది రసాయనిక చర్యలు, అనువంశికత, మనిషి చుట్టూ ఉండే పర్యావరణం, స్థానిక సంస్కృతులూ- ఇవన్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే 'ఆరోగ్యకరమైన జీవనశైలి' వైద్య శాస్త్రం, సామాజిక శాస్త్రాలు కలిస్తే వచ్చే దృక్పథం ఇది.

'ఆరోగ్యకరమైన జీవనశైలి'లో నాలుగు అంశాలుంటాయి.

* సమతుల ఆహారం,

* శారీరక వ్యాయామం,

* వ్యక్తిగత జీవితంలో ఆశావహత-వాస్తవిక దృష్టి

* సామాజికంగా సానుకూల దృక్పథం-సమిష్టితత్వం.

పై నాలుగు అంశాలను పాటిస్తున్న వారు 'ఆరోగ్యకరమైన జీవనశైలి'తో ఉన్నట్టు లెక్క.


ఆరోగ్యవంతుడి శారీరక లక్షణాలు

బరువు (వయస్సు ప్రకారం) : ఎత్తు సెంటి మీటర్లలో -(minus) 100 = బరువు కిలో గ్రాముల్లో (సుమారు గా)
(Range : Height - 100 = Wight +- 5 Kgs)
శారీరక ఉష్ణోగ్రత : 98 డిగ్రీలు ఫారెన్హీట్ +- 1 డిగ్రీ (నార్మల్ రేంజ్).
గుండె లయ (హార్ట్ బీట్) :72 +- 8 (నార్మల్ రేంజ్)
నాడీ లయ (పల్స్ రేట్) : 72 +- 8 (నార్మల్ రేంజ్)
రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) : 120/80 మీ.మీ.అఫ్ మెర్కురి (mercury) (140 /90 వరకు నార్మల్)
మూల జీవక్రియ రేటు (బేసల్ మెటబాలిక్ రేటు) :
English BMR Formula
Women: BMR = 65 + ( 4.35 x weight in pounds ) + ( 4.7 x height in inches ) - ( 4.7 x age in years )
Men: BMR = 66 + ( 6.23 x weight in pounds ) + ( 12.7 x height in inches ) - ( 6.8 x age in year )

Metric BMR Formula
Women: BMR = 65 + ( 9.6 x weight in kilos ) + ( 1.8 x height in cm ) - ( 4.7 x age in years )
Men: BMR = 66 + ( 13.7 x weight in kilos ) + ( 5 x height in cm ) - ( 6.8 x age in years )

ఇక్కడ క్లిక్ చేయండి -
1. BMI లెక్క కట్టుటకు
2. BMR లెక్క కట్టుటకు

ఆరోగ్యం కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు :

పౌష్టికాహారం

పౌష్టికాహారం : పుస్ఠి కరమైన ఆహారము - ఒక్కొక్క రికి ఒకలా ఉంటుంది - శాఖార్లులు , మాంసాహారులు: పాలు ,పండ్లు , పప్పులు ఆకుకూరలు , కాయకురాలు మున్నగు వాటితో కూడుకున్నది ,

సమతుల్యాహారం : సరియైన , సరిపడు , అన్నీ (పిండి పదార్దములు , మాంస కత్తులు , క్రొవ్వులు , విటమిన్లు , మినరల్స్, తగినంత నీరు ) ఉన్న ఆహారము .

శారీరక వ్యాయామం : మనుషులము తిండి ఎంత అవసరమో .. వ్యాయామము అంతే అవసరము .. దీని వలన శరీరము లోని మాలిన పదార్దములు( free radicals ) విసర్జించబడుతాయి . ప్రతి రోజు ఒక గంట నడవాలి .... ఇది రెగ్యులర్ గా ఉండాలి .

మానసిక వ్యాయామం : చిన్న చిన్న విషయాలకు స్పందించకుండా ఎప్పుడు మనషు ప్రశాంతం గా ఉండేటట్లు చూసుకోవాలి . నవ్వుతు బ్రతకాలి ... నవ్విస్తూ బ్రతకాలి .

ధ్యానం : అంతే ఏమిటి ? .. మనషు స్థిరం గా , నిలకడ గా ఒకే విషయం పై , దేవుడైనా , దెయ్యేమైనా ... లగ్నంయ్యేతట్లు ప్రతిరోజూ సుమారు ఒక గంట ధ్యానం లో ఉండాలి .

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.