Friday, June 19, 2009

స్పృహ తప్పితే ఎం చేయాలి?, Unconsciousness - First Aid





  • తాత్కాలికం గా స్పృహ తప్పి పడిపోవడం వయస్సు వారికైనా , ఎప్పుడైనా జరగడం సహజం . సడెన్ గా మెదడుకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు ఇలా జరుగుతుంది . ఉదాహరణకు అనుకోకుండా ఏదైనా వినకుడని వార్త విన్నప్పుడు , చాలా సేపు ఎటు కదలకుండా నిలబడి ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది . స్పృహ తప్పిపోవదమనేది చాలా సార్లు తాత్కాలికం గానే జరుగుతుంది . కొద్ది నిముషాలలోనే వ్యక్తీ తిరికి మామూలు స్థితికి వచ్చేస్తాడు .
ముందు సూచనలు :
ఎవరైనా ...
  • కళ్లు తిరుగుతున్నాయని ,
  • కళ్ళ ముందు చుక్కలు కనిపిస్తున్నాయని ,
  • తెములు తున్నట్లు (కడుపులో వాంతి)ఉందనీ అన్నప్పుడు ,
  • వ్యక్తీ చర్మము పాలిపోతున్నట్లు ఉన్నప్పుడు ,
  • చెమటలు పోస్తున్నప్పుడు ,
ఆ వ్యక్తీ స్పృహ తప్పిపడిపడిపోతున్నాడని అర్ధం చేసు కోవచ్చు .

ఎం చేయాలి ? :
  • స్పృహ తప్పి పడిపోతున్న వ్యక్తిని పడిపోకుండా పట్టుకుని ఆపాలి ... పడిపోతే తలకి దెబ్బ తగలవచ్చును .
  • వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టి అతడి కాళ్ళ దింద లేదా ౧౨ అంగుళాల ఎత్తుగా దేనినైనా పెట్టాలి .
  • స్పృహ తప్పిన వక్తి బిగుతైన దుస్తులు దహ్రించి ఉంటే , చొక్కా గుండీలు వదులు చేయాలి .
  • మెత్తటి తడి బట్ట ను నుదిటిపై వేయాలి .
అప్పటికే పడిపోయి ఉంటే ?...
  • అతడి శ్వాస సక్రమము గా ఉందొ లేదో చూడాలి (ముక్కుదగ్గర వేలుపెట్టి చుసిన , లేక చాతి ఎగిసిపడుతున్నడా లేదా అని చుసిన చాలు .).
  • పడటం వలన వ్యక్తి తలకి దెబ్బ తగిలిందా చూడాలి ... తలకి గాయం కాని పక్షం లో కాళ్ళ కింద ఎత్తు పెట్టాలి . దీనివలన తలకు రక్త సరఫరా జరిగి త్వరగా స్పృహ లోకి వస్తాడు .
  • చొక్కా గుండీలు తీసి కాలర్ ను వదులు చేయాలి , అలాగే బెల్టు వదులు చేయాలి .
డాక్టర్ ను ఎప్పుడు కలవాలంటే ...
  • వ్యక్తి 40 సంవస్తరాలు వయసు పై బడినవాడు అయి ఉన్నా ... మాటిమాటికి స్పృహ కోల్పోతున్నా ,
  • 4 లేదా 5 నిముషాలు గడిచిన అతడు స్పృహలోకి రాకుండా ఉన్నా ,
  • కూర్చొని ఉండగా లేదా పడుకొని ఉండగా అతడు స్పృహను కోల్పోయినా ,
  • అలా పడిపోవడానికి ఎలాంటి కారణాలు కనిపించక పోయినా ,
వెంట నే డాక్టర్ ని సంప్రదించాలి .


No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.