- తినే ఆహారం, తాగే నీరే కాదు. పీల్చేగాలి కూడా పరిశుభ్రంగా ఉండాలి. లేకపోతే వూపిరితిత్తులు దెబ్బతినొచ్చు. ఇది క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ), ఆస్థమా, అలర్జీ, బ్రాంకైటిస్ వంటి రకరకాల వ్యాధులకు దారితీయొచ్చు. అయితే తగు జాగ్రత్తలు, జీవనశైలి మార్పులతో వూపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
సిఓపిడి-COPD (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) ఏదో ఒక రోజులోనో, హఠాత్తుగానో వచ్చే వ్యాధి కాదు. కొన్ని ఏళ్లపాటు చాపకింద నీరులా వ్యాధి కొనసాగుతూ ఒక స్థాయికి వచ్చే సరికి మనిషిని కుంగదీస్తుంది. ఇప్పుడు చేయడానికి ఏమీ ఉండదని కూడా ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఇవ్వాళ సిగరెట్ తాగగానే దాని ఫలితం కనిపించదు. మెల్లగా దాని విషప్రభావం తాలూకు మార్పులు శరీరంలో ప్రారంభమవుతాయి. ఎన్నో ఏళ్లకు గానీ వ్యాధి బయటపడదు. ఈ లోగా లక్షణాలు అంత ప్రమాదకరంగా కూడా ఉండవు. దగ్గు వస్తుంది. కళ్లి (expectoration)పడుతుంది. మళ్లీ కొన్నాళ్లకు పరిస్థితి మామూలుగా ఉంటుంది. మళ్లీ దగ్గు, కళ్లి(expectoration) పడతాయి. ఇలా వ్యాధి ముదరిపోతూ చివరికి ఊపిరితిత్తులు మూలనపడిపోతాయి.
సిఓపిడిని ఒకప్పుడు రెండు వ్యాధులుగా పరిగణించేవారు. ఒకటి క్రానిక్ బ్రాంకైటిస్. రెండోది ఎంఫిసిమా. ఇపుడు రెండు వ్యాధుల్ని కలిపి సిఓపిడి గా వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. క్రానిక్ బ్రాంకైటిస్‌లో కళ్లి(expectoration) ఎక్కువగా పడుతుంది. అదే ఎంఫిసిమాలో అయితే ఆయాసం ఎక్కువగా ఉంటుంది. రెండింటికీ కారణం ధూమాపానమే ! సిగరెట్ తాగినా, చుట్టతాగినా, బీడీలు తాగినా ఇవన్నీ సిఓపిడి వ్యాధిని కలిగించేవే. ఈ వ్యాధి కేవలం పురుషుల్లోనే కాకుండా స్త్రీలోలనూ కనిపిస్తుంది. అయితే మన రాష్ట్రంలో స్త్రీలో ఇది వచ్చే అవకాశం అంతాగా లేదు. కానీ పంజాబ్, కాశ్మీర్ వంటి చలి ప్రదేశాల్లో స్త్రీలకు సిఓపిడి వస్తుంది. ఆస్తమా కూడా ఊపిరితిత్తుల సంబంధ వ్యాధే కానీ, సామాన్యంగా ఏదో ఒక సీజనల్లో వస్తుంది. పోతుంది. సిఓపిడి అలా కాదు. వచ్చిదంటే పోదు... పైగా క్రమేపీ ముదురుతూంటుంది. సిఓపిడి వల్ల ఆయాసమే కదా అనుకోవడానికి వీలులేదు. కనీసం మూత్రవిసర్జన చేసేందుకు లేచి నాలుగు అడుగులు వేయలేని దుస్థితి వచ్చేస్తుంది. తరచూ దగ్గు, జ్వరం, కళ్లి (expectoration) సమస్యలు ఉంటాయి. వస్తుంటాయి. పోతుంటాయి ! కొందరు బరువు తగ్గుతారు. ఎంత తిన్నా బరువు తగ్గతుంటారు. ఎందుకంటే ఊపిరితిత్తులు గాలి తీసుకోవడానికి ఎంతో శక్తి అవసరం. తినే తిండి కేవలం ఊపిరితీసుకోవడానికి సరిపోతుందంటే నమ్మలేం కానీ నిజంగా జరిగేది అంతే ! కుటుంబపరంగా, వారసత్వంగా ఒకవేళ ఆస్తమా అనువంశికంగా వస్తుంటే ఉన్న సిఓపిడికి ఆస్తమా తోడవుతుంది. సిఓపిడి తీవ్రతను మనం ఇంకా సరిగా గుర్తించలేదని చెప్పాలి. ధూమపానం చేసే వ్యక్తి తన జీవితంలో సిగరెట్లు, బీడీలకు తన సంపాదనలో 15 శాతం ఖర్చు చేస్తుండగా, ఆనక వచ్చే వ్యాధులను తగ్గించుకునేందుకు వచ్చే సంపాదనలో 30 శాతం ఖర్చు చేస్తున్నట్లు అంచనా.
- వ్యాధి లక్షణాలు
ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది. రోజువారీ పనులు చేసుకోవడం తగ్గిపోతాయి. వ్యాధి ముదిరేకొద్దీ కదలికలు తగ్గిపోతూ వస్తాయి. కాస్త వంగున్నా ఊపిరాడదు. కాస్త జలుబు చేసినా ఊపిరి తీయడం కష్టమవుతుంది. ఎడతెగని దగ్గు ఉంటుంది. ఆకలి ఉండదు. బరువు తగ్గుతారు. కళ్లు తిరుగుతాయి.
స్పైరోమీటర్ అన్న ఒక పరికరం సహాయం ద్వారా,మీరు కొన్ని శ్వాస పరీక్షలు చెయ్యవలసి వుంటుంది. COPD తక్కువైనదా ( MILD), ఓ మోస్తరుదా ( MODERATE) లేదా విపరీతమైనదా (SEVERE) అనేది కనుక్కునేందుకు ఈ పరీక్షలు పనికొస్తాయి.
తక్కువ COPD లక్షణాలు :- ఎక్కువగా దగ్గతూ వుండవచ్చు, ఒక్కొసారి దగ్గులో శ్లేష్మం కూడా రావచ్చు.కాస్తగా గట్టిగా పనిచేస్తే లేదా త్వరగా నడిస్తే, తగ్గినట్లు అనిపించవచ్చు.
మోస్తరు COPD లక్షణాలు :- శారీరకమైన పని లేదా ఇంటి పనులు చేస్తూ వున్నప్పుడు, మీకు కష్టం అనిపిస్తూ వుండచ్చు. మిగతా వారి కంటే ఈ పనులన్నీ కాస్త మెల్లగా చేయవలసి రావచ్చు.జలుబు, ఛాతీ ఇన్‌ఫె క్ష్‌న్‌ల నుండి కోలుకోవడానికి చాలా వారాలు పట్టవచ్చు.
విపరీతమైన COPD లక్షణాలు :- మీరు మెట్లు ఎక్కలేరు. ఓ గదిలో ఈమూల నుంచి ఆ మూలకి సరిగ్గా నడవలేరు. ఎంత కొంచెం పని చేసినా లేదా మీరు కాస్త విశ్రాంతి తీసుకున్నా కూడా మీరు ఆలిసిపోతూవుంటారు.
- కారణాలు
ఈ వ్యాధి ఎక్కువగా సిగరెట్లు తాగే వారిలోనే, చుట్టలు తాగేవారిలోనూ, బీడీలు తాగేవారిలోనూ కనిపిస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఈ వ్యాధి ఎక్కువ. ఏళ్ల తరబడీ ధూమపానం చేసేవారికి ఈ వ్యాధి తప్పకుండా వస్తుంది. పరోక్ష ధూమపానం వల్ల క్రానిక్ బ్రాంకైటిస్ లక్షణాలు కనిపిస్తాయి. వాతావరణ కాలుష్యం వల్ల కూడా సిపిఓడి వస్తుంది. కొన్ని వృత్తుల వల్ల కూడా సిపిఓడి వ్యాధి రావొచ్చు. వండ్రంగులూ, మైనింగ్‌లో పనిచేసేవారు కూడా ఈ వ్యాధి బారినపడతారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిలు వాడే స్త్రీలు నిరంతరం పొగలో ఉండడం వల్ల ఈ వ్యాధి రావొచ్చు. కార్లు విడుదల చేసే కాలుష్య కారకాలను పీల్చే వారికి కూడా రిస్కు ఉంటుంది. ఇన్నీ కాకుండా వంశపారంపర్యంగా కూడా సిఓపిడి రావొచ్చు. ''ఏఏఎఫ్'' అల్ఫా ప్రోటీన్ లోపం వల్ల వ్యాధి అనువంశికంగా వస్తుంది. కాకపోతే ఇది అరుదు. అలాగే హెచ్‌ఐవి వ్యాధి ఉన్నవారు కూడా ఈ వ్యాధికిలోనవుతారు.
- డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్లాలి?
కొంచెం వ్యాయామాలు చేసేటప్పుడు శ్వాస కష్టంగా ఉంటే. ఎంతకీ మానని దగ్గు, కాస్త రంగుగా ఉన్న కళ్లెపడుతున్నప్పుడు. ఈ లక్షణాలు ఉన్న అందరికీ ఎంఫిసిమా ఉందని కాదు. ఇవన్నీ ఉంటే ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేదని భావించొచ్చు. ఎంఫిసిమా ఉన్నదీ లేనిది డాక్టర్లు మాత్రమే నిర్ధారిస్తారు. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ (PFT)ద్వారా ఊపిరిత్తులు ఎలా పనిచేస్తున్నదీ తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ధూమపానం చేసినవారూ, చేస్తున్నవారూ కూడా ఒకసారి ''పి.ఎఫ్.టి'' చేయించుకుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నదీ లేదనిదీ తెలుస్తుంది. అలాగే కళ్లి పరీక్ష, ఎక్స్‌రేలు కూడా వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. సిటిస్కాన్ చేయించుకుంటే బుల్లాలను ( ధూమపానం చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో పాడైపోయిన చిన్న చిన్న వాయుకోశాలు కలిసిపోయి పెద్ద తిత్తిలా మారతాయి. ఇలాపాడైపోయిన ఈ తిత్తి శ్వాస ప్రక్రియను నిర్వహించలేదు. దీన్నే బుల్లా అని వ్యవహరిస్తారు) గుర్తించే వీలుంది.
- చికిత్స
తక్షణ చికిత్స పొగమానేయడం. లేదంటే వ్యాధి ముదిరిపోతుంది. ఇన్‌హేలర్ ద్వారా మందులు వాడడం ప్రారంభిస్తే ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు కొద్దిగా వదులుగా మారి శ్వాస కాస్త తేలిగ్గా అందుతుంది. చాలాసార్లు ప్రాణవాయువును అందిచాల్సి వస్తుంది.
డాక్టర్ సూచన మేరకు మందులను క్రమం తప్పకుండా ఖచ్చితంగా తీసుకోవాలి. COPD తీవ్రతను తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకోండి. ప్రతి మందు పేరు, తీసుకోవలసిన మోతాదు, ఎప్పుడు తీసుకోవాలి అనవి రాసి ఉంచుకోండి. వాయునాళాలని వెడల్పు చేసే మందులను 'బ్రోంకో డైలేటర్స్' అంటారు. మీ ఊపిరితిత్తులలో గల వాయు నాళాల చుట్టూ వున్న కండరాలను గట్టిపరిచే చర్యను అవరోధించి, ఇంకా వెనక్క మరలించడం ద్వారా ఈ మందులు పని చేస్తాయి. ఉపశమనం కలిగి మరింత కులాసాగా శ్వాస పీల్చడానికి తోడ్పడ తాయి. శీతాకాలంలో మరింత జాగ్రత్తగా ఉంటే ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. Infection కోసము యాంటిబయోటిక్స్ డాక్టర్ సలహా మేరకు వాడాలి
- ఆపరేషన్ అవసరమా?
సిఓపిడి వ్యాధి బాగా ముదిరి శ్వాస తీసుకోవడం మరీ కష్టంగా ఉన్నప్పుడు ఆపరేషన్ చేయాల్సి రావొచ్చు. దీన్ని లంగ్ రిడక్షన్ సర్జరీ అంటారు. అంటే ఊపిరితిత్తుల్లోపల ఉన్న బుల్లాను కత్తిరించి తీసేస్తారు.
తీసుకోవలసిన జాగ్రత్తలు :
- తేమకు దూరం :
- ఇంటి కాలుష్యంతో జాగ్రత్త:
- సిగరెట్లు ప్రమాదం
- గోబీపువ్వు సాయం
- పట్టణాల్లో నుసి ముప్పు
- వ్యాయామం --
- బరువు తగ్గటం--
references :
1.డా|| పి.అజయకుమార్,ఛాతివైద్యనిపుణులు-ప్రభుత్వ ఛాతి ఆసుపత్రి-ఇఎస్‌ఐ దగ్గర హైదరాబాద్,
2.ఈనాడు సుఖీభవ వ్యాసము ,
3. - డా|| సుధీర్ ప్రసాద్-పల్మోనాలజిస్ట్--గ్లోబల్ హాస్పిటల్,-హైద్రాబాద్ ,
4.Text book of Lung diseases for P.G. students.,
- ===================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.